breaking news
FIFA World Cup 2026
-
ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. మైదానంలో తన ఆటతో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ తాజాగా తన జెర్సీ విషయంలోనూ కింగ్ అని నిరూపించుకున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలో మెస్సీ 10వ నంబర్ జెర్సీలు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫిఫా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఫిఫా 2026లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలిచి 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ను అందుకుంది. ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపించాడు. 8 మ్యాచ్‌లాడిన మెస్సీ 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లు చేసి టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచి సిల్వర్ బూట్ కైవసం చేసుకున్నాడు. అంతేకాదు ఏడు వరుస ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ కొట్టిన తొలి ఆటగాడిగాను మెస్సీ రికార్డులకెక్కాడు. 2022లో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలిపిన మెస్సీ ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావించాడు. కానీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో చతికిలపడిన అర్జెంటీనా రన్నరప్‌కే పరిమితమైంది. 39 ఏళ్ల మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ (2030) ఆడేది అనుమానమే. 🚨 FIFA has officially announced that Lionel Messi's jersey was the best-selling jersey of the 2026 FIFA World Cup! 👕🐐🇦🇷 pic.twitter.com/nnLVWtVK7L— FC Barcelona Fans Nation (@fcbfn_live) July 25, 2026Read: హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్! -
ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రిటైర్మెంట్పై ఒక స్పష్టత వచ్చింది. అర్జెంటీనా జట్టులో స్థిరత్వం వచ్చే వరకు తాను జట్టులో కొనసాగుతానని, ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు మెస్సీ తన అభిప్రాయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ)కు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో 2030 ఫిఫా ప్రపంచకప్‌కు తాను అందుబాటులో ఉండనని మెస్సీనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు. రాబోయే నాలుగేళ్లలో మెస్సీతో పాటు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. దీంతో జట్టులో సీనియర్లంతా ఒకేసారి రిటైర్ అయితే ఆ ప్రభావం యువ ఆటగాళ్లపై ఎక్కువగా ఉంటుందని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది. అందుకోసం మెస్సీని కొంతకాలం పాటు జట్టుతో కొనసాగాలని అతడితో తెలిపినట్లు సమాచారం. దీనికి మెస్సీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌ను కూడా ఘనంగా ప్లాన్ చేసినట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే ఆ వివరాలు బయటికి వెల్లడిస్తామని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది.ఇక 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్ట్‌లతో టోర్నీలో రెండో అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచి సిల్వర్ బూట్ అందుకున్నాడు. 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగిన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా మెస్సీ (21 గోల్స్) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్, 22 గోల్స్) ఉన్నాడు. ఇక రెండు దశాబ్దాల కెరీర్లో 2014 ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నాడు. కానీ చిన్న వయసు కావడంతో ఆలోచనను విరమించుకున్న మెస్సీ ఆ తర్వాత అర్జెంటీనాకు అద్భుత విజయాలు అందించాడు. 2021 కోపా అమెరికా కప్‌తో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను అందించి అర్జెంటీనా ఖాతాలో మూడో ఫిఫా టైటిల్‌ను చేర్చాడు. 2024 కోపా అమెరికా కప్‌ను మరోసారి గెలిచిన అర్జెంటీనా 2026 ఫిఫాలో ఫైనల్ చేరినప్పటికీ తుదిమెట్టుపై బోల్తా కొట్టింది. -
FIFA World Cup 2026 : స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ (ఫొటోలు)
-
ఎనిమిదో వింత.. ఫిఫా కప్పుతో వస్తే టమాటలతో సత్కారమా!
ఒక దేశం తరఫున క్రీడాకారులు లేదా జట్లు ఏదైనా చాంపియన్‌షిప్ లేదా ట్రోఫీలు కొల్లగొడితే సత్కారాలు, సన్మానాలతో హడావిడి చేస్తుంటారు. మన భారత్ కూడా ఇందుకు అతీతమేమి కాదు. కానీ స్పెయిన్‌లోని ఒక ప్రావిన్స్‌లో మాత్రం అక్కడి నుంచి ఏ ఆటగాడు ఎంత పెద్ద ఘనత సాధించినా పూలతో స్వాగతాలు, శాలువాలతో సన్మానాలు గట్రా చేయరు. దీనికి బదులుగా అక్కడి సంప్రదాయం ప్రకారం ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటలను ఇచ్చి సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఫిఫా గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యులైన మిడ్ఫీల్డర్స్ గావీ, పాబియానా రూయిజ్లను ఇదే తరహాలో సత్కరించడంతో వినూత్న సంప్రదాయం వెలుగులోకి వచ్చింది.ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో 20 లక్షలకు పైగా అభిమానులు ఒక్కచోట చేరి స్పెయిన్ విజయోత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. 16 ఏళ్ల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టు ఆటగాళ్లకు అభిమానులు నీరాజనాలు పట్టారు. దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అయితే స్పెయిన్ మిడ్ ఫీల్డర్స్ ఫాబియన్ రూయిజ్, పాబ్లో గవీరా (గవీ)లకు తమ ఫ్రావిన్స్ అయిన లాస్ పలాసియోస్ వై విల్లాఫ్రాంకా పాలకమండలి కూడా వినూత్నరీతిలో స్వాగతం పలికింది. ఆటగాళ్ల బరువుకు సమానంగా టమాటాలను వారికి అందించడం వైరల్‌గా మారింది.పురాతన సంప్రదాయం..కాగా ఈ ప్రావిన్స్‌లో టమాట పంట అధికంగా ఉంటుందట. అందుకే ఆ ప్రావిన్స్ నుంచి ఎవరు ఎలాంటి గొప్ప పనులు లేదా ప్రావిన్స్‌కు గౌరవం తెచ్చే పనులు చేస్తే టమాటాలను గిఫ్ట్‌గా అందిస్తారట. ఇలా చేస్తే వారి వ్యాపారం బాగుంటుందని వారి నమ్మకం. తాజాగా ఫిఫా ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న రూయిజ్, గావీలను ఇలా సత్కరించారు. అంతేకాదు వీరి ప్రావిన్స్‌లోని నగ2రంలో ఉన్న రెండు ఫుట్‌బాల్ మైదానాలకు వీరిద్దరు పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్టేడియాలకు మారిస్మస్, సాన్ సెబాస్టియన్ అనే పేర్లు ఉన్నాయి. ఫాబియానా రూయిజ్ లాస్ పాలాసియోస్ తరఫున ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించగా, ఆరేళ్ల వయసులోనే గావి లాలి లైయరా బాలోంపె తరఫున ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభించాడు. ఇక ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయాన్ని సాధించి రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందుకుంది. ▶️Esto ya es tradicional en Los Palacios y Villafranca🍅Gavi y Fabián Ruiz reciben su peso en tomates📹@AlvarooSVQ @ZonaMixta__ pic.twitter.com/PyPKDOk99U— BeSoccer (@besoccer_ES) July 21, 2026 Read: అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే -
చిరిగిన బూట్లతో మొదలై.. పేదరికం నుంచి ప్రపంచ ఛాంపియన్ గా
-
ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..?
2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఇన్ఫాంటినోకు ఉన్నాయని ప్రశంసిస్తూ, ఆయన ఐక్యరాజ్యసమితి (UN) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి కాలేరు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) మద్దతు అవసరం. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఏ ఒక్క దేశం వీటో విధించినా అభ్యర్థిత్వం నిలిచిపోతుంది.భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాతే అభ్యర్థి పేరును యూఎన్ సర్వసభ్య సమావేశం (General Assembly) తుది ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండటంతో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.ఇప్పటివరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు లేదా ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.ఇక యూఎన్ ప్రధాన కార్యదర్శి రేసులో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా, ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో మరోసారి టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్ ఫిఫాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముగిసిన ఫైనల్లో అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విజేతకు ట్రంప్ చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు. ఈ టోర్నీని అమెరికా,కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. -
అర్జెంటీనా చీటింగ్.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్‌లో చేతిలో ఓటమి చవిచూసిన అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. అయితే టోర్నీ ఆరంభం నుంచి అర్జెంటీనాకు అనుకూలంగానే వ్యవహరించదన్న విమర్శలు బహిరంగంగా వ్యక్తమయ్యాయి. ఫిఫాలో అర్జెంటీనాతో ఆడిన జట్లలో చాలా జట్లు ఇదే ఆరోపణలు చేశాయి. ఈ వివాదం సోషల్ మీడియాకు కూడా పాకింది. ఫైనల్‌కు అర్జెంటీనా చేరుకునే క్రమంలో ఫిఫా పక్షపాత ధోరణితో వ్యవహరించిందనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపించాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో లైక్ చేయడమే ఇప్పుడు వివాదానికి దారి తీసింది.దీంతో ఫిఫా వ్యవహారంపై వచ్చిన విమర్శలకు రొనాల్డో కూడా మద్దతు తెలిపాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారంపై జాతీయ మీడియా నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌లో భిన్నమైన విషయం వెలుగులోకి వచ్చింది. రొనాల్డో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోకు లైక్ చేసిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపింది. అయితే దీనిలో కూడా రెండు అంశాలు దాగున్నాయి. ఒకవేళ రొనాల్డో మొదట లైక్ చేసి ఆ తర్వాత దానిని తొలగించి ఉండొచ్చు. అదీ కాకపోతే మాత్రం ఇది పాత స్క్రీన్‌షాట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఈసారి ఫిఫాలో 48 జట్లు పోటీపడితే అర్జెంటీనాకు వ్యతిరేకంగా ఒక్కసారి కూడా వీఏఆర్ (VAR) నిర్ణయం రాలేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా జట్టుకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రౌండ్ ఆఫ్-16లో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం వీఏఆర్ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తమ జట్టు చేసిన గోల్‌ను అనర్హంగా ప్రకటించడం వల్లే ఓటమి ఎదురైందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ కెప్టెన్‌తో పాటు ప్రధాన కోచ్ కూడా ఆరోపించారు. అయితే ఈ విమర్శలను ఫిఫా ఖండిస్తూ, మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదని స్పష్టం చేసింది.ఇక ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ ప్రయాణం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడిన రొనాల్డోకు ఇదే చివరిదనే ప్రచారం కూడా జరిగింది. ఈసారి ఫిఫాలో రొనాల్డో కూడా పెద్దగా మెరవలేదు. ఇప్పటిదాకా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించని రొనాల్డో వయసు 41 ఏళ్లు. దీంతో వచ్చే ఫిఫా (2030) నాటికి రొనాల్డో ఆటకు గుడ్‌బై చెప్పే అవకాశముంది.Read: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా! -
‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్, అర్జెంటీనా ఆటగాళ్లు తన్నుకున్న సంగతి తెలిసిందే. అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాళ్ల మీదకు కోపంతో దూసుకొచ్చాడు. తన ఎదురుగా ఉన్న ఎరిక్ గార్సియాపై పిడిగుద్దులు కురిపించాడు. అడ్డువచ్చిన మరో ప్లేయర్ గావి గొంతు పట్టుకొని అతడిని నేలపై పడేశాడు. విచక్షణ కోల్పోయి పశువులా ప్రవర్తించిన లియాండ్రో పరేడెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. లియాండ్రోపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే లియాండ్రోపై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది ఫిఫా ఇంకా తెలపనప్పటికీ స్పెయిన్ స్టార్ గావి మాత్రం లియాండ్రోను శిక్షించవద్దని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ‘లియాండ్రో ఓటమి నైరాశ్యంలో సైకోలా మారిపోయి మాపై దాడి చేశాడు. కానీ ఫుట్‌బాల్ ఆటలో ఇలాంటి గొడవలు సహజమని, ఓటమి బాధలో ఒక్కోసారి ఆటగాళ్లు లయతప్పి తాము ఏం చేస్తున్నామో కూడా మరిచిపోతారు. అందుకే లియాండ్రోను కఠినంగా శిక్షించవద్దని కోరుతున్నా. అంతగా శిక్ష వేయాలనుకుంటే అతడు భవిష్యత్తులో ఆడబోయే మ్యాచ్‌ల్లో ఆట మధ్యలో మైదానం నుంచి తొలగిస్తే సరిపోతుంది.’ అని తెలిపాడు. నిజానికి పరేడెస్ హింసాత్మక చర్యకు పాల్పడడం వల్ల అతడు కనీసం మూడు మ్యాచ్‌లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్లో ఆట అదనపు సమయం 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్‌తో, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో నాటకీయ విజయాన్ని అందుకుంది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ రెండో ఫిఫా టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫిఫా చాంపియన్స్‌గా నిలిచిన తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన స్పెయిన్‌కు ఘన స్వాగతం లభించింది. 20 లక్షల మంది అభిమానుల సమక్షంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో విజయోత్సవ సంబరాలు జరిగాయి. 💣🇦🇷 GAVI SOBRE LA AGRESIÓN QUE RECIBIÓ DE PAREDES EN LA FINAL ESPAÑA-ARGENTINA:💥 “No creo que deba ser suspendido. Lo lógico hubiese sido expulsarle en el partido”👊🏼 “No es una imagen para los niños pero creo que hay esa parte de fútbol que es un poco más violenta”📹… pic.twitter.com/ZaSrjPUmQm— Zona Mixta (@ZonaMixta__) July 21, 2026Read: హండ్రెడ్ లీగ్‌లో ముంబై, సన్‌రైజర్స్ అరుదైన ఫీట్! -
మెస్సీ సేనకు ఘనస్వాగతం.. కానీ చిన్న ట్విస్ట్!
ఫిఫా ప్రపంచకప్ 2026లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున మెస్సీ సేన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ముందుగా బ్యూనస్ ఎయిర్స్‌లోని ఐజా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు, కోచ్, సహాయక సిబ్బందికి మూడు ప్రత్యేక ఓపెన్‌టాప్ బస్సులను ఏర్పాటు చేశారు. Phot Credit: FIFA Twitterఈ క్రమంలో ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ బ్యూనస్ ఎయిర్స్కు చేరుకునే దారిలో అభిమానులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో రాజధాని వీధులు నిండిపోయాయి. మ్యూజిక్ చాంటింగ్స్, ర్యాప్ సాంగ్స్‌తో వీధులన్నీ హోరెత్తిపోయాయి. భారీగా తరలివచ్చిన అభిమానులను చూసిన అర్జెంటీనా ఆటగాళ్లు బస్ క్యాబిన్ డోర్లను ఓపెన్ చేసి బయటకు వచ్చి అభివాదం చేశారు. చేతిలో ఫిఫా ట్రోఫీలకు బదులు వాళ్లు సాధించిన సిల్వర్ మెడల్స్, సిల్వర్ ట్రోఫీలను చూసే అభిమానులు మురిసిపోయారు. ట్రోపీలు ఎవడికి కావాలి.. మీ ఆటతో మనసులు గెలిచారు అని అభిమానులు తమ సందేశాలు వినిపించారు.'కమాన్ అర్జెంటీనా' అని నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. Phot Credit: FIFA Twitterఅర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ జట్టుతో ప్రయాణం చేయలేదు. తన కుటుంబం కూడా తనతోనే ఉండడంతో మెస్సీ అమెరికాలోనే ఉండిపోయాడు. ఇంటర్ మియామి క్లబ్ తరఫున ఆడుతున్న మెస్సీ కొంత బ్రేక్ తర్వాత మళ్లీ ఆ క్లబ్‌తో జాయిన్ అవ్వనున్నాడు. దీంతో ఫిఫా ప్రపంచకప్ తర్వాత మెస్సీ స్వదేశానికి వస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తమ ఆరాధ్య దైవాన్ని లైవ్‌లో చూడాలని ఆశించిన అభిమానులకు భంగపాటు ఎదురైంది. Phot Credit: FIFA Twitterఅయితే తాను రాకున్నా తాను సాధించిన సిల్వర్ బూట్‌ను మాత్రం అభిమానులకు కానుకగా జట్టుతో పాటే పంపించాడు. గోల్‌కీపర్ ఎమిలియో మార్టినేజ్ సహా నికోలస్ ఒటమెండి, మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్, అలెక్సిక్మాక్ అలిస్టర్, నికోలస్ గొంజలెజ్, సహా అర్జెంటీనా ఆటగాళ్లు తమను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేస్తూ కృతజ్ఞతలు చెప్పడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Phot Credit: FIFA Twitterఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0తో పరాజయం చవిచూసింది. ఫెర్నాండేజ్ రెడ్‌కార్డుకు గురవ్వడంతో పది మందితోనే ఆడిన అర్జెంటీనా మ్యాచ్‌ను లాక్కొచ్చింది. ఫిఫా టోర్నీ అంతటా అర్జెంటీనా జట్టును తన భుజస్కందాలపై మోసిన మెస్సీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. అయితే టోర్నీ ఆసాంతం అసాధారణ ఆటను కనబరిచిన మెస్సీ 8 గోల్స్‌తో సిల్వర్ బూట్‌ను సొంతం చేసుకున్నాడు. వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030)లో మెస్సీ ఆడడం అనుమానమే కాబట్టి తమ ఆరాధ్య ఆటగాడిని చివరిసారి అర్జెంటీనా జాతీయ జెర్సీలో చూడాలని ఆశించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. 🇦🇷💙 ¡GRACIAS POR TODO, SELECCIÓN!📹 @Argentina pic.twitter.com/fzzLE6k1Be— TyC Sports (@TyCSports) July 21, 2026Despite the World Cup final loss, thousands of Argentine fans were there to welcome their heroes home. Respect. 🫡 🇦🇷🩵 pic.twitter.com/Bo9UfU60nL— MC (@CrewsMat10) July 20, 2026Argentina 🩵 pic.twitter.com/gn9ZhMuDP3— Selección Argentina in English (@AFASeleccionEN) July 20, 2026Read: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
స్పెయిన్ నంబర్‌వన్.. ర్యాంకింగ్స్‌లో మొరాకో, నార్వే సంచలనం
ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్ గెలుచుకున్న స్పెయిన్ జట్టు మరోసారి నంబర్‌వన్ ర్యాంకును అందుకుంది. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఫిఫా అధికారికంగా ర్యాంకులను విడుదల చేసింది. చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోగా, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానానికి పడిపోయింది. Photo Credit: FIFA Twitterర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈసారి ఫిఫాలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్న మొరాకో, నార్వే జట్లు మాత్రం సంచలనం సృష్టించాయి. ఫిఫా చరిత్రలోనే మొరాకో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో ఓడిన మొరాకో ఆరో స్థానంలో నిలిచింది. ఎర్లింగ్ హాలండ్ సారథ్యంలోని నార్వే కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింది. ఈ ఫిఫాలో క్వార్టర్స్ చేరుకొని చరిత్ర సృష్టించిన నార్వే 12 స్థానాలు ఎగబాకి 19వ స్థానం (టాప్-20)లో నిలిచింది.Photo Credit: FIFA Twitterఇక కాంస్యం గెలిచిన ఇంగ్లండ్ మూడో స్థానంలో, ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన పోర్చుగల్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, అదే సమయంలో బ్రెజిల్ ఐదో స్థానానికి చేరుకుంది. ఇక బెల్జింయం, నెదర్లాండ్స్, మెక్సికో వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు దక్కించుకున్నాయి. ఫిఫా 2026లో పేలవ ప్రదర్శన కనబరిచిన మాజీ చాంపియన్ జర్మనీ మాత్రం టాప్-10లో చోటు కోల్పోయి 12వ స్థానంలో నిలవగా, క్రొయేషియా 13వ స్థానంలో ఉంది. ఇక ఈసారి ఫిఫాలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న అనామక జట్టు కేప్‌వెర్డె 8 స్థానాలు ఎగబాకి 64వ స్థానంలో నిలిచింది. ఈ ఫిఫాలో కేప్‌వెర్డె ప్రిక్వార్టర్స్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే.చదవండి: అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ -
అర్జెంటీనా ఓటమి.. మెస్సీ భావోద్వేగ లేఖ
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తొలిసారి స్పందించాడు. వరుసగా రెండోసారి ఫిఫా గెలవాలనుకున్న అతడి కలలను స్పెయిన్ ఆవిరి చేయడంతో మైదానంలోనే చిన్న పిల్లాడిలా మారిపోయి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇది చూసిన అభిమానులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత మెస్సీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ లేఖను పంచుకున్నాడు. 'ఫలితం చూసిన తర్వాత చాలా బాధేసింది. ఈ గాయం మానడానికి సమయం పడుతుంది. కానీ ఏదైనా అంతా మంచే జరగాలనే దానికే నేను కట్టుబడి ఉంటాను.' అని మెస్సీ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.'ప్రతీ మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడామనే అనుకుంటున్నాం. ఈ ఫిఫా టోర్నీలో మా దేశ ప్రజలు ప్రతీ విషయంలో మాకు అండగా నిలవడంతో వారి మద్దుతుతోనే కష్టపడ్డాం. ఫైనల్ దాకా చేరుకున్నాం. జట్టు కృషి, ప్రయత్నం కలగలిసి అర్జెంటీనాను ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టిందని బలంగా చెప్పగలను. ఇవాళ ఓటమితో మనం సాధించిన విజయాన్ని చెప్పుకోవడం కష్టమే. కానీ వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా ఫైనల్ చేరిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి (అర్జెంటీనాతో పాటు మిగతా దేశాలు) పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నా. మనమంతా ఎప్పటికీ ఇలానే ఐక్యంగా ఉంటూ అర్జెంటీనా ఖ్యాతిని కాపాడుకుందాం. ఇక చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌కు కూడా నా ప్రత్యేక అభినందనలు' తెలుపుతూ లేఖను ముగించాడు.2026 ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. 9 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో సిల్వర్ బూట్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో దుర్భేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడమే సరిపోవడంతో మెస్సీ కూడా ఏం చేయలేకపోయాడు. ఒకవేళ ఈసారి అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలిచి ఉంటే, ఆ మరుక్షణమే మెస్సీ ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం అనుమానమే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. 🚨🚨📲 Leo Messi on IG: "The pain is immense, and it will take time for this wound to heal. "But I also choose to hold on to all the good things, the matches we turned around by giving everything, moments that will remain in our memories forever and the support of an entire… pic.twitter.com/3ZL4yFKhmA— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026చదవండి: బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం! -
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఒక్కొక్కరు కాదు జట్టుగా ఆడితే ప్రపంచాన్ని జయించవచ్చని స్పెయిన్ నిరూపించింది. మొదట్లో వెనుకబడినా చివర్లో చెలరేగిపోతూ విజయాన్ని లాగేసుకుంటున్న అర్జెంటీనాకు తుది పోరులో స్పెయిన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. నిర్ణిత 90 నిమిషాల్లో గోల్ చేయలేకపోయినా... అదనపు సమయంలో స్పెయిన్ సక్సెస్ సాధించింది. 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా తమ జోరును కొనసాగించి అర్జెంటీనాకు నిరాశను మిగిల్చింది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ విశ్వవిజేత కావడంతో ఆ దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సోమవారం స్వదేశానికి వచ్చిన ప్రపంచకప్ వీరులకు ఆ దేశం బ్రహ్మరథం పట్టింది. తిరుగులేని ఆధిక్యం... ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ఆరంభమైన దగ్గరి నుంచి దాదాపు మ్యాచ్ ముగిసే వరకు బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. ఈజిప్‌్ట, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌ల తరహాలో అర్జెంటీనా ఆఖర్లో కోలుకుంటుందని అందరూ భావించినా... స్పెయిన్ అసలు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. తుది పోరులో జట్టు సభ్యులు ఒకరికొరకు ఏకంగా 853 పాస్‌లు ఇచ్చుకున్నారంటే, ప్రత్యర్థికంటే కనీసం 400 సార్లు ఎక్కువగా బంతిని ‘టచ్’ చేశారంటేనే స్పెయిన్ ఎలా బంతిపై పట్టు నిలబెట్టుకుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లు కుబార్సి, లాపోర్ట్, రోడ్రి మధ్యనే బంతి తిరుగాడింది. ఇద్దరు డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్ కలిపి ఫైనల్లో 359 సార్లు బంతిని ‘టచ్’తో తమ మధ్యే ఉంచుకున్నారు. టోర్నీ మొత్తంలో ఒకే ఒక గోల్ ఇవ్వడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. టీమ్ మొత్తం 20 షాట్లు ఆడగా... 12 నేరుగా లక్ష్యంవైపే వెళ్లాయి. ఫైనల్ స్కోర్ 1–0తో చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగిందేమో అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఒక జట్టు మాత్రమే పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌లో నిలిచింది. ఏకైక గోల్ సాధించిన ఫెరాన్ టోరెస్‌తో పాటు ఈ గోల్లో అతనికి సహకరించిన పెడ్రో పొరోస్, నికో విలియమ్స్... ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మికెల్ మెరీనో, కెపె్టన్ రోడ్రి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక గోల్‌కీపర్ యునై సైమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు మ్యాచ్‌లలో ‘క్లీన్ షీట్’తో అతను జట్టును కాపాడిన తీరు నిజంగా సూపర్.వరుస టైటిల్స్ జోరు... రెండేళ్ల క్రితం బెర్లిన్‌లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న స్పెయిన్ ఇప్పుడు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2008లో కూడా సరిగ్గా ఇదే తరహాలో యూరోప్ విజేతగా నిలిచిన రెండేళ్లకు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. నేషన్స్ లీగ్, అండర్–23 ఒలింపిక్ స్వర్ణం, అండర్–19 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లతో కలిపితే గత ఐదేళ్లలో స్పెయిన్ పురుషుల జట్టు 5 పెద్ద టోరీ్నల్లో విజేతగా నిలవడం విశేషం. వీటికి తోడు 2023లో మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా సాధించిన స్పెయిన్...రెండు విభాగాల్లో ఒకే సారి ప్రపంచ కప్‌ను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలిచింది. దీనిని బట్టి చూస్తే ఫుట్‌బాల్‌లో స్పెయిన్ ఎంత నిలకడగా, ఘనంగా రాణిస్తుందో అర్థమవుతుంది. చేతులెత్తేసిన అర్జెంటీనా... వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయం 90 నిమిషాల వరకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఒక్క షాట్ కూడా ప్రయత్నించని మొదటి జట్టుగా అర్జెంటీనా నిలిచింది! 117వ నిమిషంలో గానీ తొలి షాట్ కొట్టని జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశించగలమా! స్పెయిన్‌తో తుది పోరులో అర్జెంటీనా పరిస్థితి ఇలాగే కనిపించింది. అసలు ఇలాంటి ఆటను అభిమానులెవరూ ఊహించలేదు. మెస్సీపైనే అందరి దృష్టీ ఉండగా... ఇతర ఆటగాళ్లెవరూ జట్టు కోచ్ స్కలోని అంచనాలు నిలబెట్టలేకపోయారు. మ్యాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్, లియాండ్రో పెరేడ్స్ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యారు. అసలు సమరంలో మెస్సీని నిలువరించడంలో స్పెయిన్ పూర్తిగా సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు మెస్సీ కొట్టిన కార్నర్ కిక్‌ను సబ్‌స్టిట్యూట్ గ్విలియోనా సిమోన్ క్రాస్ బార్ మీదుగా పంపించి వృథా చేయడం జట్టు పరిస్థితికి అద్దం పట్టింది. ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుతో మైదానం నుంచి ని్రష్కమించడంతో చివర్లో 10 మందితోనే ఆడటం కూడా అర్జెంటీనా జట్టుకు చేటు చేసింది. నిజానికి స్పెయిన్ విజయం మ్యాచ్ ఆరంభంలోనే ఖాయమయ్యేది! అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్జినెజ్ అసాధారణ ప్రదర్శనతో గెలుపు ఆలస్యమైంది. ఫైనల్లో రికార్డు స్థాయిలో 12 షాట్లను అతను అడ్డుకోగలిగాడు.భవిష్యత్తు కూడా వారిదే...ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక్క గోల్ ఇవ్వడం... దాదాపు లోపాలు లేని ఆట... ఇద్దరు 19 ఏళ్ల కుర్రాళ్లను సమర్థంగా వాడుకోవడంతో పాటు వారి చుట్టూ సీనియర్లతో కలిపి జట్టును సన్నద్ధం చేయడం... టోర్నీ ఆరంభానికి ముందే తాము అనుకున్న ప్రణాళికకు పూర్తి కట్టుబడి దానినే అమలు పర్చడం... స్పెయిన్‌ను రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఈ జట్టు ఎలాంటి థ్రిల్లర్ సినిమాను తలపించే అనూహ్య మలుపుల తరహా ఆట ఆడలేదు. కానీ ఏం చేయాలనే దానిపై జట్టుకు చాలా స్పష్టత ఉంది. మిడ్‌ఫీల్డర్లు సత్తా చాటి దూసుకుపోగా, డిఫెండర్లు అయిన అద్భుత ఆటను ప్రదర్శించారు. ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో హీరో జట్టు నుంచి వచ్చాడు. ఏడుగురు ప్లేయర్లు గోల్ స్కోరర్లు కావడం విశేషం కాగా క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డిబ్రూయిన్ (బెల్జియం), ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీల వంటి స్టార్లను స్పెయిన్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. టోర్నీ మొత్తంలో కలిపి ప్రత్యర్థులకు 43 సార్లు మాత్రమే షాట్లకు అవకాశం చిక్కింది. స్పెయిన్ గెలుపు ఇక్కడితోనే ఆగిపోదు. వచ్చే దశాబ్దంలో ఫుట్‌బాల్‌ను శాసించగల సామర్థ్యం టీమ్‌లో ఉంది. 19 ఏళ్ల ఇద్దరు కుర్రాళ్లు భవిష్యత్తులో టీమ్‌ను ముందుకు తీసుకెళ్లగలరు. ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కుబార్సి అద్భుతంగా ఆడుతుండగా... లమీన్ యామల్ విలువేమిటో ప్రపంచం ఇప్పటికే చూసింది. ఈ వయసులోనే వీరిద్దరు వరల్డ్ కప్ నెగ్గిన బృందంలో సభ్యులుగా ఉన్నారు.2026 ప్రపంచకప్ అవార్డులుగోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్): కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్; 10 గోల్స్). 2022 ప్రపంచకప్‌లోనూ ఎంబాపెకే గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో గోల్డెన్ బూట్ గెల్చుకున్న ఏకైక ప్లేయర్ ఎంబాపెనే. గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్‌ప్లేయర్): స్పెయిన్ కెప్టెన్ రోడ్రి. గోల్డెన్ గ్లౌవ్ (టోర్నీ బెస్ట్ గోల్‌కీపర్): స్పెయిన్ గోల్‌కీపర్ సిమోన్. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో సిమోన్ ఒక్క గోల్ మాత్రమే సమరి్పంచుకున్నాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్: కుబార్సి (స్పెయిన్). ఫెయిర్‌ప్లే అవార్డు: నెదర్లాండ్స్ – సాక్షి క్రీడా విభాగం -
స్పానియార్డ్స్ జయకేతనం
ఆటపై అంకితభావం... అవతలి జట్టుపై గెలవటానికి పక్కా వ్యూహం... తిరుగులేని క్రమశిక్షణ... అన్నిటికీ మించి జట్టు మొత్తం ఒక వ్యవస్థగా పనిచేయటం సోమవారం వేకువజామున న్యూజెర్సీ వేదికగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. సాకర్ ప్రపంచ కప్ సంరంభంలో మొదట్లో ఎవరికీ పెద్దగా అంచనాలు లేని స్పెయిన్ జట్టు అందరినీ అధిగమించి విశ్వవిజేతగా నిలిచింది. క్రీడాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇలాంటి ఘట్టాలు సాకర్ చరిత్రలో బహుశా అరుదుగా నమోదైవుంటాయి. అలాగని స్పెయిన్ తక్కువేం కాదు. అది తొలిసారిగా 2010లో దక్షిణాఫ్రికాలో ప్రపంచకప్ సాధించింది. అంతక్రితం సాకర్ యూరో కప్‌ను మూడుసార్లు – 1964, 2008, 2012లలో గెలుచుకుంది. ఒకరకంగా 2008 నుంచి 2012 వరకూ అది ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిందని చెప్పాలి. కానీ అనంతరకాలంలో దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. మొదట్లో స్పెయిన్‌కు విజయపరంపర అందించిన ‘టికి–టాకా’ వ్యూహం (ఆటగాళ్లు బంతిని పాస్‌లు ఇచ్చుకుంటూ తమమధ్యే ఉంచుకోవటం), గోల్ పోస్ట్ వైపు వెళ్లే చొరవ తగ్గటానికి దారితీసింది. ప్రత్యర్థులు సులభంగా అంచనావేసే స్థితి ఏర్పడింది. దిగ్గజా లనదగ్గ జావి, ఇనియెస్టా, కార్లెస్, సెర్గియో రామోస్ వంటి ఆటగాళ్లు వరసగా నిష్క్రమించినప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేయటంలో బోర్డు విఫలమైంది. కొత్తగా వచ్చినవారికి అంతర్జాతీయ టోర్నీల ఒత్తిడిని తట్టుకునే అనుభవం లేకపోయింది. అయితే కాలం మారింది. లామిన్ యామాల్ వంటి యువ సంచలనం, ఫెర్రాన్ టోరెస్ వంటి సమర్థుడు చరిత్ర తిరగరాశారు. అటు అర్జెంటీనా అసామాన్యమైనది. నిన్న మొన్నటివరకూ దానివైపు తలెత్తి చూడటానికి కూడా ప్రత్యర్థులు సాహసించనంతటి అరివీరభయంకర జట్టు. మారడోనా, మెస్సీ వంటి సార్వకాలిక మహా దిగ్గజాలను ప్రపంచానికందించిన ఆ దేశం ఎప్పుడూ ఫుట్‌బాల్‌లో తిరుగులేని శక్తిగానే ఉంది. 1978, 1986, 2022లలో అర్జెంటీనా ఆటగాళ్లు మహాద్భుతాలను ప్రదర్శించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపారు. దక్షిణమెరికా ఖండంలో అత్యున్నత టోర్నమెంటు అయిన ‘కోపా అమెరికా’లో ఏకంగా 16 సార్లు ఆ టైటిల్‌ను గెలిచిన చరిత్ర అర్జెంటీనా ఆటగాళ్లది. మెస్సీది అద్భుతమైన నైపుణ్యం. చెప్పాలంటే అతనిది భావోద్వేగంతో ముడిపడివుండే మాయాజాలం. అది ఇన్నాళ్లూ రాణించింది. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి రావటం కూడా అసాధ్యమనిపించే రీతిలో పనిచేసింది. కానీ భారమంతా మెస్సీపైనే పడటం ఆ జట్టుకు పెద్ద మైనస్ అయికూర్చుంది. అవతల స్పెయిన్ ఆటగాళ్లు ఉక్కు క్రమశిక్షణతో, అంకితభావంతో ఆడి మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించిన తీరు అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బతీసింది. ఒలింపిక్స్ అయినా, సాకర్ వంటివైనా ప్రపంచ దేశాలమధ్య సద్భావనను పెంపొందించే సందర్భాలు. నిన్న మొన్నటివరకూ కలహాలతో చెలరేగిపోయిన దేశాల ఆటగాళ్లు ఆ యుద్ధంరేపిన గాయాలు మరిచి పరస్పరం చేతులు కలపడం గుర్తుంచుకోదగిన క్షణాలవుతాయి. ఈసారి ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా ప్రపంచ దేశాలను అష్ట కష్టాలు పెడుతూ పగబట్టినట్టు ప్రవర్తిస్తూ వచ్చింది. ఆఖరికి సాకర్ సాగుతున్న దశలో కూడా అది ఇరాన్‌పై క్షిపణిదాడులతో చెలరేగిపోయింది. ఆ చీడను ఇరాన్ ఆటగాళ్లకూ పులిమింది. ప్రాక్టీసింగ్ మ్యాచ్‌లు ఇక్కడ కుదరదంటూ విమానాశ్రయంనుంచే వెనక్కి పంపింది. చివరకు వారు మెక్సికోలో బసచేసి, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆట ముగిసీ ముగియగానే మెక్సికో వెళ్లటానికి విమానాశ్రయానికి తరలించేది. అన్ని అవమానాలనూ దిగమింగుకుంటూనే అమెరికా క్రీడాభిమానులుసహా ప్రపంచమంత టినీ ఇరాన్ జట్టు అలరించింది. మొత్తానికి అమెరికా అగ్రరాజ్య దురహంకారానికి కొత్తగా వచ్చిచేరిన జాత్యహంకారం ఈ సాకర్‌లో కొన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పట్టనట్టున్న ఫిఫా దానికి లొంగి స్వీయ ప్రతిష్ఠను కోల్పోయింది. మైదానంలో రిఫరీదే తుది నిర్ణయంకాగా, ట్రంప్ జోక్యంతో దాన్ని మార్చటం ఫిఫా బలహీనతకు చిహ్నం. మొత్తానికి ఫుట్‌బాల్ అందం దాని దిగ్గజాలు ప్రదర్శించే క్రీడా నైపుణ్యంలో ఉంటుంది. భిన్నమైన ఆట శైలులుగల మెస్సీ, రొనాల్డో, ఎర్లింగ్ హాలండ్ వంటివారు అభిమానులకు శాశ్వతంగా మిగిలే ఆనందకర క్షణాలను అందించారు. -
బుడ్డోడా మజాకా.. సవతి సోదరుడైనా తమ్ముడంటే ప్రాణం!
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్ నిలవడంతో ఆ జట్టు సంబరాలు మాములుగా లేవు. 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా టైటిల్ గెలవడంతో స్పెయిన్‌లో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఇక స్పెయిన్ ఆటగాళ్ల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ఈ ఫిఫా టోర్నీలో ఒక బుడ్డోడు మాత్రం యమా క్రేజ్ సంపాదించాడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు స్పెయిన్ స్టార్ లామినె యమాల్ చిన్న తమ్ముడు కీన్. సవతి తల్లికి పుట్టినోడయినప్పటికీ కీన్‌ను యమాల్ సొంత తమ్ముడిలా, కొడుకులా భావిస్తుంటాడు. మూడేళ్ల వయసున్న కీన్ 2026 ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు తన తల్లితో కలిసి హాజరయ్యాడు. ప్రతీ మ్యాచ్‌ను స్టాండ్స్ నుంచి వీక్షించిన కీన్ తన అన్న ఆటను తెగ ఎంజాయ్ చేసేవాడు. Photo Credit: FIFA Twitterఅంతేకాదు స్పెయిన్ తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత యమాల్ తన సోదరుడిని ఒడిలో తీసుకొని ఆడుకోవడం ఆనవాయితీగా చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా యమాల్ దీనిని కంటిన్యూ చేశాడు. తన అన్న కప్ గెలవడంతో తమ్ముడికి సంతోషం ఆగలేదు. గ్రౌండ్ అంతా తనదే అన్నట్లుగా మైదానం నలుమూలలా పరిగెడుతూ సందడి చేశాడు. Photo Credit: FIFA Twitterఈ సందర్భంగా అన్న లామినె యమాల్‌ను కూడా కాసేపు ఆట పట్టించాడు. ట్రోఫీ సెలబ్రేషన్స్ అనంతరం కప్పు తన చేతిలోకి తీసుకున్న యమాల్ తన కుటుంబం దగ్గరకు వచ్చి తమ్ముడితో కలిసి ఫొటోలుకు ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫిఫా పైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. Lamine Yamal ve kardeşi. pic.twitter.com/gpcwLCiKvz— Pusholder (@pusholder) July 20, 2026 Lamine Yamal celebrating with his brother 🤗 pic.twitter.com/sd8Jg8smgZ— B/R Football (@brfootball) July 19, 2026 It's Keyne's world and we're just living in it 🤣 pic.twitter.com/Qk4I9BAuX4— B/R Football (@brfootball) July 19, 2026చదవండి: దేశవాళీ టోర్నీ.. సూర్యకుమార్‌కు మరో అవమానం! -
మెస్సీ అలా.. లామినే ఇలా; చివరికి!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఓటమి బాధను తట్టుకోలేక అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ స్పెయిన్ ఆటగాళ్లతో తగాదా పెట్టుకున్నాడు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పటికీ ఒకవైపు మెస్సీ.. మరోవైపు లామినె యమాల్ మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. ఓటమి షాక్ నుంచి తేరుకోని మెస్సీ మైదానంలోనే నిరాశతో కూర్చుండిపోయాడు. తనలో తాను కుమిలిపోతు కన్నీటిపర్యంతమయ్యాడు. Photo Credit: FIFA Twitterమరోపక్క యమాల్ కూడా తన పక్కనే అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తన దేశం గెలిచిందన్న సంతోషంతో అతను ప్రార్థనల్లో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా యమాల్ తన పనిలో నిమగ్నమై ఉండడం చూస్తే అతడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో అర్థమవుతోంది. ఇంత గొడవలో కూడా మెస్సీ, యమాల్ మధ్య జరిగిన ఒక భావోద్వేగ ఘటన ఆసక్తిగా మారింది.MIENTRAS LAMINE YAMAL REZABA... 😳 pic.twitter.com/9SPl4s4Gep— Diario Olé (@DiarioOle) July 20, 2026Photo Credit: FIFA Twitterఒకరినొకరు ఆలింగనం..లామినే యమాల్ తన ప్రార్థన పూర్తి చేసుకొని లేచిన తర్వాత తన ఎదురుగా పెద్ద గొడవ జరుగుతున్న దృష్ట్యాలను చూశాడు. కానీ దానిని పట్టించుకోకుండా యమాల్ నేరుగా మెస్సీ వద్దకు వచ్చాడు. అప్పటికే నిరాశలో కూరుకుపోయిన మెస్పీని ఓదార్చి పైకి లేపాడు. ఆ తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన అభిమానులు.. 'క్యా సీన్‌హై' అనకుండా ఉండలేకపోయారు. వీరిద్దరు ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. 'నిజమైన క్రీడా స్ఫూర్తికి మెస్సీ, యమాల్ అర్థం చెప్పారంటూ' కామెంట్లు చేశారు.అసలేం జరిగింది?ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఓటమి బాధలో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లవైపు చూస్తూ స్పెయిన్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం వారికి కంటికి ఇంపుగా అనిపించలేదు. దీంతో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఒక్కసారిగా స్పెయిన్ ఆటగాళ్లవైపు దూసుకొచ్చాడు. Thank you, Leo. Legends are remembered, but you will never be forgotten. 🐐https://t.co/K8dqX5Tvlo— ketansusuw ✿ (@tansuuuw) July 20, 2026ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. Read: మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే! -
మరో ఫిఫా ఆడకపోవచ్చు.. మెస్సీ శకం ముగిసినట్లే!
మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా తన ఆటతోనే సమాధానం చెప్పాడు తప్ప హద్దులు మీరిన సందర్భాలు చాలా తక్కువ. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవసరం ఎంతమేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో ప్రతీ మూలన అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో ఫుట్‌బాల్ పీలే, మారడోనా సహా ఎందరో దిగ్గజ ఆటగాళ్లను అందించినప్పటికీ ఈ తరంలో మాత్రం మెస్సీనే దిగ్గజ ఆటగాడు. ఇంకా చెప్పాలంటే అతడో ఆరాధ్య దైవం.అలాంటి ఈ తరంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్రలో నుంచి లేపి ఒక ఆటగాడి పేరు చెప్పమంటే మొదట వినిపించే పేరు లియోనల్ మెస్సీ. రెండు దశాబ్దాలుగా తన ఆటతో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి కట్టేసుకున్న మెస్సీ చూడాల్సినవన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియన్ గోల్డెన్ షేస్, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయర్, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్‌గాను నిలిచాడు. తన కెరీర్లో లోటుగా ఉన్న ఫిఫా ప్రపంచకప్‌ను కూడా నాలుగేళ్ల కిందట ఖతార్‌లోనే అందుకున్నాడు. మరి ఇన్ని చూసినా ఈసారి ఫిఫాలో కూడా మెస్సీ నామజపమే ఎందుకు నడిచిందనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదంతా మెస్సీ మాయ.Photo Credit: FIFA Twitterమెస్సీ బరిలో ఉన్నాడంటే చాలు అభిమానులకు ఎక్కడలేని జోష్ వస్తుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ అయింది. ఈసారి ఫిఫాలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాను మెస్సీనే మరోసారి అన్నీ తానై నడిపించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో (ప్రి-క్వార్టర్ ఫైనల్ వరకు) కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ గోల్డెన్ బూట్ రేసులోను దూసుకెళ్లాడు. అయితే అతడి స్పీడుకు ఈసారి ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) బ్రేకులు వేశాడు. అయితే క్వార్టర్స్, సెమీస్‌లో గోల్ చేయనప్పటికీ కీలక అసిస్ట్‌లు అందించి జట్టు వెన్నంటే ఉన్నాడు. కానీ కీలకమైన ఫైనల్లో మెస్సీ ఏం చేయలేకపోయాడు. దుర్బేద్యమైన స్పెయిన్ ఫార్వార్డ్ ప్లేయర్లను అడ్డుకోవడంతోనే మెస్సీకి సరిపోయింది. మ్యాచ్‌లో మెస్సీ రెండు క్రాస్‌లతో పాటు ఒక్కసారి మాత్రమే గోల్‌పోస్ట్ వైపు షాట్ ఆడినప్పటికీ స్పెయిన్ గోల్ కీపర్ ఉనైయి సిమోన్ దానిని కూడా సమర్థంగా అడ్డుకున్నాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 20 సార్లు తమ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తే.. అర్జెంటీనా మాత్రం రెండుసార్లు మాత్రమే ప్రయత్నం చేయడం గమనార్హం.Photo Credit: FIFA Twitterఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ కన్నీటిపర్యంతమవడం వెనుక ఒక కారణముంది. ఈసారి ఫిఫా ఆరంభం నుంచి అర్జెంటీనా ఆటపై వివాదాలు నెలకొన్నప్పటికీ మెస్సీ మాత్రం తన ఆటను చాలా సందర్భాల్లో నిజాయితీగానే ఆడాడు. ఫైనల్లో కూడా తను చేయాల్సిందంతా చేశాడు. కానీ పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన స్పెయిన్ ముందు అర్జెంటీనా పూర్తిగా తేలిపోవడంతో మెస్సీ కూడా చేష్టలుడిగి ఉండిపోయాడు.ఇక 1962 తర్వాత వరుసగా రెండు ఫిఫా ప్రపంచకప్‌లు గెలవాలన్న కల కూడా చెదరడం మెస్సీ కన్నీటికి మరో కారణం. 39 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఆటను కొనసాగించిన మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. మంచి ఫామ్‌లో ఉన్నందున ఈసారి ఎలాగైనా అర్జెంటీనాకు రెండోసారి ఫిఫా టైటిల్‌ను అందించాలని మెస్సీ కలగన్నాడు. బరిలోకి దిగిందే తడవుగా ప్రత్యర్థులతో పోరాట సింహంలా తలపడ్డాడు. 8 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లు చేసిన మెస్సీ సిల్వర్ బూట్‌ను కూడా గెలుచుకున్నాడు. Photo Credit: FIFA Twitterఅవార్డులు కొత్త కానప్పటికీ ఈసారి మెస్సీ ఫిఫా టైటిల్‌ను గెలిచిన మరుక్షణమే ఆటకు వీడ్కోలు పలికేవాడేమో. ప్రస్తుతం తన రిటైర్మెంట్పై మౌనమే వహించినప్పటికీ 2030 ఫిఫాలో మెస్సీ ఆడడం డౌటే. కాబట్టి ఫుట్‌బాల్‌లో ఒక శకం దాదాపు ముగిసినట్లే. Lionel Messi, Arjantin taraftarlarının tezahüratıyla duygulanıyor. pic.twitter.com/FkN2VjlUSm— Messi Anıları (@messianilari) July 19, 2026Lionel Messi gets emotional as Argentina fans shower him with love and support 🥹 pic.twitter.com/kff4YYJBwu— Instablog9ja (@instablog9ja) July 20, 2026 ESTE ULTÚIMO TANGO Una de las cosas más hermosas del fútbol es tener a Lionel Andrés Messi y su participación en todos los Mundiales. Gracias por todo lo que has logrado con la selección: récords, logros y campeonatos Gracias por cada momento de alegría que compartimos con la… pic.twitter.com/6GYfKBKpnz— AR (@ionlylei) July 20, 2026 -
నాలుగేళ్లలో సీన్ రివర్స్.. విలన్‌గా మారిన అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ విజయంతో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో నిరాశతో కూర్చుండిపోయాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనాకు ఫిఫా ప్రపంచకప్ అందించాలన్న కల చెదరడంతో ఏం చేయలేక కన్నీటిపర్యంతమయ్యాడు. ఈసారి ఫిఫా టోర్నీ ఆరంభం నుంచి ఫుల్‌జోష్‌లో కనిపించిన అర్జెంటీనా.. ఫైనల్ వరకు హీరోగానే నిలిచినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరెడెస్ ఓటమి బాధను తట్టుకోలేక స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగడం ఆ జట్టును విలన్‌గా మార్చేసింది. ఫిఫా ఆరంభం నుంచి ఎన్ని వివాదాలు జరిగినా ప్రపంచమంతా అర్జెంటీనా గెలవాలని బలంగా కోరుకుంది. కానీ ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన గొడవ అర్జెంటీనాను హీరో నుంచి జీరోకు పడిపోయేలా చేయడమే గాక, టోర్నీ విలన్‌గా మారిపోయింది.Photo Credit: FIFA Twitter2022 ఖతార్ ప్రపంచకప్‌లో తమ ఆటతీరుతో అందరి మన్ననలు పొందిన అర్జెంటీనా నాలుగేళ్ల తర్వాత జరిగిన ఫిఫా 2026లో మాత్రం వారి ప్రయాణం మొత్తం వివాదాలతోనే నడిచింది. ఈజిప్ట్‌పై చివరి నిమిషంలో 3-2 తేడాతో విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ విజయం అర్జెంటీనాను మరింత వివాదంలోకి నెట్టేసింది. అర్జెంటీనా గెలవడానికే ఫిఫా నిర్వహిస్తున్నారని, రిఫరీ ఎవరైనా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు ఉంటున్నాయని, అంతమాత్రాన ఫిఫా ప్రపంచకప్ నిర్వహించడం ఎందుకని, టైటిల్‌ను అర్జెంటీనాకు ఇచ్చేయాలనే విమర్శలు వచ్చాయి. ఇలా టోర్నీలో అర్జెంటీనా సాధించిన ప్రతీ విజయం వెనుక ఒక మెలిక ఉండడం పరిపాటిగా మారిపోయింది.Photo Credit: FIFA Twitterఈసారి టోర్నీ అంతటా వివాదాలు, సోషల్ మీడియాలో చర్చలు ఉన్నప్పటికీ, మెస్సీ మాత్రం తన ఆదర్శప్రాయమైన ప్రవర్తనతో జట్టును నడిపించాడు. అంతా చేజారిపోయినట్లు అనిపించిన మ్యాచ్‌ల్లో కూడా తన మ్యాజిక్‌తో అర్జెంటీనావైపు మొగ్గేలా చేశాడు. మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ ఆడడం అనుమానమే. కాబట్టి తర్వాతి ఫిఫాకు ఈ దిగ్గజం లేకుండానే అర్జెంటీనా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మెస్సీకి ఒక పరిపూర్ణమైన ముగింపు కల్పించే అవకాశం అర్జెంటీనాకు లభించినప్పటికీ ఫైనల్ తర్వాత జరిగిన ఒక్క గొడవ ఆ జట్టు ఆటగాళ్లను విలన్లుగా మార్చేసింది.Read: కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది? -
FIFA World Cup 2026 : ఫిఫా 2026 విశ్వవిజేత స్పెయిన్ (ఫొటోలు)
-
కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. ఏం జరిగింది?
ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ఫిఫా విశ్వవిజేతగా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓటమి షాక్‌లో ఉన్న అర్జెంటీనా ఆటగాళ్లు సహనం కోల్పోయి స్పెయిన్ ఆటగాళ్లతో గొడవకు దిగారు. చిలికి చిలికి గాలి వానలా మారిన గొడవ తన్నుకునేంత వరకు వెళ్లింది. దీంతో అప్పటివరకు రణరంగంలా కనిపించిన మైదానం యుద్ధభూమిని తలపించింది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో అర్జెంటీనా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆటగాళ్లను విడదీసి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఈ ఘర్షణలో అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ లియాండ్రో పరేడెస్.. స్పెయిన్ ఆటగాళ్లు గావీ, ఎరిక్ గార్సియాలతో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో పరేడెస్ ప్రత్యర్థి ఆటగాడిని తోసివేయడంతో పాటు చేయి చేసుకున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ గొడవను ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఘర్షణకు కారణమైన లియాండ్రో పరెడేస్పై రెడ్ కార్డు చూపించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో రెడ్ కార్డు అందుకున్న రెండో ఆటగాడిగా పరేడెస్ నిలిచాడు. అంతకుముందు మ్యాచ్ జరుగుతున్న సమయంలో అర్జెంటీనా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ కూడా రెడ్ కార్డు అందుకున్నాడు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో ఆఖరి అంకం దాకా హీరోగా నిలిచిన అర్జెంటీనా ఈ ఒక్క ఘటనతో విలన్‌గా మారిపోయింది. 🚨🥊 Full scenes after final whistle.@MickyJnr__ 🎥 pic.twitter.com/ZXCvAFkHwy— Fabrizio Romano (@FabrizioRomano) July 20, 2026Read: అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా? -
సైలెంట్‌గానే.. చరిత్ర సృష్టించాడు!
స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రోడ్రి అరుదైన ఘనత సాధించాడు. ‘కంప్లీట్ ఫుట్‌బాల్’ వీరుల జాబితాలో 30 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ చేరిపోయాడు. కాగా న్యూయార్క్ వేదికగా భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ అర్జెంటీనాపై 1-0 గోల్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించాడు!ఈ క్రమంలో రోడ్రి ఖాతాలో తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్ చేరింది. ఇంతకు ముందు అతడు UEFA చాంపియన్స్ లీగ్, బాలన్ డి ఓర్ అవార్డులు కూడా గెలిచాడు. ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మూడు అవార్డులను గెలిచిన పదకొండో ప్లేయర్‌గా రోడ్రి చరిత్రకెక్కాడు.ఈ జాబితాలో సర్ బాబీ చార్ల్టన్, ఫ్రాంజ్ బెకెన్బ్యూయర్, గెడ్ ముల్లర్, పవోలో రోసి, జినెదైన్ జిదానే, రివాల్డో, రొనాల్డినో, కకా, లియోనల్ మెస్సీ, డెంబెలె రోడ్రి కంటే ముందు వరుసలో ఉన్నారు.గోల్డెన్ బాల్అదే విధంగా.. బాలన్ డి ఓర్, వరల్డ్‌కప్, చాంపియన్స్ లీగ్‌లతో పాటు గోల్డెన్ బాల్ గెలిచిన నాలుగో ఆటగాడిగానూ రోడ్రి నిలిచాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో రోడ్రి గోల్ కొట్టలేకపోవచ్చు. కానీ సహచరులు గోల్ కొట్టేలా అవకాశాలు కల్పించాడు. టోర్నీ ఆసాంతం అత్యుత్తమంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీంతో అతడిని గోల్డెన్ బాల్ వరించింది.ఈ అవార్డు అందుకున్న తొలి స్పెయిన్ ఆటగాడు కూడా రోడ్రి కావడం విశేషం. కాగా 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన రోడ్రి.. 2022లోనే తొలిసారి వరల్డ్‌కప్ ఆడాడు. ఇక ఈసారి ఏకంగా కెప్టెన్‌గా స్పెయిన్‌కు టైటిల్ అందించాడు. పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సి వంటి సారథులు ఎక్కువగా గోల్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. అత్యుత్తమ మిడ్ ఫీల్డర్కానీ రోడ్రి ఆట మాత్రం ఇందుకు భిన్నం. ఆరు అడుగులకుపైగా ఎత్తు ఉండే అతడు.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ బంతిని పాస్ చేయడంలో దిట్ట. సహచరులు గోల్స్ కొట్టేలా అవకాశాలు సృష్టించే రోడ్రి ప్రపంచంలోని అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో రోడ్రి ఏకంగా 790 పాస్‌లు అందించాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. అర్జెంటీనాతో ఫైనల్లో రోడ్రి 101 పాస్‌లు కంప్లీట్ చేయడం విశేషం. చదవండి: స్పెయిన్ 20.. అర్జెంటీనా0: తెర వెనుక హీరో అతడే! -
స్పెయిన్ 20.. అర్జెంటీనా 0: తెర వెనుక హీరో అతడే!
స్పెయిన్.. 2008- 2021 మధ్య ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏలడమే కాదు. ఆట తీరును కూడా మార్చివేసింది. 1988- 96 మధ్య బార్సిలోనా జట్టు ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘టికీ-టాకా’ అస్త్రాన్ని పూర్తిగా వాడుకోవడంలో స్పెయిన్ సఫలమైంది.ఇందులో భాగంగా షార్ట్, క్విక్ పాసులతో పాదరసంలా కదులుతూ ఆటగాళ్లు ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ.. ప్రత్యర్థిని పూర్తిగా అలసిపోయేలా చేస్తారు. ఆ తర్వాత గోల్స్ వేట మొదలుపెడతారు.చిన్న, వేగవంతమైన పాసులతో బంతిని కదిలించడం.. నిర్దిష్ట జోన్లలో నిలిచి ఎల్లప్పుడూ పాసింగ్ ఆప్షన్లు కల్పించడం, ఆటగాళ్లు త్రిభుజాకారంలో నిలిచి తక్కువ దూరంలోనే బంతిని పాస్ చేసుకోవడం ఇందులోని ముఖ్య వ్యూహాలు.ఆ తర్వాత అందుకే విఫలంయూరో 2008, ఫిఫా వరల్డ్‌కప్-2010, యూరో 2012 టైటిళ్లను స్పెయిన్ టికీ-టాకా వ్యూహంతోనే దక్కించుకుంది. తమ ప్రత్యేక శైలితో ఆట తీరును మరో స్థాయికి తీసుకువెళ్లిన స్పెయిన్.. ఆ తర్వాత ప్రత్యర్థుల చేతిలో భంగపడింది. ఎల్లప్పుడూ ఎక్కువగా పాస్లపైనే దృష్టి పెట్టి గోల్స్ కొట్టడంలో విఫలమై 2018, 2022 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది. ప్రత్యర్థి జట్లు తమ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేసుకుని స్పెయిన్ వ్యూహానికి ఇలా చెక్ పెట్టాయి.ఫూయెంటె రాకతో..దీంతో ఒకప్పుడు బలంగా భావించిన ‘టికీ- టాకా’ అస్త్రం.. ఆ తర్వాత ప్రత్యర్థుల అప్రమత్తతో వారి బలహీనతగా మారిపోయింది. అయితే, లూయీస్ డి లా ఫూయెంటె (Luis de la Fuente) స్పెయిన్ కోచ్‌గా వచ్చిన తర్వాత మరోసారి ఈ వ్యూహాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేశాడు. సరికొత్త హంగులతో టికీ-టాకా 2.0ను తీసుకువచ్చాడు.ఇందులో భాగంగా కేవలం బంతిని నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా.. వేగంగా ఫార్వర్డ్ చేసి గోల్స్ సాధించే శక్తివంతమైన జట్టుగా మారింది స్పెయిన్. కేవలం బంతిని పాస్ చేయడమే కాకుండా.. ప్రత్యర్థి మోహరింపుల్లోని గ్యాప్‌లను గుర్తించి అటాక్ చేయడంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం లమీన్ యమాల్, విలియమ్స్ వంటి యువ ఆటగాళ్ల సేవలను వాడుకుంది.తద్వారా కేవలం బంతిని కంట్రోల్ చేయడమే కాకుండా.. కౌంటర్ అటాక్‌లు చేయడంలో సఫలమై.. తమ అమ్ములపొదిలోని టికీ-టాకా అస్త్రానికి మరింత పదునుపెట్టింది. ముఖ్యంగా సెమీ ఫైనల్లో ఫ్రాన్స్‌పై ఈ వ్యూహాన్ని సమర్థవంతంగా ఉపయోగించి అనుకున్న ఫలితాన్ని రాబట్టింది స్పెయిన్. ఆ మ్యాచ్‌లో పెడ్రో పోరో సాధించిన గోల్ ఆధునిక టికీ-టాకా వ్యూహానికి నిదర్శనం.స్పెయిన్ 20.. అర్జెంటీనా 0ఈ టోర్నీలో స్పెయిన్ మొత్తంగా పద్నాలుగు గోల్స్ సాధించగా.. ప్రత్యర్థి ఒకే ఒక గోల్ కొట్టే అవకాశం ఇచ్చింది. దీనిని బట్టి స్పెయిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ గోల్ కోసం ప్రయత్నించే క్రమంలో 20 షాట్లు కొట్టింది. ఇందులో 12 గోల్ పోస్ట్ దిశగా వెళ్లాయి. మొత్తంగా 817 పాస్‌లు ఇచ్చుకున్నారు ఆటగాళ్లు. అదే సమయంలో అర్జెంటీనా మాత్రం గోల్ పోస్ట్ దిశగా ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. రోడ్రి వరల్డ్ రికార్డుఇక మైదానంలో పక్కాగా వ్యూహాలను అమలు చేసిన స్పెయిన సారథి రోడ్రి.. ఈ సీజన్లో ఏకంగా 790 పాస్‌లు ఇచ్చాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక స్పెయిన్ డిఫెండర్లు క్యూబార్సి 668, లాఫోర్టే 618 పాసులు చేశారు. ఓవరాల్‌గా జట్టుగా స్పెయిన్ 4945 సార్లు బంతిని పాస్ చేసింది. తెర వెనుక హీరో అతడే!దీనిని బట్టి స్పెయిన్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిందన్న విషయం సుస్పష్టం. ఏదేమైనా ఫూయెంటె టికా-టాకాకు పునర్వైభవం తెచ్చి జట్టు రెండోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచేలా చేశాడు. తెర ముందు గోల్ కొట్టి ఫెరాన్ టోరెస్ హీరో కాగా.. తెర వెనుక తన పదునైన వ్యూహాలతో ఫూయెంటె హీరోగా నిలిచాడు.చదవండి: మెస్సీ చేయలేనిది... రొనాల్డో సాధించాడు!Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
స్పెయిన్ చేతిలో ట్రోఫీ.. ట్రంప్‌ను ఆటాడుకున్నారు!
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో స్పెయిన్ చారిత్రక విజయం సాధించిన వేళ.. అసలు మ్యాచ్ కంటే ట్రోఫీ ప్రదానోత్సవమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికపైకి రావడం, ఆ తర్వాత ట్రోఫీ లిఫ్ట్ సమయంలో అక్కడే నిలబడిపోవడం సోషల్ మీడియాలో సెటైర్లకు కారణమైంది.న్యూజెర్సీ: అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మ్యాచ్ అనంతరం న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్ మైదానంలోకి వచ్చారు. అయితే ట్రంప్ ఎంట్రీకి ప్రేక్షకుల్లోని ఓ వర్గం నుంచి భారీగా ‘బూస్’(నిరసన నినాదాలు) వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేక్షకులు చల్లబడ్డా.. ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం వైరల్‌గా మారింది.ట్రోఫీ ఇచ్చి అలాగే.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రికి ట్రంప్ వరల్డ్‌కప్ ట్రోఫీ అందించారు. సాధారణంగా ట్రోఫీ అందుకున్న కెప్టెన్ తన జట్టుతో కలిసి దానిని ఎత్తి సంబరాలు చేసుకుంటాడు. అదే సమయంలో ట్రంప్ అక్కడి నుంచి తప్పుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపు ఆటగాళ్ల మధ్యే నిలబడి ఉన్నారు. దీంతో అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్ పక్కకు జరిగారు. ఆ తర్వాత రోడ్రి తన సహచరులతో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని పైకెత్తి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026 @FIFAWorldCup Champions! 🏆 pic.twitter.com/SHsoBhYm1b— The White House (@WhiteHouse) July 19, 2026ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ‘‘ట్రోఫీ ఇచ్చారు కానీ ఫోటోలో ఉండాలనుకున్నారు’’ అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.క్లబ్ వరల్డ్‌కప్ ఘటన గుర్తొచ్చిందా?ఈ ఘటనపై గతంలో జరిగిన క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్ ట్రోఫీ వేడుకను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనూ ట్రంప్ విజేత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టేజ్‌పై ఎక్కువసేపు ఉండటంపై చర్చ జరిగింది. అయితే ఈసారి ఫిఫా ప్రోటోకాల్ ప్రకారం చివరకు ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.స్పెయిన్ చరిత్ర.. వేదికపై ట్రంప్ హైలైట్ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోరెస్ అదనపు సమయంలో చేసిన గోల్‌తో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లడంతో ఆ జట్టు 10 మందితో మ్యాచ్‌ను ముగించింది. లియోనెల్ మెస్సీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరలేదు. స్పెయిన్ ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన రాత్రి.. ట్రోఫీ వేడుకలో ట్రంప్ ఎపిసోడ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. -
మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!
ఒక్క మ్యాచ్‌తో అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ కల చెదిరిపోయింది. వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడాలన్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా 1-0 గోల్ తేడాతో ఓటమిపాలైంది. స్పెయిన్ స్టార్ టోరెస్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అదనపు సమయంలో గోల్ కొట్టి అర్జెంటీనా హృదయం ముక్కలు చేశాడు.ఇక వరల్డ్‌కప్-2026 ఫైనల్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అని మెస్సీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే.. స్పెయిన్‌తో ఫైనల్లో గోల్ కొట్టడంలో మెస్సీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లకు ఇచ్చే అవార్డు) కూడా మెస్సీ కోల్పోయాడు. ఫ్రాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.ఆసక్తికర చర్చ.. మెస్సీకి అదొక పీడకలఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. స్పెయిన్ విషయంలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సాధించింది.. మెస్సీ మాత్రం సాధించలేకపోయాడంటూ సాకర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మెస్సీ కెరీర్లో స్పెయిన్‌తో మ్యాచ్ ఓ పీడకలలా మిగిలిపోయింది. ఫైనల్లో మెస్సీతో పాటు అతడి జట్టులో ఒక్క సభ్యుడు కూడా గోల్ కొట్టలేక టైటిల్‌ను కోల్పోయారు.ఒకే ఒక్కసారిఇక మెస్సీ ఇప్పటికి నాలుగుసార్లు స్పెయిన్‌తో మ్యాచ్ ఆడాడు. తాజా వరల్డ్‌కప్ ఫైనల్ మినహాయిస్తే.. మిగిలిన మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు. అయితే, ఈ నాలుగు సందర్భాల్లోనూ మెస్సీ స్పెయిన్‌పై కేవలం ఒకే ఒక్క గోల్ సాధించాడు. 2009లో స్పెయిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ గోల్ కొట్టాడు.అయితే, ఈ మ్యాచ్‌లో స్పెయిన్ 2-1 గోల్ తేడాతో గెలిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ మెస్సీ స్పెయిన్‌పై గోల్ కొట్టలేదు. కీలక ప్రపంచకప్ ఫైనల్లోనూ మరోసారి అతడి ఈ బలహీనత బయటపడింది.మెస్సీ చేయలేనిది.. రొనాల్డో సాధించాడు!ఇక రొనాల్డో విషయానికొస్తే.. ఈ పోర్చుగల్ స్టార్ స్పెయిన్‌తో పదకొండుసార్లు తలపడ్డాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా నాలుగు గోల్స్ సాధించాడు. వరల్డ్‌కప్-2018లో హ్యాట్రిక్‌తో మెరిసి 3-3తో మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2025 నేషన్స్ లీగ్ ఫైనల్లో స్పెయిన్- పోర్చుగల్ మ్యాచ్ 2-2తో డ్రా కాగా... రొనాల్డో పెనాల్టీ షూటౌట్లో గోల్ కొట్టి తన జట్టును గెలిపించాడు.అంతేకాదు.. ఈ మాజీ రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు యూరో 2004, వరల్డ్‌కప్ 2010, యూరో 2012.. ఫిఫా వరల్డ్‌కప్-2026 రౌండ్ ఆఫ్ 16లో కూడా స్పెయిన్‌తో తలపడ్డాడు. అయితే, ఆయా సందర్భాల్లో గోల్ మాత్రం కొట్టలేకపోయాడు.తీరని కలఏదేమైనా.. సమకాలీన ఫుట్‌బాలర్లలో మెస్సీ- రొనాల్డో.. ఇద్దరూ ఎవరికివారే సాటి. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా.. రొనాల్డో గెలవలేని వరల్డ్‌కప్ ట్రోఫీని.. మెస్సీ 2022లో సొంతం చేసుకున్నాడు. అయితే, స్పెయిన్ విషయంలో మాత్రం మెస్సీ కంటే రొనాల్డో మెరుగైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక మెస్సీకి వరల్డ్‌కప్ మెగా ఫైనల్లోనూ స్పెయిన్ ఒక పజిల్లా మిగిలిపోయింది. గోల్ కొట్టలేక.. ఓటమి బాధతో కన్నీళ్లతో మెస్సీ మైదానాన్ని వీడాడు.చదవండి: స్పెయిన్ హీరో.. ఎవరీ టోరెస్? -
ఫిఫా వరల్డ్‌కప్ హీరో.. ముందుగా భారత్‌లోనే మెరిశాడు!
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్ ఆది నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఈ టీనేజర్.ముఖ్యంగా ఫ్రాన్స్‌తో సెమీ ఫైనల్లో కీలక సమయంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి.. అతి పిన్న వయసులోనే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అర్జెంటీనాతో ఫైనల్లో మాత్రం ఫెరాన్ టోరెస్ స్పెయిన్ హీరోగా అవతరించాడు.అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్ కొట్టి స్పెయిన్‌ను గెలిపించాడు టోరెస్. నికో విలియమ్స్ ఇచ్చిన హెడర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లాడు. తద్వారా స్పెయిన్ వరల్డ్‌కప్ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు.ఎవరీ టోరెస్?26 ఏళ్ల టోరెస్ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో ఫార్వర్డ్ ప్లేయర్. స్పెయిన్‌లోని ఫెయెస్లో 2000, ఫిబ్రవరి 29న జన్మించాడు. ఆరేళ్ల వయసులోనే వాలెన్షియా అకాడమీలో చేరాడు. యూత్ జట్టు తరఫున రాణించి.. 2017లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. వాలెన్షియా తరఫున2017- 2020 మధ్యలో 71 మ్యాచ్‌లలో ఆరు గోల్స్ సాధించాడు.మాంచెస్టర్ సిటీ తరఫున 2020-2022 మధ్య కాలంలో 28 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్ కొట్టిన టోరెస్.. ప్రీమియర్ లీగ్, ఈఎఫ్ఎల్ కప్ గెలిచిన జట్టులు సభ్యుడు.ఇక ఆ తర్వాత అంటే 2021-22 సీజన్లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో చేరాడు టోరెస్. లా లిగా, కోపా డెల్ రెయ్, సూపర్కోపా కప్పులు గెలిచాడు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మేన్ జట్టుకు ఆడుతున్నాడు.భారత్‌లోనే ముందుగా మెరిశాడుస్పెయిన్ అండర్-17 జట్టు తరఫున 2017లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో టోరెస్ పాల్గొన్నాడు. స్పెయిన్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులోనూ సత్తా చాటాడు.కోల్‌కతాలో ఇంగ్లండ్- స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఇంగ్లండ్ 5-2 గోల్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీంతో స్పెయిన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీ గ్రూప్ దశలో స్పెయిన్ మూడు విజయాలు సాధించింది. అనంతరం నాకౌట్ దశలో ఫ్రాన్స్, మాలి జట్లపై గెలిచింది.ఈ ఈవెంట్లో టోరెస్ రెండు గోల్స్ కొట్టడంతో పాటు.. రెండు అసిస్ట్‌లు ఇచ్చి తన వంతు పాత్ర పోషించాడు. కాగా టోరెస్ స్పెయిన్ తరఫున 2020లో అరంగేట్రం చేశాడు. అండర్-17, 19, 21 స్థాయిల్లో ఆడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ముద్దుపేరు తెలుసా?ఇక లీప్ సంవత్సరంలో జన్మించిన టోరెస్ నాలుగేళ్లకోసారి తన పుట్టినరోజు జరుపుకొంటాడు. అతడి ముద్దుపేరు ‘ది షార్క్’. గోల్ కొట్టినపుడు అతడు షార్క్ ఫిన్ (షార్క్ వెనుక భాగంలో కనిపించే త్రికోణాకారపు రెక్క లాంటిది) సింబాలిక్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు కారణం. షార్క్ ఫిన్‌ను శక్తి, ప్రత్యేక గుర్తింపు, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. నీటి మీద ఫిన్ కనిపిస్తే అది ప్రమాద సూచనగా భావిస్తారు. తన ముద్దుపేరు మీదుగా టోరెస్ ఓ క్లాత్ బ్రాండ్ కూడా తీసుకువచ్చినట్లు సమాచారం.చదవండి: గోల్డెన్ బూట్, గోల్డోన్ గ్లోవ్, గోల్డెన్ బాల్.. ప్రైజ్ మనీ ఉంటుందా?Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 -
ఒక్క గోల్.. 12 ఏళ్ల తర్వాత అదే చరిత్ర!
ఫుట్‌బాల్‌లో ఒక గోల్ అంటే కేవలం స్కోర్ బోర్డుపై పెరిగే ఒక సంఖ్య కాదు.. కోట్లాది మంది అభిమానుల ఆశలు, భావోద్వేగాలను మార్చే క్షణం. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్ లాంటి అత్యున్నత వేదికపై ఒక్క గోల్ కూడా ఓ జట్టును చరిత్రలో నిలబెడుతుంది. కొన్ని ఫైనల్స్‌లో అయితే 90 నిమిషాల ఉత్కంఠకు తెరదించేది ఒకే ఒక్క గోల్. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఒకే దెబ్బతో ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సందర్భాలు ఫిఫా చరిత్రలో అరుదుగా నమోదయ్యాయి.ఒక్క గోల్.. ఒక్క క్షణం.. కానీ ఆ క్షణమే ఓ జట్టును చరిత్రలో శాశ్వతంగా నిలబెడుతుంది. అందుకే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో 1-0 విజయాలకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మ్యాచ్ ఫలితం 1-0తో తేలింది. ఈ ప్రతి విజయానికీ ఓ ప్రత్యేక కథ ఉంది.బ్రెహ్మే పెనాల్టీతో జర్మనీ చాంపియన్1990 ఇటలీ ప్రపంచకప్ ఫైనల్లో వెస్ట్ జర్మనీ, అర్జెంటీనా తలపడ్డాయి. అప్పటికే ఇరు జట్లు గట్టి పోరాటం సాగించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. గోల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 85వ నిమిషంలో కీలక క్షణం వచ్చింది. జర్మనీకి లభించిన పెనాల్టీని ఆండ్రియాస్ బ్రెహ్మే గోల్‌గా మలిచాడు. ఆ ఒక్క గోల్‌తో వెస్ట్ జర్మనీ ప్రపంచకప్‌ను ముద్దాడింది.ఇనియెస్టా గోల్‌తో స్పెయిన్ కల సాకారం2010 దక్షిణాఫ్రికా ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. 116వ నిమిషంలో ఆండ్రెస్ ఇనియెస్టా చేసిన అద్భుతమైన గోల్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. అదే స్పెయిన్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది. ఒక్క గోల్.. స్పెయిన్ ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణాక్షరాలుగా నిలిచిపోయింది.గోట్జే దెబ్బతో అర్జెంటీనాకు నిరాశ2014 బ్రెజిల్ ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ, అర్జెంటీనా మరోసారి ప్రపంచ వేదికపై తలపడ్డాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టైటిల్‌పై కన్నేయగా.. జర్మనీ పటిష్ఠ రక్షణతో పోరాడింది. మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లిన తర్వాత 113వ నిమిషంలో మారియో గోట్జే చేసిన గోల్ జర్మనీకి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఫైనల్ ముగిసే సమయానికి స్కోర్ బోర్డుపై నిలిచింది 1-0.2026.. స్పెయిన్ మరోసారి అదే ఘనత12 ఏళ్ల తర్వాత.. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. స్పెయిన్, అర్జెంటీనా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో గోల్స్ నమోదు కాలేదు. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఫెర్రాన్ టోరెస్ చేసిన కీలక గోల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ ఒక్క గోల్‌తో స్పెయిన్ ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌ను 1-0తో గెలిచిన అరుదైన జట్ల జాబితాలో స్పెయిన్ చేరింది.ఎందుకంత ప్రత్యేకం? ప్రపంచకప్ ఫైనల్లో జట్లు సాధారణంగా ఎంతో జాగ్రత్తగా ఆడతాయి. చిన్న తప్పిదం కూడా ట్రోఫీని దూరం చేయగలదనే ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుంది. అందుకే ఫైనల్స్‌లో భారీ స్కోర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. 1-0 విజయాల్లో గెలిచిన జట్లు కేవలం దాడిలోనే కాదు.. రక్షణలోనూ తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా.. వచ్చిన ఒక్క అవకాశాన్ని గోల్‌గా మార్చుకుని ప్రపంచ చాంపియన్లుగా నిలిచాయి. -
గోల్డెన్ బూట్ అతడికే!.. గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ ఎందుకిస్తారో తెలుసా?
సాకర్ మెగా సంబరం ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ముగిసింది. టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విజేతగా అవతరించింది. న్యూయార్క్ వేదికగా మెస్సీ బృందాన్ని 1-0 గోల్ తేడాతో ఓడించి రెండోసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది.అదనపు సమయంలోని 106వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్ కొట్టడంతో స్పెయిన్ చాంపియన్‌గా నిలవగా.. అర్జెంటీనా హృదయం ముక్కలైంది. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ టోర్నీలో ఆసాంతం అద్భుత ప్రదర్శ కనబరిచిన స్పెయిన్ వ్యక్తిగత బహుమతుల జాబితాలోనూ సత్తా చాటింది.ఈసారి ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్‌ను ఫాన్స్ కెప్టెన్ కెలియన్ ఎంబాపె గెలుచుకోగా.. మిగతా అవార్డులను మాత్రం స్పెయిన్ ఆటగాళ్లు కైవసం చేసుకున్నారు. అయితే, గోల్డెన్ బూట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి గోల్డెన్ బాల్, గోల్డెన్ గ్లోవ్ అవార్డుల గురించి మీకు తెలుసా?.. విజేతలను ఎలా నిర్ణయిస్తారు?.. ప్రైజ్‌మనీ ఉంటుందా?... పూర్తి వివరాలు మీకోసం గోల్డెన్ బూట్ విజేత ఎంబాపె (Kylian Mbappe- ఫ్రాన్స్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఎడిషన్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి దీనిని ప్రధానం చేస్తారు. ఈసారి ఎంబాపె పది గోల్స్ కొట్టడంతో పాటు నాలుగు అసిస్ట్‌లు అందించి గోల్డెన్ బూట్ గెలిచాడు. గత ప్రపంచకప్ అంటే 2022లోనూ ఎంబాపేకే ఈ అవార్డు దక్కింది.గోల్డెన్ బూట్ సుమారు కిలో మేర బరువు ఉంటుంది. దీనిని ఇత్తడి మిశ్రమ లోహంతో తయారు చేసి.. దానిపై మందపాటి బంగారు పొరను ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. గణాంకాల ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. దీనిని 1930లోనే ప్రవేశపెట్టినప్పటికీ.. 1982 నుంచి భౌతికంగా అందిస్తున్నారు. ఫ్రాన్స్ ఆటగాడు జస్ట్ ఫౌంటైన్ 1958 ప్రపంచకప్ టోర్నీలో 13 గోల్స్ కొట్టగా.. ఇప్పటికీ ఆ విషయంలో ఎవరూ అతడి దరిదాపుల్లోకి రాలేదు.గోల్డెన్ బాల్ విజేత రోడ్రి (Rodri- స్పెయిన్)ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫిఫా టెక్నికల్ స్టడీ గ్రూప్ (FSG)ఈ అవార్డు విజేతను నిర్ణయిస్తుంది. టోర్నీలోని ప్రతీ మ్యాచ్‌ను విశ్లేషించి.. సదరు మ్యాచ్‌లలో ప్రభావం చూపిన ఆటగాడికి దీనిని అందజేస్తారు.జట్టు తరఫున గోల్స్, అసిస్ట్స్ చేయడం.. డిఫెన్స్‌తో ఆకట్టుకుకోవడం.. నాయకత్వ బృందంలో కీలకంగా వ్యవహరించడం.. ఇలా మొత్తంగా ఏ విధంగానైనా సరే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాడికి గోల్డెన్ బాల్ దక్కుతుంది. ఇక ఈ అవార్డు విజేతను నిర్ణయించే FSGలో ఫిఫా గ్లోబల్ ఫుట్‌బాల్ డెవలప్మెంట్ చీఫ్‌తో పాటు.. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, టెక్నికల్ డైరెక్టర్లు, సాకర్ అనలిస్టులు.. అదే విధంగా మీడియా ప్రతినిధులు కూడా భాగంగా ఉంటారు.విజేత జట్టు తరఫు ఆటగాడికేనా?అయితే, ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడికి మాత్రమే ఈ అవార్డు లభిస్తుందనుకుంటే పొరపాటు. 2014 ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా జర్మనీ చేతిలో ఓడినప్పటికీ అత్యుత్తమ ఆటగాడిగా లియోనల్ మెస్సీకి ఈ అవార్డు దక్కింది. ఇక గోల్డెన్ బాల్‌తో పాటు సిల్వర్, బ్రాంజ్ బాల్స్ విజేతలను కూడా సాంకేతిక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.తొలుత 1986లో దీనిని ప్రవేశపెట్టగా.. అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా గోల్డెన్ బాల్ అందుకున్నాడు. ఇక మెస్సీ ఒక్కడే 2014, 2022 టోర్నీలలో అత్యధికంగా రెండుసార్లు ఈ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు.గోల్డెన్ గ్లోవ్ విజేత ఉనై సైమన్ (Unai Simon- స్పెయిన్)ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గోల్కీపర్కి ఈ అవార్డు అందజేస్తారు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన నైపుణ్యాలు, నిలకడైన ఆట తీరుతో ప్రభావం చూపిన ఆటగాడిని FSG ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది.అత్యుత్తమ డిఫెన్స్‌తో ప్రత్యర్థులను అడ్డుకోవడం.. వారు గోల్స్ కొట్టకుండా ఆపడం.. జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపారన్న ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని విజేతను నిర్ణయిస్తారు. ఈసారి ఏడు క్లీన్ షీట్స్‌తో సైమన్ గోల్డెన్ గ్లోవ్ గెలిచాడు. గోల్డెన్ గ్లోవ్‌ను తొలుత 1994లో బెల్జియం ప్లేయర్ మిచెల్ ప్రెడ్హోమ్ గెలుచుకున్నాడు.7 clean sheets. adidas Golden Glove winner. ⭐@adidasfootball pic.twitter.com/mME9QEIgNj— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026 ప్రైజ్‌మనీ ఇస్తారా?ఈ అవార్డులన్నీ ఆటగాళ్ల గుర్తింపునకు మాత్రమే. వారి ప్రదర్శనకు ప్రతిఫలంగా ట్రోఫీలు అందజేస్తారు. వీటికి ఫిఫా నుంచి ఎలాంటి ప్రైజ్‌మనీ ఉండదు. అయితే, స్పాన్సర్ల ద్వారా ఆటగాళ్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. -
మెస్సీ ఫ్యాన్స్ కి షాక్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 గెలిచిన స్పెయిన్
-
స్పెయిన్‌పై కాసుల వర్షం.. రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ!
ఫిఫా ప్రపంచకప్-2026 ఛాంపియన్స్‌గా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని స్పెయిన్ ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు 30 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఆటగాడు ఫెర్రాన్ టోర్రెస్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్ ట్రోఫీ 2010 తర్వాత తిరిగి స్పానిష్ జట్టు సొంతమైంది.స్పెయిన్‌పై కాసుల వర్షంఇక విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీ దక్కింది. రోడ్రి సారథ్యంలోని స్పెయిన్‌కు దాదాపు 50 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.420 కోట్లు ) నగదు బహుమతి లభించింది. అదేవిధంగా రన్నరప్ అర్జెంటీనాకు 33 మిలియన్ డాలర్లు (సుమారు రూ.రూ.277 కోట్లు) అందింది. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు ప్రైజ్‌మనీగా 29 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 243 కోట్లు) సొంతం చేసుకుంది. అదేవిధంగా నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 27 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 225 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఫిఫా ప్రపంచ కప్ 2026లో అవార్డు విజేతలు వీరేగోల్డెన్ బూట్ - కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)గోల్డెన్ బాల్ - రోడ్రి (స్పెయిన్)గోల్డెన్ గ్లోవ్ - ఉనై సైమన్ (స్పెయిన్)బెస్ట్ యంగ్ ప్లేయర్ - పావ్ కుబార్సి (స్పెయిన్) -
FIFA World Cup 2026: జగజ్జేత స్పెయిన్
న్యూయార్క్: ఒకవైపు పటిష్టమైన డిఫెన్స్... మరోవైపు పాదరసంలాంటి కదలికలతో అటాకింగ్... వెరసి స్పెయిన్ జట్టు రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ముగిసిన ఫైనల్లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టును ఓడించింది. అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్సిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ జట్టు విజయం అందుకుంది. పెడ్రో పోరో కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్ హెడర్ షాట్‌తో వెనక్కి పంపించాడు. అక్కడే ఉన్న ఫెరాన్ టోరెస్ అర్జెంటీనా గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్పెయిన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత అదనపు సమయంలో మిగిలిన క్షణాల్లో అర్జెంటీనాను నిలువరించి స్పెయిన్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2010లో స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. నెదర్లాండ్స్‌తో ఆనాడు జరిగిన ఫైనల్లోనూ స్పెయిన్ అదనపు సమయంలోని రెండో అర్ధభాగంలో ఇనియెస్టా చేసిన గోల్‌తో విజయం అందుకుంది. 16 ఏళ్ల తర్వాత అలాంటి దృశ్యమే పునరావృతమైంది. అంతకుముందు నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్ చేయలేదు. 90+3వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో అదనపు సమయంలో 30 నిమిషాలు అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఈ సువర్ణావకాశాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది. పదే పదే దాడులు చేస్తూ 106వ నిమిషంలో ఫలితాన్ని సాధించింది. మ్యాచ్ మొత్తంలో అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియో మార్టీనెజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 12 సార్లు స్పెయిన్ ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను నిలువరించాడు. అయితే 13వ ప్రయత్నంలో మాత్రం మార్టీనెజ్ ఏమీ చేయలేకపోయాడు. ఫైనల్ చేరే క్రమంలో 19 గోల్స్ కొట్టిన అర్జెంటీనా తుది పోరులో పూర్తిగా నిరాశపరిచింది. స్పెయిన్ ఫార్వర్డ్ ఆటగాళ్లను అడ్డుకోవడంలోనే అర్జెంటీనాకు సరిపోయింది. -
ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్-2026 విజేతగా స్పెయిన్ అవతరించింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించిన స్పెయిన్.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ తుది పోరులో జట్లు కూడా నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. నిర్ణీత సమయంలో మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో 30 నిమిషాలు కేటాయించారు. ఈ క్రమంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫెర్రాన్ టోర్రెస్ మెరుపు గోల్ కొట్టి తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు.ఆధిక్యంలో స్పెయిన్తుది పోరులో స్పెయిన్ ఖాతా తెరిచింది. 106 నిమిషాల తర్వాత తొలి గోల్ నమోదైంది. స్పెయిన్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసినప్పటికి ఇరు జట్లు కూడా ఇంకా కనీసం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. దీంతో విజేత ఎవరో తేల్చడానికి ఎక్స్ట్రా టైమ్ 30 నిమిషాలు కేటాయించారు.ఖాతా తెరవని ఇరు జట్లుసెకెండ్ హాఫ్లోనూ 75వ నిమిషం వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. స్పెయిన్ తమ జట్టులో రెండు మార్పులు చేసింది. డాని ఓల్మో, అలెక్స్ బేనా స్ధానాల్లో వింగర్ నికోలస్, మైకెల్ మెరినో జట్టులోకి వచ్చారు. కాగా ఈ తుది పోరులో రెండో హైడ్రేషన్ బ్రేక్ సమయం ముగిసే వరకు కూడా అర్జెంటీనా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా కనీసం ఒక్క షాట్ కూడా నమోదు చేయలేకపోయింది.హోరాహోరీగా తలపడుతున్న స్పెయిన్న్యూజెర్సీ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా, స్సెయిన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇరు జట్లు ఎటాకింగ్ గేమ్ ఆడినప్పటికి ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. మ్యాచ్ ప్రారంభంలోనే స్పెయిన్ సంచలన యువ ఆటగాడు లమిన్ యమల్‌కు గోల్ కొట్టే అద్భుత అవకాశం లభించింది. అయితే అర్జెంటీనా డిఫెన్స్ సమర్ధవంతంగా అడ్డుకోవడంతో అతడు తనకు లభించిన ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. అయితే ఈ తుది పోరులో అర్జెంటీనాకు భారీ షాక్ తగిలింది.స్టార్ డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ తీవ్రమైన గాయానికి గురై మైదానాన్ని వీడాడు. ఇక ఫస్ట్ హాఫ్ ముగిసిన అనంతరం విరామ సమయంలో గ్లోబల్ పాప్ స్టార్స్ జస్టిన్ బీబర్, షకీరా తమ సంగీత ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. -
అర్జెంటీనా గెలవదని 14 కోట్లు పందెం.. డ్రేక్ శాపం ఫలిస్తుందా?
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లు నమోదవుతున్నాయి. అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందంటూ కొంతమంది పందేలు కాస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఈసారి స్పెయిన్ టైటిల్ అందుకొని 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందంటూ భారీ బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉండడం గమనార్హం. ప్రపంచం మొత్తం బెట్టింగ్‌లు వేసినప్పటికీ, కెనడియన్ రాపర్ డ్రేక్ గ్రహమ్ వేసే పందెం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. గతంలో డ్రేక్ మద్దతు ఇచ్చిన జట్లు లేదా ఆటగాళ్లు ఓడిపోవడం జరిగింది. తాజాగా అర్జెంటీనా ఫిఫా టైటిల్‌ను గెలవదంటూ డ్రేక్ 1.5 అమెరికన్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 14.5 కోట్ల రూపాయలు) పందెం కాయడం సంచలనం కలిగించింది. మరి డ్రేక్ శాపం ఫలిస్తుందా అన్నది ఫైనల్ తర్వాత తేలనుంది.'డ్రేక్ శాపం' అంటే?👉డ్రేక్ శాపం అనేది ఒక క్రీడా మూఢనమ్మకం. దీని ప్రకారం, డ్రేక్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన అథ్లెట్లు, ఫైటర్లు లేదా జట్లు తరచుగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోవడాన్ని అభిమానులు గమనించారు.👉చాలా సందర్భాల్లో, ఆటగాళ్లు కెనడియన్ ర్యాపర్‌తో ఫోటోలు దిగిన తర్వాత ఆయా జట్లు ఓటమిని చవిచూశాయి.👉ఈ మూఢనమ్మకం కారణంగా, చాలా మంది క్రీడాభిమానులు డ్రేక్ మద్దతును అపశకునంగా భావిస్తారు.👉ఇప్పుడు అతను అర్జెంటీనాపై తన పందెం వేయడంతో, ఈ చర్య ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఆ జట్టు మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది.లెక్కచేయని అర్జెంటీనా ఫ్యాన్స్..అయితే అర్జెంటీనా అభిమానులు మాత్రం డ్రేక్ పందేన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో అర్జెంటీనా ఓడిపోతుందంటూ డ్రేక్ గ్రహమ్ ఒక మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 కోట్లు) పందెం కాసి చేతులు కాల్చుకున్నాడు. డ్రేక్ శాపానికి తిరుగుండదని బీరాలు పలికాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ప్రపంచకప్‌లో మెస్సీ సేన ఫిఫా టైటిల్ గెలవడంతో డ్రేక్ అంచనా తప్పి అపఖ్యాతి పాలయ్యాడు. అయితే తాజాగా ఫిఫా 2026 టోర్నీలో అర్జెంటీనా మరోసారి ఫైనల్ చేరిన క్రమంలో డ్రేక్ మరోసారి భారీ పందెం కాసినప్పటికీ ఈసారి కూడా అతడి అంచనా తప్పుతుందని అర్జెంటీనా అభిమానులు బల్లగుద్ది జోస్యం చెబుతున్నారు. ఈసారి కూడా మెస్సీ సేన డ్రేక్ మూడ నమ్మకాన్ని బద్దలుకొట్టి నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని పేర్కొన్నారు.మెస్సీ సేనకు వ్యతిరేకంగా..ఆరంభం నుంచి ఈసారి ఫిఫా టోర్నీలో అర్జెంటీనా గెలవకూడదనే ప్రయత్నాలు కొనసాగుతూ వచ్చాయి. ఆరంభ పోటీల్లో అనామక జట్టు కేప్‌వెర్డె.. అర్జెంటీనాను ఓడిస్తుందంటూ ఒక ఆధ్యాత్మికవేత్త చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. కానీ రియాల్టీకి వచ్చేసరికి అర్జెంటీనా సునాయాసంగా కేప్వెర్డెను ఓడించింది. ఈసారి ఫిఫాలో విస్తృతంగా ప్రచారం జరిగిన మరో మూడనమ్మకం ఏంటంటే.. ప్రముఖ యూట్యూబర్ ఐషో స్పీడ్ తాను మద్దతు ఇచ్చిన ప్రతీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో, అతడికి అపశకునం అనే బిరుదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా మ్యాచ్‌కు ఐషోస్పీడ్ అర్జెంటీనా జెర్సీ ధరించి వారికి మద్దతు ఇచ్చాడు. కానీ మెస్సీ సేన ఐషో స్పీడ్ అపశకునాన్ని సైతం ఛేదించి సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు మెట్‌లైఫ్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.Read: ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం! -
ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సీ చివరి సందేశం!
ఫిఫా ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ తలపడనుంది. ఈసారి ఫిఫాలో జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు అర్జెంటీనా జట్టు, సహాయక సిబ్బందితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను షేర్ చేసుకున్న మెస్సీ తన చివరి సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఫిఫా టోర్నీ ఆద్యంతం తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, కోచ్, సహాయక సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక లేఖను రాసుకొచ్చాడు. ఈ ఫిఫాలో ఫైనల్ చేరే క్రమంలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా జట్టు ప్రయాణం కూడా తమను గొప్పదిగా నిలబెట్టిందని మెస్సీ తెలిపాడు. 'ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో అత్యంత ఆనందకరమైన విషయం ఏంటంటే.. మేము టైటిల్స్ గెలవడమే కాదు, ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులను పొందాము. అర్జెంటీనా జట్టులోని ఆటగాళ్లతో కలిసి రోజువారి పనులను పంచుకోవడం, కలిసి పోటీ పడడం, కష్ట సమయాల్లో అండగా నిలబడడం, ఇలా ప్రతి అడుగును మనస్ఫూర్తిగా ఆస్వాదించాం. నా ప్రయాణంలో అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు, సహాయక, సాంకేతిక సిబ్బంది, అర్జెంటీనా దేశ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిఫా టైటిల్ గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే ఇప్పటికే జట్టుగా మరిచిపోలేని, చెరిగిపోని జ్ఞాపకాలను చరిత్రగా లిఖించుకున్నాం. కమాన్ అర్జెంటీనా.’ అని భావోద్వేగంతో పేర్కొన్నాడు. అర్జెంటీనా కెప్టెన్ ఇచ్చిన సందేశం ఆ జట్టు ఒక కుటుంబంలా కలిసి నడుస్తూ ధృడమైన బంధాన్ని చాటిచెబుతుంది. స్పెయిన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా వారసత్వం మాత్రం సురక్షితంగా ఉంటుందని మెస్సీ పరోక్షంగా పేర్కొన్నాడు.ఇక ఫిఫా ఫైనల్ మెస్సీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ మెస్సీ ఇచ్చిన తాజా సందేశం వైరల్‌గా మారింది. ఫైనల్‌కు ముందే ఇలాంటి సందేశాన్ని ఇవ్వడం వెనుక మెస్సీ తన రిటైర్మెంట్ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో మెస్సీ ఏడు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 8 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌తో పాటు 4 అసిస్ట్‌లతో తొలి స్థానంలో ఉన్నాడు. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలుకానుంది. Excited for finals but Lionel messi will play his last match for argentina pic.twitter.com/clW43BWtQV— `mr. villa (@Luccydevil07) July 19, 2026Read: సింధుదే జపాన్ ఓపెన్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు -
ఎంబాపె ప్రపంచ రికార్డు.. మెస్సీకి కష్టమేనా!
ఫిఫా ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో ఫ్రాన్స్ ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపె మాత్రం ప్రపంచ రికార్డుతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో మెరిసిన ఎంబాపె ఈ ఫిఫా టోర్నీలో తన గోల్స్ సంఖ్యను పదికి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపె (10 గోల్స్, 4 అసిస్ట్‌లు) మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. మెస్సీ 8 గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇవాళ జరగనున్న ఫిఫా ఫైనల్లో మెస్సీ కనీసం రెండు గోల్స్, ఒక అసిస్ట్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతోంది. లేదంటే ఎంబాపె దానిని ఎగరేసుకుపోతాడు. Photo Credit: FIFA Twitterఇక ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలోనూ మెస్సీని ఎంబాపె దాటేశాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 20 గోల్స్‌తో ఉన్న ఎంబాపె మరో రెండు గోల్స్ నమోదు చేయడంతో తన సంఖ్యను 22కు పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా స్టార్ మెస్సీ 21 గోల్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ గోల్ చేయకుంటే మాత్రం ఎంబాపె టాప్‌లో ఉంటాడు. ఈ ఫిఫా అనంతరం ఒకవేళ మెస్సీ రిటైర్ అయితే మాత్రం ఎంబాపె ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కనున్నాడు.స్పెయిన్‌తో సెమీస్‌లో సమన్వయ లోపం వల్ల ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన ఫ్రాన్స్ మూడో ప్లేస్ కోసం జరిగిన పోరులో మాత్రం గెలిచేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-4 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా (37వ, 45+1వ, 87వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్‌తో మెరవగా, డెక్లన్ రైస్ (3వ నిమిషం), ఎరిక్ కోన్సా (18వ నిమిషం), జూడ్ బెల్లింగ్ హమ్ (90+8వ నిమిషం) గోల్స్ సాధించారు. ఫ్రాన్స్ తరఫున కైలియన్ ఎంబాపె (48, 66వ నిమిషం) డబుల్ గోల్స్‌తో మెరవగా, బ్రాడ్లీ బార్కోలా (54వ నిమిషం), ఉస్మాన్ డెంబెలె (90+6వ నిమిషం) గోల్స్ చేశారు.గోల్డెన్ బూట్ రేసులో ఉన్న ఆటగాళ్ల జాబితా:👉కైలియన్ ఎంబాపే: గోల్స్: 10, అసిస్ట్‌లు: 4👉లియోనెల్ మెస్సీ : గోల్స్: 8, అసిస్ట్‌లు: 4👉ఎర్లింగ్ హాలాండ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 0👉జూడ్ బెల్లింగ్‌హామ్ : గోల్స్: 7, అసిస్ట్‌లు: 1👉హ్యారీ కేన్ : గోల్స్: 6, అసిస్ట్‌లు: 1👉ఉస్మాన్ డెంబెలె : గోల్స్: 6, అసిస్ట్‌లు: 2Kylian Mbappé has now scored the MOST goals in World Cup history with his 22nd 🇫🇷He leads the Golden Boot race with 10 goals this tournament. pic.twitter.com/mVlvHDZvkz— B/R Football (@brfootball) July 18, 2026 Kylian Mbappe now has 14 goal contributions in this World Cup - a record for most in a single tournament ☝️ pic.twitter.com/laTGyeN4IQ— B/R Football (@brfootball) July 18, 2026చదవండి: టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా -
ఫిఫా ప్రపంచకప్.. మూడో స్ధానం ఇంగ్లండ్‌దే
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీని ఇంగ్లండ్ విజయంతో ముగించింది. ఈ టోర్నీలో భాగంగా మయామి వేదికగా మూడో స్ధానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై 6-4 తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. ఈ 'బ్రాంజ్ ఫైనల్' పోరు ఫస్ట్ హాఫ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 2 నిమిషాలకే కెప్టెన్ డెక్లాన్ రైస్ ఒక అద్భుతమైన లాంగ్-రేంజ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అనంతరం బుకాయో సాకా వరుసగా రెండు గోల్స్‌ను సాధించి ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్‌ను 4-0తో తిరుగులేని స్థితిలో నిలిపాడు. తొలి ఆర్ధ భాగంలో ఫ్రాన్స్ ఎలాంటి గోల్ చేయకపోవడంతో ఇంగ్లండ్ సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు.కానీ సెకెండ్ హాఫ్‌లో మాత్రం ఫ్రాన్స్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. కెప్టెన్ ఎంబాపే 48వ నిమిషంలో ఫ్రాన్స్‌కు తొలి గోల్‌ను అందించాడు. వెంటనే 54వ నిమిషంలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ సాధించాడు. ఆ తర్వాత 66వ నిమిషంలో ఎంబాపే మరో గోల్ కొట్టడంతో స్కోరు 4-3కి చేరింది. దీంతో ఇంగ్లండ్ డౌగౌట్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావారణం నెలకొంది. అయితే ఫ్రాన్స్ జట్టు మ్యాచ్‌ను సమం చేసేలా కనిపించిన సమయంలో, ఇంగ్లండ్ స్టార్ బుకాయో సాకా మరోసారి సత్తాచాటాడు. 87వ నిమిషంలో లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి తన హాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ గోల్‌తో ఇంగ్లండ్ 5-3 ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఫ్రాన్స్ మళ్లీ గోల్ సాధించి పోటీలో నిలిచింది. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్ మిడ్ ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ మరో గోల్ కొట్టి తన జట్టు విజయాన్ని 6-4తో ఖరారు చేశాడు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 1966 తర్వాత ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఓ మెడల్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. -
ఫైనల్ 'కిక్'
39 రోజులు, 103 మ్యాచ్‌ల తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మెస్సీ మెరుపులతో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? టీనేజ్ సంచలనం లమీన్ యామల్ నైపుణ్యం 2010 విశ్వవిజేత స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచకప్ అందిస్తుందా? అటాకింగ్ ఆటతీరుతో ఈ ప్రపంచకప్‌ను ఊపేసిన అర్జెంటీనా ఆటగాళ్లు అదే జోరును తుది పోరులో కొనసాగిస్తారా? అడ్డుగోడలా నిలబడుతూ ప్రత్యర్థి జట్లకు గోల్ కొట్టడమే గగనంలా చేసిన స్పెయిన్ డిఫెన్స్ తుది పోరులోనూ విజయవంతం అవుతుందా? వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని ఇటలీ, బ్రెజిల్ సరసన అర్జెంటీనా నిలుస్తుందా? అర్జెంటీనా ఆశలను వమ్ము చేసి ప్రపంచకప్‌తో స్పెయిన్ పూర్వ వైభవం సాధిస్తుందా? వీటన్నింటికి సమాధానం నేడు అర్ధరాత్రి తర్వాత లభిస్తుంది. న్యూయార్క్: ఒక్క పరాజయం లేకుండానే అంతిమ సమరానికి అర్హత సాధించిన అర్జెంటీనా, స్పెయిన్ జట్లు ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఆఖరి పోరులోనూ గెలిచి టోర్నీని అజేయంగా ముగించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్‌పై యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మైదానంలో ప్రత్యక్షంగా 80 వేల మంది... ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ప్రేక్షకులు టీవీల ద్వారా ఈ తుది పోరును వీక్షించనున్నారు.2022లో ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 17 మంది ప్లేయర్లు ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు.ముఖ్యంగా 39 ఏళ్ల లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా ఈ టోర్నీలో అద్భుత ఆటతీరుతో అలరిస్తోంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఓటమి అంచుల్లో నుంచి విజయకేతనం ఎగురవేస్తోంది. చివరి క్షణం ముగిసేవరకు తమను తక్కువ అంచనా వేయొద్దని.... అవకాశం దొరికితే ఏ క్షణంలోనైనా మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా తమలో ఉందని మెస్సీ బృందం నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ గెలుపు కిక్ తమదే కావాలని అర్జెంటీనా పకడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగనుంది. మరోవైపు 2010లో ఏకైకసారి ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులోని ఆటగాళ్లెవరూ ప్రస్తుత ప్రపంచకప్‌లో లేరు. అయితే 2024లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న స్పెయిన్ జట్టులోని 16 మంది ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్నారు. స్పెయిన్ భవిష్యత్ ఆశాకిరణం, 19 ఏళ్ల యామల్పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చివర్లో చెలరేగుతూ... ఫైనల్ చేరే క్రమంలో అర్జెంటీనా జట్టు 19 గోల్స్ సాధించింది. ప్రత్యర్థి జట్లకు 7 గోల్స్ సమ ర్పించుకుంది. అర్జెంటీనా చేసిన 19 గోల్స్‌లో 12 గోల్స్ మ్యాచ్‌లో 75 నిమిషాలు ముగిశాకే వచ్చాయి. ముందుగా నెమ్మదిగా ఆడటం... ప్రత్యర్థి జట్టు గోల్ చేశాక అర్జెంటీనా జోరు పెంచుతూ తమ సత్తా చాటుకుంటోంది. చివర్లో సబ్‌స్టిట్యూట్‌గా వస్తున్న ఆటగాళ్లు కూడా గోల్స్ చేస్తూ అర్జెంటీనాను గట్టెక్కిస్తున్నారు. మరోవైపు స్పెయిన్ జట్టు పూర్తి డిఫెన్స్ ఆటతీరుకు ప్రాధాన్యమిస్తోంది. అవకాశం దొరికినపుడు గోల్ చేసి ఆ తర్వాత ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయతీరానికి చేరుతోంది. ఈ టోర్నీలో స్పెయిన్ జట్టు 13 గోల్స్ సాధించి... ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ మాత్రమే సమ ర్పించుకుంది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై ప్రత్యర్థి జట్లు 11 సార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం.విజేత జట్టుకు రూ. 481 కోట్లు ఈసారి ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 5 కోట్ల డాలర్లు (రూ. 481 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించనుంది. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 317 కోట్లు) దక్కుతాయి. మూడో స్థానం పొందిన జట్టు ఖాతాలో 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 279 కోట్లు) చేరుతాయి. నాలుగో స్థానం సంపాదించిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 259 కోట్లు) లభిస్తాయి. 5 నుంచి 8 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 182 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 9 నుంచి 16 స్థానాల మధ్య నిలిచిన జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల చొప్పున (రూ. 144 కోట్లు చొప్పున) లభిస్తాయి. 17 నుంచి 32 స్థానాల మధ్య నిలిచిన జట్లు 1 కోటీ 10 లక్షల డాలర్ల చొప్పున (రూ. 105 కోట్లు చొప్పున) అందుకుంటాయి. 33 నుంచి 48 స్థానాల్లో నిలిచిన జట్ల ఖాతాలో 90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 86 కోట్లు) లభిస్తాయి. 37 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ జట్టు వరుసగా 37 మ్యాచ్‌ల్లో పరాజయం రుచి చూడలేదు. 2024 నుంచి ఇప్పటి వరకు స్పెయిన్ 27 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో స్పెయిన్ గెలిస్తే ఇటలీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతుంది. ఇటలీ జట్టు 2018 నుంచి 2021 వరకు వరుసగా 37 మ్యాచ్‌ల్లో ఓడిపోలేదు.3 మెస్సీ బృందం ఈసారి టైటిల్ గెలిస్తే ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. అర్జెంటీనా ఇప్పటికి మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. బ్రెజిల్ జట్టు అత్యధికంగా ఐదుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇటలీ, జర్మనీ జట్లు నాలుగుసార్లు చొప్పున సాధించాయి. 1 ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌ను 1992లో ప్రవేశపెట్టాక వరల్డ్‌కప్ టైటిల్ కోసం ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. 4 ఫైనల్లో స్పెయిన్‌పై అర్జెంటీనా గెలిస్తే ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో బ్రెజిల్ (2002, 1970), ఉరుగ్వే (1930), ఇటలీ (1934) మాత్రమే ఈ ఘనత సాధించాయి.3 అర్జెంటీనా ఫైనల్లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) మాత్రమే ఈ ఘనత సాధించాయి.1 మూడు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన తొలి ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందనున్నాడు. 2014 ప్రపంచకప్ ఫైనల్స్‌లో మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలిచింది. -
విజేతకు ఇచ్చేది నమూనా ట్రోఫీనే!
ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్ కప్ ట్రోఫీ రూపకల్పన ఆసక్తికరంగా జరిగింది. మైదానంలో ప్లేయర్ల పోరాటం... స్టాండ్స్‌లో అభిమానుల ఆనందం... విజయం సాధించిన అపురూప క్షణం... ఈ మూడు భావోద్వేగాలకు ప్రస్తుతం విజేతకు అందిస్తున్న ట్రోఫీ ప్రతిరూపం. ఇటలీకి చెందిన ప్రఖ్యాత శిల్పి సిల్వియో గజానిగా దీన్ని రూపొందించారు. 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్ సమయంలో రూపొందించిన ట్రోఫీ గ్రీకు దేవత ‘నైక్’ను పోలి ఉండేది. 1970లో బ్రెజిల్ మూడోసారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన అనంతరం అసలు ట్రోఫీని శాశ్వతంగా సొంతం చేసుకుంది. దీంతో కొత్త డిజైన్ రూపకల్పన అనివార్యమైంది. పలు ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వేల డిజైన్లు... వందల మోడల్స్... పదుల సంఖ్యలో నమూనాలు తీర్చిదిద్దిన తర్వాత జ్యూరీ చివరకు ప్రస్తుతం ఉన్న ట్రోఫీకి పచ్చజెండా ఊపింది. ఫైనల్లో విజయం సాధించిన జట్టు కెప్టెన్‌కు అందించే అసలు ట్రోఫీ ఎత్తు 36 సెంటీమీటర్లు, ఇది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ఈ ట్రోఫీని విజేతకు శాశ్వతంగా అందించరు. సంబరాల అనంతరం ‘ఫిఫా’ దాన్ని తిరిగి తీసుకుంటుంది. దాని స్థానంలో బంగారు పూత పూసిన నమూనా ట్రోఫీని మాత్రమే విజేత జట్టుకు ఇస్తారు. తదుపరి వరల్డ్‌కప్ వరకు అసలైన ట్రోఫీ స్విట్జర్లాండ్‌లోని ‘ఫిఫా’ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. అయితే గతంలో మూడుసార్లు వరల్డ్‌కప్ నెగ్గిన జట్టు ఈ ట్రోఫీని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకునేది... ప్రస్తుతం దీనికి ‘ఫిఫా’ అనుమతించడం లేదు. 1974 వరల్డ్‌కప్‌లో మొదటిసారి వాడిన ప్రస్తుత డిజైన్‌ను ఇప్పటి వరకు 14 సార్లు ఉపయోగించారు. 2038 వరకు ఇదే ట్రోఫీని కొనసాగించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. కప్‌ను కరిగించేశారు! వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచి బ్రెజిల్ 1970లో సొంతం చేసుకున్న ‘జూల్స్ రిమేట్ ట్రోఫీ’ ఇప్పుడు లేదు. ఈ కప్ రెండుసార్లు చోరికి గురైంది. 1966లో తొలిసారి ప్రేక్షకుల కోసం లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ సమయంలో దీనిని ఎవరో చోరి చేశారు. అయితే ‘పికిల్స్’ పేరు గల జాగిలం సౌత్ లండన్‌లో దీనిని గుర్తించడంతో ప్రపంచకప్ దొరికింది. ఆ తర్వాత 1983లో బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం నుంచి ఎవరో ఈ ప్రపంచకప్‌ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన వ్యక్తులు బంగారు ప్రపంచకప్‌ను కరిగించేశారని.. అందుకే ఎంత వెతికినా ప్రపంచకప్ జాడ దొరకలేదని చెబుతుంటారు. -
దొంగాట కూడా... మెరుపుల మధ్య మరకలు
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో వివాదాలు కొత్త కాదు. ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో ఎన్నో అంశాలు తీవ్ర చర్చకు దారి తీస్తాయి. ఆటగాళ్ల ప్రవర్తను సంబంధించి కొన్ని వివాదాలు ఉంటే, మరికొన్ని రిఫరీల నిర్ణయాలు, వారి వ్యవహార శైలిపై సందేహాలు రేకెత్తిస్తాయి. ఇప్పుడు కూడా పలు ఘటనలు ప్రపంచకప్ నిర్వహణలో పారదర్శకత లేకుండా ‘ఫిఫా’ నిజాయితీని శంకించేలా కనిపించాయి. రొనాల్డోకు ప్రపంచకప్ అవకాశం... వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు దారాషియాను దురుసుగా అడ్డుకున్నందుకు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీని ప్రకారం అతడు చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌తో పాటు వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాలి. అయితే రొనాల్డో స్థాయి, అతని స్టార్ హోదాను దృష్టిలో ఉంచుకొని ‘ఫిఫా’ సడలింపు ఇచ్చింది. 226 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో అతను ఇలా ఎప్పుడూ చేయలేదు కాబట్టి నిషేధాన్ని ‘ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు’ ప్రకటించింది. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. రొనాల్డో రెండు మ్యాచ్‌లు ఆడకపోతే ఆ మ్యాచ్‌లపై ఆసక్తి తగ్గిపోతుందనే ‘ఫిఫా’ ఈ నిర్ణయం తీసుకుంది. బాలోగాన్ కోసం ట్రంప్ సిఫారసు... అమెరికా ఆటగాడు ఫొలారిన్ బాలోగాన్ విషయంలో ‘ఫిఫా’ వ్యవహారం అందరినీ ఆశ్చర్యపర్చింది. బోస్నియా హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు బాలోగన్ రెడ్ కార్డుకు గురయ్యాడు. దాంతో బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్ పోరులో అతను ఆడటానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఆతిథ్య జట్టు ఆటగాడు అలా తప్పుకోవడం బాగుండదని, ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా ఫోన్ చేసి అడిగాడు. దాంతో ఇన్ఫాంటినో వెంటనే స్పందించిన బాలోగాన్ నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. మైదానంలో ఆటపై బయటి వ్యక్తి ఇలా కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు. తగిన సమాధానం ఇవ్వకుండా ‘ఫిఫా’ తమ నిర్ణయాన్ని అమలు చేసింది.టోర్నీ ‘డ్రా’తోనే పక్షపాతం... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా టెన్నిస్ పద్ధతిలో ‘ఫిఫా’ తెలివిగా మ్యాచ్‌ల ‘డ్రా’ను ప్రకటించింది. గతంలో ఓపెన్ ‘డ్రా’ ద్వారా చూస్తే నాకౌట్ దశకు ముందే పెద్ద జట్లు ప్రత్యర్థులుగా తలపడే అవకాశం వచ్చేది. ఈసారి ఎంచుకున్న ‘డ్రా’ ప్రకారం ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న స్పెయిన్...నంబర్ టూ అర్జెంటీనాను ఫైనల్ వరకు ఎదుర్కొనే అవకాశమే లేదు. మూడో స్థానంలోని ఫ్రాన్స్, నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ మధ్య సెమీస్‌కు ముందు మ్యాచ్ జరగదు. ‘ఫిఫా’ తెలివితేటలు బాగా పని చేశాయని చివరకు తేలింది. చరిత్రలో తొలిసారి టాప్–4 టీమ్‌లు వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సోమాలియా రిఫరీకి నో ఎంట్రీ... ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ రిఫరీల్లో ఒకడిగా సోమాలియాకు చెందిన ఒమర్ అబ్దుల్ కదిర్‌కు పేరు ఉంది. అందుకే అతడిని ‘ఫిఫా’ వరల్డ్ కప్ రిఫరీల జాబితాలో చేర్చింది. అయితే తమ దేశంలోకి ప్రవేశించించేందుకు నిషేధం ఉన్న దేశాల్లో సోమాలియా ఒకటి. కాబట్టి కదిర్‌ను అమెరికాలో అడుగుపెట్టనిచ్చేది లేదని వైట్‌హౌస్ అధికారులు స్పష్టం చేశారు. అతడికి వీసా ఉండటంతో పాటు వ్యక్తిగతంగా కాకుండా అధికారిక హోదాలో వరల్డ్ కప్ కోసం అతను వచ్చినా సరే అమెరికా ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇలాంటి స్థితిలో రిఫరీకి కనీసం అండగా నిలవకుండా మౌనం వహించడం ‘ఫిఫా’ అమెరికాకు ఎంతగా తలవంచిందో అర్థమవుతుందని విమర్శలు వెలువెత్తాయి. అర్జెంటీనా... ‘ఫిఫా’ భాయ్ భాయ్‘ఫిఫా’ ఎలాగైనా అర్జెంటీనా జట్టును మళ్లీ విజేతగా నిలపాలని చూస్తున్నట్లుంది... ఆ జట్టుకు మా ముందస్తు అభినందనలు... ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తర్వాత ఈజిప్ట్ ఆటగాళ్ల స్పందన ఇది. ప్రతీ మ్యాచ్‌లో రిఫరీలు ఆ జట్టుకు మద్దతుగా నిలిచారని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. వరుసగా ఈజిప్ట్ , స్విట్జర్లాండ్, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లలో అర్జెంటీనాకు అనుకూలంగా అంతా జరిగిందని ప్రపంచం మొత్తం విమర్శించింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ద్వారా అయితే అర్జెంటీనాకే పూర్తిగా అండగా నిలవడం కనిపించింది. కనీసం దాపరికం కూడా లేకుండా బహిరంగంగా ‘ఫిఫా’ అన్ని పరిమితులు దాటేసిందని ఇతర జట్ల అభిమానులు, విశ్లేషకులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలన్నీ అర్జెంటీనా విజయాల స్థాయిని తగ్గించాయి అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కాలు తగిలి ప్రత్యర్థి కెప్టెన్ ఐసా మందీ కింద పడ్డాడు. రీప్లేలో కూడా ఇది కనిపించింది. రెడ్ కార్డ్ స్థాయి శిక్షకు గురయ్యే ఈ ఘటనలో మెస్సీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో తప్పు లేదని కనిపిస్తున్నా అంపైర్ ఎల్లో కార్డ్ ఇచ్చాడు. మ్యాచ్‌లో అది అతడికి రెండో ఎల్లో కార్డ్ కావడంతో బ్రీల్ ఎంబోలో మైదానం వీడగా... అప్పటి వరకు 1–1తో మెరుగైన స్థితిలో కనిపించిన స్విట్జర్లాండ్ 10 మందితోనే ఆడి ఓటమి పాలైంది. ఈజిప్ట్ తో జరిగిన మ్యాచ్‌లోనైతే రిఫరీ మరీ పక్షపాతంగా వ్యవహరించినట్లు తేలింది. 58వ నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ ముస్తఫా జికో చేసిన గోల్‌ను రిఫరీ ‘ఫౌల్’గా తేల్చడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అదే మ్యాచ్ చివర్లో సలా తప్పు లేదని తేలినా... అర్జెంటీనాకు రిఫరీ పెనాల్టీ ఇచ్చేశాడు. ఓటమి ఖాయమనిపించిన స్థితిలో 14 నిమిషాల వ్యవధిలో 3 గోల్స్ చేసి అర్జెంటీనా మ్యాచ్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా గోల్ కొట్టడంలో విఫలమైనప్పుడు బాధపడుతూ, గోల్ కొట్టగానే సంబరాలు చేసుకుంటున్న ‘ఫిఫా’ అధ్యక్షుడు ఇన్ఫాంటినో దృశ్యాలు ప్రపంచం అవాక్కయ్యేలా చేశాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ చేసిన గోల్ చర్చకు దారి తీసింది. అది ‘ఆఫ్‌సైడ్’ గోల్ అయినా... పూర్తిగా రివ్యూ చేయకుండా, అసలు వీఏఆర్‌లో ఆఫ్‌సైడ్ గ్రాఫిక్స్ కూడా చూడకుండా రిఫరీ తన నిర్ణయం ప్రకటించాడని అంతా ఆరోపించారు. -
100 మ్యాచ్‌లకు ఒక బంతి... ఆఖరి 4 మ్యాచ్‌లకు మరో బంతి
‘ఫిఫా’ వరల్డ్‌కప్‌లో రెండు రకాల బంతులను వినియోగించారు. టోర్నమెంట్ తొలి 100 మ్యాచ్‌లకు... ఆతిథ్య దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడా జెండాల రంగులను ప్రస్ఫుటించేలా ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో కూడిన ‘ట్రియోండా’ బంతిని వాడగా... మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు (2 సెమీఫైనల్స్, మూడో స్థానం మ్యాచ్, ఫైనల్) బంతి రంగులో మార్పులు చేశారు. స్పానిష్ లో ‘ట్రియోండా’ అంటే ‘త్రీ వేవ్స్’... ఆతిథ్యమిస్తున్న మూడు దేశాలకు ప్రతీక అని అర్థం. ఫ్రాన్స్–స్పెయిన్... ఇంగ్లండ్–అర్జెంటీనా మధ్య జరిగిన సెమీఫైనల్స్‌తో పాటు ఫ్రాన్స్–ఇంగ్లండ్ మధ్య మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో బంగారు, నలుపు రంగులతో కూడిన బంతిని వినియోగించారు. అడిడాస్ సంస్థ రూపొందించిన ఈ బంతితోనే ఫైనల్ కూడా జరగనుంది. ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చిన 16 నగరాలకు గుర్తుగా దీన్ని రూపొందించడం విశేషం. ‘ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ‘ఫిఫా’ ప్రపంచకప్‌కు స్వాగతించిన 16 నగరాలను ట్రియోండా గౌరవిస్తోంది. చివరి నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన నగరాల పేర్లు బంతిపై ప్రముఖంగా కనిపించే విధంగా రూపొందించాం. మిగిలిన 12 ఆతిథ్య నగరాల పేర్లను కూడా పొందుపరిచాం. తద్వారా టోర్నీ విజయవంతం కావడానికి వారు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటున్నాం’ అని ‘ఫిఫా’ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైనల్ బంతిలో అత్యాధునిక ఏఐ సాంకేతికత ఉందని... అది కచ్చితమైన డేటా అందిస్తూ... రిఫరీలు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతుందని ‘ఫిఫా’ వెల్లడించింది. -
ఫిఫా ఫైనల్ ఆఖరిదా?.. రిటైర్మెంట్పై మెస్సీ స్పందన!
ఫిఫా ప్రపంచకప్ 2026 తర్వాత అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడా? ఆదివారం స్పెయిన్‌తో జరగనున్న ఫిఫా ఫైనల్ మెస్సీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే లియోనల్ మెస్సీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ముగిసిన తర్వాత ప్రెస్‌మీట్‌కు హాజరైన మెస్సీకి తన రిటైర్మెంట్పై ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. ‘మీ జర్నీ ఒక వీడియో గేమ్‌లా ఉంది. ఫిఫా ఫైనల్ మీకు చివరిది కానుందా’ అని ప్రశ్నించారు. దీనిపై మెస్సీ స్పందిస్తూ.. ‘నేను నా చివరి మ్యాచ్‌ను గత వరల్డ్‌కప్ (ఖతార్ 2022)లోనే ఆడేశాను. అక్కడ ఫిఫా టైటిల్ గెలవడంతోనే నా కెరీర్లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాను. ఇప్పుడు నా ఆట ముగిసిపోయింది’అని అర్ధంకాని రీతిలో జవాబివ్వడంతో రిపోర్టర్లు తలలు పట్టుకోవడం గమనార్హం. దీంతో మెస్సీ రిటైర్మెంట్పై మరోసారి గందరగోళం నెలకొంది. అయితే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలుకుతాడా లేదా అన్నది ఆదివారమే తేలనుంది. ఇదే విషయమై అర్జెంటీనా జట్టు కోచ్, మేనేజర్ లియోనల్ స్కలోనిని కూడా అడిగారు.ఆయన కూడా ‘నాకైతే ఏ సమాచారం లేదు. నిజాయితీగా చెప్పాలంటే మెస్సీ తన నిర్ణయంతో మమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు.. చేయకపోవచ్చు. రిటైర్మెంట్ అంశం పూర్తిగా అతడికే వదిలేశాం’ అని తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026లో మెస్సీ అత్యున్నత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లోనే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకెళ్తున్నాడు. అయితే ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె (7 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, 3 అసిస్ట్‌లు) మెస్సీతో సమానంగా ఉన్నాడు. స్పెయిన్‌తో ఫైనల్లో మెస్సీ గోల్ చేస్తే గోల్డెన్ బూట్ అతడి సొంతమవుతుంది. ఒకవేళ మెస్సీ గోల్ చేయకుంటే ఎంబాపెకు గోల్డెన్ బూట్ దక్కే అవకాశముంది. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ ఓవరాల్‌గా 21 గోల్స్‌తో ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మెస్సీ వెనుకే ఎంబాపె (ఫ్రాన్స్, 20 గోల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. 🗣️ “Your career is like a video game, you keep unlocking new levels until you reach the final”.😬🇦🇷 Leo Messi: “I already completed the game at the last World Cup in Qatar”. pic.twitter.com/CD2eZLhlv0— Fabrizio Romano (@FabrizioRomano) July 18, 2026Read: ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు! -
ఫిఫా ఫైనల్ మ్యాచ్.. ఒక్క టికెట్ ధర 27 లక్షలు!
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా, స్పెయిన్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టడం వల్ల భారీ క్రేజ్ నెలకొంది. అటు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టిన స్పెయిన్ కూడా కప్ కొట్టాలనే కసితో ఉంది. మరి కొదమసింహాల్లా లాంటి ప్రత్యర్థుల మధ్య పోటీ జరుగుతున్న వేళ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉంటాయా చెప్పండి. ఫైనల్ మ్యాచ్‌కు ముందే టికెట్ల ధరల రూపంలో ఫిఫా రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఫిఫా ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ఒక్క టికెట్ ధర ఏకంగా రూ.27 లక్షలు పలికింది. 96 ఏళ్ల ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన అత్యున్నత శ్రేణి (హాస్పిటాలిటీ) టికెట్ ధర ఏకంగా రూ. 27 లక్షలు పలుకుతోంది. ఈ ప్రీమియం హాస్పిటాలిటీ ప్యాకేజీలు కేవలం మ్యాచ్ వీక్షణకే పరిమితం కావు. విదేశీ వీఐపీలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించేలా స్టేడియంలో ప్రత్యేక విలాసవంతమైన లాంజ్‌లు, ఫైన్ డైనింగ్, విభిన్న లగ్జరీ సేవలను ఫిఫా అందిస్తోంది. అయితే, ఇది కేవలం వీఐపీ ప్యాకేజీ ధర మాత్రమేనని, సామాన్య అభిమానుల కోసం అందుబాటులో ఉండే సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు దీనికంటే చాలా తక్కువగా ఉంటాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.అమెరికా క్రీడా చరిత్రలో 2024లో జరిగిన ‘సూపర్‌బౌల్’ చాంపియన్‌షిప్‌లో శాన్ ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ వర్సెస్ కాన్సాస్ సిటీ అత్యంత ఖరీదైన మ్యాచ్‌గా నిలిచింది. అప్పట్లో దీని సగటు టికెట్ ధర రూ. 9.6 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు ఫిఫా ఫైనల్ టికెట్ ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 6,943 డాలర్లు (సుమారు రూ.6 లక్షలు)గా ఉంది. యావరేజ్ టికెట్ ధర 11,327 డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు)గా ఉంది. అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 7,200 డాలర్లు ( సుమారు రూ. 6.93 లక్షలు)గా ఉంది. సెమీస్‌తో పోలిస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ కనిష్ట ధర 93 వేలు తక్కువగా ఉండడం గమనార్హం. మొత్తం మీద ఈసారి ప్రపంచవ్యాప్తంగానూ ఫిఫా ప్రపంచకప్ వీక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఎన్నడూ లేనంతగా ఫిఫా చరిత్రలో టీఆర్పీ రేట్లన్నీ బద్దలయ్యాయి.Read: ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి! -
ఫిఫా కీలక నిర్ణయం.. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి!
ఫిఫా ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫిఫా పైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ తలపడనున్నాయి. అయితే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిఫా టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఆటగాళ్లు మెడల్స్ అందుకోనున్నారు. విన్నర్ జట్టుకు లభించే ప్రైజ్‌మనీనే భారీగా ఉంటుంది. ఒక్కో ఆటగాడు భారీ మొత్తాన్ని దక్కించుకుంటారు. ఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోని ఆటగాళ్లకు 96 ఏళ్ల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఫిఫా ప్రత్యేక గిఫ్ట్ అందించనుంది. ఫిఫా 2026లో చాంపియన్‌గా నిలిచిన జట్టు ఆటగాళ్లకు ఉంగరాలు ప్రదానం చేయనున్నారు. టైటిల్ గెలిచిన జట్లకు ఉంగరాలు ఇవ్వడం నార్త్ అమెరికాలో 19వ శతాబ్దం నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఫిఫా గెలిచిన జట్టులోని ఆటగాళ్లుకు 30 ప్రత్యేక ఉంగరాలను ఇప్పటికే తయారు చేయించి ఉంచారు. నార్త్ అమెరికా సంప్రదాయం ప్రకారం గెలిచిన జట్టు గుర్తింపును ప్రతిబింబించేలా ఈ ఉంగరాలను ఆటగాళ్ల వేలికి తొడగనున్నట్లు ఫిఫా తెలిపింది. అయితే ఆ ఉంగరాల ధర ఎంత ఉంటుందనేది మాత్రం ఫిఫా వెల్లడించలేదు.1893 నుంచి రింగుల ప్రదానంనార్త్ అమెరికాలో చాంపియన్లుగా నిలిచిన జట్లు లేదా వ్యక్తులకు రింగుల ప్రదాన సంప్రదాయం అనేది 1893 నుంచి కొనసాగుతోంది. ఆ సంవత్సరంలో మాంట్రియల్ హాకీ క్లబ్‌కు డొమినియన్ హాకీ ఛాలెంజ్ కప్ లభించింది. దీనినే ఇప్పుడు స్టాన్లీ కప్ అని పిలుస్తారు. ఆ జట్టు పైభాగంలో చిన్న హాకీ స్టిక్‌లు జతచేయబడిన సాధారణ పట్టీలను కూడా తయారు చేయించుకుంది.ఇక మేజర్ లీగ్ బేస్‌బాల్ జట్లు 1920ల్లో ఛాంపియన్షిప్ రింగులను ఇవ్వడం ప్రారంభించగా.. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) ఛాంపియన్‌షిప్‌లో మాత్రం 1940 నుంచి ఆ టోర్నీలో విజేతగా నిలిచిన జట్లకు రింగులను అందిస్తూ వస్తున్నారు. 1960ల నుంచి కొనసాగుతున్న సూపర్ బౌల్ శకంలో విజేతగా నిలిచిన ఎన్ఎఫ్ఎల్ జట్లు రింగులు అందుకుంటున్నాయి. జట్లతో పాటు వివిధ క్రీడల్లో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దిగ్గజాలతో పాటు ప్రపంచ వేదికపై తమ దేశానికి (నార్త్ అమెరికా) ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు కూడా లభించే ప్రోత్సాహక ప్యాకేజీలో భాగంగా యూఎస్ ఒలింపియన్లు, పారాలింపియన్లు ఉంగరాలను అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది.చదవండి: ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల! -
యామల్ ఒక్కడే కాదు.. ఈ ముగ్గురూ ఇప్పుడు మెస్సీకి ‘ప్రత్యర్థులే’!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. న్యూజెర్సీ వేదికగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అర్జెంటీనా- స్పెయిన్ మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ, స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్‌పైనే నిలిచాయి.లాలపోసి జోల పాడాడునిజానికి కెరీర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న ఏ ఆటగాడైనా... తన అభిమాన ప్లేయర్‌ను దగ్గర నుంచి చూడాలనో లేక అతడితో ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ తీసుకోవాలనో కోరుకుంటాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చిన్నప్పుడు ఆశిష్ నెహ్రా చేతుల మీదుగా అవార్డు తీసుకొని మురిసిపోగా... శ్రేయస్ అయ్యర్ బాల్‌బాయ్‌గా ఉన్నప్పుడు ఇర్ఫాన్ పఠాన్ మాటలతో స్ఫూర్తిపొందాడు. ఇలా ఎవరైనా ఊహ వచ్చాకే తమ అభిమాన ఆటగాళ్లతో అనుబంధం పెంచుకుంటారు. కానీ, స్పెయిన్ ఫుట్‌బాల్ యువ సంచలనం లమీన్ యామల్ అనుభవం మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. ఊహ తెలియక ముందే యామల్‌ను అతడి అభిమాన ప్లేయర్ ముద్దాడాడు. ఐదు నెలల వయసులోనే లాలపోసి జోల పాడాడు. ఇదేంటీ విడ్డూరం అనుకుంటున్నారా! కాదు నిజమే. అపుడు ఐదు నెలల పసికందు.. ఇపుడు ప్రత్యర్థిదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంటున్న ఓ యువ ఆటగాడు... ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు నెలల పసికందును ఎత్తుకొని ముద్దుచేశాడు. కట్ చేస్తే... ఆ ఎత్తుకున్న వ్యక్తి ప్రస్తుతం అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ కాగా... ఆ ముద్దులొలికే బాబు స్పెయిన్ స్టార్ ప్లేయర్ లమీన్ యామల్. యూనిసెఫ్, బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2007లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు నెలల యామల్‌కు మెస్సీ స్నానం చేయించాడు. ఆ రోజు మెస్సీ చేతుల్లో ఆడుకున్న ఆ చిన్నారి ఇప్పుడు పెరిగి పెద్ద వాడై అతడితోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా వేదికగా ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫైనల్లో ఈ ఇద్దరు ప్లేయర్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో... 19 ఏళ్ల నాటి ఫొటో సోషల్ మీడియాను ఊపేస్తోంది.అయితే ఏఐ యుగంలో ఈ ఫోటో నకిలీ అయి ఉంటుందని ప్రచారం జరగగా... యూనిసెఫ్ ప్రతినిధులు ఈ ఫొటో వెనక ఉన్న చరిత్రను తాజాగా వెల్లడించారు. 2008 యూనిసెఫ్ క్యాలెండర్ కోసం ఈ ఫొటోషూట్ నిర్వహించినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్న ఈ నిజజీవిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. యామల్ ఒక్కడే కాదు..ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. యామల్ ఒక్కడే కాదు.. ఫైనల్లో మెస్సీ బృందంతో తలపడనున్న స్పెయిన్ జట్టులో మరో ముగ్గురు కూడా మెస్సీతో చిన్ననాడే ఫొటోలకు ఫోజులిచ్చారు. వారు మరెవరో కాదు.. డానీ ఒల్మో (Dani Olmo), జోవాన్ గ్రేసియా (Joan Garcia), గవీ (Gavi).బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ గవీకి మెస్సీ రోల్ మోడల్. ఇప్పుడు తన ఆరాధ్య ఫుట్‌బాలర్‌కు ప్రత్యర్థిగా అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక స్పెయిన్ జట్టులో ఫార్వర్డ్ ప్లేయర్‌గా, సెంట్రల్ మిడ్‌ఫీల్డర్‌గా డానీ పాత్ర కీలకం. బార్సిలోనాలో చాలా ఏళ్ల క్రితమే అతడు మెస్సీతో కలిసి ఫొటో దిగాడు. ఇప్పుడు తన అనుభవాన్ని డానీ.. తన రోల్ మోడల్ మెస్సీకి వ్యతిరేకంగా ఉపయోగించబోతున్నాడు. ఇక జోవాన్ గ్రేసియా స్పెయిన్ గోల్ కీపర్. చిన్నపుడు మెస్సీతో కలిసి అతడు సందడి చేశాడు. ఇప్పుడు మెస్సీ గోల్ కొట్టకుండా ఆపే అడ్డుగోడలా నిలబడేందుకు సిద్ధమయ్యాడు. ఇది విధి రాసిన కథఈ నేపథ్యంలో.. ‘ఇది విధి రాసిన కథ.. మెస్సీ చేతుల్లో నాడు ఒదిగిపోయిన చిన్నారులు నేడు.. అతడికే ప్రత్యర్థిగా మారడం నిజంగా నమ్మలేని విషయం’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా యామల్ ఫొటో నిజమే అని యూనిసెఫ్ ధ్రువీకరించగా.. మిగతా ముగ్గురితో ఉన్న ఫొటోలు మాత్రం బార్సిలోనా ఇండిపెండెంట్ న్యూస్ చానెల్ బార్కా యూనివర్సల్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో తెరమీదకు వచ్చాయి.చదవండి: రోహిత్, జైస్వాల్ కోసం నాడు గిల్ అలా చేశాడు! -
స్పెయిన్ యువ సంచలనం పేరు వెనుక ఆసక్తికర కథ
స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ పేరు వెనుక ఓ భావోద్వేగ కథ ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఈ యువ ఆటగాడి పూర్తి పేరు లమీన్ యమాల్ నస్రౌయి ఎబానా (Lamine Yamal Nasraoui Ebana).స్పెయిన్ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరు నస్రౌయి, తల్లి ఇంటి పేరు ఎబానా. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో అతను లమీన్ యమాల్ పేరుతోనే గుర్తింపు పొందాడు.యమాల్ తండ్రి మౌనిర్ నస్రౌయి మొరాకోకు చెందినవాడు. తల్లి షీలా ఎబానా ఈక్వటోరియల్ గినియాలో జన్మించారు. యమాల్ పుట్టినప్పుడు ఇద్దరూ చాలా చిన్న వయసులో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ఇద్దరు స్నేహితుల పేర్లు లమీన్ మరియు యమాల్. వారి సహాయానికి కృతజ్ఞతగా తమ కుమారుడికి 'లమీన్ యమాల్' అని పేరు పెట్టినట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. (Story Behind Lamine Yamal Name)'లమీన్' అనే పేరు అరబిక్‌లో నమ్మకమైన వ్యక్తి, నిజాయితీ గలవాడు అనే అర్థం ఇస్తే, 'యమాల్' (జమాల్) అంటే అందం, సొగసు, ఆకర్షణ అనే అర్థాలు ఉన్నాయి.2007లో జన్మించిన యమాల్, చిన్నతనంలోనే బార్సిలోనా లా మాసియా అకాడమీలో చేరి అసాధారణ ప్రతిభతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు స్పెయిన్ జాతీయ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగిన యమాల్, తన పేరులో దాగి ఉన్న ఈ భావోద్వేగ కథతో మరోసారి అభిమానులకు చేరువయ్యాడు.ఇదిలా ఉంటే, జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా-స్పెయిన్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మ్యాచ్ నేపథ్యంలో యమాల్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వీరిద్దరికి 19 సంఖ్యతో ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు.ప్రపంచకప్ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.మెస్సీ, యమాల్ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం. -
19తో ముడిపడ్డ మెస్సీ-యమాల్ అనుబంధం
ఫిఫా వరల్డ్‌కప్ 2026 తుది అంకానికి చేరింది. అర్జెంటీనా-స్పెయిన్ జట్లు ఫైనల్‌కు చేరాయి. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఈ రెండు జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన స్టార్ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ (అర్జెంటీనా), లమీన్ యమాల్ (స్పెయిన్) మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా 19 సంఖ్యతో మెస్సీ-యమాల్‌కు ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.మెస్సీ, యమాల్ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం.ఒకప్పుడు తాను స్నానం చేయించిన చిన్నారి... ఇప్పుడు ప్రపంచకప్ కిరీటం కోసం తనతో పోటీపడటాన్ని మెస్సీ సహా ప్రపంచమంతా నమ్మలేకపోతుంది. ఈ విషయాలు ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన యాదృచ్ఛికాలుగా నిలిచిపోతాయి. -
మూడో స్థానం కోసం ఫ్రాన్స్, ఇంగ్లండ్ మధ్య పోరు
ఫిఫా ప్రపంచకప్-2026లో ఫైనల్‌కు చేరాలన్న కల నెరవేరకపోయినా, టోర్నీని విజయంతో ముగించాలని ఫ్రాన్స్, ఇంగ్లండ్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. శనివారం జరిగే మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో ఈ రెండు యూరోపియన్ దిగ్గజాలు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ అర్దరాత్రి (జులై 19) 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్, అర్జెంటీనా చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ (మూడో స్థానం) ఆడాల్సి రావడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు స్పష్టం చేశారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరూ కోరుకోలేదు"ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కొనాటే మాట్లాడుతూ, "మేమంతా ఫైనల్లో ఆడాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు ఇలా మారాయి. ఇప్పుడు మూడో స్థానం కోసం అయినా గెలిచి టోర్నీని ముగించాలని చూస్తున్నాం" అని తెలిపాడు.తుచెల్పై విమర్శలు.. జట్టులో మార్పులుఅర్జెంటీనాతో సెమీఫైనల్లో వ్యూహాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లండ్ కోచ్ థామస్ తుచెల్, ఈ మ్యాచ్‌లో జట్టులో మార్పులు చేస్తామని వెల్లడించారు."ఈ మ్యాచ్ ఆడాలని ఎవరికీ ఉండదు. కానీ ఇది ప్రపంచకప్ అధికారిక మ్యాచ్. గత 60 ఏళ్లలో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ ప్రపంచకప్ ఫలితం సాధించే అవకాశం. ఆటగాళ్ల పోరాట పటిమను మరోసారి చూపించాల్సిన సమయం ఇది" అని తుచెల్ అన్నారు.సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో ఆధిక్యాన్ని కోల్పోవడంపై బాధ్యత తనదేనని కూడా ఆయన అంగీకరించారు.గోల్డెన్ బూట్ రేసులో ఎంబపేఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబపే ఈ మ్యాచ్‌లో మరో లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన అతడు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీతో సమానంగా ఉన్నాడు. అయితే నాలుగు అసిస్టులతో మెస్సీ ఆధిక్యంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ తలో ఆరు గోల్స్‌తో పోటీలో ఉన్నారు.ఇదిలా ఉంటే, అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ట్రంప్
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కూడా ఫైనల్ అనంతరం ట్రంప్‌తో కలిసి విజేత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీ అందజేస్తామని ప్రకటించారు.అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 102 మ్యాచ్‌లకు ట్రంప్ గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ హాజరుకాలేదు. అయితే అమెరికా జట్టు ఆడిన కొన్ని మ్యాచ్‌లకు కేబినెట్ సభ్యులు హాజరయ్యారు.అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రెడ్‌కార్డు సస్పెన్షన్ వ్యవహారంలో ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోతో మాట్లాడిన విషయం వివాదాస్పదమైంది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయ ప్రక్రియలో తాను జోక్యం చేసుకోలేదని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు.అనంతరం బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా తాత్కాలికంగా ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ, ప్రీక్వార్టర్‌లో బెల్జియం చేతిలో అమెరికా 1-4 తేడాతో ఓటమి పాలైంది. -
ఫిఫా ఫైనల్‌కు రిఫరీగా అతడే.. అర్జెంటీనాకు పీడకల!
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్‌కు రిఫరీగా స్లోవేనియాకు చెందిన స్లావో విన్సిచ్ ఎంపికయ్యాడు. తాజా నిర్ణయం అర్జెంటీనా అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. ఎందుకంటే, విన్సిచ్ గత రిఫరీ అనుభవాలు అర్జెంటీనాకు పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే.. 2022 ఖతార్ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా, సౌదీ అరేబియా మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించారు. ఎనిమిదో నిమిషంలో అర్జెంటీనాకు విన్సిచ్ పెనాల్టీని ఇచ్చ్చాడు. ఆ పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచాడు. అంతేకాదు విన్సిచ్ సౌదీ ఆటగాళ్లకు ఆరు యెల్లోకార్డులు చూపించాడు. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా సౌదీ అరేబియా చేతిలో 1-2 తేడాతో అనూహ్య ఓటమిని చవిచూసింది. ఫిఫాలో విన్సిచ్ రిఫరీగా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో అర్జెంటీనా ఓటమి చవిచూసిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.స్పెయిన్‌తో అనుబంధం..అయితే విన్సిచ్కు స్పెయిన్‌తో మంచి అనుబంధముంది. స్పెయిన్ ఆడిన చాలా మ్యాచ్‌లకు విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు. 2017లో కొలంబియాతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌కు, యూరో 2020లో స్వీడన్, స్పెయిన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, 2023 UEFA నేషన్స్ లీగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించాడు. యువ ఆటగాడు లామిన్ యమాల్ జట్టులో స్థిరమైన ఆటగాడిగా మారిన తర్వాత, యూరో 2024లో ఇటలీపై స్పెయిన్ 1-0తో గెలిచిన మ్యాచ్‌తో పాటు, ఫిఫా 2026లో ఫ్రాన్స్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌కు కూడా విన్సిచ్ రిఫరీగా వ్యవహరించాడు.అపఖ్యాతిఇక ప్రస్తుత ఫిఫా ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన విన్సిచ్, మెక్సికో-ఈక్వెడార్ మ్యాచ్‌లో ఈక్వెడార్ ఆటగాడు పియరో హింకాపీకి రెడ్ కార్డ్ చూపించి అపఖ్యాతి పాలయ్యాడు. దీంతో ఆదివారం న్యూయార్క్ వేదికగా అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో విన్సిచ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వీఏఆర్ ద్వారా ఫిఫా నిశితంగా పరిశీలించనుంది. -
అర్జెంటీనా ఫ్యాన్స్ దుశ్చర్య.. ఇంగ్లండ్‌కు అవమానం!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరిన తర్వాత ఆ దేశ అభిమానుల సంబురాలు శ్రుతిమించాయి. ఆట వరకు గెలుపోటములు సహజమైనప్పటికీ అర్జెంటీనా ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ జాతీయ జెండాను కిందపడేసి కాళ్లతో తొక్కి ఓవరాక్షన్‌కు పాల్పడ్డారు. విషయంలోకి వెళితే.. అర్జెంటీనా సెమీస్ గెలిచిన తర్వాత ఆ దేశంలో అభిమానుల సంబురాలు మిన్నంటాయి. అర్జెంటీనా రాజధాని బ్రూనస్ ఎయిర్స్ వీధుల్లోకి భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్.. నృత్యాలు, అరుపులతో చెవుల మోత మోగించారు. ఈ నేపథ్యంలో వేడుకల్లో కొంతమంది అభిమానులు హద్దు మీరారు. ఇంగ్లండ్ జాతీయ జెండాను పోలిన ఒక పప్పెట్‌ను కిందపడేసి, దానిపై ఇంగ్లండ్ జాతీయ జెండాను ఉంచారు. ఇంగ్లండ్ జెండాపై ఉమ్మివేయడంతో పాటు చాలా మంది ఆ జెండాను కాళ్ల కిందేసి తొక్కిన దృశ్యాలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానుల చర్య పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. ‘అభిమానం ఉండడం మంచిదే కానీ అది హద్దుమీరకూడదు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఫిఫా సెమీస్‌లో విజయం తర్వాత మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది. సెలబ్రేషన్స్ సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.మ్యాచ్ విషయానికొస్తే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకొని వరుసగా రెండో ఫిఫాలో ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. Argentina fans spat on and trampled the England flag under their feet. pic.twitter.com/pfPzzgZkIV— The Resonance (@Partisan_12) July 16, 2026చదవండి: ‘రోహిత్ రిటైర్మెంట్పై కోహ్లి రియాక్షన్ వైరల్!’ -
అపశకునం ముద్ర.. ఫైనల్‌కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనుంది. ఏ టోర్నీలో అయినా తమ దేశం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంటే సదరు దేశాధ్యక్షుడు లైవ్‌లో చూడాలని ఆశించడం సహజం. కానీ అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తున్నారు. మూడ నమ్మకాల నెపంతో అర్జెంటీనా ఆడనున్న ఫిఫా పైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే టీవీలో వీక్షించాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఒక అర్జెంటీనా అధ్యక్షుడు లైవ్‌లో ఫిఫా మ్యాచ్ చూడడం వల్ల అర్జెంటీనా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సదరు అధ్యక్షుడిపై ‘అపశకునం’ ముద్ర వేశారు. దీంతో ఆ సెంటిమెంట్‌కు భయపడి తాజా ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఫిఫా ఫైనల్‌కు జావియర్ మిలే దూరమవ్వడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. మూడనమ్మకమా లేదా సెంటిమెంట్.. ఇలా ఏది అనుకున్నా తాను మాత్రం ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం టీవీలోనే వీక్షిస్తానని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే అధికారులకు తెగేసి చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. మెస్సీకి వీరాభిమాని అయిన అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఆడిన ఏడు మ్యాచ్‌లను తన ఇంటిలోనే వీక్షించారు. ఈ ఏడింటిలో ఒక్క ఓటమి, డ్రా కానీ చేసుకోని అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో వరుసగా రెండోసారి ఫిఫా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో విశేషమేమిటంటే జావియర్ మిలే తన హెవి జాకెట్‌ను ధరించి ఈ మ్యాచ్‌లన్నింటిని వీక్షించారట. కాబట్టి ఫైనల్ మ్యాచ్‌కు కూడా అదే హెవీ జాకెట్‌ను ధరించనున్నట్లు అర్జెంటీనా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్‌లో మూడ నమ్మకాలు కొత్తవేమి కావు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అర్జెంటీనా అభిమానులు మూడ నమ్మకాల పేరిట కాబాలస్ (ప్రీజర్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల ఫొటోలు ఉంచడం) సహా చాలా మంది అభిమానులు అర్జెంటీనా గెలవాలంటూ తాము నమ్మే దైవాన్ని ప్రార్థించడం వైరల్‌గా మారింది.తాజాగా ఒక దేశాధ్యక్షుడే ఇవాళ మూడ నమ్మకం పేరుతో ఫైనల్ మ్యాచ్‌ను లైవ్‌లో కాకుండా ఇంట్లోనే చూస్తానని చెప్పడం ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు కావడంతో జావియర్ మిలేకు ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆహ్వానం కూడా వచ్చింది. 'మీ స్నేహితుడు ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోలతో కలిసి ఆదివారం ఫిఫా పైనల్ చూసేందుకు న్యూజెర్సీ వెళ్తున్నారా' అని అడిగితే.. 'లేదు అస్సుల వెళ్లను.. ఒలివోస్లోని నా ఇంటి నుంచే ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తాను' అని అర్జెంటీనా అధ్యక్షుడు బదులివ్వడం విశేషం.అధ్యక్షుడిపై అపశకునం ముద్రతమ జట్లకు దురదృష్టం వెంటాడుతుందేమోనని అర్జెంటీనా అధ్యక్షులు చాలా కాలంగా కీలకమైన ప్రపంచకప్ మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ మూఢనమ్మకం 1990 టోర్నమెంట్ నాటిది. అప్పుడు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఉన్న కార్లోస్ మెనెమ్.. ఆనాటి ప్రపంచకప్‌లో కామెరూన్, అర్జెంటీనా మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా జట్టు కామెరున్ జట్టుతో పోరులో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో అధ్యక్షుడు మెనెమ్పై “ముఫా (అపశకునం) అని ముద్ర వేశారు. అప్పటి నుంచి ఫిఫా ప్రపంచకప్ ఎక్కడ జరిగినప్పటికీ ఏ అర్జెంటీనా అధ్యక్షుడు కూడా జాతీయ జట్టు మ్యాచ్‌కు హాజరుకాకపోవడం విశేషం.చదవండి: అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం! -
అర్జెంటీనాతో ఫైనల్.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం!
ఫిఫా ప్రపంచకప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో స్పెయిన్ అమీతుమీకి సిద్ధమైంది. అయితే 16 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని కలలు కంటున్న స్పెయిన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినె యమాల్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్పెయిన్ ప్రాక్టీస్ సమయంలో లామినె తొడకు పెద్ద కట్టు వేసుకున్న ఫొటోలు బయటికి వచ్చాయి. తొడ నొప్పితో బాధపడుతున్న యమాల్‌కు ఫిజియో చికిత్స చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. నొప్పితో బాధపడిన యామినే లమాల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. ఫ్రాన్స్‌తో జరిగిన సెమీస్‌లో ఆట 22వ నిమిషంలో లుకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్ వద్ద లామినె యమాల్‌ను కిందపడేయడంతో అతని ఎడమ తొడకు తీవ్ర గాయమైంది. అయితే నొప్పిని భరిస్తూనే యమాల్ మ్యాచ్ మొత్తం కొనసాగాడు. స్పెయిన్ విజయం తర్వాత హోటల్ రూమ్‌కు చేరిన అనంతరం లామినె తొడనొప్పి మరింత తీవ్రతరమైనట్లు సమాచారం.దీంతో స్పెయిన్ జట్టు బస చేస్తున్న డల్లాస్‌లోని హోటల్‌కే వైద్య సిబ్బందిని పిలిపించి లమాల్కు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే అతడి ఎడమ తొడకు భారీ కట్టు కట్టినట్లు తెలుస్తోంది. తొడ గాయంతో ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయిన లామినె యమాల్ అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 19 ఏళ్ల లామినె యమాల్ స్పెయిన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ మాత్రమే చేసినప్పటికీ జట్టుపై అతడి ప్రభావం చాలానే ఉంటుంది. 🚨 BREAKING: Lamine Yamal is not training with Spain due to discomfort. pic.twitter.com/jv8d9OsnIr— barcacentre (@barcacentre) July 16, 2026Read: టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్! -
సాహో అర్జెంటీనా
జగజ్జేత జట్టు ఆట ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు మరోసారి ప్రపంచానికి చూపించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరడం... ఎలాంటి స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడటం... ప్రత్యర్థి జట్ల ఆశలను చివరి క్షణాల్లో గల్లంతు చేయడం... ఏ లక్ష్యంతోనైతే అడుగు పెట్టామో దానిని ఎలా సాధించాలో ... తమను చూసి నేర్చుకోవాలని అర్జెంటీనా చాటి చెప్పింది. మరోవైపు ఇంగ్లండ్‌కు మూడోసారి కూడా ప్రపంచకప్ సెమీఫైనల్ పీడకలగా మారిపోయింది. ఆధిక్యంలో ఉన్నామన్న ధీమాతో... మేటి జట్లను తక్కువ అంచనా వేస్తే చివరకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని ఇంగ్లండ్‌కు మరోసారి అనుభవమైంది. అట్లాంటా: వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడో జట్టుగా గుర్తింపు పొందేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున ముగిసిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. అర్జెంటీనా తరఫున ఎంజో ఫెర్నాండెజ్ (85వ నిమిషంలో), సబ్‌స్టిట్యూట్ లాటారో మార్టినెజ్ (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆంథోనీ గోర్డాన్ (55వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. కెప్టెన్ మెస్సీ అందించిన పాస్‌లతోనే అర్జెంటీనా రెండు గోల్స్ నమోదు చేయడం విశేషం. 85వ నిమిషం వరకు 0–1తో వెనుకబడిన అర్జెంటీనా ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టి మరో అద్భుతం నమోదు చేసింది. ఈజిప్ట్ తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 0–2తో వెనుకబడ్డాక 13 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా మూడు గోల్స్ కొట్టి అనూహ్య విజయం అందుకున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి న్యూజెర్సీ వేదికగా జరిగే ఫైనల్లో ప్రస్తుత యూరోపియన్ చాంపియన్, 2010 ప్రపంచకప్ విజేత స్పెయిన్ జట్టును అర్జెంటీనా ‘ఢీ’కొంటుంది. తుది పోరులో అర్జెంటీనా విజయం సాధిస్తే... ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా నిలుస్తుంది. ప్రపంచకప్‌లో ఏడోసారి ఫైనల్‌కు చేరుకున్న అర్జెంటీనా మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా, మూడుసార్లు (1930, 1990, 2014) రన్నరప్‌గా నిలిచింది. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన అర్జెంటీనా కీలక సమరంలోనూ సత్తా చాటింది. 55వ నిమిషంలో ఇంగ్లండ్‌కు గోల్ సమర్పించుకున్న అర్జెంటీనా ఆ తర్వాత అసలు సిసలు ఆటతీరును కనబరిచింది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. అవకాశం దొరికినపుడల్లా ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ దిశగా దూసుకెళ్లాడు. 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఇంగ్లండ్ మరీ రక్షణాత్మకంగా ఆడింది. ఎలాగైనా అర్జెంటీనాను గోల్ చేయనీకుండా నిలువరించాలన్న ధ్యేయంతో కనిపించింది. గోల్‌కీపర్‌తో కలిపి రక్షణశ్రేణిలో తొమ్మిది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కనిపించారు. మరోవైపు స్కోరును సమం చేయాలన్న కసితో అర్జెంటీనా దాడుల్లో పదును పెంచింది. రెండుసార్లు దాదాపు గోల్ అయినట్లే కనిపించింది. ఇంగ్లండ్ గోల్‌కీపర్ పిక్ఫర్డ్ అప్రమత్తతతో రెండుసార్లు గోల్ కాకుండా నిలువరించాడు. 69వ నిమిషంలో నికో గొంజాలెజ్ షాట్‌ను... 76వ నిమిషంలో మాక్ అలిస్టర్ షాట్‌ను పిక్ఫర్డ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత అలిస్టిర్ కొట్టిన షాట్ ఒకటి ఇంగ్లండ్ గోల్‌పోస్ట్‌కు తగిలి వెనక్కి వచ్చింది. ఓవరాల్‌గా 55 నిమిషం నుంచి 85వ నిమిషం వరకు బంతి అర్జెంటీనా ఆధీనంలో 88 శాతం, ఇంగ్లండ్ ఆ«దీనంలో 12 శాతం ఉండటం గమనార్హం. ఎట్టకేలకు 85వ నిమిషంలో అర్జెంటీనా స్కోరు సమం చేయడంలో సఫలమైంది. మెస్సీ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న ఎంజో ఫెర్నాండెజ్ కళ్లు చెదిరే కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ తర్వాత 90+2 నిమిషంలో మెస్సీ అందించిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియా లోపల ఇద్దరు ఇంగ్లండ్ డిఫెండర్లకంటే ఎత్తుకు ఎగిరిన మార్టినెజ్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో అర్జెంటీనా 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. స్టాపేజ్ సమయంలోని మిగిలిన సమయంలో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి అర్జెంటీనా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో ఇంగ్లండ్ కేవలం ఐదుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. ఈ టోర్నీలో ఆరు గోల్స్ చొప్పున కొట్టి నిలకడగా రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ కీలకమైన సెమీస్‌లో ఆకట్టుకోలేకపోయారు. 1966లో చివరిసారి ఫైనల్ చేరి టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మూడుసార్లు (1990, 2018, 2026) సెమీఫైనల్లో ఓడిపోయింది. 19 ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్జెంటీనా చేసిన గోల్స్. ఒకే ప్రపంచకప్‌లో అర్జెంటీనా సాధించిన అత్యధిక గోల్స్ ఇవే కావడం విశేషం. 1930 లో అర్జెంటీనా 18 గోల్స్ నమోదు చేసింది.6 ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా ఆడిన ఆరు సెమీఫైనల్స్‌లోనూ (1930, 1986, 1990, 2014, 2022, 2026) నెగ్గింది. అర్జెంటీనా తొలిసారి విజేతగా నిలిచిన 1978 ప్రపంచకప్ లో సెమీస్ జరగలేదు. 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభ జించారు. గ్రూప్ విన్నర్స్‌గా అర్జెంటీనా, నెదర్లాండ్స్ ఫైనల్లో ఆడాయి. -
19 ఏళ్ల క్రితం స్నానం చేయించిన 'ఆ' చిన్నారే ఫైనల్లో మెస్సీ ప్రత్యర్ది
ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న అరుదైన ఘటనకు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ వేదిక కానుంది. 19 ఏళ్ల క్రితం తాను స్నానం చేయించిన చిన్నారినే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ, ప్రపంచకప్ ఫైనల్లో ఎదుర్కోనున్నాడు. కాలం రాసిన ఈ అద్భుత కథ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.2007లో యునిసెఫ్ నిర్వహించిన ఓ సేవా కార్యక్రమంలో భాగంగా "డియారియో స్పోర్ట్" అనే పత్రిక ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, యాదృచ్ఛికంగా ఎంపికైన శిశువు, నేటి స్పెయిన్ సూపర్ స్టార్ "లామినే యమాల్"కు ప్లాస్టిక్ టబ్‌లో స్నానం చేయిస్తూ ఫొటోలకు పోజులిచ్చాడు.ఆ చిన్నారి భవిష్యత్తులో ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారతాడని, ఒకరోజు ప్రపంచకప్ ఫైనల్లో తన ప్రత్యర్థిగానే నిలుస్తాడని మెస్సీ ఊహించి ఉండడు.ఈ ఫొటోలు చాలా సంవత్సరాలు వెలుగులోకి రాలేదు. అయితే 2024లో యమాల్ తండ్రి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మెస్సీ చేతుల్లో కనిపించిన ఆ శిశువే స్పెయిన్ యువ సంచలనం లామినే యమాల్ అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం యమాల్ స్పెయిన్ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన డ్రిబ్లింగ్, సృజనాత్మక ఆటతీరుతో క్లబ్, దేశం తరఫున వరుస రికార్డులు నెలకొల్పుతూ ప్రపంచ ఫుట్‌బాల్ భవిష్యత్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. 2026 ప్రపంచకప్‌లోనూ అతని ప్రదర్శన స్పెయిన్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.మరోవైపు 39 ఏళ్ల వయసులోనూ మెస్సీ తన మాంత్రిక ఆటతో అర్జెంటీనాను మరోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో చివరి నిమిషాల్లో అందించిన రెండు అద్భుత అసిస్టులతో అర్జెంటీనా విజయానికి మార్గం సుగమం చేశాడు.ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్లో ఒకవైపు మరో ప్రపంచకప్ కోసం పోరాడుతున్న మెస్సీ, మరోవైపు కొత్త యుగానికి నాంది పలకాలని భావిస్తున్న యువ సంచలనం యమాల్ నిలవనున్నారు.19 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఓ యాదృచ్ఛిక ఫొటో కథ, ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత భావోద్వేగభరితమైన ఫైనల్‌కు నేపథ్యంగా మారింది. రెండు తరాల మధ్య జరిగే ఈ పోరు ఫుట్‌బాల్ క్రీడలో చారిత్రక ఘట్టంగా నిలవనుంది. -
ఫైనల్స్ కు అర్జెంటీనా.. సెమీస్ లో ఇంగ్లాండ్ చిత్తు..
-
ఫిఫా వరల్డ్‌కప్.. అర్జెంటీనాకు భారీ షాక్!
ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అట్లాంటా వేదికగా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో మెస్సీ బృందం సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర నిరాశలో మునిగిపోయింది.ఇక సెలబ్రేషన్స్ చేసుకునే సమయంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ గియోవని లో సెల్సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. ‘ఫాక్‌ల్యాండ్స్ అర్జెంటీనా’దే అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అతడితో పాటు కెప్టెన్ లియోనల్ మెస్సీ సహా మిగతా ఆటగాళ్లు ఆ బ్యానర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.చిరకాల ప్రత్యర్థులుఈ క్రమంలో అర్జెంటీనా ఆటగాళ్ల చర్య వివాదానికి దారితీసింది. కాగా క్రికెట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ల మాదిరే ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా- ఇంగ్లండ్ మ్యాచ్‌లకూ అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇందుకు ఇరుదేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాలు.. తదనుగుణంగా చెలరేగే భావోద్వేగాలు కారణం అని చెప్పవచ్చు.అసలు వివాదం ఏమిటి?అర్జెంటీనా తూర్పు తీర ప్రాంతానికి దాదాపుగా 480 కిలోమీటర్ల దూరంలో ఫాక్లాండ్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను 1774లో అప్పటి బ్రిటన్ ప్రభుత్వం తమవిగా చెప్పుకొంది. ఇక 1832లో వీటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే, 1982లో అర్జెంటీనాలోని సైనిక ప్రభుత్వం ఫాక్లాండ్ దీవుల కోసం ఘర్షణకు దిగింది.దీంతో ఇంగ్లండ్- అర్జెంటీనా మధ్య నాడు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. అయితే, ఇంగ్లండ్ ధాటికి తాళలేక ఆఖరికి అర్జెంటీనా బలగాలు లొంగిపోవడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ ఘర్షణలో దాదాపు 649 మంది అర్జెంటీనా సైనికులు బలైపోయారు. అదే విధంగా 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.24 ఏళ్ల తర్వాత తొలిసారిఅయితే, ఫాక్లాండ్ దీవుల విషయంలో ఇప్పటికీ ఇరుదేశాల మధ్య ఒక రకంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత అర్జెంటీనా- ఇంగ్లండ్ తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్లో తలపడే అవకాశం వచ్చింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గట్లు రాణించింది. అర్జెంటీనా తరఫున 85వ నిమిషంలో ఎన్జో ఫెర్నాండెజ్, అదనపు సమయం (90+2వ నిమిషం)లో మార్టినేజ్ చెరో గోల్ గొట్టారు.ఇక వీరిద్దరు గోల్స్ సాధించడంలో కెప్టెన్ మెస్సీ సహకారం అందించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ తరఫున ఆంటోనీ గార్డన్ 55వ నిమిషంలోనే గోల్ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ గోల్ సాధించడంలో సఫలం కాలేకపోయింది. దీంతో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.షాక్ తప్పదా?ఈ నేపథ్యంలో ఓవైపు టైటిల్ సమరానికి మరోసారి అర్హత సాధించడం.. మరోవైపు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఓడించిన సంబరంలో అర్జెంటీనా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫాక్లాండ్ దీవులు తమవే అన్నట్లుగా బ్యానర్ ప్రదర్శించారు.Argentina Team with The Falkland Islands Banner 😂😂😂! pic.twitter.com/NlSUZXXlsS— The Final Whistle (@Rufus_45) July 16, 2026అయితే, అర్జెంటీనా ఆటగాళ్లపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు గానూ.. ముందుగా బ్యానర్ ప్రదర్శించిన ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.నిబంధనలు ఏం చెబుతున్నాయి?IFAB నిబంధనల ప్రకారం.. మైదానంలో పరికరాల ద్వారానైనా సరే ఆటగాళ్లు రాజకీయ, మతపరమైన విషయాలకు సంబంధించి.. అదే విధంగా వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించిన ప్రకటనలు చేయడం, ఫొటోలు ప్రదర్శించడం నిషిద్ధం.ఆటగాళ్ల లోదుస్తులపై సైతం కేవలం తయారీ లోగో మాత్రమే ఉండాలి. అది కాకుండా తమ రాజకీయ, మతపరమైన, వ్యక్తిగతమైన అభిప్రాయాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ ఆటగాళ్లు ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే సదరు ఆటగాడు లేదంటే జట్టు మొత్తానికి టోర్నీ నిర్వాహకులు జరిమానా విధిస్తారు. జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ లేదంటే ఫిఫా ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ మద్దతుఅర్జెంటీనా ఉపాధ్యక్షురాలు విక్టోరియా విలారుయెల్ మాత్రం తమ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ‘‘ఫాక్లాండ్స్ ఎప్పటికీ అర్జెంటీనావే! వాళ్లు స్టేడియంలోకి బ్యానర్ తీసుకురాకుండా నిషేధం విధించారు. కానీ ఈ భావం మా నరనరాల్లో, హృదయాల్లో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ రికార్డు బద్దలు¡Las Malvinas son Argentinas! 🇦🇷 Prohibieron llevarlas a la cancha y se olvidaron que las llevamos en la sangre y el corazón. pic.twitter.com/qB455HeqVX— Victoria Villarruel (@VickyVillarruel) July 15, 2026 -
గురి తప్పిన ఫ్రెంచ్ కిక్
ఒకరిద్దరి మెరుపులు ప్రతీసారి ఏ జట్టుకైనా విజయం అందించవని మరోసారి నిరూపితమైంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగితే... అడుగడుగునా సమన్వయం ప్రదర్శిస్తూ.. సమష్టిగా ముందుకు కదిలితే... ఎంతటి మేటి ప్రత్యర్థినైనా బోల్తా కొట్టించవచ్చని మళ్లీ రుజువైంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఈసారి కచ్చితంగా ఫ్రాన్స్ విజేతగా నిలుస్తుందని భావించినవారందరి అంచనాలను తారుమారు చేస్తూ స్పెయిన్ సంచలనం సృష్టించింది. కలిసికట్టుగా కళ్లు చెదిరే ఆటతీరుతో ఫ్రాన్స్ ఫైనల్ ఆశలను సెమీఫైనల్లోనే గల్లంతు చేసిన స్పెయిన్... 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. డాలస్: ప్రత్యర్థి స్థాయి చూసి భయపడలేదు... లయబద్దమైన ఆటతో ప్రత్యర్థినే భయపెట్టింది... ఆరంభం నుంచి అంతం వరకు మ్యాచ్‌పై నియంత్రణ కోల్పోలేదు... పకడ్బందీగా ఆడి ప్రత్యర్థినే ఆద్యంతం నియంత్రించింది... తొలి క్షణం నుంచే ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా కదం తొక్కింది.... ప్రత్యర్థి ఆటగాళ్లను ఎక్కడికక్కడే కట్టడి కూడా చేసింది. వెరసి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ ఫేవరెట్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ముగిసిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 2–0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును బోల్తా కొట్టించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒయర్జబాల్ (22వ నిమిషంలో), పెడ్రో పోరో (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ గెలుపుతో స్పెయిన్ 2010 తర్వాత ఈ మెగా ఈవెంట్లో మళ్లీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అంతేకాకుండా ఓటమి లేకుండా వరుసగా 37వ మ్యాచ్‌ను ముగించింది. ఈ క్రమంలో ఇటలీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును స్పెయిన్ సవరించింది. ఎంబాపె తడబాటు...2018 ప్రపంచకప్‌లో టైటిల్ సాధించి... 2022లో రన్నరప్‌గా నిలిచి... ఈసారి మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలే ఆటతీరుతో అదరగొట్టిన ఫ్రాన్స్ కీలకమైన సమరంలో ఉసూరుమనిపించింది. ఏమాత్రం పోరాటపటిమ కనబర్చకుండా స్పెయిన్ ‘కిక్’ఎక్కించే ఆటకు సమాధానం ఇవ్వకుండా ఫ్రాన్స్ చేతులెత్తేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో ఫ్రాన్స్ కెపె్టన్ కిలియన్ ఎంబాపె 8 గోల్స్... మరో స్టార్ ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె 5 గోల్స్ చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరు సెమీఫైనల్లోనూ మెరిపిస్తారని... ఫ్రాన్స్ జట్టును ఫైనల్‌కు చేరుస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎంబాపె, డెంబెలె కీలక సమరంలో తేలిపోయారు. స్పెయిన్ డిఫెండర్లను దాటి ఆ జట్టు గోల్‌పోస్ట్ వరకు వెళ్లడంలో ఎంబాపె, డెంబెలె విఫలమయ్యారు. అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా అనుకూలంగా మల్చుకోలేకపోయారు. ఎంబాపెను నియంత్రించడంలో పూర్తిగా సఫలమైన స్పెయిన్ చివరకు మ్యాచ్ ఫలితాన్ని కూడా శాసించింది. ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన స్పెయిన్ 22వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను సంపాదించింది. ‘డి’ ఏరియాలో లమీన్ యామల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లుకాస్ డిగ్నె మొరటుగా అడ్డుకున్నాడు.దాంతో రిఫరీ స్పెయిన్‌కు పెనాల్టీ కిక్ ఇవ్వగా... మికెల్ ఒయర్జబాల్ బంతిని లక్ష్యానికి చేర్చి స్పెయిన్‌ను 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. ఈ టోర్నీలో ఒయర్జబాల్కిది ఐదో గోల్ కావడం విశేషం. అనంతరం 58వ నిమిషంలో డానీ ఓల్మో అందించిన పాస్‌ను పెడ్రో గోల్‌గా మలచడంతో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. ఆలస్యంగానైనా ఫ్రాన్స్ పుంజుకుంటుందని, స్కోరును సమం చేస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నా... స్పెయిన్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. -
ఫిఫా వరల్డ్‌కప్.. ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అట్లాంటా వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా.. స్పెయిన్‌తో తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీని ఇంగ్లండ్ డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. మెస్సీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయాడు. ఇంగ్లండ్ కూడా ప్రథమార్ధంలో గోల్ సాధించలేకపోయింది.దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు తమ ఖాతాను తెరవలేదు. అయితే సెకెండ్ హాఫ్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. యువ సంచలనం ఆంథోనీ గోర్డాన్ 58 నిమిషంలో ఒక సూపర్ గోల్‌తో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం దగ్గరపడుతున్నప్పటికి అర్జెంటీనా ఇంకా గోల్ సాధించకపోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌కు ఓటమి తప్పదని అంతా భావించారు.అర్జెంటీనా అదరహోఈ సమయంలో అర్జెంటీనా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాళ్లు విశ్వరూపం ప్రదర్శించారు. 85వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ డి-బాక్స్ లాంగ్-రేంజ్ షాట్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అనంతరం అదనపు సమయం(90+2)లో లియోనెల్ మెస్సీ మ్యాజిక్ చేశాడు.మైదానం మధ్యలో నుంచి ఇంగ్లండ్ డిఫెన్స్‌ను తప్పించుకుంటూ మెస్సీ అందించిన ఒక అద్భుతమైన క్రాస్ పాస్‌ను.. స్ట్రైకర్ లౌటారో మార్టినెజ్ గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి నిమిషాల్లో ఇంగ్లండ్ మరో గోల్ సాధించకపోవడంతో మెస్సీ సేన వరుసగా రెండో సారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం(జూలై 20) జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో అర్జెంటీనా తలపడనుంది. -
అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి బహిష్కరించండి..!
ఫిఫా ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై మరోసారి వివాదం చెలరేగింది. రిఫరీలు, వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాల్లో అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నమెంట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో ఓ పిటిషన్ వైరల్ అవుతోంది. ఈ పిటిషన్‌కు ఇప్పటికే 75 లక్షల మందికిపైగా మద్దతు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.పిటిషన్ నిర్వాహకులు ఫిఫాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్జెంటీనాకు అనుకూలంగా రిఫరీ నిర్ణయాలు వస్తున్నాయని, దీంతో పోటీ సమానంగా జరగడం లేదని వారు ఆరోపించారు. "విజేత ముందే నిర్ణయించబడితే మిగతా జట్లు ఎందుకు పోటీ పడాలి? అర్జెంటీనాను ప్రపంచకప్ నుంచి తప్పించి ఇతర జట్లకు న్యాయం చేయాలి" అని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ వివాదం మధ్యనే అర్జెంటీనా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక ప్రత్యర్థిత్వం కారణంగా ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజా ఆరోపణలతో ఈ పోరుకు మరింత ఉత్కంఠ ఏర్పడింది.ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, అర్జెంటీనాపై చర్యలు తీసుకునే అంశంపై ఫిఫా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే పిటిషన్లో చేసిన ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారిత ఆధారాలు కూడా వెలుగులోకి రాలేదు. అందువల్ల ఇవి ప్రస్తుతం ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాగా, భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్య రాత్రి రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా ఇంగ్లండ్‌తో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌పై గెలుపుతో స్పెయిన్ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. -
ఉదయం 3:30 వరకు పబ్‌లు, రెస్టారెంట్లు ఓపెన్!
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌కు సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో (జులై 14, 15, 19 తేదీలు) నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లను రాత్రి 1 గంటకు బదులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక పోలీస్ చట్టం పరిధిలో ఈ తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం ఆహార పదార్థాల (ఫుడ్) సరఫరాకేనా లేక మద్యం (లిక్కర్) విక్రయాలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై గందరగోళం నెలకొంది.నిర్ణయ నేపథ్యం ఏమిటి?ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) బెంగళూరు ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కలిసి మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చే కస్టమర్ల సౌకర్యార్థం నగరంలోని వ్యాపార వేళలను పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.లిక్కర్ అనుమతిపై సందిగ్ధత!పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఆహార సేవలను తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మద్యం సరఫరా, విక్రయాలపై ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదు. సాధారణ నిబంధనల ప్రకారం బెంగళూరులో రాత్రి 1 గంట తర్వాత మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. దీంతో పబ్‌లు, బార్ల యజమానులు ఈ ఉత్తర్వులపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేదా నిబంధనల సడలింపు వస్తేనే తెల్లవారుజాము వరకు మద్యం సరఫరా చేయడానికి వీలవుతుందని వాదిస్తున్నారు.శాంతిభద్రతలపై పోలీసుల నిఘామరోవైపు రాత్రి వేళల్లో సమయాన్ని పొడిగించడం వల్ల నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిబంధనలను విధించారు. లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఫుట్‌బాల్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నైట్‌లైఫ్ సంస్కృతికి భంగం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం బెంగళూరు నైట్‌లైఫ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక లిక్కర్ సందిగ్ధత వల్ల నీరుగారిపోతుందా అనేది ఎక్సైజ్ శాఖ ఇచ్చే తదుపరి స్పష్టతపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
ఫిఫా ఫైనల్లో స్పెయిన్.. ఆ జట్టును మాత్రం ఓడించలేకపోయింది!
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా తాను తలపడిన అన్ని జట్లను చిత్తు చేసిన స్పెయిన్ కేప్వెర్డెను మాత్రం ఓడించకలేకపోయింది. గ్రూప్ దశలో కేప్‌వెర్డెతో మ్యాచ్‌ను స్పెయిన్ 0-0తో డ్రా చేసుకోవడం గమనార్హం. దీంతో అనామక జట్టుగా ఫిఫాలో ఎంట్రీ ఇచ్చిన కేప్‌వెర్డె టోర్నీ నుంచి నిష్క్రమించే సమయంలో హీరోలా మారిపోయింది. తన గోల్ కీపింగ్ నైపుణ్యంతో వోజిన్హా స్పెయిన్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్ ఆటగాళ్లు 27 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసినప్పటికీ వాటన్నింటిని సమర్థంగా అడ్డుకొని 40 ఏళ్ల వయసులో వోజిన్హా సూపర్‌హీరోగా నిలిచాడు.Photo Credit: FIFA Twitterతాజాగా సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ టీం ఒక కామెంట్ చేసింది. ‘ఈ ఫిఫాలో మేము అందరిని నిలువరిస్తే.. మమ్నల్ని మాత్రం కేప్‌వెర్డె నిలువరించింది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్ కంటే కేప్‌వెర్డెతో మ్యాచ్ మాకు చాలా కష్టమనిపించింది’ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది. తాజాగా స్పెయిన్ టీం చేసిన వ్యాఖ్యలతో కేప్‌వెర్డె మరోసారి వార్తల్లో నిలిచింది.స్పెయిన్ ప్రయాణం సాగింది ఇలా..ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్-హెచ్లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను కేప్‌వెర్డెతో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సౌదీ అరేబియాను 4-0తో చిత్తు చేసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేను 0-1తో ఓడించిన స్పెయిన్ టేబుల్ టాపర్‌గా రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో ఆస్ట్రియాను 0-3తో ఓడించి స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు గోల్ చేయడంలో స్పెయిన్ విఫలమైంది. అయితే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మైకెల్ మిరినో స్టాపేజీ టైం (91వ నిమిషం)లో గోల్ చేసి పోర్చుగల్‌కు పీడకలను మిగిల్చాడు. పోర్చుగల్‌పై 1-0తో విజయం సాధించిన స్పెయిన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్టర్స్‌లో స్పెయిన్ బెల్జియంతో తలపడింది. తొలి హాఫ్ ముగిసేసరికి 1-1తో సమంగా నిలిచాయి. అయితే రెండో హాఫ్‌లో బెల్జియం గోల్‌కీపర్ సన్నె లామిన్స్ చేసిన చిన్ప తప్పిదం బెల్జియం కొంపముంచింది. స్పెయిన్ ఆటగాడు కుబార్సి కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో లామిన్స్ మిస్ చేయడం, ఇదే అదనుగా భావించిన మికెల్ మెరినో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి మరోసారి హీరోగా నిలిచాడు. ఫలితంగా స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత జరిగిదంతా ఒక చరిత్రే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. 🚨FACT: Cape Verde are the only team Spain faced at the 2026 World Cup that they DIDN’T beat pic.twitter.com/51p0mFj8ip— Polymarket Sports (@PolymarketSport) July 14, 2026Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం! -
ఫిఫా వీఏఆర్పై ప్రపంచవ్యాప్త నిరసనలు.. ఆ దేశంలో మాత్రం!
2026 ఫిఫా వరల్డ్‌కప్‌లో వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఏకపక్ష నిర్ణయాలు, ఫౌల్స్ విషయంలో కొత్త నిబంధనలు, గోల్స్‌ను రద్దు చేయడంపై జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ల ఫలితాలను మార్చేస్తున్న వీఏఆర్ వివాదం ఫిఫాలో పెద్ద రచ్చగా మారిపోయింది. ‘#Good Bye VAR’ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిపోయింది.ఫిఫా ప్రవేశపెట్టిన వీఏఆర్‌ను చాలా దేశాలు వ్యతిరేకించడంతో పాటు దానిని బ్యాన్ చేయాలని కోరుతున్నాయి. కానీ స్వీడన్ ఇదే వీఏఆర్‌ను టెక్నాలజీని ఐదేళ్ల క్రితమే బ్యాన్ చేసిందన్న విషయం మీకు తెలుసా. కోవిడ్ సమయంలో స్వీడన్లో దేశీయంగా చాలా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో వీఏఆర్ టెక్నాలజీని వాడారు. కానీ దీనిపై అప్పట్లో ఆటగాళ్లు సహా అభిమానులు తిరుగుబాటు చేశారు. దీంతో వీఏఆర్‌ను బ్యాన్ చేయాలని ఆ దేశ ఫుట్‌బాల్ అసోసియేషన్ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది.Photo Credit: FIFA Twitterఇప్పటికీ స్వీడన్లో సంప్రదాయ అంపైరింగ్కే అక్కడి ఫుట్‌బాల్ లీగ్‌లు కట్టుబడి ఉన్నాయి. అయితే ఇవాళ ఫిఫాలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వీఏఆర్ వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ వీఏఆర్ టెక్నాలజీ అర్జెంటీనాకు వరంలా మారిపోయిందని, రిఫరీలు కూడా అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోయాయి.ప్రపంచకప్‌లో ముఖ్యంగా అర్జెంటీనా–ఈజిప్ట్, స్విట్జర్లాండ్–అర్జెంటీనా వంటి మ్యాచ్‌ల్లో VAR జోక్యంతో తీసుకున్న నిర్ణయాలు పెద్ద వివాదంగా మారాయి. ఈజిప్ట్‌కు లభించిన గోల్‌ను రద్దు చేయడం, పెనాల్టీపై వచ్చిన వివాదం, స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలోకు సిమ్యులేషన్ పేరుతో ఎర్రకార్డు చూపించడం వంటి ఘటనలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. సోషల్ మీడియాలో అర్జెంటీనాను వ్యంగ్యంగా "VARgentina" అని పిలుస్తూ విమర్శలు వెల్లువెత్తాయి.వీఏఆర్ వివాదాలకు కారణాలు:👉నిబంధనల మార్పు: ఈ టోర్నీలో ఫౌల్స్, డైవింగ్ (తప్పుడు ప్రయత్నాలు) వంటి వాటిపై వీఏఆర్ కఠినంగా వ్యవహరిస్తోంది. స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో డైవింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించి, అతనికి రెడ్ కార్డ్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇది ఎంతదాకా వెళ్లిందంటే అర్జెంటీనా కోసమే ఫిఫాను నిర్వహిస్తే సరిపోతుందని.. కప్‌ను అర్జెంటీనాకే ఇచ్చేయాలని మైదానంలోని బహిరంగ నిరసనకు దిగడం చర్చనీయాంశమైంది.👉గోల్స్ రద్దు: మైదానంలో ఆటగాళ్లు కష్టపడి చేస్తున్న గోల్స్‌ను రిఫరీలు వీఏఆర్ స్క్రీనింగ్ ద్వారా (బాల్ సెన్సార్ టచ్) పేరుతో రద్దు చేయడం అభిమానులను నిరాశపరిచింది.👉ఆటకు ఆటంకం: టెక్నాలజీ జోక్యం వల్ల ఆట సమయం వృథా అవుతోందని కొందరు, సరైన నిర్ణయాలు రావడం వల్ల వీఏఆర్ వల్ల ఉపయోగం ఎవరికి ఉంటుందనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Photo Credit: FIFA Twitterఫిఫా ఏమందంటే?వీఏఆర్ నిర్ణయాలపై ఫిర్యాదులు పెరిగిపోవడంతో ఫిఫా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గతంలో వీఏఆర్ నిర్ణయాలు రిమోట్ కంట్రోల్ (అంతర్జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రం) ద్వారా జరిగేవి. కానీ వీఏఆర్పై రచ్చ పెరిగిపోవడంతో, క్వార్టర్ ఫైనల్స్ నుంచి స్టేడియంలోనే ప్రత్యేకంగా వీఏఆర్ అధికారులను (VAR Team) ఫిఫా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కూడా వీఏఆర్ వివాదాలకు మాత్రం తెరపడడం లేదు.చదవండి: ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు! -
ఓం భీమ్ బుష్.. 'కబాలాస్'ను నమ్ముకున్న అర్జెంటీనా ఫ్యాన్స్
ఫుట్‌బాల్ అంటే కేవలం ఆట కాదు.. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగం. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ, వ్యూహాలు, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో.. కొంతమంది అభిమానుల నమ్మకాల్లో అదృష్టం కూడా అంతే కీలకం. ఇప్పుడు ఫిఫా ప్రపంచకప్-2026 సెమీఫైనల్ ముందు అర్జెంటీనా అభిమానులు తమ జట్టు విజయం కోసం ఆసక్తికరమైన ‘కబాలాస్’ను ఆశ్రయిస్తున్నారు.ఇంగ్లండ్‌తో కీలక పోరుకు ముందు.. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్ పేర్లను కాగితాలపై రాసి ఫ్రీజర్‌లో పెట్టడం అర్జెంటీనాలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి ఆటగాళ్లు చల్లబడిపోవాలని, మైదానంలో తమ ప్రభావం చూపలేకపోవాలని ఇలా చేస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. కొందరు అభిమానులు ఏఐ సాయంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను మంచులో బంధించినట్లుగా చిత్రాలు రూపొందించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అసలు ‘కబాలాస్’ అంటే ఏమిటి?అర్జెంటీనా ఫుట్‌బాల్ సంస్కృతిలో ‘కబాలాస్ (Cábalas)’ అనేది చాలా కాలంగా కొనసాగుతున్న నమ్మకం. జట్టు గెలవాలంటే ఒకే టీ-షర్ట్ ధరించడం, మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ ఒకే చోట కూర్చోవడం, ఒకే ఆహారం తినడం వంటి అలవాట్లను అభిమానులు అదృష్ట సూచికలుగా భావిస్తారు. కొంతమంది అభిమానుల నమ్మకం ప్రకారం.. ఒకసారి చేసిన పని జట్టుకు విజయం తెచ్చిపెడితే, తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తే అదృష్టం కలిసి వస్తుందట. శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. అర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఈ సంప్రదాయం భావోద్వేగంగా కొనసాగుతోంది.Photo Credit: FIFA Twitterకేన్, బెల్లింగ్హామ్లకు ‘ఫ్రీజర్ ట్రీట్మెంట్’ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ పోరు కావడంతో ఈసారి అర్జెంటీనా అభిమానుల కబాలాస్ మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యర్థి జట్టు కీలక ఆటగాళ్లను "ఐస్‌లో పెట్టడం" ద్వారా వారి ఆటను నిలువరించవచ్చని కొందరు నమ్ముతున్నారు. హ్యారీ కేన్ ఇంగ్లండ్ ప్రధాన గోల్ ఆయుధం కాగా.. జూడ్ బెల్లింగ్‌హామ్ మిడ్‌ఫీల్డ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకే వీరిద్దరినీ టార్గెట్‌గా చేసుకుని అభిమానులు ఈ ప్రతీకాత్మక చర్యలకు దిగారు.కోచ్‌లకూ ఉన్న నమ్మకాలుఅర్జెంటీనా ఫుట్‌బాల్‌లో ఇలాంటి నమ్మకాలు అభిమానులకే పరిమితం కాదు. మాజీ కోచ్ Carlos Bilardo కూడా ప్రత్యేక అలవాట్లు, నమ్మకాలతో ప్రసిద్ధి చెందారు. ప్రస్తుత కోచ్ Lionel Scaloni కూడా కొన్ని వ్యక్తిగత అలవాట్లను పాటిస్తారని చెబుతారు. మైదానంలోకి అడుగుపెట్టే విధానం, మ్యాచ్‌కు ముందు చేసే కొన్ని ఆచారాలు ఆయనకు అదృష్టాన్ని తెస్తాయని అభిమానులు భావిస్తుంటారు.అర్జెంటీనా-ఇంగ్లండ్.. ఆ మాత్రం ఉంటదిఅర్జెంటీనా-ఇంగ్లండ్ మ్యాచ్ అంటే కేవలం ఫుట్‌బాల్ పోటీ కాదు.. దానికి చరిత్ర, భావోద్వేగాలు కూడా జతకట్టాయి. 1986 ప్రపంచకప్‌లో Diego Maradona చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఈ రెండు దేశాల మధ్య పోటీ మరింత ప్రత్యేకంగా మారింది. ప్రపంచకప్ వేదికపై ఈ రెండు జట్లు ఎదురుపడితే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ఈసారి కూడా సెమీఫైనల్‌కు ముందు అర్జెంటీనా అభిమానులు తమ కబాలాస్పై నమ్మకం పెట్టుకున్నారు.మైదానంలో విజయం మాత్రం ఆటగాళ్ల ప్రదర్శన, వ్యూహాలపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. ఫుట్‌బాల్‌లో అభిమానుల విశ్వాసాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలు ఎంత లోతుగా పాతుకుపోయాయో అర్జెంటీనా ఫ్యాన్స్ ‘ఫ్రీజర్ కబాలా’ మరోసారి చూపించింది.Concuerdo, las cábalas NO se comparten.En lo personal, yo soy bien supersticioso en el deporte y tengo un buen.¿Ustedes tienen? https://t.co/DLQ6MvhLBt— Iván Jacob (@ivanjacobvg) July 15, 2026 -
ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు!
ఫిఫా ప్రపంచకప్‌లో 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2010లో చివరిసారి ఫిఫా ఫైనల్ చేరిన స్పెయిన్ ఆనాడు టోర్నీలో చాంపియన్‌గా అవతరించింది. మళ్లీ ఇన్నేళ్లకు స్పెయిన్‌కు ఫైనల్ ఆడే అవకాశం రావడం విశేషం. ఫ్రాన్స్‌తో సెమీస్‌కు ముందు స్పెయిన్ స్టార్ లామినే యమాల్ ఎంబాపెతో పాటు ఆ జట్టుకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. 'భయపడేది మేము కాదు.. వాళ్లే మాకు భయపడతారు' అని యమాల్ అన్నట్లు ఫ్రాన్స్ కీలక సెమీస్‌లో అనవసర ఒత్తిడికి లోనయ్యి స్పెయిన్ చేతిలో పరాజయం చవిచూసింది. లామినే యమాల్.. ఎంబాపెకు చెప్పి మరీ దెబ్బతీశాడు. ఫ్రాన్స్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ యమాల్ తన సహచర ఆటగాళ్లు గోల్ చేయడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. సోమవారం 19వ పుట్టినరోజు జరుపుకున్న లామినే యమాల్‌కు ఫ్రాన్స్‌పై విజయంతో స్పెయిన్‌ను ఫైనల్ చేర్చి తన సహచరులు అతడికి బర్త్‌డే కానుకగా అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఫిఫా వంటి ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో మెస్సీకి ఎదురుపడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటిది ఈసారి ఫైనల్లో మెస్సీ ఎదురుపడితే ఆ మజానే వేరు. దాని కోసమే ఎదురుచూస్తున్నా. అది జరుగుతుందని ఆశిస్తున్నా' అని కామెంట్ చేశాడు.ఇది విన్న స్పెయిన్ అభిమానులు.. ఎంబాపె అయిపోయాడు.. ఇప్పుడిక మెస్సీ వంతు అని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (22వ నిమిషం), పెడ్రో పొర్రో (58వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఈసారి ఫిఫాలో ఫ్రాన్స్ ఒక్క గోల్ చేయకపోవడం ఇదే తొలిసారి. తాము ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన ఫ్రాన్స్ సెమీస్‌లో స్పెయిన్‌పై మాత్రం గోల్ చేయడంలో విఫలమైంది. 🚨 Lamine Yamal: “Facing Leo Messi in a World Cup final would be fantastic. I hope so!”, told DAZN. pic.twitter.com/xWsAJ2zv9d— Fabrizio Romano (@FabrizioRomano) July 14, 2026LAMINE YAMAL SHOWS OFF HIS DIAMOND CHAIN 💎💸On his birthday, the Spain star arrived at the press conference wearing this dazzling chain ahead of tomorrow’s World Cup semifinal 🔥😱#LamineYamal #Spain #WorldCup2026 #Football #PressConference pic.twitter.com/V12ZXgb87Q— MARCA in English 🇺🇸 (@MARCAinENGLISH) July 13, 2026 -
నార్వే జట్టుకు నీరాజనం
ఓస్లో (నార్వే): ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఓడి ఇంటి బాట పట్టిన నార్వే ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన నార్వే... ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను బోల్తా కొట్టించడంతోపాటు ఈ టోర్నీ మొత్తం నార్వే అద్భుత ప్రదర్శన కనబర్చింది. స్టార్ స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ ఏడు గోల్స్‌తో జట్టును ఒంటిచేత్తో నడిపించగా... మైదానం బయట అభిమానులంతా ‘వైకింగ్ రో’ సంబరాలతో ప్రత్యేకత చాటుకున్నారు.గ్రూప్ ‘ఐ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 6 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధించిన నార్వే జట్టు... ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. రౌండ్–32లో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించిన నార్వే... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్‌ను మట్టికరిపించింది. దీంతో నార్వే పేరు మారుమోగిపోయింది. ఆరున్నర అడుగుల స్ట్రయికర్ ఇర్లింగ్ హాలాండ్ 5 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ సాధించడంతో పాటు... తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన అనంతరం సోమవారం స్వదేశానికి చేరుకున్న టీమ్‌కు... అభిమానులకు అనూహ్య స్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులు విమానాశ్రయానికి చేరుకొని ‘వైకింగ్ రో’ సంబరాలతో హోరెత్తించారు. కనుచూపు మేరంతా అభిమానులతో విమానాశ్రయం జనసంద్రాన్ని తలపించగా... అనంతరం టీమ్ ప్లేయర్లు ఓపెన్ టాప్ బస్సులో ముందుకు సాగారు. దారి పొడవునా అభిమానులు ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలుపుతుండగా... నార్వే యువరాజు హాకాన్ డ్రమ్స్ వాయిస్తూ ‘వైకింగ్ రో’ సంబరాలకు నేతృత్వం వహించడం విశేషం. క్వార్టర్ ఫైనల్లోనూ చక్కటి ఆటతీరు కనబర్చిన నార్వే... అదనపు సమయంలో బెలింగ్‌హామ్ చేసిన గోల్‌తో ఇంగ్లండ్ జట్టు ముందంజ వేసింది. ఏంటీ వైకింగ్... వరల్డ్‌కప్ సమయంలో నార్వే ప్లేయర్లు, అభిమానులు, ప్రజలు ఇలా ప్రతీ ఒక్కరూ ‘వైకింగ్ రో’ సంబరాల్లో భాగస్వాములయ్యారు. ఇంతకూ ఏంటీ ‘వైకింగ్ రో’... ఎందుకు దానికి అంత ప్రత్యేకత అంటే... ఇది ప్రాచీన నౌకాయాన సంస్కృతికి నిదర్శనం. క్రీస్తు శకం 8వ శతాబ్ద కాలంలో సముద్రయానానికి ప్రత్యేకమైన పడవలు వినియోగించేవారు. లాంగ్షిప్స్ అని పిలుచుకునే తేలికపాటి చెక్క పడవలను నడపడంలో నార్వే ప్రజలు అప్పట్లో సిద్ధహస్తులు.సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వైకింగ్ యోధులంతా ఒక లయతో... క్రమశిక్షణతో కలిసికట్టుగా పడవలను ముందుకు నడిపేవారు. ఇది వారి బృంద స్ఫూర్తిని ప్రస్ఫుటించేంది. అయితే ఆధునిక కాలంలో వైకింగ్ పడవలు లేకపోయినా... తమ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తున్న నార్వే ప్రజలు... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్లేయర్ల ‘టీమ్ స్పిరిట్’కు చిహ్నంగా మైదానంలో ‘వైకింగ్ రో’ సంబరాలు ప్రారంభించగా... అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్‌గా మారిపోయింది. -
అర్జెంటీనాను ఆపతరమా!
అట్లాంటా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండో సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టుతో నేడు జరిగే పోరులో మాజీ విజేత ఇంగ్లండ్ తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా జట్టు సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు విజయం సాధించి ఫైనల్లోకి దూసుకొచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు 60 ఏళ్ల క్రితం ఒకే ఒక్కసారి ఫైనల్ చేరుకొని ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. 1966 తర్వాత ఫైనల్ చేరేందుకు ఇంగ్లండ్‌కు రెండుసార్లు అవకాశం వచ్చింది. కానీ ఆ రెండుసార్లు (1990, 2018) ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే వెనుదిరిగింది. ఎనిమిదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టేందుకు ఇంగ్లండ్‌కు మరో చాన్స్ వచ్చింది. ఇంగ్లండ్, అర్జెంటీనా జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో అర్జెంటీనా నెగ్గింది. 5 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు 5 సార్లు పోటీపడ్డాయి. 3 సార్లు ఇంగ్లండ్... 2 సార్లు అర్జెంటీనా నెగ్గాయి. 2002 ప్రపంచకప్ తర్వాత మళ్లీ అర్జెంటీనాతో ఇంగ్లండ్ ‘ఢీ’కొంటోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ 8 గోల్స్ సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ 6 గోల్స్ చొప్పున సాధించి జోరుమీదున్నారు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడని అర్జెంటీనాకు ఇంగ్లండ్ షాక్ ఇస్తుందా... లేక నాలుగోసారి సెమీస్‌లో నిష్క్రమిస్తుందా వేచి చూడాలి. -
సెమీస్‌లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డల్లాస్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో 2-0 తేడాతో పటిష్టమైన ఫ్రాన్స్‌ను స్పెయిన్ మట్టికరిపించింది. ఈ అద్భుత విజయంతో స్పెయిన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫిఫా చర్రితలో స్పెయిన్ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది రెండో సారి.ఒయర్జబాల్ పెనాల్టీ గోల్ఈ మ్యాచ్ 21వ నిమిషంలో స్పెయిన్ టీనేజ్ సంచలనం లామైన్ యమల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నె బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఈ సువర్ణ అవకాశాన్ని స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఒయర్జబాల్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. సెకెండ్ హాఫ్‌లో కూడా "లా రోజా" జట్టు తమ జోరును కొనసాగించింది. 58వ నిమిషంలో పెడ్రో పోర్రో సూపర్ స్ట్రైక్‌తో మరో గోల్ కొట్టి స్పెయిన్ విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో కిలియన్ ఎంబాపె సారథ్యంలోని ఫ్రాన్స్ జట్టు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరుస తప్పిదాల కారణంగా ఫ్రాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్రాన్స్ స్టార్ సెంటర్-బ్యాక్ ఆటగాడు విలియం సాలిబా గాయంతో మైదానాన్ని వీడటం కూడా ఆజట్టును దెబ్బ తీసింది. ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం ఇదే మొదటిసారి. -
ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జూన్ 16న అట్లాంటా వేదికగా రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. అయితే ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో అర్జెంటీనా ప్రత్యేక జెర్సీ కిట్‌తో బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేవీ బ్లూ జెర్సీతోనే అర్జెంటీనా ఫిఫా చరిత్రలో రెండు అద్భుతాలకు నాంది పలికిందిఇంగ్లండ్పై మానసికంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సెమీస్ రోజున అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీని ధరించనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే అర్జెంటీనా ఫిఫా నుంచి అనుమతి కూడా పొందింది. ప్రతీ ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఒక మ్యాచ్‌ను నేవీ బ్లూ జెర్సీతో ఆడడం ఆనవాయితీగా చేసుకుంది. ఈ ఫిఫాలో ఇప్పటికే జోర్డాన్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీతో బరిలోకి దిగారు. Photo Credit: FIFA Twitterఇంగ్లండ్‌తో సెమీస్ సందర్భంగా తమకు రెండోసారి నేవీ బ్లూ జెర్సీ ధరించే అవకాశం ఇవ్వాలని అర్జెంటీనా ఫిఫాను అభ్యర్థించింది. తాజాగా ఫిఫా నుంచి అనుమతి రావడంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీకి లైన్ క్లియర్ అయింది. సెమీస్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు నేవీ బ్లూ జెర్సీ, నల్లరంగు షార్ట్‌ను ధరించనుండగా.. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్‌లో బరిలోకి దిగనుంది.జెర్సీ వెనుక పెద్ద కథే..అర్జెంటీనా ప్రతి ఫిఫాలో నేవీ బ్లూ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడడం వెనుక పెద్ద కథే దాగుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ తలపడ్డాయి. అప్పట్లో ఇద్దరి జెర్సీ రంగు దాదాపు ఒకే విధంగా ఉండడంతో జట్ల మధ్య తేడా ఉండాలని అర్జెంటీనా నేవీ బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోనే మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' తో పాటు 'గోల్ ఆఫ్ ది సెంచరీ' నమోదు చేశాడు.Photo Credit: FIFA Twitterఆ మ్యాచ్‌కు గుర్తుగా తాజా ఫిఫాలో సెమీస్‌లో మరోసారి ఇంగ్లండ్‌తో తలపడుతున్న వేళ అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాలని నిర్ణయించుకుంది. ఇది మానసికంగా ఇంగ్లండ్‌పై తమకు విజయం సాధించినట్లవుతుందని అర్జెంటీనా అభిప్రాయపడుతుంది. 1986 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుసార్లు అర్జెంటీనా, ఇంగ్లండ్‌లు తలపడ్డాయి. ఈ రెండుసార్లు కూడా అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగడం విశేషం. 1998 ఫిఫాలో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-3తో ఇంగ్లండ్‌పై విజయాన్ని అందుకుంది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్‌హమ్ మెరుపులతో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇరుజట్లు నాకౌట్ మ్యాచ్‌లో తలపడనుండడంతో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.Photo Credit: FIFA Twitterహ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్'హ్యాండ్ ఆఫ్ గాడ్' అనేది 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డియెగో మారడోనా ఇంగ్లాండ్‌పై చేసిన వివాదాస్పద గోల్. అతను ఇంగ్లాండ్ గోల్ కీపర్ కంటే ఎత్తున ఎగిరి, బంతిని తన ఎడమ చేతితో గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. రిఫరీలు దీన్ని గమనించకపోవడంతో గోల్ చెల్లుబాటయింది. ఆ తర్వాత మారడోనా కొట్టిన గోల్‌ను హ్యాండ్ ఆఫ్ గాడ్‌గా అభివర్ణించారు.Photo Credit: FIFA Twitterగోల్ ఆఫ్ ది సెంచరీఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమమైన గోల్‌గా పేరొందిన "గోల్ ఆఫ్ ది సెంచరీ"ని 1986 జూన్ 22న అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా సాధించాడు. మెక్సికోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, మారడోనా దాదాపు 60 మీటర్ల దూరం నుంచి ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను దాటుకుంటూ వెళ్లి ఈ అద్భుతమైన గోల్ చేయడం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీనిని గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.చదవండి: చెన్నై వేదికగా తొలి మ్యాచ్.. బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల -
ఫిఫా టీమ్ నుంచి తొలగింపు.. రిఫరీ అనుమానాస్పద మృతి!
ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ మాయలో పడిపోయిన వేళ ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. నెదర్లాండ్స్ రిఫరీ రాబ్ డిపెరింక్ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిజానికి 2026 ఫిఫా ప్రపంచకప్ టీమ్‌లో రాబ్ డిపెరింక్ సభ్యుడిగా ఉండాల్సింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీమ్‌లో రాబ్ విధులు నిర్వర్తించాల్సింది. కానీ అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఫిఫా టీమ్ నుంచి తప్పించారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును క్లోజ్ చేసినప్పటికీ, తాజాగా డచ్ రిఫరీ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనపై అకారణంగా ఆరోపణలు చేశారనే కారణంతో ఆత్యహత్మకు పాల్పడ్డాడా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇక రాబ్ డిపెరింక్ మృతి విషయాన్ని డచ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధికారికంగా ధ్రువీకరించింది. 2017 నుంచి రాబ్ డిపెరింక్ నెదర్లాండ్స్ రిఫరీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2024 యూరో చాంపియన్‌షిప్‌లో రాబ్ వీఏఆర్ బృందంలో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే 2026 ఫిఫా ప్రపంచకప్ రోస్టర్‌లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా పేరును చేర్చడం జరిగింది. ఈలోగా అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రాబ్ డిపెరింక్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబ్‌ను ఫిఫా టీమ్ నుంచి తొలగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తనపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలని, అకారణంగా తనను అరెస్టు చేశారని, ఫలితంగా ఫిఫా 2026లో వీఏఆర్ టీమ్‌లో రిఫరీగా విధులు నిర్వర్తించే సువర్ణావకాశాన్ని కోల్పోయినట్లు తన గోడును వెల్లబోసుకున్నాడు.చదవండి: ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు? -
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీస్.. ఫైనల్ చేరేదెవరు?
ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. 16 ఏళ్ల తర్వాత ఫిఫాలో ఫైనల్ చేరాలని స్పెయిన్ భావిస్తుంటే.. మరోవైపు వరుసగా మూడో ఫిఫాలోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదనిపిస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గతంలో జర్మనీ (1982, 1986, 1990), బ్రెజిల్ (1994, 1998, 2002) జట్ల తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరాయి. తాజాగా వరుసగా మూడోసారి ఫిఫా ఫైనల్ చేరడం ద్వారా మూడో జట్టుగా గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ ఉబలాటపడుతోంది. టైటిల్ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఫ్రాన్స్ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.కెప్టెన్ ఎంబాపె (8 గోల్స్), డెంబెలె (5 గోల్స్), బార్కోలా (2 గోల్స్), డిజైర్ డుయి (1 గోల్) అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమివైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్ మాదిరిగానే స్పెయిన్ ఏ ఒకరిద్దరి ఆటతీరుపైనే ఆధార పడటం లేదు. మికెల్ ఒయర్జబాల్ (4 గోల్స్), మికెల్ మెరీనో (2 గోల్స్), బయేనా (1 గోల్), రూయిజ్ (1 గోల్), పెడ్రో (1 గోల్), లమీన్ యమాల్ (1 గోల్) సమష్టి ప్రదర్శనతో స్పెయిన్ అనూహ్యంగా టైటిల్ రేసులోకి వచ్చింది. Photo Credit: FIFA Twitterముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌పై స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో స్పెయిన్, 13 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ గెలిచాయి. ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో స్పెయిన్‌ను ఓడించింది. చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్ పదవి.. రేసులో ఊహించని పేర్లు! -
భారీ మార్పునకు ఫిఫా ప్లాన్.. భారత్‌కు బిగ్ చాన్స్!
ఫిఫా ప్రపంచకప్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. 48 జట్లు బరిలోకి దిగితే అందులో నుంచి నాలుగు జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. తొలి సెమీస్‌లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇక అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా ప్రపంచకప్ సూపర్ సక్సెస్ అయింది. 2022తో పోలిస్తే ఈసారి ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగింది. ముఖ్యంగా క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే భారత్ లాంటి దేశాల్లోనూ ఈసారి ఫిఫా క్రేజ్ మాములుగా లేదు. కేరళ, బెంగాల్‌కు తోడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఫిఫాకు సంబంధించి ప్రత్యేక హోర్డింగ్‌లు, స్టార్ ఆటగాళ్ల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీల్లో ఒకటిగా నిలిచిన ఫిఫాను మరింత విస్తరించే యోచనలో ఫిఫా సమాఖ్య అడుగులు వేస్తోంది. 2030 ఫిఫా ప్రపంచకప్ నాటికి టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్య 48 నుంచి 64కు పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినోతో ఫిఫా సమాఖ్య బృందం సమావేశమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇలా చేయడం వల్ల ఫుట్‌బాల్‌లో అతిపెద్ద వేదిక అయిన ఫిఫాలో పోటీపడాలనే కల ప్రతీ దేశానికి కలుగుతుందని గియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. ఒకవేళ వచ్చే ప్రపంచకప్ లేదా ఆ తర్వాత జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇది జరిగితే భారత్‌కు అవకాశమెంత ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్ల నుంచి ఫిఫాలో ఆడాలన్న భారత్ కల నెరవేరుతుందా? దీనికి సంబంధించిన అవకాశాలెంత అనేది ఒకసారి పరిశీలిద్దాం.అలా అయితేనే భారత్‌కు చాన్స్!వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి 64 జట్లు పాల్గొంటే ఆసియా ఖండం నుంచి భారత ఫుట్‌బాల్ జట్టుకు అవకాశం ఉంటుందా అంటే చెప్పలేం. అది రాబోయే నాలుగేళ్లలో మన జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ర్యాంకింగ్స్‌లో భారత్ 24వ స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ 2030 ఫిఫా నాటికి 64 జట్లకు అవకాశం కల్పిస్తే ఆసియా ఖండం నుంచి క్వాలిఫై అయ్యే జట్ల సంఖ్య 11 లేదా 12కు పెరగనుంది. ఫిఫా ర్యాంకింగ్స్ ఆధారంగా జపాన్, సౌత్ కొరియా, ఇరాన్, ఆస్ట్రియా, సౌదీ అరేబియాలు నేరుగా టాప్ ఐదు స్థానాలకు అర్హత సాధిస్తాయి. ఖతార్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్, యూఏఈ, జోర్డాన్ జట్లు మిగతా నాలుగు స్థానాలకు పోటీ పడనున్నాయి. ఒకవేళ 11 లేదా 12 జట్లకు అవకాశం కల్పిస్తే భారత్ ఈ స్థానాలకు పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు స్థానాలకు కూడా ఒమన్, బహ్రెయిన్, సిరియా, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఉండనుంది. అది కూడా భారత్ ప్రస్తుతమున్న 24వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంకుకు చేరుకుంటేనే ఫిఫాకు అర్హత సాధించే అవకాశముంటుంది. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్ అర్హతకు ఆసియా ఖండం నుంచి 15 అత్యుత్తమ జట్లకు మాత్రమే క్వాలిఫయింగ్ పోటీలకు అర్హత కల్పించడం జరుగుతుంది. ఈ లెక్కన 2030లో భారత్ ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే వచ్చే నాలుగేళ్లలో మెరుగైన ప్రదర్శనతో టాప్-15లో చోటు దక్కించుకోవాల్సిన అవసరముంది.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో 32 దేశాలు పాల్గొన్నాయి. తాజా ప్రపంచకప్‌లో ఆ సంఖ్యను 48కి పెంచారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే ఫిఫా ప్రపంచకప్ ఖండాంతరాలను దాటి విశ్వవ్యాప్త క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఫిఫా జట్ల సంఖ్యను మరింత పెంచాలనే నిర్ణయానికి రావడం అభినందించాల్సిన అంశం.Read: సీఎస్కే కోచ్ పదవికి స్టీఫెన్ ప్లెమింగ్ గుడ్ బై -
సెమీస్ సమరం.. ఎవరి బలమెంత?
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి గ్రూప్ దశలో 48 జట్లు పాల్గొన్నాయి. రౌండ్ ఆఫ్ 32, ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో వడపోత తర్వాత నాలుగు జట్లు మిగిలాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టగా, 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా వరుసగా మూడోసారి (2018, 2022, 2026) సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇక 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ (2010 విజేత) సెమీస్‌లో అడుగుపెడితే, అటు మాజీ చాంపియన్ ఇంగ్లండ్ కూడా తన దూకుడైన ఆటతీరుతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇప్పటిదాకా తమకు ఎదురైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చిన ఈ నాలుగు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో సెమీస్‌లో తలపడనున్నాయి. గత ఫిఫా ప్రపంచకప్ లాగే ఈసారి ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ పోరును చూస్తామా లేక స్పెయిన్, ఇంగ్లండ్ ఆట చూస్తామా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో సెమీస్‌లో ఎవరితో ఎవరు తలపడనున్నారనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒస్మోన్ డెంబ్లీ, ఫ్రాన్స్ (Phot Credit: FIFA Twitter)జట్ల బలాబలాలు👉ఫ్రాన్స్ తరఫున ఎంబాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి ఫిఫాలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు.👉ఇక స్పెయిన్ తరఫున కెప్టెన్ రొడ్రితో పాటు యామినే లమాల్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ (ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్), గోల్ కీపర్ ఉనైయి సిమోన్లు కూడా తమదైన ఆటతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మైకెల్ ఒయర్జబాల్, స్పెయిన్ (Phot Credit: FIFA Twitter)👉ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీకేన్ ఈసారి ఎలాగైనా ఫిఫా ప్రపంచకప్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తరఫున ఈసారి ఫిఫాలో ఆరు మ్యాచ్‌ల్లో ఆరు గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ చేసి ఆ జట్టు తరఫున గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. హ్యారికేన్కు తోడుగా జూడ్ బెల్లింగ్హమ్ కూడా కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. బెల్లింగ్హమ్ కూడా ఆరు గోల్స్ చేసి హ్యారికేన్తో సమానంగా ఉన్నాడు.👉డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాకు కర్త, కర్మ, క్రియ.. లియోనల్ మెస్సీ. మెస్సీ ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీతో పాటు ఎమిలో మార్టినేజ్, జులియన్ అల్వరెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్‌లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.జూడ్ బెల్లింగ్హమ్, ఇంగ్లండ్ (Phot Credit: FIFA Twitter)తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ఫ్రాన్స్, స్పెయిన్ జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం జులై 15న (బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు) జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. స్పెయిన్‌దే పైచేయి. 38 మ్యాచ్‌ల్లో స్పెయిన్ 18 గెలవగా.. ఫ్రాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు కేవలం ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2016 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్ 3-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది.అలెక్సిస్ మాక్ అలిస్టర్, అర్జెంటీనా (Phot Credit: FIFA Twitter)రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్ఫిఫాలో రెండో సెమీ-ఫైనల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జులై 16 (భారత కాలమాన ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 గంటలు) అట్లాంటా వేదికగా జరగనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడగా.. వీటిలో ఇంగ్లండ్ మూడు, అర్జెంటీనా రెండు గెలిచాయి. 40 ఏళ్ల క్రితం (1986 ఫిఫా) ఇరుజట్ల మధ్య జరిగిన సెమీస్‌లో అర్జెంటీనా పైచేయి సాధించింది.సెమీఫైనల్ షెడ్యూల్:👉తొలి సెమీస్: ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్, బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అర్లింగ్టన్, టెక్సస్👉రెండో సెమీస్: అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లండ్, గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: అట్లాంటాSemi-final match-ups 👀#FIFAWorldCup pic.twitter.com/2WWvIw4E06— FIFA World Cup (@FIFAWorldCup) July 12, 2026చదవండి: శతకంతో ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా యస్తిక భాటియా -
‘అంతా ఫిక్సింగ్.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’
ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ ఫార్వార్డ్ ప్లేయర్ మొస్తాఫా జీకో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయిందని, అర్జెంటీనాను గెలిపించడం కోసమే టోర్నీ నిర్వహిస్తున్నట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు. అర్జెంటీనాతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొన్నాడు.ఇక ప్రిక్వార్టర్స్‌లో ఓటమి అనంతరం ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్‌ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తోందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని జీకో పేర్కొన్నాడు. 😂🏆 The Swiss players looked completely stunned, almost as if they were saying:"Just hand the trophy to Argentina already!" 🤣The reactions on their faces said it all — a mix of disbelief, frustration, and pure shock. Football always delivers these priceless moments! 😅⚽…— KUMAR (@MyCric101) July 13, 2026చదవండి: ‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్! -
అర్జెంటీనా... అదే దూకుడు
కాన్సస్ సిటీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా చేరువైంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన చివరిదైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో ఏడోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (112వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (120+1వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్విట్జర్లాండ్ జట్టుకు డాన్ ఎండోయో (67వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 72వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం స్విట్జర్లాండ్ పదిమంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ టోర్నీలో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్ చేయలేదు. అయితే అలెక్సిస్ తొలి గోల్ చేసేందుకు మెస్సీ సహాయపడ్డాడు. గత మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అర్జెంటీనా ఏమాత్రం ఆందోళన చెందకుండా విజయమే లక్ష్యంగా చివరి క్షణం వరకు పోరాడింది. ఈ పోరాట ఫలితమే అర్జెంటీనా జట్టుకు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసింది. స్విట్జర్లాండ్‌తో పోరులో అర్జెంటీనా 22 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి ఏడుసార్లు గోల్ లక్ష్యంగా షాట్లు కొట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. గతంలో సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు (1930, 1978, 1986, 1990, 2014, 2022) అర్జెంటీనా జట్టు ఫైనల్లోకి ప్రవేశించడంతోపాటు మూడుసార్లు విజేతగానూ నిలిచింది. ఏడోసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. 12 ప్రపంచకప్‌లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి జట్టుగా అర్జెంటీనా రికార్డు నెలకొల్పింది. 72 ఏళ్లుగా ఉరుగ్వే (1930 నుంచి 1954 వరకు; వరుసగా 11 మ్యాచ్‌ల్లో ) పేరిట ఉన్న రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది.4 అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య 1992లో వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక... తొలిసారి ప్రపంచకప్‌లో టాప్–4 జట్లు సెమీఫైనల్ చేరాయి. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ తొలి స్థానంలో, స్పెయిన్ రెండో స్థానంలో, అర్జెంటీనా మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.బెలింగ్‌హమ్ ‘డబుల్’ ధమాకా...నార్వేను ఓడించి సెమీస్‌లోకి ఇంగ్లండ్ మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్‌హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు. 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. -
‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్ రిఫరీకి మెస్సీ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్ రిఫరీ జోవో పిన్హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్‌లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క గోల్ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం గోల్ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్‌తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించింది. ఆట అదనపు సమయంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. “HABLÁ BIEN, NO FALTES EL RESPETO. A MÍ HÁBLAME BIEN”.Lionel #Messi, al árbitro portugués. 🤬🇦🇷 pic.twitter.com/fxMHSPMvLe— treintaytres (@GRUPOTRESTRES) July 12, 2026చదవండి: అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన -
అర్జెంటీనా దిగ్గజం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) భారత కాలమన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్ కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపె ట్టింది. ఆంటోనియో మృతి పట్ల అర్జెంటీనా జట్టు సంఘీభావం ప్రకటించి ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. స్విస్‌తో మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు.రెడ్, యెల్లో కార్డులకు ఆద్యుడు1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జర్మన్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బలవంతంగా మైదానం నుంచి బయటకు పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడకుండా తనకు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిరసనకు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది.దెబ్బకు దిగొచ్చిన ఫిఫాదీంతో మరుసటి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లకు రెఫరీ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేయబడటానికి మార్గం సుగమం అయ్యింది. ఇక రాటిన్ తన కెరీర్‌ను 'బోకా జూనియర్స్' క్లబ్‌కు అంకితం చేశారు, అక్కడ 1956 నుంచి 1970 వరకు 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1962, 1966 ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహించారు.ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆంటోనియో రాటిన్ కోచ్‌గా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. మైదానంలో తన అంకితభావం, దేశం పట్ల గర్వంతో ఆడిన గొప్ప ఆటగాడిగా ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతితో, ఫుట్‌బాల్ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. రాటిన్ క్రీడా ప్రస్థానం, ఆయన చేసిన మార్పులు, ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయనడంలో సందేహం లేదు. 🇦🇷 Argentina wearing black armbands vs Switzerland today Rest in peace, Antonio Rattín The Albiceleste are honouring the Boca Juniors and Argentina legend, who passed away yesterday at 89.Captain of the 1966 World Cup team, his famous sending-off vs England helped inspire… pic.twitter.com/DAbbwUI0qc— Sports Freak (@OfficialSfreak) July 12, 2026 A los 89 años falleció Antonio Rattin símbolo del fútbol argentino y de Boca. Un 5 con garra, capitán de la Selección en el Mundial 66 donde lo expulsaron vs Inglaterra en Wembley y al retirarse estrujo el banderin del corner con la bandera británica. Respetado x rivales. QEPD pic.twitter.com/yQpmU34Aex— Archivo Dany Páez⚪️🔴⚪️ (@DanyPaez1975) July 11, 2026 Falleció Antonio Rattín a los 89 años ⚫👉 Recordamos el día que humilló a los ingleses: estrujó la bandera británica y se sentó en la alfombra real en las semifinales del mundial de 1966 ⚽ pic.twitter.com/w5RHTRyaYX— El Destape (@eldestapeweb) July 11, 2026Read: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్న మెస్సీ తాజాగా స్విట్జర్లాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో గోల్ చేయనప్పటికీ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. అలెక్సిస్ మాక్ అలిస్టర్‌కు 10వ నిమిషంలో పిన్‌పాయింట్ కార్నర్ నుంచి అసిస్ట్ అందించాడు. ఈ నేపథ్యంలో ఫిఫా చరిత్రలో అత్యధిక అసిస్ట్‌లు అందించిన ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అలిస్టర్‌కు అందించిన అసిస్ట్ మెస్సీకి పదోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (8 అసిస్ట్‌లు) రికార్డును బద్దలు కొట్టిన మెస్సీ 10 అసిస్ట్‌లతో తొలి స్థానంలో నిలిచాడు. 1966 ఫిఫా ప్రపంచకప్ నుంచి చూసుకుంటే మారడోనా (1982, 1986, 1990, 1994 ఫిఫా వరల్డ్‌కప్స్) కలిపి 8 అసిస్ట్‌లు సాధించాడు. తాజాగా 32 ఏళ్ల తర్వాత మారడోనా రికార్డును మెస్సీ బద్దలుకొట్టడం విశేషం. మారడోనా 8 అసిస్ట్‌లతో రెండో స్థానంలో, ఇక మూడో స్థానంలో జర్మనీ ప్లేయర్ పియెర్రె లిట్బార్స్కీ, పోలండ్ ప్లేయర్ జార్జ్ లాటో చెరో ఏడు అసిస్ట్‌లతో సంయుక్తంగా ఉన్నారు. ఆరు అసిస్ట్‌లతో డేవిడ్ బెక్‌హమ్ (ఇంగ్లండ్), పీలే (బ్రెజిల్), థామస్ ముల్లర్ (జర్మనీ) నాలుగో స్థానంలో నిలిచారు. ఇక 1962లో వరుసగా రెండోసారి చాంపియన్స్‌గా నిలిచిన బ్రెజిల్ సరసన చేరేందుకు అర్జెంటీనా మరో రెండు అడుగుల దూరంలో ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్‌లో పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్‌ను చిత్తు చేసిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా ట్రోఫీ అందుకుంది. ఇక నాలుగోసారి ఫిఫా టైటిల్‌ను అందుకోవాలనే దృడ సంకల్పంతో ఉంది. జూలై 14న తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్, జూలై 16న రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా తలపడనున్నాయి. జూలై 20న ఫిఫా పైనల్ జరగనుంది.Lionel Messi reaction to Julian Alvarez goal, what a moment 🥹🩵 pic.twitter.com/D977815flQ— MC (@CrewsMat10) July 12, 2026Argentina keep on getting it done 🇦🇷 pic.twitter.com/JHfpxUNlWt— B/R Football (@brfootball) July 12, 2026 -
స్విట్జర్లాండ్ ప్లేయర్ హైడ్రామా.. మరో వివాదంలో అర్జెంటీనా!
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా మరోసారి వివాదంలో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రిఫరీ తప్పుడు నిర్ణయాలతో అర్జెంటీనా విజయాలు సాధిస్తుందని ప్రత్యర్థి జట్లు ఆరోపణలు గుప్పించాయి. తాజాగా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యి మైదానం నుంచి బహిష్కరణకు గురి కావడం అర్జెంటీనాను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. నిజానికి ఇక్కడ స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో నటనను అద్భుతంగా పండించాడు. కానీ డ్రామా పండకపోవడంతో పాటు తప్పిదానికి మూల్యంగా రెడ్‌కార్డ్‌కు గురవ్వడంతో స్విట్జర్లాండ్ 10 మందికే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.ఎంబోలోకు రెడ్‌కార్డ్ ఎందుకంటే?విషయంలోకి వెళితే.. ఆట రెండవ అర్ధభాగంలో స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. ఎంబోలోపై అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పరేడెస్ అనాలోచిత ఫౌల్ చేసిన కారణంగా మొదట అతడికి యెల్లో కార్డ్ చూపించాడు. అయితే, వీఏఆర్ బృందం జోక్యం చేసుకుని, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌కు యెల్లో కార్డు ఇవ్వడం అన్యాయమని, దానిని రద్దు చేయాలని సూచించింది. దీంతో రిఫరీ జోవో పిన్హీరో మైదానం డగౌడ్‌లో ఉన్న మానిటర్‌లోని ఫుటేజీని సమీక్షించారు. ఫుటేజీలో పరేడెస్ ఎలాంటి తప్పిదం చేయలేదని, పరేడెస్ రాకముందే ఎంబోలో కిందపడినట్లుగా నటించినట్లు తేలింది. దీంతో పరేడెస్ యెల్లో కార్డ్ రద్దు చేసిన రిఫరీ ఆ తర్వాత ఎంబోలోకు రెడ్ కార్డ్ చూపించాడు. ఆటలో అంతకముందే ఒక ఫౌల్ చేసిన కారణంగా ఎంబోలో యెల్లో కార్డుకు గురయ్యాడు. తాజాగా తనను కిందపడేశాడంటూ ఆరోపించడం, ఆ తర్వాత ఫుటేజీలో అదంతా నటన అని తేలడంతో ఎంబోలోకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపించాడు. ఈ సమయంలో మైదానంలో ఒక్కసారిగా హైడ్రామా చోటుచేసుకుంది. రిఫరీ నిర్ణయాన్ని తప్పుబ్టటిన స్విస్ జట్టు నిరసనకు దిగింది. అయితే అదే సమయంలో ఎంబోలో తాను తప్పు చేశానని అంగీకరించడంతో, మ్యాచ్ రిఫరీ అనవసరంగా సీన్ చేయొద్దని, మైదానం నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించాడు. దీంతో చేసేదేం లేక ఎంబోలో ఏడుస్తూ మైదానం వీడాడు. ఈసారి ఫిఫా మొదలైనప్పటి నుంచి వీఏఆర్ సమీక్షలపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. IFAB (అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్) ఆట నియమాల ప్రకారం, అనుకరణ అనేది ఖచ్చితంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన ప్రవర్తన వర్గంలోకి వస్తుంది. మ్యాచ్ అధికారులను మోసం చేయడానికి ప్రయత్నించినట్లు రుజువైతే, ఆటగాడికి తప్పనిసరిగా హెచ్చరిక (పసుపు కార్డు) ఇవ్వాలని నియమావళి నిర్దేశిస్తుంది. Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026Read: చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా -
చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్.. సెమీఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై ఘన విజయాన్ని సాధించింది. నిర్ణీత సమయంలో ఒక గోల్ చేసిన అర్జెంటీనా ఆట అదనపు సమయంలో మరో రెండు గోల్స్ చేసి స్విట్జర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషం), జులియన్ అల్వరెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) ఆట అదనపు సమయంలో గోల్ చేశాడు. స్విట్జర్లాండ్ తరఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. ఇక ఆట 72వ నిమిషంలో బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గురయ్యాడు. దీంతో స్విట్జర్లాండ్ 10 మంది ఆటగాళ్లతోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తొలి హాఫ్‌లో ఆట ప్రారంభమైన కాసేపటికే అర్జెంటీనా గోల్ చేసింది. మెస్సీ నుంచి పాస్ అందుకున్న అలిస్టర్ బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగంలో విఫలమైన స్విట్జర్లాండ్ రెండో హాఫ్‌లో మాత్రం ఫుంజుకొని అర్జెంటీనాకు గట్టి పోటీనిచ్చింది.ఈ నేపథ్యంలోనే 67వ నిమిషంలో డాన్ నోయె గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంతో పాటు స్టాపేజీ టైంలోనూ ఇరుజట్లు మరో గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఎక్స్ట్రా టైమ్‌లో అర్జెంటీనా తరఫున జులియన్ అల్వరెజ్ 112వ నిమిషంలో మెరిసి అర్జెంటీనాకు రెండో గోల్ అందించాడు. మరో నాలుగు నిమిషాల్లో ఎక్స్ట్రా టైమ్ ముగుస్తుందనగా, 121వ నిమిషంలో లుటారో మార్టినేజ్ గోల్ చేసి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. 2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అన్నీ కుదిరితే 2022 ఫిఫా ఫైనల్ మరోసారి రిపీటయ్యే అవకాశముంది. 2022 ఫిఫా ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్లో మట్టికరిపించిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా టైటిల్‌ను గెలుచుకుంది. I want this Julian Alvarez in this World Cup 😃🙏🏻pic.twitter.com/IwHW5ORAyL— Messi¹⁰ (@LaPulgaZone) July 11, 2026 Breel Embolo crying after receiving the RED CARD in Argentina vs Switzerland FIFA World Cup Quarterfinal game pic.twitter.com/1vpcl43Xod— Daily Foot Vibes (@dailyfootvibes) July 12, 2026చదవండి: 25 ఏళ్లకే స్టార్ ఫుట్‌బాలర్ కన్నుమూత -
25 ఏళ్లకే సౌతాఫ్రికా స్టార్ ఫుట్‌బాలర్ కన్నుమూత
ప్రపంచం మొత్తం సాకర్ ఫీవర్ (FIFA World Cup 2026)తో ఊగిపోతున్న వేళ ఫుట్‌బాల్ ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో ఫిఫా 2026 క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్, నార్వే ఆట మొదలవుతుందనగా, స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై సౌతాఫ్రికా ఫుట్‌బాల్ ప్లేయర్ జేడన్ ఆడమ్స్ (25) కన్నుమూసినట్లు ప్రత్యక్షమవ్వడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్, నార్వే ఆటగాళ్లు సహా అభిమానులంతా జేడన్ ఆడమ్స్ ఆకస్మిక మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.మౌనం పాటిస్తున్న ఇంగ్లండ్, నార్వే ఆటగాళ్లుసౌతాఫ్రికా మిడ్ ఫీల్డర్ అయిన జేడన్స్ ఆడమ్స్ 25 ఏళ్ల వయసులోనే తనువు చాలించాడు. అతడి ఆకస్మిక మృతి వెనుక కారణాలు ఏంటనేది తెలియదని పోలీసులు వెల్లడించారు. అయితే జేడన్ ఆడమ్స్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్టు కొందరు అనుమానిస్తుంటే, వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు మరికొందరు పేర్కొంటున్నారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో జేడన్ ఆడమ్స్సౌతాఫ్రికా ఫుట్‌బాల్ జట్టులో స్టార్ ఆటగాడిగా పేరు పొందిన జేడన్ ఆడమ్స ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో కూడా జట్టు తరఫున ఆడాడు. సౌతాఫ్రికా గ్రూప్ దశకే పరిమితమైనప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ జేడన్ ఆడమ్స్ ఆడాడు. మెక్సికోతో మ్యాచ్‌కు ముందు తన అమ్మమ్మ మరియానా ఆడమ్స్ మరణించిందన్న వార్తను దిగమింగుకొని బరిలోకి దిగిన జేడన్ ఆడమ్స్ మంచి ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో మెక్సికో 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న సౌతాఫ్రికా.. తమ చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 0-1తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జేడన్ ఆడమ్స్సబ్స్టిట్యూట్గా వచ్చాడు. ఆడమ్స్ మృతి పట్ల ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ ఫాంటినో, దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గాయటన్ మెకెంజీలతో పాటు ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. సౌతాఫ్రికా తరపున 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జేడన్ ఆడమ్స్ రెండు గోల్స్ చేశాడు. This video of Jayden Adams breaks my heart even more. This guy was going through the most 💔💔💔💔. pic.twitter.com/b4ot1fBvLK— Mpho Alex⭐⭐ (@mphoalex11) July 11, 2026 Rest in peace, Jayden Adams, Grootman. 🕊️💔 pic.twitter.com/ERSkw8oCwv— T. (@__T_touch) July 11, 2026A moment of silence was held before Norway and England in honor of South Africa midfielder Jayden Adams who died at the age of 25 ❤️ pic.twitter.com/vlOrxzgSSg— ESPN FC (@ESPNFC) July 11, 2026 Read: టీ20 సిరీస్ ఓటమి.. నంబర్‌వన్ ర్యాంక్ గోవిందా -
ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్ సెమీస్‌కి.. నార్వే ఇంటికి..
మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్‌హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఇక 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు. కాగా 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా క్వార్టర్ ఫైనల్లోనే నిరాశగా వెనుదిరిగింది. -
ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ లో స్పెయిన్
-
ఫిక్సింగ్ ఆరోపణలు.. కప్పు గెలవొద్దనే ఇలాంటి కుట్రలు!
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న క్వార్టర్ ఫైనల్లో మెస్సీ సేన స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. స్విట్జర్లాండ్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాలని అర్జెంటీనా జట్టు భావిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే క్వార్టర్స్‌లో రిఫరీ సానుకూల నిర్ణయాలతో తమను చీట్ చేసి గెలిచిందని ఈజిప్ట్ ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఇది ఫిక్సింగ్ కిందకు వస్తుందని, దీనిపై విచారణ చేపట్టాలని కూడా ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఫిఫాను కోరింది. ఈ నేపథ్యంలోనే అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని తమ జట్టుపై వస్తున్న ఆరోపణలపై తొలిసారి స్పందించాడు. ఇప్పటిదాకా బయటే వినిపించిన ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు ఆటగాళ్ల దాకా కూడా వచ్చాయని తెలిపాడు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ గెలవకూడదనే ఉద్దేశంతోనే కొందరు గిట్టనివాళ్లు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తాము పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు. లియోనల్ స్కలోని మాట్లాడుతూ.. ‘అర్జెంటీనా గెలవకూడదని కోరుకోవడం ఇదేమి కొత్త కాదు. 1986 ఫిఫా ప్రపంచకప్ సమయంలోనూ అర్జెంటీనాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కానీ అప్పటి మారడోనా బృందం ఇలాంటి వాటిని బేఖాతరు చేయకుండా ఒక చాంపియన్ ఆటను ప్రదర్శించి రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఈజిప్ట్ ఆరోపిస్తున్నట్లుగా రెండో అర్ధభాగంలో వాళ్లు కొట్టిన గోల్‌ను రద్దు చేయడానికి ముందే వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) ఫుటేజీని క్లియర్‌గా పరిశీలించారు. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే నిర్దేశించిన నియమాలను మాత్రమే వీఏఆర్ బృందం పాటిస్తోందని' లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. ఇక ఫిఫా 2026లో అర్జెంటీనా చాంపియన్ ఆటతీరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు! -
మొన్న పోర్చుగల్, ఇవాళ బెల్జియం.. చావుదెబ్బ కొట్టాడు
ఫిఫా ప్రపంచకప్ నుంచి బెల్జియం జట్టు నిష్క్రమించింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ జట్టు 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే బెల్జియం ఓటమికి పరోక్ష కారణం ఆ జట్టు గోల్ కీపర్ సెన్నే లామెన్స్ అయితే, ప్రత్యక్ష కారణం మాత్రం స్పెయిన్ సంచలనం మైకెల్ మెరినో.మొన్న పోర్చుగల్‌తో జరిగిన క్వారర్ ఫైనల్ పోరులో స్టాపేజ్ టైం (90+ నిమిషాల్లో) గోల్ కొట్టి మ్యాచ్‌ను లాగేసుకున్న మెరినో.. తాజాగా బెల్జియంతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ బరిలోకి దిగిన మెరినో మరోసారి మెరిసి స్పెయిన్‌కు గోల్ అందించాడు. తన లక్కీ హ్యాండ్‌తో స్పెయిన్‌కు విజయాన్ని కట్టబెట్టి 16 ఏళ్ల తర్వాత సెమీస్ చేర్చాడు.గాయం నుంచి కోలుకొనిఈసారి ఫిఫాలో స్పెయిన్‌కు లక్కీ హ్యాండ్‌గా మారిపోయిన మైకెల్ మెరినో తొలుత ప్రపంచకప్ ఆడతాడా లేదా అన్న అనుమానం ఉండేది. ఈ ఏడాది జనవరిలో అతడి పాదానికి గాయమైంది. స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో రెండు నెలల పాటు పాదాన్ని కింద ఆనించడంలోనూ ఇబ్బంది పడ్డాడు. తన రెగ్యులర్ ఫుట్‌బాల్ క్లబ్ ఆర్సెనల్ తరఫున కూడా బరిలోకి దిగకపోవడంతో ఫిఫా ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్పెయిన్ జట్టులో చోటు సంపాదించుకోవడమే గాక, ఆ జట్టు సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించిన మైకెల్ మెరినో స్పెయిన్ జట్టుకు గోల్డెన్ హ్యాండ్‌గా మారిపోయాడు.ఆ తప్పు చేయకపోయి ఉంటే..70వ నిమిషంలో బెల్జియం రెగ్యులర్ గోల్‌కీపర్ కోర్టోయిస్ గాయపడి గ్రౌండ్ ను వీడాడు. దీంతో ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని యువ గోల్‌కీపర్ సెన్నే లామెన్స్ అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల మధ్య బరిలో దిగాల్సి వచ్చింది. లామెన్స్ చేసిన ఓ చిన్న పొరపాటే చివరకు బెల్జియం పరాజయానికి దారితీసింది. పావ్ కుబార్సి కొట్టిన లాంగ్ షాట్‌ను లామెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. అదే బంతిని మెరెనో గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో స్పెయిన్ జట్టు ఆనందానికి అవధుల్లేకపోయింది. ఆఖరి నిమిషాల్లో స్కోర్ సమం చేయడానికి బెల్జియం తీవ్రంగా ప్రయత్నించింది. జెరెమీ డోకు వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ స్పెయిన్ డిఫెన్స్ ను చేధించలేకపోయారు. అలెక్సిస్ సేల్మేకర్స్ అందించిన చక్కటి క్రాసు రొమేలు లుకాకు సరిగ్గా అందుకోలేకపోవడంతో బెల్జియం ఆశలు అడియాశలయ్యాయి. 🚨🚨Thibaut Courtois: "Senne Lammens is a fantastic goalkeeper with a bright future. This moment will make him STRONGER."pic.twitter.com/9wnru8QUml— 🇵🇸 TP_KATSRK (@TP_Katsrk) July 10, 2026Read: ‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’ -
‘ఎంబాపె కాస్కో.. 2024 సెమీస్‌ను రిపీట్ చేస్తాం’
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్పెయిర్ రెండు గోల్స్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ ఆటగాడు లామినే యమాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 18 ఏళ్ల లామినే యమాల్ ఈ ఫిపాలో పెద్దగా గోల్స్ కొట్టకపోయినప్పటికీ కీలక సమయాల్లో తన సహచరులకు అసిస్ట్‌లు, పాస్‌లు అందిస్తూ స్పెయిన్ విజయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నాడు. ఇక వరుసగా మూడో ఫిఫా ప్రపంచకప్‌లోనూ సెమీస్ చేరి సూపర్ ఫామ్‌లో ఉన్న ఫ్రాన్స్‌ను స్పెయిన్ ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే లామినే యమాల్ ఫ్రాన్స్ జట్టుకు వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. బెల్జియంతో క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత లామినే యమాల్ మాట్లాడాడు. ‘టోర్నీని చాలా ఉత్సాహంగా ప్రారంభించాం. మా ప్రయాణంలో సెమీస్ దశలో అడుగుపెట్టాం. ఫ్రాన్స్ అంటే మాకు భయం లేదు. నిజానికి మేము కాదు వాళ్లే మాకు భయపడతారేమో. ఎందుకంటే 2024 యూరోకప్ సెమీస్‌లో మా చేతిలోనే ఫ్రాన్స్ ఓడిపోయింది. ఆ తర్వాత మేము కప్‌ను కూడా ఎగరేసుకుపోయాం. ఇప్పుడు మళ్లీ 2024 నాటి యూరోకప్ సెమీస్నే రిపీట్ చేయబోతున్నాం. ఒత్తిడి మాకంటే ఫ్రాన్స్‌పైనే ఎక్కువ ఉంటుంది. మేము గెలుస్తామా లేదా అన్న సంగతి పక్కనబెడితే మాత్రం ఈసారి మా మధ్య జరగబోయే మ్యాచ్ మాత్రం ఫిఫా చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచిపోనుంది.’ అని చెప్పుకొచ్చాడు.ఇక యూఈఎఫ్ఏ యూరో 2024 కప్‌లో సెమీస్‌లో స్పెయిన్ 2-1తో ఫ్రాన్స్‌ను ఓడించింది. అప్పటికి 16 ఏళ్ల వయసున్న లామినే యమాల్ లాంగ్ రేంజ్ స్ట్రైక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించడం ఇప్పటికీ రికార్డుగా నిలిచిపోయింది. ఇదే మ్యాచ్‌లో డాని ఓల్మో మరో గోల్ సాధించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-2తో చిత్తు చేసిన స్పెయిన్ యూరో చాంపియన్స్‌గా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌లో జూలై 14న జరగనున్న సెమీఫైనల్లో ఫ్రాన్స్, స్పెయిన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.🚨 𝐎𝐅𝐅𝐈𝐂𝐈𝐀𝐋: 𝐅𝐑𝐀𝐍𝐂𝐄 🇫🇷 𝐕𝐒 🇪🇸 𝐒𝐏𝐀𝐈𝐍 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐒𝐄𝐌𝐈-𝐅𝐈𝐍𝐀𝐋𝐒 𝐎𝐅 𝐓𝐇𝐄 𝟐𝟎𝟐𝟔 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐔𝐏 🍿 pic.twitter.com/Ob8JJatAmd— 433 (@433) July 10, 2026 🚨⭐️ OFFICIAL: Lamine Yamal, FIFA Man of the Match for Spain-Belgium. pic.twitter.com/hbDaRMT6sn— Fabrizio Romano (@FabrizioRomano) July 10, 2026Read: సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్‌గా రికార్డు -
బెల్జియం చిత్తు.. సెమీఫైనల్లో స్పెయిన్
బాస్ ఏంజిలిస్: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున ఫాబియన్ రూయిజ్ (30వ నిమిషంలో), సబ్ స్టిట్యూట్ మికెల్ మదీనో 88వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు. బెల్జియం జట్టుకు చార్లెస్ కెటెలార్ (41వ నిమిషం లో) ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 16 సార్లు బెల్జియం గోల్‌పోస్టుపై దాడి చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చివరిసారి స్పెయిన్ జట్టు 2010లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆ ఏడాదే తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. 1986 ప్రపంచకప్‌లోనూ స్పెయిన్, బెల్జియం జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడగా..పెనాల్టీ షూటౌట్'లో బెల్జియం 5- 4తో స్పెయిన్‌ను ఓడించింది. తాజా విజయంతో స్పెయిన్ 40 ఏళ్ల తర్వాత బెల్జియం చేతిలో ఎదురైన పరాజయానికి లెక్క సరి చేసింది. బుధవారం డాలస్‌లో జరిగే తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టుతో స్పెయిన్ తలపడుతుంది. -
సెమీఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
మయామి: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ తుది అంకానికి చేరువైంది. రెండు సెమీఫైనల్ బెర్త్‌ల కోసం నార్వే జట్టుతో ఇంగ్లండ్; స్విట్జర్లాండ్ జట్టుతో అర్జెంటీనా తలపడనున్నాయి. నార్వే, స్విట్జర్లాండ్ జట్లు ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరుకోలేకపోయాయి. మరోవైపు ఇంగ్లండ్ 1966లో... అర్జెంటీనా 1978లో, 1986లో, 2022లో ప్రపంచకప్ టైటిల్స్ సాధించాయి. ఈ టోర్నీలో నార్వే అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ముఖ్యంగా నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ కళ్లు చెదిరే ఆటతీరుతో అలరిస్తున్నాడు. 4 మ్యాచ్‌ల్లో ఎర్లింగ్ 7 గోల్స్ చేసి నార్వే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెలింగ్‌హమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హ్యారీ కేన్ 6 గోల్స్, బెలింగ్‌హమ్ 4 గోల్స్ సాధించారు. ఇక డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు అజేయంగా నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. అర్జెంటీనాపై స్విట్జర్లాండ్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచి మ్యాచ్‌ను పెనాల్టీ షూటౌట్ వరకు రప్పించ గలిగితే తుది ఫలితం ఎలాగైనా ఉండవచ్చు. -
అరుదైన ఫీట్‌తో ఫిఫా చరిత్రను తిరగరాసిన ఎంబాపె
ఫిపా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె గోల్స్ వర్షం కురిపిస్తున్నాడు. 30 ఏళ్లు కూడా నిండని ఎంబాపె ఈ ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌ల్లో 8 గోల్స్, మూడు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు మరోసారి ఫైనల్లో తలపడితే ఎవరికి గోల్డెన్ బూట్ అందుతుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక 27 ఏళ్ల ఎంబాపెకు ఫిఫా ప్రపంచకప్పుల్లో ఇది 20వ గోల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఎంబాపె ఒక అరుదైన ఫీట్ సాధించి ఫిఫా చరిత్రను తిరగరాశాడు. 30 ఏళ్ల లోపే ఫిఫాలో 20 గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా కైలియన్ ఎంబాపె రికార్డు సృష్టించాడు.ఇక ఫిఫా ప్రపంచకప్పుల్లో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో ఎంబాపె రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ (21 గోల్స్) ఉన్నాడు. మెస్సీ రికార్డును అధిగమించేందుకు ఎంబాపె రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. ఇక మొరాకోతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2-0తో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తొలి అర్ధభాగంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో విఫలమైన ఎంబాపె రెండో అర్ధభాగంలో మాత్రం 60వ నిమిషంలో గోల్‌తో మెరిశాడు. ఈ ఫిఫాలో ఎంబాపెకు ఇది 8వ గోల్ కావడం విశేషం. ఆ తర్వాత 66వ నిమిషంలో డెంబ్లీకి పాస్ అందించి అతడు రెండో గోల్ కొట్టడంలో సహాయపడ్డాడు. 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టు 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఇక వరుసగా మూడోసారి సెమీస్ చేరిన ఫ్రాన్స్ టైటిల్ అందుకునేందుకు రెండు అడుగుల దూరంలో ఉంది. -
సెమీస్ చేరిన ఫ్రాన్స్‌కు భారీ షాక్!?
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0తో చిత్తు చేసి.. ఎనిమిదోసారి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. బోస్టన్ వేదికగా శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపే అదరగొట్టాడు.తొలుత 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను వృథా చేసినప్పటికీ.. 60వ నిమిషంలో ఎంబాపె గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. ఇక 66వ నిమిషంలో డెంబెలె మరో గోల్ గొట్టి మొరాకోకు షాకిచ్చాడు. ఆ తర్వాత మొరాకోను నిలువరించడంలో సఫలమైన ఫ్రాన్స్.. ఈసారి టాప్-4 బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.ఊహించని షాక్ఇదిలా ఉంటే.. గోల్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కిలియన్ ఎంబాపె గాయపడటం కలకలం రేపింది. మ్యాచ్ రెండో అర్ధ భాగం 77వ నిమిషంలో ఎంబాపె మడిమ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో ఫ్రాన్స్ మేనేజర్ డిడెర్ డెచాంప్స్ ఫిలిప్ మటేటాను ఎంబాపే స్థానంలో మైదానంలోకి పంపగా.. ఎంబాపె బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మటేటా మిగిలిన 13 నిమిషాలు మైదానంలో ఉండగా.. ఎంబాపె తిరిగి వెళ్లలేదు.ఊపిరి పీల్చుకో!దీంతో సెమీస్ చేరిన ఆనందంలో ఉన్న ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ తగిలినట్లయింది. అయితే, తన గాయంపై ఎంబాపె స్పందిస్తూ.. అభిమానులకు ఊరట కలిగించే విషయం చెప్పాడు.‘‘నేను బాగానే ఉన్నాను. నా చీలమండకు దెబ్బ తగిలింది. అయితే, ఇప్పుడు అంతా బాగానే ఉంది.నాకంటే కూడా మటేటా ఆఖరి 15 నిమిషాల మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా, సన్నద్ధంగా ఉన్నాడు’’ అని ఎంబాపె చమత్కరించాడు.చదవండి: నేను బాగానే ఆడాను.. కానీ ఏం లాభం? -
వరల్డ్‌కప్ సెమీస్‌కు దూసుకువెళ్లిన ఫ్రాన్స్
బోస్టన్: అంచనాలకు అనుగుణంగా రాణించిన ఫ్రాన్స్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో మొరాకో జట్టును ఓడించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఫ్రాన్స్ తరఫున కెప్టెన్ కిలియన్ ఎంబాపె (60వ నిమిషంలో), డెంబెలె (66వ నిమిషంలో) ఒక్కో గోల్ చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు 26వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె వృథా చేశాడు. ఇక స్పెయిన్, బెల్జియం జట్ల మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో ఫ్రాన్స్ తలపడుతుంది. ఎంబాపె 20వ గోల్ప్రపంచకప్ చరిత్రలో ఎంబాపెకిది 20వ గోల్ కావడం విశేషం. ఇక తొలి అర్ధభాగంలో మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌను అద్భుత ప్రదర్శన కారణంగా ఫ్రాన్స్ ఖాతా తెరువలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలో మొరాకో డిఫెండర్లు తడబడ్డారు. 60వ నిమిషంలో డిజైర్ డుయి అందించిన పాస్‌ను ఎంబాపె లక్ష్యానికి చేర్చగా... ఆరు నిమిషాల తర్వాత ఎంబాపె అందించిన పాస్‌ను డెంబెలె గోల్‌గా మలిచాడు. ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన ఫ్రాన్స్ మరింత జోరు పెంచగా... మొరాకో డీలా పడిపోయింది. కాగా గత ప్రపంచకప్ సెమీఫైనల్లో ఫ్రాన్స్ చేతిలోనే ఓడిన మొరాకో జట్టు ఈసారి క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూసింది. We need to talk about the nonsense FIFA , Referee & VAR did here pic.twitter.com/egdEcGxISu— sᴛᴇᴘʜ (@stephiscodee) July 9, 2026 2022: France 🆚 Morocco#FIFAWorldCup pic.twitter.com/vlzRbKwzr2— FIFA World Cup (@FIFAWorldCup) July 9, 2026 -
స్పెయిన్‌ను ఆపతరమా!
లాస్ ఏంజెలిస్: గత మూడు ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన 2010 విశ్వవిజేత స్పెయిన్ తాజా ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా కొనసాగుతోంది. అంతేకాకుండా క్వార్టర్ ఫైనల్ చేరుకున్న క్రమంలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్ కూడా ఇవ్వని ఒకే ఒక జట్టు స్పెయిన్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు మరో కీలకపోరుకు స్పెయిన్ సిద్ధమైంది. బెల్జియం జట్టుతో క్వార్టర్ ఫైనల్ పోరులో స్పెయిన్ తలపడనుంది. 2010లో ఏకైకసారి ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్... ఆ తర్వాత నిరాశపరిచింది. 2014లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. 2018లో, 2022లో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఈసారి మాత్రం నిలకడగా రాణిస్తూ క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చింది. మికెల్ ఒయర్జబాల్ నాలుగు గోల్స్‌తో స్పెయిన్ తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా... అలెక్స్ బేనా, మికెల్ మెరీనో, పెడ్రో పోరో, లామినె యామల్ ఒక్కో గోల్ చేశారు. వీరందరూ సమష్టిగా రాణించడంపై స్పెయిన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు నాలుగోసారి క్వార్టర్ ఫైనల్ చేరిన బెల్జియం జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. గ్రూప్ దశలో ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న బెల్జియం... నాకౌట్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 3–2తో సెనెగల్ జట్టుపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–1తో అమెరికా జట్టుపై గెలిచింది. లుకాకు, చార్లెస్ కెటెలెర్, యురీ టిలెమాన్స్, ట్రొసార్డ్, కెవిన్ డిబ్రున్, సేల్మికర్స్, హాన్స్ వానాకెన్ బెల్జియం విజయాల్లో కీలకపాత్ర పోషించారు. -
వింబుల్డన్‌లో మారథాన్ గేమ్.. మెస్సీపై జకోవిచ్ జోకులు
వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సెమీఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సెమీస్ చేరేందుకు జకోవిచ్ చెమటోడ్చాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదు గంటల 15 నిమిషాల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో జకోవిచ్ 7-6 (12/10), 3-6, 6-3, 6-7 (4/7), 7-6 (10/4)తో కెనడా స్టార్ ఫెలిక్స్ అలియసిమెపై కష్టపడి గెలిచాడు. ఇక సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సినర్‌ను ఎదుర్కోనున్న జకోవిచ్ క్వార్టర్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మ్యాచ్‌తో పాటే ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా, ఈజిప్ట్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమయింది. ఆ మ్యాచ్ 90 నిమిషాల్లో ముగియగా, జకోవిచ్ మాత్రం తన మ్యాచ్‌ను నెగ్గడానికి ఐదు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న అర్జెంటీనా జట్టుపై, ముఖ్యంగా మెస్సీ ప్రదర్శనపై జకోవిచ్ స్పందించాడు. 'మెస్సీ లాగే నాకు 90 నిమిషాల మ్యాచ్ ఆడడం చాలా బాగుంటుంది. అవకాశమొస్తే మెస్సీతో స్వాప్ చేసుకుని అతడి 90 నిమిషాలు నేను.. నా ఐదు గంటల 15 నిమిషాలు అతడు తీసుకుంటే బాగుండేదేమో' అని నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జకోవిచ్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటూ వింబుల్డన్‌లో 15వ సారి సెమీస్‌లో అడుగుపెట్టి స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో జకోవిచ్ సెమీస్ చేరడం ఇది 55వ సారి కావడం విశేషం. 1974లో కెన్ రోజ్‌వాల్ తర్వాత ఓపెన్ శకంలో 39 లేదా అంతకంటే ఎక్కువ వయసులో వింబుల్డన్ సెమీస్ చేరిన రెండో ఆటగాడిగా జకోవిచ్ నిలిచాడు.39 years old. @DjokerNole things. #Wimbledon pic.twitter.com/W5GMGr6V0r— Wimbledon (@Wimbledon) July 7, 2026 -
‘రిఫరీ చీటింగ్‌తోనే అర్జెంటీనాకు విజయం’
ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్‌లో ఓడినప్పటికీ ఈజిప్ట్ మాత్రం అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. ఒక దశలో 2-0తో ఆధిక్యంలో నిలిచిన ఈజిప్ట్ అర్జెంటీనాను ఓడించినంత పని చేసింది. అయితే చివరి నిమిషాల్లో మూడు గోల్స్ కొట్టిన అర్జెంటీనా విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ జట్టు రిఫరీపై ఫిఫాకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు రిఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారని, అతడిని వెంటనే తొలగించాలని ఫిఫాకు రాసిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది.వీఏఆర్ సమీక్ష తర్వాత గోల్‌ను తిరస్కరించడమే గాక, అర్జెంటీనా విజయానికి దారి తీసిన చివరి గోల్ పెనాల్టీ అప్పీల్‌ను సమీక్షించకపోవడం సహా చాలా నిర్ణయాలు ఈజిప్ట్‌కు వ్యతిరేకంగా రావడంపై ఆ జట్టు శిబిరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈజిప్ట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు హనీ అబో రిడా.. ఫ్రెంచ్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్, మిగిలిన బృందంపై ఫిఫాకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. తప్పుడు నిర్ణయాలతో ఈజిప్ట్ విజయాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కిందకు వస్తుందని తెలిపిన హనీ అబో, విచారణ చేపట్టాలని కోరారు. ఫ్రెంచ్ రిఫరీ బృందాన్ని మిగిలిన టోర్నీ మ్యాచ్‌ల్లో పాల్గొనకుండా తొలగించాలని హనీ అబో ఫిఫాను అభ్యర్థించారు. మ్యాచ్ విషయానికొస్తే.. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక క్వార్టర్ ఫైనల్లో మెస్సీ బృందం జూలై 12న ఉదయం 6.30 గంటలకు స్విట్జర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw— WardaNews (@warda_news1) July 7, 2026#Missi asks Egypt's coach: «What's wrong with you?» pic.twitter.com/yQ6tml5Prw— WardaNews (@warda_news1) July 7, 2026Read: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. గాయంతో కీలక ప్లేయర్ దూరం! -
ఎనిమిది జట్ల సయ్యాట.. ఫిఫా క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదే
ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. ఇక్కడి నుంచి మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. లీగ్ దశలో 48 జట్లు పోటీపడితే అందులో నుంచి 32 జట్లు రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి 16 జట్లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్లో 8 జట్లు (అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, బెల్జియం, ఇంగ్లండ్, మొరాకో, స్విట్జర్లాండ్) అమీతుమీకి సిద్ధమ వుతున్నాయి. ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీ (అర్జెంటీనా)ఈ ఫిఫాలో భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వరకు నిష్క్రమించడం గమనార్హం. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి జట్లు ప్రిక్వార్టర్స్‌లోనే తమ ఆటను ముగించాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్లే వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ 5 మ్యాచ్‌ల్లో 8 గోల్స్, ఒక అసిస్ట్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా ఆ జట్టు యువ సంచలనం కైలియన్ ఎంబాపె 5 మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్‌తో మెస్సీని అనుసరిస్తున్నాడు. ఎర్లింగ్ హాలండ్ (నార్వే), లామినే యమాల్ (స్పెయిన్)అన్నీ కుదిరితే 2022 ఫిఫాలో ఫైనల్లో తలపడిన అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు ఈసారి సెమీస్ లేదా మరోసారి ఫైనల్లో తలపడే అవకాశముంది. మరోవైపు మాజీ చాంపియన్లు స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు బెల్జియం తమ స్థాయి ఆటతీరుతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ఇక ఎవరూ ఊహించని రీతిలో మొరాకో నార్వే, స్విట్జర్లాండ్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అదరగొట్టి క్వార్టర్స్‌లో ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్ దశలో ఏ జట్టు ఎవరితో తలపడనుంది, ఏ సమయానికి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం.లుకాకు (బెల్జియం), హ్యారీకేన్ (ఇంగ్లండ్)క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్:👉ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో, జూలై 10, తెల్లవారుజామున 1.30 గంటలకు, వేదిక: బోస్టన్👉స్పెయిన్ వర్సెస్ బెల్జియం, జూలై 11, అర్ధరాత్రి 12.30 గంటలకు, వేదిక: లాస్ ఏంజెలెస్👉నార్వే వర్సెస్ ఇంగ్లండ్, జూలై 12, తెల్లవారుజామున 2.30 గంటలకు, వేదిక: మియామి స్టేడియం👉అర్జెంటీనా వర్సెస్ స్విట్జర్లాండ్, జూలై 12, ఉదయం 6.30 గంటలకు, వేదిక: కాన్సాస్ సిటీక్వార్టర్ ఫైనల్లో గెలిచిన నాలుగు జట్లు జూలై 15, 16వ తేదీల్లో జరగనున్న సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఇక ప్రతిష్టాత్మక ఫిఫా ఫైనల్ జూలై 19 (ఆదివారం) తెల్లవారుజామున 2.30 గంటలకు జరగనుంది.Read: టీమిండియాకు ఆర్చర్ చురకలు.. ‘వైభవ్‌కు ఇదే నా సవాల్’ -
మెస్సి మ్యాజిక్.. వరుస విజయలతో అర్జెంటీనా జోరు..
-
క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్
ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. 2026 ఎడిషన్ రౌండ్ ఆఫ్ 16లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో గెలిచి, 72 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని వాంకూవర్‌లో జరిగిన ప్రీక్వార్టర్ పోరులో నిర్ణీత 90 నిమిషాలు, అదనపు సమయం ముగిసే వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ 0-0తో సమంగా ముగిసింది. అనంతరం జరిగిన పెనాల్టీ షూటౌట్లో స్విస్ జట్టు నెగ్గి చరిత్ర సృష్టించింది.షూటౌట్లో కొలంబియా తరఫున డేవిన్సన్ సాంచెజ్ కొట్టిన పెనాల్టీ క్రాస్‌బార్‌ను తాకగా, కుచో హెర్నాండెజ్ తీసిన షాట్‌ను స్విస్ గోల్‌కీపర్ గ్రెగర్ కోబెల్ అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరగా రూబిన్ వర్గాస్ విజయవంతంగా పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది.ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ ఒకే టోర్నీలో రెండు నాకౌట్ మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 1954లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు 2014 తర్వాత రెండోసారి క్వార్టర్ ఫైనల్ చేరాలన్న కొలంబియా ఆశలు అడియాశలయ్యాయి. 2018లో ఇంగ్లండ్ చేతిలో పెనాల్టీ షూటౌట్లో ఓడిన కొలంబియా, ఈసారి కూడా అదే విధంగా నిష్క్రమించింది. -
కప్ గెలవకపోయినా... ప్రపంచాన్ని గెలిచాడు
ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డియోర్ అవార్డు... ఐదుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా ‘ఫిఫా’ ఎంపిక... యూరోపియన్ యూనియన్ అత్యుత్తమ ఆటగాడిగా మూడుసార్లు ఘనత... నాలుగుసార్లు యూరోపియన్ యూనియన్ ‘గోల్డెన్షూ’ విజేత... చాంపియన్స్ లీగ్, నేషన్స్ లీగ్, యూరోపియన్ చాంపియన్‌షిప్‌లలో కలిపి ఏకంగా 35 ట్రోఫీ విజయాల్లో సభ్యుడిగా అసాధారణ రికార్డు...ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక గోల్స్...మొత్తంగా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో 1300కు పైగా మ్యాచ్‌లు... దాదాపు 1000 గోల్స్... ఇంతటి అత్యద్భుత కెరీర్ అతని సొంతం!అయితే ఇన్ని సాధించినా ఆ ఒక్కటి మాత్రం అతనికి దక్కలేదు.చివరకు వరల్డ్‌కప్ మాత్రం లేకుండానే క్రిస్టియానో రొనాల్డో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితేనేమి... ప్రపంచకప్ గెలవలేకపోయినా క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఏమాత్రం తగ్గదు. వరల్డ్‌కప్ విజయంలో భాగం కాలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అతని ఆటతో ఉర్రూతలూగిపోయిన మైదానాలు రొనాల్డో స్థాయిని చూపించాయి. ఆటపై అతను వేసిన ముద్ర అభిమానుల మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. – సాక్షి క్రీడా విభాగం ఫుట్‌బాలర్ కాకపోయి ఉంటే నా కొడుకు ఇటుకలు మోసేవాడు, తాపీ మేస్త్రీ పని చేసేవాడు... రొనాల్డో గురించి అతని తల్లి చెప్పిన మాట ఇది. నిజంగానే అతని నేపథ్యం అలాంటిది. పేరుకే సైనికుడు అయిన అతని తండ్రి తాగుబోతుగా మారి.. రొనాల్డో పుట్టే సమయానికే ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత స్థానికంగా ఒక గార్డెన్లో పని చేసినా ఆదాయం చాలా స్వల్పం. దాంతో తల్లి వేర్వేరు ఇళ్లల్లో, హోటల్లలో పని మనిషిగా చేస్తూ ఇంటిని నడపాల్సి వచ్చింది. అప్పటికే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్న తల్లి ఈ పేదరికం కారణంగానే తన నాలుగో గర్భాన్ని తొలగించుకోవాలని చూసింది. అయితే ప్రమాదం అంటూ డాక్టర్లు తిరస్కరించడంతో వెనకడుగు వేసింది. కానీ ఆ పుట్టే నాలుగోవాడు చరిత్ర సృష్టిస్తాడని, ప్రపంచ క్రీడారంగంలోనే శిఖరానికి చేరతాడని ఆమె ఊహించలేదు. మొదటి నుంచీ రొనాల్డోకు చదువు అబ్బలేదు. ఒకసారి స్కూల్లో టీచర్‌పై కుర్చీ కూడా విసరడంతో అతడిని బయటకు పంపించారు. అంతే ఆరో తరగతితోనే చదువు ముగిసిపోయింది. అయితేనేమి ఫుట్‌బాల్‌లో మాత్రం అతను రారాజుగా వెలిగాడు.తాను ప్రాణంగా, పిచ్చిగా ప్రేమించిన ఫుట్‌బాల్‌లో మాత్రం అతను కఠోర శ్రమకు వెనుకాడలేదు. ప్రాణం పెట్టి పట్టుదలగా ఆడటమే రొనాల్డోను చాంపియన్ ప్లేయర్‌గా మార్చింది. అతను బాగా పేరు సంపాదించుకున్న తర్వాత పోర్చుగల్‌లో మ్యాగీలాంటి కంపెనీలు, సూపర్ మార్కెట్లకు అతని తల్లి ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. అయితే రొనాల్డోకు 20 ఏళ్ల వయసులో ఇంకా స్టార్ కాకముందే మద్యం కారణంగా వచ్చిన అనారోగ్యంతో అతని తండ్రి చనిపోయాడు. అసాధారణ ప్రతిభతో... ఏడేళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో ఆట మొదలైంది. ఆ వయసులోనే స్థానిక క్లబ్ ఆండోరిన్హాకు అతను ఆడటం మొదలు పెట్టాడు. అక్కడే అతనిలో అపార ప్రతిభ ఉందని గుర్తించిన కోచ్‌లు ప్రోత్సహించారు. చదువు అబ్బదని తెలిసిన క్షణాన పూర్తి సమయం ఆటకే కేటాయిస్తే అద్భుతాలు సాధ్యమని కోచ్ ఇచ్చిన సలహాతో రొనాల్డో తల్లి ఏకీభవించడంతో అతనికి మరో లోకం లేకుండా పోయింది. ఫుట్‌బాల్, ఫుట్‌బాల్... ఎప్పుడు చూసినా గ్రౌండ్‌లోనే... ఎక్కడైనా అదే ధ్యాస. అప్పటికే బ్రెజిల్ దిగ్గజాలు రొనాల్డో నజారియో, రొనాల్డిన్హోలను అభిమానించడం మొదలు పెట్టిన ఈ కుర్రాడు ఒక్కసారిగా దూసుకుపోయాడు. తన ఆటతో ప్రమోషన్ సాధిస్తూ జూనియర్ ఆటగాడిగా పదేళ్లపాటు మూడు వేర్వేరు క్లబ్‌లకు ఆడి రొనాల్డో తన విలువేంటో చూపించాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో సీనియర్ ఆటగాడిగా తొలిసారి లిస్బన్లో స్పోర్టింగ్ క్లబ్ పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడితో మొదలైన అతడి ప్రస్థానం ఆ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించే స్థాయికి తీసుకెళ్లింది. గత 24 ఏళ్లుగా రొనాల్డో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.అరుదైన వ్యాధిని దాటి... మైదానంలో చిరుతలా ఇప్పుడు దూసుకుపోతున్న రొనాల్డో ఫుట్‌బాల్ ప్రపంచం చిన్నప్పుడే ముగిసిపోయేది. అతను నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకునే అరుదైన వ్యాధి టాకీకార్డియా బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతను బతికిపోయాడు. గుండెకు ప్రత్యేక శస్త్రచికిత్స జరిపిన తర్వాత అతను కోలుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మళ్లీ ఫుట్‌బాల్ మైదానంలోకి వచ్చి తన ఆటను చూపించడం విశేషం. పోర్చుగల్‌ను గెలిపించి...జాతీయ జట్టు తరఫున రొనాల్డో వరల్డ్ కప్ గెలవకపోయినా... ఈ టోర్నీలో అతని ప్రభావం తక్కువగా కనిపించినా.. 23 ఏళ్లుగా పోర్చుగల్ సీనియర్ టీమ్‌కు స్టార్ అట్రాక్షన్ అతడే. ఫలితాలు ఎలా వచ్చినా అతని చుట్టే టీమ్ భ్రమించింది. రొనాల్డోను మినహాయిస్తే మరో ఆటగాడి గురించి ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఆలోచించలేని పరిస్థితి ఉంది. క్లబ్ ఫుట్‌బాల్‌లో చూపిన అద్భుత ప్రదర్శనలు ఇక్కడ పునరావృతం చేయలేదనే విమర్శలు వచ్చినా... సహచరుల అండ లేకుండా ఒంటి కాలితో అతను అందించిన విజయాలు ఎన్నో. అసలు రొనాల్డో వల్లనే పోర్చుగల్ టీమ్ గెలవాలని కోరుకునే అభిమానులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 233 మ్యాచ్‌లలో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను 2016 యూరోలో జట్టును చాంపియన్‌గా నిలిపాడు. రెండుసార్లు అతని సారథ్యంలోనే టీమ్ నేషన్స్ లీగ్ విజేతగా నిలిచింది. 2006 నుంచి 2026 వరకు ఆరు వరల్డ్ కప్‌లు ఆడిన రొనాల్డో 27 మ్యాచ్‌లు ఆడి 11 గోల్స్ కొట్టాడు. 2006లో టీమ్ అత్యుత్తమంగా సెమీఫైనల్ చేరింది.ఈతరం ఆటగాళ్ళలో అర్జెంటీనా స్టార్ మెస్సీతో ఇన్నేళ్లుగా అతడిని పోల్చడం రివాజుగా మారిపోయింది. ఇతర ఘనతలను పక్కన పెడితే 2022లో వరల్డ్ కప్ గెలవడంతో రొనాల్డో కంటే మెస్సీ ఒక మెట్టు పైకి కనిపిస్తున్నా... ప్రజాదరణ, ఆటపరంగా రొనాల్డో ఎవరికంటే తక్కువ కాదు. వ్యక్తిగత ఘనతలు, సాధించిన రికార్డులు, రివార్డులు చూస్తే అతని స్థాయి కూడా శిఖరాన ఉందంటే అతిశయోక్తి లేదు.క్లబ్‌లతో కనకాభిషేకం... 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో రొనాల్డో జత కట్టడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. ఈ క్లబ్‌కు ఆరేళ్లు, ఆ తర్వాత రియల్ మాడ్రిడ్‌తో తొమ్మిదేళ్లు అతని ఆటలో అత్యుత్తమ స్థాయిని చూపించాయి. బంతి డ్రిబ్లింగ్‌తో మొదలు పెడితే ఎదురు లేకుండా గోల్‌పోస్ట్ వరకు దూసుకుపోయే తత్వం, మెరుపు వేగంతో ప్రత్యర్థి డిఫెండర్లను ఏమార్చే వైనం, తనకే సాధ్యమైన అరుదైన విన్యాసాలతో రొనాల్డో ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఐకాన్‌గా మారిపోయాడు. ఈ పదిహేనేళ్లు అతని నామస్మరణతో అసంఖ్యాక ఫ్యాన్స్ ఊగిపోయారు. దాంతో సహజంగానే వాణిజ్యపరంగా అతని విలువ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఆటపరంగా ఒప్పందాల మొత్తం రికార్డులు సృష్టిస్తుండగా, బ్రాండింగ్ పరంగా కూడా అసాధారణ ఆర్జన అతని ఖాతాలో చేరింది. అత్యధిక మొత్తం అందుకున్న ఫుట్‌బాలర్‌గా ఫోర్బ్స్ జాబితాలో ఎప్పుడు చూసినా అతని పేరు కనిపించింది. ఆరేళ్ల క్రితమే కేవలం ఆటతోనే బిలియన్ డాలర్లు సంపాదించిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో గుర్తింపు పొందాడు. సీఆర్ 7 బ్రాండింగ్‌తో అతను ఏ వ్యాపారం మొదలు పెట్టినా కనకవర్షం కురిసింది. రియల్ మాడ్రిడ్‌తో విభేదాలతో ఇటలీలోని యువెంటస్ క్లబ్‌కు చేరినప్పుడు కూడా రికార్డు మొత్తంలో ట్రాన్స్ఫర్ జరిగింది. 100 మిలియన్ యూరోలు చెల్లించి యువెంటస్ సొంతం చేసుకోగా... తొలి రోజు కేవలం ఆ టీమ్‌లో రొనాల్డో జెర్సీ అమ్మకాల ద్వారానే 62.4 మిలియన్ డాలర్లు రావడం అతని స్థాయి ఏమిటో చూపించింది. గోల్ సాధించినప్పుడల్లా అతను తనదైన శైలిలో సుయ్య్య్... అంటూ ప్రదర్శించే ప్రత్యేక విన్యాసం ప్రతీ యువ ఫుట్‌బాల్ మదిలోసిగ్నేచర్గా నిలిచిపోయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా రొనాల్డో అందనంత ఎత్తులో నిలిచాడు. సొంత దేశంలోనైతే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కే అతని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది. ప్రస్థానం ఎప్పటి వరకు...జొహాన్న్క్రఫ్, ఫెరెన్స్ పుస్కాస్, పావోలో మాల్డిని, మైకేల్ ప్లాటిని, ఆల్ఫ్రెడో డి స్టిఫానో, డేవిడ్ బెక్‌హామ్, వేన్ రూనీ, ఒలివార్ కాన్, నెమార్... తమ అద్భుత ఆటతో ఫుట్‌బాల్‌లో ఎన్నో ఘనతలు సాధించినా వరల్డ్ కప్‌ను మాత్రం ముద్దాడని ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఈ జాబితాలో ఇప్పుడు రొనాల్డో కూడా చేరాడు. అతని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. అయితే ఆటలో పదును, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు కూడా అతని జోరు ముందు దిగదుడుపే. చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేసినా... పోర్చుగల్‌కు మున్ముందు కూడా ప్రాతినిధ్యం వహిస్తానని అతను చెబుతున్నాడు. అందుకే అధికారికంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. అయితే జాతీయ జట్టు తక్కువ సంఖ్యలో ఆడే మ్యాచ్‌లు, మార్పు కోరుకునే ఫెడరేషన్ వంటి కారణాలతో పోర్చుగల్ తరఫున మిగిలింది చాలా తక్కువ కెరీరే కావచ్చు. అయితే క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం అతని క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్‌కు అతను ఆడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చి అయినా సరే ఇప్పట్లో అతడిని వదిలేసేందుకు క్లబ్ ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పుకున్నా మరో క్లబ్ కచ్చితంగా ఈ సూపర్ స్టార్ కోసం వేచి చూస్తుందనడంలో సందేహం లేదు. వరల్డ్ కప్‌లో అతని స్థాయికి తగిన మెరుపులు కనిపించకపోయినా ... మరికొంత కాలం రొనాల్డో విన్యాసాలకు లోటు ఉండకపోవచ్చు. 1 వరుసగా ఆరు ప్రపంచకప్‌లలో గోల్ చేసిన ఏకైక ప్లేయర్146 జాతీయ జట్టు తరఫున ప్రపంచంలో అత్యధికగోల్స్ చేసిన ఆటగాడు 233 జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లుఆడిన ఏకైక ప్లేయర్ 4 రొనాల్డో నెగ్గిన క్లబ్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టైటిల్స్. రియల్ మాడ్రిడ్ తరఫున మూడుసార్లు (2015, 2017, 2018), మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరఫున ఒకసారి (2009) రొనాల్డో ఈ ఘనత సాధించాడు.35 కెరీర్లో రొనాల్డో గెలిచిన మొత్తం ట్రోఫీలు100కోట్లు సోషల్ మీడియాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య -
ఆఖరి నిమిషాల్లో మూడు గోల్స్.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు. మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక మెస్సీకి ఈ ఫిఫాలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది 8వ గోల్ కావడం విశేషం. ప్రస్తుతం ఎంబాపెను దాటిన మెస్సీ 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అర్జెంటీనాకు ఈజిప్ట్ చుక్కలుఇక మ్యాచ్‌లో అర్జెంటీనాకు ఈజిప్ట్ ముచ్చెమటలు పట్టించింది. తొలి హాఫ్ ముగిసేసరికి ఈజిప్ట్ ఒక గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ 67వ నిమిషంలో ముస్తాఫా జీకో రెండో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోతుందా? విజయం ఈజిప్ట్దేనా అనే అనుమానాలు రేకెత్తాయి.ఆఖర్లో హైడ్రామా అర్జెంటీనా మ్యాచ్ ఓడిపోతుందా అన్న సమయంలో అసలు డ్రామా మొదలైంది. మరో 15 నిమిషాల్లో ఫుల్‌టైమ్ ముగుస్తుందనగా, అర్జెంటీనా స్ట్రైకర్ క్రిస్టియన్ రొమెరో తొలి గోల్‌తో మెరిశాడు. రైట్ కార్నర్ నుంచి మెస్సీ అందించిన బంతిని బులెట్ హెడర్‌తో క్రిస్టియన్ రొమెరో నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించాడు. ఇక 83వ నిమిషంలో మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి స్కోరును 2-2తో సమం చేశాడు. 90 నిమిషాలు ముగియడంతో ఇంజ్యూరీ టైమ్ మొదలైంది. 90+3వ నిమిషంలో ఈసారి యెంజో ఫెర్నాండేజ్ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడంతో 3-2తో అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఈజిప్ట్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ లాభం లేకపోయింది.🚨 GOAL ARGENTINA!LIONEL MESSI EQUALIZES IN THE 83RD MINUTE! 🇦🇷⚽ pic.twitter.com/U0jkSMkgsT— FIFA World Cup 2026 (@FIFAWC26Updates) July 7, 2026 THIS IS WHAT IT MEANS! 💙🥺pic.twitter.com/tvg4ujENTt— BarçaTimes (@BarcaTimes) July 7, 2026 -
వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’
ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున అదరగొడుతున్న ఎంబాపె.. పరాగ్వేతో మ్యాచ్ అనంతరం ఆ దేశానికి చెందిన మహిళా సెనెటర్ సెలెస్టే అమరిల్లాను ఉద్దేశించి ‘నీచమైన మహిళ’ అని ఉద్దేశిస్తూ ఎంబాపె తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెట్టడం అగ్గిని రాజేసింది. ఎంబాపె తనకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని సెలెస్టే డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఎంబాపె చేసిన వ్యాఖ్యలు జాతి వివక్షపూరితంగా ఉన్నాయని, అతడు క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమని హెచ్చరించడం ఇక్కడ కొసమెరుపు.అసలేం జరిగిందంటే?ఫిఫాలో ప్రిక్వార్టర్స్‌లో ఫ్రాన్స్, పరాగ్వే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఎంబాపే ‘ఎక్స్’లో సెలిస్టే అమరిల్లాను నీచమైన మహిళగా పేర్కొంటూ పోస్ట్ పెట్టాడు. ‘మేడం సెలెస్టీ.. మీరు ఒక నీచమైన మహిళ. సెనేటర్ పదవికి మీరు అనర్హులు. మీరు పరాగ్వే ప్రతినిధులు కారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో పరాగ్వే జట్టు అద్భుత ప్రదర్శనతో మీ నిర్లక్ష్య ధోరణిని, మీరు చూపిన జాతి వివక్షను అందరూ మరిచిపోయారు. మీరు అశక్తులు. దేశ ప్రతినిధిగా మిమ్మల్ని చూపడానికి అనర్హులు. విద్వేషాన్ని, జాతివివక్షను ప్రపంచమంతా వ్యాపింప జేయాలనుకునే ఆమెలాంటి వాళ్లను నేను అనుమతించను’ అని ఎంబాపె సంచలన పోస్టు పెట్టాడు.ఎంబాపె పెట్టిన పోస్ట్ చూసి సెలెస్టీ కోపంతో ఉగిపోయింది. తనను నీచమైన మహిళ అనేందుకు, సెనెటర్ పదవికి అనర్హురాలు అనడానికి ఎంబాపెకు అర్హత లేదని మండిపడ్డారు. ‘సమస్య నీకు, నాకు మధ్య. ఫ్రాన్స్‌ను ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. నేను ఫ్రాన్స్‌లోని స్కూల్లో చదివాను. పదిహేడేళ్లు వచ్చేవరకూ ఇక్కడే చదివా. ఫ్రెంచ్ మాట్లాడుతా. ఫ్రాన్స్ రావడం అంటే నాకు ఇష్టం. నాకు ఫ్రాన్స్‌తో ఏ సమస్యా లేదు. నీతోనే సమస్య. మ్యాచ్ అనంతరం ఎంబాపే తన కోపాన్ని, ధిక్కార స్వభావాన్ని చూపాడు. పరాగ్వే ఆటగాళ్లు, గోల్ కీపర్ పట్ల అతడు ప్రవర్తించిన తీరు నా దేశాన్ని గాయపరిచింది. కాబట్టి ఎంబాపే తన పోస్ట్ పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పాలి. లేదంటే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని సెలెస్టీ పేర్కొంది. గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపెఇక ఫిఫా ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన ఎంబాపె ఏడు గోల్స్, రెండు అసిస్ట్‌లతో గోల్డెన్ బూట్ రేసులో దూసుకుపోతున్నాడు. ఎంబాపెకు పోటీగా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ కూడా ఉన్నాడు. మెస్సీ 4 మ్యాచ్‌ల్లోనే ఏడు గోల్స్ చేయడం విశేషం. నేడు జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా తలపడనున్న నేపథ్యంలో మెస్సీ ఎన్ని గోల్స్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. -
క్రిస్టియానో రొనాల్డో ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. టెక్సస్‌లోని డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లో స్పెయిన్ చేతిలో 1-0తో పోర్చుగల్ ఓటమి చవిచూసింది. ఆఖరి నిమిషంలో స్పెయిన్ తరఫున మైకెల్ మెరినో గోల్ కొట్టడంతో పోర్చుగల్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే 2026 ఫిఫా ప్రపంచకప్ తనకు చివరిదని ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ ఓటమి తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. ఇది తన చివరి వరల్డ్‌కప్ అన్న మాట వాస్తవమేనని, కానీ రిటైర్మెంట్కు ఇంకా సమయం ఉందంటూ ఆసక్తికరంగా పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఓటమితో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడం బాధగా ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. నా వంతు కృషి చేశాననే సంతృప్తితోనే ఉన్నాను. ఇది నా చివరి ప్రపంచ కప్ అన్నది వాస్తవం. కానీ ఇప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేసే ఆలోచన లేదు. ఇక నా కుటుంబంతో కొంత సమయం గడిపి.. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. భావోద్వేగంలో తొందరపడి ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోను. క్రిస్టియానో రొనాల్డోకు ముందు కూడా పోర్చుగల్ ఒక్క టైటిల్ గెలవలేదు. నా కెరీర్లో దేశానికి మూడు టైటిళ్లు అందించా. 2016లో గెలిచిన యూరోపియన్ ఛాంపియన్షిప్ నాకు వరల్డ్ కప్‌తో సమానమైన గొప్ప విజయంగా భావిస్తాను. అలాగే రెండు యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిళ్లు కూడా మా దేశ ఫుట్‌బాల్ చరిత్రలో ప్రత్యేకమైనవే’ అని రొనాల్డో చెప్పుకొచ్చాడు.రొనాల్డో నెట్‌వర్త్ ఎంతంటే?ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో నంబర్‌వన్ స్థానంలో ఉంటాడు. ఈ ఏడాది మే నెలలో విడుదలైన జాబితా ప్రకారం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రీడాకారుడిగా నిలిచాడు. 2026 వరకు చూసుకుంటే అతడి నెట్‌వర్త్ 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 10 వేల నుంచి 13 వేల కోట్ల మధ్య) వరకు ఉండొచ్చు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ రొనాల్డో ఆస్తలు విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. 2025 జూన్‌లో ఒక బిలియన్ మార్క్ దాటిన తొలి ఫుట్‌బాలర్‌గా రొనాల్డో చరిత్రకెక్కాడు.ఆ ఏడాది అల్ నసర్ క్లబ్‌తో ఒప్పందం రొనాల్డో నెట్‌వర్త్ విలువను అమాంతం పెంచేసింది. అల్ నసర్ క్లబ్‌తో రెండేళ్ల కాలానికి గానూ రొనాల్డో చేసుకున్న ఒప్పందం విలువ దాదాపు 400 మిలియన్ డాలర్ల నుంచి 620 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3వేల నుంచి ఆరు వేల కోట్ల మధ్య) మధ్య ఉంటుంది. ఇక క్లబ్ తరఫున ఆడుతూ రొనాల్డో ఏడాదికి వార్షిక వేతనం కింద 200 నుంచి 235 మిలియన్ డాలర్ల (సుమారు 1800 నుంచి 2వేల కోట్ల రూపాయల మధ్య)ను పారితోషికంగా అందుకుంటున్నాడు. 2003లో రొనాల్డో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా మారిన తర్వాత మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జూవెంటస్, అల్నసర్ క్లబ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ దాదాపు 550 మిలియన్ డాలర్లకు పైగా ఉండేది. ఇక నైక్‌తో చాలా ఏళ్ల క్రితమే కుదుర్చుకున్న ఒప్పందంతో ఒక బిలియన్ డాలర్ల విలువను దాటేశాడు. ఇది జీవితకాలం ఒప్పందం కావడంతో అతడు ఆడుతున్నా, ఆడకపోయినా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇక రొనాల్డో బ్రాండ్ హోటల్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, జిమ్ వరకు విస్తరించి ఉంది. రొనాల్డోకు చెందిన హోటళ్లు లిస్బన్, మదీరా, మాడ్రిడ్, న్యూయార్క్, మారకేశ్లలో కోట్లలో ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఎండార్స్మెంట్లలో భాగమైన హెర్బ్లైఫ్, క్లియర్, ఆర్మానీ ప్రొడక్ట్‌ల ద్వారా 50 నుంచి 60 మిలియన్ల డాలర్లు పొందుతున్నాడు. సోషల్ మీడియా ఖాతాలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగా రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచే రొనాల్డో ఏడాదికి 125 నుంచి 175 మిలియన్ డాలర్ల (సుమారు వెయ్యి నుంచి 1600 కోట్ల రూపాయల మధ్య)ను సంపాదిస్తున్నాడు.Cristiano Ronaldo: 🗣️ "I've won three titles with Portugal. Before Cristiano, Portugal hadn't won anything.The biggest title I won with the National Team was Euro 2016. FOR ME, IT HAS THE SAME DIMENSION AS A WORLD CUP." 😳🇵🇹 pic.twitter.com/kqDd3Oo5Qf— World Cup HQ (@WorldCup26HQ) July 6, 2026 -
ప్రపంచకప్ నుంచి అమెరికా నిష్క్రమణ
2026 ఫిఫా ప్రపంచకప్‌లో సహ-ఆతిథ్య దేశమైన అమెరికా ప్రీ క్వార్టర్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. సియాటిల్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాపై ఘన విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.మ్యాచ్ ప్రారంభం నుంచే బెల్జియం ఆధిపత్యం చెలాయించింది. 9వ నిమిషంలో చార్లెస్ డి కెటెలారే గోల్ చేసి బెల్జియంకు తొలి ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత అమెరికా తిరిగి పుంజుకునే ప్రయత్నంలో 31వ నిమిషంలో మాలిక్ టిల్మన్ నేరుగా ఫ్రీ కిక్ ద్వారా అద్భుత గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా ఫ్రీ కిక్‌తో టిల్మన్ గోల్ చేయడం విశేషం.అయితే అమెరికా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కేవలం రెండు నిమిషాలకే బెల్జియం మరో గోల్ చేసి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పరిణామంతో అమెరికా కోచ్ మౌరిసియో పోచెట్టినో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సైడ్‌లైన్ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లను తన్నేశారు.రెండో అర్థభాగంలో కూడా అమెరికా తప్పిదాలు కొనసాగాయి. 57వ నిమిషంలో గోల్‌కీపర్ మ్యాట్ ఫ్రీస్ తన పెనాల్టీ ప్రాంతం బయటకు వచ్చి లాంగ్ బాల్‌ను అందుకునే ప్రయత్నంలో బంతిని కోల్పోవడంతో హాన్స్ వానాకెన్ ఖాళీ గోల్‌లోకి సులభంగా బంతిని పంపించాడు. అదనపు సమయంలో రొమేలు లుకాకు మరో గోల్ చేయడంతో బెల్జియం 4-1తో మ్యాచ్‌ను ముగించింది.ఈ మ్యాచ్‌కు ముందు అమెరికా స్టార్ స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్‌కు గత మ్యాచ్‌లో విధించిన రెడ్ కార్డు సస్పెన్షన్‌ను ఫిఫా నిలిపివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతుంది.ఈ ఓటమితో 2026 ప్రపంచకప్‌కు సహ-ఆతిథ్యం వహించిన మూడు దేశాలు అమెరికా, మెక్సికో, కెనడా టోర్నీ నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. మరోవైపు బెల్జియం క్వార్టర్ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనుంది. -
పోర్చుగల్ కోచ్ సంచలన నిర్ణయం
ఫిఫా వరల్డ్‌కప్ 2026 ప్రీ క్వార్టర్లో పోర్చుగల్ స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం పోర్చుగల్ ప్రధాన కోచ్ రాబర్టో మార్టినెజ్ తన పదవికి రాజీనామా చేశారు. స్పెయిన్‌పై పరాజయంతో తన ఒప్పందం ముగిసిందని, కొత్త కోచ్‌ను ఎంపిక చేసే అవకాశం పోర్చుగీస్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఉందని ఆయన తెలిపారు.మ్యాచ్ అనంతరం మార్టినెజ్ మాట్లాడుతూ.. "నేను పోర్చుగల్‌కు ప్రపంచకప్ గెలిపించాలనే లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయిన తర్వాత పదవిలో కొనసాగడంలో అర్థం లేదు. నా ఒప్పందం ఈరోజుతో ముగుస్తోంది. ఇక కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత సమాఖ్యదే" అని చెప్పారు.అలాగే, "ఇది జాతీయ జట్టుకు కోచ్‌గా నా చివరి మ్యాచ్. పోర్చుగల్ ప్రజలు నన్ను తమలో ఒకరిగా ఆదరించారు. ఈ జట్టుకు కోచ్‌గా పనిచేయడం గర్వకారణం, గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.క్రిస్టియానో రొనాల్డోపై కూడా మార్టినెజ్ ప్రశంసలు కురిపించారు. "రొనాల్డో ఆదర్శప్రాయమైన కెప్టెన్. అతని గోల్స్ మాత్రమే కాదు, అసిస్టులు కూడా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఫుట్‌బాల్ పట్ల అతని అంకితభావం ప్రతి ఆటగాడికి ఆదర్శం. అతని సేవలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి" అని అన్నారు.2023లో పోర్చుగల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మార్టినెజ్‌కు దేశానికి తొలి ప్రపంచకప్ టైటిల్ అందించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ అది నెరవేరలేదు. బ్రూనో ఫెర్నాండెస్, బెర్నార్డో సిల్వా, విటిన్హా, రఫాయెల్ లియావో, క్రిస్టియానో రొనాల్డో వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా, అతడు జట్టుకు తగిన గుర్తింపు తీసుకురాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా రొనాల్డో చుట్టూనే దాడి వ్యూహాన్ని నిర్మించడం మార్టినెజ్ వైఫల్యానికి నిదర్శనమన్నది చాలామంది అభిప్రాయం. తాజాగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పోర్చుగల్ డిఫెన్స్ బాగనే ఉన్నా, బంతిపై ఆధిపత్యం చెలాయించలేక చివరకు మెరినో గోల్‌కు తలవంచాల్సి వచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అదనపు సమయంలో (91వ నిమిషం) మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది. ఈ పరాజయంతో పోర్చుగల్ ప్రపంచకప్ ప్రయాణం ముగియగా, స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ మ్యాచ్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. -
రొనాల్డో కథ ముగిసింది.. ప్రీ క్వార్టర్స్‌లో పోర్చుగల్ ఓటమి
ఫిఫా వరల్డ్‌కప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆ జట్టు స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్ తేడాతో ఓడింది. తద్వారా నాకౌట్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అడ్వాన్స్ అయ్యింది.డల్లాస్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరీహోరీగా పోరాడినా నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అదనపు సమయంలో(91వ నిమిషం) ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన మికెల్ మెరినో కీలక గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఫెరాన్ టొరెస్ అందించిన అద్భుతమైన పాస్‌ను మెరినో సద్వినియోగం చేసుకొని గోల్‌గా మలిచాడు.ఆ గోల్‌తో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా, మిగిలిన సమయంలో పోర్చుగల్ స్కోర్‌ను సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయింది.ఈ విజయంతో స్పెయిన్ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా తన అద్భుతమైన డిఫెన్సివ్ రికార్డును కొనసాగించింది. క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ అమెరికా లేదా బెల్జియంతో తలపడనుంది.రొనాల్డో వరల్డ్‌కప్ ప్రయాణానికి ముగింపుమరోవైపు, ఈ ఓటమితో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ ప్రయాణం కూడా ముగిసినట్లైంది. ప్రస్తుతం రొనాల్డో వయసు 41 సంవత్సరాలు. ఏ లెక్కన చూసుకున్న అతడు మరో ప్రపంచకప్ ఆడలేదు. దీంతో అనధికారికంగా రొనాల్డో వరల్డ్‌కప్ జర్నీ ముగిసిందనుకోవాలి. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రొనాల్డోకు ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. -
పదేళ్ల క్రితమే భారత్‌ను దెబ్బకొట్టిన ఎర్లింగ్ హాలండ్
ఫిఫా ప్రపంచకప్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎర్లింగ్ హాలండ్ పేరే వినిపిస్తోంది. ఐదుసార్లు ఫిఫా చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ను నార్వే రౌండ్ ఆఫ్ 16 (ప్రిక్వార్టర్స్)లోనే నాకౌట్ చేయడం వెనుక ఎర్లింగ్ హాలండ్ కొట్టిన రెండు గోల్స్ ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే 1998లో తొలిసారి నార్వే ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంది.అప్పటి నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫిఫా ప్రపంచకప్‌లు ఆడిన నార్వే ఏనాడు నాకౌట్ దశలో అడుగుపెట్టలేదు. కానీ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్లో బలమైన బ్రెజిల్‌ను ఓడించిన నార్వే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో నార్వే మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. అయితే 1998లో తొలిసారి ఫిఫా ఆడినప్పుడు ఎర్లింగ్ హాలండ్ ఇంకా పుట్టనే లేదు. కట్‌చేస్తే నాలుగోసారి ఫిఫా ఆడుతున్న నార్వే జట్టులో ఎర్లింగ్ హాలండ్ ఒక సూపర్‌స్టార్. అలాంటి ఎర్లింగ్ హాలండ్.. ఒకప్పుడు నార్వే అండర్-17 టీమ్ తరఫున భారత జట్టుతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడం ఇప్పడు వైరల్‌గా మారింది. ఆనాటి మ్యాచ్‌లో నార్వే 2-0తో భారత్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో ఎర్లింగ్ హాలండ్ 57వ నిమిషంలో తొలి గోల్ కొట్టగా, 80వ నిమిషంలో ఎరిక్ బోథీమ్ మరో గోల్ కొట్టాడు. అయితే మొదటి హాఫ్ ముగిసిన తర్వాత భారత ఆటగాడు సంజీవ్ దురుసు ప్రవర్తనతో రెండోసారి యెల్లో కార్డ్‌కు గురవ్వడంతో భారత జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. కాగా ఎర్లింగ్ హాలండ్ గోల్ కొడుతున్న అప్పటి ఫొటో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అయితే 2017 ఫిఫా అండర్-17 ప్రపంచకప్‌కు కేవలం ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అన్ని జట్లు తమ మ్యాచ్‌ల్లో మునిగితేలాయి. అప్పుడు ఎర్లింగ్ హాలండ్ నార్వే అండర్-17 తరఫున, బ్రెజిల్ అండర్-17 తరఫున వినిసియస్ జూనియర్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు తమ జట్ల తరఫున 2026 ఫిఫా ప్రపంచకప్‌లో సోమవారం ప్రత్యర్థులుగా తలపడడం విశేషం. ఎర్లింగ్ హాలాండ్ సారథ్యంలోని నార్వే ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు సన్నద్ధమవుతుంది. మరోవైపు భారత ఫుట్‌బాల్ జట్టు మాత్రం ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫిఫాలోని 211 సభ్య దేశాల్లో భారతదేశం 138వ ర్యాంకులో కొనసాగుతోంది.By the way, I won that ball. Just saying 😉 https://t.co/c6A5pZ7vBy— Suresh Wangjam (@SureshWangjam) June 16, 2022చదవండి: బంగ్లాదేశ్‌పై జింబాబ్వే సంచలన విజయం -
బెల్లింగ్‌హామ్ డబుల్.. క్వార్టర్ ఫైనల్‌కు ఇంగ్లండ్
ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-16లో ఇంగ్లండ్ అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది. సహ ఆతిథ్య దేశమైన మెక్సికోపై 3-2తో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ రెండు నిమిషాల్లో (36, 38) రెండు గోల్స్ చేసి జట్టుకు బలమైన పునాది వేయగా, కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా మరో గోల్ (60) సాధించాడు. రెండో అర్ధభాగంలో జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్‌తో బయటకు వెళ్లినా, ఇంగ్లండ్ పది మంది ఆటగాళ్లతో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంది.రెండు నిమిషాల్లో మ్యాచ్‌ను మార్చేసిన బెల్లింగ్హామ్మెక్సికో అభిమానుల హోరాహోరీ మద్దతు మధ్య ప్రారంభమైన ఈ నాకౌట్ పోరులో తొలి అర్ధభాగం వరకు ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి.36వ నిమిషంలో బెల్లింగ్‌హామ్ తొలి గోల్‌తో ఇంగ్లండ్‌కు ఆధిక్యం అందించాడు. ఆ గోల్‌కు కేవలం 98 సెకన్ల వ్యవధిలోనే మరోసారి గోల్ చేసి స్కోరును 2-0కు చేర్చాడు. అతని వేగవంతమైన డబుల్‌తో మెక్సికో ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది.వెనకడుగు వేయని మెక్సికోరెండు గోల్స్ వెనుకబడినా మెక్సికో ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. 42వ నిమిషంలో జూలియన్ క్విన్యోనెస్ గోల్ చేసి స్కోరును 2-1కు తగ్గించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి మ్యాచ్ మళ్లీ ఆసక్తికరంగా మారింది.కేన్ గోల్.. క్వాన్సా రెడ్ కార్డ్రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. 60వ నిమిషంలో కెప్టెన్ హ్యారీ కేన్ దాన్ని గోల్‌గా మలిచి జట్టుకు 3-1 ఆధిక్యం అందించాడు.అయితే మ్యాచ్ మలుపు తిరిగింది జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్‌తో. ప్రత్యర్థి దాడిని అడ్డుకునే క్రమంలో అతడు నేరుగా రెడ్ కార్డ్ అందుకోవడంతో ఇంగ్లండ్ పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించాల్సి వచ్చింది.చివరి వరకు ఉత్కంఠసంఖ్యా బలాన్ని ఉపయోగించుకుంటూ మెక్సికో వరుస దాడులు చేసింది. రౌల్ జిమెనెజ్ మరో గోల్ చేసి స్కోరును 3-2కు తీసుకువచ్చాడు. చివరి నిమిషాల్లో మెక్సికో సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, ఇంగ్లండ్ రక్షణ ఆటగాళ్లు అసాధారణ పోరాటాన్ని ప్రదిర్శించి మ్యాచ్‌ను కాపాడుకున్నారు.క్వార్టర్ ఫైనల్లో నార్వేతో పోరుఈ విజయంతో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్-16లో బ్రెజిల్‌ను ఓడించిన నార్వేతో త్రీ లయన్స్ తలపడనున్నాయి. హాలాండ్ సారథ్యంలోని నార్వేను ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కఠిన సవాలుగా మారనుంది. -
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు నెయ్మార్ కన్నీటి వీడ్కోలు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం నెయ్మార్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-16లో నార్వే చేతిలో తన జట్టు ఓటమి (1-2) అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ నుంచి తన జట్టు నిష్క్రమించాక తీవ్ర భావోద్వేగానికి లోనైన నెయ్మార్.. "ఎంతో ప్రయత్నించాను.. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది. ఇక్కడే నా ప్రయాణం ప్రారంభమైంది... ఇక్కడే ముగిసింది" అంటూ ఆటకు వీడ్కోలు ప్రకటించాడు.16 ఏళ్ల ప్రయాణానికి ముగింపు34 ఏళ్ల నెయ్మార్ 2010లో అమెరికాతో జరిగిన మ్యాచ్ ద్వారా బ్రెజిల్ సీనియర్ జట్టులో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ కూడా న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలోనే జరిగింది. అదే వేదికపై నెయ్మార్ 16 సంవత్సరాల తర్వాత తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి జాతీయ జట్టుకు వీడ్కోలు పలకడం విశేషం.కల చెదిరిందిబ్రెజిల్ ఆరో ప్రపంచకప్ టైటిల్ సాధిస్తుందనే భారీ అంచనాల మధ్య నాకౌట్ దశలోకి అడుగుపెట్టింది. అయితే నార్వే సంచలన ప్రదర్శనతో బ్రెజిల్ ఆశలను ఆవిరి చేసింది.ఈ మ్యాచ్‌లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్ చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. స్టాపేజ్ టైమ్‌లో నెయ్మార్ పెనాల్టీ ద్వారా బ్రెజిల్‌కు ఏకైక గోల్ అందించినప్పటికీ, అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది.గాయాలు వెంటాడినా జట్టును ముందుండి నడిపించాడుగత కొన్ని సంవత్సరాలుగా నెయ్మార్ గాయాల కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయినప్పటికీ 2026 ప్రపంచకప్‌ను గెలవాలనే లక్ష్యంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదే తనకు ప్రపంచకప్ గెలిచే చివరి అవకాశం అని భావించిన నెయ్‌మార్‌కు ఈ ఓటమి మరింత బాధ కలిగించింది.బ్రెజిల్ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్రనెయ్మార్ డ సిల్వ శాంటోస్ జూనియర్ అలియాస్ నెయ్మార్ జూనియర్ బ్రెజిల్ ఫుట్‌బాల్‌పై చెరగని ముద్ర వేశాడు. ఆ దేశం తరఫున అతడు అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. నెయ్మార్ బ్రెజిల్ తరఫున 129 మ్యాచ్‌లు ఆడి 80 గోల్స్ నమోదు చేశాడు. అధికారిక గణాంకాల ప్రకారం నెయ్మార్ ఆ దేశ దిగ్గజం పీలేను కూడా అధిగమించాడు.నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించిన నెయ్మార్, ప్రతి తరం జట్టుకు ప్రధాన ఆశాకిరణంగా నిలిచాడు. అయితే ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అతనికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.ప్రపంచకప్ లేకపోయినా ఘనమైన కెరీర్నెయ్మార్ ప్రపంచకప్ ట్రోఫీ సాధించలేకపోయినా బ్రెజిల్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2013 కాన్ఫెడరేషన్స్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, 2016 రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌కు చారిత్రాత్మక తొలి ఒలింపిక్ స్వర్ణ పతకం అందించాడు. -
బ్రెజిల్‌కు గుండెకోత.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
ఆరో సారి ఫిఫా వరల్డ్‌కప్ గెలవాలనుకున్న మాజీ ఛాంపియన్ బ్రెజిల్ ఆశలు అడియాశలయ్యాయి. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ బ్రెజిల్ ఆశలను అడియాశలు చేశాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌పై నార్వే 2-0 గోల్స్ తేడాతో గెలుపొంది, తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ దెబ్బతో బ్రెజిల్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో నార్వే ఇంగ్లండ్ లేదా మెక్సికోతో తలపడుతుంది. ఒంటికాలితో తన్నేశాడు..!బ్రెజిల్ ప్రపంచకప్ కలను హాలాండ్ ఒంటికాలితో తన్నేశాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో (80, 90) లభించిన రెండు అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ నమోదు చేశాడు. దీంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రక విజయం సాధించింది. బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ కల చెదిరిపోయింది.ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ అటాకింగ్ కంటే డిఫెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు నార్వే దూకుడుగా ఆడి బ్రెజిల్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ జట్టు తరఫున హాలాండ్, మార్టిన్ ఓడెగార్డ్, పాట్రిక్ బెర్గ్, ఆండ్రియాస్ షెల్డెరప్ అద్భుతంగా ఆడారు. వరుసగా ప్రమాదకర దాడులు చేశారు.78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా, బ్రెజిల్ కేవలం 203 పాస్‌లతోనే సరిపెట్టుకోవడం మ్యాచ్‌పై నార్వే ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.బ్రెజిల్‌కు సైతం అవకాశాలు వచ్చినా..!బ్రెజిల్‌కు సైతం మ్యాచ్‌లో పలు కీలక అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. బ్రునో గిమరాయెస్ కొట్టిన పెనాల్టీని గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లి ప్రయత్నాన్ని కూడా నైలాండ్ నిలువరించాడు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎండ్రిక్‌కు వినీషియస్ జూనియర్ అందించిన చక్కని అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చలేకపోయాడు. 68వ నిమిషంలో స్టార్ స్ట్రైకర్ నెయ్మార్ బరిలోకి దిగినా దాడుల్లో పెద్ద మార్పు రాలేదు. స్టాపేజ్ టైమ్‌లో (90+10) నెయ్మార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.80 నిమిషాలు నిశ్శబ్దం... చివరి 10 నిమిషాల్లో తుఫాన్దాదాపు 80 నిమిషాల పాటు బ్రెజిల్ డిఫెండర్లు హాలాండ్‌ను సమర్థంగా కట్టడి చేశారు. కానీ 80వ నిమిషంలో షెల్డెరప్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను హాలాండ్ హెడర్‌తో గోల్‌గా మలిచి నార్వేకు ఆధిక్యం అందించాడు. 90వ నిమిషంలో బ్రెజిల్ మొత్తం ముందుకు రావడంతో ఏర్పడిన ఖాళీలను చాకచక్యంగా ఉపయోగించుకున్న హాలాండ్, బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన బుల్లెట్ షాట్‌ను గోల్‌గా మార్చి మ్యాచ్‌ను పూర్తిగా నార్వే వైపు తిప్పేశాడు.నెయ్మార్ కన్నీళ్లు.. హాలాండ్ ఆనందభాష్పాలుఫైనల్ విజిల్ అనంతరం నెయ్మార్ మైదానంలోనే నిలబడి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది అతని చివరి ప్రపంచకప్ మ్యాచ్ కావచ్చన్న నేపథ్యంలో ఆ దృశ్యం అభిమానులను కదిలించింది. మరోవైపు చారిత్రక విజయంతో హాలాండ్ మైదానంలోనే కుప్పకూలి ఆనందభాష్పాలు పెట్టుకున్నాడు. నార్వే అభిమానులు స్టేడియంలో చాలా సేపు సంబరాలు కొనసాగించారు. -
ఫ్రాన్స్‌దే పైచేయి
ఫిలడెల్ఫియా: మూడోసారి ప్రపంచ కప్ టైటిల్ సాధించాలని ఆశిస్తున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు ఆ దిశగా మరో అడుగు వేసింది. పరాగ్వే జట్టుతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 1–0తో గెలిచి ఈ మెగా ఈవెంట్లో పదోసారి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మ్యాచ్ 70వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ ఎంబాపె గోల్‌గా మలిచి ఫ్రాన్స్ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టుతో ఫ్రాన్స్ తలపడుతుంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో మొరాకో జట్టును ఓడించే ఫ్రాన్స్ ఫైనల్‌కు చేరింది. 1998, 2018 ప్రపంచకప్‌లలో టైటిల్ గెలిచిన ఫ్రాన్స్ 2022లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లో ఐదోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఆడిన పరాగ్వే జట్టు... ఫ్రాన్స్ జట్టును ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా చివరకు ఓటమితో సరిపెట్టుకుంది. నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టుపై ‘పెనాల్టీ షూటౌట్’లో సంచలన విజయం నమోదు చేసిన పరాగ్వే జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం అత్యంత మొరటుగా ఆడింది. ఫ్రాన్స్ జట్టు స్టార్ ప్లేయర్లు ఎంబాపె, డెంబెలె, డిజైర్ డుయి, అడ్రియన్ రబియోట్, మనూ కోన్లను ఎక్కడ పడితే అక్కడ నిలువరించేందుకు పరాగ్వే ఆటగాళ్లు ప్రయత్నించారు. ఫ్రాన్స్ ఆటగాళ్లతో వాగ్వాదం చేయడం... జెర్సీలు పట్టి లాగడం... మోచేతులతో ఢీకొట్టడం... కాళ్లలో కాళ్లు పెట్టి అడ్డగించడం... చేశారు. పరాగ్వే ఆటగాళ్ల మొరటు ఆటతీరుపై రిఫరీ ఇల్గిజ్ తంతాòÙవ్ (ఉజ్బెకిస్తాన్) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందర్నీ నివ్వెరపరిచింది. మ్యాచ్ మొత్తంలో పరాగ్వే ఆటగాళ్లను కనీసం ఒక్కయెల్లో కార్డుతో కూడా రిఫరీ హెచ్చరించకపోగా.. ముగ్గురు ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఆయన యెల్లో కార్డులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. తొలి అర్ధభాగంలో ఒక్కసారి కూడా పరాగ్వే గోల్‌పోస్ట్‌పై షాట్ కొట్టని ఫ్రాన్స్... రెండో అర్ధభాగంలో జోరు పెంచింది. వారి ప్రయత్నం 70వ నిమిషంలో ఫలించింది. ‘డి’ ఏరియాలో ఫ్రాన్స్ ఫార్వర్డ్ డిజైర్ డుయిని పరాగ్వే డిఫెండర్ గోమెజ్ కింద పడేశాడు. వీడియో రీప్లే పరిశీలించాక రిఫరీ ఫ్రాన్స్ జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశారు. ఎంబాపె దీనిని గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో ఎంబాపె కిది ఏడో గోల్కాగా... ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 19వ గోల్ కావడం విశేషం. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు రెండో గోల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో గిల్ అడ్డుగోడలా నిలబడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంబాపెతో కరచాలనం చేసేందుకు పరాగ్వే గోల్‌కీపర్ ఒర్లాండో వెళ్లగా ఫ్రాన్స్ కెప్టెన్ స్పందించలేదు. దాంతో ఒర్లాండో తన చేతిలో ఉన్న బంతిని ఎంబాపె వీపు పైకి విసిరేసి తన అసహనాన్ని ప్రదర్శించాడు. -
ఎంబపే జోరు.. క్వార్టర్ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో, ఫ్రాన్స్ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. తొలి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో సహా ఆతిథ్య జట్టు కెనడాపై మొరాకో.. పరాగ్వేపై ఫ్రాన్స్ గెలుపొందాయి. మొరాకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో గెలుపొందగా.. ఫ్రాన్స్ పరాగ్వేను 1-0 గోల్స్‌తో చిత్తు చేసింది.చరిత్ర సృష్టించిన మొరాకోకెనడాపై గెలుపుతో మొరాకో చరిత్ర సృష్టించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో క్వార్టర్స్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా రికార్డు నెలకొల్పింది. మొరాకో ఈ ఘనత సాధించడానికి అజెద్దీన్ ఔనాహీ (Azzedine Ounahi) తోడ్పడ్డాడు. ఈ మ్యాచ్‌లో అజెద్దీన్ రెండు గోల్స్‌తో మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు. అదనపు సమయంలో సూఫియాన్ రహిమీ (Soufiane Rahimi) మరో గోల్ చేసి మొరాకోను క్వార్టర్స్‌కు చేర్చాడు.ఎంబపే జోరుప్రస్తుత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబపే జోరు కొనసాగుతోంది. వరుసగా అతడు మరో మ్యాచ్‌లో గోల్ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ గోల్‌తో అతడు మెస్సీతో సమానంగా 7 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు. పరాగ్వేతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఎంబపే 70వ నిమిషంలో పెనాల్టీ ద్వారా గోల్ చేసి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించాడు.క్వార్టర్స్‌లో ఫ్రాన్స్-మొరాకో పోరుఈ విజయాల తర్వాత జూలై 9న బోస్టన్‌లో జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, మొరాకో తలపడనున్నాయి. -
అర్జెంటీనా 'అదరహో'...
మయమీ: మూడు సార్లు ప్రపంచ కప్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఒక వైపు...తొలిసారి వరల్డ్ కప్‌లో ఆడుతున్న పసికూన మరో వైపు...ఫలితం ఎలా ఉంటుందో అందరూ అంచనా వేసుకోవచ్చు. కానీ ఆ దిగ్గజం ముందు ఈ కొత్త టీమ్ అంత సులువుగా తలొగ్గలేదు. ఓడినా అసాధారణ ఆటతో చివరి వరకు పోరాడింది. కాస్త అదృష్టం కలిసిరాక చివరకు నిరాశతో నిష్క్రమించాల్సి వచ్చింది. దిగ్గజం లయోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా గెలుపు కోసం 120 నిమిషాల పాటు ప్రతీ సెకన్ చెమటోడ్చాల్సి వచ్చింది. ఎన్నో గోల్ ప్రయత్నాలు విఫలం కాగా, చివరకు చచ్చీచెడి పైచేయి సాధించింది. అర్జెంటీనా, కొత్త జట్టు కేప్ వెర్డే మధ్య జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ గురించి సంక్షిప్త వివరణ ఇది. శనివారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2 గోల్స్ తేడాతో కేప్ వెర్డేను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అర్జెంటీనా తరఫున లయోనల్ మెస్సీ (29వ నిమిషం), లిజాండ్రో మార్టినెజ్ (92వ ని.) గోల్స్ కొట్టగా... కేప్ వెర్డె ఆటగాళ్లలో డెరాయ్ డ్యుయార్టె (59వ ని.), సిడ్నీ లోపెజ్ కాబ్రాల్ (103వ ని.) చెరో గోల్ కొట్టారు.అయితే 111వ నిమిషంలో కేప్ వెర్డె ఆటగాడు డైనీ బోర్జెస్ చేసిన సెల్ఫ్ గోల్‌తో అర్జెంటీనా గట్టెక్కగా, కేప్ వెర్డె దురదృష్టవశాత్తూ పరాజయం పాలైంది. చాలా సమయం పాటు గోల్ కీపర్ వోజిన్హాను దాటడం అర్జెంటీనా వల్ల కాలేదు. మొత్తంగా మ్యాచ్‌లో అతను 10 గోల్స్‌ను నిలువరించగా... వాటిలో ఐదు మెస్సీ కొట్టినవే కావడం విశేషం. సుమారు ఐదు లక్షల జనాభా ఉన్న కేప్ వెర్డె తొలి సారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంతో పాటు నాకౌట్‌కు చేరి సగర్వంగా టోర్నీని ముగించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈజిప్‌్టతో అర్జెంటీనా తలపడుతుంది. ఆద్యంతం అద్భుతంగా... అర్జెంటీనా స్థాయిని బట్టి చూస్తే ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్ కేప్ వెర్డె అద్భుత ప్రదర్శనతో హోరాహోరీగా జరిగింది. అర్జెంటీనా దూకుడు కనబర్చిన ప్రతీసారి కేప్ వెర్డె అంతే దీటుగా ఎదురుదాడి చేసింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లనూ డ్రాగా ముగించి ఓటమి లేకుండా ముందంజ వేసిన వెర్డె నాకౌట్ పోరులోనూ సత్తా చాటింది. ఎట్టకేలకు 29వ నిమిషంలో అర్జెంటీనా బోణీ చేసింది. లిజాండ్రో మార్టినెజ్ ఇచ్చిన లాఫ్టెడ్ పాస్‌ను అందుకున్న మెస్సీ పూర్తి నియంత్రణతో దూసుకుపోయి తొలి గోల్ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీకిది 7వ గోల్ కావడం విశేషం. అయితే రెండో అర్ధభాగం మొదలు కాగానే కేప్ వెర్డె దూకుడు పెంచింది. దాని ఫలితం తొమ్మిది నిమిషాల్లోనే వచ్చింది. డ్యుయార్టెను నిలువరించడం అర్జెంటీనా కీపర్ మార్టినెజ్ వల్ల కాలేదు. 73వ నిమిషంలో ఫ్రీ కిక్ లభించగా మెస్సీ కొట్టిన షాట్‌ను వెర్డె కీపర్ వోజిన్హా అద్భుతంగా అడ్డుకున్నాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలవడంతో మ్యాచ్ అదనపు సమయంలోకి వెళ్లింది. ఆట ఆరంభమైన రెండు నిమిషాలకే డిఫెండర్లంతా ఒక వైపు ఉండిపోగా, లిజాండ్రో చాకచక్యంగా బంతిని అందుకొని సునాయాసంగా పోస్ట్‌లోకి కొట్టాడు. అయితే ఆ తర్వాత కేప్ వెర్డె తగిన జవాబిచ్చింది. ‘గోల్ ఆఫ్ ద టోర్నమెంట్’ అనదగ్గ రీతిలో కాబ్రాల్ స్కోరు చేయడం విశేషం. పెనాల్టీ బాక్స్ చివర్లో కుడి వైపు కార్నర్‌కు అతను కొట్టిన గోల్‌తో అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆట చివరకు వస్తుండగా అర్జెంటీనా పోరాడుతున్నా... కేప్ వెర్డె పట్టు వదల్లేదు. అయితే ఆ జట్టును అనూహ్యంగా దురదృష్టం వెంటాడింది. మెస్సీ కిక్‌ను క్రిస్టియాన్ రొమెరో హెడర్‌తో నియంత్రించే ప్రయత్నం చేయగా... వెర్డె ఆటగాడు బోర్జెస్ చేతికి తగిలిన బంతి పోస్ట్‌లోకి పడింది. ఆ తర్వాత జట్టు ఎంత ప్రయత్నించినా స్కోరును సమం చేయలేకపోయింది.క్వార్టర్ ఫైనల్లో మొరాకో హూస్టన్: ఆఫ్రికా జట్టు మొరాకో వరల్డ్ కప్‌లో వరుసగా రెండో సారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 2022 టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన టీమ్ ఈ సారి కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మొరాకో 3–0 గోల్స్ తేడాతో సహ ఆతిథ్య జట్టు కెనడాపై విజయం సాధించింది. మొరాకో తరఫున అజ్దిన్ ఒనాహీ (50వ నిమిషం, 82వ నిమిషం) రెండు గోల్స్ కొట్టగా... సూఫియాన్ రహీమి (90+8వ నిమిషం) ఒక గోల్ సాధించాడు. కెనడా తొమ్మిది సార్లు గోల్ అవకాశాలు సృష్టించుకున్నా... మొరాకో గోల్ కీపర్ యాసీన్ బోనో వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కొలంబియా లీగ్ దశలో అజేయంగా నిలిచి గ్రూప్‌లో అగ్రస్థానంతో ముందంజ వేసిన కొలంబియా నాకౌట్ మ్యాచ్‌లోనూ అదే జోరున కొనసాగించింది. శనివారం మ్యాచ్‌లో కొలంబియా 1–0 గోల్ తేడాతో ఘనా జట్టును ఓడించింది. కొలంబియా తరఫున జాన్ అరియాస్ (14వ నిమిషం) ఏకైక గోల్ సాధించాడు. ఆ తర్వాత ఇరు జట్లు పలు ప్రయత్నాలు చేసినా మరో గోల్ నమోదు కాలేదు. ఘనా గోల్ కీపర్ లారెన్స్ జిగి ప్రత్యర్థి ఎనిమిది గోల్ ప్రయత్నాలను సమర్థంగా నిలువరించడం విశేషం. 56వ నిమిషంలో కొలంబియా ఆటగాడు లూయీస్ డియాజ్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి కొట్టినా రిఫరీ దానిని ‘ఆఫ్‌సైడ్’గా తీర్మానించి గోల్ ఇవ్వలేదు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను కొలంబియా ఎదుర్కొంటుంది. ‘షూటౌట్’లో ఈజిప్ట్ ముందంజ...ఖతర్‌లో జరిగిన గత ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈజిప్ట్ ఈ సారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. నాకౌట్ మ్యాచ్‌లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్లో 4–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఈజిప్ట్ తరఫున ఇమామ్ అషూర్ (13వ నిమిషం) గోల్ సాధించాడు. ఆ తర్వాత ఈజిప్ట్ ఆటగాడు మొహమ్మద్ హనీ (55వ ని.) అనూహ్యంగా ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణీత సమయం తర్వాత అదనపు సమయంలో కూడా పరస్థితి మారలేదు. దాంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్, రామీ రాబియా, మొహమ్మద్ సలా, హొసామ్ అబ్దెల్ గోల్ చేయగా... ఆ్రస్టేలియా ఆటగాళ్లలో జాక్సన్ ఇర్విన్, అవేర్ మాబిల్ మాత్రమే సఫలమయ్యారు. ప్రపంచ కప్‌లో మూడు సార్లు నాకౌట్ మ్యాచ్ ఆడిన ఆ్రస్టేలియా ప్రతీ సారి ఓటమిపాలైంది. -
హోరాహోరీ పోరులో ఆర్జెంటినా గెలుపు
-
మెస్సీ మరో చరిత్ర
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మరో చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా కేప్ వెర్డేతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా.. వరుసగా 8 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా మెస్సీకి ఇది 20వ ఫిఫా వరల్డ్ కప్ గోల్. ఈ గోల్‌తో అతడు ఫిఫా ప్రపంచకప్ లీడింగ్ గోల్ స్కోరర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ గోల్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ అవకాశాలను కూడా మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ గోల్ ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్‌లో మెస్సీకి 7వది. గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబపే 6 గోల్స్‌తో మెస్సీ వెనువెంటనే ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో కేప్ వెర్డేపై గెలుపొంది, రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే ఓడినా, వీరోచితంగా పోరాడి అందరి మనసులు గెలుచుకుంది. చివరి వరకు ఆ జట్టు ఓటమి ఒప్పుకోకుండా పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి గోల్ మెస్సీదే. 29వ నిమిషంలో అతడు ఈ గోల్ సాధించాడు.59వ నిమిషంలో కేప్ వెర్డే ఆటగాడు డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.అర్జెంటీనా తరఫున మెస్సీ, మార్టినెజ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కేప్ వెర్డే గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో అడ్డుకున్నాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ (కేప్ వెర్డే) అద్భుతమైన గోల్‌తో స్కోర్‌ను సమం చేశాడు.ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో హెడర్ కేప్ వెర్డే ఆటగాడు డినే (ఓన్ గోల్) ద్వారా అర్జెంటీనాను మళ్లీ ఆధిక్యంలో తీసుకెళ్లింది. ఆతర్వాత కేప్ వెర్డే వరుస ఎటాక్స్ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో అడ్డుకున్నాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది.ఈ మ్యాచ్‌లో గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న కేప్ వెర్డే చూపిన పోరాటం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కేప్ వెర్డే. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఈ జట్టు చూపిన పోరాటం ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతుంది. -
ప్రీ క్వార్టర్స్‌కు కొలంబియా.. ఘనాపై ఘన విజయం
ఫిఫా వరల్డ్ కప్-2026లో కొలంబియా జట్టు కీలక విజయం సాధించింది. కెన్సాస్ సిటీలోని ఆర్రోహెడ్ స్టేడియంలో ఇవాళ జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఘనాపై 1-0 గోల్స్ తేడాతో గెలిచి, రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచే కొలంబియా దూకుడుగా ఆడింది. 14వ నిమిషంలో జాన్ ఆరియాస్ చేసిన గోల్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. లూయిస్ సువారెజ్ అందించిన కచ్చితమైన క్రాస్‌ను ఆరియాస్ సమర్థంగా ఫినిష్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. ఈ గోల్ తర్వాత కొలంబియా ఆటపై పూర్తి నియంత్రణ సాధించింది. చివరి అదే జోరు కొనసాగించి ఘనాను ఇంటికి పంపింది. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.ఈ మ్యాచ్‌తో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ రాత్రి నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు మొదలవుతాయి. రాత్రి 10:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో కెనడా, మొరాకో పోటీపడతాయి. మధ్యరాత్రి 2:30 గంటలకు ఫ్రాన్స్, పరాగ్వే అమీతుమీ తేల్చుకుంటాయి. మిగతా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు ఇలా ఉన్నాయి.జులై 6 మధ్య రాత్రి 1:30 గంటలకు బ్రెజిల్ వర్సెస్ నార్వేజులై 6 తెల్లవారు జామున 5:30 గంటలకు మెక్సికో వర్సెస్ ఇంగ్లండ్జులై 7 మధ్య రాత్రి 12:30 గంటలకు పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్జులై 7 తెల్లవారు జామున 5:30 గంటలకు యూఎస్ఏ వర్సెస్ బెల్జియంజులై 7 రాత్రి 9:30 గంటలకు అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్జులై 8 మధ్య రాత్రి 1:30 గంటలకు స్విట్జర్లాండ్ వర్సెస్ కొలంబియా -
నరాలు తెగే ఉత్కంఠ.. అదిరిపోయే హైడ్రామాలో అర్జెంటీనా గెలుపు
ఫిఫా వరల్డ్ కప్ వేదికగా జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఊహించని ఉత్కంఠ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా.. కేప్ వెర్డే లాంటి జట్టుతో చివరిదాకా పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందోనని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూశారు. హోరాహోరీ పోరులో.. చివరకు 3-2 తేడాతో అర్జెంటీనా కాబో వెర్డె (Cabo Verdy)ను ఓడించి రౌండ్ ఆఫ్-16లో అడుగుపెట్టింది.ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా.. మియామి హార్డ్‌రాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్‌కు ఆద్యంతం ఉత్కంఠను పంచింది. ప్రారంభంలో అర్జెంటీనా ఆధిపత్యం చాటింది. అయితే ఒక్క గోల్ పడకుండా కాబో వెర్డె రక్షణ గోడలా నిలబడి అడ్డుకుంది. ఈ క్రమంలో 29వ నిమిషంలో మెస్సీ Lionel Messi అద్భుతమైన టచ్‌తో గోల్ చేసి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగం 1-0తో ముగిసింది.రెండో అర్ధభాగంలో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వెనక్కి తగ్గని కాబో వెర్డె ఫాస్టెస్ట్ కౌంటర్ అటాక్స్‌తో అర్జెంటీనాను ఒత్తిడిలోకి నెట్టింది. ఆట 59వ నిమిషంలో డెరోయ్ డువార్టే గోల్‌తో స్కోర్‌ను 1-1 చేసింది. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ పోరుగా మారి ఉత్కంఠను పెంచింది.అర్జెంటీనా తరఫున మెస్సీ, లౌటారో మార్టినెజ్ ప్రయత్నాలు చేసినా.. కాబో వెర్డె గోల్‌కీపర్ వోజిన్హా అద్భుత సేవ్‌లతో నిలబడ్డాడు. నిర్ణీత 90 నిమిషాల్లో విజేత తేలకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది. అక్కడే అసలైన డ్రామా మొదలైంది.అదనపు సమయం ప్రారంభమైన వెంటనే 93వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ గోల్‌తో అర్జెంటీనా మళ్లీ ముందంజలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 103వ నిమిషంలో లారోస్ కాబ్రాల్ అద్భుతమైన షాట్‌తో కాబో వెర్డెను మళ్లీ సమం చేశాడు.#CapeVerde you kept the fight on man, Africa is proud of you! ♥️#FWC2026 pic.twitter.com/ZELWOuefa4— #MadlangaCommission not to end🕯🕯🕯 (@Dumplings_More) July 4, 2026కానీ ఈ ఉత్కంఠ అక్కడితో ఆగలేదు. 111వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో ‘హెడర్ గోల్’తో(మెస్సీ ఇచ్చిన కార్నర్‌ను రొమెరో తలతో గోల్‌గా మార్చాడు) అర్జెంటీనా మరోసారి ఆధిక్యం సాధించింది. చివరి నిమిషాల్లో కాబో వెర్డె వరుస ఎటాక్స్ చేసినా.. ఎమిలియానో మార్టినెజ్ అద్భుత సేవ్‌లతో గోడలా నిలబడ్డాడు. చివరికి 3-2 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టింది. అయితే.. గెలుపు డిఫెండింగ్ ఛాంపియన్‌దే అయినా అల్ప జనాభా ఉన్న చిన్న దేశమైనా కాబో వెర్డె చూపిన పోరాటం ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకట్టుకుంది. ఆఫ్రికా పడమటి తీరానికి దూరంగా సముద్రంలో ఉన్న చిన్న దీవుల దేశం కాబో వెర్డె.. ఫిఫా గ్రూప్ దశ నుండి నాకౌట్ వరకు ఇచ్చిన పోరాటం, పెద్ద జట్లను ఒత్తిడిలోకి నెట్టిన తీరు, సాకర్ సమరంలో గుర్తుండిపోయే “అండర్డాగ్ స్టోరీ”గా నిలిచింది. -
పెనాల్టీ షూటౌట్లో విజయం.. తొలిసారి ప్రిక్వార్టర్స్‌కు ఈజిప్ట్
ఫిఫా ప్రపంచకప్‌లో ఈజిప్ట్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్లో 4-2తో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో మ్యాచ్‌లో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫలితంగా పెనాల్టీ షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌లో ఈజిప్ట్ తరఫున ఇమామ్ అశోర్ (13వ నిమిషం) గోల్ కొట్టగా.. 55వ నిమిషంలో మొహమ్మద్ హనీ సెల్ఫ్ గోల్ కొట్టడంతో అది ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎక్స్ట్రా టైమ్‌లోనూ ఇరుజట్లు మరో గోల్కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్లో తొలి కిక్‌లో ఆస్ట్రేలియా తరఫున హారి సౌట్టర్ బంతిని కిక్ చేయగా అది క్రాస్‌బార్‌ను తాకుతూ వెళ్లిపోయింది. ఈజిప్ట్ తరఫున మహ్మూద్ సాబెర్ స్కోర్ చేశాడు. ఇక రెండో కిక్‌లో ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్, ఈజిప్ట్ తరఫున రామి రబియా స్కోర్ చేశారు. మూడో కిక్‌లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా, ఆసీస్ తరఫున అవర్ మాబిల్ స్కోర్ చేయడంతో ఆధిక్యం 3-2కు తగ్గింది. కీలకమైన నాలుగో కిక్‌లో ఆస్ట్రేలియా మిస్ చేయగా, ఈజిప్ట్ తరఫున అబ్దెల్మిగుడ్ స్కోర్ చేయడంతో 4-2తో ఈజిప్ట్ జయకేతనం ఎగురవేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో ఫిఫా చరిత్రలో ఈజిప్ట్ తొలిసారి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అంతేకాదు ఆఫ్రికా నుంచి ఫిఫాలో రౌండ్-16కు అర్హత సాధించిన రెండో దేశంగా ఈజిప్ట్ నిలిచింది. ఇక రౌండ్-16లో అర్జెంటీనా, కేప్‌వెర్డె మధ్య విజేతతో ఈజిప్ట్ తలపడనుంది.సెల్ఫ్ గోల్స్ రికార్డుఈసారి ఫిఫా ప్రపంచకప్‌లో సెల్ఫ్ గోల్స్ విషయంలో ఒక చెత్త రికార్డు నమోదయ్యింది. ఈ టోర్నీలో ఈజిప్ట్ ఆటగాడు మొహ్మద్ హనీ కొట్టిన సెల్ఫ్ గోల్ 13వది కాగా.. గతంలో ఫిఫా టోర్నీలో నమోదైన 12 సెల్ఫ్ గోల్స్ రికార్డు బద్దలయ్యింది. 13 సెల్ఫ్ గోల్స్‌తో ఫిఫా ప్రపంచకప్ 2026 కొత్త రికార్డు సృష్టించింది. 2018లో రష్యాలో జరిగిన ఫిఫా టోర్నీలో 12 సెల్ఫ్ గోల్స్ నమోదవ్వగా, 1998లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఫిఫాలో ఆరు గోల్స్, 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫాలో ఐదు సెల్ఫ్ గోల్స్ నమోదయ్యాయి.Egypt won their first ever knockout match at worldcup, i loved their celebration. But in whole match Mo salah has been carried by mostafa ziko and Emam ashour, he showed his mediocrity today at global level. One penalty is enough to satisfy his dumbass fans😭 pic.twitter.com/Mhmraf5Vy0— shaurya nirjhar (@Shaurya_Nirjhar) July 3, 2026 -
పోర్చు‘గోల్’ ఇంకా ఉంది
టొరంటో: చివరి ప్రయత్నంలోనైనా ప్రపంచకప్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ మెగా ఈవెంట్లో నిలిచాడు. తాడో పేడో తేల్చుకునే నాకౌట్ దశ మ్యాచ్‌లో క్లిష్టమైన ప్రత్యర్థి క్రొయేషియా జట్టుపై రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో పోర్చుగల్ ప్రపంచకప్‌లో ఆరోసారి ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్‌కు మరింత కఠిన సవాలు ఎదురుకానుంది. 2010 ప్రపంచకప్ విజేత, యువ ఆటగాళ్లతో జోరుమీదున్న స్పెయిన్ జట్టుతో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం పోరాడనుంది. 2018 ప్రపంచకప్ రన్నరప్... 2022 ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన క్రొయేషియా జట్టు ఈసారి నాకౌట్ దశ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడుతున్న క్రొయేషియా కెప్టెన్, స్టార్ ప్లేయర్ 40 ఏళ్ల లుకా మోడ్రిచ్‌కు ఈసారి మెగా ఈవెంట్ నిరాశ మిగిల్చింది. పోర్చుగల్‌తో ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో క్రొయేషియాకు అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు పోర్చుగల్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందంజ వేసింది. తొలి అర్ధభాగంలో రెండు జట్లు ఖాతా తెరువలేదు. రెండో అర్ధభాగంలోని 53వ నిమిషంలో ఇవాన్ పెరిసిచ్ గోల్‌తో క్రొయేషియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికి రొనాల్డో గోల్ చేసినా రిఫరీ దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించి గోల్ ఇవ్వలేదు. అయితే 68వ నిమిషంలో తమకు లభించిన పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. అంతేకాకుండా ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన అతిపెద్ద వయసు్కడిగా రొనాల్డో (41 ఏళ్ల 147 రోజులు) రికార్డు సృష్టించాడు. 80వ నిమిషంలో పీటర్ సుచిచ్ గోల్ చేయగా... రిఫరీ దీనిని కూడా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. నిర్ణీత 90 నిమిషాలు ముగిశాక స్టాపేజ్ సమయంగా 10 నిమిషాలు జోడించారు. 90+4వ నిమిషంలో రాఫెల్ లియో క్రాస్ పాస్ షాట్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న సబ్‌స్టిట్యూట్ గొన్సాలో రామోస్ లక్ష్యానికి చేర్చడంతో పోర్చుగల్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలోని చివరి సెకన్లలో క్రొయేషియా ప్లేయర్ గ్వార్డియోల్ గోల్ చేయడంతో స్కోరు 2–2తో సమమైందని భావించారు. అయితే రిఫరీ ఆఫ్‌సైడ్‌గా ప్రకటించడంతో గోల్ ఇవ్వలేదు. రెండున్నర నిమిషాలపాటు వీడియో రీప్లే పరిశీలించాక... క్రొయేషియా ప్లేయర్ ఇవాన్ పెరిసిచ్ కొట్టిన షాట్... ‘డి’ ఏరియాలో ఇగోర్ మాంటానోవిచ్ తల వెంట్రుకలకు బంతి తగులుతూ వెళ్లిందని.. ఆ సమయానికి అక్కడే పోర్చుగల్ డిఫెండర్కంటే క్రొయేషియా మరో ప్లేయర్ పాలాసిచ్ ముందున్నట్లు కనిపించింది. దాంతో రిఫరీ దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత మరో ఆరు నిమిషాలు క్రొయేషియాను నిలువరించి పోర్చుగల్ జట్టు విజయాన్ని ఖరారు చేసుకుంది. రిఫరీ నిర్ణయంపై క్రొయేషియా అభిమానులు వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 88 ఏళ్ల తర్వాత.. వాంకూవర్: అల్జీరియాతో జరిగిన మరో నాకౌట్ తొలి రౌండ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 2–0తో గెలిచింది. 88 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మ్యాచ్‌లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. స్విట్జర్లాండ్ తరఫున బ్రీల్ ఎంబోలో (10వ నిమిషంలో), డాన్ ఎండోయో (46వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కొలంబియా, ఘనా మ్యాచ్ విజేతతో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ తలపడుతుంది. స్పెయిన్ జోరు... లాస్ ఏంజెలిస్‌లో జరిగిన మరో నాకౌట్ మ్యాచ్‌లో స్పెయిన్ 3–0తో ఆ్రస్టియాపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒయర్జబాల్ (36వ, 89వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా.. పెడ్రో పోర్పో (66వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. -
ఫిఫా నుంచి జట్టు నిష్క్రమణ.. స్టార్ ఫుట్‌బాలర్ వీడ్కోలు
ఫిఫా ప్రపంచకప్ నుంచి అల్జీరియా నిష్క్రమించిన తర్వాత ఆ జట్టు స్టార్ ఫుట్‌బాలర్ రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా టోర్నీలో రౌండ్ ఆఫ్-32లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్జీరియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు రియాద్ మెహ్రెజ్ తెలిపాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అల్జీరియా తరఫున 119 మ్యాచ్‌లాడిన 35 ఏళ్ల ఫార్వార్డ్ ప్లేయర్ రియాద్ మహ్రెజ్ 40 గోల్స్ సాధించి జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 2019లో ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ (ఆఫ్కన్) టైటిల్ అందించడంలో రియాద్ మహ్రెజ్ది కీలకపాత్ర. అయితే రియాద్ మహ్రెజ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు దూరమైనప్పటికీ, సౌదీ ప్రో లీగ్ క్లబ్ @అల్ అహ్లీ తరఫున ఫ్రొఫెషనల్ క్లబ్ కెరీర్‌ను కొనసాగించనున్నాడు. ఇక క్లబ్ స్థాయిలో రియాద్ మహ్రెజ్ లీసెస్టర్ సిటీతో ఒక ప్రీమియర్ లీగ్ టైటిల్, మాంచెస్టర్ సిటీతో నాలుగు టైటిళ్లు , అలాగే సిటీతో ఒక ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో 4 మ్యాచ్‌లాడిన రియాద్ మహ్రెజ్ 2 గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ అందించాడు. 'నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. సహజంగానే అందరి కెరీర్లో ఎత్తుపల్లాలు ఉన్నట్లే నా కెరీర్లోనే అన్ని కష్టాలు, సంతోషాలు అనుభవించాను. చిన్నప్పటి నుంచి అల్జీరియాకు ప్రాతినిధ్యం వహించడం, నాదేశం కోసం ఆడడమనేది నా కల. ఇది నాకు లభించిన అపారమైన గౌరవం, గర్వకారణం. ఇక ఇప్పుడు కొత్త తరం ఆడాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే వీడ్కోలుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. గుడ్‌బై' అని పోస్టు పెట్టాడు.🇩🇿 Riyad Mahrez : "C'était un match à notre portée."👀 Il annonce son dernier match avec la sélection #beINFWC2026 #FIFAWorldCup pic.twitter.com/y0C908Rsxx— beIN SPORTS (@beinsports_FR) July 3, 2026Read: గోల్‌కీపర్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్ -
చరిత్ర సృష్టించిన స్విట్జర్లాండ్.. 90 ఏళ్ల నిరీక్షణకు తెర
స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫిఫా వరల్డ్‌కప్‌లో తమ 90 ఏళ్ల ప్రయాణంలో తొలిసారి నాకౌట్ దశలో విజయాన్ని సాధించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (జులై 3) జరిగిన రౌండ్ ఆఫ్ 32లో అల్జీరియాపై 2–0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్రి క్వార్టర్స్‌కు (రౌండ్ ఆఫ్ 16) అర్హత సాధించింది.అల్జీరియాపై స్విట్జర్లాండ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 10 నిమిషాల్లోనే బ్రీల్ ఎంబోలో గోల్ చేసి శుభారంభం అందించాడు. ఆ గోల్‌కు జోహాన్ మాన్జాంబి అద్భుతమైన అసిస్ట్ అందించాడు. ప్రారంభ గోల్‌తో స్విట్జర్లాండ్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.రెండో అర్ధభాగం ఆరంభమైన వెంటనే డాన్ న్డోయే మరో గోల్ సాధించి స్కోరు 2–0కి పెంచాడు. ఈ గోల్ మ్యాచ్‌ను పూర్తిగా స్విట్జర్లాండ్ వైపు తిప్పింది. అనంతరం అల్జీరియా జట్టు పోరాటంలో నిలిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ, స్విస్ రక్షణ విభాగం క్రమశిక్షణతో ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. అల్జీరియా కెప్టెన్ రియాద్ మహ్రెజ్ నాయకత్వంలో ఆ జట్టు కొంత సమయం బంతి నియంత్రణ సాధించినప్పటికీ, గోల్ చేసే అవకాశాలను సృష్టించుకోవడంలో విఫలమైంది.స్విట్జర్లాండ్ జట్టు మొత్తం మ్యాచ్‌లో సమతుల్య ఆటతీరు, వేగవంతమైన కౌంటర్ అటాక్స్ మరియు కఠినమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా మాన్జాంబి ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో నిలిచింది. అతని పాస్‌లు, అటాక్‌లు స్విస్ జట్టుకు కీలకంగా మారాయి.ఈ విజయంతో స్విట్జర్లాండ్ ప్రపంచ కప్ నాకౌట్ దశలో తమ దీర్ఘకాలిక వైఫల్యాలకు బ్రేక్ వేసినట్లైంది. అనేక దశాబ్దాలుగా నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశ ఎదుర్కొన్న స్విస్ జట్టు, ఈసారి స్థిరమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. తదుపరి దశలో స్విట్జర్లాండ్ కొలంబియా-ఘనా మ్యాచ్ విజేతను ఎదుర్కొనుంది. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రిక్వార్టర్స్‌కు పోర్చుగల్
పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రొనాల్డో 41 ఏళ్ల 147 రోజుల వయసులోఈ ఘనత సాధించాడు.తద్వారా ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో 40 ఏళ్ల వయసు తర్వాత గోల్ కొట్టిన ఫుట్‌బాలర్‌గానూ రొనాల్డో చరిత్రకెక్కాడు. ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా క్రొయేషియాతో జరిగిన రౌండ్32 మ్యాచ్ సందర్భంగా ఈ పోర్చుగల్ దిగ్గజం ఈ ఘనత సాధించాడు.అంతకుముందు ఈ రికార్డు పోర్చుగల్‌కే చెందిన పెపె పేరిట ఉండేది. 2022లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 39 ఏళ్ల 283 రోజుల వయసులో పెపె గోల్ కొట్టాడు. రొనాల్డో ఇప్పుడు అతడిని అధిగమించాడు.ప్రిక్వార్టర్స్‌కు పోర్చుగల్టొరొంటో వేదికగా పోర్చుగల్- క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ రెండో అర్దభాగంలో... ఇవాన్ పెరిసిక్ 53వ నిమిషంలో గోల్ కొట్టడంలో క్రొయేషియా ఖాతా తెరిచింది.ఈ క్రమంలో పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక అదనపు సమయంలో (90+4) రామోస్ గోల్ కొట్టి పోర్చుగల్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. అయితే, 103వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు జోస్కో గవార్డియాల్ గోల్ కొట్టగా.. సమీక్ష తర్వాత వీడియో అసిస్టెంట్ రిఫరీ(VAR) మాత్రం దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు.దీంతో క్రొయేషియా నిరాశలో మునిగిపోగా.. పోర్చుగల్ 2-1తో జయభేరి మోగించి.. రౌండ్ 16కు దూసుకవెళ్లింది. కాగా ఆటగాడు బాల్‌ను అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందు ఉండి.. తద్వారా ఆటలో ప్రభావం చూపినట్లయితే దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. ఆ సమయంలో సదరు ఆటగాడు గోల్ కొట్టినా అది చెల్లదు. -
గోల్‌కీపర్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్
ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా లాస్ ఏంజిల్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. స్పెయిన్ తరఫున మికెల్ ఒజర్బయాల్ (37, 89వ నిమిషం) డబుల్ గోల్స్ చేయగా, పెడ్రో పోరో (66వ నిమిషం) మరో గోల్ సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. స్పెయిన్ తొలి గోల్ 37వ నిమిషంలో నమోదైంది. ఎడమ వైపు నుంచి వచ్చిన లో క్రాస్‌ను బాక్స్ మధ్యలో నుంచి మికెల్ బంతిని గోల్‌పోస్టులోకి పంపించాడు. ఆ తర్వాత ఆట 89వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. ఇది కూడా మొదటి గోల్‌ను పోలి ఉంటుంది. లో క్రాస్ నుంచి వచ్చిన బంతిని అందుకున్న మికెల్ నేరుగా నెట్లోకి పంపించాడు. దీంతో ఫిఫా 2026లో మికెల్ తన గోల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. ఇక డిఫెండర్ పెడ్రో పోరో రైఫిల్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్టులోకి పంపించి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. ఇక ప్రత్యర్థి ఆస్ట్రియాను స్పెయిన్ ఉక్కిరిబిక్కిరి చేసింది. పటిష్టమైన డిఫెన్స్‌తో ఆస్ట్రియాను కేవలం ఐదుషాట్స్కే పరిమితం చేశారు. మొత్తం 90 నిమిషాల ఆటలో ఆస్ట్రియా ఒక్కసారి కూడా లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది.ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో స్పెయిన్ ఒకటి కంటే ఎక్కువ గోల్స్ సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో స్పెయిన్ నాకౌట్ దశలో స్విట్జర్లాండ్‌పై 3-0తో గెలిచింది. లామినే యమాల్, పౌకుబార్సీ వంటి ఇద్దరు టీనేజర్లు ఉన్న ఏకైక జట్టుగా స్పెయిన్ నిలిచింది. ఈ ద్వయం గతంలో బ్రెజిల్ దిగ్గజం పీలే, జోస్ అల్టాఫిని పేరిట ఉన్న 68 ఏళ్ల ప్రపంచరికార్డును బద్దలుకొట్టింది. ఇక ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్.. క్రొయేషియా, పోర్చుగల్ మధ్య విజేతతో తలపడనుంది. స్పెయిన్ గోల్ కీపర్ గిన్నిస్ రికార్డుఈ క్రమంలో స్పెయిన్ గోల్ కీపర్ ఉనై సైమన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఫిఫా టోర్నమెంట్లో 519 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా, సైమన్ తొలి గోల్ కీపర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకున్నాడు. ఫిఫా 2026 టోర్నీ గ్రూప్ దశ నుంచి తాజాగా లాస్ ఏంజెల్స్‌లో ఆస్ట్రియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ వరకు ఉనై సైమన్ తన ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 1990 ఫీఫా ప్రపంచ కప్ సమయంలో ఇటలీ దిగ్గజ గోల్ కీపర్ వాల్టర్ జెంగా నెలకొల్పిన 517 నిమిషాల మునుపటి రికార్డును సైమన్ బద్దలుకొట్టాడు. Unai Simón has now gone the longest time in World Cup history without conceding a goal beating Walter Zenga's record from 1990 🧤🤯🔝 pic.twitter.com/RC57OFSjCq— OneFootball (@OneFootball) July 2, 20261 - Con #España 🇪🇸, Unai Simón (519 minutos) se ha convertido en el portero con el mayor récord de imbatibilidad en la historia del #Mundial.Ha superado los 517 de Walter Zenga.Histórico. https://t.co/bq6usGgiDX— OptaJose (@OptaJose) July 2, 2026 -
'భళా' బెల్జియం
సీటెల్: బెల్జియం, సెనెగల్ మధ్య రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్... ఎలా చూసినా ప్రత్యర్థికంటే బెల్జియం బలమైన జట్టు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–10లో ఉండటంతో పాటు ‘ఫిపా’ ప్రపంచ కప్‌లో ఎంతో మెరుగైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌లోనూ బెల్జియంనే అంతా ఫేవరెట్‌గా భావించారు. కానీ సెనెగల్ అసాధారణ ప్రదర్శనతో పెను సంచలనం నమోదయ్యేలా కనిపించింది. మ్యాచ్‌లో మరో 5 నిమిషాలు మిగిలి ఉండగా సెనెగల్ 2–0తో ముందంజలో ఉంది.ఈ ఆఫ్రికా జట్టు ప్రిక్వార్టర్స్ చేరడం ఖాయమనిపించింది. అయితే బెల్జియం తమ స్థాయికి తగ్గ ఆటతో ఒక్కసారిగా కోలుకుంది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేయడంతో పాటు మ్యాచ్‌ను అదనపు సమయానికి మళ్లించగలిగింది. ఈ దశలో అనూహ్యంగా లభించిన పెనాల్టీని గోల్‌గా మలిచి ఊపిరి పీల్చుకుంది. చివరకు 3–2తో సెనెగల్‌ను ఓడించి తర్వాతి రౌండ్లోకి అడుగు పెట్టింది. ముందుగా సెనెగల్ తరఫున హబీబ్ దియారా (24వ నిమిషంలో), ఇస్మాయిలా సార్ (51వ ని.) గోల్స్ సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపారు. ఆ తర్వాత బెల్జియం తరఫున ఆ జట్టు టాప్ ప్లేయర్ రొమెలు ల్యూకాకు (86వ నిమిషం), యూరీ టైల్మన్స్ (89వ ని.) గోల్స్ కొట్టడంతో స్కోరు సమమైంది. అదనపు సమయంలో సెనెగల్ ఆటగాడు లామిన్ కమారా ఫౌల్ చేయడంతో బెల్జియంకు పెనాల్టీ దక్కింది. దీనిపై సెనెగల్ ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేసినా వీడియో రివ్యూ (వీఏఆర్) ద్వారా రిఫరీ పెనాల్టీని సరైందిగా తేల్చాడు. ఈ అవకాశాన్ని బెల్జియం వదులుకోలేదు. 120+5వ నిమిషంలో బంతిని యూరీ టైల్మన్స్ నెట్లోకి పంపించడంతో బెల్జియం సంబరాల్లో మునిగిపోయింది. 2 గోల్స్ కొట్టిన కెప్టెన్ టైల్మన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 2018 వరల్డ్ కప్‌లో కూడా బెల్జియం ఇదే తరహాలో జపాన్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో 0–2తో వెనుకబడి కూడా ఆపై 3–2తో విజయాన్ని అందుకుంది. 10 మందితో గెలిచిన యూఎస్...శాన్ఫ్రాన్సిస్కో: ఆతిథ్య జట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ప్రపంచ కప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. టోర్నీ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండేసి గోల్స్ కొట్టిన జట్టు నాకౌట్ పోరులోనూ అదే జోరును కొనసాగించింది. బోస్నియా అండ్ హెర్జిగోవినాతో జరిగిన పోరులో అమెరికా 2–0తో విజయం సాధించింది. యూఎస్ తరఫున ఫొలారిన్ బాలోగన్ (45వ నిమిషం), మలిక్ టిల్మాన్ (82వ ని.) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి బాలోగన్ దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దూసుకుపోయాడు. 31వ నిమిషంలో అతను మొదటి గోల్ కొట్టినా రిఫరీ దానిని ‘ఆఫ్‌సైడ్’గా గుర్తించి తిరస్కరించాడు. కొద్ది సేపటి తర్వాత బంతిని నిలువరించే ప్రయత్నంలో ప్రత్యర్థి ఆటగాడు ముహరెమొవిచ్ నియంత్రణ కోల్పోగా... దీనిని అవకాశంగా మలచుకున్న బాలోగన్ పదునైన కిక్‌తో తొలి గోల్‌గా మలిచాడు. అయితే బాలోగన్‌ను దురదృష్టం వెంటాడింది. ఆటలో దూసుకుపోతున్న తరుణంలో బంతిని తప్పిస్తుండగా అనూహ్యంగా అతని కాలు ముహరెమొవిచ్కు బలంగా తాకింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా రిఫరీ భావించాడు. వీడియో రివ్యూలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో బాలోగన్‌కు రిఫరీ 64వ నిమిషంలోనే ‘రెడ్ కార్డ్’ చూపించాడు.ఫలితంగా ఒక మ్యాచ్ నిషేధం కారణంగా బెల్జియంతో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు అతను దూరం కానున్నాడు. బాలోగన్‌ను తప్పించడంతో మిగిలిన 26 నిమిషాలు యూఎస్ పది మంది ఆటగాళ్లతోనే పోరాడింది. ఈ సమయంలో ఒక గోల్ నమోదు చేయడంతో పాటు పటిష్టమైన డిఫెన్స్‌తో బోస్నియాను నిలువరించడంలో సఫలమైంది. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ చేసిన తర్వాత రెడ్‌కార్డుకు గురైన మూడో ఆటగాడిగా బాలోగన్ నిలిచాడు. 2002లో రొనాల్డిన్హో (బ్రెజిల్), 2006లో జినెదిన్ జిదాన్ (ఫ్రాన్స్) ఈ తరహాలో శిక్షకు గురయ్యారు. -
ప్రీ క్వార్టర్స్ దూసుకెళ్లిన అమెరికా
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య అమెరికా జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌కు (రౌండ్ ఆఫ్ 16) దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగొవినాపై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి, టైటిల్ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో అమెరికా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే పోరాటం చేసింది.64వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ ఫొలారిన్ బలోగన్ రెడ్ కార్డ్‌కు గురై మైదానాన్ని వీడాడు. రెడ్ కార్డ్‌కు గురయ్యే సమయానికి బలోగన్ చెలరేగి ఆడుతున్నాడు. 45వ నిమిషంలో గోల్ చేసి అమెరికాకు ఆధిక్యం అందించాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో గోల్. మరోవైపు బోస్నియా కూడా ప్రారంభంలో కొన్ని అవకాశాలు సృష్టించుకున్నా అమెరికా గోల్‌కీపర్ మ్యాట్ ఫ్రీస్ అద్భుతమైన సేవ్‌లతో జట్టును కాపాడాడు.బలోగన్ రెడ్ కార్డ్‌కు గురైనా వెనక్కి తగ్గని అమెరికా 82వ నిమిషంలో మరో గోల్ చేసి ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మలిక్ టిల్‌మ్యాన్ అద్భుతమైన ఫ్రీకిక్‌తో గోల్ చేసి అమెరికా విజయాన్ని ఖాయం చేశాడు.కాగా, ప్రపంచకప్ చరిత్రలో అమెరికా రౌండ్ ఆఫ్ 16కు చేరడం ఇది మూడోసారి. 1930లో తొలిసారి సెమీస్‌కు చేరిన ఆ జట్టు.. 2002 ఎడిషన్‌లో రౌండ్ ఆఫ్ 16కు చేరింది. మళ్లీ ఇప్పుడే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. అమెరికా తమ తదుపరి మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది. ఈ పోరు జూలై 6న సియాటిల్‌లో జరగనుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో అమెరికా నుంచి అభిమానులు సంచలనాలు ఆశిస్తున్నారు. -
నాకౌట్ అయిన సెనెగల్.. బెల్జియంను వరించిన అదృష్టం
ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. సెనెగల్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియం 3-2 తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. దీంతో సెనెగల్ ఫిఫా నుంచి నాకౌట్ అయింది. బెల్జియం తరఫున రొమెలు లుకాకు (86వ నిమిషం), కెప్టెన్ యురి టిలేమన్స్ (89, 120+5వ నిమిషం)లో డబుల్ గోల్స్‌తో మెరిశాడు. ఇక సెనెగల్ తరఫున హబిబ్ డియారా (24వ నిమిషం), ఇస్మాయిలా సర్ (51వ నిమిషం) గోల్స్ సాధించారు. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచాయి. ఇంజ్యూరీ టైమ్‌లోనూ గోల్ కొట్టలేదు. అయితే ఎక్స్ట్రా టైమ్‌లో టిలేమన్స్ను బంతిని కొట్టకుండా సెనెగల్ ఆటగాడు లామినే కమారా ఉద్దేశపూర్వకంగా కింద పడేసినట్లు తేలడంతో రిఫరీ బెల్జియంకు పెనాల్టీ కిక్ అవకాశమిచ్చారు.దీంతో తనకు లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంలో టిలేమన్స్ సక్సెస్ అయ్యాడు. దీంతో బెల్జియం విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ఇక బెల్జియం.. ప్రిక్వార్టర్స్‌లో అమెరికా, బోస్నియా అండ్ హెర్జెగొవినా మధ్య మ్యాచ్ విజేతతో తలపడనుంది.🚨 FULL-TIME 🚨A contentious late penalty sees #Tielemans fire Belgium into the Round of 16, completing a remarkable comeback from 2-0 down against Senegal.Follow #BELvsSEN LIVE👇https://t.co/bwW66t0MyP pic.twitter.com/4I1OfCUhrd— India Today Sports (@ITGDsports) July 1, 2026 Youri Tielemans has cemented his place in my hate watchlist with this absolutely shambolic piece of sportsmanship tonight. And that dive to get the penaltt is not even the only stuff he pulled.Here's how he scored the equalizer! #BELvsSEN pic.twitter.com/ifiYZvCeZw— দীপজিৎ (@BeingDeepjit) July 1, 2026 -
ఇంగ్లండ్‌ను గెలిపించిన హ్యారీ కేన్
అట్లాంటా: ఆరు దశాబ్దాల తర్వాత ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు అద్భుతం చేసింది. ప్రపంచకప్ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో ఆరంభంలో వెనుకబడి ఆ తర్వాత విజయాన్ని అందుకుంది. కాంగో జట్టుతో బుధవారం జరిగిన రౌండ్–32 నాకౌట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. కెప్టెన్ హ్యారీ కేన్ 11 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్ జట్టును గెలిపించాడు. అంతకుముందు ఏడో నిమిషంలో బ్రియాన్ సిపెంగా గోల్‌తో కాంగో జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రక్షణాత్మక ఆటతీరుతో ఇంగ్లండ్ జట్టును నిలువరించి గెలుపొందాలని ప్రయత్నించింది.కానీ ఇంగ్లండ్ జట్టు అవకాశం దొరికినపుడల్లా స్కోరును సమం చేసేందుకు యత్నించింది. చివరకు 75వ నిమిషంలో సఫలమైంది. ఆంథోని గోర్డాన్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న హ్యారీ కేన్ హెడర్ షాట్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో ఇంగ్లండ్ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 86వ నిమిషంలో గోర్డాన్ అందించిన పాస్‌ను హ్యారీ కేన్ లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత మిగిలిన సమయంలో కాంగో జట్టును నిలువరించి ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారి ఇంగ్లండ్ జట్టు 1966 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీపై 0–1తో వెనుకబడి విజయం సాధించింది. ఎంబాపె జోరు... ఫ్రాన్స్ గెలుపు న్యూయార్క్‌లో జరిగిన మరో రౌండ్–32 నాకౌట్ మ్యాచ్‌లో గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టు 3–0 గోల్స్ తేడాతో స్వీడన్ జట్టును ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్ కెప్టెన్ కిలియాన్ ఎంబాపె (45వ, 74వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో మెరిపించగా... బ్రాడ్లీ బార్కోలా (53వ నిమిషంలో) మరో గోల్ అందించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మెస్సీ (అర్జెంటీనా; 19 గోల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు ఎంబాపె (18 గోల్స్) ఒక గోల్ దూరంలో ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాగ్వేతో ఇంగ్లండ్ తలపడుతుంది. మెక్సికో... 40 ఏళ్ల తర్వాత ఆతిథ్య మెక్సికో జట్టు 40 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో విజయం రుచి చూసింది. మెక్సికో సిటీలో జరిగిన రౌండ్–32 నాకౌట్ మ్యాచ్‌లో మెక్సికో 2–0 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మెక్సికో తరఫున జూలియన్ క్వినోనెస్ (22వ నిమిషంలో), రౌల్ జిమెనెజ్ (31వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. 1986 ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో బల్గేరియాపై గెలిచిన తర్వాత మెక్సికో జట్టు ఈ మెగా ఈవెంట్ నాకౌట్ మ్యాచ్‌లో మళ్లీ గెలవలేదు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో మెక్సికో ఆడుతుంది. -
ఆటగాళ్ల గుండెల్లో ‘షూటౌట్’
జర్మనీ జట్టులో నలుగురు సీనియర్ ప్లేయర్లు... గొరెట్జా, వాల్డమర్, బ్రౌన్, మెలిక్... పరాగ్వేతో పెనాల్టీ షూటౌట్ ఐదు ప్రయత్నాల్లో 3–3తో సమంగా నిలిచిన తర్వాత ఎవరు పెనాల్టీ తీసుకుంటారంటూ జర్మనీ కెప్టెన్ జోషువా కిమిక్ వీరందరినీ అడిగాడు... గొరెట్జానైతే దాదాపు బతిమాలినంత పని చేశాడు. కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. దాంతో జొనాథన్ తాహ్ నేను ప్రయత్నిస్తానంటూ కిక్కు సిద్ధమయ్యాడు. అతని 51 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్లో పెనాల్టీ కిక్ తీసుకోవడం ఇదే మొదటిసారి! తీవ్ర ఒత్తిడిలో అతను కొట్టిన బంతి బార్ మీదుగా వెళ్లిపోయింది. తర్వాత పరాగ్వే గోల్ కొట్టడంతో జర్మనీ ఓటమి ఖాయమైంది. షూటౌట్లో ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో, వారిపై ఉండే ఒత్తిడి ఎలాంటి ఇది తాజా ఉదాహరణ. –సాక్షి క్రీడా విభాగం ఫుట్‌బాల్‌లో పెనాల్టీ ‘షూటౌట్’ డ్రామాలను ఒక రకంగా ‘అమానవీయం’గా వ్యవహరిస్తుంటారు. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో హోరాహోరీగా పోరాడి అలసిన తర్వాత మళ్లీ కొత్త సవాల్‌కు సిద్ధం కావడం ఆటగాళ్లకు కష్టంగా మారిపోతుంది. తమ దేశం తరఫున అంచనాల భారం మోస్తూ బరిలోకి దిగిన ప్లేయర్లపై షూటౌట్ సమయంలో మరింత తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. షూటౌట్లో ఆట మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన వాళ్లు కూడా షూటౌట్లో తడబాటుకు లోనవుతారు. ఇతర ఆటగాళ్లలాగే ఈ సమయంలో గోల్ చేయడంలో వారు కూడా విఫలమయ్యే అవకాశాలు అంతే సమానంగా ఉంటాయి. అప్పటి వరకు అద్భుతంగా ఆడినా సరే... కిక్‌లో విఫలం అయితే వారంతా ఒక్కసారిగా విలన్లుగా మారిపోవడం ఖాయం. తాజా ‘ఫిఫా’ ప్రపంచ కప్ రౌండ్–32లో తొలి రెండు మ్యాచ్‌లలో ఫలితం పెనాల్టీ షూటౌట్ల ద్వారానే వచ్చింది. ఇందులో దిగ్గజ జట్టు జర్మనీ, మరో పటిష్ట యూరోపియన్ టీమ్ నెదర్లాండ్స్... బలహీనులనదగ్గ పరాగ్వే, మొరాకో చేతుల్లోపరాజయం పాలయ్యాయి. గొప్ప ఆటగాళ్లూ విఫలమై... ఫుట్‌బాల్‌లో షూటౌట్లను 1970లో ప్రవేశపెట్టారు. 1994లో తొలిసారి షూటౌట్ ద్వారా ప్రపంచ కప్ విజేతను నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ఇటలీపై బ్రెజిల్ పైచేయి సాధించింది. ఇటలీ దిగ్గజ ఆటగాడు రాబర్టో బాగియో ఈ షూటౌట్లో గోల్ కొట్టలేకపోవడం సాకర్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకర క్షణాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ‘షూటౌట్ సమయంలో ఆటగాళ్లపై అతి తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది. ఇది అమానవీయ స్థాయికి చేరిపోతుంది. ముఖ్యంగా కిక్ తీసుకునే ఆటగాళ్లపై అందరి దృష్టీ ఉంటుంది. దీనిని అధిగమించి స్కోర్ చేయడం చాలా కష్టం’ అని నార్వేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ గియర్ జార్డెట్ అభిప్రాయ పడ్డారు. పెనాల్టీ స్పాట్ నుంచి గోల్ లైన్ వరకు ఉండే 11 మీటర్ల దూరంలో ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ధారితమవుతుందని ఇంగ్లండ్ ఆటగాడు నోని మడుకె అన్నాడు. 2022 ఖతర్ వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లగా... అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఫలితం కూడా దాంతోనే తేలిన విషయాన్ని అతను గుర్తు చేశాడు. ఒత్తిడిని అధిగమిస్తేనే... పెనాల్టీ కిక్‌ను తీసుకోవడంలో ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలికి ఉంటుంది. కొందరు ఎక్కువ సమయం తీసుకోకుండా వేగంగా ముందుకు దూసుకొచ్చి కిక్ కొడితే, మరికొందరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అప్పుడు కిక్ తీసుకుంటారు. కాస్త ఆగినట్లుగా చేస్తూ కీపర్ బోల్తా కొట్టేలా ఎదురు చూసి తమ పని పూర్తి చేసుకునే శైలి మరికొందరు ఆటగాళ్లది. అయితే ఎలా చేసినా అతను గోల్ కొట్టాలనే తీవ్రమైన ఒత్తిడి మాత్రం కచ్చితంగా ఉంటుంది. ‘రిఫరీ విజిల్ వేయగానే కిక్ కొట్టే వారు ఎక్కువగా విఫలం కావడం కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గే వరకు కాస్త ఆపై వెళ్లేవారికి మంచి ఫలితాలు రావడం మేం చూశాం. అయితే పెనాల్టీ కిక్ తీసుకోవాలంటే చాలా గుండె ధైర్యం మాత్రం ఉండాల్సిందే. అది అంత సులువు కాదు. గోల్‌కీపర్లు మాత్రం ఈ విషయంలో అనుభవం కొద్దీ రాటుదేలుతారు’ అని అమెరికా ఫార్వర్డ్ క్రిస్టియాన్ ప్యులిసిక్ విశ్లేషించాడు. 2022 వరల్డ్ కప్ ఫైనల్ సహా అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గత ఆరు పెనాల్టీ షూటౌట్లోనూ ప్రత్యర్థిని నిలువరించడం విశేషం.ఆటగాళ్ల ఎంపికే కీలకం... షూటౌట్లో ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా కోచ్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఎవరిని ఎంచుకున్నా అది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. ఆటగాడిగా పేరు, అనుభవం మాత్రమే కాకుండా ఆ సమయంలో కొట్టగలడనే నమ్మకం కూడా ఉండాలి. మెస్సీ, ఎంబాపెలాంటి ఆటగాళ్లు మరో ఆలోచన లేకుండా షూటౌట్‌కు సిద్ధం కావడం సహజమే కానీ ఇతర ఆటగాళ్ల విషయంలోనే సమస్య వస్తుంది. టెక్నిక్‌తో పాటు పెనాల్టీ కిక్‌ల విషయంలో కూడా రిహార్సల్స్ చేయడం అవసరమనేది నిపుణుల అభిప్రాయం. తాజాగా పరాగ్వేతో జర్మనీ మ్యాచ్ అందుకు సరైన ఉదాహరణ. సీనియర్ ప్లేయర్లు కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. పేరు ప్రతిష్టలతో కాకుండా తాను గోల్ కొడతాననే ఆత్మవిశ్వాసం ప్రదర్శించే ఆటగాళ్లపై నమ్మకం ఉంచవచ్చని... అయితే స్వచ్ఛందంగా రమ్మని అడగకుండా కోచ్‌లు ఎంపిక చేయడమే సరైన పద్ధతి అని ప్యులిసిక్ వ్యాఖ్యానించాడు. ఈ ప్రపంచకప్‌లో మున్ముందు ఎన్ని మ్యాచ్‌లలో ‘షూటౌట్’ రాత మారుస్తుందనేది ఆసక్తికరం. -
హ్యారికేన్ విధ్వంసం.. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం రాత్రి డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారికేన్ డబుల్ గోల్స్ (75, 86వ నిమిషం) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక కాంగో తరఫున 7వ నిమిషంలో బ్రియాన్ సిపెంగా గోల్ కొట్టాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్‌పై కాంగో ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. మ్యాచ్ మొదలైన కాసేపటికే కాంగో తరఫున బ్రియాన్ గోల్ చేయడం ఇంగ్లండ్ జట్టును షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంగ్లండ్ గోల్ కొట్టడంలో సఫలం కాలేకపోయింది. అయితే రెండో అర్ధభాగంలోనూ మూడో క్వార్టర్ వరకు ఇంగ్లండ్ గోల్ చేయకపోవడం గమనార్హం. ఇక ఓటమి తప్పదనుకున్న దశలో హ్యారికేన్ విజృంభించాడు. తనలోని విన్యాసాలను బయటకు తీసిన హ్యారికేన్ 75వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మరో 11 నిమిషాల వ్యవధిలో రెండో గోల్ కొట్టి ఇంగ్లండ్‌ను 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. తద్వారా నిర్ణీత సమయంలో కాంగో మరో గోల్ కొట్టడంలో విఫలం కావడంతో ఇంగ్లండ్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.ఇక హ్యారికేన్ టోర్నీలో ఐదు గోల్స్ కొట్టడం ద్వారా గోల్డెన్ బూట్ రేసులో కొనసాగుతున్నాడు. మెస్సీ, ఎంబాపె చెరో ఆరు గోల్స్‌తో సంయుక్తంగా ఉండగా, హాలండ్, హ్యారికేన్లు చెరో 5 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.🌎🏴 ENGLAND BEAT RD CONGO AND FLY TO WORLD CUP ROUND 16!Brace for Harry Kane beating Pele’s goals record with 12 👑Proud Congo performance once again 👏🏽🇨🇩 pic.twitter.com/4GALURPta8— Fabrizio Romano (@FabrizioRomano) July 1, 2026 -
పుట్టెడు దుఃఖంలోనూ దేశం కోసం వరల్డ్ కప్ లో గోల్ కొట్టిన నెదర్లాండ్స్ ప్లేయర్
-
40 ఏళ్ల తర్వాత నాకౌట్ విజయం.. సంబరాల్లో మెక్సికో
ఫిఫా వరల్డ్ కప్‌లో హోస్ట్ జట్టు మెక్సికో అద్భుత ప్రదర్శనతో 40 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఎస్టాడియో అజ్టెకాలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో ఈ జట్టు 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ ఆవకాశాలను మెరుగుపర్చుకుంది.ఆరంభం నుంచే దూకుడు.. 9 నిమిషాల్లో రెండు గోల్స్వాతావరణం అనుకూలించని కారణంగా మ్యాచ్ ప్రారంభం గంట ఆలస్యమైనా, అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. హోమ్ క్రౌడ్ మద్దతుతో మెక్సికో మొదటి నుంచే ఆధిపత్యం చూపింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ నమోదయ్యాయి.జూలియన్ క్వినోనెస్ అద్భుత గోల్‌తో ఖాతా తెరవగా.. వెంటనే రౌల్ జిమెనెజ్ రెండో గోల్‌తో ఆధిక్యం పెంచాడు.మెక్సికో చివరిసారిగా 1986 ఎడిషన్‌లో బల్గేరియాపై నాకౌట్ విజయం సాధించింది. ఇప్పుడు అదే అజ్టెకా స్టేడియంలో, అదే స్కోర్‌లైన్‌తో మరోసారి నాకౌట్ గెలుపు నమోదు చేసింది. వరుసగా 7 నాకౌట్ పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం మెక్సికోకు భారీ ఊరట ఇచ్చింది.ఈక్వెడార్‌కు నిరాశగ్రూప్ దశలో జర్మనీపై సంచలన విజయం సాధించి అనూహ్యంగా అంచనాలు పెంచుకున్న ఈక్వెడార్, ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. రెండో అర్ధభాగంలో పీరో హింకాపీ రెడ్ కార్డ్‌తో వైదొలగడంతో జట్టు 10 మందికే పరిమితమైంది.తదుపరి పోరాటం ఎవరితో..?మెక్సికో క్వార్టర్ ఫైనల్ చేరేందుకు ఇంగ్లండ్ లేదా డీఆర్ కాంగోతో తలపడనుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే హోస్ట్ జట్టును అంచనా వేయడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. -
మెస్సీని దాటేసిన ఎంబాపె.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ దూసుకుపోతోంది. టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ జట్టు రౌండ్ ఆఫ్ 32లో స్వీడన్‌ను 3-0తో చిత్తు చేసింది. కైలియన్ ఎంబాపె మరోసారి డబుల్ గోల్స్ (45, 74వ నిమిషం)తో మెరవగా, బ్రాడ్లీ బార్కోలా (53వ నిమిషం) మరో గోల్ సాధించాడు. ఫ్రాన్స్ దూకుడుకు స్వీడన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకోవడంతో స్వీడన్‌కు గోల్‌పోస్టుపై దాడులు చేసే అవకాశాలు కూడా తక్కువగానే వచ్చాయి. నిర్ణీత సమయం ముగిసేలోపే ఫ్రాన్స్ విజయం ఖరారు అయిపోయింది. ఇక ప్రీ క్వార్టర్స్‌లో పరాగ్వేతో ఫ్రాన్స్ తలపడనుంది.ఆమడదూరంలో మెస్సీఫిఫా చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో కైలియన్ ఎంబాపె సరికొత్త రికార్డు సృష్టించాడు. మెస్సీకి కూడా సాధ్యం కాని రికార్డును ఎంబాపె తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె (10 గోల్స్) తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బ్రెజిల్ దిగ్గజ ఆటగాళ్లు లియోనిదాస్, రొనాల్డో ఫిఫా నాకౌట్ దశలో (8 గోల్స్) సమానంగా ఉన్నారు. వీరి తర్వాత జస్ట్ ఫౌంటైన్, వావా, ఒల్డ్రిచ్, పీలే (7 గోల్స్) ఉన్నారు. ఇక అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ (5 గోల్స్) 12వ స్థానంలో నిలిచి ఎంబాపెకు ఆమడ దూరంలో నిలిచాడు. ఇక ఎంబాపె ఆడిన మూడు వరల్డ్‌కప్స్ (2018, 2022, 2026) నాకౌట్ దశలు కలిపి 10 గోల్స్ కొట్టగా.. ఇందులో 2018లో నాకౌట్ దశలో మూడు గోల్స్, 2022 ఫిఫా నాకౌట్ దశల్లో ఐదు గోల్స్, తాజాగా 2026 ఫిఫాలో నాకౌట్ దశలో ఇప్పటికే రెండు గోల్స్ సాధించాడు. ఈ ప్రపంచకప్ ముగిసేసరికి నాకౌట్ దశలో ఇంకెన్ని గోల్స్ చేస్తాడో చూడాలి. ఈ లెక్కన 27 ఏళ్ల ఎంబాపె వచ్చే ఫిఫా ప్రపంచకప్ (2030) నాటికి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.మెస్సీ రికార్డుకు అడుగు దూరంలోఇక ఫ్రాన్స్ సంచలనం కైలియన్ ఎంబాపె రికార్డుల మీద రికార్డులు సాధిస్తూనే వస్తున్నాడు. తాజాగా స్వీడన్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా ఎంబాపె (18 గోల్స్) ఫిఫాలో అత్యధిక గోల్స్ చేసిన ఆల్‌టైమ్ ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును బద్దలుకొట్టాడు. ఇక అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ 19 గోల్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. మెస్సీ రికార్డును సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఎంబాపె అత్యధిక గోల్స్ తన పేరిట లిఖించుకోవడానికి మాత్రం ప్రస్తుతానికైతే రెండు గోల్స్ దూరంలో నిలిచాడు. కేప్‌వెర్డెతో జరగనున్న మ్యాచ్‌లో మెస్సీ గోల్స్ చేస్తే మాత్రం ఎంబాపె ఆ రికార్డును అందుకోవడానికి సమయం పడుతుంది. ఏది ఏమైనా ఎంబాపె మాత్రం మెస్సీ రికార్డును ఈ ఫిఫాలోనే అధిగమించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఫిఫాలో అత్యధిక గోల్స్ జాబితాలియోనల్ మెస్సీ (అర్జెంటీనా)- 19 గోల్స్కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)- 18 గోల్స్మిరాస్లావ్ క్లోజ్ (జర్మనీ)- 17 గోల్స్రొనాల్డో (బ్రెజిల్)- 16 గోల్స్గెర్డ్ ముల్లర్ (జర్మనీ)- 14 గోల్స్జస్ట్ ఫౌంటైన్ (ఫ్రాన్స్)- 13 గోల్స్పీలే (బ్రెజిల్)- 12 గోల్స్Kylian Mbappé scores his NINTH goal in the World Cup knockouts. The most of any men's player ever 😲🇫🇷 pic.twitter.com/mq0JT61eJz— B/R Football (@brfootball) June 30, 2026 -
జర్మనీ, నెదర్లాండ్స్ ఖేల్ ఖతం
అత్యంత నిలకడగా రాణించే జట్టుగా పేరున్న జర్మనీ... ప్రపంచకప్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్... ఈసారి నిరాశపరిచాయి. కీలకదశలో ఒత్తిడికి తలొగ్గిన జర్మనీ, నెదర్లాండ్స్ నాకౌట్ దశ తొలి రౌండ్ మ్యాచ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాయి. భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పరాగ్వే, మొరాకో సంచలన ఫలితాలతో ప్రపంచకప్‌లో మరో అడుగు ముందుకు వేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మేటి జట్లకు కూడా చెమటలు పట్టించే ‘పెనాల్టీ షూటౌట్’లో పరాగ్వే 4–3తో జర్మనీపై... మొరాకో ‘పెనాల్టీ షూటౌట్’లో 3–2తో నెదర్లాండ్స్‌పై విజయం సాధించాయి. బోస్టన్: గత మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత సాధించలేకపోయిన పరాగ్వే ఆ కసినంతా తాజా ప్రపంచకప్‌లో తీర్చుకుంటోంది. సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకుంటోంది. లీగ్ దశలో మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ దశకు చేరుకున్న పరాగ్వే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నాలుగుసార్లు చాంపియన్, నాలుగుసార్లు రన్నరప్ జర్మనీ జట్టును కంగుతినిపించింది. నిర్ణీత 90 నిమిషాలు ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 42వ నిమిషంలో జూలియో ఎన్సిసో గోల్‌తో పరాగ్వే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 54వ నిమిషంలో కాయ్ హావెట్జ్ గోల్‌తో జర్మనీ స్కోరును 1–1తో సమం చేసింది. రెగ్యులర్ సమయం ముగిశాక రెండు జట్లు సమఉజ్జీగా నిలవడంతో... ఫలితం తేల్చేందుకు అదనపు 30 నిమిషాలు ఆడించారు. అదనపు సమయం ముగిశాకా రెండు జట్లు సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహించారు.‘షూటౌట్’లో జర్మనీ ముగ్గురు ఆటగాళ్లు హావెట్జ్, వోల్టెమేడ్, జొనాథన్... పరాగ్వే ఇద్దరు ఆటగాళ్లు సనబ్రియా, బల్బయేనా గురి తప్పారు. ఆరో షాట్‌ను కెనాలో గోల్‌గా మలచడంతో పరాగ్వే సంబరాలు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ‘షూటౌట్’లో ఓడిపోయిన జర్మనీ బృందం నిరాశలో మునిగిపోయింది.‘షూటౌట్’లో మూడో‘సారీ’నెదర్లాండ్స్, మొరాకో మధ్య మ్యాచ్‌లో నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యాక రెండు జట్లు 1–1తో సమఉజ్జీగా నిలిచాయి. 72వ నిమిషంలో కోడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ముందంజ వేసింది. 90+1వ నిమిషంలో ఇసా డియోప్ గోల్‌తో మొరాకో స్కోరును 1–1తో సమం చేసింది. అదనపు సమయంలోనూ ఫలితం రాకపోవడంతో విజేతను నిర్ణయించేందుకు ‘పెనాల్టీ షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ఒత్తిడికి తలొగ్గి ఓటమిని మూటగట్టుకున్నారు. 2014, 2022 ప్రపంచకప్ టోర్నీల్లో ‘షూటౌట్’లోనే తడబడి నిష్క్ర మించిన నెదర్లాండ్స్ మూడోసారి ఈ మెగా ఈవెంట్లో ‘షూటౌట్’లో విఫలమైంది. -
హాలండ్ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్టర్స్‌కు నార్వే
ఫిఫా ప్రపంచకప్‌లో 28 ఏళ్ల తర్వాత నార్వే జట్టు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా మంగళవారం రాత్రి ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే 2-1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. నార్వే తరఫున ఆంటోనియో నుసా (39వ నిమిషం), ఎర్లింగ్ హాలండ్ (86వ నిమిషం) గోల్స్ చేశారు. ఇక ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో (74వ నిమిషం) గోల్ సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో బ్రెజిల్‌తో నార్వే అమీతుమీ తేల్చుకోనుంది. ఆట మొదలైన తర్వాత తొలి హాఫ్‌కు ముందు నార్వేకు ఆంటోనియో గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో ఐవరీ కోస్ట్ తరఫున అమడ్ డియాల్లో గోల్ చేసి ఆ జట్టు తరఫున నాకౌట్లో తొలి గోల్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక మ్యాచ్ డ్రా దిశగా నడుస్తున్న సమయంలో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలండ్ 82వ నిమిషంలో తన సహచరుడు అందించిన పాస్‌ను ఏమాత్రం తప్పు చేయకుండా సింపుల్‌గా గోల్‌పోస్ట్‌లోకి పంపించి ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇంజ్యూరీ టైమ్‌లో ఐవరీ కోస్ట్ గోల్ చేయడంలో విఫలం కావడంతో నార్వే విజయాన్ని సాధించింది.ఇక నార్వే స్టార్ ఎర్లింగ్ హాలండ్ ఐవరీ కోస్ట్‌తో మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా అరుదైన రికార్డు సాధించాడు. తొలి ప్రపంచకప్ ఆడుతున్న ఎర్లింగ్ హాలండ్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో తన తొలి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన హాలండ్.. గెర్డ్ ముల్లర్ (జర్మనీ), యూసెబియో (పోర్చుగల్), జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) వంటి దిగ్గజ స్ట్రైకర్ల సరసన చోటు సంపాదించాడు. మొత్తం మీద నాలుగు మ్యాచ్‌ల్లో హాలండ్ ఆరు గోల్స్ చేశాడు. మరోవైపు తొలిసారి నాకౌట్ మ్యాచ్ ఆడిన ఐవరీ కోస్ట్ తన స్థాయిని మించి ప్రదర్శన చేసిందని చెప్పొచ్చు. Well done, Norway! 🇳🇴 Congratulations on the victory!You rowed hard throughout the entire match! pic.twitter.com/6m8IueBJ0r— Orla Joelsen (@OJoelsen) June 30, 2026 👽🇳🇴 3 starts, 5 goals. Erling Haaland has scored in every single World Cup game he’s played in his career.Absolute machine. pic.twitter.com/XIMg3UJQbP— Fabrizio Romano (@FabrizioRomano) June 30, 2026 -
నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన మొరాకో
ఫిఫా వరల్డ్‌కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 చేరేసరికి మరింత రసవత్తరంగా మారింది. ఈ దశలో భాగంగా ఇవాళ జరిగిన నాలుగు మ్యాచ్‌లు చివరి నిమిషాల వరకు తీవ్ర ఉత్కంఠ రేపాయి. సౌతాఫ్రికాపై కెనడా 92వ నిమిషంలో గోల్ చేసి విజయం సాధించగా.. జపాన్‌పై బ్రెజిల్ 96వ నిమిషంలో మ్యాచ్ విన్నింగ్ గోల్ సాధించి రౌండ్ ఆఫ్ 16కి చేరింది.మరో మ్యాచ్‌లో జర్మనీపై పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించగా.. ఇంకో మ్యాచ్‌లో మొరాకో సైతం నెదర్లాండ్స్‌కు అదే తరహాలో షాకిచ్చింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు తలో గోల్ చేసి సమంగా నిలువగా.. పెనాల్టీ షూటౌట్లో మొరాకో పటిష్టమైన నెదర్లాండ్స్‌ను 3-2తో ఓడించి ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్-16)కు అర్హత సాధించింది.పెనాల్టీ షూటౌట్లోనూ నాలుగు రౌండ్లు ముగిసే సరికి స్కోరు 2-2తో సమంగా ఉన్నప్పటికీ.. కీలక సమయంలో మొరాకో గోల్‌కీపర్ యాస్సిన్ బౌనో నెదర్లాండ్స్ ఆటగాడు క్రిసెన్సియో సమ్మర్విల్లే పెనాల్టీని అద్భుతంగా అడ్డుకున్నాడు. అనంతరం ఇస్మాయిల్ సైబారి తన కిక్‌ను గోల్‌గా మలిచి మొరాకోకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గోల్ సాధించిన వెంటనే సైబారి ఆనందంతో జెర్సీ విప్పి సంబరాలు చేసుకోగా, సహచర ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి సంబరాల్లో మునిగిపోయారు.ఈ మ్యాచ్‌లో తొలుత ఆధిక్యం నెదర్లాండ్స్‌కే లభించింది. 72వ నిమిషంలో కోడి గాక్పో గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌కు సమ్మర్విల్లే అసిస్ట్ చేశాడు. అయితే చివరి క్షణాల్లో మొరాకో పోరాటం ఫలించింది. ఇంజరీ టైమ్ (91వ నిమిషం)లో ఇస్సా డియోప్ హెడ్డర్‌తో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. అదనపు 30 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు చేరుకుంది.ఈ పరాజయంతో నెదర్లాండ్స్‌కు మరో అపవాదు కూడా ఎదురైంది. గత 11 ప్రపంచకప్‌లలో కనీసం రౌండ్ ఆఫ్-16కు చేరిన డచ్ జట్టు, ఊహించని విధంగా ఈసారి రౌండ్ ఆఫ్-32లోనే నిష్క్రమించింది.మరోవైపు, గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ వరకు చేరి చరిత్ర సృష్టించిన మొరాకో, ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తోంది. రౌండ్ ఆఫ్-16లో ఆ జట్టు కెనడాతో తలపడనుంది. -
ఫిఫాలో సంచలనం.. పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఓటమి
ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ జర్మనీ ఆట ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన పోరులో పెనాల్టీ షూటౌట్లో 4-3తో జర్మనీ ఓటమి చవిచూసింది. ఐదోసారి ఫిఫా చాంపియన్‌గా నిలవాలని భావించిన జర్మనీకి పరాగ్వే చెక్ పెట్టింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. జర్మనీ తరఫున ఆట 54వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ గోల్ చేయగా, పరాగ్వే తరఫున ఆట 42వ నిమిషంలో జులియో ఎన్సియో గోల్ సాధించాడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఇంజ్యూరీ టైమ్‌తో పాటు ఎక్స్ట్రా టైమ్ (మరో 30 నిమిషాలు) అదనంగా కేటాయించినప్పటికీ జర్మనీ, పరాగ్వే గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. 2018, 2022 ఫిఫా ప్రపంచకప్పుల్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన జర్మనీ ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటినప్పటికీ రౌండ్ ఆఫ్ 16ను దాటడంలో విఫలమయ్యింది. ఇక నాకౌట్ దశను దాటి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన పరాగ్వే జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2010 ఫిఫాలో వచ్చింది. ఆ ఏడాది ప్రపంచకప్‌లో పరాగ్వే క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. THE FOUR-TIME WORLD CUP WINNERS, GERMANY, ARE ELIMINATED IN THE ROUND OF 32 BY PARAGUAY ON PENALTIES.The first upset of the knockout stage 🤯 pic.twitter.com/axPr7fNdEN— ESPN (@espn) June 29, 2026🚨🚨💣 QUEL ÉNORME COUP DE TONNERRE : LE PARAGUAY 🇵🇾 ÉLIMINE L'ALLEMAGNE 🇩🇪 DÈS LES SEIZIÈMES DE FINALE DU MONDIAL !!! 🤯⚡️CONTRE TOUTE ATTENTE, LES PARAGUAYENS S'IMPOSENT AUX TIRS AU BUT CONTRE LES QUADRUPLES CHAMPIONS DU MONDE !!!C'EST UNE FOLIE, LES ALLEMANDS N'ONT PLUS… pic.twitter.com/pOz2lRnZi9— Actu Foot (@ActuFoot_) June 29, 2026 -
కెనడా కిక్... దక్షిణాఫ్రికా అవుట్
లాస్ ఏంజెలిస్: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మరో అడుగు ముందుకు వేసింది. మూడోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్న కెనడా జట్టు తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రౌండ్–32 తొలి నాకౌట్ మ్యాచ్‌లో కెనడా 1–0 గోల్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 90+2వ నిమిషంలో ‘డి’ ఏరియా పైభాగం నుంచి స్టీఫెన్ యుస్టాకియో సంధించిన కిక్‌ను దక్షిణాఫ్రికా గోల్‌కీపర్ నిలువరించలేకపోయాడు. దాంతో కెనడా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం స్టాపేజ్ సమయంలోని మిగతా ఐదు నిమిషాలపాటు దక్షిణాఫ్రికాను కట్టడి చేసి కెనడా విజయాన్ని అందుకుంది. -
ఆఖరి నిమిషంలో గోల్.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్
ఫిఫా ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ బ్రెజిల్ ప్రిక్వార్టర్స్ (రౌండ్ ఆఫ్ 16)లో అడుగుపెట్టింది. సోమవారం రాత్రి రౌండ్ ఆఫ్ 32లో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ 2-1 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున కేస్మిరో (56వ నిమిషం), గాబ్రియెల్ మార్టినెల్లి (90+6వ నిమిషం) గోల్స్ కొట్టారు. ఇక జపాన్ తరఫున కైషూ సానో 29వ నిమిషంలో గోల్ సాధించాడు. ఆట తొలి అర్ధభాగంలో జపాన్ పూర్తి ఆధిప్యతం కనబరిచింది. గాయంతో బ్రెజిల్ స్టార్ నెయ్మర్ జూనియర్ జపాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరంగానే ఉన్నాడు. దీంతో ఆరంభం నుంచి బ్రెజిల్ కాస్త తడబడింది. అయితే జపాన్ మాత్రం బ్రెజిల్‌పై పదే పదే దాడులు చేసింది. ఈ నేపథ్యంలో 29వ నిమిషంలో కైషూ సానో జపాన్‌కు గోల్ అందించాడు. దీంతో హాఫ్ టైమ్ ముగిసేసరికి జపాన్ 1-0తో బ్రెజిల్‌పై ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో బ్రెజిల్ డిఫెన్స్ మోడ్ నుంచి బయటకు వచ్చి దూకుడును ప్రదర్శించింది. దీంతో ఆట మొదలైన కాసేపటికే 56వ నిమిషంలో కేస్మిరో బ్యాక్ హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి 1-1తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్ పలుమార్లు జపాన్ గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ సమర్థంగా అడ్డుకుంది. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉండడంతో స్టాపేజీ టైమ్ (ఇంజ్యూరీ టైమ్) ఇచ్చారు. స్టాపేజీ టైమ్ బ్రెజిల్‌కు కలిసి వచ్చింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గాబ్రియెల్ మార్టినెల్లి గుమెరాస్ నుంచి పాస్ అందుకొని డీప్ నుంచి బంతిని గోల్‌పోస్ట్‌కు తరలించి బ్రెజిల్‌కు రెండో గోల్ అందించడంతో పాటు విజయాన్ని సాధించి పెట్టాడు. ఇప్పటి వరకు జరిగిన 23 ప్రపంచకప్‌లలో ఆడిన బ్రెజిల్ జట్టు 20వసారి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఇక రౌండ్ ఆఫ్ 16లో బ్రెజిల్.. ఐవరీ కోస్ట్, నార్వే మధ్య విజేతతో తలపడనుంది.🚨🌎 GABRIEL MARTINELLI HAS WON IT IN THE 95TH MINUTE FOR BRAZIL! 🤯🤯Brazil 2-1 Japan.pic.twitter.com/JUQ8WZsa2v— Tekkers Foot (@tekkersfoot) June 29, 2026 -
కేప్ వెర్డే కెప్టెన్‌పై లైంగిక ఆరోపణలు!
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆఫ్రికా ద్వీప దేశం కేప్ వెర్డే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో కేప్ వెర్డే వరుస డ్రాలతో రౌండ్ ఆఫ్ 32 కి దూసుకెళ్లింది. అయితే అర్జెంటీనాతో నాకౌట్ మ్యాచ్‌కు ముందు కేప్ వెర్డేకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రేయాన్ మెండిస్‌పై అత్యాచార ఆరోపణలు రావడం ప్రస్తుతం ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌లో జరిగిన ఒక టోర్నీ సందర్భంగా.. జట్టుకు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన బ్రెజిల్ మహిళపై మెండిస్ హోటల్ గదిలో లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆక్లాండ్ పోలీసులకు సదరు మహిళ ఫిర్యాదు చేసినట్లు బ్రెజిల్‌కు చెందిన 'గ్లోబో' మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. బ్రెజిల్ మహిళ ఆరోపణలపై ఫిఫా స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, న్యూజిలాండ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఫిఫా తెలిపింది. -
సౌతాఫ్రికా హృదయం ముక్కలు
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసిపోయింది. రౌండ్ 32లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కెనడాను సౌతాఫ్రికా నిలువరించలేకపోయింది. ఫలితంగా కెనడా చేతిలో 1-0తో ఓటమి పాలైంది.ఈ క్రమంలో కెనడా రౌండ్ 16కు దూసుకువెళ్లగా.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంజూరీ టైమ్‌లో కెనడా మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ ఉస్తాకియో అద్భుత రీతిలో గోల్ కొట్టాడు. దీంతో కెనడా 1-0తో విజయం సాధించగా.. సౌతాఫ్రికా హృదయం ముక్కలైంది. తొలిసారి..ఇక కెనడా రౌండ్ 16 మ్యాచ్‌లో భాగంగా నెదర్లాండ్స్ లేదంటే మోరాకోతో తలపడనుంది. కాగా ఆతిథ్య దేశమైన కెనడా గ్రూప్ దశలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. గ్రూప్-బిలో భాగంగా బోస్నియాతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న కెనడా.. ఖతార్‌పై 6-0తో విజయం సాధించింది. అయితే, ఆఖరి మ్యాచ్‌లో భాగంగా స్విట్జర్లాండ్ చేతిలో 2-1తో ఓడిపోయింది.అయితే, బోస్నియా, ఖతార్ పేలవ ప్రదర్శన కారణంగా గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన కెనడా.. నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక నాకౌట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎలిమినేట్ చేసి మరో ముందడుగు వేసింది. కాగా కెనడా నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
అర్జెంటీనా... అదే జోరు
డాలస్: డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడిన అర్జెంటీనా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్ దశను అజేయంగా ముగించింది. జోర్డాన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘జె’ చివరి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–1తో గెలిచింది. అర్జెంటీనా తరఫున జియోవాని సెల్సో (19వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (31వ నిమిషంలో), లియోనెల్ మెస్సీ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జోర్డాన్ తరఫున మూసా అల్తమారి (55వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన అర్జెంటీనా తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘జె’ టాపర్‌గా నిలిచింది. ఈ టోర్నీలో మెక్సికో, ఫ్రాన్స్ తర్వాత గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మూడో జట్టుగా అర్జెంటీనా ఘనత వహించింది. అంతేకాకుండా అర్జెంటీనా ఐదోసారి ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో నెగ్గింది. బ్రెజిల్, జర్మనీ జట్ల తర్వాత ప్రపంచకప్‌లో 50 విజయాలు సాధించిన మూడో జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. శనివారం జరిగే నాకౌట్ దశ మ్యాచ్‌లో కేప్ వెర్డె జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. నాకౌట్ బెర్త్ ముందే ఖరారు కావడంతో జోర్డాన్‌తో మ్యాచ్‌లో కెపె్టన్ మెస్సీ 60వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. 80వ నిమిషంలో గోల్ సాధించాడు. తద్వారా వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా మెస్సీ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో మెస్సీకిది 19వ గోల్ కావడం విశేషం.పోర్చుగల్, కాంగో కూడా...గ్రూప్ ‘కె’ నుంచి క్రిస్టియానో రొనాల్లో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు... 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన కాంగో జట్టు కూడా నాకౌట్ బెర్త్‌లు సాధించి ముందంజ వేశాయి. వరుసగా రెండు విజయాలు సాధించి ఇప్పటికే నాకౌట్ దశకు చేరిన కొలంబియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. మరో మ్యాచ్‌లో కాంగో జట్టు 3–1తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచింది. గ్రూప్ ‘కె’లో 7 పాయింట్లతో కొలంబియా తొలి స్థానంలో, 5 పాయింట్లతో పోర్చుగల్ రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా కాంగో జట్టు నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈసారి ప్రపంచకప్‌లలో ఆఫ్రికా నుంచి 10 దేశాలు పాల్గొనగా... ఏకంగా 8 దేశాలు నాకౌట్ దశకు అర్హత పొందడం విశేషం.‘డ్రా’తో ఆస్ట్రియా, అల్జీరియా ముందుకు...గ్రూప్ ‘జె’లో భాగంగా అల్జీరియా, ఆ్రస్టియా మధ్య జరిగిన మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఈ ఫలితంతో ఆస్ట్రియా, అల్జీరియా నాలుగు పాయింట్లతో సమంగా నిలిచాయి. గోల్స్ అంతరంతో ఆస్ట్రియా గ్రూప్ ‘జె’లో రెండో స్థానంతో నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అల్జీరియా ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను సంపాదించింది. గత రెండు ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌కు చేరిన క్రొయేషియా జట్టు... నాకౌట్ బెర్త్ పొందాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటుకుంది. ఘనా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎల్’ మ్యాచ్‌లో క్రొయేషియా 2–1తో విజయం సాధించింది. గ్రూప్ ‘ఎల్’లోని మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 2–0తో పనామా జట్టును ఓడించింది. గ్రూప్ ‘ఎల్లో ఇంగ్లండ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో, క్రొయేషియా 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఘనా జట్టు ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. -
ఫిఫా చరిత్రలో అరుదైన ఘట్టం.. ఆ 9 దేశాలు నాకౌట్‌కు!
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఒక అరుదైన ఫీట్ నమోదయ్యింది. ఆఫ్రికాకు చెందిన 10 దేశాలు ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొంటే అందులో 9 దేశాలు నాకౌట్‌కు అర్హత సాధించడం విశేషం. ఆదివారం ఉజ్బెకిస్తాన్‌పై కాంగో 3-1తో విజయం, అల్జీరియా-ఆస్ట్రియా మధ్య మ్యాచ్ (3-3) డ్రా కావడంతో ఆఫ్రికాకు చెందిన తొమ్మిది దేశాలు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించినట్లయింది. గతంలో ఒక ఫిఫా ప్రపంచకప్‌లో రెండుమార్లు (2014, 2022లో) ఆరు ఆఫ్రికా దేశాలు నాకౌట్ చేరడమే ఇప్పటికీ రికార్డుగా ఉంది. తాజాగా మాత్రం మొరాకో, సౌతాప్రికా, సెనెగల్, ఐవరీ కోస్ట్, ఘనా, కేప్‌వెర్డె, ఈజిప్ట్, కాంగో, అల్జీరియా నాకౌట్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. అయితే ఈసారి ప్రపంచకప్‌లో మాత్రం ఆఫ్రికా సాకర్ బలం మరింత పెరిగింది. కేప్‌వెర్డె, కాంగో లాంటి చిన్నజట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడం చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఫుట్‌బాల్‌లో మంచి రికార్డు కలిగిన ఇరాన్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.కేప్‌వెర్డె ఫుట్‌బాల్ జట్టుఇక 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన మొదటి ఆఫ్రికా దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన మొరాకో బలమైన బ్రెజిల్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఈసారి కూడా మొరాకో సెమీస్ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగో ఫుట్‌బాల్ టీం2030 ఫిఫా ప్రపంచకప్‌కు మొరాకో సహ ఆతిథ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగో, కేప్‌వెర్డె తదుపరి రౌండ్లో బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోనున్నాయి. లీగ్ దశలో సంచనలన ప్రదర్శన చేసిన కేప్‌వెర్డె రౌండ్ ఆఫ్ 32లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను కాంగో ఎదుర్కోనున్నాయి.రౌండ్ ఆఫ్ 32 పోరు ఇలా..'రౌండ్ 32'కు అర్హత సాధించిన జట్ల మధ్య సోమవారం నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. మొత్తం 16 మ్యాచ్‌ల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌లు రౌండ్ 16 లేదా ప్రిక్వార్టర్స్‌లో తలపడతాయి. ఓడిన టీమ్ ఇంటిముఖం పట్టాల్సిందే. ఇక్కడ డ్రా అనే మాటే ఉండదు. నిర్ణీత సమయం, అదనపు సమయంలోగా ఎవరూ గోల్స్ చేయకపోతే.. పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.జూన్ 29: బ్రెజిల్ వర్సెస్ జపాన్, దక్షిణాఫ్రికా వర్సెస్ కెనడాజూన్ 30: ఐవరీ కోస్ట్ వర్సెస్ నార్వే, జర్మనీ వర్సెస్ పరాగ్వే, నెదర్లాండ్స్ వర్సెస్ మొరాకోజులై 1: ఫ్రాన్స్ వర్సెస్ స్వీడన్, మెక్సికో వర్సెస్ ఈక్వెడార్, ఇంగ్లాండ్ వర్సెస్ డీఆర్ కాంగోజులై 2: యూఎస్ఏ వర్సెస్ బోస్నియా, బెల్జియం వర్సెస్ సెనెగల్జులై 3: స్పెయిన్ వర్సస్ ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వర్సెస్ అల్జీరియా, పోర్చుగల్ వర్సెస్ క్రొయేషియా, ఆస్ట్రేలియా వర్సెస్ ఈజిప్ట్జులై 4: అర్జెంటీనా వర్సెస్ కేప్ వెర్డె, కొలంబియా వర్సెస్ ఘనాRead: ఆఖరి బంతికి సిక్స్.. గెలిపించిన భారత సంతతి క్రికెటర్ -
ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ ప్రపంచ రికార్డు
ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా లీగ్ దశను ఓటమన్నదే లేకుండా అజేయంగా ముగించింది. గ్రూప్-జెలో భాగంగా జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అర్జెంటీనా తరఫున గివాని సెల్సో (19వ నిమిషం), లుటారో మార్టినేజ్ (31వ నిమిషం), లియోనల్ మెస్సీ (80వ నిమిషం)లో గోల్స్ సాధించగా, జోర్డాన్ తరఫున ముసా అల్ తమారీ (55వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన అర్జెంటీనా 9 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నాకౌట్‌కు అర్హత సాధించింది. అర్జెంటీనాతో పాటు ఆస్ట్రియా, అల్జీరియా కూడా తదుపరి రౌండ్‌కు చేరుకోగా, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన జోర్డాన్ ఇంటిబాట పట్టింది. ఇక నాకౌట్లో మెస్సీ సేన తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌లో రౌండ్ ఆఫ్ 32కు చేరిన కేప్ వెర్డెతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ద్వారా లియోనల్ మెస్సీ మరో రికార్డు సాధించాడు. జోర్డాన్‌తో మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా మెస్సీ వరుసగా ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీకి ఇది ఆరో గోల్ కావడం విశేషం. ఆరు గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఫ్రాన్స్ సంచలనం ఎంబాపె 4 గోల్స్‌తో అతడిని అనుసరిస్తున్నాడు. తాజా గోల్‌తో మెస్సీ ఫిఫా గోల్స్ సంఖ్య 19కి చేరుకుంది. ఆట 60వ నిమిషంలో మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీ 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. జోర్డాన్ జట్టుతో పాటు గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ మెస్సీ కొట్టిన గోల్ హైలైట్‌గా నిలిచింది. మెస్సీ కొట్టిన గోల్‌ను చూసి జోర్డాన్ గోల్‌కీపర్ ఆశ్చర్యపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Messi free kick from that angle is nuts. Alien. pic.twitter.com/8g333O2h8M— Geronimo Morgans (@GeronimoMorgans) June 28, 2026💥🇦🇷 Lionel Messi breaks another record as he becomes the FIRST PLAYER EVER to score in 7 consecutive World Cup games.Perfect free kick. 🎨 pic.twitter.com/vgWxKSV6CW— Fabrizio Romano (@FabrizioRomano) June 28, 2026చదవండి: భూకంప విలయం.. కన్నపేగు కోసం ఫుట్‌బాలర్ భార్య ప్రాణత్యాగం -
నాకౌట్‌కు క్రొయేషియా.. బతికిపోయిన పోర్చుగల్
ఫిఫా ప్రపంచకప్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో క్రొయేషియా జూలు విదిల్చింది. గ్రూప్-ఎల్లో ఘనాతో జరిగిన మ్యాచ్‌లో క్రొయే షియా 2-1 తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కొలంబియాతో డ్రా చేసుకున్న పోర్చుగల్ కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించడం గమనార్హం. క్రొయేషియా తరఫున ఆట 31వ నిమిషంలో పీటర్ సుకిక్ తొలి గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట రెండో అర్ధభాగంలో ఘనా ప్లేయర్ డెర్రిక్ లుకాస్సెన్ 73వ నిమిషంలో గోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. ఇక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న తరుణంలో చివరి క్వార్టర్లో (ఆట 83వ నిమిషంలో) నికోలా వ్లాసిక్ మరో గోల్ కొట్టడంతో క్రొయేషియా 2-1తో నిలిచి విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో ఓడినప్పటికీ క్రొయేషియాతో పాటు ఘనా కూడా నాకౌట్‌కు అర్హత సాధించింది. అంతకముందు ఇదే గ్రూప్‌లో పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-0 తేడాతో విజయాన్ని అందుకొని ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది.నిరాశపరిచిన రొనాల్డో..కొలంబియాతో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా పోర్చుగల్ 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 7 పాయింట్లతో ఉన్న కొలంబియా గ్రూప్ టాపర్‌గా నాకౌట్లో అడుగుపెట్టింది. నిర్ణీత సమయం ముగిసేలోపు ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన క్రిస్టియానో రొనాల్డో తన ఫెవరేట్ ఓవర్‌హెడ్ కిక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించే ప్రయత్నం చేయడం హైలైట్‌గా నిలిచింది. అయితే కొలంబియా గోల్ కీపర్ దానిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఇక రెండో హాఫ్‌లో ఇరుజట్లు పదే పదే గోల్ పోస్టులపై దాడులు చేసుకున్నప్పటికీ లాభం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ పోర్చుగల్ ఓడిపోయి ఉంటే మూడో స్థానంలో నాకౌట్లో అడుగుపెట్టేది. ఇక నాకౌట్లో పోర్చుగల్ జట్టు క్రొయేషియాతో అమీతుమీకి సిద్ధమైంది. -
ఉస్మాన్ 'హ్యాట్రిక్'
బోస్టన్: ‘ఫిఫా’ ప్రపంచ కప్‌లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్ తమ జోరు కొనసాగించింది. గ్రూప్ ‘ఐ’లో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి టాపర్‌గా ‘నాకౌట్’లోకి ప్రవేశించింది. 1998లో విజేతగా నిలిచిన తర్వాత లీగ్ దశలో ఫ్రాన్స్ అన్ని మ్యాచ్‌లూ గెలవడం ఇదే మొదటిసారి. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4–1 గోల్స్ తేడాతో నార్వేను చిత్తు చేసింది. ఫ్రాన్స్ తరఫున ఉస్మాన్ డెంబెలె ‘హ్యాట్రిక్’ గోల్స్ సాధించడం విశేషం.తొలి అర్ధ భాగంలోనే (7వ, 20వ, 32వ నిమిషాల్లో) అతను మూడు గోల్స్ కొట్టాడు. తద్వారా ప్రపంచ కప్ చరిత్రలో రెండో వేగవంతమైన హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. 1954 ప్రపంచ కప్‌లో చెకొస్లవేకియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా ఆటగాడు ఎరిక్ ప్రోబ్ ఆట మొదలైన 24 నిమిషాల్లోనే మూడు గోల్స్ కొట్టి రికార్డు నమోదు చేశాడు.తాజా మ్యాచ్‌లో ఫ్రాన్స్ తరఫున నాలుగో గోల్‌ను డిజైర్ డో (90+4వ ని.లో) సాధించగా ... నార్వే ఆటగాడు థెలో అస్గార్డ్ (21వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. అయితే ‘ఐ’ గ్రూప్ నుంచి ఈ మ్యాచ్‌కు ముందే నార్వే కూడా నాకౌట్‌కు అర్హత సాధించగా... సంచలన ప్రదర్శనతో సెనెగల్ కూడా ముందంజ వేసింది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సెనెగల్ 5–0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సెనెగల్ తరఫున పేప్ గుయె (59వ, 71వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా... హబీబ్ దియారా (4వ ని.), ఇస్మాయిలా సర్ (56వ ని.), లిమాన్ ఎన్దియె (82వ ని.) ఒక్కో గోల్ కొట్టారు. ఈ గ్రూప్‌లో సెనెగల్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 12 గ్రూప్‌ల నుంచి మూడో స్థానాల్లో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన టాప్–8 టీమ్‌లు కూడా ముందంజ వేస్తాయి. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనతో సెనెగల్ నాకౌట్లోకి ప్రవేశించింది. బెల్జియం, ఈజిప్ట్ ముందంజ 2018 ప్రపంచ కప్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన (మూడో స్థానం) కనబర్చిన బెల్జియం జట్టు మరో సారి నాకౌట్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘జి’లో జరిగిన పోరులో బెల్జియం 5–1 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. బెల్జియం తరఫున లియాండ్రో ట్రొసార్డ్ (28వ, 50వ నిమిషాల్లో), కెవిన్ డి బ్రూన్ (66వ ని.), రొమేలు ల్యూకాకు (86వ ని.), అలెక్సిస్ సెల్మెకర్స్ 99+4వ ని.) గోల్స్‌తో చెలరేగగా... న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఎలీజా జస్ట్ (84వ ని.) ఏకైక గోల్ కొట్టాడు. మూడో సారి ప్రపంచ కప్ బరిలోకి దిగిన కివీస్ టీమ్ ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఈ గ్రూప్‌లో ఓటమి లేకుండా అజేయంగా నిలిచిన ఈజిప్ట్ రెండో జట్టుగా క్వాలిఫై అయింది. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఈజిప్ట్ 1–1తో డ్రా చేసుకుంది. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెల్ (5వ ని.) గోల్ సాధించగా... ఇరాన్ ఆటగాళ్ళలో రమీన్ రెజైన్ (14వ ని.) గోల్ చేశాడు. 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన ఈజిప్ట్ తొలిసారి నాకౌట్‌కు చేరడం విశేషం. ఈ టోర్నీకి ముందు మూడు వరల్డ్ కప్‌లు ఆడిన ఈజిప్ట్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.ఒక్క మ్యాచ్ గెలవకున్నా... గ్రూప్ ‘హెచ్’లో సంచలన ఫలితం నమోదైంది. మాజీ చాంపియన్ ఉరుగ్వే నిష్క్రమించగా... తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న కేప్ వెర్డె నాకౌట్‌కు అర్హత సాధించింది. 2010 వరల్డ్ కప్ విజేత స్పెయిన్ 1–0 గోల్‌తో ఉరుగ్వేను ఓడించి నాకౌట్‌కు చేరింది. స్పెయిన్ తరఫున అలెక్స్ బెనా (42వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న ఉరుగ్వే... ఈ టోర్నీలో లీగ్ దశలోనే నిష్క్రమించిన అత్యుత్తమ ర్యాంకింగ్ టీమ్‌గా నిలిచింది. ఉరుగ్వే 1930, 1950లలో చాంపియన్‌గా నిలిచింది. మరో వైపు కేప్ వెర్డెకు అదృష్టం కలిసొచ్చింది. ఆ జట్టు 3 మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని నమోదు చేయకున్నా... మూడూ ‘డ్రా’గా ముగించడంలో సఫలమైంది. ఫలితంగా ఉరుగ్వేను వెనక్కి నెట్టి ముందంజ వేసింది. కేప్‌వెర్డె, సౌదీ అరేబియా మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. 1998 వరల్డ్ కప్‌లో చిలీ తర్వాత లీగ్ దశలో ఒక్క మ్యాచ్ గెలవకున్నా నాకౌట్‌కు చేరిన మొదటి జట్టుగా కేప్ వెర్డె నిలిచింది. -
ఫిఫా ప్రపంచకప్ నుంచి నాడు భారత్ తప్పుకొందని తెలుసా?
ప్రపంచకప్ ఫుట్‌బాల్ సీజన్ వచ్చినప్పుడల్లా భారత ఫుట్‌బాల్ అభిమానుల హృదయాల్లో ఒక ప్రశ్న కచ్చితంగా మెదులుతుంది. అసలు ప్రపంచకప్ వేదికపై భారత్ ఎప్పుడు అడుగుపెడుతుంది? అనే ప్రశ్న అభిమానులను తొలిచివేస్తుంది. కానీ, 76 ఏళ్ల క్రితమే, భారత జట్టు ప్రపంచకప్ ఆడటానికి అర్హత సాధించినా.. చేజేతులా ఆ అవకాశాన్ని వదిలేసుకుందన్న చేదు నిజం ఎంతమందికి తెలుసు?1950 బ్రెజిల్ ప్రపంచకప్‌లో భారత్ ఆడకపోవడానికి 'బూట్లు లేకపోవడమే' కారణమనే ప్రచారం ఇప్పటికీ ఉన్న విషయం మీకు తెలుసా?? అది నిజమేనా? లేక దాని వెనుక అంతకంటే పెద్ద కథేమైనా ఉందా? భారత క్రీడా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.భారత్ నాడు సువర్ణావకాశంఅది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతి కాలం. 1950 జూన్ 24 నుంచి జూలై 23 వరకు బ్రెజిల్లో నాలుగో ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఆ సమయంలో ఆసియా గ్రూప్‌లో ఉన్న బర్మా.. అదే ఇప్పుడు మయన్మార్, ఫిలిప్పీన్స్ జట్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. భారత్‌కు నేరుగా ప్రపంచకప్ ఆడే సువర్ణావకాశం లభించింది. ఏకంగా స్వీడన్, ఇటలీ, పరాగ్వేలతో కలిసి గ్రూప్-3లో భారత్ స్థానం సంపాదించింది.బ్రెజిల్ ఆఫర్ఒకవేళ భారత్ బరిలోకి దిగి ఉంటే, జూన్ 28న పరాగ్వేతో తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉండేది. ఆతిథ్య దేశమైన బ్రెజిల్ సైతం ‘గాంధీ దేశం’ నుంచి వస్తున్న భారత జట్టు కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది. అవసరమైతే భారత ఆటగాళ్ల ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామని కూడా బ్రెజిల్ ఆఫర్ చేసింది. కానీ, చివరి నిమిషంలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ తీసుకున్న ఒక నిర్ణయం.. భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును మార్చేసింది.1948 లండన్ ఒలింపిక్స్‌లో బూట్లు లేకుండా ఆడిన భారత జట్టు, బలమైన ఫ్రాన్స్‌కు ముచ్చెమటలు పట్టించింది. కేవలం 1-2 తో ఓడిపోయినా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ జట్టులో శైలన్ మన్నా, అహ్మద్ ఖాన్, ఎస్. మేవలాల్, థామస్ మత్తాయి వర్గీస్ వంటి హేమాహేమీలు ఉన్నారు. సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.అసలు కారణాలు వేరేఅయితే.. భారత ఆటగాళ్లకు బూట్లు లేవనే కారణంతోనే ప్రపంచకప్ ఆడలేదనేది పూర్తి నిజం కాదని.. అప్పటికే హైదరాబాద్, మైసూర్ ఆటగాళ్లు బూట్లతో ఆడటం అలవాటు చేసుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు 1953 నుంచే ఫిఫా బూట్లతో ఆడాలన్న నిబంధనను కఠినతరం చేసింది. కాబట్టి టోర్నీ నుంచి భారత్ తప్పుకోవడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.ఒలింపిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతఅవును, నాటి భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ అప్పట్లో ప్రపంచకప్ కంటే ఒలింపిక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచకప్‌లో ఆడితే ఆటగాళ్లు ప్రొఫెషనల్స్‌గా మారిపోతారని, దానివల్ల ఒలింపిక్స్‌లో ఆడే అర్హత కోల్పోతామని భయపడ్డారు. దానికి తోడు, సుదీర్ఘమైన ఓడ ప్రయాణం, ఆర్థిక భారం, జట్టు ఎంపికలో విభేదాలు భారత్‌ను వెనక్కి లాగాయి.వీటన్నింటికీ మించి, అప్పట్లో భారత్‌లో కేవలం 70 నిమిషాల మ్యాచ్‌లు మాత్రమే ఆడేవారు. అంతర్జాతీయంగా 90 నిమిషాల పాటు ఆడే సత్తా, ఫిట్నెస్ తమకు ఉందా? లేదా? అనే అనుమానాలు కూడా ఫెడరేషన్‌ను పీడించాయి. దీంతో 1951లో ఢిల్లీలో జరగబోయే ఆసియా క్రీడలపై దృష్టి పెట్టాలనే నెపంతో ప్రపంచకప్ నుంచి భారత్ తప్పుకొంది. ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉందిచివరి నిమిషంలో భారత్ తప్పుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫిఫా, ఆ తర్వాత 1954 ప్రపంచకప్ ఆడేందుకు భారత్ దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించింది. ఆ తర్వాత భారత్ 1951, 1962 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించి.. ఫుట్‌బాల్‌లో సువర్ణ యుగాన్ని చూసినప్పటికీ.. ప్రపంచకప్ వేదికపై ఆడే అవకాశాన్ని మాత్రం ఇప్పటివరకు దక్కించుకోలేకపోయింది. నాటి ఫెడరేషన్ చేసిన ఆ ఒక్క చారిత్రక తప్పిదానికి.. భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉంది.నాటి నిర్ణయం సరైనదా? కాదా? అనేది పక్కన పెడితే.. ఆ రోజు గనుక భారత్ బ్రెజిల్ విమానం ఎక్కి ఉంటే, ఈరోజు ప్రపంచ ఫుట్‌బాల్ పటంలో భారత స్థానం వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా, ఆనాటి తప్పులను అధిగమించి, త్వరలోనే మన దేశం మెగా టోర్నీలో అడుగుపెట్టాలని ఆశిద్దాం.చదవండి: ‘నేను 13 సిక్సర్లు బాదుతాను.. మిగతాది మీరు చూసుకోండి’ -
చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించిన కేప్ వెర్డె అనూహ్య రీతిలో నాకౌట్లోనూ అడుగుపెట్టింది. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించకుండానే కేప్ వెర్డే తదుపరి దశకు చేరుకోవడం మరో విశేషం. అదెలా అంటారా?!గెలవలేదు.. నిలువరించిందిగ్రూప్- ‘H’లో భాగంగా స్పెయిన్, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కలిసి కేప్ వెర్డె ఫిఫా ప్రపంచకప్ బరిలో దిగింది. ఈ క్రమంలో స్పెయిన్‌తో మ్యాచ్ (0-0)ను డ్రా చేసుకుని కేప్ వెర్డె తొలుత సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉరుగ్వే (2-2)తో మ్యాచ్‌నూ డ్రా చేసుకుంది.తాజాగా లీగ్ దశలో ఆఖరిగా సౌదీ అరేబియాతో హూస్టన్ వేదికగా తలపడ్డ కేప్ వెర్డే.. ఈ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకుంది. ఈ క్రమంలో కేప్ వెర్డె ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. గ్రూప్- H టాపర్‌గా స్పెయిన్ ఏడు పాయింట్లతో ఇప్పటికే నాకౌట్‌కు చేరగా.. కేప్ వెర్డే రెండో స్థానంలో నిలిచి నాకౌట్లో అడుగుపెట్టింది. అతి చిన్న దేశంమూడింట ఒక్కో మ్యాచ్ గెలిచిన ఉరుగ్వే, సౌదీ అరేబియా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా నాకౌట్ దశలో కేప్ వెర్డేకు అర్జెంటీనా రూపంలో అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. ఇక పశ్చిమ ఆఫ్రికాలోని ఐలాండ్ అయిన కేప్ వెర్డే.. కాబో వెర్డె పేరుతో దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి జనాభా కేవలం 5.30 లక్షలు మాత్రమే!.. అనూహ్య రీతిలో తొలిసారి ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన కాబో వెర్డె ఏకంగా నాకౌట్లోనూ అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. చదవండి: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే? -
చరిత్ర సృష్టించిన సెనెగల్
సెనెగల్ ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఓ మ్యాచ్‌లో ఐదు గోల్స్ కొట్టిన తొలి సౌతాఫ్రికన్ జట్టుగా నిలిచింది. గ్రూప్- ‘ఐ’లో భాగంగా సెనెగల్ శుక్రవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత ఇరాక్‌తో తలపడింది.చావోరేవోనాకౌట్ దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో సెనెగల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. చావోరేవో తేల్చుకునే క్రమంలో ఇరాక్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి ఏకపక్ష విజయం సాధించింది. తద్వారా గ్రూప్- ‘ఐ’లో మూడో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. కాగా గ్రూప్- ‘ఐ’ టాపర్‌గా ఫ్రాన్స్.. రెండో స్థానంలో నిలిచిన నార్వే ఇప్పటికే నాకౌట్లో అడుగుపెట్టాయి. ఇరాక్ ఎలిమినేట్ అయింది.ఆది నుంచి ఆధిపత్యంఇక సెనెగల్- ఇరాక్ మ్యాచ్ విషయానికొస్తే.. టొరంటో వేదికగా ఆట మొదలైన కాసేపటికే సెనెగల్ తమ వేట మొదలుపెట్టింది. నాలుగో నిమిషంలో హబీబ్ డియారా గోల్ కొట్టి శుభారంభం అందించాడు.ఆ తర్వాత చాలా సేపటి వరకు ఇరుజట్లు డిఫెండ్ చేసుకుంటూ పోయాయి. ఈ క్రమంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఇస్మాలియా సర్ 56వ నిమిషంలో గోల్ కొట్టగా.. పేప్ గయే డబుల్ బొనాంజా అందించాడు. 59, 71వ నిమిషంలో గోల్స్ కొట్టాడు. ఇక 82వ నిమిషంలో ఇలిమన్ ఎన్డియాయే గోల్ కొట్టడంతో 5-0తో సెనెగల్ ఇరాక్‌ను చిత్తు చేసింది.చదవండి: ఐర్లాండ్ దెబ్బ కొట్టింది -
ఈక్వెడార్ గెలుపు ఈల
న్యూయార్క్: ఈక్వెడార్ ఫుట్‌బాల్ జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా... నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచిన జర్మనీ జట్టుపై ఊహించని విజయాన్ని సాధించింది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా జరిగిన చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2–1తో జర్మనీ జట్టును బోల్తా కొట్టించింది.ఐవరీకోస్ట్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓటమి చెందడం... రెండో మ్యాచ్‌లో కురసావ్ లాంటి అనామక జట్టుతో ‘డ్రా’ చేసుకోవడం... వెరసి జర్మనీతో మ్యాచ్‌కు ముందు ఒక్క పాయింట్‌తో ఈక్వెడార్ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిలో నిలిచింది. కానీ ఈక్వెడార్ జట్టు సమష్టి ఆటతీరుతో సత్తా చాటుకొని గెలుపు ఈల వేసింది. గ్రూప్ ‘ఇ’లో నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 12 గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన 8 అత్యుత్తమ జట్లకు కూడా నాకౌట్ బెర్త్‌లు లభిస్తాయి. మూడో స్థానంలో నిలిచే 8 అత్యుత్తమ జట్లలో ఈక్వెడార్ ఉండటం ఖాయం కావడంతో ఆ జట్టుకు నాకౌట్ బెర్త్ లభించింది. 0–1తో వెనుకబడి... మ్యాచ్ మొదలైన 2వ నిమిషంలోనే లెరాయ్ సెన్ గోల్‌తో జర్మనీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరంభంలోనే వెనుకబడ్డా... ఆందోళన చెందకుండా ఈక్వెడార్ ఆటగాళ్లు అవకాశం ఉన్నపుడల్లా జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. ఫలితంగా 9వ నిమిషంలోనే నిల్సన్ అంగులో గోల్‌తో ఈక్వెడార్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత జర్మనీ వ్యూహాలు మార్చి ఈక్వెడార్ జోరుకు బ్రేక్ వేసింది. ఒకదశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించినా... 77వ నిమిషంలో ‘డి’ ఏరియాలో గోల్‌పోస్ట్ ముందు లభించిన అవకాశాన్ని ఈక్వెడార్ ప్లేయర్ గొంజాలో ప్లాటా వదులుకోలేదు. కెవిన్ రోడ్రిగెజ్ హెడర్ షాట్‌ను గోల్‌పోస్ట్ ముందున్న ప్లాటా లక్ష్యానికి చేర్చడంతో ఈక్వెడార్ 2–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిసేవరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని ఈక్వెడార్ ఈ టోర్నీలో తొలి విజయం అందుకోవడంతోపాటు నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. ఐవరీకోస్ట్ తొలిసారి... నాలుగో ప్రయత్నంలో ఐవరీకోస్ట్ జట్టు ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా కురసావ్ జట్టుతో ఫిలడెల్ఫియాలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఐవరీకోస్ట్ 2–0తో గెలిచింది. నికోలస్ పెపె (7వ, 64వ నిమిషంలో) రెండు గోల్స్ చేసి ఐవరీకోస్ట్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. గ్రూప్ ‘ఇ’లో జర్మనీ, ఐవరీకోస్ట్ ఆరు పాయింట్లతో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా జర్మనీ గ్రూప్ విజేతగా నిలువగా.. ఐవరీకోస్ట్ రెండో స్థానంతో ముందంజ వేసింది. 2006, 2010, 2014 ప్రపంచకప్‌లలో ఐవరీకోస్ట్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. 12వసారి నెదర్లాండ్స్ ముందుకు...కాన్సస్ సిటీలో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ ఆఖరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో గెలిచింది. ఏడు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన నెదర్లాండ్స్ ఈ మెగా ఈవెంట్లో పాల్గొన్న 12వసారీ నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్ ‘ఎఫ్’లోని మరో మ్యాచ్‌లో జపాన్ 1–1తో స్వీడన్‌ను నిలువరించింది. ఐదు పాయింట్లతో జపాన్ గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌ను దక్కించుకుంది. టోర్నీ నుంచి నిష్క్రమించిన టర్కీ గ్రూప్ ‘డి’ చివరి మ్యాచ్‌లో 3–2తో అమెరికాపై నెగ్గింది. శాన్ఫ్రాన్సిస్కోలో పరాగ్వేతో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌ను ఆ్రస్టేలియా 0–0తో ‘డ్రా’గా ముగించి నాకౌట్ దశకు చేరింది. -
నువ్వా-నేనా!.. నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి..
ఫిఫా ప్రపంచకప్-2026లో అమెరికా- తుర్కియే మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. లాస్ ఏంజెలెస్ వేదికగా తుర్కియే అనూహ్య రీతిలో పటిష్ట అమెరికా జట్టుపై విజయం సాధించింది. గ్రూప్- ‘డి’లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 3-2తో చిత్తు చేసి తమ తొలి విజయం నమోదు చేసింది.కాగా గ్రూప్- ‘డి’ నుంచి ఇప్పటికే అమెరికా వరుసగా రెండు విజయాలతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఈ క్రమంలో తుర్కియే మీదా గెలిచి హ్యాట్రిక్ విజయంతో అజేయంగా నిలవాలని భావించింది. ఇక అప్పటికి రెండు మ్యాచ్‌లలో రెండూ ఓడిన తుర్కియే సులువుగా తలొగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కానీ తుర్కియే అంచనాలన్నీ తలకిందులు చేసింది. నిజానికి మూడో నిమిషంలోనే ఆస్టన్ ట్రస్టీ గోల్ కొట్టి అమెరికాకు శుభారంభం అందించాడు. అయితే, తుర్కియే ఆటగాడు బారిస్ యిల్మాజ్ ఇచ్చిన పాస్‌తో ఆర్డా గూలర్ గోల్ కొట్టి 1-1తో స్కోరు సమం చేశాడు.నువ్వా- నేనాఆ తర్వాత మ్యాచ్ రెండో అర్ధ భాగంలో ఒర్కూన్ కొకూ గోల్ కొట్టడంతో తుర్కియే 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, సెబాస్టియన్ బెర్హాల్టర్ గోల్ కొట్టడంతో.. అమెరికా 2-2తో స్కోరు సమం చేసింది. అయితే, అప్పటికి ఫలితం తేలకపోగా.. అదనపు సమయం కేటాయించారు. ఈ క్రమంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొనగా.. కాన్ అహ్యాన్ అనూహ్య రీతిలో గోల్ కొట్టి తుర్కియేను విజేతగా నిలిపాడు.ఆసీస్, పరాగ్వే సైతంఇక గ్రూప్-డి మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాగ్వేతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో టేబుల్ టాపర్ అమెరికాతో పాటు.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, పరాగ్వే నాకౌట్‌కు చేరాయి. అయితే, ఆఖరి మ్యాచ్‌లో తుర్కియే అమెరికాపై సంచలన విజయం సాధించినప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు రెండు మ్యాచ్‌లలోనూ టర్కీ ఓడిపోవడం ఇందుకు కారణం. అయితే, వెళ్తూ వెళ్తూ.. అజేయంగా నాకౌట్‌కు చేరాలనుకున్న అమెరికాకు మాత్రం షాకిచ్చింది.చదవండి: వైభవ్ కోసం వాళ్లకు అన్యాయం చేయలేము! -
జపాన్- స్వీడన్ మ్యాచ్ డ్రా.. నాకౌట్‌కు ఇరుజట్లు
ఫిఫా వరల్డ్‌కప్-2026లో జపాన్, స్వీడన్ సంయుక్తంగా నాకౌట్ దశకు చేరుకున్నాయి. గ్రూప్- ‘F’లో భాగంగా ఇరుజట్ల మధ్య డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. గేమ్ తొలి అర్ధ భాగంలో ఇరుజట్లు ఎక్కువగా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చాయి.సగం మ్యాచ్ ముగిసేసరికి ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే, 56వ నిమిషంలో డైజెన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోని ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది.తొలుత నెదర్లాండ్స్కాగా ఈ గ్రూప్ నుంచి తొలుత నెదర్లాండ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించగా.. రెండు, మూడు స్థానాల కోసం జపాన్- స్వీడన్ బరిలో నిలిచాయి. ఈ గ్రూప్‌లో ఇదే ఇదే ఫైనల్ మ్యాచ్ కాగా.. ఇరుజట్లు 1-1తో మ్యాచ్‌ను సమం చేసుకుని కలిసే నాకౌట్లో అడుగుపెట్టాయి. మరోవైపు.. ఈ గ్రూపులో చిట్టచివర నాలుగో స్థానంలో నిలిచిన ట్యునీషియా ఎలిమినేట్ అయిపోయింది.గ్రూప్ దశలో నెదర్లాండ్స్ మూడింట రెండు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకుని ఏడు పాయింట్లు సాధించగా.. జపాన్ మూడింట ఒకటి గెలిచి రెండు డ్రా చేసుకుని ఐదు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇక స్వీడన్ మూడింట ఒకటి గెలిచి.. ఒకటి డ్రా చేసుకుని.. మరొకటి ఓడిపోయింది. దీంతో నాలుగు పాయింట్లు రాగా మూడో స్థానంలో నిలిచి.. నెదర్లాండ్స్, జపాన్‌లతో కలిసి నాకౌట్‌కు చేరుకుంది. ఇక ట్యునీషియా ఆడిన మూడింటా ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్మార్! -
జర్మనీకి షాక్.. ఈక్వెడార్ సంచలన విజయం
ఫిఫా ప్రపంచకప్-2026 మరో సంచలన విజయం నమోదైంది. గ్రూప్-ఈలో నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ జర్మనీకి ఈక్వెడార్ భారీ షాక్ ఇచ్చింది. తొలి గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన జర్మనీని ఈక్వెడార్ 2-1తో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈక్వెడార్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.ఇక.. గేమ్ విషయానికి వస్తే.. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషానికే జర్మనీ స్టార్ ఆటగాడు లెరాయ్ సానే గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. అయితే ఆ ఆధిక్యం ఎక్కువసేపు నిలవలేదు. కేవలం ఏడు నిమిషాల తర్వాత, 9వ నిమిషంలో నిల్సన్ అంగులో అద్భుతమైన షాట్‌తో ఈక్వెడార్‌కు సమం చేశాడు. దీంతో తొలి అర్ధభాగం 1-1తో ముగిసింది.Gonzalo Plata winning goal in Ecuador vs Germany FIFA World Cup game pic.twitter.com/5FpQGyXPyc— Daily Foot Vibes (@dailyfootvibes) June 25, 2026రెండో అర్ధభాగంలో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు 77వ నిమిషంలో గోంజాలో ప్లాటా కార్నర్ అవకాశాన్ని అద్భుతంగా గోల్‌గా మలిచి ఈక్వెడార్‌కు 2-1 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత జర్మనీ సమం చేయడానికి చేసిన ప్రయత్నాలను ఈక్వెడార్ అడ్డుకోవడంతో మ్యాచ్ ఈక్వెడార్ ఖాతాలో పడింది.ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్ కూడా చేయలేక విమర్శలు ఎదుర్కొన్న ఈక్వెడార్, అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరును కనబరిచింది. ముఖ్యంగా మోయిసెస్ కైసెడో, హెర్నాన్ గలీందెజ్, విలియన్ పాచో రక్షణలో కీలక పాత్ర పోషించారు. కోచ్ సెబాస్టియన్ బెక్కాసెసె కూడా జట్టు ప్రదర్శనపై భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఓటమి జర్మనీకి టోర్నీలో తొలి పరాజయమైనప్పటికీ, ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించినందున వారి ప్రయాణంపై ప్రభావం చూపలేదు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ విజయంతో ప్రపంచకప్‌లో చారిత్రాత్మక ముందడుగు వేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.#2026WorldCup — #Ecuador defeated Germany 2–1 to qualify for the Round of 32.After the match, Ecuador head coach Sebastián Beccacece celebrated with the fans in the stands.pic.twitter.com/QiyVrhabP9— Antifa_Ultras (@ultras_antifaa) June 25, 2026 -
భళా బ్రెజిల్...
మయామి: ప్రపంచకప్ టైటిల్ సాధించి రెండు పుష్కరాలు దాటినా... అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో నిలకడగా రాణించే జట్లలో ఒకటైన బ్రెజిల్ మరోసారి సత్తా చాటుకుంది. 23వ ప్రపంచకప్ టోర్నీలో బ్రెజిల్ జట్టు దర్జాగా నాకౌట్ దశకు అర్హత సాధించింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 3–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. వినిసియస్ జూనియర్ (7వ, 45+3వ నిమిషంలో) రెండు గోల్స్‌తో మెరిపించగా... మథియాస్ కునా (60వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్ నెమార్ ఈ మ్యాచ్‌లో 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా గోల్ చేయలేకపోయాడు. రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో బ్రెజిల్ ఏడు పాయింట్లతో గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన బ్రెజిల్ జట్టు ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశలో తమ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని సంపాదించడం వరుసగా ఇది 12వసారి (1982 నుంచి 2026 వరకు) కావడం విశేషం. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న బ్రెజిల్... రెండో మ్యాచ్‌లో 3–0తో హైతీపై గెలిచింది. లీగ్ దశలో బ్రెజిల్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వినిసియస్ గోల్స్ చేయడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లోని గ్రూప్ దశ మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గోల్స్ కొట్టిన ఐదో బ్రెజిలియన్గా వినిసియస్ గుర్తింపు పొందాడు. గతంలో బ్రెజిల్ తరఫున జైర్జినో (1970లో), రొమారియో (1994లో), రొనాల్డో నజారియో (2002లో), రివాల్డో (2002లో) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఈ మూడుసార్లూ బ్రెజిల్ జట్టు ప్రపంచకప్ టైటిల్ నెగ్గడం విశేషం. మొరాకో మెరుపులు అట్లాంటా: గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకో ఈసారి అదరగొడుతోంది. హైతీ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో మొరాకో 4–2తో గెలిచింది. మొరాకో తరఫున అచ్రఫ్ హకీమి (39వ నిమిషంలో), ఇస్మాయిల్ సైబారి (45+1వ నిమిషంలో), సూఫియాన్ రహీమి (78వ నిమిషంలో), గెసిమి యాసిన్ (89వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మొరాకో ప్లేయర్ యాసిన్ బునూ (10వ నిమిషంలో) ‘సెల్ఫ్ గోల్’తో ఖాతా తెరిచిన హైతీ జట్టుకు విల్సిన్ ఇసిడోర్ (43వ నిమిషంలో) మరో గోల్ అందించాడు. ఏడు పాయింట్లతో బ్రెజిల్, మొరాకో గ్రూప్ ‘సి’లో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా బ్రెజిల్‌కు అగ్రస్థానం ఖరారైంది. మొరాకోకు రెండో స్థానంతో నాకౌట్ బెర్త్ దక్కింది. కెనెడా ఓడినా... టొరంటో: తాము ఆడిన గత రెండు ప్రపంచకప్‌లలో ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గని కెనడా జట్టు ఈసారి ఆతిథ్య దేశం హోదాలో సంచలన ప్రదర్శనతో నాకౌట్ దశకు చేరుకుంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో కెనడా 1–2తో ఓడిపోయింది. అయితే ఖతర్ జట్టుపై 6–0తో గెలిచి, బోస్నియా అండ్ హెర్జెగోవినాతో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న కెనడా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న స్విట్జర్లాండ్ ఏడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం దక్కించుకొని నాకౌట్ బెర్త్‌ను సాధించింది. దక్షిణాఫ్రికా కొత్త చరిత్రమోంటెరె (మెక్సికో): నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్ దశకు చేరుకుంది. దక్షిణ కొరియా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 1–0తో గెలిచింది. 63వ నిమిషంలో థపెలో మసెకో గోల్‌తో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గ్రూప్ ‘ఎ’లో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందింది. నాకౌట్ మ్యాచ్‌లో కెనడా జట్టుతో దక్షిణాఫ్రికా ఆడుతుంది. 1998, 2002, 2010 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. మెక్సికో ‘హ్యాట్రిక్’ మెక్సికో సిటీ: ప్రపంచకప్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో గ్రూప్ దశను అజేయంగా ముగించింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 3–0తో గెలిచి ‘హ్యాట్రిక్’ విజయం అందుకుంది. మెక్సికో తరఫున మటియో చావెజ్ (55వ నిమిషంలో), జూలియన్ క్వినోనెస్ (61వ నిమిషంలో), అల్వారో ఫిడాల్గో (90+4వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన మెక్సికో తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో గ్రూప్ దశలో ఒక్క గోల్ సమర్పించుకోకుండా ఆడిన మూడుమ్యాచ్ల్లోనూ గెలిచిన ఆరో జట్టుగా మెక్సికో గుర్తింపు పొందింది. ఈ జాబితాలో నెదర్లాండ్స్ (1978), బ్రెజిల్ (1986), ఇటలీ (1990), అర్జెంటీనా (1998), ఉరుగ్వే (2018) జట్లున్నాయి. గెలిచి నిలిచిన బోస్నియా సియాటెల్: నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా జట్టు అదరగొట్టింది. ఖతర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ ఆఖరి మ్యాచ్‌లో బోస్నియా 3–1తో విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో బోస్నియా, కెనడా గ్రూప్ ‘బి’లో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా కెనడా ముందంజ వేసింది. మూడో స్థానంలో ఉన్న ఎనిమిది అత్యుత్తమ జట్లలో బోస్నియా నిలిస్తే ఆ జట్టుకూ నాకౌట్ బెర్త్ లభిస్తుంది. -
కన్నీటి పర్యంతమైన నెయ్మార్.. టాపర్‌గా బ్రెజిల్
బ్రెజిల్ సూపర్ స్టార్, దిగ్గజ ఫుట్‌బాలర్ నెయ్మార్ జూనియర్ కన్నీంటి పర్యంతమయ్యాడు. దాదాపుగా మూడేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టు తరఫున పునరాగమనం చేసిన క్రమంలో.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అతడిని అలా చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు.తీవ్ర గాయంకాగా 2023లో ఉరుగ్వేతో మ్యాచ్ సందర్భంగా నెయ్మార్ తీవ్రంగా గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైన నెయ్మార్.. ఆ తర్వాత కొన్ని క్లబ్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ జాతీయ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు.ఈ క్రమంలో ఫిఫా ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందు నెయ్మార్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో బ్రెజిల్ జట్టు సంతోషంలో మునిగిపోయింది. అయితే, టోర్నీ ఆరంభానికి ముందు అతడిని మరోసారి ఫిట్నెస్ సమస్యలు వేధించాయి. దీంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.భావోద్వేగాలు నియంత్రించుకోలేక కన్నీళ్లుఈ నేపథ్యంలో మియామి వేదికగా గ్రూప్- ‘సి’లో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్ సందర్భంగా నెయ్మార్ బ్రెజిల్ తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపుగా 981 రోజుల తర్వాత జాతీయ జట్టు తరఫున మైదానంలో అడుగుపెట్టిన అతడు.. భావోద్వేగాలను నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు.టాపర్‌గా నాకౌట్కుకాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో 76వ నిమిషంలో నెయ్మార్ సబ్‌స్టిట్యూట్ (ఇంపాక్ట్) ప్లేయర్‌గా వచ్చాడు. అప్పటికే బ్రెజిల్ 3-0తో ఆధిక్యంలో ఉంది. అయితే, నెయ్మార్ రాకతో ఒక్కసారిగా అభిమానులు కేకలు పెట్టారు. అతడిని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకున్నారు. కాగా 34 ఏళ్ల నెయ్మార్ కెరీర్లో ఇది నాలుగో ఫిఫా వరల్డ్‌కప్.ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. బ్రెజిల్ తరఫున వినిసియస్ జూనియర్ రెండు గోల్స్ చేయగా.. మాథ్యూస్ కున్హా ఒక గోల్ కొట్టాడు. ఈ విజయంతో గ్రూప్-సి టాపర్‌గా బ్రెజిల్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఇక ఈ గ్రూపు నుంచి మొరాకో కూడా నాకౌట్‌కు చేరగా.. హైతీ ఎలిమినేట్ అయింది. స్కాట్లాండ్కు మరో అవకాశం ఉంది. చదవండి: అందుకు అతడే అర్హుడు.. రోహిత్ వద్దు?! -
మెక్సికోతో పాటు నాకౌట్‌కు సౌతాఫ్రికా.. చెక్ రిపబ్లిక్ ఎలిమినేట్
ఫిఫా ప్రపంచకప్-2026 నాకౌట్ దశకు సౌతాఫ్రికా అర్హత సాధించింది. గ్రూప్- ‘ఎ’లో భాగంగా సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో గెలుపొంది.. తొలిసారి నాకౌట్ బెర్తు ఖరారు చేసుకుంది. మ్యాచ్ తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే 0-0తో ముగిసింది.రెండో అర్ధ భాగంలో సౌతాఫ్రికా తరఫున తాపెలో మసేకో గోల్ కొట్టడంతో జట్టు ఆధిక్యం 1-0కు చేరింది. నిజానికి బంతి ఎక్కువ సేపు కొరియా తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్ మాత్రం కొట్టలేకపోయింది.ఫలితంగా మెక్సికోలోని మాంటెర్రీ వేదికగా కొరియా అభిమానుల మధ్య సౌతాఫ్రికా అనూహ్య రీతిలో విజయం సాధించి.. తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశలో అడుగుపెట్టింది.టాపర్‌గా మెక్సికోమరో మ్యాచ్‌లో.. ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించిన మెక్సికో.. తాజాగా చెక్ రిపబ్లిక్‌పై 3-0తో ఏకపక్ష విజయం సాధించింది. మెక్సికో తరఫున మేటో చావెజ్ 55వ, జూలియన్ క్వినోన్స్ 61వ నిమిషంలో గోల్స్ కొట్టగా.. అల్వారో ఫిడాల్గో అదనపు సమయం (90+4)లో గోల్ కొట్టాడు. ఫలితంగా ఆతిథ్య మెక్సికో చెక్ రిపబ్లిక్ చిత్తుగా ఓడించింది.తద్వారా గ్రూప్- ‘ఎ’ టాపర్‌గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు.. చెక్ రిపబ్లిక్‌ను ఎలిమినేట్ చేయడంతో.. సౌతాఫ్రికాకు మార్గం సుగమమైంది. గ్రూప్- ‘ఎ’ సెకండ్ టాపర్‌గా సౌతాఫ్రికా కూడా మెక్సికోతో పాటు నాకౌట్ దశకు చేరుకుంది. ఇక కొరియాకు మరో అవకాశం మిగిలి ఉంది. ప్రతీ గ్రూపులోని నాలుగు జట్ల నుంచి టాప్-3లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే.


