ఆటలోనే కాదు ఆ విష‌యంలోనూ మెస్సీ కింగే! | Official Statement-Messi Jersey No-10 Best Selling Shirt-FIFA-WC-2026 | Sakshi
Sakshi News home page

ఆటలోనే కాదు ఆ విష‌యంలోనూ మెస్సీ కింగే!

Jul 26 2026 11:46 AM | Updated on Jul 26 2026 12:09 PM

Official Statement-Messi Jersey No-10 Best Selling Shirt-FIFA-WC-2026

Photo Credit: FIFA Twitter

అర్జెంటీనా సూప‌ర్‌స్టార్ లియోన‌ల్ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. మైదానంలో త‌న ఆట‌తో కోట్ల‌లో అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ తాజాగా త‌న జెర్సీ విష‌యంలోనూ కింగ్ అని నిరూపించుకున్నాడు. 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో మెస్సీ 10వ నంబ‌ర్ జెర్సీలు అత్య‌ధికంగా అమ్ముడ‌య్యాయ‌ని ఫిఫా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

ఇక ఫిఫా 2026లో మెస్సీ సార‌థ్యంలోని అర్జెంటీనా ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలిచి 16 ఏళ్ల త‌ర్వాత రెండోసారి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుంది. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను న‌డిపించాడు. 8 మ్యాచ్‌లాడిన మెస్సీ 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లు చేసి టోర్నీలో అత్య‌ధిక గోల్స్ కొట్టిన రెండో ఆట‌గాడిగా నిలిచి సిల్వ‌ర్ బూట్ కైవ‌సం చేసుకున్నాడు. 

అంతేకాదు ఏడు వ‌రుస ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో గోల్ కొట్టిన తొలి ఆట‌గాడిగాను మెస్సీ రికార్డులకెక్కాడు. 2022లో అర్జెంటీనాను చాంపియ‌న్‌గా నిలిపిన మెస్సీ ఈసారి కూడా అదే రిపీట్ చేయాల‌ని భావించాడు. కానీ ఫైన‌ల్లో స్పెయిన్ చేతిలో చ‌తికిల‌ప‌డిన అర్జెంటీనా రన్న‌ర‌ప్‌కే ప‌రిమిత‌మైంది. 39 ఏళ్ల మెస్సీ మ‌రో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ (2030) ఆడేది అనుమాన‌మే.

 

Read: హార్దిక్‌ పాండ్యా విష‌యంలో బీసీసీఐ మాస్ట‌ర్‌ప్లాన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement