source: X
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్‌తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్‌పై, 1952)
* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)
* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)
అభిషేక్‌కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం.
బ్యాట్‌తో తడబడుతున్న అభిషేక్
అభిషేక్ ఈ మ్యాచ్‌లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా బ్యాట్‌తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.
నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.


