breaking news
India vs Zimbabwe
-
‘మీ పిల్లాడి క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు’
క్రికెట్ ప్రపంచంలోకి దూసుకువచ్చిన నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఫార్మాట్లకు అతీతంగా అదరగొట్టాడు. భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన వైభవ్.. ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా ఏకంగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ గడ్డపైతద్వారా అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా దిగ్గజ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్‌లలో (13,15,14) విఫలమయ్యాడు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం రెండు అర్ధ శతకాలతో రాణించాడు. టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్.వైభవ్ కుటుంబానికి కీలక సూచనలుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే వైభవ్ సూర్యవంశీ కుటుంబానికి కీలక సూచనలు చేశాడు.ఇంగ్లండ్ మాజీ స్టార్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నిల్తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలోనే వైభవ్‌కు సరైన మార్గదర్శనం అవసరం. అతడి కుటుంబం మాత్రమే ఇది చేయగలదు.ప్రస్తుతం అతడికి ఏది అత్యంత ముఖ్యమో అతడి కుటుంబమే చెప్పాలి. అతడి కోసం షెడ్యూల్, ప్రణాళికలను రచించాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే వచ్చిన కీర్తిప్రతిష్టలు చూసి అతడు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలి.క్రమశిక్షణ ముఖ్యంజట్టుతో పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నో కొత్త పరిచయాలు అవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అతడికి చెప్పాలి. కుటుంబమే అతడి బలం. వచ్చే ఐదు, పదేళ్లలో వైభవ్‌ను వారెంత క్రమశిక్షణగా ఉంచుతారో అదే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని రహానే పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులను కూడా అనుమతించింది. వైభవ్ వయసు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. చదవండి: ధోని గది తలుపు ఒక్కసారి మూతపడితే అంతే ఇక! -
RBI అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.టీమిండియా రీఎంట్రీలో అదుర్స్అసలు విషయం ఏమిటంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా టీమిండియా తరఫున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలతో బిజీగా గడిపిన ఇషాన్ కిషన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీమిండియా టెస్టు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లగా ఇషాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు.. ఆర్బీఐ విధుల్లో చేరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయంలోకాగా స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఇషాన్ కిషన్‌కు చాన్నాళ్ల క్రితమే ఆర్బీబీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్18 కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం లభించగా.. ఇషాన్ ఆర్బీఐ విధుల్లో చేరాడు. పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్‌కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. అతడితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.జీతం ఎంతంటే..?కాగా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా నెలకు ఇషాన్ కిషన్‌కు రూ. 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రొవిడెంట్ ఫండ్ సహా మిగతా కటింగ్స్ అన్నీ పోనూ చేతికి దాదాపు రూ. 1.12 లక్షలు అందుతున్నట్లు సమాచారం.ఇక ఆగష్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలోనే మళ్లీ అతడు ఆటతో బిజీ కానున్నాడు. ఈ జట్టుకు బిహార్ చిచ్చరపిడుగు, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్.కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు 32 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1107, టీ20లలో 1608 పరుగులు.. టెస్టుల్లో 78 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.చదవండి: అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీIndian cricketer Ishan Kishan has reportedly resumed work as an Assistant Manager at the Reserve Bank of India office in Patna during his break from competitive cricket. Kishan was appointed to the post through the sports quota and was seen carrying out his official… pic.twitter.com/AZPdCflCrM— News18 (@CNNnews18) August 5, 2026 -
వైభవ్‌నే పక్కనపెడతారా?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరు సరికాదని విమర్శించాడు. ఈ పిల్లాడిని ఐర్లాండ్‌పై గడ్డపై ఆడిస్తే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.కాగా ఐపీఎల్, భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని టీమిండియా సెలక్టర్లు యూకే పర్యటనకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడింది భారత జట్టు.సంజూ వరుస వైఫల్యాలుఅయితే, ఐర్లాండ్‌లో సంజూ శాంసన్- అభిషేక్ శర్మను ఓపెనింగ్ జోడీగా కొనసాగించిన యాజమాన్యం.. వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. ఇక సంజూ ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ తేలిపోయాడు.అరంగేట్రంలో తేలిపోయిన వైభవ్అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ సంజూ విఫలం కావడంతో.. ఎట్టకేలకు వైభవ్‌కు రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అయితే, పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు.. తొలి మ్యాచ్‌లో కేవలం 13 పరుగులే చేశాడు. ఆ తర్వాత 15,14 పరుగులకే నిష్క్రమించాడు.జింబాబ్వే గడ్డ మీద దూకుడుదీంతో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 నుంచి వైభవ్‌ను తప్పించి మరోసారి సంజూకే అవకాశమిచ్చారు. అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి సంజూకు విశ్రాంతినివ్వగా.. వైభవ్‌కు మళ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 50, 20, 81 పరుగులు సాధించాడు.జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‘‘వైభవ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అతడి సత్తా ఏమిటో అంతా చూశారు. వరుస మ్యాచ్‌లలో అదరగొట్టి ఏకంగా ఆరెంజ్‌క్యాప్ గెలుచుకున్నాడు.నిజానికి ఐర్లాండ్‌లోనే అతడి అరంగేట్రం జరగాల్సింది. అప్పుడే అతడు నిర్భయంగా ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి.. అక్కడా రాణించేవాడు. కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది. ఆరెంజ్ క్యాప్ విన్నర్‌ను ఐర్లాండ్‌లో పక్కనపెట్టి.. నీళ్ల బాటిళ్లు మోయమని బెంచ్‌కే పరిమితం చేసింది.వైభవ్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతడిని మీరు ఐర్లాండ్‌లోనే ఆడిస్తే.. గొప్పగా ఉండేది. ఇంగ్లండ్‌లో అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేవాడు. కానీ ఇంగ్లండ్‌లో అతడు తేలిపోయాడు. దీంతో మళ్లీ తుదిజట్టు నుంచి అతడిని తప్పించారు.అతడినే పక్కనపెడతారా?జోఫ్రా ఆర్చర్‌కు వైభవ్ ఆట తీరు తెలుసు కాబట్టి అతడిని సులువుగానే అవుట్ చేయగలిగాడు. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున మున్ముందు అదరగొట్టడం ఖాయం. కానీ ఆరంభమే ఇంకాస్త సులువుగా ఉంటే బాగుండేది.అతడొక స్పెషల్ టాలెంట్. అతడిని తుదిజట్టు నుంచి తప్పించి ప్రయోగాలు చేయొద్దు. జింబాబ్వే మీద అతడు ఎలా ఆడాడో చూశారు కదా!.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు’’ అని మహ్మద్ కైఫ్ మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు గుప్పించాడు.చదవండి: సన్‌రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లోనే 241 రన్స్ -
కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!
జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా కోచ్ మార్పు అంశం సోమవారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. గంభీర్‌ను తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తిస్థాయి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. రోజంతా ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ కూడా జరిగింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్నజట్టే అయినప్పటికీ, లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటబట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనుక వీవీఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక నాలుగు అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది.స్థిరమైన ఓపెనింగ్ జోడిఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున అభిషేక్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. వైభవ్ ఈ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. రెండు అర్ధసెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎగరేసుకుపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కోచ్‌గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇచ్చి స్థిరమైన ఓపెనింగ్ జోడిని కొనసాగించాడు.ముగ్గురు పేసర్లతో బరిలోకియూకే పర్యటనలో కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్లను ఉపయోగించిన తీరు విమర్శలకు దారి తీసింది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై అనవసర ప్రయోగాలకు పోయి స్పిన్-ఆల్‌రౌండర్ల కలయికపై ఎక్కువగా ఆధారపడి గంభీర్ చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో మొత్తం ఐదుగురిలో ఒకే ఒక పేసర్‌ను ఆడించడం గమనార్హం. ఇక వన్డే సిరీస్‌లోనూ గంభీర్ వ్యూహాలు పనిచేయలేదు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం లక్ష్మణ్ గంభీర్‌కు విరుద్ధంగా వ్యవహరించాడు. టీ20 సిరీస్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడాలని నిర్ణయించిన లక్ష్మణ్.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ సేవలు వినియోగించుకొని అద్భుత ఫలితాలు రాబట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్‌పై నమ్మకముంచిన లక్ష్మణ్ అవకాశాలిచ్చాడు. దీంతో మయాంక్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.ఆల్‌రౌండర్ల వినియోగంఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రానాలకు గంభీర్ తుది 11 మందిలో చోటిచ్చాడు. దీని ఫలితంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ లోపించడంతో పాటు, తన నాలుగు ఓవర్ల కోటాను నమ్మకంగా పూర్తి చేయగల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కూడా ఏర్పడింది. కానీ లక్ష్మణ్ మాత్రం కేవలం ఒక్క ఆల్‌రౌండర్‌కే చోటు కల్పించాడు. తొలి రెండు టీ20ల్లో శివమ్ దూబేను ఆడిపించిన లక్ష్మణ్ చివరి టీ20 మ్యాచ్‌కు సూర్యాంశ్ షెడ్గేను చాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల జట్టులో ఒక పూర్తిస్థాయి బ్యాటర్‌కు అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్‌కు అవకాశం కల్పించినట్లయింది. రింకూ సింగ్ ఫినిషర్‌గా, రవి బిష్ణోయ్ స్పిన్నర్‌గా తమ పాత్రను సమర్థంగా పోషించారు.ఆటగాళ్లపై నమ్మకంజింబాబ్వేలో భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సమయంలో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ వారికి అండగా నిలిచాడు. కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి స్థానంలో, చివరి నిమిషంలో బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక క్లిష్టమైన టీ20 మ్యాచ్‌లో బిష్ణోయ్ అధిక ఎకానమీ రేటుతో ఇబ్బంది పడ్డాడు.అయినప్పటికీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడించి ఫుంజుకోవడానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో రవి బిష్ణోయ్ మొత్తంలో 5.667 సగటు ఎకానమీతో 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.చదవండి: శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను
-
నా కల నెరవేరింది.. వారి వల్లే ఇదంతా: వైభవ్ సూర్యవంశీ
తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ఇరగదీశాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తంగా 151 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ వైభవ్ సత్తాచాటాడు.49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. దీంతో సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన టీమ్ మేనెజ్మెంట్కు వైభవ్ ధన్యవాదాలు తెలిపాడు."నా కల నెరవేరింది. మొదటిసారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాను. హరారే వచ్చిన తర్వాత మేము మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాం. ఇంతకుముందు ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాను. ఈ గ్రౌండ్లో ఆడడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా కెప్టెన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి వల్లే నేను ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. టీ20 క్రికెట్లో మొదట నుంచి ఎలా ఆడుతున్నానో.. ఇక్కడ కూడా అదే కొనసాగించాను.జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఒకసారి కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచడానికి ప్రయత్నించాను. సిరీస్ అంతటా ఇదే ప్లాన్‌తో ముందడుగు వేశాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వైభవ్ పేర్కొన్నాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు మళ్లీ జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్నాడు. -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో జింబాబ్వేపై 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మాత్రమే జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశాయి.జింబాబ్వేపై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌లు* పాకిస్తాన్ – 3-0 (2020)* ఆఫ్ఘనిస్తాన్– 3-0 (2021)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2022)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2025)* **భారత్** – 3-0 (2026)ధోనికి కూడా సాధ్యపడలేదు..!2010లో సురేశ్ రైనా నేతృత్వంలో భారత్ జింబాబ్వేపై 2-0తో సిరీస్ గెలిచినా, అది రెండు మ్యాచ్‌ల సిరీస్ మాత్రమే. 2015లో అజింక్య రహానే సిరీస్‌ను 1-1తో సమం చేయగా, 2016లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ 2-1తో విజయం సాధించింది.2024లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ 4-1తో సిరీస్ గెలిచింది. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు.ఊరటనిచ్చిన విజయంటీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఆరంభం నిరాశాజనకంగా సాగింది. ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లండ్‌తో 0-4 తేడాతో వరుస సిరీస్‌ల్లో భారత్ పరాజయం పాలైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో (ఒకటి ఫలితం లేకుండా) ఆరు ఓటములు ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా అయ్యర్ అవాంఛిత రికార్డు నమోదు చేశాడు.అయితే జింబాబ్వేపై 3-0 సిరీస్ విజయం శ్రేయస్ అయ్యర్‌కు, అలాగే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఫలితంగా నిలిచింది. రానున్న కఠిన సిరీస్‌లలో ఇదే జోరును కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా వైభవ్‌ను పంపించి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్‌కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్‌లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్‌కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్‌ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్‌ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్‌కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్‌లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్‌ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్‌గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్‌ను తొలగించి లక్ష్మణ్‌ను కోచ్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌కు హెడ్‌కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్‌లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్‌పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్‌పై 1-0తో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్‌గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు! -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్‌కు గంభీర్ స్థానంలో కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్‌నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. వైభవ్‌లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
"సవాళ్లకు మేం సిద్ధం".. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఆదివారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.'ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్‌లలోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్‌గా ఇది నాకు మొదటి సిరీస్ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మరోసారి చెబుతున్నాను.జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. -
హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.బర్ల్ ఒంటరి పోరాటంఅనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ZIM: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్‌కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026 -
అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టు మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోసారి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బానీ బౌలింగ్‌లో అభిషేక్ దొరికిపోయాడు. ఈ సిరీస్‌లోని ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లలో కలిపి అభిషేక్ చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. దీంతో ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భారత (టాప్-7) బ్యాటర్‌గా అభిషేక్ శర్మ ఘోర రికార్డును మూటగట్టుకున్నాడు.ఇంతకుముందు ఈ చెత్త రికార్డు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. 2019లో వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అయ్యర్ 14 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో అయ్యర్‌ను అభిషేక్ దాటేశాడు.3-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:అభిషేక్ శర్మ – 11 పరుగులు (విత్ జింబాబ్వే, 2026)శ్రేయస్ అయ్యర్ – 14 పరుగులు (వెస్టిండీస్, 2019)హార్దిక్ పాండ్యా – 15 పరుగులు (న్యూజిలాండ్, 2017)కేఎల్ రాహుల్ – 15 పరుగులు (ఇంగ్లాండ్, 2021)దినేష్ కార్తీక్ – 17 పరుగులు (ఆస్ట్రేలియా, 2022)చదవండి: 'వరల్డ్‌కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి' -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.స్పీడ్ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్ బర్ల్(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్ కుర్రాన్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/4జింబాబ్వే మూడో వికెట్ డౌన్యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్ మైర్స్(19), సికిందర్(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 40/3జింబాబ్వే తొలి వికెట్ డౌన్193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో బెన్నెట్ ఔటయ్యాడుజింబాబ్వే టార్గెట్ ఎంతంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.భారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 172/4వైభవ్ అవుట్వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్.. రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.వైభవ్ ఫిప్టీవైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్‌తో పాటు ఇషాన్ కిషన్(29) ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/1అభిషేక్ అవుట్జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేల స్ధానంలో అశోక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ -
టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది
భారత క్రికెట్ జట్టు 2026లో యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టెస్టుల్లో మానవ్ సుతార్ అరంగేట్రం చేయగా, వన్డేల్లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ భారత జెర్సీ ధరించారు. టీ20ల్లో ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు వేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రాబోయే ఐసీసీ టోర్నీలు, 2028 ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్ల కోసం బలమైన బెంచ్ స్ట్రెంగ్త్‌ను సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.2026లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:టెస్టులు: * మానవ్ సుతార్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, ముల్లాన్పూర్వన్డేలు:* హర్ష్ దుబే – ఆఫ్ఘనిస్తాన్‌తో, ధర్మశాల* గుర్నూర్ బ్రార్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, ధర్మశాల* ప్రిన్స్ యాదవ్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, లక్నోటీ20లు:* ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్‌తో, బెల్ఫాస్ట్* సూర్యాంశ్ షెడ్గే – ఐర్లాండ్‌తో, బెల్ఫాస్ట్* వైభవ్ సూర్యవంశీ – ఇంగ్లండ్‌తో, మాంచెస్టర్* అశోక్ శర్మ – జింబాబ్వేతో, హరారే* యశ్ ఠాకూర్ – జింబాబ్వేతో, హరారేఈ ఏడాది అరంగేట్రం చేసిన ఈ ఎనిమిది మందిలో వైభవ్ సూర్యవంశీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అతను సత్తా చాటకపోయినా, ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అతను 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్ల విషయానికొస్తే..ప్రిన్స్ యాదవ్ (6 టీ20ల్లో 9 వికెట్లు), గుర్నూర్ బ్రార్ (6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) సత్తా చాటారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ ఏడాది మరికొంత మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
విరాట్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 81 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన అతను.. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ఏడాది ఇషాన్ టీ20 పరుగుల సంఖ్య 783 పరుగులకు చేరగా.. 2022లో విరాట్ 781 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (2021లో 1326 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. భారత్ తరఫున మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2022లో 1164 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ ఈ ఏడాది స్కై రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో 381 పరుగులు చేస్తే స్కై రికార్డు.. మరో 543 పరుగులు చేస్తే మహ్మద్ రిజ్వాన్‌ను కూడా అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చు.భారత్‌కు ఈ ఏడాది ఇంకా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఉండటంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఆడే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌కు ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లు:* 1326 – మహ్మద్ రిజ్వాన్ (2021)* 1164 – సూర్యకుమార్ యాదవ్ (2022)* 996 – మహ్మద్ రిజ్వాన్ (2022)* 939 – బాబర్ ఆజమ్ (2021)* 936 – బ్రియాన్ బెన్నెట్ (2025)* 859 – అభిషేక్ శర్మ (2025)* 783 – ఇషాన్ కిషన్ (2026)* 781 – విరాట్ కోహ్లీ (2022)మ్యాచ్ విషయానికొస్తే.. ఇషాన్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (219-5) సాధించింది. అనంతరం అభిషేక్ మూడు, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్‌తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్‌పై, 1952)* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)అభిషేక్‌కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం.బ్యాట్‌తో తడబడుతున్న అభిషేక్అభిషేక్ ఈ మ్యాచ్‌లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా బ్యాట్‌తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. -
రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన సికందర్ రజా
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఓ అవాంఛిత విషయంలో టీమిండియా డాషింగ్ బ్యాటర్ రోహిత్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేశాడు. నిన్న (జులై 25) భారత్‌తో జరిగిన రెండో టీ20లో డకౌట్ కావడంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా అత్యధిక డక్స్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్, బాబర్ సరసన చేరాడు.కెప్టెన్‌గా రజాకు ఇది ఆరో డక్. రోహిత్, బాబర్ కూడా కెప్టెన్లుగా ఇన్నే డక్స్ నమోదు చేశారు. దీంతో వీరు ముగ్గురు అత్యధిక డక్స్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్‌టైమ్ సభ్య దేశాల కెప్టెన్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎనిమిది డక్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక డక్స్ (పూర్తి సభ్య దేశాలు):* 8 – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)* 6 – రోహిత్ శర్మ (భారత్)* 6 – బాబర్ ఆజం (పాకిస్థాన్)* 6 – సికందర్ రజా (జింబాబ్వే)అంతేకాకుండా, ఈ డక్‌తో రజా టీ20ల్లో జింబాబ్వే తరఫున 10 డక్స్ నమోదు చేసి, ఆ జట్టు తరఫున అత్యధిక డక్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. రెజిస్ చకాబ్వా 11 డక్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.భారత్‌తో రెండో టీ20 విషయానికొస్తే.. జింబాబ్వేపై భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీనికి ముందు తొలి టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం. మిగిలిన నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (జులై 26) అదే వేదికగా జరుగనుంది. -
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్‌కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్‌ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్‌కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్‌గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్‌తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్‌ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్‌ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్‌వన్‌గా టీమిండియా
ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా నెంబర్‌వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పనిలో పనిగా మరోసారి పొట్టి ఫార్మాట్లో అగ్రపీఠాన్ని అందుకుంది. 60 మ్యాచ్‌లాడిన టీమిండియా 268 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ (268 పాయింట్లు) ఉండగా, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ మధ్య పాయింట్ల మధ్య వ్యత్యాసం లేకున్నప్పటికీ భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడడంతో నంబర్‌వన్ స్థానాన్నితిరిగి హస్తగతం చేసుకుంది. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే మాత్రం టీమిండియా నంబర్‌వన్ ర్యాంకు మరింత పటిష్టం కానుంది.శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. చదవండి: ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు -
సిరీస్ మనదే
హరారే: స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రికెట్ జట్టు... జింబాబ్వేపై టి20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు. గత మ్యాచ్‌లో రికార్డు అర్ధ శతకం నమోదు చేసిన 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. వైభవ్ ఆరంభ మెరుపులు... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత బ్యాటింగ్ ఆర్డర్... ఈ మ్యాచ్‌లో దంచికొట్టింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సూర్యవంశీ వరుసగా 4, 6, 4, 4 బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25; 4 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోగా... 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 95/3తో నిలిచింది. అక్కడి నుంచి ఇషాన్, తిలక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ... చెత్త బంతులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇషాన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో హోరెత్తించాడు. మరుసటి ఓవర్లో ఇషాన్ 4, 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో మధ్య ఓవర్లలో భారత్ మెరుగైన స్కోరు చేసింది. ధాటిగా ఆడిన తిలక్ 23 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్ దాటాడు. తిప్పేసిన అభిషేక్... లక్ష్యఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే పోటీలో కనిపించలేదు. ఓపెనర్ బెన్నెట్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడగా... అతడిని తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న యశ్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బెన్ కరెన్ (1) పెవిలియన్ చేరగా... మైయర్స్ (12),సికందర్ రజా (0) విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బర్ల్ (20; 2 ఫోర్లు), మరుమని (24; 1 ఫోర్, 1 సిక్స్), ఇవాన్స్ (19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో... భారత సారథి శ్రేయస్ బంతిని పార్ట్‌టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు అందించాడు. వారిద్దరూ లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో జింబాబ్వే ఆలౌటైంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి) ముజరబాని (బి) ఎన్గరవా 20; అభిషేక్ (సి) బర్ల్ (బి) ముజరబాని 8; ఇషాన్ (సి) బెన్నెట్ (బి) న్యూమన్ 81; శ్రేయస్ (సి) ఇవాన్స్ (బి) బెన్నెట్ 25; తిలక్ (నాటౌట్) 60; రింకూ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 12; శివమ్ దూబే (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–10, 2–29, 3–95, 4–189, 5–213. బౌలింగ్: సికందర్ రజా 4–0–47–0; ముజరబాని 4–0–36–1; ఎన్గరవా 3–0–43–1; ఇవాన్స్ 4–0–44–1; న్యూమన్ 3–0–25–1; బెన్నెట్ 2–0–22–1. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) యశ్ 32; కరన్ (సి) శివమ్ దూబే (బి) ప్రిన్స్ 1; మైయర్స్ (బి) రవి బిష్ణోయ్ 12; బర్ల్ (సి) రింకూ (బి) తిలక్ 20; సికందర్ రజా (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 0; మదెవెరె (సి) శ్రేయస్ (బి) శివమ్ దూబే 2; మరుమని (బి) యశ్ 24; ఇవాన్స్ (బి) అభిషేక్ 19; న్యూమన్ (బి) అభిషేక్ 3; ఎన్గరవా (సి) రింకూ (బి) అభిషేక్ 1; ముజరబాని (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 129. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–48, 4–49, 5–65, 6–82, 7–105, 8–119, 9–121, 10–129. బౌలింగ్: మయాంక్ 3–0–25–0; యశ్ ఠాకూర్ 4–0–30–2; ప్రిన్స్ 1.2–0–10–2; రవి బిష్ణోయ్ 4–0–20–1; శివమ్ దూబే 1.4–0–13–1; తిలక్ వర్మ 1–0–9–1; అభిషేక్ 2.5–0–17–3. -
వారిద్దరూ అద్భుతం.. గతం మాకు అవసరం లేదు: శ్రేయస్ అయ్యర్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 219 పరుగుల భారీ స్కోర్ సాధించిన మెన్ ఇన్ బ్లూ.. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ పిచ్‌పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ వారిద్దరి అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ తర్వాత మా బౌలర్లు వారి పని వారు చేసుకుపోయారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్లో ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం గురుంచి ఆలోచిస్తూ ముందుకు సాగడమే మా సిద్దాంతం. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాడనికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ మనదే (ఫోటోలు)
-
రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అభిషేక్అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది. జింబాబ్వే బ్యాటర్లలో బెన్నెట్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. కాగా జింబాబ్వే టూర్‌కు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. -
జిడ్డు బ్యాటింగ్ అంటూ విమర్శలు.. కట్ చేస్తే! బౌండరీలతో విధ్వంసం
టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ తన ఫామ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధనమిచ్చాడు. శనివారం హరారే వేదికగా జింబాబ్వేతో రెండో టీ20లో తిలక్ విధ్వసంకర హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ హైదరాబాదీ మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.ఈ క్రమంలో తిలక్ కేవలం 23 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇది 9వ టీ20 హాఫ్ సెంచరీ. మొత్తంగా భారత వైస్ కెప్టెన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో కిషన్ 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా ఇటీవల కాలంలో తిలక్ ఆట తీరుపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. చాలా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడని, జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందిచిన తిలక్.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పుడు మరోసారి తనలోని హిట్టర్‌ను తిలక్ బయటపెట్టాడు. తనకు దూకుడుగా ఆడడంతో పాటు సమయస్పూర్తితో కూడా ఆడడం తెలుసు అని తిలక్ చాటి చెప్పాడు.చదవండి: భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్ -
భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. హరారా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో పేసర్ యశ్ ఠాకూర్ భారత్ తరపున డెబ్యూ చేశాడు. తొలి టీ20 ఆడిన అశోక్ శర్మను పక్కన పెట్టి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఎవరీ యశ్ ఠాకూర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ యశ్ ఠాకూర్?27 ఏళ్ల యశ్ ఠాకూర్ 1998లో కోల్‌కతాలో జన్మించాడు. కానీ ఈ రైట్ ఆర్మ్ పేసర్ దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు ఇప్పటికే రంజీలతో పాటు లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ 'ఎ' జట్టు తరపున కూడా అతడు తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుమందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.ఈ ఏడాది సీజన్‌కు ముందు అతడిని రూ. 1.60 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను తన ఆదర్శంగా తీసుకున్న యశ్ ఠాకూర్.. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దిట్ట. ఈ క్రమంలోనే అతడికి భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడే అవకాశం దక్కింది. ఈ విదర్భ పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
టీమిండియా ప్లేయింగ్ 11లో ఊహించని మార్పు
-
మళ్లీ తస్సుమన్న అభిషేక్.. వైభవ్ ధాటిగా ఆడినా..!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో అతడు నిరాశపరిచాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.ఇవాళ (జులై 25) జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.అభిషేక్ త్వరగా ఔట్ కావడంతో రెండో టీ20లో భారత్ ఆదిలోనే ఒత్తిడిలో పడినట్లైంది. అతడు ఔటైన వెంటనే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఔటయ్యాడు. తొలి మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించిన వైభవ్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తే.. 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 29 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అశోక్ కుమార్ స్థానంలో యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. యశ్ ఠాకూర్‌కు ఇది తొలి టీ20 మ్యాచ్. కెప్టెన్ అయ్యాక వరుసగా ఏడు టాస్‌లు గెలిచిన శ్రేయస్ ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్‌లో టాస్ ఓడాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Ind vs Zim 2nd T20 live updates: హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.జింబాబ్వే ఏడో వికెట్ డౌన్‌జింబాబ్వే ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన బ్రాడ్ ఎవాన్స్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ బర్ల్.. తిలక్ వర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 90/6జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మాధవీరే.. దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ సికందర్ రజా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆతిథ్య జట్టు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.జింబాబ్వే మూడో వికెట్ డౌన్‌జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన డియోన్ మైర్స్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.జింబాబ్వే రెండో వికెట్ డౌన్‌జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బెన్ కుర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే తొలి వికెట్ డౌన్‌జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 32 పరుగులు చేసిన బ్రియాన్ బెన్నెట్.. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న జింబాబ్వే220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో బెన్నెట్(22), బెన్ కుర్రాన్(1) తలా వికెట్ సాధించారు.జింబాబ్వే టార్గెట్ 220 పరుగులుహరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 81 పరుగులు చేసిన కిషన్.. న్యూమన్ న్యాముహురి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 195/5తిలక్ వర్మ ఫిప్టీతిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు. ఈ హైదరాబాదీ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 188/3భారీ స్కోర్ దిశగా భారత్16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(75), తిలక్ వర్మ(40) ఉన్నారు.ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీఇషాన్ కిషన్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో కిషన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 51 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా మూడో వికెట్ డౌన్టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బెన్నెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 95/3నిలకడగా ఆడుతున్న శ్రేయస్, కిషన్8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఇషాన్ కిషన్(26) ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్.. వైభవ్ ఔట్వైభవ్ సూర్యవంశీ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేసిన వైభవ్.. నగరావ బౌలింగ్‌లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.5వ ఓవర్- 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (8) ఔటయ్యాడు. హరారే వేదికగా రెండో టీ20లో జింబాబ్వే-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌తో టీమిండియా తరపున యువ పేసర్ యాశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. అశోక్ శర్మ స్ధానంలో యశ్ ఠాకూర్‌కు అవకాశమిచ్చారు. జింబాబ్వే మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
టీమిండియా బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్‌ను భవిష్యత్తులో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత స్టాండ్-ఇన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి, తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నాడు.బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పైనా దృష్టివైభవ్లో బౌలింగ్ సామర్థ్యం కూడా ఉందని, సమయం లభించిన ప్రతిసారీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతనితో ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపారు. బౌలింగ్‌లో మెరుగుదల కనిపించిన వెంటనే దానిపై పూర్తి దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతానికి బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, హరారే మైదానం వైభవ్‌కు కలిసొచ్చే ప్రాంతమని, గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచారని జోషి గుర్తుచేశారు.కాగా, జోషి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైభవ్‌ను తొందరపడి అంతర్జాతీయ స్థాయిలో బౌలర్‌గా వినియోగించే ఆలోచనలో లేదని, దశలవారీగా పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.బౌలింగ్ అనుభవంవైభవ్ ఎడమచేతి ఆఫ్ స్పిన్నర్‌గా పార్ట్‌టైమ్ బౌలింగ్ చేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతని బౌలింగ్ అనుభవం పరిమితం. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతని ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్లో మూడు ఇన్నింగ్స్‌లు బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు.మొత్తంగా బౌలింగ్‌లో దాదాపు అనుభవం లేని వైభవ్‌ను సరైన శిక్షణతో తీర్చిదిద్దగలిగితే, భారత జట్టు కూర్పుకు మరింత వైవిధ్యం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో ఆల్రౌండర్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ నిర్ణయం ఆశ్చర్యకరం కాదని కథనాలు పేర్కొంటున్నాయి.నేడే రెండో టీ20భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న సిరీస్‌లో రెండో టీ20 నేడు (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టీ20 గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
‘వైభవ్ సూర్యవంశీతో బౌలింగ్ కూడా చేయిస్తాం’
విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్‌తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా జింబాబ్వే పర్యటనలో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శుభారంభం అందుకున్నాడు.మెరుపు అర్ద శతకంహరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ పందమ్మిది బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునిల్ జోషి వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.అతడొక సంచలన బ్యాటర్భారత్- జింబాబ్వే మధ్య శనివారం రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడొక సంచలన బ్యాటర్. తొలి మ్యాచ్‌లో అతడు అదరగొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ అంటే పూనకాలు వస్తాయి. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్ భారీ శతకం (80 బంతుల్లో 175) బాదాడు.జింబాబ్వేతో తొలి టీ20లోనూ మెరుపులు మెరిపించాడు. వైభవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ విషయంలో ఎంతో సౌకర్యంగా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయాల్సిన టైమ్ వస్తే బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో నేను అతడితో సాధన చేయిస్తాను.వైభవ్‌తో బౌలింగ్ కూడా చేయిస్తాంఅతడు బౌలింగ్‌లోనూ మెరిశాడంటే.. కచ్చితంగా మేము అతడి సేవలను ఉపయోగించుకునే అంశంపై తప్పక దృష్టి సారిస్తాం’’ అని సునిల్ జోషి తెలిపాడు. కాగా జింబాబ్వేతో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. దీంతో కళ్లన్నీ మరోసారి వైభవ్ సూర్యవంశీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
IND vs ZIM: అతడు కోచ్‌గా ఉన్నాడంటే.. అన్నీ వైట్వాష్లే!
భారత టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో భాగంగా అతడి సారథ్యంలో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.అనంతరం ఇంగ్లండ్ గడ్డ మీద 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. దీంతో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఏడు మ్యాచ్‌లలోనూ శ్రేయస్ అయ్యర్‌కు గెలుపన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద తొలి మ్యాచ్ సందర్భంగా ఎట్టకేలకు శ్రేయస్ సేన విజయాల ఖాతా తెరిచింది.సమిష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వే జట్టుపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుస పరాభవాల తర్వాత శ్రేయస్ తొలిసారి గెలుపు రుచిచూశాడు. అయితే, జింబాబ్వేపై విజయాన్ని కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పనిలేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.మిగిలిపోయిందైనా.. అది విందు భోజనం లాంటిదే!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ శ్రేయస్ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘జింబాబ్వే మీద విజయాన్ని గొప్పగా భావించవద్దని చాలా మంది అంటున్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమిండియా టీ20మ్యాచ్‌లో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది.చాన్నాళ్ల ఆకలి తర్వాత దక్కిన గెలుపు ఇది. కాబట్టి ఇది మిగిలిపోయిందే అయినా.. పెళ్లి భోజనం లాంటిదే. శ్రేయస్ అయ్యర్‌కు కాస్త ఊరట లభించింది. అతడి కెప్టెన్సీ ఆరంభంలోనే టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది.కాబట్టి ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచినా సరే.. అది విజయమే. ఇప్పుడు ఇదే అతడికి బూస్ట్’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. జింబాబ్వే టూర్లో గౌతం గంభీర్‌కు బదులు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌పై రమేశ్ ప్రశంసలు కురిపించాడు.వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసలు‘‘ఈ విజయంలో వీవీఎస్ లక్ష్మణ్‌దే సింహభాగం. అతడు ఎప్పుడు కోచ్‌గా వ్యవహరించినా సరే.. అప్పుడు టీమిండియా తప్పక విజయాలు సాధిస్తుంది. అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రత్యర్థులను దాదాపుగా అన్ని సిరీస్‌లలోనూ వైట్‌వాష్ చేసింది.టీమిండియా వైట్‌వాష్‌లకు గురైన తర్వాత కూడా అతడు ఇలాంటి ఫలితాలు రాబట్టాడు. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లోనూ టీమిండియా గెలిచింది’’ అని రమేశ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ప్రశంసించాడు. కాగా జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా గురువారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్‌పై వేటు పడనుందా!
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఆడించే అవకాశముంది.ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్‌గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
జింబాబ్వే గడ్డపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం పందొమ్మిది బంతుల్లోనే అర్ధ శతకంతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా భారత అండర్-19, ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్.. పదిహేనేళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్‌తో అరంగేట్రం చేయిస్తారనుకుంటే.. మేనేజ్మెంట్ అక్కడ ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వలేదు. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమైన తర్వాత సంజూ శాంసన్‌ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించారు.మూడు మ్యాచ్‌లలో విఫలం ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్‌లలో 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో ఐదో టీ20 నుంచి ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను తప్పించి మళ్లీ సంజూనే ఆడించారు. అయితే, జింజాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో సంజూ లేకపోవడంతో.. వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కింది.ఈ క్రమంలో జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీతో అలరించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగినా.. ఈ బిహారీ పిల్లాడు దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.తెలివితక్కువ వాడు తప్పిస్తే.. తానేంటో చూపించాడు!ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్‌ను ప్రశంసిస్తూ.. గంభీర్‌ను విమర్శించాడు. ‘‘సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. షాట్ సెలక్షన్లో ఒక్క పొరపాటు కూడా చేయలేదు. ఈ పిల్లాడు చాలా ప్రత్యేమని అందుకే అంటాను.అయినా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో విఫలం కాగానే.. గౌతం గంభీర్ తెలివితక్కువతనంతో అతడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తాడు?.. గంభీర్ నిర్ణయం వల్ల ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదా?అయితే, అందరిలా అతడు కుంగిపోలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంటికి వెళ్లకుండా తన ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ క్యాంపునకు వెళ్లాడు. అక్కడ తన బ్యాటింగ్‌లో.. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో ఎదురైన సవాళ్లకు పరిష్కారం కనుగొనేలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.అంకిత భావానికి సెల్యూట్నిజంగా వైభవ్ అంకిత భావానికి సెల్యూట్. తన బ్యాటింగ్ లోపాల్ని సరిచేసుకుని జింబాబ్వేలో సత్తా చాటాడు. తాను ఎందుకు స్పెషలో మరోసారి ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నాడు. చేసి చూపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా జింబాబ్వే పర్యటన నుంచి గంభీర్ విరామం తీసుకోగా.. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన భారత్.. 1-0తో ముందంజలో ఉంది.చదవండి: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు -
బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. Photo Credit: BCCI Twitterఅయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్‌వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్‌తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ -
అసలు మనిషేనా? ఆ షాట్లు చూసి షాక్ అయ్యా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ మార్క్‌ను సూర్యవంశీ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయష్కుడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై తన సహచర ఆటగాడు మయాంక్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఐపీఎల్‌లోనే అతడి టాలెంట్ చూశాను అని మయాంక్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ నిలిచాడు."వైభవ్ బ్యాటింగ్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఐపీఎల్లో వైభవ్‌కు బౌలింగ్ చేసినప్పుడు, అతడు ఆడిన షాట్లను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు తనతో కలిసి ఒకే జట్టులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అతడు భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడు.అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఐపీఎల్లో మా బౌలింగ్‌ను వైభవ్ ఉతికారేశాడు. ఈ తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అతడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన అరంగేట్ర సిరీస్‌లో అతడు అంతగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున తొలి అర్ధశతకాన్ని సాధించాడు. ఏ ఆటగాడికైనా ఇది స్పెషల్ మూమెంటే" అని మయాంక్ పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
‘అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ’
దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ‘ఫాస్టెస్ట్’ బౌలర్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగైపోయాడు. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భగా మయాంక్ రీఎంట్రీ ఇచ్చాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను డకౌట్ చేసిన మయాంక్.. వన్‌డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026గొప్పగా అనిపించిందితద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లు జట్టుగా దూరంగా ఉండటం నా జీవితంలో అత్యంత కష్టకాలం. అప్పుడు నాకు 22-23 ఏళ్ల మధ్య వయసు. అంత చిన్నవయసులోనే గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.అయితే, దేశానికి ఆడటం గొప్ప విషయం. అదే స్ఫూర్తిగా ముందుకు సాగి సవాళ్లను అధిగమించాను. జింబాబ్వేలో పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని విన్నాను. నేను హరారేలో ఆడటం ఇదే మొదటిసారి. గొప్పగా అనిపించింది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛఅదే విధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి కెప్టెన్సీలో ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్‌కు ముందు మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా!.. అయితే, మ్యాచ్ సమయంలో బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు.నాకు నచ్చినట్లుగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతడూ కొన్ని సలహాలు ఇచ్చాడు. సారథి ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు సాగాను. అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించింది’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌తో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. క్రెడిట్ నాకు ఇవ్వొద్దు: వైభవ్ -
‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్లు రాణించగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ సాధించడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయంలో తన పాత్రేమి లేదని, నిజానికి బౌలర్లే మ్యాచ్ విన్నర్లంటూ వైభవ్ పేర్కొన్నాడు. తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని.. గెలుపునకు అర్హుడిని కాదని వెల్లడించాడు.మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను. జట్టు కోసం ఎప్పుడూ నా బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడుతుంటా. జింబాబ్వేపై విజయంలో నేను క్రెడిట్ తీసుకోలేను. దానికి నేను అర్హుడిని కాను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నా’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌లో ఫిఫ్టీ అనంతరం చేతి వేళ్లలో 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు. ''A' అనేది మా అమ్మ పేరులో (Aarti Suryavanshi) మొదటి అక్షరం. నా హాఫ్ సెంచరీ సెలబ్రేషన్‌ను అందుకే A సంకేతంతో చూపించాను. నా కెరీర్లో సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని నా కుటుంబానికి, కోచ్‌లతో పాటు నా జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమి స్తున్నా.' అని వెల్లడించాడు. హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.Read: అతడికి 2 నెలలే డెడ్‌లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు! -
భయమనేది లేదు.. అతడొక అత్యద్భుతం: శ్రేయస్ అయ్యర్
టీ20ల్లో టీమిండియా ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్ధేశించిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మెన్ ఇన్ బ్లూ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 13.2 ఓవర్లలో ఊదిపడేసింది.యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు సాధించి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ కమ్‌బ్యాక్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన కెప్టెన్సీలో జట్టు తొలి విజయం సాధించడం సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు."ఈ విజయం నాకు చాలా ప్రత్యేకమైనది. కెప్టెన్‌గా తొలి గెలుపును అందుకోవడం సంతోషాన్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అందరూ అద్భుతంగా రాణించారు. తొలుత మా బౌలర్లు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేశారు. ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుందని నేను ముందే పసిగట్టాను.అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాను. మయాంక్ యాదవ్ సంచలన స్పెల్ బౌలింగ్ చేశాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధరణ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి ఏ మాత్రం భయం లేదు. వైభవ్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా అత్యద్భుతం. హరారే పిచ్‌పై అతడికి బాగా అవగాహన ఉంది. ఇదే గ్రౌండ్లో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించాడు. ఆ అనుభవమే ఈ మ్యాచ్‌లో అతడికి పనికొచ్చింది. రాబోయో రెండు మ్యాచ్‌లలో కూడా ఇదే జోరును కొనసాగించి సిరీస్ క్లీన్ చేస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
వైభవ్ విశ్వరూపం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
వరుస ఓటములకు బ్రేక్.. జింబాబ్వేపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కూడా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది.భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తన రీఎంట్రీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతికే బ్రియాన్ బెనెట్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో ప్రిన్స్ యాదవ్ రెండు, దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వైభవ్ వీర విహారం126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వైభవ్ సూర్యవంశీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో అతడు బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్(35), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(28 నాటౌట్) రాణించారు. ఫలితంగా 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. మయాంక్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా శనివారం జరగనుంది. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు
వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యంత పిన్న వయసులోనే హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. 🇿🇼 𝐒𝐄 𝐊𝐄𝐇 𝐃𝐄𝐍𝐀 𝐒𝐎𝐎𝐑𝐘𝐀𝐕𝐀𝐍𝐒𝐇𝐈 𝐀𝐀𝐘𝐀 𝐇𝐀𝐈 🥵𝐑𝐔𝐊𝐄𝐆𝐀 𝐍𝐀𝐇𝐈, 𝐓𝐇𝐎𝐊𝐄𝐆𝐀 😎Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/ACaAC23Zoq— FanCode (@FanCode) July 23, 2026భారత అండర్-19, ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అరుదైన ఫీట్లు నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఇటీవల ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇంగ్లండ్‌లో విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ను తప్పించిన యాజమాన్యం.. వైభవ్‌ను అరంగేట్రం చేయించింది. అయితే, తొలి మ్యాచ్‌లో పదిహేనేళ్ల ఈ లెఫ్టాండ్ ఓపెనర్ 13 పరుగులే చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత మూడు, నాలుగో టీ20లలో వరుసగా 14, 15 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో వైభవ్ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో ఐదో టీ20 నుంచి వైభవ్‌ను తప్పించి.. మళ్లీ సంజూను ఆడించారు. అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు మాత్రం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన మేనేజ్మెంట్.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఇక జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వైభవ్ సూర్యవంశీ శుభారంభం అందించాడు.ఆకాశమే హద్దుగా..తొలి ఓవర్లో అభిషేక్, వైభవ్ పెద్దగా పరుగులు చేయలేదు. బ్లెస్సింగ్ ముజర్బానీ బౌలింగ్‌లో కేవలం చెరో పరుగు చేశారు. అయితే, రెండో ఓవర్లో రిచర్ట్ నగవర బౌలింగ్‌కు రాగా.. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయినప్పటికీ.. రెండు, మూడు, నాలుగు బంతుల్లో వైభవ్ వరుసగా 6,4,6 బాదాడు. రెండో ఓవర్లో మొత్తంగా 20 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో మూడో ఓవర్ ఐదో బంతికి అభిషేక్ శర్మ (1)ముజర్బానీ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ.. వైభవ్ జోరు కొనసాగించాడు. కేవలం పద్దెనిమిది బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో ఓవర్లో నగరవ బౌలింగ్‌లో తొలి బంతికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ మరుసటి బంతికే బెన్ కర్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెప్పాడు.. చేసి చూపించాడుఅయితే, నాలుగు నెలల క్రితం ఇదే వేదిక మీద.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ మీద వైభవ్ 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌కు టైటిల్ అందించాడు. జింబాబ్వేకు తొలి టీ20కి ముందు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు హరారే స్పోర్ట్స్ క్లబ్ మీద ఆడిన అనుభవం, పిచ్ గురించి పూర్తి అవగాహన ఉందన్నాడు. అన్నట్లుగానే విధ్వంసకర హాఫ్ సెంచరీతో తళుక్కుమన్నాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యంత పిన్న వయసులో తొలి అర్ధ శతకం బాదిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ (ఇండియా): జింబాబ్వే మీద హరారే వేదికగా 2026లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీ👉లూయీస్ బ్రూస్ (గిబ్రాల్టర్): మాల్టా మీద అల్బేగరియా వేదికగా 2021లో 16 ఏళ్ల 56 రోజుల వయసులో ఫిఫ్టీ👉కవిన్ చద్దా (ఇండోనేషియా): స్వీడన్ మీద బాలి వేదికగా 2026లో 16 ఏళ్ల 76 రోజుల వయసులో ఫిఫ్టీ👉ఆల్సినే టురే (సియెర్రా లియోన్): ఘనా మీద బెనోని వేదికగా 2023లో 16 ఏళ్ల 89 రోజుల వయసులో ఫిఫ్టీ👉టెంజిన్ రాబ్గే (భూటాన్): చైనా మీద కౌలాలంపూర్ వేదికగా 2023లో 16 ఏళ్ల 118 రోజుల వయసులో ఫిఫ్టీసచిన్ రికార్డు బ్రేక్ఫుల్ మెంబర్ జట్లలో భాగంగా అఫ్గనిస్తాన్ స్టార్ రహ్మనుల్లా గుర్బాజ్ 17 ఏళ్ల 296 రోజుల వయసులో ఈ ఘనత సాధించగా.. వైభవ్ తాజాగా అతడిని అధగమించాడు. అంతేకాదు.. ఫుల్ మెంబర్ జట్ల తరఫున అంతర్జాతీయ క్రికెట్ (ఆల్ ఫార్మాట్)లో అతి పిన్న వయసులోనే అర్ధ శతకం చేసిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండ్కులర్ పాకిస్తాన్ మీద 1989 నాటి టెస్టు మ్యాచ్‌లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో అర్ధ శతకం చేయగా.. వైభవ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. తనకు అచ్చొచ్చిన హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ఈ చిచ్చర పిడుగు ఉతికారేశాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అయితే ఆర్ధ శతకం సాధించిన వైభవ్.. తర్వాత బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ఫలితంగా భారత్ స్కోర్ పవర్‌ప్లేనే 60 పరుగులు దాటింది.వైభవ్ వరల్డ్ రికార్డుఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సాధించిన వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అర్ధ శతకం చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్(15 ఏళ్ల 118 రోజులు) చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జిబ్రాల్టర్ ప్లేయర్ లూయిస్ బ్రూస్(16 ఏళ్ల 56 రోజులు) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో బ్రూస్ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
టీమిండియాతో తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో ఆతిథ్య జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్- జింబాబ్వే మధ్య గురువారం నాటి తొలి మ్యాచ్‌కు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. తొలి బంతికే వికెట్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగింది. మయాంక్ యాదవ్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్‌ను డకౌట్ చేశాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026మరో ఓపెనర్, అరంగేట్ర ఆటగాడు బెన్ కర్రాన్ (10) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను మయాంక్ యాదవ్ వెనక్కి పంపాడు. కెప్టెన్ సికిందర్ రజా (4) వికెట్‌ను శివం దూబే తన ఖాతాలో వేసుకోగా.. నిలకడగా ఆడుతున్న ర్యాన్ బర్ల్ (26)ను రవి బిష్ణోయి వెనక్కి పంపాడు.BACK TO BACK WICKETS IN BACK TO BACK OVERS! 💪Full THOKO mode power-play mein 🔥Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3 #ZIMvIND #RokoNahiThoko pic.twitter.com/6vpRLxPZ5I— FanCode (@FanCode) July 23, 2026రాణించిన మెధెవెరెఈ క్రమంలో వెస్లే మెధెవెరె ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరో స్థానంలో వచ్చిన ఈ ఆల్‌రౌండర్.. 34 బంతుల్లో 39 పరుగులతో జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ అతడు రనౌట్ అయ్యాడు. మిగతా వాళ్లలో బ్రాడ్ ఎవాన్స్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమాణి (20 బంతుల్లో 27) కాస్త వేగంగా ఆడాడు. జింబాబ్వే స్కోరెంతంటే?న్యూమన్ ఒక్క పరుగు చేసి మరుమాణితో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా.. శివం దూబే, రవి బిష్ణోయి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఎనిమిదో సారి. దీంతో అంతర్జాతీయ టీ20లలో వరుసగా 8 టాస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని టీమిండియా సారథిగా 2010-12 మధ్య కాలంలో వరుసగా 7 సార్లు టాస్ గెలిచాడు. తాజా మ్యాచ్‌తో ధోనిని అయ్యర్ అధిగమించాడు.టీ20ల్లో వరుసగా టాస్‌లు గెలిచిన భారత కెప్టెన్లు వీరేశ్రేయస్ అయ్యర్: 8 (జూన్ 2026 – జూలై 2026)ఎం.ఎస్. ధోని: 7 (మే 2010 – ఫిబ్రవరి 2012)విరాట్ కోహ్లి: 6 (ఆగస్టు 2019 – డిసెంబరు 2019)రోహిత్ శర్మ: 5 (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామీ పేరిట ఉంది. సామీ 2015-16 మధ్య కాలంలో టీ20ల్లో వరుసగా 10 టాస్‌లు గెలిచాడు. ఆ తర్వాత రెండో స్ధానంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా(9) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో హ్యారీ బ్రూక్(8), ఆరోన్ ఫించ్(8)లో కలిసి శ్రేయస్ సంయుక్తంగా నిలిచాడు. కాగా అయ్యర్ టాస్‌లు గెలుస్తున్నప్పటి మ్యాచ్‌లు మాత్రం గెలవడం లేదు. ఇప్పటివరకు అతడి సారథ్యంలో 7 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. -
IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం
జింబాబ్వేతో తొలి టీ20 సందర్భంగా అశోక్ శర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో సీనియర్లను పక్కనపెట్టిన యాజమాన్యం.. పేస్ దళంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ క్రికెట్లతో పాటు తొలిసారి అశోక్ శర్మను ఎంపిక చేసింది.ఎవరీ అశోక్ శర్మ?రాజస్తాన్‌లోని జైపూర్‌కి సమీపంలో గల రాంపుర అనే గ్రామంలో 2002లో జన్మించాడు అశోక్ శర్మ. అతడి తండ్రి సాధారణ రైతు. కుటుంబ పరిస్థితి ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ అశోక్‌తో పాటు అతడి అన్న అక్షయ్ శర్మ కూడా క్రికెటర్ కావాలనే కలలు కన్నాడు.జిల్లా స్థాయిలో అక్షయ్ ఆడాడు. అయితే, తమ్ముడి కోసం తన కెరీర్‌ను త్యాగం చేశాడు. దీంతో అశోక్‌కు మార్గం సుగమమైంది. ఈ విషయం గురించి అశోక్ శర్మ స్వయంగా జాతీయ మీడియాకు వెల్లడించాడు.లీడింగ్ వికెట్ టేకర్కుటుంబ సహకారంతో తన కలలను నిజం చేసుకునే క్రమంలో అశోక్ శర్మ.. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ దేశీ టీ20 టోర్నీ తాజా ఎడిషన్‌లో పది మ్యాచ్‌లలో కలిపి 22 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న అశోక్ శర్మ.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిలో పడ్డాడు.ఫాస్టెస్ట్ బాల్ఈ క్రమంలో ఐపీఎల్-2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ అశోక్‌ను రూ. 90 లక్షలకు కొనుగోలు చేసింది. ఆకాశ్ నెహ్రా మార్గదర్శనంలో అతడు రాటుదేలాడు. ఈ ఏడాది రాజస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా గంటకు 154.2 కిలో మీటర్లకు పైగా వేగంతో బంతిని విసిరి హాట్ టాపిక్‌గా మారాడు. మొత్తంగా ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 24 ఏళ్ల అశోక్ శర్మ.. తాజాగా అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ముగ్గురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. తుదిజట్టులో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ కూడా పేస్ విభాగంలో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు.. జింబాబ్వే తరఫున బెన్ కర్రాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు.తుదిజట్లుభారత్వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్జింబాబ్వేబ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి (వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
IND vs ZIM: వైభవ్ మెరుపులు.. టీమిండియా ఘన విజయం
హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 13.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది.ఓపెనర్లలో అభిషేక్ శర్మ (1) విఫలమైనప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ మెరుపు అర్ద శతకంతో రాణించాడు. కేవలం 18 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28*), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (6*)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా 13.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి భారత్ 126 పరుగులు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.Updates10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 96-2ఇషాన్ 26, శ్రేయస్ అయ్యర్ 17 పరుగులతో ఉన్నారు.వైభవ్ మెరుపు అర్ధ శతకం6.1: నగరవ బౌలింగ్‌లో రెండు పరుగులు పూర్తి చేసుకుని యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్. కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ. ఆ మరుసటి బంతికే అవుటయ్యాడు. స్కోరు: 68-2. ఇషాన్ 16 పరుగులతో ఉన్నాడు. శ్రేయస్ క్రీజులోకి వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మ.. ముజరబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 9 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. 3 ఓవర్లకు భారత స్కోర్: 23/1 టీమిండియా టార్గెట్ ఎంతంటే?జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌లో మధెవెరే(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరుమణి(27), బర్ల్(26) రాణించారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.వరుసగా రెండు వికెట్లుఆఖరి ఓవర్లో జింబాబ్వే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి మధెవెరే(39), మూడో బంతికి ఎవాన్స్(0) ఔటయ్యారు.ఐదో వికెట్ డౌన్13.1: రవి బిష్ణోయి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బర్ల్ (26). మెధెవెరె 8 పరుగులతో ఉండగా.. స్కోరు: 64-5. మరుమాణి క్రీజులోకి వచ్చాడు.పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 46-4 (10)మెధెవెరె 5, బర్ల్ 12 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్‌లో సికిందర్ రజా(4) ఔటయ్యాడు. మెధెవెరె క్రీజులోకి వచ్చాడు.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 26-3 (6)బర్ల్ 1, రజా 4 పరుగులతో ఉన్నారు.పీకల్లోతు కష్టాల్లో జింబాబ్వేజింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో డియాన్ మైర్స్(6) ఔటయ్యాడు. మయాంక్‌కు ఇది రెండో వికెట్ కావడం గమనార్హం. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 21/2జింబాబ్వే రెండో వికెట్ డౌన్‌జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన బెన్ కర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 20/2తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వేభారత బౌలింగ్ అటాక్ ఆరంభించిన మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో తొలి బంతికే... వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన బ్రియాన్ బెన్నెట్ (0). క్రీజులోకి డియాన్ మైర్స్. జింబాబ్వే స్కోరు: 6-1 (1). బెన్ కర్రాన్ సున్నా, డియాన్ మైర్స్ ఆరు పరుగులతో ఉన్నారు.అశోక్ శర్మ అరంగేట్రంరాజస్తాన్ పేసర్ అశోక్ శర్మ ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. అదేవిధంగా యువ పేసర్ మయాంక్ యాదవ్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు యువ ఆటగాళ్లు న్యూమాన్ న్యామ్హురి, బెన్ కరన్ జింబాబ్వే తరపున డెబ్యూ చేశారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బెన్ కర్రాన్, డియాన్ మైర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీభారత్ : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ -
వాళ్లకు అన్యాయం చేశారు: టీమిండియా దిగ్గజం ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ కెప్టెన్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అర్హత ఉన్న ఆటగాళ్లను జింబాబ్వే సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఒక్కడికే సెలక్టర్లు న్యాయం చేశారని.. కానీ మిగతా ఐపీఎల్ స్టార్లకు మాత్రం అన్యాయం చేశారని చిక్కా విమర్శించాడు.వరుస పరాజయాల తర్వాతకాగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లలో వరుసగా 2-0, 4-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియా.. తాజాగా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ క్రమంలో గురువారం ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుండగా.. హరారే స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో సిరీస్‌కు సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (ప్రస్తుతం గాయపడ్డాడు), అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ వంటి సీనియర్లను పక్కనపెట్టారు. రవి బిష్ణోయికి కూడా ముందుగా ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఆ తర్వాత మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.కొత్తగా వీళ్లుఇదిలా ఉంటే.. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు కూడా యాజమాన్యం ఈ సిరీస్ ఆడే జట్టులో చోటిచ్చింది. మయాంక్ యాదవ్, హర్ష్ దూబే కూడా జట్టులోకి వచ్చారు.రింకూ ఎక్కడి నుంచి వచ్చాడు?ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం వైఖరిని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను ఎంపిక చేశారు. మంచి సెలక్షన్. కానీ ఆర్సీబీకి వరుసగా రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్ సంగతేంటి?పాపం.. వాళ్లకు అన్యాయంఅసలు ఈ రింకూ సింగ్ మళ్లీ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? అతడికి బదులు పాటిదార్‌ను సెలక్ట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు.. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయి లేదంటే హర్ష్ దూబే స్థానంలో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను ఎంపిక చేస్తే బాగుండేది.మీడియం పేసర్లకు బదులు ఆర్సీబీ స్టార్, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేస్తే ఇంకా బాగుండేది. అసలు జింబాబ్వేతో సిరీస్‌కు జట్టును ఈ సెలక్టర్లు ఎలా ఎంపిక చేశారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. ఆర్సీబీ ప్లేయర్లకు అన్యాయం చేశారంటూ ఈ మాజీ చీఫ్ సెలక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
భారత్‌తో సిరీస్.. జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ
స్వదేశంలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ మిల్టన్ షుంబా కుడి కాలి హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.మంగళవారం నిర్వహించిన స్కాన్లలో గాయం తీవ్రత బయటపడటంతో షుంబాను జట్టు నుంచి తప్పించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన ఇన్నోసెంట్ కైయాను జట్టులోకి తీసుకుంది. కైయా ఇప్పటికే హరారేలో జట్టుతో చేరాడు.బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌తో షుంబా దాదాపు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు గాయం అతని ఆశలకు గండికొట్టింది.కైయా విషయానికొస్తే.. ఇతను చివరిసారిగా 2024 జూలైలో భారత్‌పైనే, హరారే వేదికగా టీ20 మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై మరోసారి అవకాశం దక్కింది.భారత్-జింబాబ్వే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఇవాళ (జూలై 23) హరారేలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు జూలై 25, 26 తేదీల్లో ఇదే వేదికపై జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే!
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్‌ల తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య గురువారం నాటి తొలి టీ20కి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్ నుంచి ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన యాజమాన్యం.. వైభవ్ సూర్యవంశీని మాత్రం కొనసాగించింది.అదే విధంగా.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ తదితర యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్లను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా.. రింకూ సింగ్‌ను కూడా తిరిగి పిలిపించింది.అభిషేక్ జోడీగా ఎవరు?ఈ నేపథ్యంలో జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతున్న అంశం ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా? లేదంటే వైభవ్‌ను ఎంపిక చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు.అయితే, హరారే వేదికగా ఈ ఏడాది అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. కానీ టీమిండియా తరఫున అరంగేట్రం తర్వాత మాత్రం అతడు అంచనాలు అందుకోలేకపోతున్నాడు.ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం ఉంటుందా?అదే సమయంలో గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్.. ఈ ఏడాది కూడా 510 పరుగులతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ ఈ మేరకు రాణించాడు.నా జట్టు ఇదేఇలాంటి తరుణంలో భారత మాజీ క్రికెటర్ ఎస్. బద్రీనాథ్ తన తుదిజట్టులో ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీకే పెద్దపీట వేశాడు. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, నాలుగో నంబర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ తిలక్ వర్మను కొనసాగించిన బద్రీనాథ్.. ఆరు, ఏడు స్థానాల్లో ఆల్‌రౌండర్లు శివం దూబే, సూర్యాంశ్ షెడ్గేలను ఎంచుకున్నాడు. రింకూ సింగ్‌ను మాత్రం పక్కనపెట్టాడు.ఇక స్పిన్ విభాగంలో హర్ష్ దూబే, రవి బిష్ణోయి రూపంలో ఇద్దరిని ఎంపిక చేసిన బద్రీనాథ్.. పేస్ దళంలో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లకు చోటిచ్చాడు.జింబాబ్వేతో తొలి టీ20కి బద్రీనాథ్ ఎంచుకున్న జట్టువైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబే, రవి బిష్ణోయి, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.చదవండి: ICC ODI WC 2027: దమ్ముంటే అతడిని తప్పించండి -
భారీ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ
జింబాబ్వేతో ఇవాళ (జూలై 23) జరగనున్న తొలి టీ20కి ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 16 పరుగులు చేస్తే, టీ20 క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.ప్రస్తుతం అభిషేక్ 203 టీ20 మ్యాచ్‌ల్లో 199 ఇన్నింగ్స్ ఆడి 5984 పరుగులు చేశాడు. తొలి టీ20లో 16 పరుగులు సాధిస్తే, 200 ఇన్నింగ్స్లోపు 6000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (184), శుభ్‌మన్ గిల్ (185) ఉన్నారు.అంతర్జాతీయంగా ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు కేవలం 162 ఇన్నింగ్స్‌లోనే 6000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.జింబాబ్వేపై అద్భుతమైన రికార్డుఅభిషేక్ శర్మకు జింబాబ్వేపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన ఆరు టీ20ల్లో 179 పరుగులు చేసి, భారత్ తరఫున జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.అంతేకాదు, ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కంటే కనీసం 16 పరుగులు ఎక్కువ చేస్తే, భారత్-జింబాబ్వే మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.నేటి భారత్-జింబాబ్వే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత యువ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
టీమిండియాకు మరిచిపోలేని షాక్
భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైన వేళ, రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంచలన మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే కేవలం 116 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని చారిత్రక విజయం సాధించింది. పసికూన నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా ఛేదించలేపోవడం అభిమానులకు నేటికీ గుర్తుంది.బిష్ణోయ్ మ్యాజిక్.. 115కే జింబాబ్వే ఆలౌట్టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత జట్టు ఇప్పటిలాగే జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.ముకేశ్ కుమార్ తొలి వికెట్ అందించగా, రవి బిష్ణోయ్ ( 4/13) తన అద్భుత స్పిన్‌తో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను అతలాకుతలం చేశాడు. అతడికి వాషింగ్టన్ సుందర్ (2/11) కూడా తోడవ్వడంతో జింబాబ్వే 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది.కుప్పకూలిన టీమిండియాస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ఆ వెంటనే రుతురాజ్ గైక్వాడ్ కూడా పెవిలియన్ చేరాడు.సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాటింగ్‌ను పూర్తిగా కుదిపేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) పోరాడే ప్రయత్నం చేసినా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. చివరకు భారత్ 102 పరుగులకే ఆలౌటై 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.టీమిండియాకు సవాల్ఆ ఓటమి షాక్ నుంచి కోలుకోకముందే టీమిండియా మరోసారి జింబాబ్వేలో పర్యటిస్తుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 23) తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై టీ20 సిరీస్‌లు కోల్పోయి ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో జరిగే సిరీస్‌లో తప్పక విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, గత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరో సంచలనం సృష్టించాలని జింబాబ్వే భావిస్తోంది. -
'అతడికి సలహాలు అక్కర్లేదు.. కచ్చితంగా చెలరేగుతాడు'
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే వేదికగా జరగనుంది. వరుస సిరీస్‌ల ఓటముల అనంతరం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది.ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచరలకు కీలక సూచనలు చేశాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాలను పక్కనపెట్టి ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని అయ్యర్ పిలుపునిచ్చాడు. "ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యనటనలలో మాకు అనుకూల ఫలితాలు రాలేదు. కానీ ఈ ఓటముల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా మనం ఏ విషయాలపై దృష్టి పెట్టాలి, మైదానంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా మారాలి అనే విషయాలపై స్పష్టత వచ్చింది. నాతో పాటు జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఇదే తొలి జింబాబ్వే పర్యటన.కాబట్టి ఇక్కడ కండీషన్స్‌కు ఎంత వేగంగా అలవాటుపడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. నేను మా బాయ్స్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బయట నుంచి విమర్శలను పట్టించుకోవద్దు. కేవలం మీ ఆటపైనే దృష్టి సారించి ఫియర్ లెస్ క్రికెట్ ఆడండి. మేము ఒక జట్టుగా సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. జింబాబ్వేను ఏ మాత్రం తేలికగా తీసుకోము. ప్రత్యర్ధి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కొంతమందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో అయ్యర్ పేర్కొన్నాడు.అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురుంచి శ్రేయస్ మాట్లాడుతూ.. "ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మా బాయ్స్‌కు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.చదవండి: భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే -
T20I Series 2026: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. FREE గా ఎలా చూడాలంటే?
-
భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్.. జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే
భారత్-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. జూలై 23 నుంచి హరారే వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో ఘోర పరాజయాలను చవిచూసిన భారత్.. ఈ సిరీస్‌తో తిరిగి విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది.ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన శ్రేయస్ సేన మూడు రోజుల పాటు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. ఈ సిరీస్ భారత జట్టుతో పాటు వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన వైభవ్.. ఇప్పుడు జింబాబ్వేపై ఎలా రాణిస్తాడోనని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై కూడా అందరి కళ్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు కూడా తన ఫామ్‌ను అందుకోవడానికి ఈ జింబాబ్వే పర్యటన ఎంతగానో ఉపయోగపడనుంది.మరోవైపు సొంతగడ్డపై వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న జింబాబ్వే.. టీమిండియాను అడ్డుకునేందుకు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ తదితర విషయాలను తెలుసుకుందాం.షెడ్యూల్ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి.1వ టీ20- జూలై 23, 2026- గురువారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్2వ టీ20- జూలై 25, 2026- శనివారం-సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్3వ టీ20-జూలై 26, 2026- ఆదివారం- సాయంత్రం 4:30- హరారే స్పోర్ట్స్ క్లబ్ఈ మ్యాచ్‌లను భారత్‌లో జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన సరికొత్త స్పోర్ట్స్ ఛానెల్ Unite8 Sports లో వీక్షించవచ్చు. అదేవిధంగా ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్సైట్లో కూడా ఈ మ్యాచ్‌లను చూడవచ్చు.జట్లుభారత్శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్. జింబాబ్వే సికిందర్ రజా (కెప్టెన్), బ్రియన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివాంగా, బెన్ కుర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధెవెరె, తాడివనాషే మరుమాని, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబాని, డియోన్ మైయర్స్, రిచర్డ్ న్గరావా, న్యూమాన్ నియామ్హురీ, మిల్టన్ షుంబా, తఫద్వా త్సిగా (వికెట్ కీపర్). -
వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్నాడు. అయితే, క్రికెట్లో ఇవన్నీ భాగమేనని.. జట్టు ప్రయోజనాల కోసం తాను ఎల్లప్పుడూ వందశాతం కష్టపడతానని స్పష్టం చేశాడు.కాగా ఐపీఎల్, భారత్ అండర్-19 జట్టు తరఫున విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీ.. పదిహేనేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా అత్యంత పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.భారీ అంచనాల నడుమఈ పరిణామాల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 , 15 పరుగులు మాత్రమే చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో ఈ బిహారీ పిల్లాడిని తప్పించి.. మళ్లీ సంజూనే ఆడించింది మేనేజ్మెంట్. ఇక ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 4-0తో క్లీన్‌స్వీప్ అయింది.అయితే, జింబాబ్వేతో తాజాగా మరో టీ20 సిరీస్‌ను గురువారం నుంచి మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం.. అభిషేక్ శర్మకు జోడీగా జింబాబ్వే సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ..వంద శాతం కష్టపడతాను‘‘గడిచిన నాలుగు నెలల కాలంలో నేను ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే, ఆటను మెరుగుపరచుకునే ప్రక్రియపై మాత్రమే నేను దృష్టి పెట్టాను. జట్టు కోసం వందకు వంద శాతం కష్టపడతాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.అదే విధంగా.. ‘‘కోచ్‌లు, ఇతర సిబ్బంది నాకు మార్గదర్శనం చేస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలో నాకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. అంతా బాగుంది. ఈ అనుభూతి గొప్పగా అనిపిస్తోంది. రోజురోజుకీ ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతోంది.ఈ పిచ్‌లపై నాకు అవగాహన ఉందిఇక జింబాబ్వేతో టీ20 సిరీస్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడే నాలుగు నెలల క్రితం అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో మేము గెలిచాం. అప్పుడు యువ జట్టు తరఫున.. ఇప్పుడు టీమిండియా తరఫున ఇదే గ్రౌండ్లో ఆడటం గొప్పగా ఉంది. ఈ పిచ్‌లపై నాకు అవగాహన ఉంది. కాబట్టి జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తాను’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో వైభవ్ ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. భారీ ఆధిక్యంలో భారత్ -
తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడగలను కానీ..: టీమిండియా స్టార్
ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత భారత టీ20 జట్టు జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి టీ20 నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగ.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా తనకు ఉందని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగానే తాను బ్యాటింగ్ చేస్తానని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్‌గా తనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయని.. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తానంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవాలుకాగా ఐర్లాండ్‌తో సిరీస్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టీ20లలో ఇవ్వడంతో పాటు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ లభించింది. అయితే, ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా వరుసగా 2-0, 4-0తో క్లీన్‌స్వీప్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.బ్యాటర్‌గా శ్రేయస్ ఫర్వాలేదనిపించినా.. సారథిగా అతడికి చేదు అనుభవమే మిగిలింది. మరోవైపు.. తిలక్ వర్మ స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వచ్చాయి. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడి స్ట్రైక్‌రేటు 110 కాగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 152.94కు చేరినప్పటికీ సగటు 26 మాత్రమే.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి మాజీ క్రికెటర్లు తిలక్ వర్మను జట్టు నుంచే తొలగించాలనే డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో జింబాబ్వేతో తొలి టీ20కి ముందు తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్లో ఒక్కోసారి వేర్వేరు ఆటగాళ్లు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంటుంది.ఆ సత్తా నాకుంది.. కానీపిచ్ పరిస్థితులకు తగినట్లుగా ప్లాన్ ఉంటుంది. కాబట్టి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ప్రణాళిక ప్రకారం.. తొలి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలంటే నేను అదే పని చేస్తా. మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడగల సత్తా నాకుంది. కానీ యూకే పిచ్ పరిస్థితుల్లో అది అంత సులువు కాదు. పైగా మ్యాచ్‌లో ఎలాంటి స్థితిలో ఉన్నామో కూడా చూసుకోవాలి.నేను బ్యాటింగ్‌కు వెళ్లేసరికి జట్టు పవర్‌ప్లేలోనే నాలుగైదు వికెట్లు కోల్పోతూ వచ్చింది. అలాంటప్పుడు వచ్చీ రాగానే షాట్లు ఆడటం సరైంది కాదు. పైగా వైస్ కెప్టెన్ అంటే నేను మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంటుంది. అందుకే తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ఆలోచించాల్సి వచ్చింది. పోరాటపటిమ ఉన్న జట్టుగత రెండేళ్లుగా ఎక్కువగా ఆసియాలోని పిచ్‌లపైనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మేం ఇంగ్లండ్‌కు వెళ్లగానే ఇబ్బంది పడ్డాం’’ అని తిలక్ వర్మ తనను విమర్శించిన వారికి కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. జింబాబ్వే మంచి పోరాటపటిమ ఉన్న జట్టు అని ప్రశంసించిన తిలక్ వర్మ.. వారిని ఓడించడం కూడా అంత సులువేమీ కాదన్నాడు. చదవండి: టీమిండియాపై గెలవగలం: జింబాబ్వే కెప్టెన్ -
భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన జింబాబ్వే
రేపటి నుంచి స్వదేశంలో భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ వెస్లీ మధేవెరే, ఫాస్ట్ బౌలర్ న్యూమన్ న్యాంహురిని తిరిగి జట్టులోకి తీసుకోగా, వికెట్‌కీపర్-బ్యాటర్ తఫాడ్జ్వా సిగాకు తొలిసారి టీ20 జట్టులో చోటు కల్పించింది.సికందర్ రజా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టు జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.ఆశించిన ప్రదర్శనలు లేకపోవడంతో మధేవెరేను ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు పక్కన పెట్టగా.. గాయం కారణంగా ఆ సిరీస్‌ను మిస్ అయిన న్యూమన్ న్యాంహురి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.న్యాంహురి స్థానంలో బంగ్లాదేశ్ సిరీస్‌లో అవకాశం పొందిన తనాకా చివాంగా ఈసారి కూడా జట్టులో స్థానం నిలబెట్టుకోగా.. క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తషింగా ముసెకివా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు.జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, తనకా చివంగా, బెన్ కర్రాన్, బ్రాడ్ ఎవాన్స్, వెస్లీ మాధవెరె, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియోన్ మైయర్స్, రిచర్డ్ నగరావా, న్యూమాన్ న్యాంహురి, మిల్టన్ షుంబా, తఫాడ్జ్వా సిగాకాగా, ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో జింబాబ్వే అద్భుతాలు చేసింది. తొలుత ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను, ఆతర్వాత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (2-1) కైవసం చేసుకుంది. అయితే చివర్లో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది. రేపటి నుంచి భారత్‌తో జరుగబోయే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలని సికందర్ రజా సేన లక్ష్యంగా పెట్టుకుంది. -
IND vs ZIM: సిరీస్‌లో టీమిండియా ఫేవరెట్ కాదు: జింబాబ్వే కెప్టెన్
విదేశీ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస పరాజయాలు చవిచూసింది. యూకే టూర్లో భాగంగా తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడ్డ భారత జట్టు.. అనూహ్య రీతిలో పసికూన చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టి ఆతిథ్య జట్టు చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది.దీంతో యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు అత్యంత చేదు అనుభవమే మిగిలింది. విజయమన్నదే లేకుండా అతడు ఈ రెండు సిరీస్‌లను అవమానకర రీతిలో ముగించాల్సి వచ్చింది.ఇపుడు జింబాబ్వేతో సిరీస్అనంతరం.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోనూ టీమిండియా ఓటమిపాలైంది. ప్రత్యర్థికి 1-2తో సిరీస్‌ను సమర్పించుకుంది. ఇక ఇప్పుడు భారత జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ బృందం ఎలాగైనా ఈసారి గెలుపు ఖాతా తెరిచి.. సిరీస్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే, అదేమీ అంత తేలిక కాదు. ఐరిష్ జట్టు వంటి పసికూన చేతిలో ఓడిన టీమిండియాకు.. జింబాబ్వే కూడా కఠిన సవాలు విసురుతోంది.అసాధారణ విజయాలుఇటీవలి కాలంలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. టీ20 ప్రపంచకప్-2026లో అనూహ్య రీతిలో మాజీ చాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియా జట్టునే జింబాబ్వే మట్టికరిపించింది. ఏకంగా 23 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ దశలోనే ఆసీస్‌ను ఎలిమినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై కూడా విజయాలు సాధించింది.ఇక ఇటీవల బంగ్లాదేశ్ జట్టు తమ దేశంలో పర్యటించగా ఏకైక టెస్టులో బంగ్లాను ఏకంగా ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో జింబాబ్వే మట్టికరిపించింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే, టీ20 సిరీస్‌ను మాత్రం 1-2తో బంగ్లాకు కోల్పోయింది. ఏదేమైనా ఇటీవల అన్ని ఫార్మాట్లలో చెప్పుకోదగ్గ విజయాలతో జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.టీమిండియా ఫేవరెట్ కాదుఈ నేపథ్యంలో తాజా టీ20 సిరీస్‌లో టీమిండియా హాట్ ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ‘‘అదేం లేదు. ఈ సిరీస్‌లో గెలిచేందుకు ఇరుజట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి.ఏదేమైనా నేనొక విషయం కచ్చితంగా చెప్పగలను. జింబాబ్వే ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా ఆడుతూ క్రికెట్లోని అసలైన మజాను అందిస్తోంది. ఈ సిరీస్ ద్వారా కూడా జింబాబ్వే కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.వార్వన్ సైడ్ కానే కాదుప్రస్తుతం టీమిండియా సంధి దశలో ఉంది. జింబాబ్వే పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ సిరీస్ ఎంతమాత్రం ఏకపక్షంగా ఉండబోదని చెప్పగలను’’ అని రజా పేర్కొన్నాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య జూలై 23, 25, 26 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. చదవండి: iND vs ENG: ప్రపంచంలోనే బెస్ట్.. అతడిని ఎందుకు ఆడించలేదు?Another exciting challenge awaits Team India! 🇮🇳Zimbabwe skipper Sikandar Raza is excited for the upcoming series against India and believes fans are in for an entertaining contest! 👊🔥#ZIMvIND pic.twitter.com/6iyXDzZbLn— Star Sports (@StarSportsIndia) July 21, 2026 -
IND vs ZIM: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ఖాయం..!
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల జూలై 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం కానుంది. వరుసగా మూడు సిరీస్‌లను కోల్పోయి జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఎలా రాణిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదరు చూస్తున్నారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన వైభవ్‌కు ఈ జింబాబ్వే టూర్ అద్భుత అవకాశంగా చెప్పుకోవాలి.సంజూ శాంసన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్‌లో వైభవ్ తనను తను నిరూపించుకుంటే భారత టీ20 జట్టులో అతడి స్దానం పదిలంగా ఉంటుంది. అయితే జింబాబ్వే గడ్డపై సూర్యవంశీ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.వైభవ్ చెలరేగడం ఖాయం!ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే వేదికగా అండర్-19 ప్రపంచకప్‌లో వైభవ్ దుమ్ములేపాడు. ముఖ్యంగా ఫైనల్లో ఇంగ్లండ్‌పై అతడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇది యూత్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.ఈ చిచ్చర పిడుగు జింబాబ్వేలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 169.49 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 439 పరుగులు సాధించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కనబరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా జింబాబ్వే పర్యటనలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. వరుస సిరీస్‌లతో బీజీగా ఉండడంతో రెగ్యులర్ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.చదవండి: వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా -
వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అరంగేట్ర సిరీస్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వైభవ్ కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 15 ఏళ్ల వైభవ్‌కు అంతర్జాతీయ వేదికపై తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇప్పుడు లభించింది.జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ప్రపంచ క్రికెట్లో గొప్ప స్టార్‌గా ఎదుగుతాడని రజా కొనియాడాడు."వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన క్రికెటర్. కేవలం 15 ఏళ్ల వయస్సులో ప్రపంచస్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. అయితే అంతర్జాతీయ స్ధాయిలో ఆడేటప్పుడు సహజంగా ఆటగాళ్లపై ఒత్తడి ఉంటుంది. కాబట్టి కేవలం రెండు లేదా మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన వైభవ్‌ను విమర్శించడం సరికాదు.ఎంతో మంది గొప్ప క్రికెటర్లతో వైభవ్ డ్రెసింగ్ రూమ్‌ను షేర్ చేసుకుంటున్నాడు. వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. బీసీసీఐ వైభవ్‌ను సరైన దిశలో నడిపిస్తే, అతడు ఖచ్చితంగా ఈ తరంలో గొప్ప క్రికెటర్ అవుతాడని" రజా హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా జూలై 23న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-భారత్ మధ్య తొలి టీ20 జరగనుంది. వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా.. తిరిగి జింబాబ్వే పర్యటనలో పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్ -
జింబాబ్వేతో టీ20 సిరీస్.. శ్రేయస్ సేనకు ముప్పు వీరితోనే!
వరుసగా మూడు వైట్‌బాల్ సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా వారం రోజులు తిరగక ముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. వరుస పరాజయాల తర్వాత టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టడానికి ఈ టీ20 సిరీస్ అత్యంత కీలకంగా మారింది. అయితే పేపర్ మీద భారత్ అత్యంత బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికి టీ20 ఫార్మాట్లో మాత్రం జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పసికూనే కాదా అని తేలికగా తీసుకుంటే మన జట్టుకు మరో పరభావం ఎదురవ్వకతప్పదు. ఎందుకంటే తమ సొంతగడ్డపై జింబాబ్వే బంగ్లాదేశ్‌పై వరుస విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉండి. తాజాగా టీ20 సిరీస్‌ను కోల్పోయినప్పటికి ఆ జట్టు ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2026లో పటిష్టమైన ఆస్ట్రేలియాను సైతం జింబాబ్వే చిత్తు చేసింది. ఈ క్రమంలో జింబాబ్వే బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిద్దాం.రజాతో డెంజర్..ముఖ్యంగా ఆ జట్టుకు కెప్టెన్ సికందర్ రజా అతిపెద్ద బలం. అతడు బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ టీమ్‌ను ముందుండినడిపించగలడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్ ఆడిన అనుభవం అతడికి ఉంది. ఒంటో చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించాలంటే అతడిని తొందరగా పెవిలియన్‌కు పంపాల్సిందే. బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు.అతడి ఆఫ్ స్పిన్‌ను భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఎదుర్కొవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఆడితే వికెట్ సమర్పించుకోక తప్పదు. మరోవైపు యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ నుంచి భారత జట్టుకు ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై బెన్నెట్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మల్టీ ఫార్మాట్ సిరీస్‌లలో కూడా అతడు దుమ్ములేపాడు.అతడి వికెట్‌ను ఆరంభంలోనే భారత్ సాధిస్తే ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టవచ్చు. బెన్నెట్‌తో పాటు మరో బెన్ కుర్రాన్ రూపంలో మరో అద్భుతమైన ఓపెనర్ జింబాబ్వే వద్ద ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డేలో బెన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ సొదరుడే ఈ బెన్ కుర్రాన్ కావడం గమనార్హం. మిడిలార్డర్లో రియాన్ బర్ల్ వంటి సీనియర్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. వీరితో పాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ బ్యాట్‌తో కూడా మెరుపులు మెరిపించగలడు. బౌలింగ్‌లో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు.బలహీనతలు ఇవేఅయితే బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం జింబాబ్వే ప్రధాన సమస్యగా ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. కొన్నిసార్లు మెరుగైన ఆరంభం లభించినప్పటికి పవర్ ప్లే తర్వాత వరస వికెట్లు కోల్పోయి చిత్తు అయిన సందర్భాలు ఉన్నాయి. సికందర్ రజా లేదా బెన్నెట్‌పై కూడా అతిగా ఆధారపడడం కూడా వారి బలహీనతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరైన బెంచ్ బలం కూడా జింబాబ్వే వద్ద లేదు. -
టీ20 సిరీస్.. జింబాబ్వేకు బయల్దేరి వెళ్లిన టీమిండియా
జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా శనివారం రాత్రి భారత్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినివ్వడంతో అతడి స్థానంలో జట్టు మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వీవీఎస్ లక్ష్మణ్ సహా తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇతర క్రికెటర్లు జింబాబ్వే టూర్‌కు వెళ్తున్న ఫొటోలను బీసీసీఐ పంచుకుంది. ఇంగ్లండ్ టూర్లో ఇవాళ చివరి వన్డే ఆడిన అనంతరం టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, శివమ్ దూబేలు నేరుగా జింబాబ్వేకు పయనం కానున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. తన కెప్టెన్సీలో శ్రేయస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో జింబాబ్వే సిరీస్ అతడికి కీలకం కానుంది. జింబాబ్వే టూర్లో టీమిండియానే ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ ఆతిథ్య జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జూలై 23 నుంచి మొదలుకానుంది. తొలి టీ20 జూలై 23న హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. 2024 జూలైలో చివరగా జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.ఇక ఈ సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పక్కకు తప్పించారు. రింకూ సింగ్, మయాంక్ యాదవ్‌లతో పాటు ప్రబ్సిమ్రన్లను జింబాబ్వే టూర్‌కు ఎంపిక చేసింది.జింబాబ్వే టూర్‌కు టీమిండియా: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యాష్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రబ్‌సిమ్రన్, మయాంక్ యాదవ్.𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝙩𝙤 𝙕𝙞𝙢𝙗𝙖𝙗𝙬𝙚 🇿🇼#TeamIndia | #ZIMvIND pic.twitter.com/akRFqycwXC— BCCI (@BCCI) July 18, 2026చదవండి: రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ తొలి స్పందన! -
భారత్‌తో సిరీస్‌కు ముందు జింబాబ్వే ఆటగాడికి షాక్
త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ తనాకా చివంగా షాక్ తగిలింది. అతడిపై ఐసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు చివంగాకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.ఐసీసీ మీడియా ప్రకటన ప్రకారం, ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ను చివంగా ఉల్లంఘించాడు. ఈ నిబంధన అంతర్జాతీయ మ్యాచ్‌లలో వినిపించేలా అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా సహచర ఆటగాడు ఇన్నోసెంట్ కాయా నుంచి ఆశించినంత వేగంగా త్రో రాకపోవడంతో నిరాశకు గురైన చివంగా, అందరికీ వినిపించేలా అసభ్య పదజాలం ఉపయోగించినట్లు ఐసీసీ గుర్తించింది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ గిల్బర్ట్ విధించిన శిక్షను చివంగా అంగీకరించాడు.గత 24 నెలల్లో చివంగా చేసిన తొలి క్రమశిక్షణ ఉల్లంఘన ఇదే కావడంతో అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే చేరింది.ఇక సిరీస్ విషయానికి వస్తే, మూడో వన్డేలో బంగ్లాదేశ్ 200 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించి ఓదార్పు విజయం సాధించింది. అప్పటికే తొలి రెండు వన్డేల్లో గెలిచిన జింబాబ్వే 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.జులై 23 నుంచి జింబాబ్వే స్వదేశంలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ హరారే వేదికగా 23, 25, 26 తేదీల్లో జరుగనుంది. -
టీమిండియాకు డబుల్ షాక్
జింబాబ్వే పర్యటనకు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా వరుణ్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో చివరి రెండు టీ20లకు అతడు అందుబాటులో లేడు. అయితే ఈ మిస్టరీ స్పిన్నర్ గాయం కాస్త తీవ్రమైనదిగా తెలుస్తోంది. అతడు కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అతడు జింబాబ్వే టూర్ నుంచి కూడా వైదొలగుతున్నట్లు సమాచారం. దీంతో వరుణ్ స్ధానంలో మరో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ రాజస్తాన్ స్పిన్నర్ ఇంగ్లండ్ సిరీస్‌లో తీవ్ర నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన బిష్ణోయ్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు. కానీ ఇప్పుడు వరుణ్ గాయపడడంతో బిష్ణోయ్‌కు మరో అవకాశం లభించింది. మరోవైపు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో అర్షద్ ఖాన్ లేదా గుర్నూర్ బ్రార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూలై 23 నుంచి జింబ్వాబేతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. -
'సంజూకు అందుకే ఛాన్స్ ఇవ్వలేదు'.. మాజీ చీఫ్ సెలక్టర్ కీలక వ్యాఖ్యలు
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.అయితే ఈ జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు లేకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలమైనంత మాత్రాన అతడిని జట్టు నుంచి చాలా మంది మాజీలు తప్పుపడుతున్నారు. సంజూ ప్రస్తుతం భారత జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో ఉన్నాడు. తొలుత ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ శాంసన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు అతడిని పక్కన పెట్టారు. ఇప్పుడు జింబాబ్వే టూర్‌కు పూర్తిగా జట్టు నుంచే పక్కన పెట్టారు. సీనియర్ బ్యాటర్లందరని ఎంపిక చేసినప్పటికి, ఒక్క సంజూనే జట్టు నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తొలగించలేదని, కేవలం యువ ఆటగాళ్లను పరీక్షించేందుకే అతడికి విశ్రాంతి ఇచ్చారని ఎంఎస్కే అభిప్రాయపడ్డాడు."శాంసన్ విషయంలో అనవసర చర్చలు వద్దు. భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన ఆటగాడిని జట్టు ఇంత సులువుగా తప్పిస్తారా? ఫామ్ కారణంగా అతడిని పక్కన పెట్టారని నేను అనుకోవడం లేదు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సెలెక్టర్లు సంజూకు విశ్రాంతి ఇచ్చారని అనుకుంటున్నాను. జింబాబ్వే పర్యటనను ప్రధానంగా భారత బెంచ్ బలాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతోంది. అందుకే జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. ప్రపంచకప్ ముగిసిన మొదటి ఆరు నెలల కాలాన్ని సెలక్టర్లు కొత్త ప్రయోగాల కోసమే కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్ కోసం కేవలం నుంచి 18 నెలల ముందు మాత్రమే సెలెక్టర్లు తమ కోర్ గ్రూప్ ఆటగాళ్లపై దృష్టి పెడతారు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న మార్పులను ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలమైనందున సంజూను జట్టు తప్పించారంటే నేను నమ్మను. ఆసియాగేమ్స్‌కు ఎంపిక చేసిన జట్టులో సంజూ ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. అయితే తదుపరి టీ20 ప్రపంచకప్(2028) ఆడాలంటే సంజూ కచ్చితంగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని" ఎంఎస్కే పేర్కొన్నాడు.చదవండి: జట్టులో దండగ.. అతడినే టీమిండియా కెప్టెన్‌ని చేస్తారేమో! -
జట్టు ఎంపికలో శ్రేయస్ మార్క్.. ఆర్సీబీ ఏం పాపం చేసింది?
జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ జట్టును కాకుండా రెండో జట్టును అక్కడికి పంపుతున్న నేపథ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా ఎంపికలో ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లలో శ్రేయస్ సహా నలుగురు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందినవారే కావడం విశేషం. కెప్టెన్ శ్రేయస్‌తో పాటు సూర్యాన్ష్ షెడ్గే, ప్రబ్‌సిమ్రన్ సింగ్, యష్ ఠాకూర్లు ఎంపికయ్యారు. వీరంతా ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. మిగిలిన ఆటగాళ్ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్కు ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు (అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హర్ష్ దూబే), కేకేఆర్ నుంచి వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్ ఉన్నారు. ఇక లక్నో సూపర్‌జెయింట్స్ నుంచి మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు ఉండగా, సీఎస్కే నుంచి శివమ్ దూబే, రాజస్తాన్ రాయల్స్ నుంచి వైభవ్ సూర్యవంశీ, ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ, గుజరాత్ టైటాన్స్ నుంచి అశోక్ శర్మకు చోటు దక్కింది. అయితే మిగిలిన రెండు ఫ్రాంచైజీలు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రం ఒక్క ఆటగాడు కూడా ఎంపిక కాలేదు. 'ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు ఎంపికలో శ్రేయస్ అయ్యర్ హవా నడుస్తుందని.. చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ నుంచి మాత్రం ఒక్క క్రికెటర్‌కు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది' అని పేర్కొన్నారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జూలై 23న హరారే వేదికగా జింబాబ్వే, భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్‌సిమ్రన్ (వికెట్ కీపర్)Read: శ్రీ చరణి సంచలనం.. ఏకైక భారత క్రికెటర్‌గా ఘనత -
సంజూ శాంసన్‌కు మరో షాక్..?
టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే టూర్‌కు దూరమైన అతను.. ఏషియన్ గేమ్స్ జట్టులోనూ స్థానంలో కోల్పోనున్నట్లు క్రీడా వర్గాలు అంటున్నాయి. గత నెలలో భారత సెలెక్టర్లు 15 మంది సభ్యుల ఏషియన్ గేమ్స్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సంజూ శాంసన్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ జట్టు నుంచి కూడా సంజూను తప్పించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.యువ ఆటగాళ్లకు అవకాశాల పేరుతో సంజూ టీ20 కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో బీసీసీఐపై భారీ ఒత్తిడి ఉందని, అతడికి అవకాశాలు ఇవ్వడం కోసమే సంజూను శాశ్వతంగా తప్పించే ప్లాన్ జరుగుతుందని అతని అభిమానులు అనుకుంటున్నారు.కాగా, ఐర్లాండ్ సిరీస్, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయని విషయం తెలిసిందే. విశ్రాంతి పేరుతో సెలెక్టర్లు అతన్ని తప్పించారన్న ప్రచారం జరుగుతుంది. ఈ సిరీస్‌కు సంజూ స్థానంలో యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అవకాశం కల్పించారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఏషియన్ గేమ్స్ విషయానికొస్తే.. ఈ ఖండాంతరం క్రీడలు సెప్టెంబర్ 19- అక్టోబర్ 4 మధ్యలో జరుగనున్నాయి.జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (విసి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (విసి)ఏషియన్ గేమ్స్‌కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (సి), తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ -
గంభీర్ ఇక్కడే!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్‌కోచ్!
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య జట్టుతో ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది శ్రేయస్ అయ్యర్ సేన. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. రెండో టీ20లో ఇంగ్లండ్ జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.జింబాబ్వే పర్యటనకుఇక టీ20 సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగం కానుంది. అనంతరం భారత టీ20 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆ తర్వాత టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలు- 2026 టోర్నీలో పాల్గొంటుంది. అదే సమయంలో టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది.ఈ నేపథ్యంలో కోచింగ్ సిబ్బందిలో బీసీసీఐ మార్పులు చేయనున్నట్లు సమాచారం. జర్నలిస్టు గౌరవ్ గుప్తా సోషల్ మీడియా వేదికగా అందించిన సమాచారం ప్రకారం.. జింబాబ్వే టూర్, ఆసియా క్రీడల్లో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ బదులు.. వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలుస్తోంది.గంభీర్ ఇక్కడే!.. టీమిండియాకు ‘కొత్త’ హెడ్‌కోచ్!అదే సమయంలో గంభీర్ సీనియర్ జట్టుతో కలిసి స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో భాగమవుతాడని సమాచారం. కాగా ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా ఉన్న లక్ష్మణ్.. గతంలో కూడా టీమిండియా హెడ్‌కోచ్‌ల గైర్హాజరీలో.. సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.వీళ్లు కూడా..ఇక జింబాబ్వే టూర్లో లక్ష్మణ్‌తో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్ సునిల్ జోషి కోచింగ్ సిబ్బందిలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. బౌలింగ్ కోచ్‌గా అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు సమాచారం. మరోవైపు.. భారత మాజీ బ్యాటర్ హృషికేశ్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జట్టు, సిబ్బంది బృందం ఆసియా క్రీడల్లోనూ భాగం కానున్నట్లు సమాచారం.కాగా ఆసియా క్రీడలు సెప్టెంబరు 19- అక్టోబరు 4 మధ్య జపాన్‌లో జరుగనున్నాయి. ఇక వెస్టిండీస్‌తో టీమిండియా సొంతగడ్డపై సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించింది. ఈ క్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో ఐరిష్ జట్టు చేతిలో టీ20 సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ అయింది. దీంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి: మూడో టీ20కి ముందు వైభవ్‌కు గాయం! -
సంజూకు మళ్లీ అన్యాయం..? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్ మరోసారి సందిగ్ధంలో పడింది. మొన్న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20కి తుది జట్టులో కోల్పోయిన సంజాకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను తొలిసారి నేషనల్ టీమ్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా యధావిధిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులో కొనసాగించారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ఆరంభించనున్నాడు.వేటునా? విశ్రాంతా?సాధారణంగా జింబాబ్వే లాంటి పర్యటనలను సీనియర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు అవకాశమిస్తారు. కానీ ఈసారి సీనియర్ బ్యాటర్లలో కేవలం సంజూ శాంసన్‌ను మాత్రమే పక్కన పెట్టడం పలు అనుమానాలకు తావనిస్తోంది. అతడిని కావాలనే తప్పించారా? లేదా రెస్ట్ ఇచ్చారా? అన్నది ఇంకా స్పష్టతలేదు.అయితే సంజూ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్, జింబాబ్వే టూర్ల తర్వాత భారత్‌కు పెద్దగా టీ20 సిరీస్‌లు లేవు. మళ్లీ సెప్టెంబర్‌లో ఆసియాకప్ గేమ్స్‌లో టీమిండియా తలపడనుంది. అంటే దాదాపు రెండు నెలల విరామం లభిస్తోంది. అలాంటిప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్ ఆడే సంజూకు ‘విశ్రాంతి’ ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయిసంజూకు రెస్ట్ కాదని, కావాలనే పక్కన పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ హీరో అయిన సంజూకు మరోసారి అన్యాయం జరిగిందని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా పొట్టి ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన సంజూ.. యూకే టూర్లో మాత్రం విఫలమయ్యాడు. ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో రెండో టీ20కు అతడిని తప్పించి చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అవకాశమిచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రధాన జట్టులోనే అతడికి చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం సంజూ సభ్యునిగా ఉన్నాడు. -
సంజూపై వేటు.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమిండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టులో ఓపెనర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున సంచలన ప్రదర్శన కనబరిచిన ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.ఇక 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంజూ శాంసన్ ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లతో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆడినప్పటికీ విఫలమయ్యాడు. దీంతో రెండో టీ20కి శాంసన్‌ను తప్పించి వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఇక జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పూర్తిగా పక్కనబెట్టారు. చిన్న జట్టుతో సిరీస్ కావడంతో శాంసన్‌కు రెస్ట్ ఇచ్చి ఉంటారని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. ఇక జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికైన ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్‌రేట్‌తో 510 పరుగులు సాధించాడు. ఇతర మార్పుల విషయానికొస్తే రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తిరిగి రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, యష్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ అశోక్ శర్మకు పిలుపొచ్చింది.జింబాబ్వే పర్యటనకు భారత జట్టుశ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రబ్‌సిమ్రన్ (వికెట్ కీపర్).జింబాబ్వే పర్యటనలో టీమిండియా షెడ్యూల్:తొలి టీ20: జూలై 23, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)రెండో టీ20: జూలై 25, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)మూడో టీ20: జూలై 26, హరారే (సమయం: సాయంత్రం 4.30 గంటల నుంచి)Read: టీమిండియాతో మూడో టీ20: ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన -
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ?
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూలైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఈ సిరీస్ జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది.అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే అంతకంటే ముందు భారత జట్టు.. ఇంగ్లండ్, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్‌లతో వైట్‌బాల్ సిరీస్‌లలో తలపడనుంది. అంతేకాకుండా జింబాబ్వే పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.అయితే ఈ వరుస సిరీస్‌ల నేపథ్యంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కేందుకు అస్కారం ముంది. ఐపీఎల్-2026లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?మరోవైపు గత కొంతకాలంగా కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశముంది. సూర్య ప్రస్తుతం స్వల్ప గజ్జ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి ముఖ్యమైన సిరీస్‌లోనే అతడిని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తుందంట. ఈ క్రమంలో ఐర్లాండ్ లేదా జింబాబ్వే టూర్లో భారత జట్టు పగ్గాలను శ్రేయస్ చేపట్టే అవకాశముందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ చివరగా రెండేళ్ల కిందట టీమిండియా తరపున టీ20ల్లో ఆడాడు. లక్నో స్పీడ్ స్టార్ యయాంక్ యాదవ్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకోవాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుందంట.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ లెజెండ్ -
జింబాబ్వే టూర్‌కు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లతో బీజీబీజీగా గడపనుంది. తొలుత జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో స్వదేశంలోనే జరగనుంది. అనంతరం ఐర్లాండ్ టూర్లో భాగంగా రెండు టీ20లు టీమిండియా ఆడనుంది.మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు టీ20లు , మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూలై 1న మొదలై జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి మూడు రోజుల తర్వాత టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించనుంది.తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగిస్తుంది. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగా జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి.భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి.అయితే వరుస సిరీస్‌ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి.భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్మొదటి టీ20: జూలై 23రెండో టీ20: జూలై 25మూడో టీ20: జూలై 26చదవండి: NZ vs SA: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
సంజూది చెత్త టెక్నిక్.. కోచ్‌ల మాట వినడు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ తర్వాత భారత ఓపెనింగ్ జోడీ మారిపోయింది. వరుస వైఫల్యాల కారణంగా సంజూ శాంసన్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు. కివీస్‌తో సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి అదరగొట్టిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. అభిషేక్ శర్మకు జోడీగా సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు.రెండో అవకాశంఅయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అనారోగ్యం కారణంగా దూరం కాగా.. సంజూకు ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో అతడు 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌కే పరిమితమైన సంజూ (Sanju Samson).. సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.ఘనంగా ఆరంభించిచెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో సంజూ 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, రెండు సిక్స్‌లు బాది 24 పరుగులు చేశాడు. అయితే, బ్లెసింగ్స్ ముజర్బానీ బౌలింగ్‌లో షార్ట్ బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది.ఈ నేపథ్యంలో మరోసారి సంజూ ఆట తీరుపై విమర్శలు వచ్చాయి. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అభిమానులు సైతం విమర్శించారు. భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా ఇదే మాట అంటున్నాడు. సంజూ టెక్నిక్ తప్పుగా ఉందని.. ఇప్పటికైనా పొరపాటు సరిచేసుకోవాలని సూచించాడు.మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు‘‘చెపాక్‌లో సంజూను ఆడించడం వల్ల చెన్నై ప్రేక్షకులు సంతోషించారు. అందుకు తగ్గట్లుగానే అతడు మంచి ఆరంభమే అందుకున్నాడు. కానీ మరోసారి తన టెక్నిక్ తప్పని నిరూపించాడు.లెగ్ సైడ్ దిశగా వచ్చిన బంతిని ఆడేందుకు పక్కకు జరిగి మూల్యం చెల్లించాడు. మూడు స్టంప్స్‌ను ప్రత్యర్థి బౌలర్‌కు చూపి ఈజీ టార్గెట్ అయ్యాడు. క్రికెట్లో ఓనమాలు దిద్దినపుడే ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. మూడు స్టంప్స్ బౌలర్‌కు కనిపించేలా ఎప్పుడూ ఓ బ్యాటర్ ఎప్పుడూ తప్పు చేయకూడదు.కోచ్‌ల మాట వింటాడో లేదో!అలా చేయడం ప్రాథమిక తప్పిదం. అసలు అతడు కోచ్‌ల మాట వింటాడో లేదో నాకు తెలియదు. నిజానికి టీమిండియాలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత కోచ్ ఉన్నాడు. కాబట్టి అతడు ఎవరి మాట విని ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. టెక్నికే తప్పుగా ఉంటే.. ఆటలో ఇంకేం ముందుకు వెళ్లగలవు?.. ఈ టోర్నీలో అతడు టెక్నిక్ సరి చేసుకోవడం కష్టమే అనిపిస్తోంది’’ అంటూ ఘాటుగా సంజూను విమర్శించాడు బద్రీనాథ్.కాగా కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ గత ఏడాది కాలంగా భారత టీ20 ఓపెనర్‌గా రాణించాడు. అయితే, ఇటీవలి కాలంలో అతడు ఫామ్ కోల్పోయాడు. కివీస్‌తో సిరీస్‌లో సంజూ చేసిన పరుగులు 10, 6, 0, 24, 6. గత కొంతకాలంగా అతడు షార్ట్ బంతుల్ని తప్పుగా అంచనా వేసి అవుట్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బద్రీనాథ్ సంజూ టెక్నిక్ సరిగ్గా లేదంటూ చివాట్టు పెట్టాడు.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
Tilak Varma: నాకే చోటు లేదా?.. మెరుపులతో ఇరగదీశాడు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్‌లలోనూ తిలక్ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.తిలక్ ప్రదర్శన ఇలా..ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్ స్ట్రైక్‌రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై తిలక్ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.టాపార్డర్ నుంచి తీసేశారు!అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్‌లో మాత్రం తిలక్ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.ఊహించినట్లుగానే టాపార్డర్ మారింది. అభిషేక్ శర్మకు జోడీగా.. ఓపెనర్‌గా రైట్ హ్యాండర్ సంజూ శాంసన్ తిరిగి రాగా.. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్ వర్మను లోయర్ ఆర్డర్‌కు పంపించారు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్‌కు ఉంది.16 బంతుల్లోనే ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్‌రేటు 275. ఇలా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్ వర్మ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.డౌన్ ఆర్డర్‌కు పంపడం మంచిదైందిఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్ వర్మను డౌన్ ఆర్డర్‌కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్ ఆర్డర్లో అతడు బ్యాటింగ్ చేయడం నేను ఇప్పటికే చూశాను.నిజానికి ఇలా బ్యాటింగ్ ఆర్డర్లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్‌తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్ పాండ్యా ఐదు, తిలక్ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఐదు, హార్దిక్‌ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో తిలక్, హార్దిక్‌లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్ మంజ్రేకర్ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్ అవకాశాలు మెరుగుపరచుకుంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
జింబాబ్వేపై గెలిచాం.. కానీ: సూర్యకుమార్ అసంతృప్తి
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్ సేన.. జింబాబ్వేపై గురువారం నాటి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది.ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచిందంటే టీమిండియా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి ఆటంకం కలిగితే.. అపుడు నెట్ రన్‌రేటు కీలకం అవుతుంది. ప్రస్తుతానికి భారత్ (-0.100) కంటే విండీస్ (+1.791) ఈ విషయంలో మెరుగ్గా ఉంది.భారీ తేడాతో గెలిచి ఉంటే బాగుండేదినిజానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికీ.. ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్‌రేటు మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026ముఖ్యంగా అక్షర్ పటేల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది.మా బ్యాటర్లు సూపర్.. కానీ బౌలర్లేఈ నేపథ్యంలో జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క బ్యాటర్ తమ వంతుగా పరుగులు ఇచ్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడు. అయితే, బంతితో మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది’’ అని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తాము బౌలింగ్ పరంగా మరింత స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్‌కతాకు వెళ్లిన తర్వాతే తుదిజట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని.. సెమీస్ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నాడు.అదరగొట్టిన అర్ష్‌దీప్‌కాగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్- వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో మ్యాచ్‌లో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే తలా ఒక్క వికెట్ తీశారు.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్లు👉వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై👉భారత్: 256/4(20)👉జింబాబ్వే: 184/6(20) 👉ఫలితం: 72 పరుగుల తేడాతో భారత్ గెలుపు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
అదేం బౌలింగ్?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్
టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్‌రన్‌రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్.ఏకంగా 256 పరుగులుఇక గురువారం నాటి మ్యాచ్‌లో చెపాక్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్ పిచ్‌పై 184 పరుగులు చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత బౌలింగ్ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్‌లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్ తీశాడు. నోబాల్, వైడ్లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.ఇది బ్యాటింగ్ పిచ్‌ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా?అసలు దూబే ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్ స్టంప్ మీదకు బాల్ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్ చేయించాలి.ఇది కేవలం నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.చదవండి: T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..? -
T20 WC 2026, IND VS ZIM: అభిషేక్ ఖాతాలో అనవసర రికార్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాట్రిక్ డకౌట్లు సహా నాలుగో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోర్‌కే (15) ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో నిన్నటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు ముందు అభిషేక్‌పై భారీ ఒత్తిడి ఉండింది. అయితే ఈసారి అతను ఒత్తిడిని అధిగమించి 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా, ఓ అనవసర రికార్డు మూటగట్టుకున్నాడు. అభిషేక్‌కు ఇది తన టీ20 కెరీర్లో రెండో నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీగా నిలిచింది. అభిషేక్ కెరీర్లో అత్యంత నిదానమైన హాఫ్ సెంచరీ కూడా జింబాబ్వేపైనే రావడం విశేషం. 2024లో హరారే వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 33 బంతులు తీసుకున్నాడు. వాస్తవానికి సాధారణ ప్లేయర్లకు 26 బంతుల్లో అర్ద శతకం అంటే చాలా పెద్ద అఛీవ్మెంట్. అయితే అభిషేక్ లాంటి విధ్వంసకర ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడికి మాత్రం ఇది అనవసర రికార్డుగా మిగిలిపోయింది.తాజా ప్రదర్శనలతో అభిషేక్ మరో ఘనత కూడా సాధించాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధవన్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్, అభిషేక్ తమ టీ20 కెరీర్లలో 11 సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (32 ఫిఫ్టి ప్లస్), కేఎల్ రాహుల్ (21) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. పై జాబితాలోని ఆటగాళ్లలో అభిషేకే అతి తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అతని కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉండటంతో రోహిత్ శర్మను కిందకు దించి ఈ విభాగంలో టాప్ ప్లేస్‌కు చేరే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ సహా జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్ సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ 55, సంజూ శాంసన్ 24, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ యాదవ్ 33, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ మొత్తంలో 17 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది కూడా ఓ ప్రపంచకప్ రికార్డు.అనంతరం ఛేదనలో జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా, తన జట్టును విజయతీరాలు దాటించలేకపోయాడు. కెప్టెన్ సికందర్ రజా (31) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. అంతిమంగా జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో అర్షదీప్ 3, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్‌కే సెమీస్ బెర్త్ దక్కుతుంది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా లెఫ్డ్ అర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్షదీప్.. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. అర్షదీప్ తన టీ20 వరల్డ్‌కప్ కెరీర్లో 19 మ్యాచ్‌ల్లో 14.25 సగటున, 7.33 ఎకానమీతో 35 వికెట్లు తీయగా.. బుమ్రా తన 19 మ్యాచ్‌ల వరల్డ్‌కప్ కెరీర్లో 14.00 సగటున 33 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత బంగ్లాదేశ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్‌కు (50) దక్కుతుంది.సూపర్ ఫామ్‌లో అర్షదీప్‌ప్రస్తుత ప్రపంచకప్‌లో అర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. టీమిండియా గత ఎడిషన్ టీ20 ప్రపంచకప్ సాధించడంలోనూ అర్షదీప్‌సింగ్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఎడిషన్‌లో 17 వికెట్లు తీసి జాయింట్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 81 టీ20లు ఆడిన అర్షీదప్.. 126 వికెట్లు తీసి భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో అర్షదీప్ సహా జట్టులోని ప్రతి ఒక్కరు సత్తా చాటడంతో జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడినా, మ్యాచ్ రద్దైనా విండీస్‌కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.భారత్ వర్సెస్ జింబాబ్వే స్కోర్ వివరాలు..భారత్: 256-4 (అభిషేక్ (55), హార్దిక్ (50 నాటౌట్)జింబాబ్వే: 184-6 (బ్రియాన్ బెన్నెట్ 97 నాటౌట్, అర్షదీప్ 4-0-24-3) -
జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశలు సజీవం
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. జింబాబ్వేను 72 పరుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఇండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.బెన్నెట్ ఒంటరి పోరాటం..255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 97 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రజా(31) ఫర్వాలేదన్పించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్‌కప్-2026లో జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన బ్యాటర్లు జూలు విధిల్చారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు.బ్యాటింగ్‌కు ప్రతీ ఒక్కరూ పరుగులు సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 44), ఇషాన్ కిషన్(38), సూర్యకుమార్ యాదవ్(33), సంజూ శాంసన్(24) రాణించారు.అయితే మొత్తం ఆరుగురు బ్యాటర్లు కూడా 150+ స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడం విశేషం. తద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయడం ఇదే తొలిసారి.👉ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో భారత్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో టీమిండియా ఇప్పటివరకు 63 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ 66 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది.👉టీ20 వరల్డ్‌కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ బంతులు(26) డాట్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్‌రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్-8 మ్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ సేన ఈ ఫీట్ నమోదు చేసింది.మెరుపులుచెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 160. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్‌రేటుతో 55 పరుగులు సాధించాడు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్‌రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్ దంచికొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్‌రేటుతో 33 పరుగులు రాబట్టాడు.𝙈𝙖𝙥𝙤𝙨𝙖 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙡𝙡, 𝙎𝙆𝙔 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙧𝙩𝙝𝙚𝙧. 🚀Total control from Suryakumar Yadav as he steers India forward!ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/QZBUsVXD6e— Star Sports (@StarSportsIndia) February 26, 2026అతడి స్ట్రైక్‌రేటు 275ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్, తిలక్ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.టీమిండియా ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, కెప్టెన్ సికందర్ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకికాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ లీగ్ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-8కు చేరుకుంది.అయితే, సూపర్-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
తిలక్ వర్మ మెరుపులు.. కేవలం 16 బంతుల్లోనే
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ కీలక మ్యాచ్‌లో తన ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8లో తిలక్ విధ్వంసం సృష్టించాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ హైదరాబాదీ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్), అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మోపోసా,నగరవా, ముజర్బానీ తలా వికెట సాధించారు. అయితే సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగడం విశేషం. -
IND vs ZIM: హార్దిక్, తిలక్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (24) నిరాశపరచగా.. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్, తిలక్ విధ్వంసంకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), తిలక్ వర్మ దంచికొట్టారు. హార్దిక్ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. తాజాగా భారత్ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
కోహ్లి స్టైల్లో సిక్స్ కొట్టిన సంజూ.. గంభీర్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చెన్నై వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో శాంసన్‌కు తుది జట్టులో దక్కింది.టీమ్ మెనెజ్‌మెంట్ అతడిని ఓపెనర్‌గా పంపింది. అయితే సంజూ క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్‌లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే భారత స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్సర్‌తో తెరిచాడు. ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్‌కు మైదానంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్‌లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్‌ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత.. ఎట్టకేలకు
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్ బ్యాట్ ఝులిపించాడు. ఇరవై ఆరు బంతుల్లోనే అర్ధ శతకం బాది సత్తా చాటాడు.ఆది నుంచి దారుణంగా విఫలంటీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్ శర్మ ఆది నుంచి దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత కడుపు నొప్పి వల్ల నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లోనూఅనంతరం జట్టులోకి తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం జట్టులో కొనసాగించగా.. సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.దీంతో అభిషేక్ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తుదిజట్టు నుంచి తప్పించి.. అతడికి కాస్త బ్రేక్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.A well-constructed half-century for #AbhishekSharma! 👏His first in the ICC Men’s T20 World Cup and what an occasion to bring it up! 💙ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/vIVUWHYhSe— Star Sports (@StarSportsIndia) February 26, 2026అర్ధ శతకంతోజింబాబ్వేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ.. ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా కెరీర్లో తొలి వరల్డ్‌కప్ ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌కు.. ఐసీసీ ఈవెంట్లో ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే, మపోసా బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.ఇదిలా ఉంటే.. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 16, తిలక్ వర్మ 11 పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ సంజూ శాంసన్ 24, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 38 పరుగులు చేసి అవుటయ్యారు. సూర్య 13 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్ టెండుల్కర్ -
T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు సంజూ శాంసన్. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్ అభిషేక్ శర్మతో కలిసి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్ ముజర్బానీ సంధించిన షార్ట్ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్ పెవిలిన్ చేరగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్ 15, అభిషేక్ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
జింబాబ్వేతో మ్యాచ్.. భారత తుదిజట్టులో రెండు మార్పులు
టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8లో భాగంగా చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది.వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్ధానంలో అక్షర్ పటేల్, సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అభిషేక్, సంజూ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. క్రీమర్ స్థానంలో టినోటెండా మాపోసాకు చోటు దక్కింది.తుది జట్లుజింబాబ్వే: తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవభారత్: సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
అతడికి బ్రేక్ ఇవ్వండి.. సంజూను జట్టులోకి తీసుకోండి: వీరేంద్ర సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే సూర్య సేన కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచన చేశాడు. ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మను తప్పించి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు డకౌట్లు ఉండడం గమనార్హం. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు."నేను గనుక టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే, అభిషేక్‌కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అతడి స్ధానంలో సంజూ శాంసన్‌ను అవకాశమిస్తాను. ఏదైనా ప్రయత్నం చేయాలంటే ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఇది చాలా కీలకమైన మ్యాచ్. కాబట్టి ఆటగాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలి.తుది జట్టు ఎంపికలో మార్పులు కచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భారత్ సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశముంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్‌లో లేరన్న విషయం మెనెజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
IND vs ZIM: భారత తుదిజట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!
జింబాబ్వేతో కీలక సూపర్-8 మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య గురువారం చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌కు తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ముందడుగు వేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక భారీ విజయం సాధించాలి.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు విషయంలో యాజమాన్యం ఆచితూచి వ్యవహరిస్తోంది. టాపార్డర్‌లో ముగ్గురు లెఫ్టాండర్లే ఉండటం వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు.. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఈజీ టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను తుదిజట్టులో చోటు ఇవ్వనున్నట్లు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు.ఆ ముగ్గురిపై వేటు!అయితే, ఓపెనింగ్ జోడీగా మాత్రం లెఫ్టాండర్లు ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మను కొనసాగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న మరో లెఫ్టాండర్ తిలక్ వర్మపై వేటు వేసి.. అతడి స్థానంలో అంటే వన్‌డౌన్‌లో కుడిచేతి వాటం బ్యాటర్ సంజూను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను ఆడించకుండా మూల్యం చెల్లించిన నేపథ్యంలో.. తిరిగి అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు స్పిన్‌కు అనుకూలమైన చెపాక్ పిచ్‌పై చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో స్థానిక ఆల్‌రౌండర్, చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడవచ్చు. అదే విధంగా రింకూ సింగ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్ స్థానంలో సంజూ.. వాషీ స్థానంలో కుల్దీప్.. రింకూ స్థానంలో అక్షర్ పటేల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.సఫారీల చేతిలో భారీ ఓటమితోకాగా గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్‌లోనే భారీ ఓటమిని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ చేరాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక భారీ విజయాలు సాధించడంతో పాటు.. విండీస్- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌కు భారత తుదిజట్టు (అంచనా)ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. చదవండి: పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్ -
సౌతాఫ్రికా, విండీస్ ముందున్నాయి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్ సేన చేతులెత్తేసింది.అతిపెద్ద పరాజయంసూపర్-8 గ్రూప్-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్‌లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.అందనంత ఎత్తులో విండీస్మరోవైపు.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్ (+5.350)నెట్‌రన్‌రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్‌గా ఉంది.మరోవైపు భారత్ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో.. అదే విధంగా ఆదివారం విండీస్‌తో మ్యాచ్‌లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది. గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనాఅయితే, జింబాబ్వేతో మ్యాచ్‌లో నెట్‌రన్‌రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్‌లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్‌రన్‌రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.ఏదేమైనా ఇప్పుడు నెట్‌రన్‌రేటు పరంగా వెస్టిండీస్‌ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్లో జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్‌రన్‌రేటు గురించి ఆలోచించాలి.ఇంత చెత్తగా ఆడతారా?సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మూడు విభాగాల్లో భారత్ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికా నెట్‌రన్‌రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు! -
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్‌కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్‌కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్‌డౌన్‌లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్‌కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్‌ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్‌డౌన్‌లో ఆడించి.. తిలక్‌ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ -
అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం తర్వాత టీమిండియా జింబాబ్వేతో తలపడేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుదిజట్టు కూర్పు గురించి ముఖ్యంగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ల గురించి కొటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.సంజూకు మొండిచేయికాగా ఇషాన్ కిషన్ రాకతో భారత టీ20 జట్టులో ఓపెనర్‌గా సంజూ శాంసన్ స్థానం గల్లైంతైన విషయం తెలిసిందే. లీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ- ఇషాన్ జోడీగా బరిలో దిగారు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు మాత్రం అభిషేక్ గైర్హాజరీలో సంజూ ఓపెనర్‌గా వచ్చాడు.తిలక్ వర్మ ఆట తీరుపై విమర్శలుమరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. అతడి స్ట్రైక్‌రేటు కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో తిలక్‌ను తప్పించి సంజూను మూడో స్థానంలో ఆడించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.తిలక్ గురించి బాధ లేదుఈ పరిణామాల నేపథ్యంలో సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి మాకు ఎలాంటి సమస్య లేదు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు చక్కగా ఆడాడు. రెండు, మూడు బౌండరీలు బాదితే అంతా అదే సర్దుకుంటుంది. అతడు బంతులు వృథా చేస్తున్నాడన్న అంశంలో మాకు ఎలాంటి ఆందోళనా లేదు.అభిషేక్ శర్మ గురించి కూడా మేము ఆందోళన చెందడం లేదు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి గురించి కూడా పెద్దగా ఆందోళన లేదు. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే మేము ప్రస్తుతం దృష్టి సారించాము.సంజూ రావొచ్చుప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను అర్థం చేసుకుని.. సరైన జవాబు ఇచ్చే విధంగా మా బ్యాటర్లు సంసిద్ధం అవుతున్నారు. ప్రణాళిక, సన్నాహకాలపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అతడి (సంజూ) గురించి చర్చ నడుస్తోంది. అయితే, మేము ముందుగానే తుదిజట్టును నిర్ణయించబోము. అతడిని ఆడించే ఆలోచన లేదని మాత్రం చెప్పము’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడిన రింకూ సింగ్ బుధవారం సాయంత్రం టీమ్‌తో కలుస్తాడని తెలిపాడు.సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతోఇదిలా ఉంటే.. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై గెలుపొంది అజేయంగా నిలిచింది టీమిండియా. అయితే, సెమీస్ దిశగా అడుగులు వేసే క్రమంలో ఊహించని రీతిలో సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఘోరంగా ఓడిపోయింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌లపై నెగ్గితేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: T20 WC 2026: పాక్ జట్టులో కలకలం -
T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో టీమిండియా కీలక ఆటగాడు రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ అందుతుంది. రింకూ నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్వస్థలమైన నోయిడాకు వెళ్లాడు. దీంతో అతను రేపటి (ఫిబ్రవరి 26) జింబాబ్వే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దత నెలకొని ఉండింది.అయితే, ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం.. రింకూ రేపటి మ్యాచ్ కోసం చెన్నైకి (వేదిక) బయల్దేరినట్లు తెలుస్తుంది. మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉంటాడని సమాచారం. సెమీస్ నేపథ్యంలో రేపటి జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కావడంతో మేనేజ్మెంట్ రింకూ సేవలను కోల్పోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఇందులో భాగంగానే రింకూ ప్రయాణానికి (నోయిడా నుంచి చెన్నైకి) ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. రింకూ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లో అత్యంత కీలక ఆటగాడు. చివరి ఓవర్లలో అతను వేగంగా చేసే పరుగులు మెగా టోర్నీలో టీమిండియా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రింకూ లేని పక్షంలో మరో లోయర్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబేపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టే టీమిండియా మేనేజ్మెంట్ రింకూను హుటాహుటిన చెన్నైకి పిలిపించినట్లు తెలుస్తుంది.కాగా, రింకూ తండ్రి ఏడాదికాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ పరిస్థితి కారణంగా రింకూ హుటాహుటిన నోయిడాకు వెళ్లాడు.సంజూ శాంసన్ పరిస్థితి ఏంటి..?రింకూ జట్టును వీడిన అనంతరం జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావించింది. అయితే రింకూ అందుబాటులోకి రావడంతో సంజూకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తుంది. తొలుత అభిషేక్‌తో పాటు సంజూను ఓపెనర్‌గా పంపి, ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలని మేనేజ్మెంట్ భావించిదట. అయితే రింకూ రీఎంట్రీతో సమీకరణలు మారేలా ఉన్నాయి. రింకూ జట్టులో చేరినా, సంజూకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం తిలక్ వర్మపై వేటు పడవచ్చు. ముందుగా అనుకున్నట్లు అభిషేక్-సంజూ ఓపెనర్లుగా ఇషాన్ కిషన్ వన్‌డౌన్‌లో బరిలోకి దిగవచ్చు. అలాగే సౌతాఫ్రికా మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన వాషింగ్టన్ సుందర్‌ను కూడా పక్కకు పెట్టి, అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.తుది జట్టు (అంచనా)..అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
తండ్రికి సీరియస్.. జట్టును వీడిన భారత పవర్ హిట్టర్
టీ20 ప్రపంచకప్-2026లో జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బయలు దేరి వెళ్లిపోయాడు.దీంతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు రింకూ దూరమయ్యాడు. అతడు ఎప్పుడు తిరిగి వస్తాడన్నది కూడా స్పష్టత లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్‌పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చినప్పటికి.. డకౌటై పెవిలియన్‌కు చేరాడు.అయితే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాల్వడంతో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఇటువంటి మ్యాచ్‌కు ముందు రింకూ జట్టును వీడడం గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి. -
మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్ ఆగ్రహం
పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్‌కప్-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్-8 కీలక మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఊహించని షాక్ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.కెప్టెన్, హెడ్‌కోచ్ ఏం చేస్తున్నారు?ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు అటాక్ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్, హెడ్‌కోచ్ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.అహంకారం వద్దునెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం -
'అతడొక మ్యాచ్ విన్నర్.. తిరిగి జట్టులోకి తీసుకోండి'
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే.ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సూచించాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని పార్ధివ్ అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ స్ధానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్‌ను ఎలా పక్కన పెట్టారని మాజీలు మండిపడ్డాడు. ఈ కీలక మ్యాచ్‌లో సుందర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా విఫలమయ్యాడు. దీంతో జింబాబ్వేతో మ్యాచ్‌కు పటేల్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది."అక్షర్ పటేల్‌ను తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లో చూడాలనుకుంటున్నాను. అక్షర్ లాంటి ఆల్‌రౌండర్ జట్టులో ఉండడం చాలా ముఖ్యం. అతడు కేవల బంతితోనే కాకుండా క్లిష్ట సమయాల్లో బ్యాట్‌తో కూడా రాణించగలడు. మ్యాచ్-అప్ల పరంగా కూడా అతడు మంచి ఎంపికే" అని స్టార్ స్పోర్ట్స్ షో 'ఫాలో ది బ్లూస్'లో పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. అదేవిధంగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి సంజూ శాంసన్ కూడా వచ్చే అవకాశముందని పార్ధివ్ తెలిపాడు. సంజూ లాంటి ప్లేయర్లు ఆఫ్ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటారని పటేల్ చెప్పుకొచ్చాడు.చదవండి: మా వాళ్లు అద్భుతం.. విండీస్ ప్రమాదకర జట్టు: మార్క్రమ్ -
జింబాబ్వేతో జర జాగ్రత్త
జింబాబ్వే.. రెండేళ్ల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు కనీసం అర్హత కూడా సాధించలేదు. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో ఉగండా చేతిలో ఓటమి పాలై ఘోర పరాభావన్ని మూటకట్టుకుంది. కానీ సదరు అఫ్రికా జట్టు ఎక్కడా నిరాశ చెందలేదు. ఎలాగైనా తదుపరి ప్రపంచకప్‌లో ఆడాలన్న లక్ష్యంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. అందుకు తగ్గట్టేగానే టీ20 ప్రపంచకప్-2026కు జింబాబ్వే క్వాలిఫై అయింది.అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగిన జింబాబ్వే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి వరల్డ్ క్లాస్ జట్లను చిత్తు చేసి సూపర్-8కు అర్హత సాధించింది. సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే అద్భుతాలు చేస్తోంది. గ్రూపు-బిలో టేబుల్ టాపర్‌గా సికిందర్ సేన నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక గడ్డపై సత్తాచాటిన జింబాబ్వే.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సన్నద్దం కానుంది.జింబాబ్వేతో జర జాగ్రత్త..జింబాబ్వే జట్టు గ్రూపు-1లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు ఉంది. సికిందర్ సేన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఫిబ్రవరి 3న వెస్టిండీస్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 6న భారత్‌ను జింబాబ్వే ఢీకొట్టనుంది. అయితే జింబాబ్వేను భారత్ ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. జింబాబ్వే ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ప్రతీ మ్యాచ్‌లోనూ తమ జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. బెన్నెట్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేసిన మొత్తం 457 పరుగులలో బెన్నెట్ దాదాపు 39% సాధించాడు. అదేవిధంగా మిడిలార్డర్లో కెప్టెన్ సికిందర్ రజా కూడా అదరగొడుతున్నారు. శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో రజా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. ముజరబానీ ఇప్పటివరకు 11 వికెట్లు పడగొట్టి టాప్ ఫామ్‌లో ఉన్నాడు. గ్రూపు స్టేజిలో అసాధరణ ప్రదర్శన కనబరిచిన జింబాబ్వే.. ఇప్పుడు సూపర్-8లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి. -
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. ఇరవై జట్లతో మొదలైన ఈ ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియా మినహా అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్-8కు చేరుకున్నాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన టీ20 ప్రపంచకప్ పదో ఎడిషన్ లీగ్ దశ గురువారంతో ముగియనుంది.ఎవరు ఎవరితో ఢీ?అయితే, అంతకంటే ముందే అంటే బుధవారమే పాకిస్తాన్ నమీబియాపై గెలవడంతో సూపర్-8 బెర్తులు ఖరారైపోయాయి. గ్రూప్ దశలో నామమాత్రపు మ్యాచ్‌లలో వెస్టిండీస్- ఇటలీ.. శ్రీలంక- జింబాబ్వే.. అఫ్గనిస్తాన్- కెనడా గురువారం తలపడతాయి. మరి సూపర్-8 దశలో ఏ జట్టుకు ఏ జట్టుతో పోటీ? షెడ్యూల్, వేదికలు.. తదితర వివరాలు తెలుసుకుందామా?8️⃣ TEAMS 4️⃣ SEMI-FINAL SPOTSThe race intensifies and the stakes are higher than ever as we enter the Super 8 phase! 🤩 🔥Which four teams will move one step closer to their World Cup dream? Drop your predictions 👇ICC Men's #T20WorldCup SUPER 8 👉 Starts SAT, 21st FEB pic.twitter.com/wsgnCWEXmx— Star Sports (@StarSportsIndia) February 19, 2026 -
T20 WC 2026: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా వైదొలగడంతో సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులు ఖరారయ్యారు. సూపర్-8 గ్రూప్-1లో భారత్‌తో పాటు జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. గ్రూప్-1 మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయి.భారత్ తమ తొలి సూపర్-8 మ్యాచ్‌ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.భారత రెండో సూపర్-8 మ్యాచ్ ఫిబ్రవరి 26న జరుగనుంది. చెన్నైలోని చిదంబరంలో స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లో భారత్ జింబాబ్వేను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.భారత్ తమ మూడో సూపర్-8 మ్యాచ్‌ను మార్చి 1న ఆడుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ వెస్టిండీస్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకే ప్రారంభమవుతుంది.గ్రూప్-1లో మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..-ఫిబ్రవరి 23- జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 26- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3 గంటలకు)-మార్చి 1- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3 గంటలకు)మరోవైపు సూపర్-8 గ్రూప్-2 బెర్త్‌ల్లో ప్రస్తుతానికి మూడు ఖరారయ్యాయి. రేపు (ఫిబ్రవరి 18) జరుగబోయే మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తే.. పాక్ నాలుగో బెర్త్ దక్కించుకుంటుంది. సూపర్-8 గ్రూప్-2లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్-2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. గ్రూప్-2కు సంబంధించి కూడా పలు సూపర్-8 మ్యాచ్‌లు ఖరారయ్యాయి.-ఫిబ్రవరి 22న ఇంగ్లండ్-శ్రీలంక (పల్లెకెలె, మధ్యాహ్నం 3 గంటలకు)-ఫిబ్రవరి 25న న్యూజిలాండ్-శ్రీలంక (కొలొంబో, రాత్రి 7 గంటలకు)-ఫిబ్రవరి 27న ఇంగ్లండ్-న్యూజిలాండ్ (కొలొంబో, రాత్రి 7 గంటలకు)గ్రూప్-1, గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు మార్చి 8న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్, ఫైనల్‌కు వేదికలు ఇంకా ఖరారు కాలేదు. -
World Cup 2026: టీమిండియా ఘన విజయం
అండర్ 19 ప్రపంచకప్‌లో యువ భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ సిక్స్‌కు చేరిన యంగ్ ఇండియా.. ఈ దశలోనూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.బులవాయో వేదికగా ఇవాళ (జనవరి 27) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 204 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఒడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విహాన్ మల్హోత్రా (109 నాటౌట్) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది.చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా.. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు. ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది.మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆదిలోనే చేతులెత్తేసింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో 37.4 ఓవర్లలో 148 పరుగులకే చాపచుట్టేసింది. లీరాయ్ (62), కియాన్ బ్లిగ్నాట్ (37), టటెండ చిముగోరో (29) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఉధవ్ మోహన్, ఆయుశ్ మాత్రే తలో 3 వికెట్లు పడగొట్టగా.. అంబ్రిష్ 2, హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ చెరో వికెట్ తీశారు. సూపర్ సిక్స్‌లో భారత్ నెక్స్ట్ టార్గెట్ దాయాది పాకిస్తాన్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా జరుగనుంది. -
World Cup 2026: టీమిండియా భారీ స్కోర్
జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ (352-8) చేసింది.మిడిలార్డర్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్‌కు సహకరించాడు.ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.కాగా, గ్రూప్ దశలో భారత్ వరుసగా యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది. సూపర్ సిక్స్‌లో భాగంగానే భారత్ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
కపిల్ డెవిల్ ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం
వన్డేల్లో సెంచరీ చేస్తేనే గొప్ప అనుకునే రోజులవి. అలాంటిది ఓ భారత బ్యాటర్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఏకంగా 175 పరుగులు చేశాడు. ఈ స్కోర్ చేసింది ఏదో ఆషామాషి మ్యాచ్‌లో కాదు. ప్రపంచకప్‌లో. అది కూడా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో. తదుపరి దశకు చేరాలంటే ఆ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.వివరాల్లోకి వెళితే.. అది జూన్ 18, 1983. ప్రుడెన్షియిల్ వరల్డ్‌కప్‌లో భారత్, జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న రోజు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 17 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగాడు నాటి భారత కెప్టెన్ కపిల్ దేవ్. టాపార్డర్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరినా కపిల్ ఏమాత్రం భయం లేకుండా ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోజర్ బిన్నీ సహకారంతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 22 పరుగులు చేసిన అనంతరం రోజర్ బిన్నీ ఔట్ కావడంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈలోపు రవిశాస్త్రి (1) కూడా ఔటయ్యాడు. ఓ పక్క ఇన్నింగ్స్ పేకమేడలా కూలుతున్నా కపిల్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చివరి వరుస బ్యాటర్లు మదన్ లాల్ (17), సయ్యద్ కిర్మాణి (24 నాటౌట్) సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేశాక కపిల్ మరింత రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా వాయించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. నిర్ణీత ఓవర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటే ఆ రోజు కపిల్ డబుల్ సెంచరీ చేసుండేవాడు. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్ 60 ఓవర్ల పాటు సాగేది. నిర్ణీత 60 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అప్పటికి వన్డేల్లో అదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. చాలా రోజుల పాటు ఈ రికార్డు కపిల్ పేరిటే కొనసాగింది.అనంతరం 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 57 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటై 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మదన్ లాల్ 3, రోజర్ బిన్నీ 2, కపిల్, మొహిందర్ అమర్నాథ్, బల్విందర్ సంధు తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెవిన్ కర్రన్ (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో వారం రోజుల తర్వాత భారత్ తమ తొలి వన్డే ప్రపంచకప్ సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ కవరేజ్ అప్పట్లో జరగలేదు కానీ, జరిగి ఉండింటే తరతరాలకు గుర్తుండిపోయేది. -
అరుదైన ఘనత సాధించిన వాషింగ్టన్ సుందర్.. తొలి భారత ప్లేయర్‌గా రికార్డు
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తాజాగా ముగిసిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే రెండు సార్లు బ్యాటింగ్‌కు దిగి 28 పరుగులు చేశాడు. మూడో టీ20లో సుందర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.సిరీస్ ఆధ్యాంతం బంతితో అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు సుందర్‌ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వరించింది. ఈ అవార్డు లభించడం సుందర్‌కు ఇది రెండో సారి. కెరీర్లో రెండో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించిన అనంతరం సుందర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.సుందర్ టీ20ల్లో ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును.. అదీ ఇదే జింబాబ్వే సిరీస్‌లో గెలుచుకున్నాడు. ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు ముందు సుందర్ ఓసారి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల కంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఎక్కువగా గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సుందర్ నాలుగో స్థానంలో నిలిచాడు. సుందర్‌కు ముందు ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు.రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుటిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)- 3 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 2 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఅలెక్స్ కుసక్ (ఐర్లాండ్)- 2 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు, 1 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఇదేందయ్యా ఇది.. టాస్ ఇలా కూడా వేయవచ్చా? వీడియో
హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును గిల్ సేన చిత్తు చేసింది. కాగా ఆఖరి టీ20 టాస్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కే ముందుకే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత నాలుగు గేమ్‌లలో టాస్ ఓడిన రజా ఈసారి తన ఆదృష్టాన్ని మార్చుకోనేందుకు కాస్త విన్నూత్నంగా ప్రయత్నించాడు. అతడు టాస్ కాయిన్‌ను గాల్లోకి జంప్ చేస్తూ స్పిన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వలు పూయిస్తోంది. టాస్ ఇలా కూడా వేయవచ్చా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్ pic.twitter.com/snhOXumMx4— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) July 14, 2024 -
వారంతా ఒక అద్బుతం.. దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు: గిల్
జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 4-1 తేడాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది.168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 125 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివమ్ దూబే రెండు, అభిషేక్, సుందర్, దేశ్‌పాండే తలా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(58) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జింబాబ్వే బౌలర్లలో ముజ్బారనీ రెండు, రజా, నగర్వా, మవుటా తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంపై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు."ఇదొక అద్భుతమైన సిరీస్. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా బాయ్స్ దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు. ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విదేశీ పరిస్థితుల్లో ఆడిన అనుభవం లేదు.అయినప్పటకి వారు ఆడిన విధానం నిజంగా అద్భుతం. ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక శ్రీలంక పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంతకుముందు ఆసియాకప్ కోసం శ్రీలంకకు వెళ్లాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: 4–1తో ముగించారు -
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4), శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు, 4-0-25-2) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ఈ సిరీస్‌లో నాలుగు టీ20లు గెలవడంతో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో నాలుగు టీ20లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శుభ్‌మన్.. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో ఈ భారీ రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కోల్పోయిన గిల్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జట్టును విజయపథాన నడిపించాడు.భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. రోహిత్ శర్మ (50), ధోని (42), విరాట్ కోహ్లి (32), హార్దిక్ పాండ్యా (10), సూర్యకుమార్ యాదవ్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
రాణించిన శాంసన్, ముకేశ్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే (5 ఓవర్లలో 40/3) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి దోహదపడ్డాడు. ఆఖర్లో శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 12, శుభ్‌మన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14, రియాన్ పరాగ్ 22 పరుగులు చేసి ఔట్ కాగా.. రింకూ సింగ్ (11), వాషింగ్టన్ సుందర్ (1) అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన ముకేశ్168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆ జట్టు క్రమ అంతరాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (34) టాప్ స్కోరర్ కాగా.. మరుమణి (27), బ్రియాన్ బెన్నెట్ (10), , ఫరక్ అక్రమ్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. భారత బౌలర్లలో ముకేశ్‌తో పాటు శివమ్ దూబే (4-0-25-2), తుషార్ దేశ్‌పాండే (3-0-26-1), వాషింగ్టన్ సుందర్ (2-0-7-1), అభిషేక్ శర్మ (3-0-20-1) వికెట్లు పడగొట్టారు. -
110 మీటర్ల భారీ సిక్సర్ బాదిన సంజూ శాంసన్
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సంజూ శాంసన్ 110 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో సంజూ కొట్టిన సిక్సర్ స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Sanju Samson Smashed 110M SIX 🤯 #ZIMvIND #CricketTwitter pic.twitter.com/fQLHkjZvaX— Mano (@manoj_tweezz) July 14, 2024ఈ మ్యాచ్‌లో సంజూ ఈ సిక్సర్‌తో పాటు మరో మూడు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న సంజూ.. నాలుగు సిక్సర్లు, బౌండరీ సాయంతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో సంజూ మినహా భారత బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND Vs ZIM: చరిత్ర సృష్టించిన యశస్వి.. ఒక్క బంతి 13 పరుగులు
జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే రెండు సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికందర్ బౌలింగ్‌లో తొలి బంతి నో బాల్ కాగా.. ఆ బంతిని యశస్వి సిక్సర్‌గా మలిచాడు. ఆతర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్‌లో పంపాడు. నో బాల్‌తో లభించే అదనపు పరుగుతో కలుపుకుని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలా తొలి బంతికే 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు.Yashasvi Jaiswal became the first batter in history to score 13 runs on the 1st ball of a T20i. 🌟pic.twitter.com/98j63xmtGu— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి మాంచి జోష్ మీదుండిన యశస్వి.. అదే ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రజా సంధించిన ఇన్ స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన యశస్వి అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. యశస్వి ఔటైన అనంతరం అభిషేక్ శర్మ (14), శుభ్‌మన్ గిల్ (13) కూడా భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ బాట పట్టారు. After conceding two sixes, Sikandar Raza took Yashasvi Jaiswal's wicket, and the celebration says it all.📸: SonyLIV pic.twitter.com/XpNkG19AhM— CricTracker (@Cricketracker) July 14, 2024వీరి తర్వాత క్రీజ్‌లో వచ్చిన సంజూ శాంసన్ (31 బంతుల్లో 38; 3 సిక్సర్లు), రియాన్ పరాగ్ (18 బంతుల్లో 20; సిక్స్) కుదురుగా ఆడుతున్నారు. 13 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 101/3గా ఉంది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా, నగరవ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ స్థానాల్లో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM 5th T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ స్థానంలో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్ -
అభిషేక్ శర్మ ఆల్‌టైమ్ రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సత్తాచాటుతున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటకి ఆ తర్వాత మ్యాచ్‌లోనే విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.ఆ తర్వాత మూడో టీ20లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన అభిషేక్‌కు.. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బ్యాటింగ్‌లో ఛాన్స్ రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అభిషేక్ కేవలం 20 పరుగులు మాత్రమే ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓ టీ20 సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అభిషేక్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. కాగా, ఓ సిరీస్‌లో సెంచరీతో పాటు వికెట్ ఘనతను భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో లాల్ అమర్నాథ్ (1933), వన్డేల్లో కపిల్ దేవ్ (1983) తొలిసారి సాధించారు. ఇక నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన గిల్-జైశ్వాల్ జోడీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ ఊదిపడేశారు.జింబాబ్వే బౌలర్లను చొతక్కొట్టారు. యశస్వీ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేయగా.. గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 156 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పిన గిల్-జైశ్వాల్ జోడీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.టీ20 క్రికెట్లో ఛేజింగ్‌లో భారత తరపున రెండు సార్లు 150 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తొలి జోడీగా గిల్-జైశ్వాల్ నిలిచారు. వీరిద్దరూ టీ20ల్లో 150 పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇదే రెండో సారి.ఇంతకుముందు 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో జైస్వాల్, గిల్ ఇద్దరూ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రెండు భాగస్వామ్యాలు కూడా ఛేజింగ్‌లో నెలకొల్పినివే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్‌ను గిల్, జైశ్వాల్ తమ ఖాతాలో వేసుకున్నారు.టీ20 చరిత్రలో భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..165 - రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శ్రీలంక, ఇండోర్, 2017165 - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ వెస్టిండీస్, లాడర్‌హిల్, 2023160 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ ఐర్లాండ్, డబ్లిన్, 2018158 - రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధావన్ వర్సెస్ న్యూజిలాండ్, ఢిల్లీ, 2017156* - యశస్వి జైస్వాల్ అండ్ శుబ్‌మన్ గిల్ వర్సెస్ జింబాబ్వే, హరారే, 2024 -
సంతోషం.. కానీ ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది: గిల్
జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు సత్తా చాటింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత ఆడిన తొలి టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లోనే టీమిండియాకు ఘన విజయం అందించింది.టీ20 ప్రపంచకప్-2024 తర్వాత సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని యువ ఆటగాళ్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. తొలి టీ20లో పరాజయం పాలైనా.. పడిలేచిన కెరటంలా హ్యాట్రిక్ విజయాలతో జోరు ప్రదర్శించారు.హరారే వేదికగా శనివారం నాటి నాలుగో టీ20లో సమష్టిగా రాణించి జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు. ఈ క్రమంలో కెప్టెన్‌గా తొలిసారి భారత జట్టు పగ్గాలు చేపట్టిన శుబ్‌మన్ గిల్ ఖాతాలో అరంగేట్రంలోనే సిరీస్ విజయం చేరింది.ఈ నేపథ్యంలో గిల్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అనుభూతి ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ‘‘మొదటి టీ20లో మేము లక్ష్య ఛేదనలో విఫలమయ్యాం.అయితే, ఈరోజు విజయవంతంగా టార్గెట్ పూర్తి చేశాం. ఈ ఫీలింగ్ అద్భుతంగా ఉంది. అయినా.. ఇప్పుడే ఇంకా పని పూర్తి కాలేదు. ఇంకొక మ్యాచ్ మిగిలే ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక ప్రస్తుతం ఆడుతున్న జట్టు గొప్పగా ఉందన్న గిల్... తదుపరి మ్యాచ్‌లో మార్పులు చేర్పుల గురించి కోచ్‌తో ఇంకా చర్చించలేదని తెలిపాడు. కాగా టీమిండియా- జింబాబ్వే మధ్య నామమాత్రపు ఐదో టీ20 హరారే వేదికగా ఆదివారం జరుగనుంది.టీమిండియా వర్సెస్ జింబాబ్వే నాలుగో టీ20 స్కోర్లు:👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్👉టాస్: టీమిండియా.. బౌలింగ్👉జింబాబ్వే స్కోరు: 152/7 (20)👉టీమిండియా స్కోరు: 156/0 (15.2)👉ఫలితం: పది వికెట్ల తేడాతో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ సొంతం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 పరుగులు నాటౌట్, (13 ఫోర్లు, 2 సిక్సర్లు)).చదవండి: Ind vs Zim 4th T20: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్ -
Ind vs Zim: జైస్వాల్ విధ్వంసం.. గిల్ సూపర్ ఇన్నింగ్స్
జింబాబ్వేతో నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టుకు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించింది.రాణించినా రజా ఈ క్రమంలో శనివారం నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హరారే వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు రాణించారు. జింబాబ్వేను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.ఆతిథ్య జట్టు ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.అరంగేట్ర బౌలర్‌కు ఒక వికెట్ టీమిండియా బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ పడగొట్టగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీశారు.ఆకాశమే హద్దుగా జైస్వాల్ఇక జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ అజేయ అద్బుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జైస్వాల్ 93 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు) తో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు (ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లు) సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తొలి సిరీస్‌లోనే ట్రోఫీ గెలవడం విశేషం.చదవండి: IND Vs ZIM 4th T20I: సికందర్ రజా వరల్డ్ రికార్డు -
Ind vs Zim: సికందర్ రజా వరల్డ్ రికార్డు
టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రజా విఫలమయ్యాడు.అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా వరల్డ్ రికార్డుఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు3. విరన్‌దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లుమెరుగ్గా రాణించిటీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. -
టీమిండియా ఘన విజయం.. సిరీస్ మనదే
Zimbabwe vs India, 4th T20I Updates: జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా నాలుగో టీ20 ఆడుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో శుబ్‌మన్ గిల్ సేన ఆధిక్యంలో ఉంది. శనివారం టీ20లో టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ విజృంభించింది. ఓపెర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దంచికొట్టారు. జైస్వాల్ 93 పరుగులతో దుమ్మలేపగా.. గిల్ 58 పరుగులు సాధించాడు.వీరిద్దరి విజృంభణ కారణంగా 15.2 ఓవర్లలోనే భారత్ టార్గెట్‌ను పూర్తి చేసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్( వికెట్ కీపర్), రింకూ సింగ్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.జింబాబ్వే తుదిజట్టు: వెస్లీ మెదెవెరె, తాడివానాషే మరుమానీ, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చటారా.అప్డేట్స్14.1: గిల్ అర్ధ శతకం12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 118/0 (12)జింబాబ్వే బౌలింగ్‌ను చిత్తు చేస్తూ టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 12వ ఓవర్ముగిసే సరికి జైస్వాల్ 75, గిల్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.పది ఓవర్లలోనే టీమిండియా స్కోరు: 106-0శుబ్‌మన్ గిల్ 37, యశస్వి జైస్వాల్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు.6.3: 29 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకు న్న యశస్వి జైస్వాల్పవర్ ప్లేలో యశస్వి పరుగుల వరదఆరో ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ 47(26), శుబ్‌మన్ గిల్ 13 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు: 61/0 (6)దంచికొడుతున్న యశస్విజింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఘనంగా తమ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ ఆది నుంచే జింబాబ్వే బౌలర్లపై అటాక్ చేస్తున్నారు.మూడు ఓవర్లు ముగిసే సరికి యశస్వి 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించగా.. గిల్ ఐదు బంతుల్లో 11 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. టీమిండియా టార్గెట్ 153ఆతిథ్య జట్టు ఓపెనర్లు వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) సహా కెప్టెన్ సికందర్ రజా(46) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్‌పాండే, శివం దూబే ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆఖరి ఓవర్లో రెండు వికెట్లుఆఖరి ఓవర్లో టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి మేయర్స్(12), ఆఖరి బంతికి మందాడే(7)ను పెవిలియన్‌కు పంపాడు.18.3: రజా హాఫ్ సెంచరీ మిస్ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరం(28 బంతుల్లో 46) నిలిచిపోయాడు. రజా రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది.జింబాబ్వే స్కోరు: 147/5 (19) పదిహేడు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే స్కోరు: 129/4రజా 42, మేయర్స్ తొమ్మిది పరుగులతో ఆడుతున్నారు14.4: నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వేబ్యాటర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్‌లో సికందర్ రజా పరుగుకు యత్నించగా.. మరో ఎండ్‌లో ఉన్న క్యాంప్‌బెల్ వేగంగా కదలలేకపోయాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న బిష్ణోయి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసరగా.. బాల్ వికెట్లను గిరాటేసింది. ఫలితంగా క్యాంప్‌బెల్(3) రనౌట్ అయ్యాడు. 13.4: మూడో వికెట్ డౌన్వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బ్రియాన్ బెనెట్ యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.జొనాథన్ క్యాంప్‌బెల్ క్రీజులోకి వచ్చాడు. సికందర్‌రజా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే స్కోరు: 93/3 (14).9.6: రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వేపేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే బౌలింగ్‌లో జింబాబ్వే ఓపెనర్ వెస్లీ(25) పెవిలియన్ చేరాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపగా.. రింకూ సింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో వెస్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా 0, బ్రియాన్ బెనెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో జింబాబ్వే స్కోరు: 67-2.7.1: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకు న్న జింబాబ్వేవాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమానీ రెండు పరుగులు తీయగా.. జింబాబ్వే యాభై పరుగుల మార్కు అందుకుంది.పవర్ ప్లేలో జింబాబ్వే స్కోరు: 44/0ఆరు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 19, మరుమానీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. తన పేస్ పదనుతో జింబాబ్వేకు తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.ఇక రెండో ఓవర్ వేసిన అరంగట్రే పేసర్ తుషార్ దేశ్‌పాండే 11 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 15 పరుగులు చేసింది. ఓపెనర్లు వెస్లీ 12, మరుమానీ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచిన భారత జట్టుశనివారం నాటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. హరారే వేదికగా జరుగనున్న ఈ టీ20లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.తుషార్ దేశ్‌పాండే అరంగేట్రంఈ మ్యాచ్ ద్వారా పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అరంగేట్రం చేస్తున్నట్లు గిల్ తెలిపాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతడిని తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.మరోవైపు.. తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపాడు. వెల్లింగ్టన్ మసకజ్ద స్థానంలో ఫరాజ్ అక్రం జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. -
జింబాబ్వేతో నాలుగో టీ20.. ధోని శిష్యుడి ఎంట్రీ!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. శనివారం హరారే వేదికగా జరగనున్న నాలుగో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.తొలి టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన గిల్ బ్రిగేడ్.. తర్వాత రెండు టీ20ల్లో మాత్రం ప్రత్యర్ధిని చిత్తు చేసింది. అదే జోరును నాలుగో టీ20లో కొనసాగించాలని యంగ్ టీమిండియా భావిస్తోంది.ధోని శిష్యుడి ఎంట్రీ?అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు పేసర్లు ఖాలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఖాలీల్ స్ధానంలో ముంబై స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే అంతర్జాతీయ అరగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ధోని శిష్యుడిగా పేరొందిన దేశ్‌పాండేకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు, ఐపీఎల్లో సీఎస్కేకు గత రెండు సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2024లో 17 వికెట్లు పడగొట్టిన తుషార్.. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి చోటు ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అదేవిధంగా అవేష్ ఖాన్ స్ధానంలో పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.జింబాబ్వేతో నాలుగో టీ20కు భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్. -
జింబాబ్వేతో మూడో టీ20.. గిల్‌పై అభిమానుల ఆగ్రహం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు అర్దసెంచరీతో (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. గిల్ చాన్నాళ్ల తర్వాత ఈ మ్యాచ్‌తోనే ఫామ్‌లోకి వచ్చినా ఓ విషయంలో మాత్రం అభిమానుల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు.విషయం ఏంటంటే.. శుభ్‌మన్ గిల్.. మూడో టీ20లో తాను ఓపెనర్‌గా బరిలోకి దిగడం కోసం రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి సెంచరీ చేసిన అభిషేక్ శర్మను డిమోట్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ స్థానచలనం కలగడంతో ఈ మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అభిమానులకు గిల్‌పై ఆగ్రహం తెప్పించింది. గిల్ తన స్వార్దం కోసం జట్టు ప్రయోజనాలను గాలికి వదిలేయడంతో పాటు అభిషేక్ లయను దెబ్బ తీశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ విషయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం (అభిషేక్ స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటాడని చెప్పాడు) చేసినా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గిల్ మరో కోహ్లిలా (వ్యక్తిగత రికార్డుల విషయంలో) ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి యశస్వి జైస్వాల్ రాకతో టీమిండియాకు కొత్త చిక్కే (ఓపెనర్ల విషయంలో) వచ్చి పడింది. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన యశస్వి లేటుగా (మూడో టీ20) జట్టుతో జతకట్టిన విషయం తెలిసిందే.కాగా, బ్యాటింగ్‌లో గిల్, రుతురాజ్ (49).. బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-16-1) సత్తా చాటడంతో మూడో టీ20లో టీమిండియా జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో పోటీపడలేకపోయిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. -
‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్ సుందర్ రియాక్షన్ ఇదే
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 27 పరుగులు చేయడంతో పాటు.. కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.ఆ మ్యాచ్ల్ భారత్ ఓడినా వాషీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లో టాపార్డర్ అదరగొట్టడంతో సుందర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 234 భారీ స్కోరు నెలకొల్పగా.. జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.ఇందులో వాషింగ్టన్ సుందర్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జొనాథన్ కాంప్‌బెల్ వికెట్ దక్కించుకోవడంతో పాటు లోయర్ ఆర్డర్లో నిలదొక్కుకున్న ల్యూక్ జోంగ్వే ఇచ్చిన క్యాచ్ పట్టాడు.ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కీలకమైన మూడో టీ20లోనూ 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇందులో వాషింగ్టన్ సుందర్‌దే కీలక పాత్ర.హరారే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టీమిండియా విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది.వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్(3/15)తో రాణించి టీమిండియాను గెలిపించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో విజయానంతరం వాషింగ్టన్ సుందర్ మాత్రం మాట్లాడుతూ.. దేశానికి ఆడటం తనకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ప్రణాళికలను పక్కా అమలు చేసి గెలుపొందామని హర్షం వ్యక్తం చేశాడు.ఈ సందర్భంగా.. టీ20లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వాషీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.ప్రతీ మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాను. ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను’’ అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేయడంపై మాత్ర దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు.కాగా చెన్నైకి చెందిన వాషింగ్టన్ సుందర్ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన వాషీ.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 4 టెస్టులు, 19వన్డేలు, 46 టీ20లు ఆడి 265, 265, 134 పరుగులు చేశాడు. అదే విధంగా ఆయా ఫార్మాట్లలో ఆరు, 18, 40 వికెట్లు తీశాడు వాషింగ్టన్ సుందర్. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. -
వారెవ్వా.. సూపర్ క్యాచ్! పక్షిలా ఎగురుతూ (వీడియో)
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌ను బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన పేసర్ అవేష్ ఖాన్.. తొలి బంతిని బెన్నట్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధిచాడు. ఈ క్రమంలో బెన్నట్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా పవర్ ఫుల్ కట్‌షాట్ ఆడాడు.అయితే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న బిష్ణోయ్.. సూపర్‌మేన్‌లా గాల్లోకి జంప్ చేస్తూ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అందరూ బిష్ణోయ్ వద్దకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్యాచ్ చూసిన బ్యాటర్ బెన్నట్ కూడా బిత్తరపోయాడు. చేసేదేమి లేక బెన్నట్(4) పరుగులతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జూలై 13న జరగనుంది. It's a bird ❌It's a plane ❌𝙄𝙩'𝙨 𝙍𝙖𝙫𝙞 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞 ✅Watch #ZIMvIND LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/yj1zvijSJu— Sony LIV (@SonyLIV) July 10, 2024 -
ఇది మాకు శుభసూచకం.. చాలా సంతోషంగా ఉంది: భారత కెప్టెన్
జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1ఆధిక్యంలో దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్‌తో షో తో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 182 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో ఆతిథ్య జట్టును 159 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. ఆల్‌రౌండ్‌షో కనబరిచిన భారత జట్టుపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు."సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్బుతంగా రాణించాము. ఈ వికెట్లో డబుల్ పేస్, బాల్ గ్రిప్పింగ్ ఎక్కువ ఉంది. ఇటువంటి పిచ్‌పై లెంగ్త్ బాల్స్‌ను హిట్ చేయడం అంత ఈజీకాదు.కానీ మా బ్యాటర్లు ఇక్కడ పరిస్థితులను బాగా ఆర్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్టే బ్యాటింగ్ చేశారు. ఇక బౌలర్లతో కూడా అదే విషయం చర్చించాము. ఇక్కడ బంతి ఎక్కువగా గ్రిప్ప్ అవుతుండడంతో ఏది చేయాలన్న కొత్త బంతితో చేయాలని మా బౌలర్లకు చెప్పాను.బంతి పాతదయ్యే కొద్దీ స్కోర్ చేయడం సులభం అని మాకు తెలుసు. అందుకు తగ్గట్టుగానే మా బౌలర్లు కొత్త బంతితో అద్బుతాలు సృష్టించారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి ఆదిలోనే ప్రత్యర్థిని కష్టాల్లో నెట్టారు.జట్టు విజయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నిజంగా ఇది భారత క్రికెట్‌కు శుభసూచికమని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 23 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-2 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(66) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్(49) పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.జింబాబ్వే బ్యాటర్లలో మైర్స్(65) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మదండే(37) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్ రెండు, ఖాలీల్ ఆహ్మద్ ఒక్క వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన భారత్..ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. భారత్‌కు ఇది పొట్టిఫార్మాట్లో 150వ విజయం కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.టీమిండియా ఇప్పటవరకు 230 మ్యాచ్‌లు ఆడి 150 విజయాలు సాధించింది. కాగా టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో భారత్(150) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్(142), న్యూజిలాండ్(111) మూడో స్ధానంలో కొనసాగుతున్నాయి. -
సత్తా చాటిన శుభ్‌మన్, సుందర్.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఘోర ఓటమి దిశగా సాగింది. అయితే డియాన్ మైర్స్ (65 నాటౌట్), మదండే (37) జింబాబ్వేను దారుణ పరాభవం బారిన పడకుండా తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. ఓ దశలో (మైర్స్, మదండే క్రీజ్‌లో ఉండగా) జింబాబ్వే టీమిండియాకు షాకిచ్చేలా కనిపించింది. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (4-0-15-3), ఆవేశ్ ఖాన్ (4-0-39-2), ఖలీల్ అహ్మద్ (4-0-15-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
రోహిత్ శర్మను దాటేసిన యశస్వి జైస్వాల్
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌ల్లో (అన్ని ఫార్మాట్లలో) 65.23 సగటున, 85.82 స్ట్రయిక్‌రేట్‌తో 848 పరుగులు చేశాడు. యశస్వి తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నాడు. జద్రాన్ 27 ఇన్నింగ్స్‌ల్లో 33.76 సగటున, 80.76 స్ట్రయిక్‌రేట్‌తో 844 పరుగులు చేశాడు. యశస్వి ఈ ఏడాది హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా మారే క్రమంలో టీమిండియా సారధి రోహిత్ శర్మను అధిగమించాడు. హిట్‌మ్యాన్ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 833 పరుగులు చేశాడు.జింబాబ్వే, భారత్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ సత్తా చాటడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గిల్.. జింబాబ్వే టార్గెట్ 183
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) అజేయంగా నిలిచారు. శుభ్‌మన్ గిల్ ఆరు ఇన్నింగ్స్‌ల తర్వాత టీ20ల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20 జింబాబ్వే.. రెండో మ్యాచ్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
IND VS ZIM: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యం
మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యంఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆరో వికెట్ కోల్పోయిన జింబాబ్వే16.3వ ఓవర్: 116 పరుగుల వద్ద జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి మదండే (37) ఔటయ్యాడు. 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జింబాబ్వే7.6వ ఓవర్: 183 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద సుందర్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి జోనాథన్ క్యాంప్‌బెల్ (1) ఔటయ్యాడు. 37 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన జింబాబ్వే6.2వ ఓవర్: 37 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి సికందర్ రజా (15) ఔటయ్యాడు. 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే3.1వ ఓవర్: 19 పరుగుల వద్ద జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది. 2.4వ ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి మరుమణి (13) ఔట్ కాగా.. 3.1వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి బ్రియాన్ బెన్నెట్ (4) పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే1.1వ ఓవర్: 9 పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి మెదెవెరె (1) ఔటయ్యాడు.జింబాబ్వే టార్గెట్ 183టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36, శుభ్‌మన్ గిల్ 66, అభిషేక్ శర్మ 10, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు చేసి ఔట్ కాగా.. సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (1) నాటౌట్‌గా మిగిలారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా19.4వ ఓవర్: 177 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మధెవెరెకు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ (49) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.5వ ఓవర్: 153 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (66) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా10.3వ ఓవర్: 81 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్‌లో మరుమణికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (10) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా8.1వ ఓవర్: 67 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సికందర్ రజా బౌలింగ్‌లో బ్రియాన్ బెన్నెట్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైస్వాల్ (36) ఔటయ్యాడు.హరారే వేదికగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లోని సభ్యులు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. ఇన్నోసెంట్ కాలా స్థానంలో మారుమణి.. లూక్ జాంగ్వే స్థానంలో నగరవ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా -
Ind vs Zim: ఆ ముగ్గురిపై వేటు.. దూబేకూ చోటు
జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌తో ప్రపంచకప్-2024 విజేత జట్టులోని ముగ్గురు స్టార్లు పునరాగమనం చేశారు.ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, పవర్ హిట్టర్ శివం దూబే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్‌లపై వేటు పడింది.అదే విధంగా.. పేసర్ ముకేశ్ కుమార్‌కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వరల్డ్‌కప్ విన్నర్ల రాకతో తమ జట్టు మరింత పటిష్టమైందని పేర్కొన్నాడు.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా. -
Ind vs Zim: యశస్వి, సంజూ ఎంట్రీ.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!
జింబాబ్వేతో కీలకమైన మూడో టీ20కి టీమిండియా సన్నద్ధమైంది. హరారే వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే చేరికతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది.అయితే, అదే సమయంలో తుదిజట్టు కూర్పు కూడా తలనొప్పిగా మారింది. ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ కుదురుకున్నాడు. తొలి టీ20లో అభిషేక్ విఫలమైనా.. రెండో టీ20లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు.కాబట్టి ఈ పంజాబీ బ్యాటర్‌ను తప్పించేందుకు మేనేజ్మెంట్ సుముఖత చూపకపోవచ్చు. ఈ నేపథ్యంలో మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించే విషయంలో సందిగ్దం నెలకొంది. ఈ క్రమంలో అతడిని జట్టులో చేర్చాలంటే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడే అవకాశం కనిపిస్తోంది.వికెట్ కీపర్‌గా అతడికే ఛాన్స్యశస్వి- అభిషేక్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు సమాచారం. దీంతో బ్యాటర్ సాయి సుదర్శన్‌పై వేటు పడే అవకాశం ఉంది. మరోవైపు.. సంజూ శాంసన్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ స్థానం ప్రశ్నార్థకమైంది.అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ వైపే మొగ్గుచూపిన యాజమాన్యం.. వికెట్ కీపర్‌గా అతడికే ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాని యశస్వి, సంజూలను ఈ మ్యాచ్‌లో తప్పక ఆడించాలనే యోచనలో ఉన్న బీసీసీఐ.. శివం దూబేకు మాత్రం విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.ఒకే ఒక్క మార్పుతోఇదిలా ఉంటే .. జింబాబ్వే ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగన్నుట్లు సమాచారం. లెఫ్టార్మ్ పేసర్ రిచర్డ్ ఎన్గరవా ఫిట్నెస్ సాధిస్తే.. ల్యూక్ జాంగ్వేకు ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మూడో టీ20 బుధవారం సాయంత్రం గం. 4:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.పిచ్ స్వభావం, వాతావరణంహరారే పిచ్ బౌలర్లు, బ్యాటర్లకు సమంగా అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.జింబాబ్వేతో మూడో టీ20కి భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముకేష్ కుమార్.జింబాబ్వే తుదిజట్టు(అంచనా)వెస్లీ మెదవెరె, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియాన్ మైయర్స్, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకజ్ద, ల్యూక్ జాంగ్వే/ రిచర్డ్ ఎన్గరవా, బ్లెస్సింగ్ ముజరాబానీ, టెండాయ్ చతారా. The #T20WorldCup-winning trio is in the house... 👏 👏... and they are 𝙍𝙖𝙧𝙞𝙣𝙜 𝙏𝙤 𝙂𝙤! 💪 💪#TeamIndia | #ZIMvIND | @IamSanjuSamson | @IamShivamDube | @ybj_19 pic.twitter.com/E0rNOkHmTz— BCCI (@BCCI) July 9, 2024 -
ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టి కూడా లేదు.. ఈ "గిల్" మనకు అవసరమా..?
టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్ర జట్టును జింబాబ్వే పర్యటనకు పంపారు. ఈ పర్యటనను భారత్ ఘోర ఓటమితో ప్రారంభించి, ఆతర్వాతి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో సమంగా నిలిచింది.రెండో టీ20లో అంతా బాగుంది అనుకున్నా, ఒక్క విషయం మాత్రం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. కెప్టెన్ గిల్ పేలవ ఫామ్ అభిమానులతో పాటు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. గిల్ గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి తన టీ20 కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. గిల్ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అయితే కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.ఈ పేలవ ఫామ్ కారణంగానే అతను టీ20 వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపిక కాలేదు. గిల్.. జింబాబ్వే పర్యటనలో అయినా ఫామ్‌లో వస్తాడని యాజమాన్యం అతన్ని ఈ టూర్‌కు ఎంపిక చేసింది. గిల్ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే భవిష్యత్తులో టీ20 జట్టు నుంచి కనుమరుగవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. జింబాబ్వే పర్యటనలో తదుపరి మ్యాచ్‌ల్లో రాణించకపోతే టీ20 జట్టు నుంచి శాశ్వతంగా తప్పించడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. సోషల్‌మీడియాలో గిల్ విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ గిల్ మనకు అవసరమా అని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.రేసులో నిలబడగలడా..?రోహిత్, కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా ఓపెనింగ్ స్థానం కోసం చాలామంది రేసులో ఉన్నారు. రెండో టీ20లో సెంచరీతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ కొత్తగా శుభ్‌మన్ గిల్‌కు పోటీగా వచ్చాడు. ఇప్పటికే యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు. వీరందరి నుంచి పోటీని తట్టుకుని గిల్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.గత 10 టీ20 ఇన్నింగ్స్‌ల్లో గిల్ స్కోర్లు..జింబాబ్వేతో రెండో టీ20- 2 (4)జింబాబ్వేతో తొలి టీ20- 31 (29)ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20- 23 (12)సౌతాఫ్రికాతో మూడో టీ20- 12 (6)సౌతాఫ్రికాతో రెండో టీ20- 0 (2)వెస్టిండీస్‌తో ఐదో టీ20- 9 (9)వెస్టిండీస్‌తో నాలుగో టీ20- 77 (47)వెస్టిండీస్‌తో మూడో టీ20- 6 (11)వెస్టిండీస్‌తో రెండో టీ20- 7 (9)వెస్టిండీస్‌తో తొలి టీ20- 3 (9) -
అభి"షేక్" శర్మ.. రసెల్, హెడ్ కూడా దిగదుడుపే..!
భారత యువ కెరటం అభిషేక్ శర్మ పొట్టి క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారాడు. రెండ్రోజుల కిందట జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేసిన శర్మ.. ఈ ఏడాది ఆరంభం నుంచే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటం మొదలుపెట్టాడు.ఈ ఏడాది ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన శర్మ.. 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 584 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి క్రికెట్లో ఈ ఏడాది ఇంత స్ట్రయిక్‌రేట్ ఎవ్వరికీ లేదు. అభిషేక ముందు ఆండ్రీ రసెల్ (199.47), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (194.13), ట్రవిస్ హెడ్ (176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా దిగదుడుపే.ఇదిలా ఉంటే, జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్దిద్దరే: మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2024తో టీమిండియాలో ఒక శకం ముగిసింది. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో.. భారత జట్టులో ఈ ఇద్దరి మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరా అన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో జింబాబ్వే మాజీ క్రికెటర్ హామిల్టన్ మసకజ్ద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీ20లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారసులు వీరేనంటూ ఇద్దరు యువ తరంగాల పేర్లు చెప్పాడు. కాగా అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్-2024లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పదకొండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ రోహిత్ సేన ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.ఐపీఎల్ వీరులకు లైన్ క్లియర్ఈ క్రమంలో సౌతాఫ్రికాతో ఫైనల్లో విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ వీరులకు జాతీయ జట్టులో ఎంట్రీకి మార్గం సుగమమైంది.ఇందుకు తగ్గట్లుగా మెగా టోర్నీ ముగిసిన వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లు తొలిసారిగా ఎంపికయ్యారు. అయితే, అనూహ్య రీతిలో జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన యువ భారత జట్టు... రెండో టీ20లో మాత్రం సత్తా చాటింది.ఆతిథ్య జట్టును ఏకంగా వంద పరుగుల తేడాతో చిత్తు చేసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌గా తొలిసారి వ్యవహరిస్తున్న శుబ్‌మన్ గిల్ ఖాతాలో విజయం చేరింది.కోహ్లి, రోహిత్ లేని లోటు పూడ్చగలిగేది వాళ్లిద్దరేఈ నేపథ్యంలో హామిల్టన్ మసకజ్ద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ప్రత్యామ్నాయం శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అని ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు పేర్కొనడం విశేషం.‘‘భారత క్రికెట్ జట్టు పరివర్తన దశలో ఉంది. అందరి కంటే ఎక్కువగా శుబ్‌మన్ గిల్ నా దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో అతడు చాలా కాలంగా తనదైన శైలిలో రాణిస్తున్నాడు.మేటి ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సత్తా అతడికి ఉంది.ఇక యశస్వి సైతం అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా సాగించలగలడనే నమ్మకం నాకు ఉంది. గిల్, యశస్వి.. వీళ్లిద్దరే వరల్డ్‌క్లాస్ క్రికెటర్ల నిష్క్రమణ వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చగలరు’’ అని మసకజ్ద అభిప్రాయపడ్డాడు.చదవండి: BCCI: ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే? -
రింకూ సింగ్ ఖాతాలో ప్రత్యేక రికార్డు.. ధోని, విరాట్ కంటే వేగంగా..!
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రింకూ.. భారత్ తరఫున టీ20ల్లో చివరి రెండు ఓవర్లలో అత్యధిక సిక్సర్లు (18) బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (32 సిక్సర్లు) టాప్‌లో ఉండగా.. విరాట్ (24), ధోని (19) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 32 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు హార్దిక్‌కు 193 బంతులు, 24 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు కోహ్లికి 158 బంతులు, 19 సిక్సర్ల మార్కును చేరుకునేందుకు ధోనికి 258 బంతులు అవసరం కాగా.. రింకూ కేవలం 48 బంతుల్లోనే 18 సిక్సర్ల మార్కును తాకాడు. రింకూ కెరీర్లో చివరి రెండు ఓవర్లలో 334.69 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించడం గమనార్హం. తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు (13 ఇన్నింగ్స్‌లు) 25 సిక్సర్లు బాదిన రింకూ.. 178.76 స్ట్రయిక్‌రేట్‌తో 80.8 సగటున 404 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో కనీసం 15 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. రింకూ తన టీ20 కెరీర్లో చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయ. 38(21), 37*(15), 22*(14), 31*(9), 46(29), 6(8), 68*(39), 14(10), 16*(9), 9*(9), 69*(39), 0(2), 48*(22)🚨 WHAT A SHOT, RINKU 🚨 pic.twitter.com/gNZKRjAYZ9— Johns. (@CricCrazyJohns) July 7, 2024జింబాబ్వేతో రెండో టీ20లో 15వ ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన రింకూ.. తొలి 14 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. చివరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన రింకూ.. 8 బంతుల్లో 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాది టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రింకూ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం బయటపడింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (47 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ కూడా చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది. -
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
‘‘మొదటి మ్యాచ్ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.డకౌట్.. వెను వెంటనే సెంచరీభారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు అభిషేక్ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే అతడు డకౌట్‌గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డకౌట్ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావుఈ క్రమంలో అభిషేక్ శర్మ తన మెంటార్ యువరాజ్ సింగ్‌కు కాల్ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతడు వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్ ఫోన్‌కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.చదవండి: బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket! 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9— BCCI (@BCCI) July 8, 2024 View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial) -
టీమిండియా తరఫున ఎవరికీ సాధ్యం కాలేదు.. అభిషేక్ శర్మ సాధించాడు
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో (7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.𝙃𝙖𝙫𝙤𝙘 𝙞𝙣 𝙃𝙖𝙧𝙖𝙧𝙚 🌪️🏏@IamAbhiSharma4 smashes 100 in 47 balls 🥵💪#SonySportsNetwork #ZIMvIND #TeamIndia pic.twitter.com/hHYlTopD1V— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2024ఇదిలా ఉంటే, రెండో టీ20లో సుడిగాలి శతకంతో (46 బంతుల్లో) విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. కెరీర్లో కేవలం రెండో టీ20 ఆడుతున్న అభిషేక్.. సెంచరీ మార్కును హ్యాట్రిక్ సిక్సర్లతో (వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్‌లో) అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ శతకాన్ని హ్యాట్రిక్ సిక్సర్లతో అందుకోలేదు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ తన పరుగుల ఖాతాను కూడా సిక్సర్‌తోనే ఓపెన్ చేయడం విశేషం. తన కెరీర్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి పలు రికార్డులు కొల్లగొట్టాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.అభిషేక్‌కు ముందు ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన కెరీర్ మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ జాబితాలో యశస్వీ జైశ్వాల్ (21 ఏళ్ల 279 రోజుల వయస్సులో) టాప్‌లో ఉన్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో నిలిచారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 50 సిక్స్‌లు బాదాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు) పేరిట ఉండేది.ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో 65 పరుగులు సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (57 పరుగులు) పేరిట ఉండేది. -
IND vs ZIM: సంజూ వచ్చేశాడు.. అతడిపై వేటు! భారత తుది జట్టు ఇదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు మూడో టీ20కు సిద్దమవుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే మూడో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టు ఎంపిక చేయడం శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు వరల్డ్‌కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కారణంగా యశస్వీ జైశ్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే దూరమైన సంగతి తెలిసిందే. వారి స్ధానంలో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలను తాత్కాలికంగా బీసీసీఐ జింబాబ్వేకు పంపింది. అయితే ఇప్పుడు జైశ్వాల్, సంజూ, దూబే మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం జట్టుతో చేరారు. వీరి రావడంతో సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మలు జట్టును వీడనున్నారు.ఈ క్రమంలో జట్టు కూర్పు కొంచెం కష్టంగా మారింది. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా దుమ్ములేపుతుండడంతో జైశ్వాల్ మూడో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. అదే విధంగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ స్ధానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో జురెల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక రెండో టీ20కు జట్టులోకి వచ్చిన సాయిసుదర్శన్ స్ధానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ రెండు మార్పులు మినహా మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జింబాబ్వేతో మూడో టీ20.. భారత తుది జట్టు(అంచనా) శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. -
నా సెంచరీ సీక్రెట్ ఇదే.. అతడికి థ్యాంక్స్ చెప్పాలి: అభిషేక్ శర్మ
అరంగేట్రంలోనే డకౌటై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. 24 గంటల వ్యవధిలోనే సంచలనం సృష్టించాడు. ఎక్కడైతే డకౌటయ్యాడో అక్కడే సెంచరీతో సత్తా చాటి శెభాష్ అనిపించుకుంటున్నాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. జింబాబ్వే బౌలర్లను అభిషేక్ ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ అందుకున్న భారత ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన అభిషేక్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో ఆడలేదంట. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఈ అద్భుత నాక్ ఆడినట్లు అభిషేక్ తెలిపాడు."ఓ విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో నేను శుబ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఆడాడను. అతడి నుంచి బ్యాట్‌ను తీసుకుని ఆడటం చాలా కష్టం. అతడు తన బ్యాట్లను ఎవరికీ అంత ఈజీగా ఇవ్వడు. కానీ నేను మాత్రం మేము అండర్-14 క్రికెట్ ఆడే రోజుల నుంచి అతడి బ్యాట్‌ను ఉపయోగిస్తునే ఉన్నాను. నేను ఒత్తిడిలో ఉన్న ప్రతీ సారి గిల్‌ను తన బ్యాట్ ఇవ్వమని అడుగుతాను. నేను అతని బ్యాట్‌తో ఆడినప్పుడల్లా అద్భుతంగా రాణించాను . ఇప్పుడు కూడా అంతే. సరైన సమయంలో గిల్ తన బ్యాట్‌ను నాకు ఇచ్చాడు. నాతో పాటు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. థంక్యూ గిల్ అంటూ బీసీసీఐ టీవీతో అభిషేక్ పేర్కొన్నాడు. కాగా గిల్, అభిషేక్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరూ పంజాబ్ నుంచి భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
వారిద్దరూ అద్భుతం.. ఎంతచెప్పుకున్న తక్కువే: టీమిండియా కెప్టెన్
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో 100) సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆఖరిలో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 134 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్లు ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్, సుందర్ చెరో రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు.ఈ మ్యాచ్‌లో సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేక్ శర్మ, రుతురాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వారు ఆడిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే పవర్‌ప్లేలో ఆ విధంగా బ్యాటింగ్ చేయడం అంత ఈజీకాదు. "పవర్‌ప్లేలో కొత్త బంతి కాస్త ఎక్కువగా స్వింగ్ అవ్వడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. కానీ అభి, రుతు మాత్రం చాలా పరిపక్వతతో ఆడారు. ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ముందుకు నడిపించారు. ఇది యువ భారత జట్టు. ఈ జట్టులో చాలా మంది ఆటగాళ్లు ప్రొఫిషనల్ టీ20 క్రికెట్లో ఆడిండవచ్చు గానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా ఎవరికి లేదు. తొలి టీ20లో ఒత్తడిని తట్టుకోలేక వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. అందుకే స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక ఓడిపోయాం. కానీ ఇప్పుడు రెండో మ్యాచ్‌లో తిరిగి పుంజుకుని సంచలన విజయం సాధించాము. ఈ సిరీస్‌లో మాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాటిలో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు.తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి ఔరా అన్పించాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) తొలి సెంచరీ నమోదు చేసిన మొదటి భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ శర్మ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెటర్ దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తను అరంగేట్రం నుంచి మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో కేవలం తన రెండో ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన అభిషేక్.. హుడా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయుష్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో శర్మ తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఉన్నాడు. జైశ్వాల్ 21 ఏళ్ల 279 రోజుల వయస్సులో సెంచరీ చేశాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్..50 సిక్స్‌లు బాదాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ను అభిషేక్ అధిగమించాడు.ఇక జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 100 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో భారత్ సమం చేసింది. -
దెబ్బకు దెబ్బ.. టీమిండియా చేతిలో జింబాబ్వే చిత్తు
జింబాబ్వేతో రెండో టీ20లో యువ టీమిండియా అదరగొట్టింది. ఆతిథ్య జట్టును వంద పరుగుల తేడాతో మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.దెబ్బకు దెబ్బ కొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఖాతాలో కెప్టెన్‌గా తొలి విజయం నమోదైంది.దుమ్ములేపిన అభిషేక్.. రాణించిన రుతురాజ్హరారే వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 2 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి జింబాబ్వే బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.తొలి టీ20లో విఫలమైన ఈ పంజాబీ బ్యాటర్ తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసి తన విలువ చాటుకున్నాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సరిగ్గా 100 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.అభిషేక్ శర్మకు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అర్థశతకం (47 బంతుల్లో 77 పరుగులు) తో అజేయంగా నిలిచాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రింకూ సింగ్ (22 బంతుల్లో 48 పరుగులు నాటౌట్, ఫోర్లు 2, సిక్సర్లు 5) రుతురాజ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో యువ భారత జట్టు కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 234 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.జోరుగా హుషారుగా వికెట్లు...ఓపెనర్ ఇన్నోసెంట్ కయా (4)ను ముకేష్‌కుమార్ ఆదిలోనే వెనక్కి పంపించాడు. అయితే, రెండో వికెట్ తీయడానికి భారత బౌలర్లు కాస్త శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ వెస్లే మెదెవెరె(43), వన్‌డౌన్ బ్యాటర్ బ్రియాన్ బ్యానెట్ (26) తేలికగా తలొగ్గలేదు.బ్యానెట్‌ను ముకేష్‌కుమార్ ఔట్ చేయగా.. రవి బిష్ణోయ్ వెస్లే పని పట్టాడు. ఇదే జోరును భారత బౌలర్లు కొనసాగించడంతో జింబాబ్వే మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఈక్రమంలో లోయర్ ఆర్డర్లో వచ్చిన ల్యూక్ జాంగ్వే 33 పరుగులు చేసి కాసేపు పోరాడాడు. ముకేష్ దెబ్బకు అతడుకూడా పెవిలియన్ చేరక తప్పలేదు.ఈక్రమంలో 18.4 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 100 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.టీమిండియా బౌలర్లలో ముకేష్‌కుమార్, ఆవేశ్‌ఖాన్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. రవి బిష్ణోయ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. భారత్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. -
అభిషేక్, రుతురాజ్, రింకూ ఊచకోత.. జింబాబ్వే టార్గెట్ 235 పరుగులు
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.జింబాబ్వే బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 46 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు,1 సిక్స్‌తో 77 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రింకూ సింగ్( తన బ్యాట్‌కు పనిచెప్పాడు. రింకూ కేవలం 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే బౌలర్లలో ముజుబ్రానీ,మసకజ్డా తలా వికెట్ సాధించారు. -
అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో ఊచకోత
హరారే వేదికగా జింబాబ్వే జరుగుతున్న రెండో టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 46 బంతుల్లోనే అభిషేక్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్లతో తన సెంచరీని అభిషేక్ పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వే బౌలర్లను మాత్రం అభిషేక్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అభిషేక్ బౌండరీలు వర్షం కురిపించాడు. సరిగ్గా 100 పరుగులు చేసి అభిషేక్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ అభిషేక్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. Abhishek Sharma 🚀#ZIMvINDpic.twitter.com/1VkL1DCUL9— OneCricket (@OneCricketApp) July 7, 2024 -
జింబాబ్వే రెండో టీ20.. భారత జట్టులోకి యువ సంచలనం! తుది జట్లు ఇవే
జింబాబ్వేతో తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. హరారే వేదికగా భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఎక్స్ట్రా బ్యాటర్‌తో ఆడుతోంది. పేసర్ ఖాలీల్ అహ్మద్ స్ధానంలో యువ బ్యాటర్ సాయిసుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. సాయిసుదర్శన్కు భారత్ తరపున ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. సాయిసుదర్శన్ ఐపీఎల్లో అద్బుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. కాగా సుదర్శన్ ఇప్పటికే భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లుజింబాబ్వే: వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారాభారత్భారత్శుబ్మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ -
IND vs ZIM: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. తొలి జట్టుగా
పసికూన జింబాబ్వే సంచలనం సృష్టించింది. హరారే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే అద్భుత విజయం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ భారత్‌ను 13 పరుగుల తేడాతో జింబాబ్వే చిత్తు చేసింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు. జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియాను దెబ్బతీయగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వాషింగ్టన్ సుందర్(27) తన వంతు ప్రయత్నం చేశాడు.చరిత్ర సృష్టించిన జింబాబ్వే..ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్‌పై అత్యల్ప టోటల్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 127 పరుగుల టార్గెట్‌ను కివీస్ డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్‌తో కివీస్ ఆల్‌టైమ్ రికార్డును జింబాబ్వే బ్రేక్ చేసింది. -
ఇది అస్సలు ఊహించలేదు.. అదే మా కొంపముంచింది: శుబ్‌మన్ గిల్
టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్ టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. హరారే వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20లో 13 పరుగుల తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత్ చతికల పడింది.జింబాబ్వే బౌలర్ల దాటికి భారత్ 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా నడ్డివిరచగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందిచాడు. బ్యాటింగ్‌లో విఫలమవకావడంతోనే ఓటమిపాలైమని గిల్ తెలిపాడు."ఈ ఓటమి మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. మేము తొలుత అద్భుతంగా బౌలింగ్ చేశాము. కానీ ఫీల్డింగ్‌లో మాత్రం మా మార్క్ చూపించలేకపోయాం. ఇక బ్యాటింగ్‌లో ప్రతీ ఒక్కరం పూర్తి స్వేఛ్చగా ఆడాలని నిర్ణయించుకున్నాము.కానీ అందుకు తగ్గ విధంగా ఆడలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డాం. మా ఇన్నింగ్స్ సగం ముగిసే సరికి మేము 5 వికెట్లు కోల్పాయం. కానీ నేను ఇంకా క్రీజులో ఉండడంతో గెలుస్తామన్న నమ్మకం ఉండేది. కానీ దురదృష్టవశాత్తూ నేను కూడా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. నేను ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే లక్ష్యం 115 పరుగులే కావడంతో ఆఖరి వరకు మాకు గెలుపు పై ఆశలు ఉండేవి. కానీ మేము అనుకున్నది జరగలేదు.ఎక్కడ తప్పు జరిగిందో మేము సమీక్షించుకుంటాము. తర్వాతి మ్యాచ్‌ల్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు. -
టీమిండియాకు ఘోర పరాభవం .. జింబాబ్వే చేతిలో ఓటమి
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో13 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య చేధనలో భారత్.. జింబాబ్వే బౌలర్ల దాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, చతరా తలా మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. బెన్నట్, మసకద్జా, జాంగ్వే తలా వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(27) పోరాడనప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 115 పరుగులకే జింబాబ్వే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. బిష్ణోయ్‌తో పాటు మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, అవేష్ ఖాన్,ముఖేష్ కుమార్ చెరో వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో మదండే(29), మైర్స్(23), బెన్నట్(23), పరుగులు చేశారు. కాగా టీ20ల్లో జింబాబ్వే చేతిలో భారత్ ఓటమి పాలవ్వడం 2016 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
అభిషేక్ శర్మ డకౌట్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు! వీడియో
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అభిషేక్ శర్మ తనదైన మార్క్ చూపించలేకపోయాడు.ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ బెన్నట్ బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతులను డాట్ చేసిన అభిషేక్.. ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో డకౌటైన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో రజా కంటే ముందు ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్, పృథ్వీ షా ఉన్నారు. pic.twitter.com/JIFGKCtDIV— Azam Khan (@AzamKhan6653) July 6, 2024 -
జింబాబ్వేతో తొలి టీ20.. ముగ్గురు మొనగాళ్ల అరంగేట్రం
భారత తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ కల ఎట్టకేలకు నేరవేరింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20తో వీరిద్దరూ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అదే విధంగా ఇప్పటికే టెస్టు క్రికెట్లో భారత తరపున డెబ్యూ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రవ్ జురెల్.. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. వీరిముగ్గురూ భారత తత్కాలిక హెడ్ కోచ్ వీవీయస్ లక్ష్మణ్, సపోర్ట్ స్టాప్ చేతుల మీదగా డెబ్యూ క్యాప్‌ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో విధ్వంసం సృష్టించాడు.ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేయడంలో అభిషేక్‌ది కీలక పాత్ర. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 32.27 సగటుతో 484 పరుగులు చేశాడు. మరోవైపు పరాగ్ కూడా తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన పరాగ్ 52.09 సగటుతో 573 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు.ఇక జురెల్ విషయానికి వస్తే.. ఇప్పటికే టెస్టుల్లో తన ఏంటో నిరూపించుకున్న ఈ రాజస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్, ఇప్పుడు టీ20ల్లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. టీ20ల్లో ఫినిషర్‌గా జురెల్‌కు మంచి రికార్డు ఉంది.


