అభిషేక్ శర్మ డకౌట్‌.. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు! వీడియో | Abhishek Sharma becomes the 4th Indian to get out on a duck in T20I debut | Sakshi
Sakshi News home page

IND vs ZIM: అభిషేక్ శర్మ డకౌట్‌.. అరంగేట్ర మ్యాచ్‌లోనే చెత్త రికార్డు! వీడియో

Jul 6 2024 7:27 PM | Updated on Jul 6 2024 7:46 PM

 Abhishek Sharma becomes the 4th Indian to get out on a duck in T20I debut

టీమిండియా యువ ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ త‌న తొలి అంత‌ర్జాతీయ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న తొలి టీ20తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన‌ అభిషేక్ శ‌ర్మ త‌నదైన మార్క్ చూపించ‌లేక‌పోయాడు.

ఓపెన‌ర్‌గా వ‌చ్చిన అభిషేక్ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌ తొలి ఓవ‌ర్ వేసిన స్పిన్నర్ బెన్నట్ బౌలింగ్‌లో మొదటి నాలుగు బంతులను డాట్ చేసిన అభిషేక్‌.. ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. 

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో డకౌటైన నాలుగో భారత ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో రజా కంటే ముందు ఎంఎస్ ధోని, కేఎల్ రాహుల్‌, పృథ్వీ షా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement