బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా పూనవాలా వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె హై-ఎండ్ డిజైనర్ దుస్తులు, అత్యంత లగ్జరీ ఆభరణాలనే ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారామె. ఇటీవల ఆభరణాల నిపుణుడు, ఫ్యాషన్ కంటెంట్ సృష్టికర్త ధ్రుమిత్ మెరులియా ఆమె అరుదైన పింక్ డైమండ్ రింగ్‌పై ఫోకస్ పెట్టడమే గాక దాని ప్రత్యేకత, వెనకున్న ఆసక్తికర కథనుకూడా వివరించారు.
ఆ రాణికి చెందినది..
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ ఉంగరాన్ని మేరీ-థెరెస్ పింక్ డైమండ్ రింగ్ అని పిలుస్తారు అని ధ్రుమిత్ వెల్లడించారు. ఈ ఉంగరం ఫ్రాన్సక్వీన్ మేరీ ఆంటోయినెట్‌కు చెందినదని తెలిపారు. ఆ ఉంగరం కేంద్ర భాగం పది క్యారెట్ల విలువ చేసే పర్పుల్ అండ్ పింక్ డైమండ్ మోడిఫైడ్ కైట్ బ్రిలియంట్-కట్ డైమండ్.
దీని చుట్టూ గుండ్రని 17 వజ్రాలతో అలకరించి నల్లటి ప్లాటినం బ్యాండ్‌లో ఉంది. అంతేగాదు ఆ మధ్యలోని వజ్రం 18వ శతాబ్దం కాలం నాటిదట. దీనిని క్వీన్ మేరీ ఆంటోయినెట్ కుమార్తె డచెస్ మేరీ-థెరిస్ డి'అంగోలేమ్ వారసత్వంగా పొందారు. ఈ ఉంగరం 1996లో విక్రయించబడే వరకు చాలా ఏళ్లు రాజకుటుంబం ఆభరణాల కలెక్షన్స్‌లో ఉండేదట.
అంత ఖరీదా..?
అయితే ప్రఖ్యాత ఆభరణాల డిజైనర్ జోయెల్ ఆర్థర్ రోసెంతల్ వజ్రం కోసం కొత్త బ్యాండ్‌ను రూపొందించారు. జూన్ 17, 2025న, ఈ ఉంగరాన్ని న్యూయార్క్‌లోని క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్‌లో దాదాపు రూ.125 కోట్లు పైనే అమ్ముడుపోయిందట. ఫ్రెంచ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఉంగరంగా వార్తల్లో నిలిచింది కూడా.
కాగా, బిలియనీర్ అదర్ పూనవాలాను వివాహం చేసుకున్న నటాషా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతేగాదు ఆమె విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం విల్లూ పూనవల్లా ఛారిటబుల్ ఫౌండేషన్‌కు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే నెదర్లాండ్స్‌లోని పూనావాలా సైన్స్ పార్క్ డైరెక్టర్‌గా, బ్రిటిష్ ఏషియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ చైర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
(చదవండి: వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి..చివరికి ర్యాపిడో డ్రైవర్‌గా! మనసు మెలిపెట్టే భావోద్వేగ కథ)


