ఎన్నో జర్నీలు చేస్తుంటాం. కానీ కొన్ని ప్రయాణాలు కొత్త వ్యక్తులను పరిచయం చేసి మధుర జ్ఞాపకాలని ఇస్తే..మరొకొన్ని జర్నీలు భావోద్వేగం చెందేలా చేస్తాయి. అలాంటి భావోద్వేగానికి గురిచేసే బైక్‌జర్నీ స్టోరీని చిరాగ్ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే..చిరాగ్ తన పోస్ట్‌లో "ఇవాళ ర్యాపిడో బైక్‌లో ప్రయాణిస్తున్నా. అతడి కథతో సాధారణ ప్రయాణం కాస్తా భావోద్వేగ క్షణంగా మారింది" అనే క్యాప్షన్ జోడించి మరి షేర్ చేసుకున్నాడు. నిజానికి ఆ ర్యాపిడడో డ్రైవర్‌తో ప్రయాణం మాములుగానే ప్రారంభమైంది. తమ మధ్య సంభాషణ అత్యంత నార్మల్‌గా సాగిందంటూ ఇలా పేర్కొన్నాడు. తనని ఎక్కడ ఉంటావ్? ఏ కళాశాలలో చదువుతున్నావ్? వంటి ప్రాథమిక ప్రశ్నలను ఆ రైడర్ అడిగాడని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
"ఆ తర్వాత కొద్దిసేపటికే డ్రైవర్ తన సొంత జీవితం గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అప్పుడే మా మధ్య సంభాషణ కాస్తా ఎమోషనల్‌గా మారింది. ఆ రైడర్ తాను అమిటీలో హోటల్ మేనేజ్‌మెంట్ చేశానని, అప్పట్లో తన తండ్రి సైన్యంలో ఉండేవాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన లైఫ్ చాలా బాగుండేదని అన్నాడు. తమకు మంచి వ్యాపారం ఉందని..కుటుంబం అంతా చాలా సంతోషంగా సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు.
కరోనా మహమ్మారితో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయిందని, వ్యాపారాలు మూతపడటంతో తమ కుటుంబం దాదాపు రూ. 14 కోట్లు మేర నష్టపోయిందని బాధగా పచెప్పుకొచ్చాడు. తిరిగి నిలదొక్కుకోవడానికి చేసిన ప్రతీ ప్రయత్నం విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. దాంతో చివరికి తన స్నేహితుడితో కలిసి ఒక స్టార్టప్‌ని ప్రారంభించడానికి చాలా ప్రయత్నించానని, కానీ దానివల్ల ఏకంగా రూ.4లక్షల వరకు నష్టం వచ్చిందని చెప్పుకొచ్చాడు.
దాంతో తమ వద్ద ఎలాంటి సేవింగ్స్ లేకుండా రోడ్డుపై పడిపోయామని వేదనగా చెప్పుకొచ్చాడు. అప్పుడు తన కుటుంబాన్ని నిలదొక్కుకునేలా చేయడానికి తన కళ్లముందు ఒకే ఒక్క మార్గం కనిపించిందని చెప్పుకొచ్చాడు.
అప్పుడు తన దగ్గర ఉన్నదల్లా బైక్ మాత్రమేనని, అదే తనను జీవనోపాధి కోసం రాపిడో రైడర్‌గా పనిచేయడానికి పురికొల్పిందని చెప్పుకొచ్చాడు. తన కథంతా చెప్పిన ఆర్యాపిడో డ్రైవర్ చివరగా అన్న ఆ ఒక్క డైలాగ్ తనను ఎంతగానో కదిలించింది అంటూ ఆ మాటను కూడా పోస్ట్‌లో రాసుకొచ్చాడు". తాను ఆశ వదులుకోనని, ఇప్పటికి దేవుడిని నమ్ముతున్నా అంటూ మాట్లాడిన మాట..తన మదిలో నిలిచిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోషల్ మీడియా యూజర్ చిరాగ్.
Life is so unfair, man.
I was on a Rapido bike today, just a normal ride. The driver asked me where I live, which college I go to. Casual stuff.
Then out of nowhere, he started telling me his story. He said he did hotel management from Amity. Life was good back then when his…— Chiraag (@0xChiraag) December 22, 2025
(చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..)


