breaking news
Driver
-
మహిళా డ్రైవర్ని నియమించుకున్న తొలి అధికారిణి..!
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో ముందుండాలి వంటి ఉపన్యాసాలు లెక్కకు మించి చూసుంటాం. చేతల్లో మాత్రం శూన్యం. అతివల తమ ప్రతిభతో సంపాదించుకున్న అత్యున్నత స్థానాలే తప్ప..చాలమటుకు కొన్ని రంగాల్లో అవకాశాలు ఉండనే ఉండవు. అంతెందుకు మహిళా అధికారులు సైతం..తమ వరకు వచ్చేటప్పటికీ ఒకలా..బయటకు ఎన్నో లెక్చర్లు ఇస్తారు. కానీ ఈ అధికారిణి..మాటల్లోనే కాదు..చేతల్లో కూడా మహిళలకే తన తొలి ప్రాధాన్యాత అంటూ చేసి చూపించింది. ఆమె చేసిన పని భారతదేశంలో ఒక సరికొత్త మైలు రాయి. ఇలాంటి అద్భుతం ఇదే దేశంలోనే తొలిసారి కూడా కావొచ్చు.ఒడిశాలో మహిళా డ్రైవర్‌ను అధికారికంగా నియమించిన తొలి మహిళా ప్రభుత్వాధికారిణిగా ఉషా పాధీ గుర్తింపు పొందారు. ఒడిశా రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి అయినా ఆమె తన శక్తిమంతమైన అధికారంతో ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మయూర్ భంజ్కి చెందిన సంధ్యారాణి మాఝిని తన అధికారిక డ్రైవర్లలో ఒకరిగా నియమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఉషా. దీంతో ప్రభుత్వ వాహన తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది సంధ్యారాణిసంధ్యా జాజ్‌పూర్ ఛటియాలోని హెచ్ఎంవీ శిక్షణా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ పొందారామె. తదనంతరం ఒక అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకుంది. ఆమెకు వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉందట! మహిళలు అన్నింట్లో ముందుడాలంటూనే, డ్రైవింగ్, పాలన, సేవా బట్వాడా వంటి వాటిల్లో సమాన అవకాశాలు ఇవ్వం. ఆ లింగ మూసధోరణికి తిలోదకాలు ఇస్తూ..ఆమెనే డ్రైవర్‌గా కేటాయించుకున్నారు ఉషా. ఇది కేవలం సంధ్యతో మొదలైన మార్పు కాదు.అక్కడ రవాణా శాఖ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కింద అమాబస్ ఓఎస్ఆర్టీసీ అనేక మంది మహిళా కండక్టర్లను నియమించుకుని సంచలనం సృష్టించింది. బస్సులను, జీవితాలను కమాండ్ చేసే సత్తా మహిళలకే ఉందంటూ ఉమె సువాహాక్ చొరవతో వాణిజ్య రవాణా శాఖ మంత్రి ఈ ఏడాది సుమారు 500 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యం, స్వీయ విలువల దిశగా నడిపించాలని చూస్తుండటం విశేషం. శక్తిమంతమైన మార్పు పుష్కలమైన అవకాశాలు అందించనప్పుడే అని చెప్పడానికి ఈ ఘటనలే ఉదాహారణలు. అంతేగాదు అధికారుల సరైన నిర్ణయాలే ప్రజల అభ్యున్నతికి బాటలు వేసి నవ సమాజ నిర్మాణానికి దోహదపడతాయి అనే మాటకు ఇదే నిదర్శనం కూడా. (చదవండి: ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషంగా నిల్!: ఎంటర్ప్రెన్యూర్ ఆవేదన) -
వాళ్ళని కూడా అలాగే చంపేయండి.. డ్రైవర్ రాయుడు చెల్లి కన్నీరు
-
అన్నా లేరా.. నాకు దిక్కెవరు రా?
‘అన్నా.. మనకు రెక్కలు రాకముందే అమ్మానాన్నను ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటి నుంచి అష్టకష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాము. అమ్మమ్మ అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసింది. నా మనవడు ఉన్నాడన్న ధైర్యంతో బతికేస్తోంది. నేను కూడా తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ మా అన్న చూసుకుంటాడనే ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు మా అందర్నీ దూరం చేసి వెళ్లిపోయావు. మేమెలా బతికేదన్నా’ అంటూ ఆ సోదరి తన అన్న మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరుల గుండెల్ని మెలిపెట్టింది. శ్రీనివాసులు అంత్యక్రియల సందర్భంగా ఈ దృశ్యం ఆదివారం శ్రీకాళహస్తి మండలం, బొక్కసంపాళెంలో తీవ్ర విషాదాన్ని నింపింది.శ్రీకాళహస్తి: మండలంలోని బొక్కసంపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. జనసేన మాజీ నాయకురాలు వినుత, ఆమె భర్త చంద్రశేఖర్‌నాయుడు, మరో ముగ్గురు కలిసి మా అన్నను చంపేశారంటూ మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం వద్ద అతడి సోదరి కీర్తి బోరున విలపించడం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాం. ఇపుడు నా రక్తసంబంధమైన అన్నను కూడా కోల్పోయాను’ అని విలపించడం చూపరుల కళ్లు చెమర్చేలా చేసింది. ఏడేళ్ల వయసులో వెంకటగిరి నుంచి వచ్చేసి అమ్మమ్మ వద్ద పెరిగాము. ఇప్పుడు అన్నని పోగొట్టుకున్నానని మృతుని సోదరి, వారిని పెంచిన అమ్మమ్మ రాజేశ్వరి ఆవేదనను చూసి గ్రామస్తులు చలించిపోయారు.మా అన్నని మాట్లాడనివ్వలేదుఅనంతరం మృతుడు శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాట్లాడుతూ ‘మా అన్న వారి(జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి) ఇంటికి పరిమితమయ్యాడు. చాలాకాలంగా చూడడానికి కూడా కష్టంగా ఉండేది. ఒకరోజు కాలు విరిగిందని చెబితే చూడడానికి వెళ్లా. ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ రోజు మా అన్నను వారు మాట్లాడనివ్వకుండా చేశారు’ అని వెల్లడించింది. మా అన్నను పంపించేస్తామని చెప్పారే గానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని కన్నీటి పర్యంతమైంది. తన అన్న చావుకు కారణమైన వారిని ఎవర్నీ వదలిపెట్టనని, వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తామని తెలిపింది. తనకు అండగా ఉండాలని స్థానికులను కోరింది.‘నాకున్న ఒకే ఒక బంధాన్ని దూరం చేశారు. నా అన్నను అతి కిరాతకంగా చంపేశారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరమయ్యారు. అన్నున్నాడనే ధైర్యంతో బతికేస్తున్నా. ఇప్పుడు ఆ ఒక్క ఆశను కూడా తుంచేశారు. నా అన్నను నాకు లేకుండా చేశారు. పవన్‌కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. న్యాయం కోసం ఎందాకై నా వెళ్తాం..’ అంటూ మృతుడు శ్రీనివాసులు సోదరి కీర్తి మాట్లాడడం అక్కడి వారిని ఆలోచనలో పడేసింది. -
Delhi: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు పోనిచ్చిన డ్రైవర్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి కారును పోనిచ్చిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని శివ క్యాంప్ సమీపంలో చోటుచేసుకుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు జంటలతో పాటు ఎనిమిదేళ్ల బాలిక.. మొత్తం ఐదుగురు పైకి డ్రైవర్ ఉత్సవ్ శేఖర్ (40) కారును ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో శేఖర్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.కారు డ్రైవర్ ఉత్సవ్ శేఖర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే.. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితులను లాధి (40), ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35)గా గుర్తించారు. వీరందరూ రాజస్థాన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సంఘటనల ఖచ్చితమైన క్రమాన్ని నిర్ధారించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.