
ఏపీలో దుబాయ్ కంపెనీల ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్‌కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్‌డ్ ట్రాన్స్‌పోర్టు, దుబాయ్‌పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో గణేష్‌కుమార్ తెలిపారు.
కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్‌ఎస్‌డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్‌డ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.
చదవండి: స్కూల్‌లో కూలి పనులు చేయిస్తున్నారు