అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు | Manchu Vishnu clarity on dubai sitution at present | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు

Mar 2 2026 11:16 PM | Updated on Mar 2 2026 11:16 PM

Manchu Vishnu clarity on dubai sitution at present

దుబాయ్‌లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు  వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు.  ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌  గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉండిపోయింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement