రామ్ చరణ్- సుకుమార్ మరోసారి ప్రేక్షకుల అలరించేందుకు రానున్నారు. వీరిద్దరి కాంబోలో ఆర్సీ17 మూవీని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో అఫీషియల్‌గా ప్రారంభించారు.. రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. ఈ క్రేజీ కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ మూవీ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాదిలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పూర్తి స్థాయి నటీనటులు ఇంకా ఫైనల్ కాలేదు. అందువల్లే షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యంగానే మొదలవుతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. తాజా రూమర్స్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కుతుందని అర్థమవుతోంది.
అయితే ఈ గ్యాప్‌లో నటీనటులు ఎంపిక పూర్తిస్థాయిలో జరగనుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టాక్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


