breaking news
Tollywood Hero
-
ఆది సాయికుమార్ శంబాల.. తొలి రోజే ఊహించని వసూళ్లు
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు. Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025 -
శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.A HOUSEFULL festive day at the cinemas ❤️🔥People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025 -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్‌కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్‌కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్‌గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. -
'అనసూయ నీ రుణం తీర్చుకుంటా'.. శివాజీ మరోసారి వ్యంగ్య కామెంట్స్..!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ తీవ్ర దుమారానికి దారితీశాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు డ్రెస్సులను ఉద్దేశించి మాట్లాడారు. మీ బాడీ అంతా బయటికి కనపడేలా డ్రెస్సులు వేసుకోవద్దని కామెంట్స్ చేశారు. అదే సమయంలో హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో శివాజీ కామెంట్స్‌పై టాలీవుడ్ సినీతారలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.టాలీవుడ్ నటి అనసూయ సైతం శివాజీ కామెంట్స్‌పై స్పందించింది. ఈ బాడీ నీది కాదు.. మాది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో శివాజీ అభద్రతా భావంతో ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే జాలీగా ఉందని కూడా రాసుకొచ్చింది.అయితే ఇవాళ దండోరా టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శివాజీ ఈ అంశంపై మాట్లాడారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. ఆ రెండు పదాలు వాడడం నా తప్పేనని.. నా ఉద్దేశంలో మాత్రం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. అదే సమయంలో యాంకర్ అనసూయకు కౌంటరిచ్చారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా మిమ్మల్ని అన్నానా అండి? మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వాస్తవానికి ఆమె పేరునే కాదు.. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని.. హీరోయిన్లు అంటూ మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. నేను చేసిన కామెంట్స్‌పై ఆడపడచులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉంది. మీరు నామీద జాలి చూపించారు కదా. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.అసలు శివాజీ ఏమన్నారంటే.. ?శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు.అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని ? - Actor Sivaji pic.twitter.com/urw4aUrniQ— Telugu Chitraalu (@CineChitraalu) December 24, 2025 -
ఆ సంఘటన చూశాకే మాట్లాడా.. అదే నేను చేసిన తప్పు: శివాజీ
దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్‌పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్‌ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనాలనే ప్రెస్‌మీట్‌కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. -
సందీప్ కిషన్ కోలీవుడ్ మూవీ.. తెలుగు టీజర్ వచ్చేసింది.!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్‌తో పాటు అడ్వెంచరస్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. సారీ చెప్పిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్‌లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో శివాజీపై మహిళ నటీమణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అనసూయ శివాజీ కామెంట్స్‌పై తమదైన శైలిలో స్పందించారు. సినీతారలతో పాటు నెటిజన్స్ సైతం శివాజీపై మండిపడుతున్నారు. ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ పేరును ప్రసావించకుండానే ఆయన తరఫున క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు. నిన్న రాత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఈ నాగరిక సమాజం మహిళల నిర్ణయాల, ఇష్టాలు, వారి హక్కులను పరిరక్షిస్తుందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.మంచు మనోజ్ తన నోట్లో ప్రస్తావిస్తూ.. 'హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఇలాంటి దుస్తులే మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం ఏ మాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తుల ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవ పరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం' అని రాసుకొచ్చారు. Came across some deeply disappointing comments last night. A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025 -
ఫుల్ వయొలెంట్‌గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా?
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ గ్లింప్స్‌లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారని టాక్. -
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు.!
సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్ఐ, ఐపీ అడ్రస్‌లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. -
శ్రీకాంత్ తనయుడి సినిమా.. భారీ ధరకు ఓటీటీ డీల్.!
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ఛాంపియన్. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ మరింత పెరిగింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులు దాదాపు రూ.16 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ రేంజ్లో డీల్ సెట్ చేశారంటే మూమూలు విషయం కాదు. ఇప్పటికే రోషన్ మరో సినిమాకు రెడీ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. -
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల'. ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు'.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఓ గ్రామంలో జరిగిన మిస్టరీ సంఘటనలతో తెరకెక్కించినటలు తెలుస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలసంగీతమందించారు. -
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గుర్రం పాపిరెడ్డిదర్శకత్వం: మురళీ మనోహర్నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులువిడుదల తేదీ: డిసెంబర్ 19, 2025హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్‌పైనే కాస్తా బజ్ నెలకొంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.ఎలా ఉందంటే..డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్‌కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్‌తోనే అలరించాడు.ఫస్ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేశాడు.సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్‌కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్‌పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్‌లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.సింపుల్ కథను స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. కోర్టు రూమ్ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్‌నెస్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే.లీడ్ రోల్లో నరేశ్ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్‌కుమార్.. చిలిపిగా వంశీధర్‌గౌడ్, గొయ్యి పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్: 2.75/5 -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ కామెడీగా టీజర్
మాస్ జాతర తర్వాత రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాసామిరంగ బ్యూటీ ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ మూవీ రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీతో పాటు భార్య, భర్తల మధ్య జరిగే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. టీజర్ చివర్లో వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అనే రవితేజ కామెడీ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వారణాసి ఆలయంలో అఖండ-2 టీమ్.. నీ టైమ్ బాగుంది బ్రో!
బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ అఖండ-2. డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వారం ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ఆదరణ దక్కించుకోలేకపోయింది. గతంలో విడుదలై హిట్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా బాలయ్య, బోయపాటి ప్రముఖ ఆలయం వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అఖండ-2 రిలీజ్ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో బోయపాటి, బాలయ్య కనిపించడంతో భక్తులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అదే సమయంలో బాలయ్య భుజంపై ఉన్న కండువా కింద పడిపోయింది. కానీ ఫ్యాన్స్‌పై ఆగ్రహంతో రెచ్చిపోయే సైలెంట్‌గా కండువా తీసుకుని ముందుకు కదిలారు. ఇది చూసిన నెటిజన్స్ అదేంటి బాలయ్య ఇంతలా మారిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదృష్టం కొద్ది అతను బతికిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో చాలాసార్లు అభిమానులపై బాలయ్య చేయి చేసుకున్న సంఘటనల గురించి మనందరికీ తెలిసిందే. God of Masses #NandamuriBalakrishna garu and blockbuster director #BoyapatiSreenu garu visited the sacred city of Varanasi, took divine blessings after the Blockbuster success of #Akhanda2 🔱🔥Har Har Mahadev 🔱Book your tickets now!🎟️ https://t.co/8l5WolzzT6… pic.twitter.com/rOMNIQQ7sN— 14 Reels Plus (@14ReelsPlus) December 19, 2025 God Of Masses Nandamuri Balakrishna, Sensational Director Boyapati Sreenu Visited Varanasi Temple on the occasion of of #Akhanda2 Success pic.twitter.com/TfkCM6GqKG— idlebrain jeevi (@idlebrainjeevi) December 19, 2025 -
'బైరాన్‌పల్లి గడ్డమీదే సమాధి కావాలి'.. ఆసక్తిగా ఛాంపియన్ ట్రైలర్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే స్వాతంత్ర్యం కంటే ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బైరాన్‌పల్లి సంఘటన కూడా ఈ ట్రైలర్ చూపించారు. బ్రిటీష్ వారితో పోరాట సన్నివేశాలు ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. 'బైరాన్‌పల్లిలో మొదలైన తిరుగుబాటు ఆ గడ్డమీదే సమాధి కావాలి' అనే డైలాగ్ వింటే ఈ స్టోరీ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. From the pages of the history comes a revolutionary saga.The epic unfolds now.Presenting #ChampionTrailer to you all!▶️ https://t.co/dr9tYJMNMV#Champion in cinemas worldwide from DECEMBER 25th, 2025. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1… pic.twitter.com/rN2dxLp20z— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 18, 2025 -
'యాక్టింగ్ తెలియకపోయినా మాకు ఛాన్స్ ఇచ్చారు'.. రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్..!
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఛాంపియన్. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వైజయంతీ మూవీస్ సంస్థతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా దత్తు గారికి, వైజయంతి మూవీస్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మమ్మల్ని బలంగా నమ్మి.. మాకు నటన వస్తుందో రాదో తెలియకపోయినా సినిమాలు ప్రొడ్యూస్ చేశారని అన్నారు. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నంబర్1, అల్లు అర్జున్‌కు గంగోత్రి, మహేశ్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. ఇలా మా అందరికీ మోస్ట్ బ్యూటీఫుల్ పర్సన్ దత్తుగారేనని తెలిపారు. చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నా.. మాకు యాక్టింగ్ తెలియని టైమ్‌లో మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'గంగోత్రితో అల్లు అర్జున్ను, రాజకుమారుడుతో మహేశ్‌బాబును, చిరుతతో నన్ను హీరోగా పరిచయం చేశారు అశ్వనీదత్. ఆయనకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మాది సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ కావొచ్చు. మేం యాక్టింగ్ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వైజయంతి మూవీస్ వారసత్వాన్ని ప్రియాంక, స్వప్న కొనసాగిస్తున్నారు. అంకిత భావంతో పని చేసే ఇలాంటి నిర్మాతలతో సినిమాలు చేయడం అదృష్టం. రోషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ మూవీ పోస్టర్లలో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. నా రెండో సినిమా మగధీరలా.. రోషన్ రెండో చిత్రం ఛాంపియన్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. ఈ ఈవెంట్లో శ్రీకాంత్, దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు. -
'మనశంకర వరప్రసాద్ గారు'.. మేకింగ్ వీడియో చూశారా?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'మనశంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాద సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించారు. కేథరిన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.మూవీ రిలీజ్‌కు ఇంకా కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే మనశంకరవరప్రసాద్ గారు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సెట్స్‌లో అంతా నవ్వుల సందడే కనిపిస్తోంది. ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చిరంజీవి హవాభావాలు, నయనతార నవ్వులు ఫ్యాన్స్‌ను అలరించేలా ఉన్నాయి.ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాదికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో సూపర్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. -
హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్
మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్‌కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇవాళ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్ ఇచ్చారు. ది రాజాసాబ్ ప్రీమియర్స్ షోలు వేయనున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. జనవరి 8న ప్రీమియర్స్ ఉంటాయని సాంగ్ లాంఛ్ ఈవెంట్లో వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తామని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. JAN 8th - PremieresPre Release Event in Hyderabad #TheRajaSaab— The RajaSaab (@rajasaabmovie) December 17, 2025 -
'ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై..' మంచు మనోజ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్సే..!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డేవిడ్ రెడ్డి. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ మంచు మనోజ్ లుక్, వార్ డాగ్ బైక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'మరిగే రక్తం నిప్పులు కక్కింది.. గుండె వేగానికి నెేల కరిగింది' ..' ఏ బ్రిటీష్ ఇండియా నహీ హై.. ఏ డేవిడ్ రెడ్డికా ఇండియా హై' అనే డైలాగ్స్ మంచు మనోజ్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.ఇవాళ విడుదలైన డేవిడ్ రెడ్డి టీజర్ గ్లింప్స్ చూస్తుంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో విజువల్స్, డైలాగ్స్, డేవిడ్ రెడ్డి బైక్ ఈ మూవీపై ఆసక్తిని పెంచేశాయి. గ్లింప్స్ చూడగానే పీరియాడికల్ మూవీ అని చెప్పేయొచ్చు. తాజా గ్లింప్స్‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ చిత్రం కోసం మంచు మనోజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.War Dog… Ready to Roar 🔥🔥🔥Speed of #DavidReddy. A revolutionary tale that has become a part of me. Created something powerful with @itshanumareddy, something all of us will be proud of ❤️❤️ 🏍️ pic.twitter.com/Q9nGga1lSn— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 17, 2025 -
సతీమణి బర్త్ డే.. మెగా హీరో స్పెషల్ విషెస్!
మెగా హీరో వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ తన భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే బేబీ.. అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ఫోటోలను షేర్ చేశారు. ఇవీ చూసిన అభిమానులు లావణ్య త్రిపాఠికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోస్ట్ చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల బర్త్ డే విషెస్ తెలిపింది. కాగా.. నాగబాబు కుమారుడిగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుమారుడు జన్మించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడికి హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు. కాగా.. మట్కా మూవీ తర్వాత.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. టైటిల్ రివీల్
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాకు విష్ణు విన్యాసం అనే టైటిల్ ఖరారు చేశారు. మొత్తానికి హీరో పేరుతోనే మూవీ టైటిల్ పెట్టడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.తొలి రోజే మౌగ్లీ కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రీమియర్స్‌తో కలిసి ఈ మొత్తం కలెక్షన్స్ సాధించిందని తెలిపింది. వైల్డ్ బ్లాక్‌బస్టర్ అంటూ పోస్టర్‌ను షేర్ చేసింది.అయితే మౌగ్లీ ముందు అనుకున్న ప్రకారం ఈనెల 12నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా బాలయ్య నటించిన అఖండ-2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా మోగ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనెల 13న థియేటర్లలో రిలీజైంది. కాగా.. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు.#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥🎟️ https://t.co/HHe863GdbEA @SandeepRaaaj CinemaA @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY— People Media Factory (@peoplemediafcy) December 14, 2025 -
అఖండ-2 రిలీజ్.. మరో టీజర్ వచ్చేసింది
బాలయ్య అఖండ-2 వివాదం తర్వాత ఎట్టకేలకు రిలీజవుతోంది. నాలుగైదు రోజుల చర్చల తర్వాత ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అఖండకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు క్లియర్ కావడంతో ఈ శుక్రవారం అఖండ-2 థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మరో టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అఖండ-2 రిలీజ్ టీజర్ పేరుతో విడుదలైంది.తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై జీవో..తెలంగాణలో అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీ ప్లెక్స్‌ల్లో రూ.100 వసూలు చేసుకోవచ్చని జీవోలో తెలిపింది. ఈ పెంచిన ధరలు మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్ 11 రాత్రి 8 గంటల ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేట్ నిర్ణయించారు. పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం తప్పనిసరిగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించాలని జీవోలో వెల్లడించారు. అంతేకాకుండా మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా స్క్రీన్ చేయాలని సూచించారు. -
అఖండ-2 రిలీజ్.. బన్నీ వాసు కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా .. ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్దఎత్తున చర్చ జరిగింది. మూవీ మేకర్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ చిత్రాన్ని వేశారు. ఈనెల 5న విడుదల కావాల్సిన అఖండ-2.. చివరి నిమిషంలో అభిమానులకు షాకిచ్చింది.అయితే తాజాగా మరో కొత్త తేదీని ప్రకటించారు మేకర్స్. అఖండ-2ను డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 12న దాదాపు ఐదారు చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సందీప్ రాజ్ మౌగ్లీ, హెబ్బా పటేల్ ఈషా, సైక్ సిద్ధార్థ్ లాంటి చిత్రాలు ముందుగానే డేట్ ప్రకటించారు.కానీ ఊహించని విధంగా బాలయ్య అఖండ-2 ఇదే రోజున రిలీజ్ చేస్తున్నారు. దీంతో సందీప్ రాజ్ మూవీ మౌగ్లీ ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య సినిమా వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్‌కు అడ్డంకిగా మారింది. ఈ విషయంపై డైరెక్టర్ సందీప్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.తాజాగా ఇవాళ హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్లో అఖండ-2 సినిమా వల్ల బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు తప్పుకోవాల్సిన పరిస్థితిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న సినిమాలు తప్పుకుంటున్నాయా? అన్న ప్రశ్నకు నిర్మాత బన్నీ వాసు స్పందించారు.ఈ ప్రశ్నకు బన్నీ వాసు స్పందిస్తూ.. అఖండ-2ను పెద్దలారీతో పోల్చారు. చిన్న సినిమాలను చిన్న కారుగా అభివర్ణించారు. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం.. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే' అన్నారు. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం అంటూ బన్నీ వాసు కామెంట్స్ చేశారు.అయితే చిన్న సినిమాలను ఉద్దేశించి బన్నీ వాసు కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. చిన్న చిత్రాలను కించపరిచేలా బన్నీ వాసు వ్యాఖ్యలు ఉన్నాయంటూ సినీ ప్రియులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ శుక్రవారం బిగ్ స్క్రీన్‌పై రావాల్సిన ఈ చిత్రం.. అఖండ-2 దెబ్బకు క్రిస్మస్కు తరలిపోయింది.ఇండస్ట్రీ లో అందరు తప్పక "Jai Balayya" అని తప్పుకుంటున్నారా ?"Highway మీద పెద్ద vehicles కి దారి ఇవ్వకపోతే మనకే risk" - #BunnyVas#Akhanda2 #Balakrishna pic.twitter.com/p0ujehI0kR— Daily Culture (@DailyCultureYT) December 10, 2025 -
వెంకీమామ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ మూవీ ప్రేమంటే ఇదేరా రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 13న వెంకీ మామ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్‌కు అదే రోజు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ప్రేమంటే ఇదేరా 4కె ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా వెంకీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్ 13న రీ రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. కొత్త రిలీడ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో బర్త్‌డే రోజు ఈ సినిమాను థియేటర్లలో చూడాలనుకున్న వెంకీమామ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అఖండ-2 వాయిదా పడడం, చిన్న సినిమాలు రిలీజ్ ఉండడం వల్లే ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.కాగా.. 1998లో వచ్చిన ఈ మూవీకి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమకథా చిత్రంలో వెంకటేష్, ప్రీతి జింటా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.అశోక్‌కుమార్ సంయుక్తంగా నిర్మించారు.#PremanteIdera re-release postponed!Stay tuned for new release date! #PremanteIderaReRelease #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/qrXeoDrRAl— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2025 -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఫుల్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
మాస్ మహారాజా సంక్రాంతికి పోటీకి సిద్ధమైపోయాడు. ఇటీవల మాస్ జాతరతో మెప్పించిన రవితేజ.. భర్త మహాశయులకు విజ్ఞప్తితో మరోసారి అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో డింపుల్ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే ఏడాది పొంగల్ బరిలో నిలిచింది. రిలీజ్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. అద్దం ముందు అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఈ లవ్ సాంగ్ రవితేజ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. -
చిన్నారికి మెగా దంపతుల ఖరీదైన గిఫ్ట్.. గోల్డ్ చైన్‌తో పాటు..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఈ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో వెంకీమామ కూడా నటించారు. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్‌తో కలిసి నటించాలన్న తన కోరిక ఈ మూవీతో నెరవేరిందన్నారు.అయితే మెగాస్టార్ ఇటీవలే తన మేనేజర్ స్వామినాథ్ కుమార్తె నామకరణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపకు అలేఖ్య అని చిరంజీవి పేరు పెట్టారు. మెగాస్టార్ తమ కూతురికి పేరు పెట్టడంతో మేనేజర్ దంపతులు ఎమోషనలయ్యారు.ఈ సందర్భంగా చిరు దంపతులు తమ ప్రేమను చాటుకున్నారు. ఆ చిన్నారికి ఖరీదైన బహుమానం అందించారు. ఆ చిట్టి తల్లికి మెడకు గోల్డ్ చైన్ బహుకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతే కాకుండా దాదాపు కోటి రూపాయల విలువైన ల్యాండ్ బహుకరించారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మెగాస్టార్ దంపతులు తమ మేనేజర్ కుటుంబానికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025 -
'ప్రభాస్ ఇప్పటికీ సిగ్గుపడతాడు'.. మంగళవారం బ్యూటీ క్యూట్ పోస్ట్!
మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆర్ఎక్స్100 మూవీతో ఫేమ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. మంగళవారం మూవీతో సూపర్ హిట్ కొట్టేసింది. గతేడాది రక్షణ చిత్రంలో కనిపించిన భామ.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ నెట్టింట చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఎవరైనా అంత అమాయకంగా ఎలా ఉండగలరు? అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటోలను షేర్ చేసింది. సినీ ఇండస్ట్రీ మనల్ని చాలా కఠినంగా మార్చుతుంది.. అంతేకాదు మంద చర్మం గలవారిగా మార్చేస్తుంది. అయినప్పటికీ ఈ వ్యక్తి మాత్రం ఇప్పటికీ సిగ్గుపడతాడు.. అతని సిగ్గువల్ల చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే అతను అంత ముద్దుగా ఉంటాడా? దేవుడు అతన్ని దీవించునుగాక.. అంటూ ప్రభాస్ సో క్యూట్ తెగ పొగుడుతూ ట్వీట్ చేసింది ముద్దుగుమ్మ. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.How can someone be so innocent?The industry toughens people up, making them thick-skinned, yet this guy still blushes easily and speaks very little because of his shyness. Why so cute? God bless him 🪬♾️ pic.twitter.com/Y8w7ZZwcKp— paayal rajput (@starlingpayal) December 8, 2025 -
ఎన్టీఆర్ ఇంట్లో మీట్.. అఖిల్ బిగ్ ప్రాజెక్ట్ కోసమేనా?
సినిమాల్లో కేవలం స్టార్డమ్ ఉంటే చాలదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా ఉండాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు కొంతవరకు బెనిఫిట్ ఉన్నప్పటికీ.. అది పూర్తిస్థాయిలో రావాలంటే సొంతం పనిమీదే ఆధారపడి ఉంటుంది.అలా టాలీవుడ్ అగ్రకుటుంబం నుంచి వచ్చిన అఖిల్ అక్కినేనికి సరైన హిట్ పడడం లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ మూవీ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు అఖిల్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తోన్న యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం లెనిన్ . ఈ మూవీకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగానే అఖిల్‌కు సంబంధించి మరో టాక్ వినిపిస్తోంది. లెనిన్తో బిజీగా ఉన్న అఖిల్ మరో క్రేజీ ప్లాన్ చేస్తున్నారని చర్చ మొదలైంది. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్‌తో అఖిల్ మీట్ అయినట్లు లేటేస్ట్ టాక్ నడుస్తోంది. ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఖిల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంట్లో సమావేశమైనట్లు సమాచారం.అయితే ప్రశాంత్ నీల్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్‌తోనే ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశాంత్ నీల్ పర్యవేక్షణలోనే చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లెనిన్ ఈ మూవీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అఖిల్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
టాలీవుడ్ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్.. బాబు మోహన్ సందడి
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఈ మూవీకి వెంకట్ త్రినాథ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు బాబు మోహన్ హాజరయ్యారు.బాబు మోహన్ మాట్లాడుతూ... 'అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నా' అని అన్నారు.దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా మేము ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నిర్మాతలు నన్నే దర్శకత్వం వహించమన్నారు. ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ సినిమాను పూర్తి చేశాం. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. నా తొలి చిత్రానికి ఇంతగా సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. హీరో అవి తేజ్ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో నటించారు. ఈ సినిమా చూసి మీరు ఫీల్ గుడ్ అవుతారని హామీ ఇవ్వగలను. ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా" అని అన్నారు. డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాత కుమార్ అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, కోయల్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. -
'పదేళ్లలో ఏం మారలేదు.. ఆ ఒక్కటి తప్ప..'.. వితికా శేరు-వరుణ్ సందేశ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ ప్రముఖ జంటల్లో వితికా శేరు- వరుణ్ సందేశ్ ఒకరు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు చేరుకుంది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 19, 2016న వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ ఏడాది కొత్తింట్లో అడుగుపెట్టిన ఈ జంట సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.తాజాగా ఈ జంట తమ ఎంగేజ్మెంట్ రోజులను గుర్తు చేసుకుంది. నిశ్చితార్థం జరిగి సరిగ్గా నేటికి పదేళ్లు పూర్తయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పదేళ్ల మా ప్రేమలో అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు రాలేదని.. కేవలం మా వయస్సు సంఖ్య మాత్రమే పెరిగిందని పోస్ట్ చేశారు. మాకెలాంటి తొందర, గడువులు లేవు.. ఇప్పుడిప్పుడే మేమిద్దరం జీవితం గురించి నేర్చుకుంటున్నామని తెలిపారు. దశల వారీగా జీవితాన్ని నిర్మించుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వితికా శేరు- వరుణ్ సందేశ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీరిద్దరు ఇలాగే నూరేళ్లు సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.కాగా.. ఈ ఏడాది వరుణ్ సందేశ్‌కు ఆయన సతీమణి వితికా శేరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. వరుణ్ సందేశ్ పుట్టిన రోజున మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త వరుణ్ బర్త్‌డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
ఆంధ్ర కింగ్ తాలూకా.. రామ్ పాడిన ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగా తాలూకా(Andhra King Taluka Movie). ఈ మూవీకి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కింగ్డమ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పప్పీ షేమ్ అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను హీరో రామ్ ఆలపించడం ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. వివేక్- మెర్విన్ సంగీతం అందించారు. కాగా.. ఈ చిత్రంలో కన్నడ హీరో కీలక పాత్రలో నటించారు. -
నామకరణ వేడుకలో చిరంజీవి దంపతులు.. వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ కుమార్తె నామకరణ వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ స్వామినాథ్ కుమార్తెకు మెగాస్టార్ పేరు పెట్టారు. చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం అనిల్ రావిపూడితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్‌గారు వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన మీసాల పిల్ల సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ సైతం కీలక పాత్రలో నటించారు. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. Megastar @KChiruTweets Garu and Surekha Garu graced the naming ceremony of Manager Swamynath’s daughter today and blessed the baby girl with their warm wishes✨ pic.twitter.com/Tix55I0Dk1— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 5, 2025 -
టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. టీజర్ వచ్చేసింది..!
ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ డ్రైవ్. ఈ మూవీకి జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఇవాళ రిలీజైన టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సీన్స్ చూస్తే ఫుల్ గ్రిప్పింగ్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రాజా చెంబోలు, కమల్ కామరాజు, అనీష్ యోహాన్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఓషో వెంకర్ సంగీతమందించారు. -
'మనశంకర వరప్రసాద్‌గారు.. నా రోల్ ముగిసింది..' వెంకటేశ్ ట్వీట్
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించింది. అయితే సంక్రాంతి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ మామ ఇటీవలే మరో మూవీని ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు.మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లోనూ వెంకీ మామ సందడి చేయనున్నారు. అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో వెంకీమామ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు హీరో వెంకటేశ్. మనశంకర వరప్రసాద్ చిత్రంలో నా పాత్ర షూటింగ్ ముగిసిందని ట్వీట్ చేశారు.వెంకటేశ్ తన ట్వీట్లో రాస్తూ..'మనశంకరవరప్రసాద్ మూవీ కోసం ఈరోజు నా పాత్రను ముగించా. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఇష్టమైన మెగాస్టార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నో రోజులుగా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలనే కోరిక ఉండేది. చివరికీ ఈ ప్రత్యేక చిత్రం కోసం అనిల్ రావిపూడి మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.Wrapped up my part today for #ManaShankaraVaraPrasadGaru, and what an incredible experience it has been! Working with my favourite @KChiruTweets was an absolute joy and this film has left me with so many lovely memories. It was long overdue to share the screen with ‘Megastar… pic.twitter.com/KAzWcXGBeK— Venkatesh Daggubati (@VenkyMama) December 3, 2025 -
'ఆ హీరో సంగతి తర్వాత చూస్తా'.. టాలీవుడ్ నిర్మాత స్ట్రాంగ్ వార్నింగ్..!
టాలీవుడ్ నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రెండు సినిమాలలో వేలు పెట్టిన ఆ టాలీవుడ్ హీరో సంగతి తర్వాత చూస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ ఫిల్మ్ ఛాంబర్ దాకా వెళ్లిందని.. కానీ నేను మాత్రం వెళ్లలేదని తెలిపారు. నా సినిమాకు రూ.1.6 కోట్ల బడ్జెట్ అని చెప్పి.. రూ.4.8 అయ్యేలా చేశారని వెల్లడించారు.మాకు ఈ విషయం చెప్పకుండానే హీరోయిన్ సీన్స్ తీసేయించారని నిర్మాత అన్నారు. హీరోను డామినేట్ చేసేలా ఉన్నాయంటూ దాదాపు 15 నిమిషాల సన్నివేశాలను తీసేశారని ఆయన మండిపడ్డారు. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్గా నటించారని తెలిపారు. దీంతో ఆ తర్వాత సినిమా నుంచి డైరెక్టర్ తప్పుకున్నారని నిర్మాత పేర్కొన్నారు. అయితే ఆలా చేసిన ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్మాత సమాధానాలిచ్చారు. Producer Chandrasekhar opens up about the hurdles faced during the making of #TejaSajja’s #Adbhutam.#GOAT pic.twitter.com/LiaegRU8Xc— Australian Telugu Films (@AuTelugu_Films) December 2, 2025 -
'అమ్మాయిని ఎత్తుకొస్తే పది లక్షలు'.. నవ్వులు తెప్పిస్తోన్న టీజర్..!
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం గోట్(GOAT). కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.ఇవాళ గోట్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెళ్లి ఇష్టం లేని అమ్మాయి.. తనను ఎత్తుకొస్తే పది లక్షలు ఇస్తానంది.. ఐదు నీకు.. ఐదు నాకు అంటూ బ్రహ్మజీ చెప్పిన డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. కాగా.. ఈ సినిమాను జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. -
త్రివిక్రమ్- వెంకీ కాంబో.. ఆ టైటిల్ ఫిక్స్..!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఈ మూవీలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.అయితే మరోవైపు ఈ మూవీ టైటిల్‌పై కూడా టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టైటిల్‌పై సినీ ప్రియుల్లో చర్చ మొదలైంది.త్రివిక్రమ్ శ్రీనివాస్- వెంకటేశ్ మూవీకి టైటిల్ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. 'బంధు మిత్రుల అభినందనలతో' అనే టైటిల్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో 77వ సినిమాగా నిలవనుంది. ఈ సినిమా వెంకీతో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చవ్, వాసు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ మూవీని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. -
ప్రభాస్ ది రాజా సాబ్.. అత్తారింటికి దారేది నటుడి స్పెషల్ పోస్టర్..!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం " ది రాజా సాబ్". ఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ ఇరానీ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. కాగా.. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్,కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే. -
బాలయ్య అఖండ-2.. హైందవం సాంగ్ వచ్చేసింది
బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి హైందవం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. నాగ గురునాథ శర్మ లిరిక్స్ రాసిన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్‌గా గుర్తింపు పొందిన సింగర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మి పాడారు. ఈ పాట బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సాంగ్‌కు తమన్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే ఫస్ట్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ పాడారు. ఈ సాంగ్‌కు వంశీకాంత్ రేఖన సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలయ్య అఖండ-2.. ఒక్క టికెట్ కోసం లక్ష..!
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ చిత్రం అఖండ-2. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ ఆదరణ వస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అఖండ-2 మూవీ ఫస్ట్ టికెట్ కోసం ఓ అభిమాని ఏకంగా లక్ష రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. ఈ టికెట్ కోసం జర్మనీలో నిర్వహించిన వేలంపాటలో రాజశేఖర్ పార్నపల్లి అనే అభిమాని పోటీపడ్డారు. లక్ష రూపాయలు చెల్లించి సూపర్ ఫ్యాన్ టికెట్‌ను సొంతం చేసుకున్నారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Balayya Craze Peaks Worldwide! 🔥💥🔥💥‘Akhanda 2’ mania hits Germany too, the first fan ticket was auctioned for a whopping ₹1 lakh (1000 Euros)!Rajasekhar Parnapalli proudly grabbed it, proving once again… Balayya’s mass has no borders! 🌍🔥#Akhanda2 #Balayya pic.twitter.com/YZpACnTpTh— Balayya Philadelphia Fans (@NBKPhillyFans) November 29, 2025 -
ఆంధ్ర కింగ్ తాలూకా.. మూడో రోజులైనా అంతేనా?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా నిరాశపర్చింది. తొలి రోజు కేవలం రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.ఇక వీకెండ్ కలిసి రావడంతో వసూళ్లు కాస్తా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.10 కోట్ల మార్క్‌ను దాటేసింది.అయితే మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్ల రాబట్టడంలో ఆంధ్ర కింగ్ సక్సెస్ కాలేకపోయాడు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ మూడు రోజులైనా ఆ మార్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ వసూళ్లపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా.. ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే చాలు..!
రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాకు పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై రామ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా వీడియోను పంచుకున్నారు. ఇందులో సముద్రంలో సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో వీడియో చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా.. రన్ టైమ్ ఎంతంటే.!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా(యాడ్స్, టైటిల్స్‌తో సహా) ఉండనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. రామ్ పోతినేని ఎనర్జిటిక్ ఫర్మామెన్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఎమోషనల్‌గా అభిమానులను అలరించనున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో ఎమోషనల్ ఫర్మామెన్స్తో ఆకట్టుకోనున్నారు. ఈ మూవీలో రామ్ పాత్ర సినీ ప్రియులను కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తోంది. It is a U/A for #AndhraKingTaluka ❤🔥A film for all, a film relatable to all 💥GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 27th.BOOKINGS NOW OPEN!🎟️ https://t.co/LKMkGbt7jv#AKTonNOV27 Energetic star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/PlAdBO6p3w— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2025 -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. సెన్సార్ పూర్తి
రవి, శ్రీయ తివారి జంటగా నటిస్తోన్న చిత్రం విచిత్ర. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్బంగా దర్శక, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ..' “విచిత్ర మూవీ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందించిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసేలా హృదయాన్ని తాకే కథ. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసేలా తీశాం. ఫ్యామిలీ డ్రామాగా విచిత్ర నిలుస్తుందనే నమ్మకముంది. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త కోణంలో చూపించబోతున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జ్యోతి అపూర్వ, 'బేబీ' శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు నిజాని సంగీతమందించారు. -
'మీరు పెట్టిన ఆ పేరుతోనే'.. స్మరించుకున్న విజయ్ దేవరకొండ!
సత్యసాయి వందో జయంతి సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆయనను స్మరించుకున్నారు. నాకు చిన్నప్పుడు మీరు పెట్టిన విజయ్ సాయి అనే పేరుతోనే ప్రతి రోజు జీవిస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ ప్రపంచానికి దూరంగా మాకు విద్యను, ఎన్నో జ్ఞాపకాలను అందించిన వాతావరణాన్ని కల్పించారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మేమందరం ప్రతిరోజూ మీ గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా మంచి, చెడు సమయాల్లో. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా జీవితాల్లో వచ్చిన మార్పును తెలుసుకున్నాం. ప్రపంచానికి ఇవ్వడానికి మేము చేయగలిగిన విధంగా మాలో శక్తిని నింపారు. మీకు 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు మాతో పాటే ఎప్పటికీ జీవించే ఉంటారు' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.Happy Birthday Swami ❤️You gave me my name “Vijay Sai” when i was months old - a name that i work to live upto everyday.You gave us a safe environment, away from the world, where we got our education and made so many memories.We all always think about you everyday, more so… pic.twitter.com/gTnAltkHiO— Vijay Deverakonda (@TheDeverakonda) November 23, 2025 -
నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్.. టైటిల్‌తోనే భారీ హైప్!
తండేల్ సూపర్ హిట్ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya).. డైరెక్టర్ కార్తీక్ దండుతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చైతూ కెరీర్లో 24వ మూవీ కాగా.. ప్రస్తుతం ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గాల కనిపించనుంది.అయితే ఇవాళ చైతూ బర్త్ డే కావడంతో మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. చైతూ మూవీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు వృషకర్మ(VrushaKarma) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు నాగచైతన్య పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. ఈ పోస్టర్ చైతూ ఫ్యాన్స్‌న విపరీతంగా ఆకట్టుకుంటోంది. #VRUSHAKARMA it is for #Nc24 .@karthikdandu86 has something special coming your way for sure ! @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @Vrushakarma @Tseries @TseriesSouth pic.twitter.com/fwZbl0qxtO— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2025 -
బాలయ్య అఖండ-2.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2 (Akhanda 2 Trailer). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ది తాండవం, జాజికాయ లాంటి లిరికల్ సాంగ్స్‌ను రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను (Akhanda 2 Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు. బెంగళూరు వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అఖండ-2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్స్, మంచు కొండల్లో ఫైట్ సీన్స్ విపరీతంగా ఆకట్టుంటున్నాయి. కష్టమొస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి.. కష్టమొచ్చనా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే సనాతన ధర్మం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
అల్లు అర్హ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe— Allu Arjun (@alluarjun) November 21, 2025 Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025 -
నాగ చైతన్య మైథలాజికల్ థ్రిల్లర్.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గాల కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నాగచైతన్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. -
'ప్లీజ్ అన్నా.. సినిమాలు ఆపేయ్'.. నెటిజన్‌కు ప్రియదర్శి స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.మూవీ రిలీజ్‌కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్. అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమంటే కథేంటంటే..?మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. Mari em cheyyamantavGaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025 -
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్.. స్పందించిన ఉపాసన!
ఇటీవల మెగా కోడలు ఉపాసన చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఉపాసన యువతకు కెరీర్‌పై సలహాలిచ్చింది. అదే క్రమంలో అమ్మాయిలకు కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. పెళ్లి, పిల్లలు తర్వాతే అని ఉపాసన యువతను ఉద్దేశించి మాట్లాడింది. అంతేకాకుండా 30 అమ్మాయిలు తమ అండాలను భద్రపరచుకోవాలంటూ కామెంట్స్ చేసింది.దీంతో ఉపాసన చేసిన వ్యాఖ్యలను కొందర సమర్థించగా.. మరికొందరు తప్పుబట్టారు. అందరి పరిస్థితి మీలా ఉండదని ఫైరయ్యారు. ఇలాంటి వాటితో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ఉపాసన షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేశారు. ఉపాసన కామెంట్స్‌తో నెగెటివిటీ పెరగడంతో తాజాగా ఆమె స్పందించింది. ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది.నేను చేసిన కామెంట్స్‌పై ఆరోగ్యకరమైన చర్చ జరిగినందుకు సంతోషంగా ఉన్నా.. మీ గౌరవప్రదమైన స్పందనలకు ధన్యావాదాలు అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. మీరందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులు/ఒత్తిళ్లపై నా అభిప్రాయాలను నేను వ్యక్తం చేస్తున్నప్పుడు వేచి ఉండండి.. ఇక్కడ నా ఫోటోలు చూడటం మర్చిపోవద్దు.. సరైన వ్యాఖ్యలు చేయడానికి మీకు సహాయపడే చాలా ముఖ్యమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి.. ఇక్కడ ఉన్న యజమానుల కోసం ఎక్కువ మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి కలిసి పని చేద్దామంటూ ట్విటర్లో రాసుకొచ్చింది.అంతేకాకుండా సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?.. పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా?’ అంటూ తనపై వచ్చిన విమర్శలపై పలు ప్రశ్నలను సంధించింది ఉపాసన. అంతేకాకుండా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ నోట్‌ను కూడా ఉపాసన షేర్ చేసింది. నాకు 27 ఏళ్ల వయసులో పెళ్లయిందని తెలిపింది. నా 29 ఏళ్ల వయసులో ఆరోగ్య కారణాలతో ఎగ్స్‌ను ఫ్రీజ్ చేసుకున్నట్లు తెలిపింది. నాకు 36 ఏళ్ల వయసులో బిడ్డ పుట్టిందని.. ఇప్పుడు 39 ఏళ్లకు ట్విన్స్ పుట్టబోతున్నారని వెల్లడించింది. నా జర్నీలో కెరీర్.. పెళ్లి సమానంగా మేనేజ్ చేశానని ఉపాసన తెలిపింది. I’m happy to have sparked a healthy debate & thank your for your respectful responses. Stay tuned as I voice my opinions on the pleasures/pressures of privilege - that u all have been talking about. Don’t forget to check out my images ! It has very important facts that will… pic.twitter.com/rE8mkbnUPW— Upasana Konidela (@upasanakonidela) November 19, 2025 -
వారణాసిలో తెలుగు డబ్బింగ్.. ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తొలిసారి వస్తోన్న భారీ బడ్జెట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను దర్శకధీరుడు రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఈవెంట్ ప్లాన్ చేసి మరి టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రాండ్ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌కు మహేశ్ బాబు ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రతిష్టాత్మక గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లోనూ మెరిసింది బాలీవుడ్ బ్యూటీ. తన డ్రెస్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే అంతకుముందే ప్రియాంక ట్విటర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీరు తెలుగులో మాట్లాడతారా? ఈ సినిమాలో మీ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్తారా? అంటూ ప్రియాంకను కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు.దీనిపై ప్రియాంక చోప్రా తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. 'వారణాసి' కోసం తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించింది. అవును నేనే డబ్బింగ్ చెప్తా.. తెలుగు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. తెలుగు నా ప్రాథమిక భాష కాదని.. అందుకే రాజమౌళి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారని వెల్లడించింది. అంతకుముందు వారణాసి ఈవెంట్లో ఏదైనా తప్పులు దొర్లితే నన్ను క్షమించాలని అభిమానులను కోరింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో తగలబెట్టేద్దామా, మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అంటూ డైలాగ్స్‌తో ప్రియాంక చోప్రా అభిమానులను అలరించింది.కాగా.. వారణాసి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హేశ్‌బాబు రుద్రగా కనిపించనుండగా.. మందాకిని పాత్రలో ప్రియాంక మెప్పించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్.. అబ్బురపరిచిన డ్రోన్ షో
రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఇవాళ ఆంధ్ర కింగ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్స్ విజువల్స్ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇలా చేయడం తొలిసారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. -
బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్లో ఈవెంట్‌ను నిర్వహించారు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళిని మించినవారు ఎవరూ ఉండరు. అత్యంత భారీ బడ్జెట్‌తో తీయడమే కాదు.. ఆ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన దర్శకధీరుడే దిట్ట అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్న ఆయన టైటిల్ రివీల్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు.కానీ ఈ వేదికపై రాజమౌళి చేసిన కామెంట్స్‌తో చిక్కుల్లో పడ్డారు. తాను దేవుళ్లను నమ్మనంటూ ఆయన చేసిన కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. దీంతో రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక సంగతి అటుంచితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్‌పై మరో వివాదం నెలకొంది. వారణాసి అనే టైటిల్ పేరును రాజమౌళి గ్లింప్స్ రిలీజ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మూవీ టైటిల్‌పైనే వివాదం మొదలైంది. ఇప్పటికే హనుమంతునిపై వ్యాఖ్యలతో గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌పై విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు అది కాస్తా వారణాసి టైటిల్‌వైపు మళ్లింది. ఈ మూవీ టైటిల్ తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్లో తన కంప్లైంట్‌ను సమర్పించింది. ఒకవైపు తన కామెంట్స్‌తో వివాదం ఎదుర్కొంటున్న రాజమౌళికి టైటిల్ రూపంలో మరోసారి చిక్కుల్లోపడ్డారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్‌కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
ఆంధ్ర కింగ్ తాలూకా.. రిలీజ్ డేట్ ఛేంజ్!
మాస్ హీరో రామ్ పోతినేని(ram pothineni), భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్నూలులో ఈనెల 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలపై చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఒక రోజు ముందుగానే ఆంధ్రకింగ్ వచ్చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 27నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. దీంతో రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు అడ్వాన్స్‌గా పండుగ రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌కు రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుడగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. THANKS @filmymahesh for GIVING the content one day in advance! #AndhraKingTaluka is coming to you on #Thanksgiving #AKTonNOV27 #AndhraKingTaluka pic.twitter.com/55WgsZTvhN— RAm POthineni (@ramsayz) November 16, 2025 -
శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్‌టైమ్ వసూళ్లు!
నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన కల్ట్ మూవీ శివ. తెలుగు సినీ ఇండస్ట్రీ గతిని మార్చేసిన ఈ చిత్రమిది. 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీతోనే రాం గోపాల్ వర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ కల్ట్ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.ఈ మూవీని తాజాగా 4కె వర్షన్లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 14న వచ్చిన ఈ చిత్రం కోసం నాగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో తొలిరోజే ఈ చిత్రం ఏకంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సరికొత్త 4కె వర్షన్లో రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అప్పట్లోనే రూ.4 కోట్లు రాబట్టిన శివ.. రీ రిలీజ్లోనూ సత్తా చాటడం చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి 'శివ' ఇంకెన్ని కోట్లు కలెక్షన్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.#SHIVA THANDAVAM at the box office 👊🔥#Shiva4K grosses 3.95Crore worldwide in 2 days 💥💥💥Enjoy the weekend with cult in cinemas now!— https://t.co/vdUYG2JnoqExperience it in 4K DOLBY ATMOS with Music engineered by Artificial Intelligence. #50YearsOfAnnapurna… pic.twitter.com/xMV6otcgk3— Annapurna Studios (@AnnapurnaStdios) November 16, 2025 -
రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా.. ట్రైలర్ ముహుర్తం ఫిక్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్‌ను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.IT’S TIME!! 💥Get ready to witness Sagar’s Life Story soon.BIOPIC OF A FAN - #AndhraKingTalukaTrailer arrives on 18th November ❤️🔥#Andhrakingtaluka pic.twitter.com/ih8HqokJ7H— RAm POthineni (@ramsayz) November 16, 2025 -
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. టైటిల్‌తోనే హైప్!
టాలీవుడ్‌కు ఆణిముత్యంలా దొరికిన కమెడియన్ సత్య. అతని కామెడీ టైమింగ్ చూసి మరో బ్రహ్మనందం దొరికాడంటూ ఇప్పటికే ప్రశంసలొచ్చాయి. అటు నటుడిగా.. ఇటు కమెడియన్‌గా టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మత్తు వదలరా మూవీలతో సత్య తానేంటో నిరూపించుకున్నాడు. తెలుగు సినిమా కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు.తాజాగా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే చిత్రాలను తెరెకెక్కించిన రితేశ్ రాణానే సత్యను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు సత్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రాకి జెట్లీ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా సత్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. #RR4 is #JETLEE ❤🔥̶C̶o̶m̶e̶d̶i̶a̶n̶ ̶S̶a̶t̶y̶a̶ ̶ HERO #Satya in and not as #JETLEE ❤🔥A @RiteshRana's turbulence 🛫Entertainment takes off. Shoot begins 💥💥Starring #Satya, #RheaSingha, @vennelakishoreMusic by @kaalabhairava7Produced by @ClapEntrtmntPresented… pic.twitter.com/X99IRAAEVt— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2025 -
శర్వానంద్ బైకర్.. రిలీజ్‌కు ముందే ఫుల్ వీడియో సాంగ్
చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను జిబ్రాన్, యాజిన్ నైజర్, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
విలేజ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రాజు వెడ్స్ రాంబాయి.. ట్రైలర్ వచ్చేసిింది
అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీకి సాయిలు దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్)ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన అబ్బాయికి.. కుటుంబానికి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి కథే ఈ రాజు వెడ్స్ రాంబాయి అని ట్రైలర్లోనే తెలిసిపోతుంది. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. Their hearts beat as one, their love faces every storm ❤️🔥Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️▶️ https://t.co/lrlbW9zT95Launched by The Star of New Age Films @AdiviSesh garu💫#RajuWedsRambaiOnNov21st pic.twitter.com/RufYYOLkvA— Dolamukhi Subaltern Films (@dsfofficial_) November 13, 2025 -
'మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం రా'.. మోగ్లీ టీజర్ అదుర్స్
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా వస్తోన్న తాజా చిత్రం మోగ్లీ 2025(Mowgli Teaser). ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బబుల్ గమ్ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాక్షి సాగర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ టీజర్‌ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఈ కథ అంతా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు, డైలాగ్స్ చూస్తే ఈ కథేంటో ప్రేక్షకులకు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన డిసెంబరు 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతమందించారు. -
'నా కెరీర్లో ఇలా చేయడం తొలిసారి'.. అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అల్లరి నరేశ్ మాట్లాడుతూ..'ఇప్పటివరకూ కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ చేశా. మధ్యలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా ప్రయత్నించా. నా కెరీర్లో సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం ఇదే తొలిసారి. ఇదొక మల్టీ లేయర్ సబ్జెక్ట్. స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా మంది కొత్త డైరెక్టర్స్‌తో చేశా. కాసరగడ్డ నానికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న నాని పెళ్లి గిఫ్ట్‌గా ఈ సినిమా సక్సెస్ అందిస్తాం. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ రమేశ్ కేవలం 41 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఎక్కువ భాగం ఒకే ఇంట్లో షూట్ చేశాం. ఈ సినిమాలో ఎవరు విలన్ అనేది చివరి వరకు కనిపెట్టలేరు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. -
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳— Allu Arjun (@alluarjun) November 11, 2025 -
అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్‌కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్‌లో వెళ్తున్నారు. ఈ సారి మాస్కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. -
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్‌కు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్‌గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
'సినిమా తీయడం గొప్ప కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదన్నారు. మనం తీసిన సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడమే అసలైన సవాల్ అని తెలిపారు. ప్రెస్మీట్స్ పెట్టి ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మీరిచ్చే కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని సూచించారు. మార్నింగ్ షోకు ఆడియన్స్ తీసుకురావడమే గొప్పదనమన్నారు. మీడియా వాళ్లు కూడా పాజిటివ్‌గా రివ్యూలు ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలని దిల్ రాజు అన్నారు. మీరు అలా రాసినప్పుడే మార్నింగ్ ఫస్ట్ షోలకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన దిల్ రాజు మాట్లాడారు.కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాలు తీయడాలు, ప్రెస్ మెట్లు పెట్టి ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు..మార్నింగ్ షోకు జనాలను తీసుకొచ్చి, సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప! - #DilRaju#SanthanaPrapthirasthu pic.twitter.com/MxmRCTmP9s— Suresh PRO (@SureshPRO_) November 6, 2025 -
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు. -
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips) -
'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మరో ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్‌తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. -
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్‌ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్‌కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్‌ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
ప్రభాస్‌తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్‌లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్‌బాస్ షోలోనూ సందడి చేసింది.తాజాగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించింది. రష్అవర్ పేరుతో ట్విటర్ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్‌తో కలిసి నటిస్తారా? అలా జరిగితే మీ కాంబో హైప్ దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక.. ప్రభాస్‌తో నటించడం నాకు కూడా ఇష్టమే.. ఒకవేళ ప్రభాస్ ఈ మేసేజ్ చూస్తారని ఆశిస్తున్నా.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికీ బాలీవుడ్ భామ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది.😆😆😆😆🩷 I love it.. I hope Prabhas sir see’s this message and I hope we really do work together on something special soon! 🩷— Rashmika Mandanna (@iamRashmika) November 3, 2025 -
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్‌కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్‌గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్‌లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్‌గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే. -
నా అభిమానులకు అంకితమిస్తున్నా.. ఐకాన్ స్టార్ ట్వీట్
ప్రతిష్టాత్మక అవార్డ్‌ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను తాజాగా ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్‌లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నిలిచారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్‌గా దినేశ్ విజన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్ మాస్సే, నితాన్షీ గోయెల్ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఏఆర్ రెహమాన్ నిలిచారు. Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official My warm congratulations to all the winners across categories this year.A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…— Allu Arjun (@alluarjun) November 2, 2025 -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఇట్లు మీ ఎదవ ట్రైలర్ చూశారా?
త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. ఈ మూవీని యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్నారు. వెయేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ వేడుకలో విడుదల చేశారు. ఈ సినిమాను సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ కీలక పాత్రల్లో నటించారు. -
గ్రాండ్‌గా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇటీవలే వర్షం కారణంగా ఎంగేజ్మెంట్కు అటంకం కలిగిందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఇవాళ వాతావరణం అనుకూలించడంతో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. కాగా.. అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్‌కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ సాయంత్రం రిలీజ్ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్‌తో పాటే మూవీ రిలీజ్ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్‌గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. సతీసమేతంగా హాజరైన నిర్మాత
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా దిల్ రాజు ఇంట కూడా శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు సోదరి కుమార్తె పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్లి వేడుక ఫోటోలను దిల్ రాజు సతీమణి తేజస్విని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. పెళ్లిలో దిల్ రాజుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడిని వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
స్పిరిట్ మూవీ.. ప్రభాస్‌ను అలా చూపించనున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగా బిగ్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్తో బోల్డ్ డైరెక్టర్‌గా ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ స్పిరిట్లోనూ అదే పంథాను ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే స్పిరిట్లోనూ బోల్డ్ సన్నివేశాలు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ ఓ సీన్లో నగ్నంగా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.గ్లింప్స్ డైలాగ్ వల్లే రూమర్స్..ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్.. ఈ వార్తకు బలం చేకూరుతోంది. ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అనే చెప్పిన డైలాగ్‌తోనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ సినిమాలో నగ్నంగా కనిపించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్‌లో రణ్‌బీర్ కపూర్ ఓ సీన్లో న్యూడ్‌గా కనిపించారు. అదే పంథాను స్పిరిట్ విషయంలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్టార్ హీరోలతో బోల్డ్ సీన్స్ చేయించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పొచ్చు. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. -
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్‌తో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025 -
ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. గ్లింప్స్ రిలీజ్
లక్ష్మణ్ టేకుముడి , రాధికా జోషి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమ లేదని'. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్ బ్యానర్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందించినట్లు గ్లింప్స్‌లో సీన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మందు, సిగరెట్ కాదు.. అబ్బాయిలకు హానికరం అమ్మాయిలు అనే చివర్లో వచ్చే డైలాగ్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ రోజుల్లో ట్రెండ్‌కు తగినట్లుగానే ప్రేమలేదని మూవీని ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ సుహాస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సురేశ్ గురు, గాయత్రి కీలక పాత్రల్లో నటించారు. -
మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్ ఆనే సాంగ్‌ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్‌ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్ రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్స్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
శర్వానంద్ లేటేస్ట్ లుక్.. ఇంతలా మారిపోయాడేంటి?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్‌కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్‌గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్‌లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
బాలయ్య అఖండ-2.. బ్లాస్టింగ్ రోర్ వచ్చేసింది!
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న యాక్షన్ మూవీ అఖండ 2 తాండవ. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.తాజాగా అఖండ-2 నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. బ్లాస్టింగ్ రోర్ అనే పేరు ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఈ చిత్రంలోని ఫైట్ సీన్, డైలాగ్ బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.WHEN HE ROARS..THE WORLD TREMBLES💥💥💥#Akhanda2 BLASTING ROAR out now❤🔥Telugu - https://t.co/S6tFj0DKz3 Hindi - https://t.co/k0jOLGVJPITamil - https://t.co/HOylJFE0TSKannada - https://t.co/WNySTgpaPdMalayalam - https://t.co/XC4HA7vqrA IN CINEMAS WORLDWIDE FROM… pic.twitter.com/l6fQ0sux4I— 14 Reels Plus (@14ReelsPlus) October 24, 2025 -
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్‌తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్
సుమన్(Suman)..ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఆయన ఒకరు. అనుకోకుండా ఆయన జైలుకు వెళ్లడం.. ఆరు నెలల పాటు అక్కడే ఉండడంతో ఆయన కెరీర్‌కి పెద్ద దెబ్బ తగిలింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా హీరోగా సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూనే..మరోవైపు టీవీ సీరియల్స్‌లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించాడు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆయనకు చేతబడి చేశారట. కేరళకు వెళ్లి విరుగుడు పూజ చేయింకున్నాని సుమన్ చెప్పారు.‘నాపై చేతబడి జరిగిన మాట వాస్తవం. అయితే ఎవరు చేయించారనేది తెలియదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. బిజినెస్ రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ చేతబడి అనేది కేరళలో చాలా ఫేమస్. అక్కడ చోటనికరే అనే ప్లేస్ ఉంది. అక్కడ చేతబడి జరిగిన వాళ్లకి విరుగుడు పూజ చేస్తుంటారు. ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? ఎవరు చేయించారనేది తెలియదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేరళ వాళ్లకి దీని గురించి బాగా తెలుసు చేతబడి ఎలా ప్రయోగిస్తారు? దాన్ని తగ్గించడం.. మనస్పర్థలు తీసుకుని రావడం లాంటి విద్యలు చేస్తుంటారు. అది ఇప్పటికీ ఉంది.అప్పట్లో నాకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతుండడంతో కొంతమంది చెబితే అక్కడకు వెళ్లాను. విరుగుడు పూజ ఏదో చేయించారు. అది తప్పు ఒప్పు... ఉంది లేదని నేనేం చెప్పను. కానీ నేను టైమ్‌ని బాగా నమ్ముతా. ఈరోజు ఇది.. ఈ నెల ఇది.. ఈ సంవత్సరం ఇది అంటే అది జరిగితీరుతుంది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా.. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు. వాడు తొక్కేశాడు.. వీడు నొక్కేశాడు.. ఎక్కేశాడు. వీడి వల్ల అలా జరిగింది.. ఇలా జరిగిందని. బట్.. ఆ టైమ్ అలా జరిపిస్తుంది. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకి అలా చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది. అది కూడా వాళ్ల రాతే. దాన్నే కర్మ అని అంటారు. కర్మను నేను బాగా నమ్ముతాను. రోగాలు రావడం కూడా కర్మే. టైమ్‌ని బట్టి రోగాలు వస్తుంటాయి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని సుమన్ చెపుకొచ్చారు. -
దీపావళి వెలుగుల్లో మెరిసిపోతున్న పూనమ్ బజ్వా.. డిఫరెంట్‌గా శ్వేతాబసు ప్రసాద్!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ పూనమ్ బజ్వా..దీపావళి సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ బ్యూటీ శివాంగి జోషి..ఎల్లో శారీలో బుల్లితెర నటి మంజుల అందాలు..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్..ఢిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో శ్వేతాబసు ప్రసాద్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by C Sharp (@c___sharp) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) View this post on Instagram A post shared by Nandiniii🕊 (@nandiniguptaa13) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) -
రెబల్ స్టార్ బర్త్ డే.. 20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న ఛార్మి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇక డార్లింగ్ కొత్త సినిమాల అప్డేట్స్ సైతం అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందరూ ఉహించినట్లుగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్‌కు పలువురు టాలీవుడ్ సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభాస్‌తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. తాజాగా హీరోయిన్ ఛార్మి సైతం డార్లింగ్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించిన పౌర్ణమి రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.(ఇది చదవండి: ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన)ఈ సినిమాలో ప్రతి సీన్ ఇప్పటికీ గుర్తుందని రాసుకొచ్చింది. పౌర్ణమి మూవీతో నాకున్న ఉత్తమ జ్ఞాపకాలలో ఒకటని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ సినిమాతో మొదలైన ప్రభుదేవా, త్రిషతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించింది. మా అభిమాన రెబెల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి విష్ చేసింది. కాగా..2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఛార్మి, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. After 20years,#Pournami a film which is very very close to all of us is re-releasing today on our darling #Prabhas’s birthday. I still remember each and every moment so strong and so beautiful, one of my best memories i have with pournami and even after 20years,… pic.twitter.com/kbGKXmhlmI— Charmme Kaur (@Charmmeofficial) October 23, 2025 -
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రవ్దీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్‌లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Zainab Ravdjee (@zainabravdjee) -
మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!
మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్కమ్ టూ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్‌ను చిరంజీవి మై బ్రదర్ అని పిలవగా.. చిరుసర్.. మై బాస్ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025 -
సజ్జనార్‌కు ఎన్టీఆర్ అభిమాని ఫిర్యాదు.. ఎందుకంటే?
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోతోంది. వారి ఫోటోలను ఎలా పడితే అలా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ స్టార్స్ ఇలాంటి వాటి బారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి సీపీని కలిసి ఫిర్యాదును సమర్పించారు.తమ హీరో ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఇప్పటికే చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. We sincerely thank Hyderabad Commissioner of Police Mr. V.C. Sajjanar, IPS garu, and the entire Hyderabad Police Department for their prompt response and assurance to take swift and appropriate action against those responsible for morphing and posting objectionable content… pic.twitter.com/Pg4dX2k4in— NandipaTi muRali (@NtrMurali9999) October 22, 2025 -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కానీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు. Who’s the culprit behind spreading fake news on #NTRNeel ?Some Paid Agenda working behind.... https://t.co/q16nhnWksa— prashanth Neel (@Prashant_neell) October 21, 2025 -
పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు శిరీష మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవలే శిరీష సోషల్ మీడియా వేదికగా పసుపు దంచే కార్యక్రమం అంటూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.తాజాగా నారా రోహిత్- శిరీషల పెళ్లి వేడుకకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు వీరి గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా జరగనుంది.(ఇది చదవండి: నారా రోహిత్ పెళ్లి సందడి.. హీరోయిన్ ఇంట హల్దీ ఫంక్షన్)ఆ సినిమాతో శిరీషతో పరిచయం..నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.రోహిత్ కెరీర్..బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.Two hearts. One destiny. Infinite memories ahead ❤️The beautiful journey of #NaraRohith & Sireesha begins with a celebration as grand as their love story 💍A 4-Day grand wedding festivities to be held in Hyderabad with the Muhurtham on 30-10-25 ❤️Here’s to forever filled… pic.twitter.com/AqGedliw78— Ramesh Bala (@rameshlaus) October 22, 2025 -
వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్‌పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. అంతేకాకుండా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ సరసన కనిపించనున్న హీరోయిన్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ హీరోయిన్ పేరును వెల్లడించింది. కేజీఎఫ్‌తో స్టార్డమ్ దక్కించుకున్న శ్రీనిధిశెట్టి ఈ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి పోస్టర్‌ను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్లో నాని హిట్- 3, ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలతో మెప్పించింది. కాగా..ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో 77వ సినిమాగా రానుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు.Here’s wishing the gorgeous and graceful @SrinidhiShetty7 a fantastic Birthday! ❤️#HBDSrinidhiShetty 💫Excited to have you join the journey of our Production No.8 | #Venky77 | #VenkateshXTrivikram | 🎬Victory @VenkyMama #Trivikram #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/AALKT17vZ4— Haarika & Hassine Creations (@haarikahassine) October 21, 2025 -
దీపావళి మరింత స్పెషల్.. వారసుడితో వరుణ్ తేజ్ సెలబ్రేషన్స్!
దీపావళి వచ్చిందంటే చాలు.. సినీతారల సందడి మామూలుగా ఉండదు. కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ దీపావళిని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండుగ టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ దంపతులకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. తమ ముద్దుల వారసుడితో కలిసి దీపావళిని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితమే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఇటీవలే బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
దీపావళి వేడుకల్లో నాగచైతన్య-శోభిత.. పెళ్లి తర్వాత తొలిసారిగా..!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) దంపతులు దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా తొలిసారి దివాళీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైతూ సతీమణి శోభిత ధూలిపాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. గతేడాది డిసెంబర్లో చైతూ-శోభిత వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేశ్ కూడా పాల్గొన్నారు. కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గతేడాది తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
శర్వానంద్ కొత్త సినిమా.. టైటిల్ రివీల్ చేసిన మేకర్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ దిపావళీకి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లేటేస్ట్ మూవీ టైటిల్‌ను రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించారు. బైక్‌పై శర్వానంద్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు బైకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించునున్నారు. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. #Sharwa36 is #BIKER 🏍️🏁May you conquer every corner, every jump and every obstacle in life and aim for glory 🏁Wishing you a Happy Diwali 🪔✨#GoAllTheWay #BikerMovieCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj… pic.twitter.com/zKUND8GQwL— UV Creations (@UV_Creations) October 20, 2025 -
ఎలన్ మస్క్ ఎరికేనా మీకు.. ఆ రాకెట్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న లేటేస్ట్ ప్రోమో!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఛాన్స్ వస్తే చాలు ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దివాళీ కావడంతో మరో ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్‌ను కూడా విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రోమోలో పటాకుల దుకాణంలో నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన హంగామా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అరే హ్యాపీ దివాళీ అన్న.. ఏం కావాలి అన్న.. ఏమీ దొరుకుతాయి ఇక్కడ అని కస్టమర్ అనగానే.. పట్టు చీరలు, శిల్క్ శారీలు అన్నీ ఉన్నాయి.. పటాకాయల షాపుకొచ్చి పట్టుచీరలు దొరుతుతాయా అన్నా అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. ఎల్లన్న.. అంటే ఎలన్ మస్క్ ఎరికేనా నీకు.. మార్స్‌లో నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పంపించిన రాకెట్స్ ఇవే.. సేమ్ పీస్.. అందుకే వారంటీ కోసం మస్క్ ఫోటో కూడా వేయించా.. మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి.. మనం నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాచ్‌మెన్‌ను పంపిస్తాం.. ఈ డబ్బులు ఉన్నోళ్లు ఏంది రాకెట్స్ పంపిస్తరు.. పైసలు ఉన్నోళ్ల పైత్యం లే.. అంటూ ప్రోమో ఫుల్ కామెడీతో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. JaaneJigars. First song from #AnaganagaOkaRaju BLASTING SOON 🔥🔥 Mee andariki Deepavali Subhakankshalu. Love you guys. Can’t wait for Sankranthi😍🔥Here is the DIWALI BLAST promo 💣▶️ https://t.co/YI94w3Q97c @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/5jHE399ZXg— Naveen Polishetty (@NaveenPolishety) October 20, 2025 -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్‌తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్‌రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
సుధీర్ బాబు జటాధర.. ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. 'పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ కథను ధనపిశాచి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సోనాక్షి సిన్హా ధనపిశాచి పాత్రలో విశ్వరూపం చూపించింది. నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కథేంటో ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులను తెలిసిపోతోంది. -
మీ ఫేవరేట్ హీరో ఎవరు?.. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నారంటే?
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్‌బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు. Ranbir kapoor ! Fan boy moment Yet to happen— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025 -
ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.కాగా..ఇటీవల దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4— Team Megastar (@MegaStaroffl) October 16, 2025 -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌తో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్.. రిలీజ్లో ట్విస్ట్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM. Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025 -
గ్రాండ్‌గా నార్నే నితిన్ పెళ్లి వేడుక.. బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడి!
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో సందడి చేశారు. పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం. Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025 -
అట్లీ మూవీ షూటింగ్ గ్యాప్.. విదేశాల్లో వాలిపోయిన బన్నీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏఏ22 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ముంబయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐకాన్ స్టార్ వెకేషన్లో చిల్ అవుతున్నారు. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను బన్నీ భార్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
సర్వస్వం నువ్వే.. నా జీవితంలో ఆదర్శం నువ్వే.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025 -
20 నెలల తర్వాత మళ్లీ.. వెంకీమామ మూవీపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను ఇటీవలే ప్రకటించారు. అనిల్ రావిపూడితో కలిసి బ్లాక్‌బస్టర్ విక్టరీ కొట్టిన వెంకటేశ్ నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీని కుటుంబ కథాచిత్రంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో 77వ చిత్రంగా నిలవనుంది. వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. వీరిద్దరి కలిసి మరోసారి మ్యాజిక్‌ను సృష్టించడానికి సెట్స్‌పైకి వెళ్లనున్నారని రాసుకొచ్చారు. వెంకీతో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P— Naga Vamsi (@vamsi84) October 8, 2025 -
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్‌గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్‌కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్ వీడియో వైరల్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025 -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్‌లో ఉన్న పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్‌కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
నా డ్రీమ్ అదే.. నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలని!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సన్నిదిలో విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్‌లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు. Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
రాయలసీమ బిడ్డగా ఎంతోమందికి స్ఫూర్తి: సతీమణిపై మంచు మనోజ్ ప్రశంసలు
టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్‌గా అభిమానులను అలరించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఏడాది గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు మంచు మనోజ్. భైరవం తర్వాత మిరాయ్ మూవీతో ఆకట్టుకున్నారు.ఇదిలా ఉంచితే మంచు మనోజ్ 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. తాజాగా అక్టోబర్ 4న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన భూమా మౌనిక.. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది. టెన్షన్లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం, స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు. ధైరవ్, దేవసేన.. లిటిల్ జోయాకు తల్లిగా.. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్. మా ఇంటిని నవ్వులతో నింపేశావ్. నమస్తే వరల్డ్ సీఈవో, వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా.. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని' కొనియాడారు.నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు.. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు.. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను.. నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు. నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్‌లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. Dear @BhumaMounika thalli, You are the very meaning of Adhi Parashakti. From the day you entered my life, I have seen the magic of your silence in chaos, your grace even in hardship, and your unshakable compassion for people, even those who hurt you. That strength and purity… pic.twitter.com/LgjNwgCENv— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2025 -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్‌తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు. -
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్‌తోనే!
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్‌తో జతకట్టారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. SKY IS THE LIMIT…🔥#NaniXSujeeth @NameisNani @Sujeethsign pic.twitter.com/lIylWc2taZ— Niharika Entertainment (@NiharikaEnt) October 2, 2025 With @NameIsNani anna 🤗❤️#NaniXSujeeth pic.twitter.com/gDBYKZtoD4— Sujeeth (@Sujeethsign) October 2, 2025 -
డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT— ahavideoin (@ahavideoIN) October 2, 2025 -
జూనియర్ ఎన్టీఆర్ దేవర-2.. కొరటాల శివ బిగ్ ప్లాన్!
జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్ఫుల్ రోల్‌ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్ఫుల్ రోల్‌కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY— Movie Tamil (@_MovieTamil) September 30, 2025 -
బాలయ్య కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా చేయొద్దన్న చిరంజీవి
మెగా అభిమాన సంఘాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఫ్యాన్స్‌కు వద్దని వారించారు. అది మన సంస్కారం కాదంటూ అఖిల భారత చిరంజీవి యువతకు సూచించారు. మెగాస్టార్ విజ్ఞప్తితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న అభిమానులు విరమించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఫ్యాన్స్.. బాలయ్యపై పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.మెగాస్టార్ వద్దని వారించడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. అభిమాన సంఘాల విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అప్రమత్తమై వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. -
ప్రభాస్ డార్లింగ్స్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్‌కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్‌గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్‌గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సతీమణికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లనున్నారు. Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x— Allu Arjun (@alluarjun) September 29, 2025 -
పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ కమెడియన్.. ఆసక్తిగా టైటిల్!
జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు లాంటి చిత్రాలతో మెప్పించాడు. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో వస్తోన్న ఐదో చిత్రానికి హైలెస్సో అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈ మూవీకి కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. With the divine blessings of Gangalamma Thalli, we humbly begin our journey🙏Here's #HaiLesso Motion Poster🔥In Telugu, Tamil, Malayalam & Kannada✨ @Iamnatashasingh @naksha_saran #AksharaGowda @actorsivaji @sivacherry9 #Ravikiran @iamkumarkota @anudeepdev @ChotaKPrasad… pic.twitter.com/1I7DyDkBRI— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 An arrival of our holy diety in her fierce avatar ❤️🔥@sudheeranand's next #SS5 titled as #HaiLesso 🔥A divine & rooted tale of our culture is coming to thrill you all 🙏💥Shoot begins soon⌛️In Telugu, Tamil, Malayalam & Kannada✨ Directed by @iamkumarkotaProduced by… pic.twitter.com/KtYZR7LyD0— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 -
తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ పోస్ట్ చేశారు.రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
మిరాయ్ టీమ్‌పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్‌లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్‌గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్‌ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్‌ను ఐకాన్ స్టార్ అభినందించారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025 -
మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్‌ను బ్యాడ్‌న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025 -
ఇప్పటికే టికెట్ రూ.1000.. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్‌కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.ఒక్కో టికెట్ రూ.1000..ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. -
'అసలు పాసులు ఎందుకిచ్చావ్'.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఘోర అవమానం!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నెల 21 భారీస్థాయిలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్డేడియంలో ఓజీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఎంతో ఆశతో ఈవెంట్‌కు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాసులు ఉన్న తమను లోపలికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు స్టేడియం గేటు బయటే వేచి చూశామని అభిమానులు వాపోయారు. మాకు పాసులు ఇచ్చిన లోపలికి పంపకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం అంతా ఖాళీగానే ఉందని.. తమను ఎందుకు పంపరని పోలీసులపై మండిపడ్డారు.ఇది బైట ఉన్న Fans పరిస్థితి !🙏🏻What a management of Telangana Police services truly excellent with this worst…#TheyCallHimOG #PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/ixIFG1Z1Dr— Karthikuuu (@Anchor_Karthik_) September 21, 2025 -
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను..!
సినీ రంగంలో స్టార్ అనే హోదా చాలామందికి వస్తుంది. కానీ ఆ గుర్తింపును కెరీర్ మొత్తం కొనసాగించాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ అనిపించుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. మన తెలుగు సినీరంగంలో అలాంటి ఘనత సొంతం చేసుకున్న హీరో ఆయనొక్కరే. మన టాలీవుడ్లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్. ఆయనే మన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.చిరంజీవి తన కెరీర్ మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ ముందు మెగాస్టార్‌గా నిలబెట్టిందన్నారు. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్)చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'22 సెప్టెంబర్ 1978 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను.. ప్రాణం ఖరీదు.. చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్‌గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావీ కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ... కృతజ్ఞతలతో మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర, మనశివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. ఇవాళ తన తొలి సినిమా పూర్తై 47 ఏళ్లు కావడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.22 సెప్టెంబర్ 1978'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025 -
'మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ..' మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై మా ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి. ఈ ప్రత్యేక రోజున మీకు ఆనందం, ప్రేమ, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా. మీరు దర్శకత్వంలో రానున్న సినిమాటిక్ మ్యాజిక్‌ను అందరూ ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. తొలిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఏఏ22 పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు.Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp— Allu Arjun (@alluarjun) September 21, 2025 -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. ఇంటర్నేషనల్ షూట్‌కు అంతా రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు వెళ్లారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. యంగ్ టైగర్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్‌కు విచ్చేసిన ఎన్టీఆర్‌ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్‌లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025 -
రవితేజ వారసుడి కొత్త సినిమా.. మాస్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న చిత్రం మారెమ్మ. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ మాధవ్ భూపతిరాజు పుట్టినరోజు కావడంతో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.తాజా గ్లింప్స్ చూస్తే మాధవ్ మాస్ లుక్‌లో కనిపించాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ యాక్షన్ హీరో లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్నారు. కాగా.. మాధవ్ ఇప్పటికే మిస్టర్ ఇడియన్ అనే చిత్రంలో కనిపించారు. -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
వరుణ్ తేజ్‌కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్‌తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్‌కు పోలాండ్‌కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్‌తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్‌తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్‌ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను కపిల్ కపిలన్ ఆలపించారు.


