సంక్రాంతి సినిమాకు బంపరాఫర్.. ఎమ్మార్పీకే టికెట్స్..! | Nari Nari Naduma Murari Movie Ticket Offers for Sankranthi Festival | Sakshi
Sakshi News home page

Nari Nari Naduma Murari Movie: సంక్రాంతి సినిమాకు బంపరాఫర్.. ఎమ్మార్పీకే టికెట్స్..!

Jan 12 2026 2:59 PM | Updated on Jan 12 2026 3:28 PM

Nari Nari Naduma Murari Movie Ticket Offers for Sankranthi Festival

ఈ సంక్రాంతి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్‌గారు రిలీజై థియేటర్లలో అలరిస్తున్నాయి. వీటితో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. ఈ నెల 14న శర్వానంద్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఆడియన్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. నారీ నారీ నడుమ మురారి మూవీ టికెట్ ధరలపై క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేసింది. కేవలం ఎమ్మార్పీ ధరలకే ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి  వైద్య హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement