రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్‌ సింగిల్ అప్‌డేట్ | Ram Charan peddi Movie Latest Update Goes viral | Sakshi
Sakshi News home page

Peddi Movie: రామ్ చరణ్ పెద్ది మూవీ.. మాస్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Feb 26 2026 9:00 PM | Updated on Feb 27 2026 8:55 AM

Ram Charan peddi Movie Latest Update Goes viral

రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే…  నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్‌ను అలరించనుంది.

కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్‌ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement