'అప్పుడెందుకు వాళ్లని ఆపలేదు'.. శివాజీకి అర్జున్ రెడ్డి నటి కౌంటర్..! | Tollywood Actress Aditi Myakal Comments About Sivaji Remarks On Dresses, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Aditi Myakal: 'బికినీ వేసుకుని రోడ్డుమీదకి వెళ్లలేం కదా?'.. శివాజీకి అర్జున్ రెడ్డి నటి కౌంటర్

Feb 26 2026 5:38 PM | Updated on Feb 26 2026 6:19 PM

Tollywood actress Aditi Myakal comments about sivaji  remarks on dresses

హీరోయిన్స్‌ దుస్తులను ఉద్దేశించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదం సృష్టించాయి. ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ సంఘటన తర్వాత ఓ మూవీ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడారు. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో రెండు పదాలు వాడారు. అప్పట్లో ఈ కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.

తాజాగా శివాజీ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ నటి అదితి మైకల్ స్పందించింది. శివాజీ సినిమాలు చిన్నప్పుడు నేను కూడా చూసేదాన్ని అని తెలిపింది. ఒక అమ్మాయి డ్రెస్‌ గురించి మీరు మాట్లాడుతుంటే భయమేస్తోందని వెల్లడించింది. అప్పుడు మీ సినిమాల్లో హీరోయిన్స్ అలాంటి బట్టలు వేసుకున్నారు.. అప్పుడు మీరెందుకు చెప్పలేదని శివాజీని ప్రశ్నించింది. అప్పుడు మనకెందుకని.. మీరు మీ పని చేసుకుని వెళ్లిపోయారు కదా.. అప్పుడు వాళ్లను ఎందుకు ఆపలేదని నిలదీసింది.

ఇలాంటి దుస్తులు వేసుకోవడం నాకిష్టమని.. ఇదే నాకు ఫుడ్ పెడుతోందని అదితి తెలిపింది. అలాగని నేను బికినీ వేసుకుని రోడ్డుమీదకి వెళ్లట్లేదు కదా అని పేర్కొంది. ఒకసారి నేను అమీ తుమీ ప్రమోషన్స్‌కు బస్సులో వెళ్లినప్పుడు.. ఓ వ్యక్తి ఏకంగా నా ఛాతి భాగాన్ని టచ్ చేశాడని వెల్లడించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ అమ్మాయిల రుద్దడం ఆపేయండని శివాజీకి అదితి కౌంటరిచ్చింది. మేము ఇప్పటికే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపింది. కొందరైతే మీ లో దుస్తులు బయటికి కనిపిస్తున్నాయని సరిగా వేసుకోండని చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అదితి మ్యాకల్ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారితీశాయి. 

కాగా.. అదితి.. టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత అమీ తుమీ, ఏకం, 24 కిస్సెస్, రాధ, షాదీ ముబారక్ లాంటి చిత్రాల్లో నటించింది. మొదట వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన అదితి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement