breaking news
Tollywood Actress
-
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను.. 'దృశ్యం' పాప (ఫొటోలు)
-
హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్‌తో ఫుల్ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)
-
చీర కట్టుతో శెట్టి..చూపుతిప్పుకోనివ్వని నిధి..(ఫోటోలు)
-
‘హాయ్’ అంటున్న నయన‘తార’.. (ఫోటోలు)
-
హస్తకళల ప్రదర్శనలో అమల సందడి.. (ఫోటోలు)
-
బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు
-
శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు
-
షావుకారు జానకి సిస్టర్స్.. ఆ ఒక్కటీ చేయకలేకపోయారు..!
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో జానకి పేరు మార్మోగింది. అప్పటి స్టార్ హీరోలందరితో ఆమె సినిమాలు చేసింది. అయితే ఆమెతో పాటే సొంత చెల్లెలు కృష్ణకుమారి సైతం హీరోయిన్గా రాణించారు. ఒకప్పుడు వీళ్లిద్దరే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్స్ హీరోయిన్లుగా ఎదిగారు.(ఇది చదవండి: షావుకారు జానకి.. తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?)కేవల ఏడాది గ్యాప్‌లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కాచెల్లెళ్లు దశాబ్దాల పాటు సినిమాల్లో కొనసాగారు. కానీ విచిత్రం ఏంటంటే.. ఈ సిస్టర్స్ తమ కెరీర్లో ఒక్కసారి కూడా కలిసి ఏ ఒక్క మూవీలోనూ నటించలేదు. షావుకారు జానకి తమిళ చిత్రాల వైపు దూసుకెళ్లగా.. కృష్ణకుమారి తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించారు. వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌ను వేర్వేరుగా ఉంచాలనే విధానం.. 1976లో కృష్ణకుమారి సినిమాలకు గుడ్ బై చెప్పడంతో అక్కాచెల్లెళ్లను ఒకే తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. కాగా.. కృష్ణకుమారి 2018లోనే కన్నుమూశారు. -
షావుకారు జానకి.. తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?
మరో దిగ్గజ సినీతార నింగికెగిసింది. దశాబ్దాల పాటు అభిమానులను మెప్పించిన అలనాటి కథానాయిక కథ ఇక ముగిసింది. దాదాపు 400లకు పైగా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన నాట్య మయూరి ఇక సెలవు తీసుకుంది. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ తుదిశ్వాస విడిచింది. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది.ఈ విషాద సమయంలో జానకి గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తొలి సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నారనే టాపిక్ ఆసక్తిగా మారింది.షావుకారు జానకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది షావుకారు మూవీనే. అందుకే ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ మూవీకి గానూ జానకికి రూ.2500 రూపాయలు ఇచ్చారని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పట్లో ఆర్థికంగా చితికిపోతున్న రోజుల్లో నాకు రెండన్నర్ర లక్షలుగా కనపడిందని జానకి పేర్కొంది. ఇది నాకు ఓ వరంలాగా అనిపించిందని జానకి వెల్లడించింది. -
డాక్టరేట్ షావుకారు జానకి.. అసలు ఆమె ఏం చదివారో తెలుసా?
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, డాక్టరేట్స్ కూడా అందుకున్నారు. రెండు నంది అవార్డులతో పాటు భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ కూడా ఆమెను వరించింది. అలా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న జానకి.. చదవింది కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమేనని తెలుస్తోంది.గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన జానకి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు ఎన్నో డాక్టరేట్స్ వచ్చినప్పటికీ నేను కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమే చదువుకున్నానని తెలిపింది. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో చదివినట్లు పేర్కొంది. ఆమె చదివింది కేవలం మెట్రిక్యులేషన్ మాత్రమే అయినప్పటికీ.అరిజోనా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ అందుకున్నారు. -
అతిలోక సుందరిని పరిచయం చేసిన జానకి
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన ఆమె.. తుదిశ్వాస విడిచారు. తెలుగు వెండితెరపై తనదైన ముద్రవేసిన షావుకారు జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి స్టార్‌గా ఎదిగారు. ఇవాళ ఆమె మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.జానకమ్మ మరణం వేళ జానకమ్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దివంగత నటి శ్రీదేవిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జానకమ్మ గారే. ఆరేళ్ల వయసులోనే బాలనటిగా శ్రీదేవిని వెండితెరపైకి తీసుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్లో రాజేశ్వరి(శ్రీదేవి అమ్మ) పాపను పట్టుకుని దూరంగా నిలబడి చూస్తున్నారు.అదే సమయంలో డైరెక్టర్ మురుగన్ ఓ చిన్న పిల్లాడు కావాలని అడిగారు. దీంతో నేను వెంటనే శ్రీదేవి తీసుకుందామని రాజేశ్వరితో చెప్పా.. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. మేకప్ వేశాక బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్‌లు చెప్పమంటే.. ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, తను చెప్పడం చూసి, మరో ఆలోచన లేకుండా ఓకే చేశారు. -
శోకసంద్రంలో టాలీవుడ్ ప్రముఖ నటి షావుకారు జానకి (94) కన్నుమూత
-
జానకమ్మ మరణం.. టాలీవుడ్ సినీతారల నివాళి
ఫ్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి మరణవార్తపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఆమె మనల్ని విడిచివెళ్లడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఆమెను కోల్పోవడం మనకు తీరని లోటు అన్నారు. జానకమ్మ సినీ ప్రయాణం, ఆమె పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు.షావుకారు జానకి గారి మరణం ఎంతో బాధాకరమని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం, అద్భుతమైన నట ప్రస్థానం తరతరాలకూ ఆదర్శంగా నిలిచిపోతాయని తెలిపారు. నేటి యువత ఆమె ఎంత గొప్ప వ్యక్తిత్వమో తప్పక తెలుసుకోవాలని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇక లేరనే వార్త ఎంతో బాధ కలిగించిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె మృతి పట్ల తన సంతాపం ప్రకటంచారు. షావుకారు చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగిందని తెలిపారు. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి అని కొనయాడారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.షావుకారు జానకి అమ్మగారి మరణవార్త విని ఎంతో బాధపడ్డానని నటి రాధిక శరత్ కుమార్ అన్నారు. ఆమె దృఢ సంకల్పం కలిగిన, స్వతంత్ర భావాలున్న, కొత్త ఒరవడిని సృష్టించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నా తండ్రి శ్రీ రాధా గారికి సన్నిహిత మిత్రురాలిగా ఉంటూ.. పరస్పరం ఎంతో గౌరవాభిమానాలు కలిగి ఉన్న ఆమెతో పరిచయం, కలిసి పనిచేసే అవకాశం నాకు లభించిందని అన్నారు. తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏— Jr NTR (@tarak9999) August 21, 2026 -
స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)
-
చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)
-
చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)
-
ఆ ఒక్క కారణం వల్లే మా ఆయన దూరమయ్యారు: మీనా
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మీనా ముందు వరుసలో ఉంటుంది. సౌత్ స్టార్ హీరోలైనా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, చిరంజీవి, వెంకటేశ్, మోహన్‌లాల్, మమ్ముట్టిల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసింది. తెలుగులో తనకంటూ ప్రత్యేక స్టార్డమ్ సొంతం చేసుకుంది.అయితే కొన్నేళ్ల క్రితం ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె కొంతకాలం పాటు తీవ్రమైన డిప్రెషన్లో ఉంది. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె.. తన భర్త మరణానికి గల కారణాలను వివరించింది. ఆ ఓక్క కారణం వల్లే విద్యాసాగర్‌ను కాపాడుకోలేకపోయానని తెలిపింది.( ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)మా ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైందని మీనా వెల్లడించింది. ఆ సమయంలో డోనర్ దొరకలేదని తెలిపింది. ఇందులో ఉండే మెడికల్ ప్రాసెస్ చూసి నేనే చాలా ఆశ్చర్యపోయా.. చాలా రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగడంతో మా ఆయన ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. లంగ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేశానని..కానీ దాతలు దొరక్కపోవడంతో అమెరికా వెళ్లేందుకు ట్రై చేశానని తెలిపింది. కానీ ఇలాంటి సమయంలో అమెరికా తరలించడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారని గుర్తు చేసుకుంది. ఆయనను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా దురదృష్టవశాత్తూ మాకు దూరమయ్యారని వెల్లడించింది. నా భర్త మరణించాక కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని.. అయితే నా ఫ్రెండ్స్, సినిమాలతో ఈ విషాదం నుంచి కోలుకుంటున్నట్లు మీనా చెప్పుకొచ్చింది. -
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత
ప్రముఖ సీనియర్ సినీ నటి షావుకారు జానకి (95) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.కాగా.. 1950ల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికల్లో షావుకారు జానకి ఒకరు. 'షావుకారు' సినిమాతో పరిచమైన ఆమెకు సినిమా పేరే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. -
సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు)
-
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
-
బాక్సాఫీస్ బంగారం
కథలో ఆడియన్స్‌కు కనెక్ట్ చేయగల అంశాలు మెండుగా ఉంటే చాలు... ఉమన్ సెంట్రిక్ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. 2024లో శ్రద్ధాకపూర్ ‘స్త్రీ 2’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, రూ. 850 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. తెలుగులో సమంత లీడ్ రోల్ చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో ఈ ఏడాది రాబోయే, ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఉమన్ సెంట్రిక్ చిత్రాలపై ఇటు ఆడియన్స్‌లో, అటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మరి... రానున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఏవి కనక వర్షం కురిపించి, ‘బాక్సాఫీస్ బంగారం’గా నిలుస్తాయో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.మహాదేవి నయనతార, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో ‘మహాదేవి’గా విడుదల కానుంది. ఈ సినిమాకు సుందర్ .సి దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఆల్రెడీ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మైథాలజీ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయట. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దునియా విజయ్, రెజీనా కసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, ఇనయ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో స్నేహ ఓ కీలక పాత్రలో నటించనున్నారని కోలీవుడ్ సమాచారం.గిరిజన యువతి మైసా రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరీ సినిమా. కాగా రష్మికా మందన్నా ప్రస్తుతం ‘మైసా’ అనే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో గోండు గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా యాక్షన్ విజువల్స్, యాక్షన్ స్టిల్స్‌గా కనిపిస్తున్నాయి. దీంతో ‘మైసా’ సినిమాలో మేజర్ పార్ట్ యాక్షన్దే అనిపిస్తోంది.ఇటీవల కేరళలో జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్. రెండు రోజుల్లో 20 గంటల పాటు ఓ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌లో కూడా పాల్గొన్నారు రష్మిక. సో... యాక్షన్ పరంగా ‘మైసా’ సినిమా మరో లెవల్లో ఉండబోతోందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసమే రష్మిక మందన్నా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ఇటీవల ‘మైసా’ చిత్రీకరణలో రష్మికా మందన్నా గాయపడ్డారు. దీంతో ఆమెకు దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతిని సూచించారు వైద్యులు. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు రష్మిక. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ‘మైసా’ సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారని ఊహింవచ్చు. ఈ చిత్రాన్ని తొలుత ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రష్మికా మందన్నా గాయం వల్ల ‘మైసా’ సినిమా చిత్రీకరణ రిలీజ్‌పై ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నాతో పాటు రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. డోరతీ లేడీ ఓరియెంటెడ్ జానర్లో ‘మహానటి’ సినిమాతో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశారు కీర్తీ సురేష్. ఆ తర్వాత ఆమె ‘మిస్ ఇండియా, పెంగ్విన్, రివాల్వర్ రీటా’ వంటి మరికొన్ని ఉమన్ సెంట్రిక్ చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించారు. అదే ‘డోరతీ’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిప ఈ సినిమా సెప్టెంబరు 25న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో సనంత్, రిషి కాంత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవల పేర్కొన్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో..! తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘ది బ్లాక్‌గోల్డ్’. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్‌డ్రాప్ కథనంతో సాగే ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సంయుక్త. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు.మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తి చేశారు. ఐదు పవర్ఫుల్ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగిందిని మేకర్స్ తెలి పారు. అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని రిస్కీ యాక్షన్ స్టంట్స్ సీక్వెన్స్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వెండితెరపై సంయుక్త నటన, బొగ్గు గనుల సిండికేట్ వంటి అంశాలను వెండితెరపై చూసేందుకు కాస్త సమయం ఉంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ‘ది బ్లాక్ గోల్డ్’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ కానుంది. కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడు కలం నరేన్, బీవీఎస్ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైథాలజీ అండ్ సస్పెన్స్ ‘సవ్యసాచి’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ది రాజా సాబ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు నిధీ అగర్వాల్. కాగా, తొలి సారి ఆమె ఓ ఉమన్ సెంట్రిక్ సినిమా చేయడానికి సిద్ధమైయ్యారు. నిధీ అగర్వాల్ నటించనున్న ఈ మైథాలజీ అండ్ సస్పెన్స్ డ్రామా ఉమెన్ సెంట్రిక్ సినిమాను ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించనున్నారు. ఆగస్టు 17న నిధీ అగర్వాల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్. అలాగే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి మహాకాళి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. 125 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించిన ఈ మైథాలజీ సినిమాకు క్రియేటర్‌గా ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఇక ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ వర్మ. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.విదేశాల్లో హ్యాపీ జర్నీ ఏడుగురు మహిళల జీవితాల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘హ్యాపీ జర్నీ’. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలి శెట్టి, రూ పా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించారు. పారిస్, మాంట్ పెలియర్ వంటి అందమైన యూరప్ ప్రాంతాల లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు మేకర్స్. మేజర్ షూటింగ్ యూరప్‌లోనే జరిగింది. వేర్వేరు వయసులకు చెందిన ఏడుగురు మహిళలు ఒక రోడ్ ట్రిప్ (ప్రయాణం) ప్రారంభించి, ఆ ప్రయాణంలో వారి జీవితాలను, బంధాలను, భావోద్వేగాలను ఎలా అన్వేషించుకున్నారనే కోణంలో ‘హ్యాపీ జర్నీ’ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ‘‘కథ విదేశీ నేపథ్యంలో సాగినా అందులోని మనుషుల అనుబంధాలు, భావాలు ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటాయి. నటీనటుల సహజమైన నటన, వారి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాయి’’ అని యూనిట్ పేర్కొంది. గుత్తా ప్రోడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ రెడ్డి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివతేజ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు.హీరోయిన్ సాయి పల్లవి నటించిన పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘గార్గి’. ఆ తర్వాత ఈ స్థాయిలో మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయలేదు సాయి పల్లవి. అయితే కొంతకాలంగా రెండు భాగాలుగా విడుదల కానున్న హిందీ ‘రామాయణ’, ఆల్రెడీ రిలీజైన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బిజీగా ఉన్నారు. కాగా, సాయిపల్లవి ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘నేను.. శైలజ’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిషోర్ తిరుమల మైథాలజీ అంశాలతో ఓ ఉమన్ సెంట్రిక్ సినిమా కథను రెడీ చేస్తున్నారట. ఈ చిత్రంలో సాయి పల్లవి మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, భారతరత్న అవార్డు గ్రహీత ఎమ్.ఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా రానుందని, ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలయ్యాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.ఉమన్ సెంట్రిక్ సినిమాల ట్రెండ్ బాలీవుడ్‌లోనూ బాగానే కనిపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న సినిమా ‘ఈఠా’. మహారాష్ట్ర సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయి బయోపిక్కు ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వెండితెర విఠాబాయిగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. మరో లీడ్ రోల్లో రణ్‌దీప్ హుడా నటిస్తున్నారు. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్న ‘ఈఠా’ సినిమా డిసెంబరు 4న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా గురించి శ్రద్ధా కపూర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ–‘‘ఈఠా’ సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగాను. విఠాబాయి పాత్రలో ఓ సన్నివేశంలో చీరకట్టుతో పాటు భారీ ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. దీంతో కాలి కండరాలు ఒత్తిడికి గురయ్యాయి. వైద్యుల సూచనల మేరకు ఓ వారం రెస్ట్ తీసుకున్నాను’’అని పేర్కొన్నారు. ఇంకా ‘స్త్రీ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో అంచనాలు ఉన్నాయి. మరో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఓ మహిళ పాత్ర బలంగా ఉన్న కథతో ‘తుంబాడ్ 2’ అనే సినిమా చేస్తున్నారు. సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 3న రిలీజ్ కానుంది. ఇంకా ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్’ ఫ్రాంచైజీలోని ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3’లో తమన్నా టైటిల్ రోల్ చేయనున్నారని, ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా ‘మడాక్ హారర్ కామెడీ యూనివర్స్’ నుంచి ‘శక్తి శాలినీ’ అనే ఉమన్ సెంట్రిక్ సినిమా రానుంది. ఈ చిత్రంలో అనీత్ పద్దా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విశాల్ జెత్వా కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆదిత్య సర్పోత్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు)
-
హావభావాలతో ఆకట్టుకుంటున్న అందాల తార.. (ఫొటోలు)
-
ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)
-
చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)
-
వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్ (ఫొటోలు)
-
పద్ధతిగా 'హిట్' సినిమా హీరోయిన్ (ఫొటోలు)
-
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
-
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
-
'చాలా క్రూరమైన చర్య.. వీళ్లను జైల్లో వేయాల్సిందే': మెగా కోడలు లావణ్య
మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. పెళ్లి తర్వాత సినిమాలు చేయకపోయినా.. ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పందిస్తూనే ఉంది. తాజాగా ఓ రైలులో మహిళను కొడుతున్న వీడియోపై స్పందించింది. చిన్నారిని ఎత్తుకుని ఉన్న మహిళను కొందరు విచక్షణారహితంగా కొడుతున్న వీడియోను చూసి రియాక్ట్ అయింది. ఇలాంటి వాళ్లను కచ్చితంగా జైలులో వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ మహిళ ఏం చేసిప్పటికీ.. చిన్న బిడ్డను పట్టుకున్నప్పుడు ఆమెను కొట్టడం చాలా క్రూరమైన చర్య అంటూ మండిపడింది. ఇలాంటి వాళ్లను జైల్లో వేసి కొట్టాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. No matter what she has done, beating her while she holds the baby is absolutely cruel, these people deserve to be in jail and beaten up! https://t.co/OgrbWJpt1m— Lavanya tripathi konidela (@Itslavanya) August 15, 2026 -
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు
-
'కొందరు కావాలనే నాపై కుట్ర': అనసూయ
టాలీవుడ్ నటి అనసూయ పేరు మరోసారి తెరపైకొచ్చింది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న అనసూయ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమా వివాదాలతో కాదు. సనాతన ధర్మంపై ఆమె చేసిన కామెంట్స్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది. అనసూయ సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చింది. కొందరు తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని పేర్కొంది. తాను ఏ మత విశ్వాసాలనూ కించపర్చేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చింది. తాను మాట్లాడింది కేవలం కొందరి గురించి మాత్రమేనని తెలిపింది. తనపై వల్గర్ కామెంట్స్.. పర్సనల్ ఎటాక్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడే వాళ్ల గురించి అని తన పోస్ట్‌లో వెల్లడించింది. అందుకే తాను వివరణ ఇవ్వాల్సి వచ్చిందని అనసూయ రాసుకొచ్చింది.అనసూయ తన పోస్ట్‌లో రాస్తూ..'కొందరు కావాలనే నా మాటలను వక్రీకరిస్తున్నారు. అందుకే నేను వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను కొందరి గురించి మాత్రమే మాట్లాడా. నాపై అభ్యంతర కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే వాళ్ల గురించి మాత్రమే చెప్పా. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ కించపరచలేదు. నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు స్పష్టంగా చెప్పాలనుకుటున్నా. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి చింత లేదు. ధైర్యంగా ఉండటం.. నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు ధర్మమే నేర్పింది. నన్ను నేను హనుమాన్ జీ కుమార్తెగా భావిస్తా. ఆయన బలమే నాకు స్ఫూర్తి' అంటూ పోస్ట్ చేసింది. అంతేకాకుండా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండటం నా నైజం కాదని తెలిపింది. నా మాటల్లో అసలు విషయం పక్కనపెట్టి.. సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా వక్రీకరించినట్లు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది. మతం ఆధారంగా నేను ఎవరిపైనా ఓ నిర్ణయానికి రాను. నన్ను వేధించే వాళ్లను మాత్రమే ప్రశ్నిస్తానని రాసుకొచ్చింది. అందువల్ల ఎడిట్ చేసిన క్లిప్‌లు, సగం సగం కథనాలు చూసి మోసపోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
సమంత మా ఇంటి బంగారం.. మరో ఓటీటీలో స్ట్రీమింగ్
సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్ స్టార్ వేదికగా సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది.తాజాగా మా ఇంటి బంగారం క్రేజ్ దృష్ట్యా మరో ఓటీటీకి వచ్చేసింది. సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్‌ను సోని లివ్ కొనుగోలు చేసింది. ఇక హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. Ek parivaar. Ek raaz. Aur ek bangaaram bahu, jo sab badal degi 🔥Action Queen Samantha's Maa Inti Bangaaram (Hindi) is streaming now on SonyLIV pic.twitter.com/hyW4jWO7lm— Sony LIV (@SonyLIV) August 14, 2026 -
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
-
పతి దేవునికి స్టార్ హీరోయిన్ పూజలు.. ఎందుకంటే?
అత్తారింటికి దారేది మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన కన్నడ బ్యూటీ ప్రణీత. ఈ చిత్రంలో తన అందమైన కళ్లతో అభిమానులను కట్టిపడేసింది. తెలుగులో హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలోనూ మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ మెరిపింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భామ.. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.సినిమాల్లో లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను అభిమానులకు తన అప్డేట్స్ ఇస్తూ టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసింది. ఇవాళ భీమన అమావాస్య కావడంతో తన భర్త కాళ్లకు ప్రత్యేక పూజలు చేసింది. పతిదేవునికి నమస్కరిస్తూ ఉన్న ఫోటోను ట్విట్ర్లో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్స్ భర్త అంటే ఎంత గౌరవమో అని కామెంట్స్ చేస్తున్నారు.భీమన అమావాస్య ఎందుకు చేస్తారంటే.. భీమన అమావాస్య అనేది కర్ణాటక, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో పాటిస్తారు. ఈ మాసం చివరి రోజైన అమావాస్య నాడు జరుపుకునే హిందూ సంప్రదాయ పండుగ. ఈ రోజు పవిత్రమైన ఉపవాసంలో ఉంటారు. ఈ రోజును శివపార్వతులకు అంకితంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహిళలు తమ భర్తలకు, కుటుంబంలోని పురుషులకు ఆరోగ్యం, దీర్ఘాయువు, శ్రేయస్సుతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. ಭೀಮನ ಅಮಾವಾಸ್ಯೆ 🙏🏻 pic.twitter.com/xcoOH7vEbe— Pranitha Subhash (@pranitasubhash) August 12, 2026 -
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
-
రష్యన్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్న శ్రియ (ఫొటోలు)
-
ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు)
-
ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)
-
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
'నా తొమ్మిదేళ్ల కష్టం.. ఆయన వల్లే సాధ్యమైంది'.. కామాక్షి ఎమోషనల్
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి పరిచయం అక్కర్లేదు. పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించింది. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు డైరెక్షన్లో వస్తోన్న అగధ మూవీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన కామాక్షి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. నా తొమ్మిదేళ్ల కష్టమని కామాక్షి తెలిపింది. నా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఇంతవరకు వచ్చానని ఎమోషనలైంది. నా కెరీర్‌కి పునాది రాయి వేసింది మాత్రం ఎంఎస్ రాజుగారు మాత్రమేనని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే కష్టమని ఏడ్చేసింది. అలాంటిది నన్ను సినిమాలో లీడ్ రోల్లో తీసుకున్నారని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మారుతోందని.. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది కామాక్షి.నన్ను స్క్రీన్‌పై చూసింది చాలా తక్కువ.. నేను చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను అలాంటివే చేస్తుందని అనుకుంటారు.. కానీ నా తొమ్మిదేళ్ల కష్టం వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. ఈ రోజు ఇక్కడ నేను నిలబడేందుకు నా ఫ్యామిలీ ఎంతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని కామాక్షి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా అన్న, అమ్మ, పిన్ని నాకోసం ఇక్కడికి వచ్చారంటూ ఏడుస్తూ మాట్లాడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ఎల్లో శారీలో హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్.. ఫోటోలు
-
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!
సెట్స్‌కు వెళ్లడానికి హీరో రెడీ. స్టార్ట్... కెమెరా... యాక్షన్ చెప్పడానికి దర్శకుడు రెడీ. బడ్జెట్ కేటాయించేందుకు ప్రోడ్యూసర్ రెడీ. కానీ హీరోయిన్ మాత్రం నాట్ రెడీ. అవును... ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే. తమ హీరోకు సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ వెతుకులాటలో బిజీగా ఉన్నారు దర్శక–నిర్మాతలు. ఈలోపే ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ అంటూ... కొన్ని గాసిప్స్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి... ఏయే హీరోకి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!’ చూద్దాం... ఎవరెవరు జోడీ కడతారో మరి...ముచ్చటగా మూడోసారి ‘ఖిలాడి’, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారా? అంటే... ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాకు ‘వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్రయూనిట్ ప్లాన్ అట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయాలని హసిత్ గోలి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట హసిత్. ఇందులో భాగంగానే రవితేజకు జోడీగా నటించేందుకు డింపుల్ హయతిని సంప్రదించారని తెలిసింది.మరి... మూడోసారి కూడా రవితేజ–డింపుల్‌ల జోడీ సెట్ అవుతుందా? చూడాలి. అలాగే శ్రీ విష్ణుకు జోడీగా ఓ యంగ్ నటి కనిపిస్తారట. మరోవైపు రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ ఆగస్టు 21న విడుదల కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.దీపిక ప్లేస్‌లో ఆలియా? ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం అయిన కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూట్లో జాయిన్ అవుతారు. అయితే ఈ మూవీలోని మరో ప్రధానమైన లీడ్ రోల్‌ను ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 1లో దీపికా పదుకోన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడంలేదని చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్ ప్లేస్‌లో ఎవరు నటిస్తారు? అనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతోంది. తొలుత సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటివలి కాలంలో ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. త్వరలో ప్రభాస్‌తో పాటు లీడ్ హీరోయిన్ కూడా సెట్స్‌లో పాల్గొనాల్సి ఉందట. దీంతో దీపిక ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం లేక పోలేదు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘కల్కి 2’ సినిమా 2027 చివర్లో రిలీజ్ అవుతుందని టాక్.గాడ్ ఆఫ్ వార్‌లో... ‘అరవిందసమేత వీరరాఘవ’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు ఎనీ్టఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.చరణ్‌కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్ కెరీర్ లోని 17వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఏడాదిన్నర క్రితమే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్‌చరణ్ బిజీగా ఉండటం వల్ల ‘ఆర్సీ 17’ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే ప్రారంభించాలని అనుకున్నారు మేకర్స్. కానీ ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్ చేతికి గాయమైంది. దీంతో ఇటీవల కోయంబత్తూరులో చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రామ్‌చరణ్.ఈ గాయం నుంచి కోలుకుని తిరిగి రామ్‌చరణ్ షూట్లో పాల్గొనేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై కూడా సుకుమార్ దృష్టి సారించారట. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లును పరిశీలిస్తున్నారు మేకర్స్. సమంత, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా రుక్మిణీ వసంత్ పేరు తెరపైకి వచి్చంది. మరి... రామ్‌చరణ్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌నే నటిస్తారా? వేచి చూడాల్సిందే.రాకాలో నలుగురు నాయికలు? అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఒక హీరోయిన్గా కన్ఫార్మ్ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దీంతో ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ఈ చిత్రంలోని ఇతర హీరోయిన్ రోల్స్‌కు ఫైనలైజ్ అయ్యారని, ఆల్రెడీ ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఈ ముగ్గురూ పాల్గొంటున్నారని టాక్.అయితే జాన్వీ, రష్మిక, మృణాల్లు ఈ సినిమాలో భాగమైన అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.పైగా రష్మిక ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారట. దీంతో ఆమె ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించక పోవచ్చట. మరి... అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించే హీరోయిన్స్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధురంధర్’ తరహాలో తక్కువ టైమ్ గ్యాప్‌లోనే ‘రాకా’ రెండు భాగాలు రిలీజ్ కానున్నాయని సమాచారం.రోమియో ప్రేయసి... నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ సెప్టెంబరు 24న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్‌లోని ‘బ్లడీ రోమియో’ సినిమాలో నటిస్తారు నాని. అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్స్ జరుగుతాయని తెలిసింది. కానీ... ఈ సినిమా మేజర్ షూటింగ్ మాత్రం లండన్‌లో ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైన లైజ్ కాలేదు. ప్రస్తుతానికి భాగ్యశ్రీ భోర్సేను అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని, ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలై, నాని ‘బ్లడీ రోమియో’ షూట్‌ను స్టార్ట్ చేసిన తర్వాత భాగ్యశ్రీ ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతోందని ఇటీవల రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. నానికి చెందిన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రోడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి ఈ ‘బ్లడీ రోమియో’ను నిర్మించనున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది.సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో... రామ్ హీరోగా నటిస్తూ, కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రా పో 23 (వర్కింగ్ టైటిల్). ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ సాంగ్‌ను, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు రామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, హీరోయిన్ పాత్రకు శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ పేర్లను పరిశీలించారట. సంయుక్త ఆల్మోస్ట్ ఖరారు అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాని కారణంగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంటే... ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని చెప్పాచ్చు.ఎల్లమ్మ..! ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత కీర్తి సురేష్‌ను అనుకున్నారట. కానీ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, మమితా బైజు వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.నో హీరోయిన్!ఒకవైపు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంటే ఒక సినిమాకి మాత్రం హీరోయినే అక్కర్లేదట. ఎందుకంటే అసలు హీరోయిన్ లేకుండానే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కొంతమంది బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేక పోవడంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రనే తొలగించాలని మేకర్స్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇంకా మరికొందరు తెలుగు హీరోలు నటించనున్న మరికొన్ని కొత్త సినిమాల్లో హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు.– ముసిమి శివాంజనేయులు -
కొరియన్ కనకరాజుతో మరో హిట్.. టాలీవుడ్ లక్కీ ఛార్మ్ రితికా!
తెలుగు సినీ ప్రియులను తన అందం, అభినయంతో కట్టిపడేస్తోంది భామ రితికా నాయక్. ఇటీవల వచ్చిన 'కొరియన్ కనకరాజు చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఓ వైపు మెస్మరైజ్ చేసే అందం, మరోవైపు పాత్రలో లీనమయ్యే నటనతో రితికా థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతుండటంతో, టాలీవుడ్లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను నిర్మాతలు లక్కీ ఛార్మ్‌గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాదని.. ప్రాజెక్ట్‌కి ప్లస్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందం ఉన్నచోట అభినయం ఉండదు అంటారు, కానీ రితికా నాయక్ ఆ మాటను తప్పుగా నిరూపించింది. 'కొరియన్ కనకరాజు' మూవీలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. క్యూట్ లుక్స్, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో తన పాత్రకు ఒదిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ భామ మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో మెరిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
'నన్ను కమిట్మెంట్ అడిగారు'.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్. ముఖ్యంగా నటీమణులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. ఇప్పటికే పలువురు సినీతారలు తమకెదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో బయటికి చెప్పుకొచ్చారు. తాజాగా మరో టాలీవుడ్ నటి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేసింది.టాలీవుడ్ నటి చాందిని చౌదరి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. 2015లో ఓ బ్రాండ్ అంబాసిడర్ ఛాన్స్ పేరుతో తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని గుర్తు చేసుకుంది. తాను తిరస్కరించడంతో మా అమ్మకు ఫోన్ చేసి కూడా అవమానించాడని చాందిని చౌదరి వెల్లడించింది. అంతేకాకుండా తనపై నెగెటివ్ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. చాందినికి పొగరు ఎక్కువనే ముద్ర వేశారని..అది ఇప్పటికీ తనని ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
శాన్వీ మేఘన లేటేస్ట్ మూవీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్
టాలీవుడ్ నటి శాన్వీ మేఘన, ఎలన్ జంటగా వస్తోన్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ క్రేజీ లవ్. ఈ చిత్రానికి ఎలన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు పోస్టర్స్ చూస్తే తెలిసిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి ఓటీటీకి రానుందని తేదీని రివీల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్యార్ప్రేమకల్యాణ్ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, సెంథిల్, కుమారవేల్, మారన్, గీతా కైలాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. #CrazyLove song from #PyaarPremaKalyanam is streaming now! 🎶🔗 https://t.co/gZqMcWraOpStreaming on Netflix from Aug 21 pic.twitter.com/37VAgu5Nlj— Sathish Kumar M (@sathishmsk) August 6, 2026 -
బ్లాక్ డ్రెస్‌లో గోల్డెన్ హార్ట్.. ఈషా రెబ్బ స్టన్నింగ్ లుక్స్!(ఫొటోలు)
-
వైట్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ మ్యాజిక్... (ఫొటోలు)
-
‘అనకాపల్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా సోనూ సూద్ (ఫొటోలు)
-
పట్టు చీరలో పరవశింపజేసిన అందాల భామ.. (ఫొటోలు)
-
అరుణాచలంలో హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర, రాబిన్‌హుడ్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌తో ఆకట్టుకుంది. కిస్సిక్ అంటూ అభిమానులను అలరించింది. ఈ ఏడాది శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. Our girl #Sreeleela at Tiruvannamalai pic.twitter.com/naeZUbBt0u— KUMAR || Vaathi సార్ || Venky Atluri&Nelson Fan || (@RajiniDhanush5) August 5, 2026 -
స్నేహితురాలి పెళ్లిలో కుందనపు బొమ్మలా జాన్వీ కపూర్..! (ఫొటోలు)
-
పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
-
'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)
-
బ్లూ శారీలో హీరోయిన్ అపర్ణ దాస్ బ్యూటీఫుల్ లుక్స్.. ఫోటోలు
-
వయసుతో పాటు అందమూ పెరుగుతోంది! (ఫొటోలు)
-
హీరో నాని నిర్మాతగా... నితిన్ కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
ఈ హీరోయిన్‌కి 40 ఏళ్లంటే నమ్మడం చాలా కష్టం! (ఫొటోలు)
-
ఫ్రెండ్స్-కూతురితో కలిసి నమ్రత హాలీడే ట్రిప్ (ఫొటోలు)
-
శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)
-
బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు
-
ది ప్యారడైజ్‌లో స్పెషల్ సాంగ్.. కీర్తికి భారీగా రెమ్యునరేషన్..!
టాలీవుడ్లో సూపర్ హిట్ జంటల్లో నాని, కీర్తి సురేశ్ ఒకరు. వీరిద్దరు జంటగా నటించిన నేను లోకల్, దసరా మూవీస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేశాయి. అయితే మరోసారి ఈ హిట్ కాంబోను తెరపై చూసే అవకాశం రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్‌లో కీర్తి సురేశ్ కనిపించనుందని సమాచారం. ఆమెను ఓ స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.ఈ ప్రత్యేక పాట కోసం కీర్తి సురేశ్ ఓకే చెప్పారని.. అయితే కేవలం రెండు రోజుల కాల్షీట్లు మాత్రమే కేటాయించినట్లు టాక్ నడుస్తోంది. ఈ రెండు రోజుల షూటింగ్ కోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కాస్తా టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ సాంగ్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఒదెల చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఈ సాంగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మ్యాచింగ్ డ్రస్సుల్లో ముచ్చటైన సినీ జంట (ఫొటోలు)
-
చిన్న పిల్లలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ (ఫొటోలు)
-
వింటేజ్ కెమెరాతో వింటేజ్ స్టైల్లో మానస (ఫొటోలు)
-
చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)
-
ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేసిన అందాల భామ రజిష విజయన్ (ఫొటోలు)
-
చీరకట్టులో మానస వారణాసి ట్రెండింగ్ ఫొటోలు
-
శ్రీదేవి విజయ్ కుమార్ శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
-
మల్లెపూలు.. వడ్డాణంతో అందంగా రుక్మిణి (ఫొటోలు)
-
'కొరియన్ కనకరాజు' బ్యూటీ.. అచ్చం అలానే ఉందే! (ఫొటోలు)
-
చాక్లెట్ కలర్ డ్రస్‌లో పూజా హెగ్డే (ఫొటోలు)
-
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
ప్రముఖ నటి, కమెడియన్ పావలా శ్యామల కన్నుమూశారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ మరణించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఆమె భౌతిక కాయానికి ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.కాగా.. టాలీవుడ్ చాలా సినిమాల్లో పావలా శ్యామలా తన నటనతో మెప్పించారు. పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. చివరి రోజుల్లో ఆమె దీన స్థితిని గడిపారు. చికిత్సకు డబ్బుల్లేక ఎన్నో అవస్థలు పడ్డారు. పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి.. చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో మరణించడం టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)
-
ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా? ఇంత పెద్ద కూతురు ఉందా?
తెలుగు తెరపై ఎందరో నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థి ర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం సడెన్‌గా వెండితెరకు దూరం అయిపోతున్నారు. వందల సినిమాలు చేసినా.. మళ్లీ తెరపై కనిపించడం లేదు. అలాంటి వాళ్లలు నవీన్ ఓలేటి ఒకరు. పేరు చెబితే తెలియదు కానీ.. ప్రేమంటే ఇదేరా చిత్రంలో హీరో వెంకటేష్ ఫ్రెండ్.. విక్రమార్కుడులో పోలీసు.. తొలివలపు మూవీలో హీరో అన్నయ్య అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నువ్వే నువ్వే, విక్రమార్కుడుతో పాటు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. సినిమాల కంటే ముందు బుల్లితెరపై సందడి చేశాడు. పద్మవ్యూహం’, ‘నాన్న’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో ఆయన పోషించిన పాత్రలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అతని సతీమణి కూడా నటినే. పేరు మధురిమ. ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన ‘ధళం’చిత్రంతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత నరసింహనాయుడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ప్రేమతో రా’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. విక్రమార్కుడు చిత్రంలో రాజీవ్ కనకాల భార్యగా నటించింది ఈమెనే. అదే చిత్రంలో నవీన్.. కానిస్టేబుల్‌గా నటించాడు.ఇలా వెండితెరపై ఆకట్టుకున్న ఈ జంట.. సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ఈ దంపతులు ఇప్పుడు పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ప్లిలలు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్నారు. పెద్ద కుమార్తె మనవి హీరోయిన్ గా రాణించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది. View this post on Instagram A post shared by Manu 🪩 (@manavvivoleti) -
చీరలో నిహారిక.. చిరునవ్వుతో ఫోటోకు ఫోజులు
-
వేకేషన్లో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి.. ఫోటోలు
-
పెళ్లైన 12 ఏళ్లకు తల్లి అయిన నటి ( ఫోటోలు)
-
ఆ ఒక్క కారణం వల్లే సినిమాల్లోకి: రకుల్ ప్రీత్ సింగ్
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ పలు మూవీస్ చేసింది. ప్రస్తుతం రామాయణ మూవీలో కనిపించనుంది. ఇటీవల రైజింగ్ భారత్ సమ్మిట్‌కు హాజరైన రకుల్.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను సినిమాల్లోకి రావడానికి గల కారణాన్ని వివరించింది.కేవలం కారు కొనాలనే కోరికతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. అలా జరిగితే నా ఫ్రెండ్స్‌లో కారు కొనుక్కున్న మొదటి వ్యక్తిని నేను అవుతానని భావించానని వెల్లడించింది. అందుకే కన్నడ మూవీలో అవకాశం రాగానే ఒప్పేసుకున్నానని పేర్కొంది. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీపై తనకు ఎలాంటి అవగాహన లేదని రకుల్ పంచుకుంది. రకుల్ మాట్లాడుతూ..' కాలేజీలో చదువుతున్నప్పుడే కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి అవకాశం వచ్చింది. ఎవరో నా ఫొటోలు చూసి మా నాన్నని కలిశారు. ఓ సినిమాలో నటించేందుకు నన్ను తీసుకుంటామని అడిగారు. అప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీపై నాకు అవగాహన లేదు. అయితే ఆ సినిమాకు నాకు రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులతో కారు కొనుక్కోవాలనుకున్నా. నా స్నేహితులందరిలో కారు ఉన్న మొదటి అమ్మాయిని నేనే అవుతా. ఆ ఒక్క కారణంతోనే సినిమా చేయడానికి అంగీకరించా' అని తెలిపింది. కాగా.. 2009లో కన్నడ చిత్రం గిల్లీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ టాలీవుడ్లో అడుగుపెట్టింది. -
నన్ను కసాయి అనుకున్నా పర్లేదు: కాజల్ అగర్వాల్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటేస్ట్ మూవీ 'ది ఇండియా స్టోరీ'. కల్తీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో సందడి రిలీజైంది. ఇటీవల మన ఇండియాలో కల్తీపాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రతి రోజు మనం తాగే పాకెట్ పాలు మంచివి కావని తెలిపింది. కల్తీపై అవగాహన కల్పించడం కోసమే ది ఇండియా స్టోరీ మూవీని తీశారని పంచుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు కానీ.. నా కుమారుడికి మాత్రం నేను పాలు ఇవ్వనని తెలిపింది. ఈ విషయంలో నన్ను అందరూ కసాయి తల్లి అనుకున్నా సరే.. నాకే పర్లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఇంట్లోనే పన్నీరు తయారు చేసి ఇస్తానని కాజల్ తెలిపింది. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.మనదేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.. అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ తెలిపింది. ఓ ప్రాజెక్ట్ రీసెర్చ్‌లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నా.. ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశానని కాజల్ చెప్పుకొచ్చింది. -
రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)
-
నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)
-
శ్రీనిధి.. అందాల నిధి (ఫొటోలు)
-
మెరూన్ కలర్ చీరలో శివాని నాగారం అందాల సందడి..ఫోటోలు
-
కామన్వెల్త్ గేమ్స్‌లో రష్మిక..!
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో నేషనల్ క్రష్ మెరవనుందా? ఈ క్రీడల సంగ్రామం ముగింపు వేడుకలకు హాజరు కానుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొగనుందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరకానున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 2న జరగనున్న ఈ వేడుకల్లో భారతదేశం తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొగననుంది. ఈ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ఫ్లాగ్‌ను భారత్‌కు అందించనున్నారు. 2030లో జరగబోయే 100 ఏళ్ల శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2010లో ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన తర్వాత.. భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం రెండోసారి కావడం విశేషం. -
దేశాలన్నీ చుట్టేస్తున్న హీరోయిన్ రీతూవర్మ (ఫొటోలు)
-
'బలగం' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
రకుల్.. సో బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
-
చీరలో పద్ధతిగా రాశీ సింగ్ (ఫొటోలు)
-
స్టన్నింగ్ లుక్స్‌లో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
పట్టు చీరలో నభా నటేష్ అందాల మెరుపులు (ఫొటోలు)
-
తెల్లని చీరలో శ్రీదేవి విజయ్‌కుమార్ మనసు దోచే అందాలు (ఫొటోలు)
-
సింపుల్‌గా వంక పెట్టలేనంత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్‌తో కలిసి టాలీవుడ్ హీరోయిన్ నైట్ పార్టీ (ఫొటోలు)
-
ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (ఫొటోలు)
-
ఉంగరాల జుట్టు.. వావ్ అనిపించే గ్లామర్ (ఫొటోలు)
-
కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)
-
చీరలో శ్రుతి హాసన్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
మోడ్రన్ దేవకన్యలా దివ్యభారతి.. చూసేందుకు రెండు కళ్లు సరిపోవు (ఫొటోలు)
-
డిఫరెంట్ డ్రెస్‌లో అవికా గోర్ అందాలు.. ఫోటోలు
-
కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు
-
ఓ సుకుమారి బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ లేటేస్ట్ స్టిల్స్.. ఫోటోలు
-
లండన్ వీధుల్లో హీరోయిన్ హెబ్బా పటేల్ చిల్.. ఫోటోలు
-
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. మరి ఇంతగానా?
టాలీవుడ్ నటి నమిత గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో తనదైన నటనతో అదరగొట్టింది. అప్పట్లో బొద్దు బొద్దుగా తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన నమిత.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.అయితే తాజాగా నమితకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. అప్పట్లో లావుగా, బొద్దు బొద్దుగా ఉండే నమిత.. ఇప్పుడేమో పూర్తి స్లిమ్‌గా మారిపోయింది. అసలు ఎవరు గుర్తు పట్టలేనంతగా కనిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో వావ్ సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ అవుతున్న ఫిట్నెస్ వీడియో!#Namitha #ViralVideo #Tollywood #Kollywood #TeluguNews #TupakiFollow 👉 @tupaki_official pic.twitter.com/b3QJnYUfTY— Tupaki (@tupaki_official) July 17, 2026 -
జిమ్‌లో 'సిల్క్ స్మిత' వర్కవుట్స్.. వీడియో వైరల్
ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్ సిల్క్ స్మిత. అప్పట్లో టాలీవుడ్లో ప్రేక్షకుల గుండెల్లో ఐటమ్ గర్ల్‌గా ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్ మూవీ నా దేశం చిత్రంలో నేనొక నెత్తురు దీపం సాంగ్ తర్వాత ఐటెం గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి దాదాపు టాప్ హీరోలందరి సినిమాల్లో సిల్క్ స్మిత డ్యాన్స్ ఉండాల్సిందే అనేంతలా క్రేజ్ దక్కించుకుంది. అప్పటికే జ్యోతిలక్ష్మీ, జయమాలిని ఐటెమ్ సాంగ్స్‌తో చెలరేగిపోతున్నా సిల్క్ స్మిత తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.అదే సమయంలోనే గూండా, ఛాలెంజ్, బాలకృష్ణ ఆదిత్య 369వంటి చిత్రాలలోనూ కీలక పాత్రల్లోనూ నటించి సత్తా చాటింది. కానీ అర్థాంతరంగా 1996 సెప్టెంబరు 23న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’అనే సినిమా సైతం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.అయితే మనుషుల పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని మనందరం వింటుంటాం. అదే నిజమో కాదో తెలియదు కానీ.. ఓ అమ్మాయి మాత్రం అచ్చం సిల్క్ స్మితను తలపిస్తోంది. గతంలో అచ్చం సౌందర్యలాగే ఓ అమ్మాయి కనిపించింది. తాజాగా సిల్క్ స్మితను పోలిన ఓ అమ్మాయి జిమ్‌లో సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అచ్చం స్మితలా కాకపోయినా.. ఇంచుమించు అలానే కనిపిస్తోంది. అచ్చం సిల్క్ స్మిత లాగే వుంది, కొంచం లావుగా వుంది.#SilkSmitha pic.twitter.com/Jk1LX1mn1X— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 16, 2026 -
వైట్ శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
-
'ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏం లేదు.. అదొక్కటి తప్ప'.. పూజా హెగ్డే
సినీ ప్రియుల గుండెల్లో బుట్టబొమ్మగా ముద్ర వేసుకున్న బ్యూటీ పూజా హేగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన జన నాయగన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 23 నుంచే థియేటర్లలోకి రానుంది. విజయ్ హీరోగా వస్తోన్న చివరి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సంగతి పక్కనపెడితే బుట్టబొమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడింది. ఆయనతో రాధే శ్యామ్ మూవీలో హీరోయిన్గా చేశానని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో నాకు ప్రభాస్ పంపిన ఫుడ్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది. ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఇంకేం లేదని.. అవకాశం వస్తే ఆయన కుక్‌ను దొంగిలిస్తానని ఫన్నీ కామెంట్స్ చేసింది బుట్టబొమ్మ. ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. Pooja Hegde in her latest interview when asked if she learned anything from Prabhas or if he gave her any advice:"My only core memory of Radhe Shyam is the food. I just want to steal Prabhas's cook and nothing else, cause he doesn’t have anything else to offer" [Laughs] 😭😭 pic.twitter.com/VWSpag2pIE— Raj (@idfcwau) July 14, 2026 -
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ నటి హేమ.. వీడియో వైరల్
క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. తాజాగా ఆమె ఖరీదైన కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కొత్త కారుకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హేమకు కంగ్రాట్స్ చెబుతున్నారు.ప్రముఖ మెర్సిడెజ్ బెంజ్ బ్రాండ్ కారును హేమ కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.కోటిన్నరకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారును తానే స్వయం నడుపుతూ వీడియోలో కనిపించింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211) -
కొరియన్ అమ్మాయితో మహేశ్ మేనల్లుడి పెళ్లి సందడి (ఫొటోలు)
-
ప్రెగ్నెన్సీతోనూ సమంత ఫారిన్ ట్రిప్ (ఫొటోలు)
-
జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫ్రెండ్ పార్టీలో బాలీవుడ్ భామ ఆలియా భట్ సందడి.. ఫోటోలు
-
ఎల్లో శారీలో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గ్లామర్.. ఫోటోలు
-
సింగిల్ మూవీ బ్యూటీ ఇవానా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
-
శారీలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అందాలు.. ఫోటోలు
-
యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
-
శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..
-
‘లెనిన్’సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)
-
డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో హీరోయిన్ నిషా అగర్వాల్..ఫోటోలు
-
హాఫ్ శారీలో లెనిన్ భామ భాగ్యశ్రీ బోర్సే అందాలు.. ఫోటోలు
-
అది చూసి షాకయ్యా.. పుచ్చకాయ తినడం మానేశా: కాజల్ అగర్వాల్
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటేస్ట్ మూవీ ది ఇండియా స్టోరీ. కల్తీ కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 24న ది ఇండియా స్టోరీ థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ తేదీకి ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది కాజల్ అగర్వాల్. మనదేశంలో ఆహార కల్తీ విపరీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి రోజు మనం తాగే పాకెట్ పాలు మంచివి కావని తెలిపింది. కానీ ప్రతిరోజు అవే అందరూ తాగుతున్నారని.. ఇది చాలా దారుణమని వాపోయింది. అసలు ఏది తినాలో.. ఏది తినకూడదో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా ఆహార కల్తీ వల్లే యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నటి కాజల్ అగర్వాల్ తెలిపింది. కల్తీపై అవగాహన కల్పిస్తూ ది ఇండియా స్టోరీ మూవీని తీశారని పేర్కొంది. ఓ ప్రాజెక్ట్ రీసెర్చ్‌లో తాను షాకింగ్ విషయాలు తెలుసుకున్నా.. ఇటీవల ఓ కేసు గురించి విని పుచ్చకాయ తినడం మానేశానని కాజల్ చెప్పుకొచ్చింది. -
తమన్నా యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా మోస్ట్ అవైటేడ్ మూవీ వివాన్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియో పంచుకున్నారు మేకర్స్. తాజాగా రిలీజైన పోస్టర్ అడవి నేపథ్యంలో డిజైన్ చేశారు. ఇందులో చేతిలో త్రిశూలంతో ఉన్న ఒక యోధుడు కనిపిస్తుండగా.. ఒకవైపు ఉగ్రరూపంతో ఉన్న పులి, మరోవైపు రౌద్రంతో దూసుకొస్తున్న ఎద్దును చూపించారు. ఈ ఫాంటసీ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Baagh uski dahaad hai… Nandi uski shakti. Aur Vvaan… uski kahaani.#THEVVAAN in cinemas on 25th September, 2026.Starring: @SidMalhotra #TamannaahBhatia @WhoSunilGrover @ManishPaul03 #ShwetaTiwari @soniiannup Producers: #ShobhaKapoor @EktaaRKapoor @ArunabhKumar &… pic.twitter.com/YyULbvAFa7— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 9, 2026 -
వైజాగ్‌లో సందడి చేసిన 'రాజాసాబ్' బ్యూటీ (ఫొటోలు)
-
ట్రెండింగ్ బ్యూటీ శ్వాసిక చీరలో అలా (ఫొటోలు)
-
రోజురోజుకీ సన్నబడిపోతున్న కాజల్ (ఫొటోలు)
-
సీక్రెట్ గా డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి ట్రెండింగ్ లో (ఫొటోలు)
-
చీరకే అందం తీసుకొచ్చిన శ్రుతిహాసన్ (ఫొటోలు)
-
కుందనపు బొమ్మలా జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
-
సంయుక్త నీ అందం వేరే! (ఫొటోలు)
-
ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
సమంత మా ఇంటి బంగారం.. మరో క్రేజీ రికార్డ్..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియంటేడ్ మూవీగా నిలిచింది.దీంతో మా ఇంటి బంగారం టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్ల మార్క్‌ను దాటేసింది. మూడో వారాంతంలోనూ మా ఇంటి బంగారం వసూళ్లపరంగా రాణించడం చూస్తుంటే సమంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు.అంతేకాకుండా మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు సమంత భర్త రాజ్ నిడిమోరు ప్రకటించారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఆలోచన రావడం ఇదే తొలిసారి అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు. #MaaIntiBangaaram continues its golden run at the box office ❤🔥Running successfully in its 3rd week with superb bookings 🔥Enjoy the BIGGEST EVER FEMALE-LED TELUGU FILM in theatres ❤🔥 Book your tickets now!🎟️ https://t.co/P89ifZn9Ss@TralalaPictures @Samanthaprabhu2… pic.twitter.com/EN6b1vXanR— Tralala Moving Pictures (@TralalaPictures) July 4, 2026 -
'తొలిసారి ఆ మాటలు విన్నా'.. రావు బహదూర్ హీరోయిన్ ఎమోషనల్
సత్యదేవ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ నెల 3న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జంటగా దీపా థామస్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీకి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సక్కెస్ టాక్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. హైదరాబాద్‌లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హీరోయిన్ దీపా థామస్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా హీరోయిన్ భావోద్వేగానికి గురైంది. ఈ సినిమా చూసిన మా నాన్న తనను పొగిడారంటూ ఎమోషనలైంది. నా కెరీర్లో తొలిసారి అలాంటి మాటలు విన్నానని ఏడ్చేసింది. నేను కూడా ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశా. వారి రెస్పాన్స్ చూసి ఎమోషనలయ్యా అంటూ రావు బహదూర్ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.దీపా థామస్ మాట్లాడుతూ..' నా పేరేంట్స్‌కు తెలుగు రాదు. వాళ్లు ఈ సినిమాని సబ్‌టైటిల్స్‌తో చూశారు. ఈ సినిమా చూసి మా నాన్న చెప్పారు. ఇంకా బాగా చేయాలని తొలిసారి నాన్న నాతో అన్నారు. ఇదే నా కెరీర్లో అత్యంత గొప్ప ప్రశంస. మన వీక్ పాయింట్ ఎవరికీ తెలియొద్దని మహాగారు చెప్పారు. అందుకే ఈరోజు నేను ఏడావలనుకోవడం లేదు' అంటూ ఫుల్ ఎమోషనలైంది. స్టేజీపై మాట్లాడుతూ దీపా థామస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.దీపా థామస్ కెరీర్..కేరళకు చెందిన దీపా థామస్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. రావు బహదూర్‌తో గ్రాండ్ సక్సెస్ కొట్టేసింది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మొదట మిస్ మిలీనియల్ అందాల పోటీలో టాప్ 10లో నిలిచింది. ఆ తర్వాత మిస్ సౌత్ ఇండియా పోటీలో సెకండ్ రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. అలా రాక్ పేపర్ సీజర్స్ అనే వెబ్‌సిరీస్‌తో సినీ కెరీర్ ప్రారంభించింది. వైరస్ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. 'హోమ్' సినిమాతో ఫేమస్ అయింది. మలయాళంలో పలు సినిమాలు చేసిన దీపా థామస్ తెలుగులో రావు బహదూర్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. -
సమంత మా ఇంటి బంగారం.. డిలీటేడ్ సీన్స్ చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ముఖ్యంగా మహిళ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సామ్ తన యాక్షన్‌తో అభిమానులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా ఇంకా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే తాజాగా ఈ మూవీలోని డీలీటెడ్ సీన్స్‌ను షేర్ చేశారు మేకర్స్. ఇప్పటికే థియేటర్లలో నవ్వులు పూయించిన మా ఇంటి బంగారం సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన డిలీటేడ్ సీన్స్ తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ వీడియోలో సెట్లో సరదా సన్నివేశాలు సామ్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ వీడియో చూసేయండి. -
'ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వానా'.. తమన్నా ఆనందం చూశారా?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఖుష్బు సుందర్ కుమార్తె వేడుకలో మెరిసిన ముద్దుగుమ్మ.. తాజాగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ముంబయిలో భారీ వర్షం కురవడంతో ప్రకృతిని ఆస్వాదించింది. తాను ఉండే ఇంటి బాల్కనీలో వర్షం పడుతున్న వేళ ఫుల్‌గా చిల్ అవుతూ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది తమన్నా. నాకు ఇంకా చల్లగానే ఉందని క్యాప్షన్ రాసుకొచ్చింది.వర్షంలో తడుస్తూ చిన్న పిల్లలా ఎంజాయ్ చేసిన తమన్నాను చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడం గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది బాలీవుడ్ బ్యూటీ రషా తడాని.. నేను లేకుండా ఎలా చేశావ్? అంటూ సరదాగా కామెంట్ చేసింది. మరోవైపు తమన్నా ప్రస్తుతం కేవలం బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. జైలర్ మూవీలో ఐటమ్ సాంగ్ తర్వాత దక్షిణాది సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
సమంత బేబీ బంప్.. సిక్స్ ప్యాక్ అంటూ పోస్ట్...!
సమంత ఇటీవలే మా ఇంటి బంగారంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో మహిళా అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ మూవీ హిట్ ప్రమోషన్ల టైమ్‌లో సమంత ప్రెగ్నెన్నీపై రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా రిలీజైన తర్వాత సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటిస్తున్నానని తెలిపింది. నా బేబీ కోసం మెటర్నిటీ లీవ్‌లో ఉంటానని సామ్ ఆనందం వ్యక్తం చేసింది.తాజాగా సమంత బేబీ బంప్‌తో ఉన్న పిక్‌ను షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. మై సిక్స్ ప్యాక్.. నేను నిన్ను చూసినప్పుడే చూస్తాను.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత సిక్స్ ప్యాక్ అని రాయడంతో ఆమెకు ఇప్పుడు ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సమంత గతేడాది డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. -
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఖరీదైన గిఫ్ట్.. ఏకంగా రూ.15 లక్షలు..!
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి మెప్పించింది.ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ఇసకపట్నం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్..ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఐశ్వర్య రాజేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ప్రతి సినిమాకు తనకు తానే ఓ గిఫ్ట్ కొంటానని తెలిపింది. అత్యంత ఖరీదైన గిఫ్ట్ తన చేతికి ఉన్న వాచ్ అని పేర్కొంది. అంతేకాదు ఈ వాచ్‌ను సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గుర్తుగా రూ.15 లక్షల వాచ్ కొన్నానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఈ వాచ్ బుక్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ప్రతి మూవీకి ఒక గిఫ్ట్ కొనడం తనకు అలవాటుగా మారిందని ఐశ్వర్య వెల్లడించింది. -
రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)
-
అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)
-
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్డమ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం కత్తిమీద సాములాంటిదే. అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ అయినవాళ్లు చాలా తక్కువమందే ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలా అరుదని కూడా చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి.. ఇలా వెళ్లిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగు రాణించి.. ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్ ఒకప్పటి హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1997లో నేను ప్రేమిస్తున్నాను అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ బ్యూటీ రచన బెనర్జీ. ఈ ముద్దుగుమ్మ రెండో సినిమా కన్యాదానంతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మామిడాకులు మూవీలో మెరిసింది. అంతేకాకుండా ఓకే ఏడాదిలో నాలుగు సినిమాలు చేసి తెలుగులో సత్తా చాటింది. తెలుగులో ఆమె చివరిసారిగా 2002లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లోనూ మెప్పించారు.కోల్‌కతాకు చెందిన రచన 1991లో మిస్ కోల్‌కతా కిరీటాన్ని అందుకుంది. 1992 మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. అలా తన అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ 1993లో దాన్ ప్రతిదాన్ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది.ఎంపీగా పార్లమెంట్‌కు..సినిమాల్లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఈ ముద్దుగుమ్మ పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీ చేశారు. వెస్ట్ బెంగాల్‌లోని హుగ్లీ లోక్‌సభ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఒరియా అగ్ర నటుడు సిద్ధాంత్ మహాపాత్రను పెళ్లాడింది. అయితే 2004లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. రచనా బెనర్జీ ఒరియాలో యాభైకి పైగా సినిమాలలో నటించారు. ఆ తర్వాత రచన బెనర్జీ 2005లో ప్రొబల్ బసుని రెండవ వివాహం చేసుకుంది. అతనితో విభేదాలు రావడంతో 2016లోనే విడిపోయింది. ప్రస్తుతం ఎంపీగా రాజకీయాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. -
హీరోయిన్ లయ ఫ్యామిలీ టైమ్ (ఫొటోలు)
-
'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
-
సూపర్‌స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు)
-
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు


