సమంత కొత్త సినిమా.. పూజ కార్యక్రమంలో రాజ్‌ నిడిమోరు! | Tollywood Actress Samantha Ruth Prabhu Latest Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

Samantha: గ్రాండ్‌గా సమంత కొత్త సినిమా ప్రారంభం.. రాజ్‌ నిడిమోరు సందడి!

Oct 27 2025 6:35 PM | Updated on Oct 27 2025 7:39 PM

Tollywood Actress Samantha Ruth Prabhu Latest Movie Pooja Ceremony

టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) ఇటీవల దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అఫీషియల్‌గా బయటికి చెప్పకపోయినా వీరిద్దరి రిలేషన్‌పై గత కొన్ని నెలలుగా రూమర్స్‌ వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా కూడా వీరిద్దరు నోరు విప్పలేదు.  

ఇదంతా పక్కనపెడితే సామ్ తెలుగులో మరో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె మరోసారి జతకట్టింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఈ దసరా సందర్భంగా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. ముహుర్తం షాట్‌తో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా..  ఓ బేబీ మూవీ తర్వాత  దర్శకురాలు నందిని రెడ్డితో సమంత  చేస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. ఈ మూవీని తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై సామ్ నిర్మిస్తోంది. ఈ  చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు, హిమాంక్‌ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ని స్థాపించిన సామ్.. శుభం అనే తొలి సినిమా నిర్మించింది. ఇందులో అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం మా ఇంటి బంగారంతో పాటు ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

s
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement