'అఖండ 2' సినిమాకు తొలిరోజే హైదరాబాద్‌లో 3 కోట్ల టికెట్స్ సేల్ అయ్యాయా? సోషల్ మీడియాలో ఈ మూవీ టికెట్స్, కలెక్షన్స్ గురించి కొందరు చెబుతున్న మాటలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓ యూట్యూబ్ జర్నలిస్ట్, గురువారం సాయంత్రం మాట్లాడుతూ.. ఈ చిత్రానికి ఒక్క హైదరాబాద్‌లోనే తొలిరోజు ఏకంగా 3 కోట్ల టికెట్స్ బుక్ అయ్యాయని చెప్పింది. చెబుతున్నది అతి అయినప్పటికీ ఏ మాత్రం తడబడకుండా చెప్పడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి గురవుతోంది.
(ఇదీ చదవండి: కోర్ట్ ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. 'అఖండ 2' టీమ్ పై హైకోర్ట్ ఆగ్రహం)
హైదరాబాద్ ప్రస్తుత జనాభా దాదాపు కోటి 20 లక్షలు. అందరూ సినిమా చూసినా సరే 3 కోట్ల టికెట్స్ సేల్ కావుగా? ఈమె మాత్రం తొలిరోజే కోట్లాది టికెట్స్ విక్రయించేశారని చెబుతోంది. సరే జనాభా విషయం కాసేపు పక్కనబెడదాం. హైదరాబాద్‌లో దాదాపు 241 థియేటర్లు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ 120 వరకు ఉండగా వీటిలో సుమారు 1.2 లక్షల సీట్లు ఉన్నాయి. మల్టీఫెక్స్‌లు దాదాపు 120 వరకు ఉండగా వీటిలో 2.2-2.5 లక్షల సీట్లు ఉన్నాయి. అంటే సిటీలో మొత్తంగా చూసుకున్నా అన్ని థియేటర్లలో మూడున్నర నుంచి నాలుగు లక్షల సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాబోయే పదిరోజులకు కలిపి టికెట్స్ సేల్ చేసినా సరే 40 లక్షల కంటే దాటవు. అలాంటిది 3 కోట్ల టికెట్స్ అనడం అతికే పరాకాష్ట!
'అఖండ 2' సినిమా ఎలాగైతేనేం థియేటర్లలోకి వచ్చేసింది. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాలి. కానీ నిర్మాతలు అప్పుడెప్పుడో చేసిన అప్పుల కారణంగా కోర్టుల చుట్టూ మూడు నాలుగు రోజులు తిరిగి, అంతా సెటిల్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ చేశారు. గురువారం సాయంత్రం ప్రీమియర్లతో షోలు పడ్డాయి. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షోలు వేశారు. సినిమా ఫలితం గురించి చెప్పుకొంటే అభిమానులకు మాత్రమే నచ్చగా.. మిగతా వాళ్లకు కనీసం అంటే కనీసం నచ్చట్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ‘అఖండ 2: తాండవం’ సినిమా రివ్యూ)


