మలయాళ ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన 'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్సు' చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సుమారు 10నెలల తర్వాత ఓటీటీలోకి రానున్నడంతో నెట్టింట పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. తమిళ ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే, మమ్ముట్టి సొంత ప్రోడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. గోకుల్ సురేష్, సుష్మిత భట్ తదితరులు నటించారు.

డిసెంబర్ 19న జీ5 వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుంది. ఇందులో మమ్ముట్టి మాజీ పోలీస్ ఆఫీసర్ డొమినిక్‌గా నటించారు. ఒక కేసుకు సంబంధించి పూజా అనే యువతి పర్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మిస్సింగ్ కేసును సరికొత్తగా ఎలా దర్యాప్తు చేశారనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాను తెరకెక్కించారు. పూజా అనే యువతికి, ఈ పర్సుకు ఉన్న లింక్ ఏంటి..? ఆమెను ఎవరు హత్య చేశారు..? ఇందులో ఆమె బాయ్‌ఫ్రెండ్ పాత్ర ఉందా..? వంటి అంశాలను చాలా చక్కగా చూపించారు.


