టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.
నేనూ మనిషినే..
కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్‌లో మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్‌లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.
నొప్పితో విలవిల
తర్వాత లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది.


