breaking news
Bigg Boss
-
'పురుషులు, మహిళలు ఓకే బెడ్‌పై.. బిగ్‌బాస్‌పై నటి షాకింగ్ కామెంట్స్'
బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఏడుస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తాజాగా ఈ బాలీవుడ్ భామ బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన కామెంట్స్ చేసింది. గత 11 ఏళ్లుగా తనకు బిగ్‌బాస్ ఆఫర్ వస్తోందని తెలిపింది. కానీ ఈ అవకాశాన్ని తాను తిరస్కరిస్తూనే ఉన్నానని వెల్లడించింది. తనకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేసినా కూడా ఈ షోలో పాల్గొనని మేకర్స్‌కు తేల్చి చెప్పానని పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజైరన తనుశ్రీ దత్తా బిగ్‌బాస్ షోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిర్మాతలు తనకు నింగి నుంచి చంద్రుడిని తీసుకొచ్చినా.. నా లైఫ్‌లో ఎప్పటికీ బిగ్‌బాస్‌లో పాల్గొనని చెప్పింది.తనుశ్రీ దత్తా మాట్లాడుతూ..'బిగ్‌బాస్ ఆఫర్ ప్రతి ఏటా వస్తోంది. ఈ షోలో పాల్గొనాలని మేకర్స్ తనను సంప్రదిస్తారు. ప్రతి ఏటా ఈ రియాలిటీ షో కోసం నాకు రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. ఎందుకంటే వారు మరో బాలీవుడ్ సెలబ్రిటీకి కూడా అంతే మొత్తాన్ని ఇచ్చారు. ఆమె కూడా నా స్థాయి నటినే. అంతకంటే ఎక్కువ డబ్బు కూడా ఇస్తామని బిగ్‌బాస్ మేకర్స్‌లో ఒకరు ఆఫరిచ్చారు. కానీ తిరస్కరించాను. ఎందుకంటే ఈ షోలో పురుషులు, మహిళలు ఓకే బెడ్‌పై పడుకుంటారు. అదే ప్లేస్‌లో కోట్లాడుకుంటారు. నా ఆహారం విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటా. ఈ రియాలిటీ షో కోసం ఒకే మంచంపై మరో వ్యక్తితో పడుకునే అమ్మాయిని అని వారు ఎలా అనుకుంటారు?.. నేను అంత చీప్ కాదు. వారు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లను. నేను నా ఫ్యామిలీతోనే కలిసి ఉండనని.. తనకంటూ ప్రత్యేక స్పేస్ కోరుకునేదాన్ని' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. -
నన్ను నేనే తిట్టుకున్నా.. చచ్చిపోవాలని ట్రై చేశా: నైనిక
డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నైనిక అనసురు (Nainika Anasuru) తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. టాస్కుల్లో బాగానే పర్ఫామ్ చేసినప్పటికీ ఫినాలే వరకు వెళ్లలేకపోయింది. కవర్ సాంగ్స్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను, కెరీర్లో అనుభవించిన బాధలను పంచుకుంది.చచ్చిపోవాలని ట్రై చేశా..నైనిక మాట్లాడుతూ.. 'ఢీ షో చేస్తున్న సమయంలోనే నేను డిప్రెషన్‌కు గురయ్యాను. నా ఫ్యామిలీతో సహా ఎవరూ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోలేదని బాధపడ్డాను. ఇంట్లోవాళ్లు పాతకాలం మనుషుల్లా ఆలోచించేవారు. వేధింపులను కూడా కొంతవరకు భరించాలన్నట్లుగా చెప్పేవారు. కానీ, అది నా వల్ల కాదు. ఎవర్నీ ఏమీ అనలేక, ఏం చేయలేక పది మంది ముందు నన్ను నేనే తిట్టుకుని ఏడ్చేదాన్ని. ఎందుకిలా అయిపోతున్నానో అర్థం కాలేదు. చనిపోయేందుకు ప్రయత్నించాను. దాదాపు ఏడాదిపాటు బాధపడుతూ నా జీవితాన్ని వృథా చేసుకున్నాను. ఇండస్ట్రీలో చీకటి కోణంకానీ, దానివల్లే నన్ను నేను ఎంత ప్రేమించుకోవాలో తెలిసొచ్చింది. ఇకపోతే ఇండస్ట్రీలో అందరూ నిలదొక్కుకోలేరు. నిజాయితీగా మాట్లాడాలంటే నాకు ఓ కూతురుంటే తనను ఈ ఇండస్ట్రీకి అస్సలు పంపించను. వద్దని చెప్పేస్తా! ఇండస్ట్రీలో చాలా చీకటికోణాలున్నాయి. అవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. కాస్టింగ్ కౌచ్‌లాంటివి ఫేస్ చేశాను. కొందరు డైరెక్ట్‌గా కాల్ చేసి మరీ అడుగుతుంటారు. సినిమా ఆఫర్లు ఇచ్చి కమిట్మెంట్స్ అడిగారు. అందరూ గలీజ్ అయిపోయారు.దరిద్రంగా తయారైందిఈ మధ్య నాకు ఓ రియల్ ఎస్టేట్ గ్రూప్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్ కోసం అనుకున్నా.. కాదు, పర్సనల్ అన్నారు. ఆయనేమంటున్నారో అర్థం కాకపోయినా డీల్ ఏంటో చెప్పండి అన్నాను. అందుకతడు.. మీ గురించి బయట ఓ ప్రచారం జరుగుతోంది. మీకు ఓ రేట్ ఫిక్స్ చేస్తున్నారు. మీ ఫోటోలతో పాటే ఆ రేట్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు అన్నాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇండస్ట్రీ ఎంతో దరిద్రంగా తయారైందనేది! అని నైనిక బాధపడింది.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ నెల ప్రారంభమైన బిగ్‌బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా ఆరుగురు కామనర్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. అంతే కాకుండా రాను.. బొంబాయికి రాను అంటూ ఊపేసిన రాము రాథోడ్ సైతం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఫోక్ సాంగ్‌తో వైరలైన రాము రాథోడ్ బిగ్‌బాస్‌లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే రాము రాథోడ్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనలవుతున్నారు. రామును అలా చూడడం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏడ్చేశారు. మాకు చదువు రాదని.. రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని.. ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు. కానీ అవన్నీ ఆటలో భాగమని మాకు తెల్వదని అంటున్నారు రాము పేరేంట్స్. అంతేకాకుండా రాము అందరికీ నచ్చే మనిషి అని అతని తల్లి అన్నారు. అందరినీ బాగా పలకరిస్తాడని చెప్పారు. రామును టీవీల్లో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్‌గా మాట్లాడారు. నువ్వు చివరికీ వరకు హౌస్‌లో ఉండి కప్ గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. రాము గెలిస్తే మహబూబ్‌నగర్‌లోని గోపాలపురమంతా డ్యాన్స్ చేస్తామని అంటున్నారు అతని తల్లిదండ్రులు. ఏదేమైనా ఒక్క పాటతో ఫేమ్ తెచ్చుకుని బిగ్‌బాస్ వరకు వెళ్లిన రాము రాథోడ్ కప్ గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు. -
'బిగ్‌బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్
తెలుగులో బిగ్‌బాస్ షో మొదలై వారం రోజులైంది. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. అయితే ప్రారంభం నుంచి ఏ మాత్రం జోష్ లేకుండా సాగుతోంది. మరోవైపు మలయాళంలోనూ 7వ సీజన్ షురూ అయి దాదాపు నెలరోజులకు పైనే అయింది. అక్కడ కూడా సాదాసీదాగానే సాగుతున్న షో కాస్త ఇప్పుడు మోహన్ లాల్ కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఓ లెస్బియన్ జంటని లేడీ కంటెస్టెంట్ అవమానించడమే దీనికి కారణం. ఇంతకీ అసలేమైంది?(ఇదీ చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..?)మలయాళ బిగ్‌బాస్ ప్రస్తుతం 7వ సీజన్ నడుస్తోంది. దీనికి మోహన్ లాల్ హోస్ట్. రీసెంట్గా వీకెండ్ ఎపిసోడ్లో ఈయన విశ్వరూపం చూపించాడు. లక్ష్మీ అనే కంటెస్టెంట్.. అదిలా-నూరా అనే లెస్బియన్ జంటపై దారుణమైన కామెంట్స్ చేసింది. 'అసలు మిమ్మల్ని ఈ హౌసులోకి ఎవరు రానిచ్చారు? మీకు ఇక్కడికి వచ్చేందుకు ఏ మాత్రం అర్హత లేదు' అని అనేసింది.దీంతో మోహన్ లాల్.. హౌస్‌మేట్ లక్ష్మీపై ఫుల్ ఫైర్ అయిపోయారు. 'అసలు హౌసులోకి రావడానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు?' అని మోహన్ లాల్ ప్రశ్నించాడు. తన కామెంట్స్‌ని కవర్ చేసేందుకు లక్ష్మీ ప్రయత్నించగా.. 'వాళ్లని నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు కాస్త ఆలోచించు. అసలు ఇలా మాట్లాడేందుకు నీకేం అర్హత ఉంది? వాళ్ల పక్కన ఉండలేకపోతే హౌస్ నుంచి వెళ్లిపో. గెటౌట్' అని మోహన్ లాల్ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హౌస్టింగ్ అంటే ఇది అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: మీదే తప్పు.. నాగార్జునకే ఝలక్ ఇచ్చిన మాస్క్ మ్యాన్) -
ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి
మేమే తోపు.. మేము చెప్పిందే కరెక్ట్ అంటూ విర్రవీగిన కామనర్లకు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. అంతేకాదు, ఎవరూ సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఇంకా బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు. తర్వాత మిరాయ్ హీరోహీరోయిన్ తేజ సజ్జ, రితికా స్టేజీపైకి వచ్చారు. ఇంటిసభ్యులను రెండు టీమ్స్‌గా డివైడ్ చేయగా వాటికి తేజ, రితిక లీడర్స్‌గా ఉన్నారు. రెచ్చిపోయిన భరణిహౌస్లో వాళ్లు ఓడిపోయినప్పుడల్లా స్టేజీపై వీళ్లతో డ్యాన్స్ చేయించాడు నాగ్ (Nagarjuna Akkineni). అలా గెస్టులుగా వచ్చినవారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడు. అనంతరం టెనెంట్స్‌లో నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. ఇందుకోసం సెలబ్రిటీలు రెండు టీములుగా విడిపోయి ఫైట్ చేశారు. రెజ్లింగ్ పోటీలకు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు. భరణి అయితే దొరికిందే ఛాన్స్.. తన సత్తా ఏంటో చూపిస్తా అన్నట్లుగా రెచ్చిపోయి గేమ్ ఆడాడు.పర్మినెంట్ ఓనర్‌గా భరణిఆడ, మగ తేడా లేకుండా అందర్ని ఈడ్చి అవతల పారేశాడు. ఈ గేమ్‌లో భరణి, తనూజ, రాము రాథోడ్, శ్రష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది. వీళ్లలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీమ్ డిసైడ్ చేయాలన్నారు. సంచాలక్ ఫ్లోరా శ్రష్టికి ఓటేసింది. కానీ ఓడిన బ్లూ టీమ్‌లోని ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి అందరూ భరణికి ఓటేశారు. దీంతో అతడు పర్మినెంట్ ఓనర్‌గా మారిపోయాడు. భరణిని ఓనర్‌గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయాయి. మాట మార్చిన ఇమ్మాన్యుయేల్అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బందవుతోంది, తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లను చేస్తానన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే శ్రష్టి, తనూజలను కాదని భరణిని ఎంచుకోవడం గమనార్హం. భరణి.. తనూజను పర్సనల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేసుకున్నాడు. చివర్లో డిమాన్ పవన్ సేవ్ అవగా శ్రష్టి వర్మ (Shrasti Verma) ఎలిమినేట్ అయింది. వెళ్లిపోయేముందు ఆమె ఓ టాస్క్ ఇచ్చారు. నమ్మకం మీద దెబ్బ కొట్టారుఅందులో భాగంగా జెన్యూన్‌గా ఉండే నలుగురు, కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురి పేర్లు చెప్పమన్నారు. అందుకామె రాము రాథోడ్, మర్యాద మనీష్, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ జెన్యూన్ అంది. రీతూ కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉంటుందని పేర్కొంది. నమ్మకం మీద దెబ్బ కొట్టారు, ఒక్కసారి నమ్మకం పోతే మళ్లీ రాదంటూ తనూజ, భరణి పేర్లు చెప్తూ శ్రష్టి ఎమోషనలైంది. సంజనా పేరు ప్రస్తావించింది.. కానీ తను చాలా స్ట్రాంగ్ అని పేర్కొంది. ఇక వెళ్లిపోయేముందు తను చేసే క్లీనింగ్ టాస్క్.. ఇకపై సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్‌బాంబ్ వేసింది.చదవండి: Bigg Boss: 'శ్రష్టి వర్మ' ఎలిమినేట్.. ఎంత సంపాదించింది..? -
బిగ్‌బాస్ సీజన్-9 డేట్ వచ్చేసింది.. హోస్ట్‌గా ఆ స్టార్ హీరోనే!
బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌తో అన్ని భాషల్లో సక్సెస్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. తెలుగులో సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా మొదలైంది. ఇప్పుడు తమిళ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. అక్కడ తమిళ బిగ్‌బాస్ సీజన్-9 కావడం మరో విశేషం.ఈ సీజన్‌ను వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సీజన్‌కు కూడా స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్‌బాస్ సీజన్ -7 తర్వాత కమల్ హాసన్ తప్పుకోవడంతో విజయ్ సేతుపతి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ రియాలిటీ షో విజయ్ టీవీతో పాటు జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. பாக்க பாக்க தான் புரியும்.. போக போக தான் தெரியும்Bigg Boss Tamil Season 9 | Grand Launch - அக்டோபர் 5 முதல்..😎 #BiggBossSeasonTamil9 #OnnumePuriyala #BiggBoss9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #VijayTV #VijayTelevision pic.twitter.com/ZdbtAolWH8— Vijay Television (@vijaytelevision) September 13, 2025 -
ఏళ్ల తరబడి డిప్రెషన్లో.. ఆ బాధతోనే బిగ్‌బాస్‌కు.. ఎవరీ మాస్క్ మ్యాన్?
'దేవుడు దిగొచ్చినా నా తీరు మార్చుకోను, నేను మాట్లాడేదే రైటు, నా నెత్తికెక్కాలని చూస్తే తొక్కిపడేస్తా..' ఈ డైలాగులు, పద్ధతి అంతా మాస్క్ మ్యాన్‌దే! తన తప్పులను నాగార్జున ఎత్తిచూపినా సరే.. అవసలు తప్పే కాదన్నట్లు అడ్డదిడ్డంగా వాదించాడు. ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం, అబ్బాయిలను అడంగిలుగా పోల్చడం.. ఇలా తప్పు మీద తప్పులు చేస్తూ ఈ వారం హైలైట్ అయ్యాడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీశ్. అసలు ఇతడెవరు? చూసేద్దాం..మాస్క వెనక రహస్యంసమాజంలో చాలామంది కనబడని మాస్కు వేసుకుంటారు. అది చెప్పడానికే హరీశ్ మాస్కు ధరించడం మొదలుపెట్టాడు. అయితే అతడు మాత్రం లోపల ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి దాదాపు 12 ఏళ్లుగా నోస్ మాస్క్ ధరిస్తూ వచ్చాడు. ఐదు నెలలుగా ముఖానికి మాస్క్ పెట్టుకోవడం ప్రారంభించాడు. విజయవాడలో పుట్టిపెరిగిన హరీశ్ హైదరాబాద్‌లో సెటిలయ్యాడు.అన్ని ఉద్యోగాల్లో..ట్యూషన్స్ చెప్పాడు, ఇంటింటికీ తిరిగి చేతి గడియారాలు అమ్మాడు. స్కూల్లో టీచర్‌గా మారాడు. బ్యాంకింగ్, టెలికాం, ఫార్మా, ఫైనాన్స్.. ఇలా అన్ని రంగాల్లో రకరకాల ఉద్యోగాలు చేశాడు. అయినా ఎక్కడా తనకు సంతృప్తి కలగలేదు. హరీశ్‌ది ప్రేమ పెళ్లి. హరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. దేవుడిని నమ్మని ఇతడి పెళ్లి గుడిలో జరిగింది. వివాహం తర్వాత విభేదాలు రావడంతో దాదాపు ఏడేళ్లపాటు ఫ్యామిలీస్‌కి దూరంగా ఉన్నారు.యాక్సిడెంట్2017లో హరీశ్‌కు యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత సిస్టర్ను కోల్పోయాడు. అప్పుడే డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏళ్ల తరబడి ఆ డిప్రెషన్‌ను అలాగే కొనసాగిస్తున్నాడు. ఈ బాధలోనే ఓసారి భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ డిప్రెషన్‌తోనే బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. ఇప్పుడు హౌస్‌లో అపరిచితుడిలా రకరకాల షేడ్స్ చూపిస్తున్నాడు. ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. తన తప్పులను సరిదిద్దుకోకపోతే అతడు హౌస్‌లో కొనసాగడం కష్టమే!చదవండి: నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా? -
ఫోటోతో పాటు కింద నా రేటు కూడా వేసి వైరల్ చేశారు: బిగ్‌బాస్ నైనిక
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణమని, సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అయితే గతంలో దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు భయపడేవారు. కానీ ఈ మధ్య తమకు ఇబ్బంది కలిగిస్తే.. మీడియా ముఖంగా వారి పేర్లను బటయపెడతున్నారు. క్యాస్టింగ్ కౌచ్‌పై చర్చిస్తూ.. నూతన నటీనటులకు అవగాహన కలిగిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపుల గురించి బాహాటంగానే వెల్లడించారు. తాజాగా డ్యాన్సర్, బిగ్‌బాస్ ఫేం నైనిక కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. చాలామందిలాగానే తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యానని చెప్పింది. కమిట్మెంట్ ఇస్తే.. సినిమా చాన్స్ ఇస్తామని చాలా మంది అడిగారని, తాను నో చెప్పడంతో వాళ్లంతా మళ్లీ కాల్ చేయలేదని చెప్పింది. తాజాగా ఆమె ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.‘సినీ ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్‌గా తయారైంది. అందరూ గలీజ్ అయిపోయారు. ఓపెన్‌గానే కమిట్మెంట్ అడిగేస్తున్నారు. ఆ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి..‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన బ్రాండ్‌ని ప్రమోట్ చేయాలేమో అనుకున్నా. ఓకే చెప్పా. ఆయన మరోసారి ‘పర్సనల్ రిక్వెర్మెంట్’ అని చెప్పడంతో నాకు అర్థమైంది. నాకు తెలిసిన వ్యక్తి కావడంతో.. ‘మీ ఫోటోతో పాటు మీ రేటు కూడా బయటకు వెళ్తుంది. బాగా వైరల్ అయింది’ అని చెప్పాడు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిల వల్లే ఈ ఫార్మెట్ క్రియేట్ అయింది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు కూడా. నేను ఆర్టిస్ట్ అయినా కూడా.. ఒకవేళ నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి రానివ్వను. ఈ ఫీల్డ్ మంచిది కాదని చెబుతా’అని నైనిక చెప్పుకొచ్చింది.ఇక తన తండ్రి గురించి కూడా నైనిక చెప్పుకొచ్చింది. ఆయన తమతో ఉండరని, తానే ఇంటి నుంచి పంపేశానని చెప్పింది. ‘డాడీ మాతో ఉండరు. డొమెస్టిక్ వైలెన్స్ చేశారు. ఆయన మంచోడు కాదు. అమ్మని టార్చర్ చేశాడు. అందుకే నేను డాడీని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పా. ‘నువ్వు ఉంటే నేను ఇంట్లో ఉండను’ అని డాడీతో చెప్పా. ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు. డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. అమ్మ నన్ను చాలా బాగా పెంచింది. కష్టపడి ఆడిషన్స్‌కి తీసుకెళ్లేది. అమ్మలా నేను కూడా నా పిల్లలను పెంచలేను. ఆమెకు ఒక మంచి ఇళ్లు కొనివ్వడమే నా లక్ష్యం’ అని నైనిక చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. బిగ్‌బాస్ 8 లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తూనే..ఆర్టిస్ట్‌గానూ ప్రయత్నాలు చేస్తుంది. -
నాగార్జుననే నిందించిన మాస్క్ మ్యాన్.. ఇంత తలపొగరా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.కామనర్స్‌కు క్లాస్ పీకిన నాగ్సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్‌పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్‌ను నిలదీశాడు నాగ్.రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్‌తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు. వీడియో బయటకు లాగిన నాగ్అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్‌కు చిన్నచూపు ఉందని క్లియర్‌గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్‌ను రాంగ్గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్‌మేట్స్‌తో పాటు నాగ్పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్‌ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్ -
ఎలిమినేషన్లో ట్విస్ట్.. 'పుష్ప' కొరియోగ్రాఫర్ ఔట్!
మొన్ననే బిగ్‌బాస్ 9 మొదలైంది. అప్పుడే మొదటి వీకెండ్ వచ్చేసింది. వారాంతం వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తాడు. నామినేట్ అయినవాళ్లలో కచ్చితంగా ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. అయితే ఈసారి సెలబ్రిటీలుగా వచ్చిన వారిలో భరణి తప్పితే అందరూ నామినేషన్స్‌లో నిలిచారు. మరోవైపు సామాన్యుల నుంచి డీమాన్ పవన్ ఇందులో ఉన్నాడు. వీరిలో ఇద్దరు మాత్రం చివరి ప్లేసుల్లో నిలిచారు. ఇప్పుడు వారిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తేలింది.ఈ వారం నామినేట్ అయినవాళ్లలో లక్స్ పాప ఫ్లోరా సైనీ.. బయటకొచ్చేస్తుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే సంజనతో గొడవ పడటం తప్పితే ఈమెకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. అలా అని కెప్టెన్సీ టాస్క్‌లో ఏమైనా ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే అదీ లేదు. దీంతో ఈమెనే తొలివారం ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ 'పుష్ప' కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: మీదే తప్పు షో నుంచి వెళ్లిపోతా.. నాగార్జునకు మాస్క్ మ్యాన్ ఝలక్)బిగ్‌బాస్ హౌసులోకి శ్రష్ఠి వర్మ వస్తుందని రూమర్స్ వచ్చినప్పడు.. ఈమె కచ్చితంగా కొన్నివారాలైనా సరే ఉంటుంది. తన జీవితంలో జరిగిన వివాదం గురించి ఎప్పుడైనా మాట్లాడకపోదా అని అందరూ అనుకున్నారు. అలానే షో మొదలైన రోజు నాగార్జునతో మాట్లాడుతూ.. మనం కలిసి సినిమా చేయాలి సర్ అని అడిగింది. దీంతో త్వరగా బయటకొచ్చేయ్ అని నాగ్ సరదాగా అన్నాడు. మరి ఈ మాటల్ని సీరియస్‌గా తీసుకుందో ఏమో తొలివారమే ఈమెని ఎలిమినేట్ చేసినట్లు అనిపిస్తుంది.సాధారణంగా తొలివారం ఎలిమినేషన్ అనగానే సీనియర్ నటుల్ని బయటకు పంపిస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అనుహ్యంగా యంగ్ బ్యూటీని ఔట్ చేయడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు బిగ్‌బాస్ కూడా ఊహలకు అందని విధంగా చేస్తుంటాడు. మరి ఈసారి అసలేం జరిగింది? అనేది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?) -
ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్ మ్యాన్ దారుణ కామెంట్స్.. బాడీ షేమింగ్ కూడా!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్‌బాస్ షోకి కావాల్సిన కంటెంట్ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచింది.సత్తా చూపించిన రాముఅయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కామనర్లు అతి చేశారు. పవన్ కల్యాణ్ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్ అయింది.బాడీ షేమింగ్నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సంజనా.. తన లగేజీకి రూమ్‌లోకి షిఫ్ట్ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు, చిప్స్ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. ముగ్గురు ఆడోళ్లుఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.దొంగతనం చేసిన మాస్క్ మ్యాన్కెప్టెన్ సంజనా హౌస్‌మేట్స్‌కు బంపరాఫర్ ఇచ్చింది. తనను ఇంప్రెస్ చేస్తే కూల్‌డ్రింక్ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్ ఓ కూల్‌డ్రింక్ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్ చేసేందుకు అందరూ స్కిట్ చేశారు. స్కిట్ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్‌డ్రింక్ ఇచ్చేముందు ఓ కూల్‌డ్రింక్ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి! -
ఇన్నాళ్లూ భరణి, ఇమ్మాన్యుయేల్ మగాళ్లనుకున్నా.. అంతమాటన్నాడేంటి?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలుంటాయి. అవి లేకపోతే షో పసే ఉండదు. కానీ కొందరు మరీ హద్దులు మీరి మాట్లాడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీశ్ ఇప్పుడదే చేశాడు. హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. సంచాలక్ మర్యాద మనీష్ వల్ల ఈ టాస్క్ గందరగోళంగా మారింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీజ గెలిచి సంజనాను కెప్టెన్ చేసిందన్న విషయం ఇదివరకే లీకైంది.భరణి, ఇమ్మాన్యుయేల్.. ఆడవాళ్లు!అయితే తాజా ప్రోమోలో హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్.. ఇన్నాళ్లూ వీళ్లు ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలనుకున్నాను. ముగ్గురు ఆడవాళ్లతో ఫైట్ చేశానని ఇప్పుడర్థమైంది అని కామెంట్స్ చేశాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తనను బాడీ షేమింగ్ చేశాడని ఇమ్మాన్యుయేల్ బాధపడ్డాడు. బాడీ షేమింగ్ చేసినట్లు ఎపిసోడ్లో క్లిప్ వస్తే మాత్రం కచ్చితంగా నాగ్ చేతిలో పవన్ కల్యాణ్‌కు తిట్లు ఖాయం! అలాగే హరీశ్, మనీష్‌లకు కూడా క్లాస్ పడేట్లు కనిపిస్తోంది. చదవండి: మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి? -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్‌ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్‌బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్‌గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్‌ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్‌గా నిలబడేవారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్‌కు భరణి, సంజనకు శ్రీజ, పవన్‌కు ప్రియ, హరీశ్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్‌గా వచ్చారు.సంచాలక్‌గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్‌ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్‌కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్‌ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్‌ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్‌గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్‌గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్‌ఫెయిర్ అంటూ అని మనీష్‌ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్‌గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్‌బాస్‌కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్‌లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ -
'మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు'.. మర్యాద మనీశ్ ఫైర్!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ బుల్లితెర ప్రియులను అలరిస్తోంది. మొదటి వారం నుంచే హౌస్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నామినేషన్స్ తంతు ముగియగానే ఒకరిపై ఒకరు తమ ఆగ్రహాన్ని ప్రదరిస్తునే ఉన్నారు. ఇవాళ కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఎపిసోడ్ ఫుల్ సీరియస్‌గా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ఇవాల్టి బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మర్యాద మనీశ్, ప్రియా శెట్టి, శ్రీజ దమ్ముల మధ్య పెద్ద వార్ నడిచింది. మీ ఇద్దరు ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటున్నారని ప్రియా, శ్రీజపై మర్యాద మనీశ్ మండిపడ్డారు.నేను కామ్‌గా ఉన్నానని నన్ను సెపరేట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు. ఆ తర్వాత ప్రియాశెట్టి.. మర్యాద మనీశ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ప్రోమో చూస్తుంటే హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ ఫైటింగ్ నడిచినట్లు తెలుస్తోంది.Fights heating up! 🔥 #PriyaShetty & #SrijaDammu Vs #ManishMaryada🤯Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat–Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/EUTUXSKlR4— JioHotstar Telugu (@JioHotstarTel_) September 11, 2025 -
బిగ్‌బాస్ మానస్ కుమారుడి ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మా బంగారు తల్లి ఊయల ఫంక్షన్.. ఫోటోలు షేర్ చేసిన గౌతమ్ (ఫోటోలు)
-
హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలుపెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికేవాళ్లుంటారు. ఈ సీజన్లో కూడా మూడు రోజుల్లోనే కావాల్సినదానికంటే ఎక్కువ రభసే జరుగుతోంది. దానికి మూల కారణం సంజనా (Sanjana Galrani)! ఈమె సరదాసరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతోంది. నిజంగా గొడవపడితే హౌస్ ఏమైపోతుందో మరి!అందరికీ పూనకాలు తెప్పిస్తున్న సంజనాతను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్‌లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పని చేశారు. కానీ సంజనా మాత్రం తాపీగా సోఫాలో కూర్చుని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఆ ఒక్క సీన్ చాలు.. నువ్వుండాలమ్మా.. కచ్చితంగా ఉండాల్సినదానివే! అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటోంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు. కానీ, అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్‌లో ఈమెనే అందరికంటే హైలైట్‌గా నిలుస్తోంది.కెప్టెన్‌గా..ఇకపోతే నేడు కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలక్ట్ చేయమని బిగ్‌బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట! దాంతో ఆమె హరీశ్, శ్రష్టి, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్‌లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ.. అటు తిరిగి, ఇటు తిరిగి కెప్టెన్సీ సంజనా చేతికి చిక్కిందట! గుడ్డు దొంగిలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరనుంది సంజనా. కెప్టెన్‌గా అందరినీ ఎలా ఆటాడిస్తుందో చూడాలి!చదవండి: 5 నెలల పాప.. గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?: సంజనా ఫైర్ -
బిగ్‌బాస్: 5 నెలల పాప.. అయితే గుడ్డు దొంగిలించడానికి సిగ్గు లేదా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో మొదటివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. కామనర్స్ నుంచి డిమాన్ పవన్, సెలబ్రిటీలలో భరణి మినహా మిగతా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఈ షోకి కావాల్సిన కంటెంట్ నేనిస్తానంటూ ఫుల్ జోష్ మీదుంది సంజనా. మొన్న షాంపూ కోసం పంచాయితీ పెట్టిన ఆమె నిన్న గుడ్డు దొంగిలించి అందరికీ బీపీలు వచ్చేలా చేసింది. గుడ్డు ఎవరు కొట్టేశారో అర్థం కాక ఓనర్స్ (కామనర్స్) తల పట్టుకున్నారు. టెనెంట్స్లోనే అసలైన దొంగ ఉన్నాడని తెలిసి వాళ్లందరిపైనా ఒంటికాలిపై లేచారు.అందరి అనుమానం తనపైనేమీరు ఇంట్లో అడుగుపెట్టేదే లేదని టెనెంట్స్‌పై ఆంక్షలు విధించారు. అయితే అందరి అనుమానం సంజనా (Sanjana Galrani)పైనే.. కానీ ఆమె మాత్రం ఓపక్క నవ్వుతూ, మరోపక్క అమయాకంగా ముఖం పెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. ఈ క్రమంలో భరణి, హరీశ్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇలా అందరూ అరుచుకుంటూ ఉంటుంటే అప్పుడు సంజనా సైలెంట్‌గా వచ్చి.. ఆకలేసి నేనే గుడ్డు తిన్నా.. అడిగితే ఇవ్వరనే అలా చేశాను అని తాపీగా చెప్పింది. ఇరికించేసిందిగా!దీంతో ఓనర్లు.. అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పొచ్చు కదా? అని ఫైర్ అయ్యారు. ఇక సంజనా తాను తినేటప్పుడు కిచెన్‌లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని, రాముకు కూడా తెలుసని ఇరికించేసింది. దాంతో అందరూ షాకయ్యారు. శ్రష్టి అయితే సంజనా దగ్గరకు వెళ్లి.. గుడ్డు తినడానికి సిగ్గు లేదా? అని తిట్టేసింది. అటు రీతూ చౌదరి.. మీ ముగ్గురూ కలిసి గేమ్ ఆడారు అని భరణిపై ఫైర్ అయింది. అప్పుడు భరణి నోరు విప్పి జరిగిందంతా చెప్పాడు. ఏడ్చేసిన సంజనామేము కిచెన్‌లో ఉన్నప్పుడు సంజనా అక్కడికి వచ్చి ఎగ్ తీసుకుంటున్నానని తనూజకి చెప్పిందట. 5 నెలల బేబీని వదిలేసి వచ్చాను.. ఏదో ప్రాబ్లమ్ ఉందంది. అందుకే నేను సైలెంట్‌గా ఉన్నా అన్నాడు. అప్పుడు సంజనా ఎంటరై.. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, నా గురించి మీకు తెలీదు. నేను బాధితురాలిని. నేను ప్రతిరోజు ఏడుస్తూనే పడుకుంటాను అని ఏడ్చేసింది. అలా ఒక్క గుడ్డు దొంగతనంతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేసింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'కూలీ' సినిమా -
బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్!
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్‌బాస్‌లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్‌తో హౌస్‌ను హీటెక్కించారు బిగ్‌బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్‌బాస్ ప్రోమో చూసేయండి.Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025 -
నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్
కామనర్స్ అంటే బెరుకుగా, భయంభయంగా ఉంటారనుకున్నారేమో! కానీ, సెలబ్రిటీలనే బెదరగొడుతున్నారు. అందులోనూ బిగ్‌బాస్ వారికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఇంటిని కామనర్ల చేతిలో పెట్టాడు. వాళ్ల అనుమతితోనే టెనెంట్లు (సెలబ్రిటీలు) లోపల అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇంటి పని, వంటపని, అందరి బట్టలు ఉతికే పని కూడా సెలబ్రిటీలే చేస్తున్నారు.షేడ్స్ చూపిస్తున్న కామనర్స్ఒక్కోసారి సెలబ్రిటీల పరిస్థితి చూసి జాలిపడతారు, బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) వద్దన్నా సరే మానవత్వం అంటూ అరటిపండ్లు ఇచ్చేందుకు ముందుకొస్తారు. అదే సమయంలో వాళ్లు ఆకలిగా ఉందని ఏదైనా తింటే మాత్రం బిగ్‌బాస్ రూల్ మర్చిపోయారా? అని లాక్కుంటారు. వాళ్ల విధానాలు వారికే అర్థం కావాలి! ప్రస్తుతానికి హౌస్‌లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పక్షపాతం చూపించాడు బిగ్‌బాస్. కామనర్స్‌ను పక్కనపెట్టేసి టెనంట్స్ మాత్రమే ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలన్నాడు.చేతులెత్తి దండం పెట్టిన తనూజఅంతటితో ఆగలేదు.. వారి నామినేషన్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అన్నది చూడాల్సిన బాధ్యతను కామనర్స్‌కు అప్పగించాడు. ఇప్పటికే సంజనా, సుమన్ నామినేట్ అయ్యారు. తాజాగా ఈ నామినేషన్‌కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో శ్రీజ మాట్లాడుతూ.. వచ్చినప్పటి నుంచి కొన్ని రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారని తనూజ (Thanuja Puttaswamy)తో అంది. దానికామె చేతులెత్తి దండం పెట్టింది. పని కూడా చిరాకుపడుతూ చేస్తున్నారంది.అర్హత లేదని హెచ్చరికఒకరు ఒకసారి ఓ పని చెప్తారు. ఇంకొకరు వచ్చి ఇంకోపని చెప్తారు, నేనూ మనిషినే.. అంటూ తనూజ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించగా మధ్యలో మాస్క్ మ్యాన్ దూరాడు. నీ దయదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? మీ మాట, బాడీ లాంగ్వేజ్ బాగోలేదు అని తిట్టాడు. నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. కానీ తర్వాత మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. భరణి మినహా మిగతా అందరు సెలబ్రిటీలు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్, సుమన్, సంజన, ఫ్లోరా, రాము రాథోడ్, శ్రష్టి వర్మ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరితో పాటు కామనర్ డిమాన్ పవన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. చదవండి: రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు! -
రీతూ తలకు గాయం.. అదో పెద్ద సైకో! దాన్ని చూస్తేనే చిరాకు!
బిగ్‌బాస్ షో (Bigg Boss 9 Telugu)లో మొదటివారం నామినేషన్స్ సిల్లీగా ఉంటాయి. ఆమె నాతో మాట్లాడలేదు, తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు, ఆయన సరిగా ఇల్లు తుడవలేదు, నాకింకో ఆప్షన్ లేదు అంటూ నామినేట్ చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అందరికీ బలమైన పాయింట్ అందించేందుకు నేనున్నానంటూ సంజనా గల్రానీ అభయమిచ్చింది. చీటికిమాటికి చిరాకు పడుతూ, గొడవలతో విసుగు తెప్పిస్తూ అందరికంట్లో పడింది. నీ పనిమనిషినా?ఇంకేముంది ఓనర్స్ అందరూ కలిసి సంజనాను ఏకాభిప్రాయంతో నామినేట్ చేశారు. తర్వాత వాష్‌రూమ్ దగ్గర రచ్చ మొదలైంది. కండీషనర్, షాంపూ బాత్రూంలో పెట్టకండి, బయటపెట్టుకోండి అని ఫ్లోరా చెప్తుంటే సంజనా అడ్డంగా వాదించింది. విసుగెత్తిన ఫ్లోరా.. నేనేమైనా నీ పనిమనిషినా? బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. క్లీన్ చేయడానికి వెళ్లిన ప్రతిసారి అవి తీసి బయటపెట్టాలా? అని నిలదీసేసరికి సంజనా కోపం నషాళానికంటింది. మ్యానర్స్ లేదు, అదీ ఇదీ అని చెడామడా తిట్టేసరికి ఫ్లోరా ఏడ్చేసింది.ఫుటేజ్ కోసమా?అదంతా చూసిన శ్రీజ.. ఫుటేజ్ కోసమే సంజనా ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది. ఆ మాటతో అగ్గిమీద గుగ్గిలమైన సంజనా.. ఏమన్నావ్? ఫుటేజ్ కోసమా? నా ముందు వేలు చూపించి మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తూనే చీప్ అని తిట్టింది. తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్‌తో శ్రీజను చూపిస్తూ అది సైకో, దాన్ని చూస్తేనే చిరాకు అని చీదరించుకుంది తర్వాత టెనెంట్స్‌లో మీలో ఒకర్ని మీరే నామినేట్ చేసుకోవాలన్నాడు బిగ్‌బాస్. పోటీదారులు ఇద్దరు టన్నెల్స్‌లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి. రీతూ తలకు గాయంసుత్తిని అందుకున్నవారు నామినేషన్స్ చేస్తారు. ఈ ప్రక్రియలో రీతూ పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది. దాంతో ఆమెను మెడికల్ రూమ్‌కు పిలిచి తలకు కట్టు కట్టారు. తనూజ.. సంజనాను, రాము.. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎక్కువగా మౌన వ్రతంలోనే ఉంటున్న సుమన్.. ఎట్టకేలకు నిన్న నోరు విప్పాడు. కానీ సరిగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. మిగతా నామినేషన్స్ నేటి ఎపిసోడ్లో కొనసాగనున్నాయి.చదవండి: నా సినిమా.. అలా చేస్తే ఇండస్ట్రీ వదిలేస్తా: బెల్లంకొండ -
బిగ్ బాస్ హౌస్ లో మొదలైన రచ్చ.. మొదటిరోజే రెచ్చిపోయిన మాస్క్ మాన్..!
-
బిగ్‌బాస్ 9 తెలుగు హౌస్ టూర్ (ఫొటోలు)
-
నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్‌లో హీరోయిన్
బిగ్‌బాస్ షోలో అందరికీ నచ్చేది నామినేషన్స్. ఈ సీజన్లో మొదటి నామినేషన్స్ నేడు జరగనున్నాయి. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో అందరి టార్గెట్ హీరోయిన్ సంజన అనే కనిపిస్తోంది. బిగ్‌బాస్.. కామనర్లను ఓనర్లుగా ప్రధాన హౌస్‌లోకి పంపించి, సెలబ్రిటీలను టెనంట్లు(అద్దెకుండేవారు)గా గార్డెన్ ఏరియాలో ఉన్న బెడ్రూమ్కు పంపాడు. ఈరోజు నామినేషన్స్ ఓనర్స్ వర్సెస్ టెనంట్స్ అన్నట్లుగా జరగనుంది. టెనంట్స్లో నుంచి ఒకరిని ఓనర్స్ నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్.అబద్ధాలుదాంతో అందరూ కలిసి సంజన గల్రానీని సెలక్ట్ చేశారు. నీ వల్లే గొడవలు జరుగుతున్నాయి. అబద్ధాలాడుతున్నావ్, వెనకాల మాట్లాడుతున్నావ్ అంటూ కారణాలు చెప్పారు. ప్రియ బ్యాక్ బిచింగ్ అనగానే సంజనాకు మండిపోయింది. అలాంటి పదాలు వాడొద్దని హెచ్చరించింది. తర్వాత సంజనా- ఆశా గొడవపడ్డారు. నా పర్సనల్ రిలేషన్షిప్ గురించి పదేపదే మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? అని సంజనాను నిలదీసింది. (Bigg Boss 9 Telugu First Week Nominations)ఎలిమినేషన్ గండంఆమె నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరైతే కిచెన్‌లో అడుగుపెడతారో వారు ఎప్పుడూ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉంటారు. అందులోనూ మొదటివారం కిచెన్‌లో దూరినవారు మరోవారం కనిపించకుండా పోతారు, అదే ఎలిమినేట్ అవుతారు. మరి సంజనా ఈ గండం గట్టెక్కుతుందో, లేదో చూడాలి! -
గుండంకుల్.. ఎంతమాటన్నాడ్ సార్? అపరిచితుడు బయటకొచ్చేశాడు!
బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu) మొదలైంది. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు. మొదటి రోజే గొడవపడ్డారు. మాస్క్ మ్యాన్ హరీశ్, కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్యే ఈ గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్‌బాస్ అనే చెప్పాలి! సెలబ్రిటీలను కామనర్స్గా, కామనర్స్‌ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్‌బాస్. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక, ప్రధాన హౌస్‌లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. నోటి కాడ కూడును లాక్కున్నాడు కూడా!ఒక్క పూట అన్నం కోసం..వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్‌ను లోపల పెట్టేయమన్నారు. దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు. ఇది హరీశ్ తట్టుకోలేకపోయాడు. తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్‌బాస్‌కే క్లాస్ పీకాడు. వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటు మీద నుంచి లేచాడు. అంతేకాదు, బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు. దాంతో బిగ్‌బాస్ మరోసారి వారించాడు. గుండు అంకుల్.. బెడిసికొట్టిన కామెడీవారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీశ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అయినా బిగ్‌బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే.. ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు. అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెడ్తే.. సెలబ్రిటీలకు బిగ్‌బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట! ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు. హరీశ్‌ను గుండు అంకుల్ అన్నాడు. మొదట ఆయన పట్టించుకోలేదు, కానీ రెండుమూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్.. ఎవరు గుండు? ఎవరు అంకుల్? అని ఫైరయ్యాడు.బాడీ షేమింగ్అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము.. అన్నా సారీ చెప్పా కదా అని సముదాయించాడు. అయినా తగ్గని హరీశ్.. లిమిట్లో ఉండు, బాడీ షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇలా చాలాసేపు వీరిమధ్య ఫైట్ నడిచింది. ఆయన గుండు చేయించుకుందే బిగ్‌బాస్ కోసం! అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు. అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి.. మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది. అపరిచితుడు బయటకొచ్చేశాడుఇక బిగ్‌బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీశ్‌కు కండీషన్ కూడా పెట్టారు. ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ, తిననందుకు కన్నీళ్లు, తనపై కామెడీ చేసినందుకు కోపం.. ఇలా అన్నీ చూపించాడు. లైవ్‌లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట! మొత్తానికి మొదటిరోజే అపరిచితుడిని చూసేశామన్నమాట! చదవండి: రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్.. తాను క్షేమం అంటూ పోస్ట్ -
బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్స్.. బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ (ఫొటోలు)
-
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి బిగ్‌బాస్ వరకు..
విశాఖపట్నం: దమ్ము శ్రీజ... ఈ పేరు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తన దూకుడుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన ప్రతిభతో బిగ్‌బాస్‌లో కచ్చితంగా రాణిస్తుందని ఈ ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి బిగ్‌బాస్ వరకు..శ్రీజ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రెండు లక్షలకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, తన ప్రతిభను నిరూపించుకోవడానికి బిగ్‌బాస్‌ను ఒక వేదికగా ఎంచుకున్నారు. ఆడిషన్స్ అనే అగ్నిపరీక్షలో నెగ్గి, ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.తండ్రి నిజాయతీ, అంకితభావంశ్రీజ తండ్రి తండ్రి దమ్ము శ్రీను, జీవీఎంసీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. వార్డులో ఏ సమస్య ఉన్నా, అది మురుగు కాల్వలైనా, చనిపోయిన వీధి కుక్కలైనా, వెంటనే అక్కడికి వెళ్లి పరిష్కరిస్తారు. ఒక సూపర్వైజర్గా కాకుండా, ఒక కార్మికుడిలా తన సిబ్బందితో కలిసి పనిచేసే గుణం ఆయనది. కొంతమంది దురభిమానం కారణంగా తోటి కార్మికుడు చేసిన దాడిలో ఒక కన్ను కోల్పోయారు.శ్రీజకు మద్దతివ్వండితమ కుమార్తె శ్రీజకు మద్దతివ్వాలని శ్రీను దంపతులు కోరుతున్నారు. ప్రతీ ఎపిసోడ్లో ఆమె ఆట తీరును గమనించి, పూర్తి మద్దతు తెలిపి, ఓట్లు వేయాలని ప్రేక్షకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. -
నాకు చావెందుకు రాలేదు? నిరూపించుకోవడానికే వచ్చా: హీరోయిన్ కన్నీళ్లు
సినిమాలకన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమసైంది సంజనా గల్రాని (Sanjana Galrani). బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్లో పరిచయమైంది. తెలుగులో కన్నా కన్నడలో మంచి స్టార్డమ్ సంపాదించింది. 2020లో రహస్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అంతా బాగున్న సమయంలో డ్రగ్స్ కేసుతో తన కెరీర్ కుప్పకూలింది. డ్రగ్స్ కుంభకోణంలో జైలుకు కూడా వెళ్లొచ్చింది. తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగు పెట్టింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నా పేరు అర్చన. ఏడో తరగతి చదువుతున్న సమయంలో మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. జాన్ ఇబ్రహీంతో ఓ యాడ్ చేశాను. అప్పుడు పూరీ జగన్నాథ్ నన్ను చూసి బుజ్జిగాడు సినిమాలో ఆఫర్ ఇచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ. అయినా నిలదొక్కుకుని, కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నాను. ఒకరోజు సడన్‌గా ఓ కేసులో నా పేరు ఇరికించారు. విచారణకు పిలిచి అరెస్ట్ చేశారు. నాకు చావెందుకు రాలేదు? అని బాధపడ్డాను. ఆ రోజు గురించి తలుచుకుంటేనే బాధేస్తోంది.ఒక్కో మీడియా ఛానల్ ఒక్కోలాగా చెప్పింది. అక్కడేం లేకపోయినా ఏదేదో చెప్పి నా జీవితం సర్వనాశనం చేశారు. అది తప్పుడు కేసు అని హైకోర్టు నాకు క్లీన్చిట్ ఇచ్చింది. కానీ, అదెవరికీ కనిపించలేదు. నేను అలాంటి అమ్మాయిని కాదు అని నిరూపించడానికే వచ్చాను. మీ అందరి మనసులో స్థానం సంపాదించుకోవాలనే బిగ్‌బాస్‌కు వచ్చాను అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది. -
నువ్వసలు మనిషివే కాదు, లూజర్.. కట్ చేస్తే బిగ్‌బాస్ షోలో!
బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu) ఈసారి స్పెషల్‌గా ఉండబోతోంది. కారణం.. సామాన్యుల ఎంట్రీ! గతంలోలాగా ఎవరో ఒకర్ని తీసుకురాలేదు. సత్తా ఉన్న సామాన్యులనే తీసుకురావాలని అగ్నిపరీక్ష షో నిర్వహించారు. వేలాది మంది అప్లై చేసుకోగా వారిలో 15 మందిని అగ్నిపరీక్షలో పరీక్షించారు. చివరకు 13 మంది మిగిలారు. ఇప్పుడు వారందరూ బిగ్‌బాస్ 9కి వచ్చారు.ఆరుగురికి ఎంట్రీ అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యహరించగా, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరించారు. అభిజిత్ మినహా మిగతా ముగ్గురు నేడు స్టేజీపైకి వచ్చారు. షోలో ఎల్లో కార్డులతో కంటెస్టెంట్లను భయపెట్టిన వీరు గ్రీన్ కార్డులతో కంటెస్టెంట్లలో కొత్త ఆశలు రేకెత్తించారు. నవదీప్.. దమ్ము శ్రీజను, బిందు మాధవి.. హరీశ్‌ను సెలక్ట్ చేసి హౌస్‌లోకి పంపించారు.ప్రేక్షకుల ఓట్లతో ముగ్గురునువ్వు మనిషివే కాదంటూ హరీశ్‌ను తిట్టిన బిందుమాధవి.. అందర్నీ కాదని అతడిని సెలక్ట్ చేయడం విశేషం. ప్రేక్షకుల ఓట్లతో పవన్ కల్యాణ్, డిమాన్ పవన్, డాక్టర్ ప్రియ హౌస్‌లోకి వెళ్లారు. చివర్లో నాగ్ షో ముగించేస్తుంటే శ్రీముఖి ఆపండంటూ ఎంట్రీ ఇచ్చింది. ఇంకొక్కరిని లోనికి పంపించమని వేడుకుంది. అభిజిత్, తాను కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ మర్యాద మనీష్‌ను సెలక్ట్ చేసింది. అలా ఏడుగురు కంటెస్టెంట్లు సామాన్యుల కేటగిరీలో హౌస్‌లోకి వెళ్లారు. -
#BiggBossTelugu9 : బిగ్‌బాస్ 9 సీజన్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
అధ్యక్షా.. ఈ కమెడియన్ ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?
అధ్యక్షా.. డైలాగ్‌తో పాపులర్ కాదు సెన్సేషన్ అయ్యాడు కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతడు ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా ద్వారా కాదు, బిగ్‌బాస్ షో ద్వారా! తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టిన సుమన్ శెట్టి తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. తొలి సినిమాకే నంది అవార్డుఅధ్యక్షా.. నన్ను గుర్తుపట్టారా? సుమన్‌శెట్టిని.. చిన్నప్పటినుంచే సినిమాలంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యాక ఓ మ్యాగజైన్లో కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి వెంటనే హైదరాబాద్ వెళ్లాను. దర్శకుడు తేజ నన్ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. జై మూవీతో కెరీర్ మొదలైంది. ఫస్ట్ సినిమాకే నంది అవార్డు గెలిచాను. జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం సినిమాల్లో అవకాశాలిచ్చి తేజ గారు నాకు గాడ్ ఫాదరయ్యారు.300 సినిమాలుతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్‌పురి భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశాను. అలా సినిమాలు చేస్తుండగా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. నాకు ఓ కూతురు, కొడుకు సంతానం. 2019లో మా నాన్న చనిపోయారు. నాన్న లేకపోయేసరికి ఒంటరితనం ఆవరించింది. నీ కెరీర్ మళ్లీ మొదలుపెట్టు అని అమ్మ తోడుగా నిలిచింది. బిగ్‌బాస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాను. బిగ్‌బాస్ హౌస్‌లో ఈ సుమన్ శెట్టి ఆటేంటో చూపిస్తా అన్నాడు సుమన్ శెట్టి. మరి ఈ కమెడియన్ బిగ్‌బాస్‌లో ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి! -
మా ఇంటిబిడ్డలా చూసుకుంటాం.. అభయమిచ్చిన నాగ్
'ముద్దమందారం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. కూతుర్ని టీచర్‌ను చేయాలనుకుంటే తనూజ మాత్రం నటనవైపు అడుగులు వేసింది. కాలేజీలో చదువుతున్న సమయంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా సినిమా చేసింది. మూడేళ్లు మాటల్లేవ్దాంతో ఆమె తండ్రి మూడేండ్లు నటితో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజయ్యాక తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ముద్ద మందారం సీరియల్లో ఆఫర్ వచ్చింది. ఈ ధారావాహికతోనే తన దశ తిరిగిపోయింది. తాజాగా ఆమె తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాన్నకు యాక్టింగ్ అస్సలు ఇష్టం లేదు. అయినా హైదరాబాద్‌కు వచ్చి యాక్టింగ్ ద్వారా పేరు సంపాదించుకున్నాను. తప్పకుండా శిక్షిస్తారుఅప్పుడు వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ, ఇప్పుడు బిగ్‌బాస్‌కు వెళ్తున్నా అని కూడా నాన్నకు తెలియదు. ఆయన తప్పకుండా నన్ను శిక్షిస్తారు. నాతో మాట్లాడరు.. నాన్నకు తప్పకుండా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో నాగ్.. ఆడపిల్లను మా ఇంటిబిడ్డలా చూసుకుంటాము. ఇండస్ట్రీ గురించి ఎటువంటి భయం అవసరం లేదు అని అభయమిచ్చాడు. -
మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని.. అప్పుడే మొదలెట్టేశాడుగా!
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) ప్రతి సీజన్లో ఓ కమెడియన్ కచ్చితంగా ఉండాల్సిందే! ఎప్పుడూ గొడవలతో అగ్నిలా భగభగమండుతూ ఉండే హౌస్‌లో నవ్వుల వర్షం కురిస్తేనే బాగుంటుంది. అందుకే కమెడియన్ ఉంటేనే షోకి కళ. ఈ సారి ఓ ఫేమస్ కమెడియన్‌ను పట్టుకొచ్చారు. అతడే జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel). నవ్వించడం అంత ఈజీ కాదు. కానీ, ఎదుటివారి పెదాలపై నవ్వు చూడటం కోసం తనపై తాను జోకులు వేసుకోవడానికి కూడా వెనుకాడడు.ఒక్క ఛాన్స్తాజాగా బిగ్‌బాస్ 9 స్టేజీపై అడుగు పెట్టిన ఇమ్మాన్యుయేల్ తన జర్నీ వివరించాడు. 'నేను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదు. అందుకే అమ్మానాన్నకు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నాను. పొలంపనిలో సాయం చేశాను. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఛాన్స్ ఇస్తాడంటారు. అలా నాకు వచ్చిన ఒక్క ఛాన్స్.. నేను కన్న కలవైపు మొదటి అడుగు పడేలా చేసింది. అవకాశం వచ్చింది, కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. నాగార్జునతో కామెడీమూడేళ్లు గడిచిపోయాక మన తలరాత మనమే రాసుకోవాలని అర్థమైంది. వందల స్కిట్లు రాసి, అందులో నటించి మిమ్మల్ని అలరించాను. బిగ్‌బాస్‌లో నా పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను' అంటూ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే తన టాలెంట్‌నంతా బయటపెట్టాడు. నాగార్జునతో.. బిగ్‌బాస్‌లో మీరు మన్మథుడు అయితే నేను ఉన్మాదిని అంటూ జోకులు మొదలుపెట్టేశాడు. అలాగే ఆడ గొంతుకతో పాట పాడి అలరించాడు. తర్వాత మిమిక్రీ చేశాడు. -
బిగ్‌బాస్: 20 ఏళ్లకే లవ్, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు. నువ్వు నాకు నచ్చావ్, నరసింహ నాయుడు, ప్రేమతో రా, మైఖేల్ మదన కామరాజు, ఆ ఇంట్లో వంటి పలు చిత్రాల్లో నటించింది. లక్స్ పాప.. సాంగ్‌తో బాగా ఫేమస్ అయింది. తమిళ, కన్నడ, పంజాబీ, హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది.రానా నాయుడు, ద ట్రయల్ వెబ్ సిరీస్‌లలోనూ మెరిసింది. అందరమ్మాయిల్లాగే తనూ ప్రేమలో పడింది. నమ్మిన ప్రియుడి చేతిల్లో నరకం చూసింది. ఆ మధ్య తనపై దాడి జరిగినట్లుగా ఫోటోలు కూడా షేర్ చేసింది. ఆ ఒక్క వ్యక్తి వల్ల ప్రేమపై నమ్మకాన్నే కోల్పోయింది. నిస్సహాయ స్థితికి వెళ్లిపోయింది. ఆ ఘటన తర్వాత అమ్మానాన్నే తన ప్రపంచంగా భావించింది. ఇప్పుడు బిగ్‌బాస్ 9 షోలో అడుగుపెట్టింది.అసలేం జరిగిందంటే?20 ఏళ్ల వయసులో ఓ నిర్మాతలో ప్రేమలో పడింది ఆశా సైని. అప్పటికే దాదాపు పది చిత్రాలు చేసింది. మోడల్‌గానూ పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసింది. కానీ నిర్మాతను ప్రేమించిన కొద్దిరోజులకే పరిస్థితులు తారుమరయ్యాయి. అతడు ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఫోన్ లాక్కున్నాడు, నటించవద్దని బలవంతం చేశాడు. ఏడాదిన్నర పాటు ఎవరితోనూ తనను మాట్లాడనివ్వలేదు. ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టాడని ఫ్లోరా సైని సోషల్ మీడియాలో వాపోయింది. ఒకరోజు పొట్టపై తన్నడంతో నొప్పి, బాధ భరించలేక పారిపోయానని చెప్పుకొచ్చింది. తిరిగి మామూలు మనిషి కావడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపింది. -
Bigg Boss 9 Telugu: కంటెస్టెంట్స్ వీళ్లే.. మొత్తం 15 మంది
-
అమ్మాయిలంటే సామాన్లా? థియేటర్లో దారుణంగా.. దిశ యాప్ సాయంతో!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈసారి సెలబ్రిటీలు వర్సెస్ కామన్‌మ్యాన్ అన్నట్లుగా పోటీ ఉండనుంది. ఇప్పటికే లాంచింగ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా 14 మంది హౌస్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్) కూడా ఉండనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ లిస్టులో మాత్రం ఆమె పేరు లేదు.వైల్డ్ కార్డ్ ఎంట్రీగా..అయితే ఆమె వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28న బిగ్‌బాస్ 9 గ్రాండ్ లాంచ్ 2.0 కింద ఐదారుగురిని హౌస్‌లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారు. వీరిలో రమ్య పేరు కూడా ఉంది. ఇకపోతే రమ్య మోక్ష, తన సిస్టర్స్ అలేఖ్య, సుమ కంచర్లతో కలిసి ఇటీవల థియేటర్‌కు వెళ్లగా అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని సుమ యూట్యూబ్ వీడియో ద్వారా వెల్లడించింది. పచ్చళ్లతో బాగా సంపాదించుకుంటున్నారు. మా డబ్బుతోనే తింటున్నారు, మా డబ్బుతోనే బతుకుతున్నారు అని ప్రతి వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.ఏం తప్పు చేశాం?మేమేం చేస్తున్నామని? మాకు వచ్చిన విద్య పచ్చళ్ల చేయడం.. వాట్సాప్ నెంబర్ పెట్టి ఆర్డర్ చేయమంటున్నాం. మా క్వాలిటీ మాకు తెలసు కాబట్టి ఒక రేటు ఫిక్స్ చేస్తున్నాం, అది మా ఇష్టం! నచ్చినవాళ్లు కొంటున్నారు, నచ్చనివాళ్లు లైట్ తీసుకుంటున్నారు. అంతకుమించి మేం ఏం తప్పు చేశాం? వాట్సప్‌లో చెండాలమైన వీడియోలు పంపుతాం.. దానికి డబ్బు పంపండి అని అడిగామా? చిట్ ఫండ్స్ పెట్టి ఎత్తేశామా? మేము సమస్యల్లో ఉన్నామని డబ్బులు అడుక్కుంటున్నామా? అవేమీ చేయడం లేదుగా!ఒక్కరు స్పందించరే?అందులో మీకు తప్పేం కనిపించింది? అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమైనప్పుడు మా మీద ఎన్నెన్ని వీడియోలు చేశారు? ఇప్పుడు మా గురించి తప్పుడు కామెంట్స్ పెడుతుంటే ఒక్కరు స్పందించరేంటి? మేము బయట కనిపిస్తే అలా చేయండి, ఇలా చేయండి అని జనాల్ని రెచ్చగొడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ రోజు నా భర్త బర్త్‌డే కాబట్టి చెల్లివాళ్లందరితో కలిసి సినిమాకు వెళ్లాను. అక్కడ కొందరు మమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు. అసభ్య కామెంట్స్తర్వాత క్యాంటీన్లో కూల్‌డ్రింక్స్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెళ్తున్నాం. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అంకుల్స్ మమ్మల్ని చూస్తూ చెండాలంగా సైగలు చేస్తున్నారు. చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అనవసరంగా మూడ్ నాశనం చేసుకోకూడని ముందుకు వెళ్లిపోయాం. థియేటర్లో కూడా మా వెనకాలే కూర్చుని... మొగుడు పక్కనుంటే మాట్లాడకూడదా? అంటూ ఏదేదో పిచ్చిగా వాగారు. ఆ కామెంట్స్ భరించలేక వెళ్లిపోతుంటే సినిమా చూడాలంటే సామాన్లు బాగుండాలంటీ అన్నారు. అమ్మాయిలంటే సామాన్లా? మా శరీరం గురించి చెత్తగా వాగుతుంటే ఎవరూ పట్టించుకోరా?దిశ యాప్ వల్లే..అలేఖ్య తెలివిగా వెంటనే దిశ యాప్‌లో కంప్లైంట్ పెట్టింది. పోలీసులు వెంటనే మేమున్న ప్రదేశానికి వచ్చి ఆ ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. అప్పటివరకు మాగురించి చెడుగా కామెంట్ చేసుకుంటూ నవ్వినవాళ్లు పోలీసులను చూడగానే మా కాళ్లు పట్టుకునేందుకు కూడా వెనుకాడలేదు. ఇలాంటివారిని వదిలపెట్టకూడదు. అందుకే పోలీసులను కేసు నమోదు చేయమన్నాం అని సుమ ఆగ్రహించింది.చదవండి: ‘సైమా ’లో సత్తా చాటిన నిహారిక మూవీ -
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9.. కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉన్నది ఎవరంటే?
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు. ఈ ఆదివారం నుంచే బిగ్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కోసం కామన్ కేటగిరి నుంచి అగ్ని పరీక్ష పేరుతో కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఐదు నుంచి ఆరుమందిని ఎంపిక చేస్తారని సమాచారం..ఇక బిగ్‌బాస్‌పై రివ్యూలు చేస్తోన్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నది రివీల్ చేశారు. ఇది అఫీషియల్ కాకపోయినా.. కాస్తా అటు.. ఇటు కూడా వీరిలో కొందరైనా ఉండొచ్చు. ఆదిరెడ్డి అనలైసిస్ ప్రకారం రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లానీ లాంటి సెలబ్రీటీలు ఉండొచ్చని అంచనా వేశారు.అలాగే కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఐదు నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. వారిలో మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆదిరెడ్డి అంచనా వేశారు. ఈ లిస్ట్‌లో ఉన్నవారంతా బిగ్‌బాస్ హౌస్‌లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే ఏడో తేదీ వరకు ఆగాల్సిందే. కాగా.. సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
శారీలో బిగ్‌బాస్ దివి హోయలు.. మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ అందాలు!
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ మాల్వికా రాజ్..ఫ్లైట్‌లో మన్మధుడు హీరోయిన్ చిల్.. శారీలో మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ హోయలు..లేటేస్ట్ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ హన్సిక..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..శారీ అందాలతో టాలీవుడ్ ముద్దుగుమ్మ దివి.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Shwetha Menon (@shwetha_menon) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
ప్రియుడితో తిరుమల వెళ్లిన ప్రియాంక జైన్ (ఫోటోలు)
-
వద్దు వద్దంటూనే మళ్లీ హోస్ట్‌గా.. కన్నడ బిగ్‌బాస్ ఎప్పటినుంచంటే?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభానికి రెడీ అయింది. మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా ఉన్నాడు. ఈసారి కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కన్నడ బిగ్‌బాస్ కొత్త సీజన్ కూడా ఇదే నెలలో షురూ అవనుంది. ఈ షో నేను చేయను, నా వల్ల కాదు అని కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) పక్కకు తప్పుకున్నాడు. కానీ, షో నిర్వాహకులు బతిమాలి మళ్లీ ఆయన్నే హోస్ట్‌గా ఒప్పించారు.ఈ నెలలోనే..ఈమేరకు ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. కర్ణాటక సాంప్రదాయాలు, రకరకాల మనుషులను, సినిమా, సీరియల్స్, రీల్స్.. ఇలా చాలానే చూపించారు. అవన్నీ చూస్తుండగా సడన్‌గా డిష్ పోతుంది. అప్పుడు కిచ్చా సుదీప్ కాఫీ చేత పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. సర్.. సెట్, కంటెస్టెంట్లు రెడీ, ఏడు కోట్ల కన్నడిగులు రెడీ.. మరి మీరు అని కొంత బెరుకుతో అమ్మాయి అడగ్గా నేనూ రెడీ అంటూ కాఫీ సిప్ చేస్తూ రెట్టింపు ఉత్సాహంతో చెప్పాడు సుదీప్. చివర్లో సెప్టెంబర్ 28 నుంచి బిగ్‌బాస్ ప్రారంభం అని ప్రకటించారు. View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్ భావోద్వేగం -
బిగ్‌బాస్‌లోకి పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బిగ్‌బాస్-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్‌బాస్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.రీతూ చౌదరి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పోలీసుల విచారణ కూడా ఎదుర్కొంది. ఆపై ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె పాత్ర కూడా ఉందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని చెప్పుకొచ్చింది. అంతడబ్బులు తన వద్ద ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ పేర్కొంది. అయితే, బిగ్‌బాస్ ద్వారా తనపై వచ్చిన నెగటివిటిని కాస్త అయినా తగ్గించుకోవచ్చని ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.సుమారు రెండేళ్ల క్రితం తన తండ్రి మరణంతో రితూ చౌదరినే తన కుటంబానికి పెద్ద దిక్కు అయింది. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంపాదన మొదలుపెట్టింది. ఆపై సోషల్‌మీడియా ద్వారా కూడా తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుండటంతో ఆమె గురించి తెలిసినవాళ్లు మాత్రం ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, బిగ్‌బాస్9 ద్వారా మరికొందరి ప్రేక్షకుల ప్రేమను గెలవచ్చు అనే రితూ చౌదరి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
టాలీవుడ్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష
టాలీవుడ్ బుల్లితెర నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు జైలుశిక్ష పడింది. గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి మృతికి కారణమైన లోబోకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. బుల్లితెరపై సినీ ప్రియులను అలరించిన లోబో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఓ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ చిత్రీకరణ కోసం లోబో బృందం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై 2018లో జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో జనగామ కోర్ట్ తీర్పు వెల్లడించింది. ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పోలీసులు తెలిపారు.లోబో కెరీర్ విషయానికొస్తే హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ అనే మ్యూజిక్ షోతో బాగా పాపులర్ అయ్యాడు లోబో. తనకు అందరిలా ఉండటం నచ్చదు. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్ డ్రెస్సుతో, వినూత్న గెటప్‌తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్ మీద పెద్దగా కనిపించని లోబో బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్-5లో కంటెస్టెంట్‌గా బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు. -
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్‌ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు. అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలుఅనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది. -
అఫీషియల్: వచ్చేవారమే బిగ్‌బాస్ 9 ప్రారంభం
బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్‌బాస్ 9 షో (Bigg Boss 9 Telugu) కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్‌బాస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ 9 ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. 9వ సీజన్ కావడంతో ప్రోమోలో నవగ్రహాలను చూపించారు. అలాగే ఈసారి రెండు హౌస్‌లు ఉంటాయన్నారు. ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్ మ్యాన్ కోసం అని తెలుస్తోంది. అలాగే బిగ్‌బాస్‌నే మారుస్తున్నట్లు చెప్పాడు నాగ్. అంటే బిగ్‌బాస్ వాయిస్ మారొచ్చని తెలుస్తోంది. అగ్నిపరీక్షఇప్పటికే కామన్ మ్యాన్ కోసం సెలక్షన్ జరుగుతోంది. హాట్‌స్టార్‌లో అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 15 మంది సెలక్టయ్యారు. వారికి రకరకాల గేమ్స్ పెడుతున్నారు. నచ్చినవారికి ఓట్లేసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓట్లు ఎక్కువ వచ్చిన ఒకరిద్దరు కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించవచ్చని తెలుస్తోంది. అలాగే అగ్నిపరీక్ష షో జడ్జిలైన బిందు మాధవి, నవదీప్, అభిజిత్.. ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లను సెలక్ట్ చేసి డైరెక్ట్‌గా పంపించవచ్చని భోగట్టా! మరి హౌస్‌లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే! -
పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. రెండోసారి బంపరాఫర్!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో 15 మంది మిగిలారు. వీరిమధ్య రకరకాల పోటీలు పెడుతూ ఏరోజుకారోజు ఫలానా కంటెస్టెంట్ బెస్ట్, ఫలానా కంటెస్టెంట్ వరస్ట్ అని ప్రకటిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోమని జియోహాట్‌స్టార్‌లో ఓటింగ్ వెసులుబాటు కల్పించారు. నిన్నటి ఎపిసోడ్లో శ్రీజ బెస్ట్ అయితే కల్కిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. మరి ఈ రోజు ఏం జరిగిందనేది నేటి (ఆగస్టు 28) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..లీడర్‌గా దాలియాఇప్పటికే నిన్న గేమ్ గెలిచిన ప్రియ.. నేడు కూడా లీడర్‌గానే కొనసాగింది. మరో లీడర్ కోసం టైమ్ గేమ్ ఆడించారు. అందరినీ బాక్సుల్లో కూర్చోబెట్టి సరిగ్గా రెండు నిమిషాల్లో లేవాలన్నారు. అయితే ఫస్ట్, లాస్ట్ లేచినవారు ఆటలో ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చారు. తొమ్మిదో స్థానంలో నిలబడ్డవారికి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. అలా దాలియా గెలిచి లీడర్ అవగా.. షాకిబ్, మనీష్ తొలి, చివరి స్థానాల్లో లేచి ఆటలో లేకుండా పోయారు.కుండ పగిలిందిప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, నిఖిత, నాగ ప్రశాంత్, శ్రేయ ఒక టీమ్‌గా; దాలియా.. ప్రసన్న, శ్వేత, పవన్, అనూష, కల్కి మరో టీమ్‌గా ఏర్పడ్డారు. వీళ్లందరికీ కుండ గేమ్ ఇచ్చారు. వేలితో కుండ కట్టి ఉన్న తాడును పట్టుకోవాలన్నారు. కుండ కింద పడేసినవాళ్లు ఎలిమినేట్ అవడం కాదు కానీ, ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని మెలిక పెట్టారు. ఈ గేమ్‌లో ప్రియ టీమ్ నుంచి పవన్ కల్యాణ్, దాలియా టీమ్ నుంచి కల్కి చివరి వరకు ఉన్నారు. కంటతడి పెట్టుకున్న జవాన్తన టీమ్ లీడర్ ప్రియ.. కుండ పడేసేయ్ అని చెప్పడంతో పవన్ తనకు సత్తా ఉన్నా సరే, దాన్ని కిందపడేశాడు. తీరా చూస్తే అందులో ప్రియ ఫోటోనే ఉండటంతో వారి టీమ్ ఓడిపోయింది. చివరి వరకు ఉన్న కల్కి కుండలో తన ఫోటోనే ఉంది. అలా తాను గెలవడంతో పాటు తన టీమ్‌ను సైతం గెలిపించింది. అయితే చివరి వరకు వచ్చి ఓడిపోయానని సైనికుడు పవన్ కంటతడి పెట్టుకున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. ఎంత కష్టపడ్డా చివరకు ఇలాగే జరుగుతుందని ఎమోషనల్ అయ్యాడు. రెండోసారి ఓట్ అప్పీల్ఈ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్‌ను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ప్రకటించడంతో అతడు ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈ బంపరాఫర్ ఇతడికి రెండోసారి రావడం విశేషం! అలాగే తన టీమ్‌ను గెలిపించిన కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిన్న వరస్ట్ ప్లేయర్ అన్నవారితోనే సూపర్ అనేలా గేమ్ ఆడింది. మర్యాద మనీష్‌ను వరస్ట్ ప్లేయర్‌గా ప్రకటించారు. చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్‌లో చిక్కుకుపోయిన హీరో మాధవన్! -
బిగ్‌బాస్‌లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్‌తో గుర్తింపు
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha) దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే రేసు నుంచి కొందరిని ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్‌లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. వీళ్లంతా కామన్ ఆడియన్స్ విభాగంలో బిగ్‌బాస్9లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, సెలబ్రిటీలు ఎవరు పాల్గొననున్నారు అనే అంశంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముద్ద మందారం సీరియల్ హీరోయిన్ బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిపోయినట్లు సమాచారం.బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రతి ఏడాది సీరియల్స్లలో గుర్తింపు పొందిన వారిని తీసుకుంటారు. ముఖ్యంగా కన్నడకు చెందిన అమ్మాయిలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని తెలిసిందే. కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, యష్మి గౌడ, నిఖిల్ వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు సీజన్-9లోకి 'ముద్ద మందారం' సీరియల్లో పార్వతి పాత్రతో మెప్పించిన 'తనుజా గౌడ' ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయింది. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.కన్నడకు చెందిన తనుజా గౌడ కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఎక్కువగా సీరియల్స్‌లోనే నటించింది. దాదాపు 5 సంవత్సరాలు ప్రసారమైన ముద్ద మందారంతో ఆమెకు తెలుగులో పాపులారటీ తెచ్చుకుంది. ఆ తర్వాత నాగ భైరవి సీరియల్లోనూ ఆమె నటించింది. ఆమె గ్లామర్‌తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న నటిగా గుర్తింపు పొందింది. బిగ్‌బాస్‌లో ఇప్పటికే కన్నడ అమ్మాయిలు బాగా రాణించారు. దీంతో తనుజా గౌడ కూడా మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
బిగ్ బాస్ షో.. అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ ఎవరంటే?
బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్‌లో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఈ బిగ్‌బాస్ సీజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆదివారం హిందీ బిగ్‌బాస్ సీజన్-19 గ్రాండ్‌గా మొదలైంది. ఈ సీజన్లో పలువురు కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.బిగ్‌బాస్ మొదలైందంటే చాలు అందరి దృష్టి కంటెస్టెంట్ ఎవరనే దానిపై ఉంటుంది. అంతేకాకుండా కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అయితే గతంలో నాలుగో సీజన్లో అడుగుపెట్టిన హాలీవుడ్ బ్యూటీ పమేలా అండర్సన్ పారితోషికంపై తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ సీజన్లోనే అత్యధిక పారితోషికం అందుకుంటోన్న కంటెస్టెంట్‌గా నిలిచింది. హౌస్‌లో హాలీవుడ్ గ్లామర్ తీసుకొచ్చిన పమేలా.. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మొట్టమొదటి అంతర్జాతీయ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె స్పెషల్ గెస్ట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది.కళ్లు చెదిరే రెమ్యునరేషన్..అయితే హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన పమేలా అండర్సన్ ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు రోజులు మాత్రమే హౌస్‌లో ఉన్న పమేలా ఒక్కో రోజుకు దాదాపు రూ.83 లక్షలుగా తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా నిలిచింది. కాగా.. హాలీవుడ్‌కు చెందిన పమేలా అండర్సన్ 1990ల్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బార్బ్ వైర్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్, సిటీ హంటర్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. -
ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ ఓవరాక్షన్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15కి ఆరుగురు సెలక్ట్ అయ్యారు. మిగిలిన తొమ్మిది స్థానాల కోసం 16 మంది పోటీపడుతున్నారు. వీరికి డేర్ ఆర్ డై అంటూ రకరకాల టాస్కులిచ్చారు. గెలిచినవారిని టాప్ 15కి పంపించారు. మరి ఎవరెవరు ఫైనల్స్‌లో అడుగుపెట్టారో నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్లో చూసేద్దాం..అరగుండుతో బిగ్బాస్లోమొదటగా మాస్క్ మ్యాన్ హరీశ్, సాయికృష్ణను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్ విసిరారు. సీజన్ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు. మాస్క్ మ్యాన్ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్ అందుకుని అరగుండు గీసుకున్నారు. దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్ 15కి పంపించారు. నెక్స్ట్ దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి ఐయామ్ లూజర్ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు. ఊర్మిళ మోడల్ కాబట్టి తాను రిజెక్ట్ చేసింది. శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. అయితే ఐయామ్ లూజర్కు బదులుగా ఐ లవ్ బిగ్‌బాస్ అని పచ్చబొట్టు వేయించారు.పది నిమిషాల్లో కిలో బరువుతర్వాత సోల్జర్ పవన్ కల్యాణ్, అబూకు 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ, బర్గర్ ముందు పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచాడు. ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్‌లో ప్రియ రెండు చేతులుపయోగించి దాలియాను ఓడించింది. కానీ, జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్‌కు పంపించారు. షాకీబ్, కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్ ఇచ్చింది. ముందుగా షాకీబ్ను బయటకు పంపేసి.. ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అర్జంట్‌గా డబ్బులు వేయించుకోవాలి. (Bigg Boss Agnipariksha)షాకీబ్‌కు అన్యాయంఎవరి అకౌంట్లో ఎక్కువ అమౌంట్ పడుతుందో వారు నెక్స్ట్ లెవల్‌కు వెళ్తారంది. దీంతో కల్కి తన ఫ్రెండ్‌కు రెండుసార్లు ఫోన్ చేయగా రూ.90 వేలు అకౌంట్లో పడ్డాయి. తర్వాత షాకీబ్ను స్టేజీపైకి పిలిచారు. కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్ చెప్పలేదు. ఎవరికైనా కాల్ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్లో వేయించుకో అంది శ్రీముఖి. కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని రూ.10 వేలు అడిగాడు. అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అతడి అకౌంట్లో రూ.50 వేలు పడ్డాయి.దమ్మున్న శ్రీజఎవరి దగ్గర ఎక్కువుంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్‌కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఈ గేమ్‌లో కల్కి గెలిచింది. తనకు క్లియర్‌గా టాస్క్ వివరించి చెప్పలేదని షాకీబ్ ప్రశ్న లేవనెత్తాడు. దీంతో శ్రీముఖి.. ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా? అని అడగ్గా.. దమ్ము శ్రీజ చేయెత్తింది. తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి.. అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు. నవదీప్, శ్రీముఖి ఓవరాక్షన్కానీ నవదీప్ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు. ఎందుకు అన్‌ఫెయిర్‌గా అనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీజ.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు. మొత్తానికి నాలుగు ఎపిసోడ్లో హరీశ్, శ్రీజ, ప్రియ, కల్కి.. టాప్ 15లో అడుగుపెట్టారు. చదవండి: నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్ -
భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్, మా వాళ్లే వెనక్కులాగారు!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha)కు వేలాదిమంది అప్లై చేశారు. వారిలో ట్రాన్స్‌జెండర్ అంకితనాయుడు ఒకరు. పలు రౌండ్లలో ముందుకు వెళ్లిన ఆమె అగ్నిపరీక్ష స్టేజీపై మాత్రం కనిపించలేదు. అందుకు గల కారణాన్ని, తన జర్నీని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అంకిత నాయుడు మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చీరకట్టుకుని, బొట్టు పెట్టుకుని గాజులు వేసుకునేదాన్ని. అక్కల పెళ్లయ్యాకే..18 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను అమ్మాయిలా మారాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరు అక్కల పెళ్లయ్యే వరకు ఆగి ఆ తర్వాతే అమ్మాయిగా మారాను. ఈ మధ్య నాకు బిగ్‌బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. బిగ్‌బాస్ షో చాలా పెద్ద ప్లాట్‌ఫామ్. అలాంటి ప్లాట్‌ఫామ్‌కు నేను సెలక్ట్ అయ్యానని తెలిసి సంతోషపడ్డాను. నాకు మొదటి నుంచీ ఈ షో అంటే ఇష్టం!భిక్షాటన చేశా.. తర్వాత..అయితే గతంలో నేను భిక్షాటన చేశాను, వేశ్యగా మారాను, షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లాను. ఇవన్నీ దాటుకుని వచ్చాను. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వస్తే అక్కడ నన్ను నేను నిరూపించుకోవచ్చనుకున్నాను. నేను వెళ్లి నా కమ్యూనిటీకి ఆదర్శంగా నిలవాలనుకున్నాను. గతంలో బిగ్‌బాస్ (Bigg Boss Reality Show)కు వెళ్లిన ప్రియాంక సింగ్.. చాలామందికి డ్రీమ్‌గర్ల్ అయిపోయారు. తను నాకు రోల్‌మోడల్. స్టేజీపైకి వెళ్లకుండానే..ఈ సీజన్లో నాకు ఆఫర్ వచ్చింది. కానీ, నా కమ్యూనిటీ వాళ్లు నన్ను వెనక్కు లాగేశారు. అగ్నిపరీక్ష షోలో శ్రీముఖి నన్ను స్టేజీపైకి రమ్మని ఆహ్వానించింది. ఓ పాట కూడా ప్లే చేశారు. ఇంతలో వెళ్లకుండానే ఆపేశారు. మా కమ్యూనిటీ వాళ్లు.. బిగ్‌బాస్ టీమ్‌కు నేను వేశ్యగా పనిచేసినప్పటి వీడియోలు పంపారు. దాంతో వాళ్లు నన్ను తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీనివల్ల మీకే కాదు, షోకి సైతం నెగెటివిటీ వస్తుందన్నారు. వాళ్ల ఆలోచనప్రకారం వాళ్లు కరెక్టే! ఎప్పుడో జరిగినదాన్ని..మా కమ్యూనిటీ వాళ్లే ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఎప్పుడో జరిగినదాన్ని ఇప్పుడు తీసి చూపించడం నచ్చలేదు. మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్తాం అని బీరాలు పలికే లీడర్స్.. నేను సెలక్ట్ అయితే ఎందుకు జీర్ణించుకోలేకపోయారు? పైగా అదే లీడర్ అక్కడ సెలక్ట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె ఎంపికవలేదు. మా వాళ్లు నన్ను నెగిటివ్ చేసి ఇంకెప్పుడూ బిగ్‌బాస్‌కు వెళ్లకుండా చేశారు అని అంకిత నాయుడు చెప్పుకొచ్చింది.చదవండి: సీక్రెట్‌గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె -
సిద్దిపేట మోడల్‌కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)లో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్‌లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మరి మూడో ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం.. మొదటగా ఆర్మీ జవాన్ వచ్చాడు. అతడికి యాక్టింగే ఎక్కువ ఇష్టమన్నాడు. ఒకవేళ బిగ్‌బాస్ గెలిచి ఆఫర్లు వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే ఆర్మీకి వెళ్లిపోతానన్నాడు. అతడికున్న క్లారిటీ జడ్జిలకు నచ్చింది. అలా అని ఇతడిని నేరుగా టాప్ 15కి పంపించలేదు, ఎలిమినేట్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు.సిద్దిపేట మోడల్‌కు షాక్సింగర్, డ్యాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చిన షకీం.. స్టేజీపై సరిగా డ్యాన్స్ చేయలేకపోయాడు. అయినా ఇతడికి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్‌కు పంపించాడు. సిద్దిపేట మోడల్ స్టేజీపై రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీవి అంటూ పంపించేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం తన స్టోరీ చెప్పింది. తండ్రి లేకపోయినా తనే కుటుంబం కోసం నిలబడి అప్పులు తీర్చానని, చెల్లిని విదేశాల్లో చదివించానని పేర్కొంది. 98 మంది ప్రపోజ్అయితే నామినేషన్స్ చేయమంటే మాత్రం తడబడింది. అప్పటికే తన స్టోరీ విని కరిగిపోయిన జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఆమెను టాప్ 15లోకి పంపించారు. తనకు 98 మంది ప్రపోజ్ చేశారంటూ స్టేజీపైకి వచ్చిన శ్రీకృష్ణను, డాక్టర్ నిఖితను.. మరికొందరిని హోల్డ్‌లో పెట్టారు. యూకే నుంచి బిగ్‌బాస్ కోసమే వచ్చానన్న శ్వేతను టాప్ 15లోకి పంపించారు. ఈమె తల్లికి క్యాన్సర్ కాగా.. ఈ ఎపిసోడ్ వచ్చేకంటే ముందే ఆమె కన్నుమూయడం విషాదం! రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలామందిని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసి పంపించేశారు. 19 ఏళ్ల అబ్బాయికి అన్యాయం?19 ఏళ్ల అమ్మాయి శ్రేయను ఎంకరేజ్ చేసిన జడ్జిలు అదే వయసులో ఉన్న అబ్బాయి జనిత్‌ను మాత్రం ఎలిమినేట్ చేయడం గమనార్హం! ఒక ప్రమాదంలో తల్లికి 80% గాయాలయ్యానని, అయినా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషించిందన్నాడు. తండ్రి చనిపోయినా అన్నీ తనే చూసుకుందన్నాడు. ఒకమ్మాయి విదేశాల్లో చదివించి, మరో అమ్మాయికి పెళ్లి చేసి, అతడిని చదివిస్తోంది అని తల్లి గొప్పదనం చెప్పాడు. అది విని జడ్జిలు లేచి చప్పట్లు కొట్టారు. తాను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నానన్నాడు. జీవితంపై క్లారిటీ ఉన్న ఇతడిని రిజెక్ట్ చేశారు.టాప్ 15 కోసం పోటీఫైనల్గా ఇప్పటివరకు టాప్ 15లో ఆరుగురిని సెలక్ట్ చేశారు. 16 మందిని హోల్డ్‌లో పెట్టారు. ఈ పదహారు మందికి రకరకాల టాస్కులు పెట్టి వారిలో 9 మందిని టాప్ 15లో చేర్చనున్నారు. మరి ఆ టాస్కులేంటి? ఎవరు సెలక్ట్ అవుతారన్నది రేపటి ఎపిసోడ్ రివ్యూలో చూద్దాం..చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా! -
ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)
-
పెళ్లి పీటలెక్కిన బిగ్‌బాస్ బ్యూటీ.. రాఖీ సావంత్ మాజీ బాయ్‌ఫ్రెండ్ సందడి!
ప్రముఖ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సబా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. సభా ఖాన్ హిందీ బిగ్‌బాస్ సీజన్-12లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. కానీ ఈ సీజన్ టైటిల్‌ను బుల్లితెర నటి దీపికా కక్కర్ గెలుచుకుంది.'బిగ్ బాస్ 12' ఫేమ్ సబా ఖాన్ వ్యాపారవేత్త వసీంను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో రాఖీ సావంత్ మాజీ భాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ సందడి చేశారు కాగా.. ఆదిల్.. సబా ఖాన్ సోదరి సోమి ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా.. సబా ఖాన్ భర్త వసీం జోధ్‌పూర్‌కు చెందిన నవాబ్ కుటుంబానికి చెందినవాడు. ఈ పెళ్లికి స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. View this post on Instagram A post shared by Saba Khan (@sabakhan_ks) -
బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై.. నిందితుడు అరెస్ట్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు.గురుగ్రామ్‌లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్‌లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్‌తో ఇషాంత్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్ కూడా అతని కాలిపై గన్‌తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్‌ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. -
సీనియర్ నటి.. కానీ టీనేజీ అమ్మాయిలా కనిపిస్తూ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ రియాలిటీ షో.. స్పెషల్ గెస్ట్‌గా స్టార్ హీరోయిన్!
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షోకు ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్‌బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్‌గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్‌తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. -
బతకొద్దు అనుకున్నా.. శ్రీముఖి హెల్ప్ చేసింది: తమన్నా సింహాద్రీ
బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి. విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా..తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ షో ద్వారానే యాంకర్ శ్రీముఖితో స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతుంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో తమన్నా కూడా ఉంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో రెండు వారాలు మాత్రమే కలిసి ఉన్న వీరిద్దరి మధ్య అంత స్నేహం ఎలా ఏర్పడింది? నా నిజాయితీకీ శ్రీముఖి ఫిదా అయిందని అంటోంది తమన్నా. తన జీవితంలో శ్రీముఖి లాంటి ఫ్రెండ్‌ని చూడలేదని, ఆమెలో తన కూతురిని చూసుకుంటున్నానని చెబుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీముఖి తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చింది.అందుకే నాతో స్నేహంశ్రీముఖి ఎదుటివాళ్లను చదివేస్తుంది. వాళ్లు ఎలాంటివాళ్లు? పైకి ఎలా మాట్లాడతారు? లోపల ఎలా ఉంటారు? ఇవన్నీ ఈజీగా పసిగట్టగలదు. బిగ్‌బాస్ హౌస్‌లో మేం రెండు వారాలే కలిసి ఉన్నాం. నాలో ఉన్న నిజాయితీని మెచ్చి శ్రీముఖి స్నేహం చేసింది. ‘తమన్నా నమ్మితే.. ప్రాణాలను సైతం ఇస్తుంది’ అని తెలుసుకొని నాకు క్లోజ్ అయింది. నేను అంటే ఆమెకు చాలా నమ్మకం. శ్రీముఖి తల్లి నన్ను సొంత చెల్లిలా చూసుకుంటుంది. శ్రీముఖి, ఆమె తమ్ముడు ఇద్దరూ నాకు పిల్లలు లేని లోటు తీర్చారు. వారిద్దరు నా పిల్లలే అనుకుంటాను.శ్రీముఖి దత్తత తీసుకుందినా బంధువులు, రక్త సంబంధీకులు అంతా దూరం పెడితే.. శ్రీముఖి నన్ను తన ఫ్యామిలీ మనిషిలా చూసుకుంది. నేను ఏ టైంలో ఏం ఆలోచిస్తాను? ఎం తినాలనుకుంటాను? ఇవన్నీ తెలుసుకొని తెప్పిస్తుంది. ఇలా ఎవరు అడుగుతారు? ఒకరకంగా చెప్పాలంటే నన్ను శ్రీముఖి దత్తత తీసుకుంది. కరోనా తర్వాత అన్ని షోస్ ఆగిపోయాయి. డబ్లుల్లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. శ్రీముఖి ఫోన్ చేసి..‘విజయవాడలో ఒంటరిగా ఏం చేస్తావు? హైదరాబాద్‌కి వచ్చేయ్. నేను సంపాదిస్తున్నాను కదా. నిన్ను చూసుకుంటాలే’ అని చెప్పింది. నా బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఇల్లు కట్టుకుంటున్నా అంటే ఆర్థిక సహాయం చేసింది. ఈ విషయం బయటకు చెపొద్దు అంటూ ఇంటి కోసం కొంత డబ్బు ఇచ్చింది. నాకే కాదు ఇలాంటి సహాయం చాలా మందికి చేసింది. బయటకు చెప్పుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు. దటీజ్ శ్రీముఖి. ఆమె ఏంటో ఫ్రెండ్ సర్కిల్‌కి మాత్రమే తెలుసు’అంటూ తమన్నా ఎమోషనల్ అయింది. -
బిగ్‌బాస్‌లోకి అనసూయ.. దెబ్బలు పడతాయి రాజా అంటూ కామెంట్
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ సందడి ఇప్పటికే షోషల్‌మీడియాలో మొదలైంది. ఇప్పటికే పలు కొత్త పేజీలు పుట్టుకొచ్చాయి. షో గురించి వీడియోలు షేర్ చేస్తున్నారు కూడా.. షోలో పాల్గొనబోతున్న కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సెప్టెంబర్ 7న ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌లోకి స్టార్ యాంకర్, నటి అనసూయ వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ఈ అంశం గురించి ఆమె వివరణ ఇచ్చారు.బిగ్‌బాస్‌లోకి అనసూయ అంటూ వారం రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రచారంపై స్వయంగా అనసూయ స్పందించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి తాను వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. అందుకు కారణాలు కూడా ఆమె చెప్పారు. గతంలో తాను ఒకట్రెండు సార్లు దెబ్బలు పడతాయి రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇక అందులో ఎంట్రీ ఇస్తే అంతే సంగతులు అంటూనే నో చెప్పేశారు. కుటుంబాన్ని వదిలేసి అన్నిరోజుల పాటు తాను ఉండలేనని ఆమె తెలిపారు.బిగ్‌బాస్: సీజన్9 గత సీజన్లకు భిన్నంగా ఈసారి ఉండబోతుంది. ఎక్కువగా సామాన్యులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో నెటిజన్లు ఈ షో పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‌కు ‘అగ్నిపరీక్ష’ పేరుతో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఆడిషన్స్‌లో న్యాయ నిర్ణేతలుగా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ ఉన్నారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ పోటీలకు సంబంధించిన ఎపిసోడ్స్ స్టార్‌మా ప్రసారం చేయనుంది. -
కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్‌బాస్ మానస్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన మానస్ (Maanas Nagulapalli) తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో బాగా పాపులర్ అయ్యాడు. అనవసరంగా ఆవేశానికి పోకుండా కూల్‌గా ఆడి, నిదానంగా మాట్లాడుతూ పాజిటివ్ యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు షోలో ఉండగా తల్లి పద్మిని హౌస్‌లోకి వచ్చి అందరితో ఇట్టే కలిసిపోయింది. మానస్‌కు పూర్తి వ్యతిరేకంగా ఫుల్ చలాకీగా ఉంటూ, డ్యాన్స్ చేస్తూ అదరగొట్టింది. అలా ఈ షోతో మానస్ తల్లి కూడా పాపులర్ అయింది.గృహప్రవేశంతాజాగా మానస్ తల్లి పద్మిని సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. డ్రీమ్ హౌస్ కల నెరవేరిందని తెలిపింది. భర్త ఎన్వీ రావు, కుమారుడు మానస్, కోడలు శ్రీజ, మనవడు ధ్రువతో కలిసి గృహప్రవేశం చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఈ ఇల్లు కొన్నట్లు పేర్కొంది. కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ గృహప్రవేశ వేడుక జరిగిందని చెప్పుకొచ్చింది. కాగా మానస్ 2023లో శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. వీరికి గతేడాది కుమారుడు ధ్రువ జన్మించాడు.సినిమానరసింహ నాయుడు, వీడే చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మానస్.. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా మారాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గోలీ సోడా, ప్రేమికుడు, క్షీరసాగర మథనం వంటి చిత్రాలు చేశాడు. కొన్నాళ్లకు తెలుగులో బిగ్‌బాస్ 5వ సీజన్లో పాల్గొనగా ఫైనల్ వరకు వచ్చాడు గానీ విజేత కాలేకపోయాడు. బిగ్‌బాస్ నుంచి రాగానే కార్తీకదీపం సీరియల్లో నటించాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7) చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్ నటి -
కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్‌గా..
బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన అసలు పేరు మధు నెక్కంటి (Madhoo Singer Nekkanti). ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయింది. బెజవాడ బేబక్కగా ఫేమస్ అయింది. తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. గలగలా మాట్లాడే ఈమె తొలివారమే ఎలిమినేట్ అయింది.కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్కతాజాగా బేబక్క కొత్తిల్లు కొనుగోలు చేసింది. హైదరాబాద్‌లోని కోకాపేట ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. నా ఇంటి గృహప్రవేశానికి అమ్మ ముఖ్య అతిథి అంటూ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు బేబక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ గృహప్రవేశ వేడుకకు హీరో శ్రీకాంత్ సహా తదితరులు అతిథులుగా విచ్చేశారు.పిల్లి కోసం ప్రత్యేకంగా..'నేను ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇన్నాళ్లకు సొంతింటి కల సాకారం అయింది' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇకపోతే.. అపార్ట్మెంట్లో 25వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌నే తన ఇంటిగా ఎంపిక చేసుకుంది బేబక్క. ఇందులో మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఇంట్లో పిల్లి ఆడుకోవడం కోసం ఓ గోడను డిఫరెంట్‌గా డిజైన్ చేయించింది. పూజగదిని నీట్‌గా, అందంగా కట్టించుకుంది. View this post on Instagram A post shared by Madhoo Singer Nekkanti (@bezawada_bebakka) చదవండి: -
బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. గురుగ్రామ్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చేరుకుని కాల్పులు జరిపారు.దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాల్పులు జరిగినప్పుడు ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడు. వివాదాస్పద యూట్యూబర్‌గా ఆయన పేరుంది. బహుళ అంతస్తులతో నిర్మించిబడిని ఆయన ఇంటి కింది అంతస్తులలో బుల్లెట్లు దూసుకుపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఈ సంఘటన ఈరోజు ఉదయం 5.30 మరియు 6 గంటల మధ్య జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సెక్టార్ 57లోని యాదవ్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. దాడి జరిగినప్పుడు అతని కేర్ టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు విచారణ ప్రారంభించారు.2024లో నోయిడా పోలీసులు ఎల్విష్‌ను రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో అరెస్టు చేశారు. అతడి దగ్గర 9 పాములతో పాటు 20ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఎల్విష్‌పై కేసు నమోదైంది. జైపూర్‌లోని ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంపపగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. -
అందం ఒక్కటే కాదు.. కలర్ ఉంటేనే షోలకు పిలుస్తారు: కీర్తి భట్
కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతుంటాయంటుంటారు. కానీ బిగ్‌బాస్ బ్యూటీ, కన్నడ నటి కీర్తి భట్ (Keerthi Bhat) జీవితంలో మాత్రం అవి ఫ్యామిలీ మెంబర్స్‌లా తిష్ట వేశాయి. యాక్సిడెంట్లో కన్నవాళ్లను పోగొట్టుకుంది. అదే ప్రమాదంలో చావు చివరి అంచుల వరకు వెళ్లొచ్చింది. జీవితంలో తల్లయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది. తనొక అనాధ అని ప్రియుడు వదిలేయడంతో కుంగిపోయింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. నన్ను పిలవలేదుతెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. తాజాగా ఆమె టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్ అయింది. బిగ్‌బాస్ 6 అయిపోయాక BB అవార్డ్స్ అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్ 3లో ఉన్న నేను, టాప్ 5లో ఉన్న రోహిత్ లేము. కానీ, టాప్ 10లో, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఉన్నారు. మమ్మల్నెందుకు పిలవలేదో అర్థం కాలేదు.కలర్ చూస్తున్నారువాళ్లు పిలిస్తే వెళ్తాం కానీ, అడిగి మరీ వెళ్లలేం కదా! తర్వాత నాకర్థమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మూడు రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలి. ఒకటి.. నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్ క్రియేట్ చేయాలి. రెండు.. మోడ్రన్‌గా ఉండాలి, ఎక్స్పోజ్ చేయాలి. మూడు.. కలర్ బాగుండాలి. ఈ మూడు క్వాలిటీస్ ఉంటే షోలతో బిజీగా ఉండొచ్చు. అవి నా వల్ల కాదు అని కీర్తి చెప్పుకొచ్చింది.చదవండి: చిరు మాజీ అల్లుడితో నటించిన బ్యూటీ.. 'కూలీ'తో వైరల్ -
బిగ్‌బాస్‌లోకి 'లక్స్ పాప'.. 'ఉల్లు' ఓటీటీతో మరింత పాపులర్
తెలుగు వారికి ఆశా సైనీ (Asha Saini)గా బాగా దగ్గరైన బ్యూటీ ఇప్పుడు బిగ్‌బాస్-9లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె అసుల పేరు ఫోరా సైనీ.. 1990లో ‘ప్రేమకోసం’ సినిమాతో టాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత 'నరసింహ నాయుడు, 'నువ్వు నాకు నచ్చావ్', 'ప్రేమతో రా,143 వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణతో 'లక్స్ పాప.. లక్స్ పాప' అంటూ స్టెప్పులేసింది. అయితే, 2011 తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ, బాలీవుడ్ పరిశ్రమలో బిజీగానే ఉంది. హిందీ వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాల్లొ గ్లామరస్ పాత్రలే ఎక్కువ చేస్తుంది. రానా నాయుడు, ఆర్య, X.X.X వంటి సీరిస్‌లో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏకంగా ఉల్లు ఓటీటీ కోసం ఒక రొమాంటిక్ ఫిలింలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్-9లో తన గ్లామర్ టాలెంట్‌ను చూపించేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.వివాదాలు 2008లో నకిలీ వీసా కేసులో అరెస్టు కావడం వల్ల తమిళ పరిశ్రమలో ఆమె కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. తాజాగా ఆమె ఓ నిర్మాతతో తన గత సంబంధం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనను చిత్రహింసలకు గురి చేశాడని, 14 నెలల పాటు ఒంటరిగా ఉంచాడని వెల్లడించింది. ఆ నిర్మాతతో ప్రేమల పడి నరకం చూశానని చెప్పింది. తన ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై రోజూ కొట్టేవాడని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన తల్లి వద్దే ఉంటున్నానని ఆమె చెప్పింది. అయితే, తాను తిరిగి వెండితెరపై కనిపించాలని ప్లాన్ చేస్తుంది. తనకు మొదట లైఫ్ ఇచ్చింది తెలుగు పరిశ్రమనే కాబట్టి మరోసారి ఇక్కడ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో ఆమె ఉన్నట్లు సమాచారం.తాజాగా బిగ్‌బాస్-9 నుంచి ఒక ప్రోమో విడుదలైంది. అందులో బిగ్‌బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! -
Bigg Boss: 15 మందికి అగ్నిపరీక్ష.. ఫైర్ మీదున్న జడ్జిలు!
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show)కు రావాలని చాలామందికి ఆశ ఉంటుంది. అలాంటివారికి ఓ అవకాశం కల్పించేందుకు కామన్ మ్యాన్ ఎంట్రీ పేరిట కొందరిని హౌస్‌లోకి పంపిస్తూ ఉంటారు. అయితే ఈసారి కామన్ మ్యాన్‌గా రావాలనుకుంటే అగ్నిపరీక్షను గెలిచి రావాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. ఏదేమైనా సరే బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu)వ సీజన్లో కనిపించాలని దాదాపు 20 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. జడ్జిలుగా ముగ్గురువారిలో 100 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఈ ఇంటర్వ్యూల ద్వారా 45 మందిని సెలక్ట్ చేశారు. వీరిని అగ్నిపరీక్ష కార్యక్రమానికి పిలిచారు. ఈ కార్యక్రమానికి మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్‌లను జడ్జిగా నియమించారు. వీళ్లు.. మొదటి రౌండ్లో 15 మందిని ఎంపిక చేశారు. వాళ్లెవరంటే..1. దివ్య నిఖిత (ఇన్ఫ్లుయెన్సర్)2. అనూష రత్నం (ఇన్ఫ్లుయెన్సర్)3. శ్వేతా శెట్టి4. శ్రియ5. డిమాన్ పవన్6. దమ్ము శ్రీజ (ఇన్ఫ్లుయెన్సర్)7. ప్రసన్న కుమార్ (దివ్యాంగుడు)8. ప్రశాంత్ (లాయర్)9. షాకీబ్ (ఇన్ఫ్లుయెన్సర్)10. కల్కి (మిస్ తెలంగాణ రన్నరప్)11. దాలియా షరీఫ్ (జిమ్ ట్రైనర్)12. మాస్క్ మ్యాన్13. పవన్ కల్యాణ్ (జవాన్)14. మరియాద మనీష్ (బిజినెస్మెన్)15. ప్రియా శెట్టిఅగ్నిపరీక్ష వీడియో లీక్..వీరిలో కల్కి.. అభిజిత్‌తో స్టెప్పులేయించిందని తెలుస్తోంది. ఇక అగ్నిపరీక్ష ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో లీకైంది. అందులో బిందు మాధవి.. ఏయ్, ఎందుకంత ఓవరాక్టింగ్ చేస్తున్నావ్? అంటూ ఓ కంటెస్టెంట్‌పై అసహనం వ్యక్తం చేసింది. నవదీప్ అయితే.. ఏ.. పో.. అంటూ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇక అభిజిత్ కూడా కొందరు కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడని భోగట్టా! ఇకపోతే 15 మందిలో నుంచి 5 లేదా 9 మందిని సెలక్ట్ చేసి బిగ్‌బాస్ హౌస్‌కు పంపించనున్నారు. ఈ అగ్నిపరీక్ష షో జియోహాట్‌స్టార్‌లో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.చదవండి: నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా -
బిగ్ బాస్ సోనియా సీమంతం ఫోటోలు.. పసిడిలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ సోనియా..రెస్టారెంట్లో చిల్ అవుతోన్న ఇనయా సుల్తానా..శారీలో మరింత బ్యూటీఫుల్‌గా సింగర్ చిన్మయి..అరుణాచల్ ప్రదేశ్ వేకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న వితికా శేరు..శారీలో మెరిసిపోతున్న టాలీవుడ్ నటి రోహిణి.. బంగారంలా ధగధగ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
బిగ్ బాస్ బ్యూటీ ఇంట పండగ సందడి, తారల భక్తి పారవశ్యం (ఫొటోలు)
-
'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. బిగ్ బాస్‌పై బిగ్ ట్విస్ట్!
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు. కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు. దాదాపుగా 40 మందిని ఫైనలైజ్ చేసిన వీరికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.ఈ ప్రాసెస్ నడుస్తుండగానే బిగ్‌బాస్ మేకర్స్ మరో ప్రోమోను రిలీజ్ చేశారు. బిగ్ బాస్ కమింగ్ సూన్ అంటూ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్‌తో జరిగిన సరదా సంభాషణ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి వచ్చావా? అంటూ నాగార్జున అడగ్గా.. కాదు.. ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిశోర్ అంటారు. అది నీవల్ల కాదులే.. ఈసారి వెరీ టఫ్ అని నాగార్జున అనడంతో.. నేను చాలా రఫ్ అని చెప్తాడు.(ఇది చదవండి: 40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్‌స్టార్‌లో 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష)ఈ సారీ బిగ్‌బాస్ డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ వెన్నెల కిశోర్‌కు నాగార్జున చిన్న ఝలక్ ఇస్తాడు. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా? అంటూ వెన్నెల కిషోర్‌ను నాగార్జున ప్రశ్నిస్తాడు. నేను డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌తోనే మాట్లాడుకుంటానని వెన్నెల కిశోర్ చెప్పడంతో.. ఈసారీ ఏకంగా బిగ్‌బాస్‌నే మార్చేశా అంటూ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈ సారీ చదరంగం కాదు.. రణరంగమే.. అనే డైలాగ్‌లో ప్రోమో ముగిసింది. ఇది చూస్తుంటే ఈ బిగ్‌బాస్ సీజన్లో పాత బిగ్‌బాస్ ఉంటాడా? లేదా నిజంగానే కొత్త బాస్‌ను తీసుకొస్తున్నారా? మొత్తానికి ఈ ప్రోమోతో మరింత ఆసక్తి పెంచేశారు. -
బిగ్‌బాస్ కొత్త సీజన్లో పహల్గామ్ బాధితురాలు?
కొన్నాళ్ల క్రితం కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గుర్తుండే ఉంటుంది. హనీమూన్ కోసం అక్కడికి అదేరోజు వెళ్లిన నేవీ అధికారి వినయ్ నర్వాల్.. ఉగ్రవాదుల్లో కాల్పుల్లో మరణించాడు. ఇతడి పక్కనే రోదిస్తున్న భార్య హిమాన్షి నర్వాల్ ఫొటో అప్పుడు తెగ వైరల్ అయింది. ఆమెకు చాలామంది సానుభూతి తెలియజేశారు. అలాంటిది ఇప్పుడు ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 'బిగ్‌బాస్'.ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్‌బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. దీనిలో ఎవరెవరు పాల్గొంటారు అనే విషయమై కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో హిమాన్షి నర్వాల్ పేరు కూడా ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే భర్త, ఉగ్రదాడిలో చనిపోయి ఎన్నిరోజులు కాలేదు అలాంటిది ఈమె షోలో పాల్గొంటుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'అరుంధతి' చైల్డ్ ఆర్టిస్ట్‌కి పెళ్లి.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ)బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈసారి బిగ్‌బాస్ షో నిర్వహకులు.. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కంటెస్టెంట్స్‌ని కోరుకుంటున్నారని, ఈ క్రమంలోనే హిమాన్షిని తీసుకురావాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం లేదని మరికొందరు అంటున్నారు. ఇది దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం అని.. అసలు నిర్వహకులు ఈమెని సంప్రదించలేదని, షోలో పాల్గొనే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.హిమాన్షి కథ వెనకున్న విషాదం చాలామంది భారతీయుల్ని కదిలించింది. ఎందుకంటే పెళ్లి చేసుకుని కొన్నిరోజులకే హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా.. అక్కడ ఈ దంపతులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఈమె భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్ చనిపోయారు. హిమాన్షి క్షేమంగా బయటపడింది. ఘటన స్థలంలోనే నిర్జీవంగా ఉన్న భర్త పక్కన ఈమె కన్నీళ్లు పెడుతున్న ఫొటోలు.. దేశవ్యాప్తంగా చాలామందిని ఎమోషనల్ అయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి టాలీవుడ్ లేడీ సింగర్ సమీర భరద్వాజ్.. ఫొటోలు) -
వరలక్ష్మీ వ్రతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫోటోలు)
-
సీమంతం వేడుక.. ఫోటోలు షేర్ చేసిన సోనియా (ఫోటోలు)
-
రెండోసారి తండ్రైన బిగ్‌బాస్ ఆదిరెడ్డి.. సోషల్ మీడియాలో పోస్ట్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి రెండోసారి తండ్రయ్యారు. ఇవాళ ఆయన సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా రెండోసారి కూడా కూతురు పుట్టడం సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే ఆదిరెడ్డి భార్యకు సీమంతం వేడుగ ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.కాగా.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
బిగ్‌బాస్ సోనియా సీమంతం ఫోటోలు.. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫస్ట్ మ్యారేజ్ డే చిల్!
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ సోనియా..దుబాయ్‌లో చిల్ అవుతోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ..షూటింగ్లో బిజీగా బిగ్‌బాస్ అశ్విని శ్రీ..మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్..బ్లాక్ శారీలో కాజోల్ బ్యూటీఫుల్ లుక్.. View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్
బిగ్‌బాస్ రియాలిటీ షోతో చాలామంది నటీనటులు బాగానే పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో గౌతమ్ కృష్ణ ఒకడు. తెలంగాణకు చెందిన ఇతడు స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు కూడా చేశారు. కాకపోతే పెద్దగా పేరు రాలేదు. అలా బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు.(ఇదీ చదవండి: నా ఐటమ్ సాంగ్ చూస్తూ పిల్లలు భోంచేస్తున్నారు: తమన్నా)బిగ్‌బాస్ 7వ సీజన్లో అశ్వద్ధామ అంటూ హడావుడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయాడు. కానీ మరోసారి అవకాశం రావడంతో గతేడాది జరిగిన 8వ సీజన్లోనూ పాల్గొన్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. రీసెంట్‌గానే 'సోలో బాయ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిన్న సినిమా కావడంతో థియేటర్లలో పెద్దగా చూడలేదు. ప్రస్తుతం ఓటీటీలో ఉంది.అసలు విషయానికొస్తే గౌతమ్ ఇప్పుడు ఓ శుభవార్త చెప్పాడు. తన కుటుంబంలోకి కొత్త మెంబర్ రాబోతున్నారని ఫొటో పోస్ట్ చేశాడు. తన వదిన ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారని చెబుతూ, ఆమెకు సీమంతం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. మరి అన్నయ్య-వదిన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మరి గౌతమ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు) View this post on Instagram A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna) -
ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్
బుల్లితెర బ్యూటీ సిరి హన్మంత్ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయింది. ఉయ్యాలా జంపాలా సీరియల్‌తో నటనవైపు అడుగులు వేసిన సిరి.. సావిత్రమ్మగారి అబ్బాయి, అగ్నిసాక్షి వంటి సీరియల్స్‌లో నటించి ఆకట్టుకుంది. సాఫ్ట్వేర్ బిచ్చగాళ్లు, మేడం సార్ మేడం అంతే, రామ్ లీలా, పులి మేక వంటి వెబ్ సిరీస్‌లతో ఫుల్ పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చీరలో అందంగా సిరిఆ మధ్య వచ్చిన షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రంలోనూ చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. తాజాగా ఈ బిగ్‌బాస్ బ్యూటీ ప్రియుడు, నటుడు శ్రీహాన్‌తో కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీహాన్ పంచెకట్టులో ఉండగా సిరి చీరలో అందంగా ముస్తాబైంది. ఇది చూసిన కొందరు పెళ్లి కాకుండా ఇలా జంటగా వరలక్ష్మి వ్రతం చేయొచ్చా? అని సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. అందుకే పెళ్లి ఆలస్యం?కాగా సిరి, శ్రీహాన్ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చాలాకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఓ బాబును దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సిరి-శ్రీహాన్ పెళ్లి గురించి ఎన్ని రూమర్లు వచ్చినా వీరు మాత్రం వాటిని పట్టించుకోనట్లే ఉంటున్నారు. దానికింకా టైముంది అన్నట్లుగానే ఓ ఎక్స్ప్రెషన్ పడేస్తున్నారు. అయితే ఓ సందర్భంలో సిరి మాట్లాడుతూ.. చిన్నప్పుడే తండ్రికి దూరం కావడంతో చాలా కష్టాలు చూశా. అందుకే, బాగా సెటిల్ అయి., మంచి స్థాయికి చేరుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) చదవండి: వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి -
బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు.. డేట్ రివీల్ చేసిన ఓటీటీ సంస్థ
బుల్లితెర ప్రియులను అలరించే బిగ్‌బాస్ రియాలిటీ షోకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే హోస్ట్‌గా మరోసారి ఆ స్టార్ హీరోనే అలరించనున్నారు. ఈ బిగ్‌బాస్ షోకు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఏ భాషలో వచ్చిన ఈ రియాలిటీ షో బుల్లితెర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హిందీలో బిగ్‌బాస్ సీజన్-19కు సమయం ఆసన్నమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ప్రకటించింది.ఆగస్టు 24 నుంచి బిగ్‌బాస్-19 సీజన్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఈ సీజన్ అభిమానులను అలరించనుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో జియో హాట్‌స్టార్‌తో పాటు కలర్స్ టీవీలో ప్రసారం కానుంది.రెమ్యునరేషన్ తగ్గించుకున్న సల్మాన్ ఖాన్..అయితే ఈ ఏడాది సీజన్‌కు సల్మాన్ ఖాన్ భారీగా పారితోషికం తగ్గించుకున్నారు. ఈ ఏడాది వీకెండ్‌కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం తగ్గించుకోవడం గమనార్హం.Bhai ke saath laut aaya hai Bigg Boss ka naya season!Aur iss baar chalegi - Gharwalon Ki Sarkaar👑Dekhiye #BiggBoss19, 24th August se, sirf #JioHotstar aur @colorstv par.@BeingSalmanKhan @danubeprop #VaselineIndia#BiggBossOnJioHotstar#BB19OnJioHotstar pic.twitter.com/MxqX8s0Cor— JioHotstar (@JioHotstar) July 31, 2025 -
బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా గ్లామరస్.. బేబీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా స్టైలిష్ లుక్..బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా చిల్..బేబీతో ఆడుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..సారా అలీ ఖాన్ బ్యూటీఫుల్ వీడియో..భర్తతో కలిసి లాస్య మంజునాథ్ ఫ్యాషన్ లుక్.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
'ఇంత బతుకు బతికి'.. బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ!
బిగ్‌బాస్ ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. జీవితంలో ఒక్కసారైనా బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లాలన్న కల నేరవేర్చుకోవడమే కాదు.. ఏకంగా విన్నర్‌గా నిలిచాడు. రైతుబిడ్డగా హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. బిగ్‌బాస్ విజేతగా బయటికి తిరిగొచ్చాడు. జై జవాన్- జై కిసాన్ అంటూ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేతగా నిలిచాడు.అయితే బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం ప్రశాంత్‌కు కొద్దిగంటల్లోనే ఆవిరైంది. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ వద్దకు పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు హంగామా సృష్టించారు. దీంతో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పల్లవి ప్రశాంత్ ఆరోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యారు. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఇంత బతుకు బతికి.. మా నాన్నను కోర్టు మెట్లు ఎక్కేలా చేశానని ఏడ్చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన తలచుకుంటే నాకు ఇప్పటికీ బాధగానే ఉంటది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
యూఎస్‌లో ప్రియాంక బీచ్ వెకేషన్ (ఫొటోలు)
-
తల్లి కాబోతున్న సోనియా.. సీమంతం వేడుకలో బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ షోతో నెగెటివిటీ, పాపులారిటీ ఒకేసారి సంపాదించింది సోనియా ఆకుల (Soniya Akula). పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీలతో ఆమె వ్యవహరించిన తీరు జనాలకు అంతగా నచ్చలేదు. దీంతో ఫినాలే వరకు రాకుండానే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే ఎంటర్ప్రెన్యూర్ యష్ వీరగోనిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది.ఏడాది తిరగకముందే గుడ్న్యూస్షో నుంచి బయటకు వచ్చిన వెంటనే అతడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గతేడాది డిసెంబర్లో యష్-సోనియా పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిరోజుల క్రితమే సోనియా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే తను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. నేడు (జూలై 27న) ఆమె సీమంతం ఘనంగా జరిగింది. సీమంతం ఫంక్షన్లో కీర్తిఈ వేడుకకు బుల్లితెర నటి కీర్తి భట్, ఆమెకు కాబోయే భర్త విజయ్ కార్తికేయన్‌తో కలిసి వెళ్లింది. తల్లి కాబోతున్న సోనియాకు చీర బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కీర్తి.. తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కాబావకు శుభాకాంక్షలు.. హ్యాపీ సీమంతం. మీరెప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి. త్వరలో రాబోయే బుజ్జిపాప కోసం ఈ పిన్ని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని క్యాప్షన్ ఇచ్చింది. రెండో పెళ్లిఇది చూసిన అభిమానులు వీరి ప్రేమాభిమానులు చూసి ముచ్చటపడిపోతున్నారు. కాగా యష్ వీరగోనికి గతంలో పెళ్లయింది. ఓ బాబు కూడా ఉన్నాడు. చాలాకాలం క్రితమే భార్యకు విడాకులిచ్చే ఒంటరిగా ఉంటున్నాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్కౌంటర్ చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్ -
'బిగ్‌బాస్' వితిక యూఎస్ ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్‌స్టార్‌లో 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష
"బిగ్‌బాస్ షోలో సామాన్యులు". కామన్ మ్యాన్ అంటారే కానీ వారు అప్పటికే సోషల్ మీడియాలో కొద్దోగొప్పో ఫేమస్ అయినవారినే రియాలిటీ షోకి తీసుకొస్తారు! గత రెండు మూడు సీజన్లలో ఇదే జరిగింది. అయితే ఈసారి (Bigg Boss Telugu 9) ఒక్కరిని కాదు కనీసం ముగ్గురు, నలుగురినైనా కామన్ మ్యాన్ కేటగిరీ కింద ఎంపిక చేస్తారట! ఇప్పటికే షోలో పాల్గొనడానికి అనేకమంది వీడియోలు పంపి దరఖాస్తులు చేసుకున్నారు.40 మందితో షోమొదటి దశలో సుమారు 200 మందిని సెలక్ట్ చేశారు. హావభావాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. ఇలా పలు అంశాల ఆధారంగా వీడియోలు జల్లెడ పట్టి అందులో 100 మందిని ఎంపిక చేశారు. వీరితో గ్రూప్ డిస్కషన్స్ అయ్యాక చివరగా 40 మందిని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడీ 40 మంది మధ్యే అసలైన పోటీ జరగనుంది. వీరికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (BIGG BOSS AGNIPARIKSHA) పెట్టనున్నాడు. ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.అగ్నిపరీక్షఅసలు ఆ 40 మంది ఎవరు? ఆ అగ్నిపరీక్షలో ఎలాంటి టాస్కులిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే! అయితే ఈ అగ్నిపరీక్షను బిగ్‌బాస్ అభిమానులు జియోహాట్‌స్టార్‌లో చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. వచ్చే నెలలోనే ఈ అగ్నిపరీక్ష కార్యక్రమం ఉండనుంది. ఇందులోనుంచి ముగ్గురు, నలుగురు కంటెస్టెంట్లను ఎంపిక చేసిన తర్వాత.. సెప్టెంబర్‌లో బిగ్‌బాస్ 9 ప్రారంభం కానుంది. చదవండి: చైసామ్ విడాకులపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. కేసు వాయిదా -
బిగ్‌బాస్ కొత్త సీజన్.. సగానికి సగం పారితోషికం తగ్గించేసిన స్టార్ హీరో!
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)ను విజయవంతంగా ముందుకు నడిపించడంలో హోస్ట్‌దే ప్రధాన పాత్ర! కంటెస్టెంట్లను వాయించడానికి, తప్పొప్పులు చెప్పడానికి, సరిదిద్దడానికి హోస్ట్ వీకెండ్లో రెండుసార్లు వస్తూ ఉంటాడు. షో చప్పగా ఉంటే దాన్ని రంజుగా మారుస్తాడు, ఊపు మీదంటే మరింత క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎటొచ్చీ గేమ్‌ను ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా ట్రై చేస్తాడు.15 ఏళ్లుగా హోస్టింగ్అయితే సినిమాలు చేసే స్టార్లు టీవీ షోలలో హోస్ట్‌గా కనిపించాలంటే అంత ఈజీ కాదు. వారు అడిగిన రేంజులో డబ్బు ఇచ్చుకుంటేనే బుల్లితెరపై కనిపించడానికి సిద్ధమవుతారు. తెలుగులో మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత నాని బిగ్‌బాస్ షోకి హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత అంటే మూడో సీజన్ నుంచి నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హిందీలో మొదట అర్షద్ వార్సీ, శిల్పా శెట్టి, అమితాబ్ బచ్చన్ వంటి పలువురు సెలబ్రిటీలు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వచ్చే నెలలోనే ప్రారంభంనాలుగో సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ షోను తన భుజాలపై ఎత్తుకుని నడిపిస్తున్నాడు. ఆగస్టు 30న హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సల్మాన్.. ఎంత పారితోషికం తీసుకుంటున్నాడన్న చర్చ మొదలైంది. అయితే హీరో ఈసారి తన రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకున్నాడట! కారణం గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ 19వ సీజన్‌కు పెద్దగా బడ్జెట్ కేటాయించలేదని తెలుస్తోంది. పారితోషికంలో రూ.100 కోట్ల కోత!సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం సల్లూ భాయ్ వీకెండ్‌కు రూ.8 - 10 కోట్ల మేర పారితోషికం తీసుకునేందుకు అంగీకరించాడు. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.120-150 కోట్లు అందుకోనున్నాడు. అయితే ఈ హీరో బిగ్‌బాస్ 17వ సీజన్‌కు రూ.200 కోట్లు, 18వ సీజన్‌కు ఏకంగా రూ.250 కోట్లు పుచ్చుకున్నాడు. అలాంటిదిప్పుడు సగానికి సగం అందుకోవడం కొంత ఆశ్చర్యకరమనే చెప్పుకోవాలి!ఓటీటీకే ప్రాధాన్యతబిగ్బాస్ 19వ సీజన్లో ఓటీటీకే ప్రాధాన్యతనిస్తున్నారు. హాట్‌స్టార్‌లో ఎపిసోడ్ రిలీజ్ చేసిన గంట- గంటన్నర తర్వాతే టీవీలో ప్రసారం కానుందట! అలాగే ఈ సీజన్ ఐదు నెలలు కొనసాగుతుందని, మొదటి మూడు నెలలు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తే తర్వాత ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి వారు చివరి రెండు నెలలు షో బాధ్యతలు అందుకోనున్నారని భోగట్టా! మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ (ఓటీటీ) -
న్యూయార్క్ వీధుల్లో ప్రియుడితో ప్రియాంక ఇలా (ఫొటోలు)
-
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ (ఫొటోలు)
-
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ సోనియా.. ప్రాజెక్ట్ సక్సెస్ అంటూ రివీల్!
తెలుగు ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సోనియా ఆకుల. ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటికొచ్చేసింది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. ఆ తర్వాతే కొన్ని రోజులకే డిసెంబర్లో యశ్వీర్ గ్రోనితో ఏడడుగులు వేసింది. నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ.. నెల రోజుల్లోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది.ఇటీవల తిరుమలను సందర్శించిన సోనియా.. తాజాగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భం ధరించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయాన్ని అందరికంటే భిన్నంగా రివీల్ చేసింది. ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకుని మరి వచ్చి తన భర్త యశ్వీర్ గ్రోనికి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ శుభవార్త విన్న యశ్వీర్ గ్రోని తన భార్యను హత్తుకుని సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది. View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్ ఫేం పోస్ట్ (ఫొటోలు)
-
పోలీసులకు ఫిర్యాదు చేసిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఎందుకంటే!
ప్రముఖ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ (24) పోలీసులను ఆశ్రయించింది. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబయిలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన బీరువాలోని రూ.4 లక్షల నగదు చోరీ చేశాడని జూలై 9న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది. కాగా.. బిగ్‌బాస్ బ్యూటీ కశిశ్ కపూర్ బీహార్ స్వస్థలం కాగా.. ప్రస్తుతం ముంబయి అంధేరి వెస్ట్‌లోని ఆజాద్‌నగర్ వీర దేశాయ్ రోడ్‌లోని సొసైటీలో నివసిస్తోంది. ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. -
'బిగ్‌బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్ కూడా!
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయికిరణ్, ముకేశ్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్‌లోకి పంపించనున్నారు.బిగ్‌బాస్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలుతాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్‌బాస్ టీమ్ కాదట! హిందీ బిగ్‌బాస్ టీమ్! హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్‌లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. కంటెస్టెంట్లు వీళ్లేనా?ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (హీరోయిన్ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కూతురు), సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!సన్యాసం తీసుకున్న ఆమె కూడా!వీరే కాకుండా లతా సబర్వాల్ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది), ఆశిష్ విద్యార్థి (టాలీవుడ్ విలన్), హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్‌బాస్‌కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు -
ఓటీటీలో టేస్టీ తేజ సినిమా.. చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘6జర్నీ’. మే 9న విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి బసీర్ ఆలూరి దర్శకత్వం వహించారు.'6జర్నీ' సినిమా సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ మూవీలో పెద్ద స్టార్లు ఎవరూ లేకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. అయితే, ఈ సినిమాను చూడాలంటే రూ. 149 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడిలేని ఈ చిత్రానికి అదనంగా రెంట్ చెల్లించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. -
ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్‌బాస్ టీమ్
చాలామంది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు పాపులారిటీ, డబ్బు కోసమే వెళ్తుంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక పూర్తిగా అందులోనే లీనమవుతారు. కొన్నిసార్లు ప్రేమలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా ఓ నటి నిజంగానే లవ్‌లో పడింది. కానీ అవతలి వ్యక్తి ఫుటేజీకోసం, పాపులారిటీ కోసం ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ విషయం తెలిసి సదరు నటి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.బ్రేకప్ అయ్యాక హౌస్‌లోకి..ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియుడితో బ్రేకప్ అయి విపరీతమైన బాధలో ఉన్న ఓ ప్రముఖ నటి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశ్యంతో రియాలిటీ షోకి వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ హౌస్‌లోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అది ఆమె గుర్తించలేకపోయింది. అతడు మోసం చేస్తున్నాడని గ్రహించిన రోజు బాధ తట్టుకోలేకపోయింది.అదే వారం ఎలిమినేట్తను షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున మూడుగంటలకు బాత్రూమ్కి వెళ్లి చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె చేస్తున్న పనిని గ్రహించి మేమంతా సెట్లోకి పరిగెత్తి తనను అడ్డుకున్నాం. మా లక్ ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ముంబై నుంచి వచ్చేవరకు తనతో మాట్లాడుతూ కూర్చున్నాం. పొద్దున ఏడింటివరకు తనతోనే ఉన్నాం. అదే వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించేశాం అని చెప్పుకొచ్చాడు. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.బిగ్‌బాస్ ఎన్ని భాషల్లో?డచ్ రియాలిటీ షో బిగ్‌బ్రదర్ నుంచి పుట్టిందే బిగ్‌బాస్. ఇండియాలో బిగ్‌బాస్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో బిగ్‌బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభానుముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వర్జిన్ బాయ్స్ హీరోయిన్ గొప్పమనసు.. నల్గొండ కుర్రాడికి సాయం!
బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. యూత్ ఆడియన్స్‌ను ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించారు. దయానంద్ గడ్డం దర్శకత్వంలో రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో మిత్రా శర్మ తన మంచి మనసును చాటుకుంది. నల్గొండ నుంచి వచ్చిన ఓ దివ్యాంగుడు ఈవీ ఇప్పించాలని కోరడంతో మిత్రా శర్మ అతని వివరాలు అడిగి తెలుసుకుంది. నీకు 15 రోజుల్లోనే ఈవీ వాహనం అందజేస్తామని అతనికి హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ హీరోయిన్ మిత్రా శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు వర్షంలా కురిపిస్తామని.. ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అని బంపరాఫర్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, జేడీ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. Heroine @Mitraaw_sharma encounters a need boy at #VirginBoysTrailer Launch Event and extends her helping hand for an EV 👏#VIRGINBOYS IN THEATERS FROM JULY 11th ! pic.twitter.com/YYC6euA504— Rajesh Manne (@rajeshmanne1) July 7, 2025 -
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (Priyanka Jain) ఇటీవల 27వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో కేక్‌ను కాలి చెప్పుపై పెట్టి ఫోటోలకు పోజిస్తూ విమర్శలపాలైన సంగతి తెలిసిందే! అయితే తన బర్త్‌డే రోజు మరో పని కూడా చేసింది. తనకు జన్మనిచ్చిన తల్లి కోసం ఓ ఫోటోషూట్ ప్లాన్ చేసింది. మా అమ్మ ప్రెగ్నెన్సీ అంటూ సదరు షూట్ ఎలా జరిగిందో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.నా బేబీ కోసం ఆలోచిస్తున్నా..ప్రియాంక ప్రియుడు, నటుడు శివకుమార్ ఈ వీడియో రికార్డ్ చేశాడు. మీ అమ్మ ప్రెగ్నెన్సీ షూట్ జరుగుతోంది. మరి నీకు తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగాడు. అందుకు ప్రియాంక.. నువ్వు తమ్ముడు, చెల్లి అని అడుగుతున్నావు. నేనింకా నాకెప్పుడు బేబీ పుడుతుందా? అని ఆలోచిస్తున్నా అని పంచ్ వేసింది. ఆ మాటతో షాకైన శివకుమార్.. పెళ్లి చేసుకున్నాక ఇలాంటివి మాట్లాడమని ఆన్సరిచ్చాడు.27 ఏళ్ల కిందట ప్రెగ్నెంట్దానికి ప్రియాంక బదులిస్తూ.. పెళ్లి చేసుకున్నాకే కదా పిల్లల్ని కనేది.. ఆ పెళ్లే ఎప్పుడు అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. ఒకమ్మాయిగా నా బాధ నీకేం తెలుసులే అని కామెంట్ చేసింది. తర్వాత తన తల్లి ప్రెగ్నెన్సీ షూట్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ 27 ఏళ్ల కింద ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు తన కడుపులో నేనున్నాను. ఆ ప్రెగ్నెన్సీని ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాం. నేను పుట్టేముందు మా అమ్మ ఎలా ఫీలైంది? అని కళ్లారా చూడాలనుకున్నాను. అలాగే తనకు సీమంతం కూడా జరగలేదు. అందుకే ఇలా ఫోటోషూట్ ప్లాన్ చేశాను అంది. కూతురు తనకు ప్రెగ్నెన్సీ షూట్ చేసేసరికి ప్రియాంక తల్లి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. చదవండి: ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం -
నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ బ్యూటీ మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరోయిన్గా, నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే! తను బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడూ ఎవరో ఒకరికి సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. మిత్రా శర్మ కథానాయికగా నటించిన తాజా చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ మూవీ జూలై 11న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మిత్ర భావోద్వేగానికి లోనైంది. అమ్మ-నాన్నను కోల్పోయానేను పుట్టగానే అమ్మను కోల్పోయాను. చిన్నవయసులోనే నాన్నకూ దూరమాయ్యాను మా నాన్న టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే! ఆయన చనిపోయేముందు కూడా నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న అని చాలా బాధపడ్డాను. ఆయన వెళ్లిపోయాక నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితంలో ఎవరైనా ఉంటే వారికోసం ఏదైనా చేయాలనుకున్నాను. కానీ, అర్హత ఉన్నవారికే సాయం చేయాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో రిజెక్షన్స్ చూశాను.తలరాత మార్చలేరుగాతిరస్కరణకు గురైనప్పుడల్లా నాకేమనిపించేదంటే.. నాలో ఏమైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా? లేదంటే టైం బాగోలేదా? ఇలా నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. తర్వాత మళ్లీ నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మన దగ్గరున్న డబ్బు ఆఖరి రూపాయి వరకు ఎవరైనా తీసుకెళ్లవచ్చు. కానీ మన తలరాతను తీసుకెళ్లలేరు కదా అని రియలైజ్ అయ్యేదాన్ని. సాయం చేయాలి.. నాకంటూ మంచి మనుషులను సంపాదించుకోవాలి అనే లక్ష్యంతోనే ముందుకువెళ్తున్నాను అంటూ మిత్ర శర్మ కన్నీళ్లు పెట్టుకుంది.సినిమాగీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వర్జిన్ స్టోరీ. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ కీలక పాత్రల్లో నటించారు. దయానంద దర్శకత్వం వహించగా దారపునేని రాజా నిర్మించారు. జూలై 11న ఈ సినిమా రిలీజవుతోంది. సినిమా చూసినవారికి ఐఫోన్లు కూడా రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. సినిమా చూశాక.. టికెట్ ఫోటో తీసి 8019210011 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని.. లక్కీ డ్రా ద్వారా 11 మందిని సెలక్ట్ చేసి ఐఫోన్ పంపిస్తామని క్రేజీ ఆఫర్ ఇచ్చారు.చదవండి: ప్రభాస్ రూ.50 లక్షల సాయం? ఒక్క రూపాయి అందలేదు: ఫిష్ వెంకట్ -
నాపై ఎందుకు ఇంత ద్వేషం.. ఇదేం మొదటిసారి కాదు: ఉర్ఫీ జావెద్
విచిత్రమైన దుస్తుల వేషధారణతో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోనూ మెరిసింది. ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ది ట్రైటర్స్ అనే షోలోనూ కనిపించింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ షోలో చాలామంది కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. అయితే చివరికీ రియాలిటీ టీవీ షో 'ది ట్రెయిటర్స్' విజేతగా ఉర్ఫీ జావెద్ నిలిచింది.అయితే ది ట్రైటర్స్ విజేతగా నిలిచిన ఉర్ఫీ జావెద్‌కు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు నెటిజన్స్ చాలా అసభ్యకరంగా సందేశాలు పంపారు. ఈ విషయాన్ని ఉర్ఫీ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. తనపై వస్తున్న కామెంట్స్‌ను స్క్రీన్ షాట్ రూపంలో షేర్ చేసింది. తనకు ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదని అంటోంది.ఉర్ఫీ జావెద్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఒక అమ్మాయి చేసే పని మీకు నచ్చకపోతే ఆర్ అనే పదాన్ని కామెంట్స్‌లో వదిలేయండి. నన్ను ఇలా బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం ఇదేం మొదటిసారి కాదు. కానీ ఈసారి నా దుస్తుల వల్ల కాదు.. నేను ఒక షో గెలిచినందు వల్ల. మీ అభిమానించే ఆటగాడు గెలవకపోతే నన్ను బెదిరించడం లాంటివి ఊహించుకోండి. నేను అప్లోడ్ చేసిన వాటిలో ఇవి చాలా డీసెంట్ కామెంట్స్. నేను ఏం చేసినా, ప్రజలు ద్వేషించడం, అసభ్యకరంగా కామెంట్స్ చేయడాన్నే ఇష్టపడుతున్నారు. ఇలాంటి ద్వేషం చూపిస్తూ చేసే మీ కామెంంట్స్ నన్ను ఇంతకు ముందు ఎప్పుడూ ఆపలేదు.. ఇకపై ఎప్పటికీ ఆపలేవు కూడా' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.కాగా.. అంతకుముందే తాను 'ది ట్రెయిటర్స్' గెలవడం వరకు జరిగిన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా ఈ ప్రయాణం సులభం కాదని.. ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపింది. జీవితంలో చాలా బాధలు ఎదురయ్యాయి.. ఒకానొక సమయంలో అన్ని వదిలేసి పారిపోవాలనుకున్నానని పేర్కొంది. తనకు చాలా బెదిరింపులు, అత్యాచార బెదిరింపులు, నాపై ఎంతోమందికి ద్వేషం ఉన్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయలేదని రాసుకొచ్చింది. 'బిగ్ బాస్‌లో ఓడిపోయినప్పుడు మంచి జీవితాన్ని గడపడానికి నా చివరి అవకాశాన్ని కోల్పోయానని అనిపించిందని తెలిపింది. బిగ్ బాస్‌కు వెళ్లేముందు బట్టలు కొనడానికి స్నేహితుల నుంచి రుణం కూడా తీసుకున్నా.. ఆ సమయంలో నేను తిరిగి చెల్లించగలనో కూడా నాకు తెలియదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. -
బిగ్‌బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్‌బాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్‌బాస్ టీమ్ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో AI రోబోసింగర్, డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్‌కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్‌లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్‌బాస్ హౌస్‌కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్‌లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.రోబో విశేషాలుయూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్‌తో లెహంగాలో క్యూట్‌గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే గేమ్ ఛేంజర్‌గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు -
ప్రియాంక బర్త్‌డే.. కాలి చెప్పుపై కేక్.. 'తిండితో ఆటలా?'
ఏ డైలాగ్స్ చెప్పకుండా, కేవలం హావభావాలతోనే ఎమోషన్స్ పలికించడం చాలా కష్టం. అయినా సరే అదెంత పని అన్నట్లుగా కళ్లతోనే నటించేసింది ప్రియాంక జైన్ (Priyanka M Jain). మౌనరాగం సీరియల్‌తో బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ సీరియల్ హీరో శివకుమార్‌తో ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమాయణం నడిపింది. 2018లో ఈ సీరియల్ రాగా.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కలిసుంటున్నారీ లవ్ బర్డ్స్. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. బిగ్‌బాస్ షోతో పాపులర్జానకలి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రియాంక.. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో అందరికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలలో కనిపిస్తోంది. తాజాగా పరి (శివకుమార్ ప్రియాంకను ముద్దుగా పిల్చుకునే పేరు) 27వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీ అభిమానం వల్లే..ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే! మీరు నన్ను ఎంతగానో నమ్మారు. నేను పోషించిన ప్రతి పాత్రకు, తీసుకున్న ప్రతి నిర్ణయాలకు మీ ఆశీర్వాదాలే కారణం. నా ప్రయాణంలో భాగమైనందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఓ ఫోటో తన కాలి చెప్పుపై బర్త్‌డే కేక్‌ను పెట్టింది. తర్వాత అదే కేక్‌ను ఆరగించింది. తిండితో ఆటలా?ఇది చూసిన సెలబ్రిటీలు.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. తినే ఆహారాన్ని అలా కాళ్లపై పెట్టి కించపరిస్తే తిండి దొరకదు, ఎంత వయసు వస్తే ఏంటి? సంస్కారం ఉండొద్దా? అన్నం కూడా అలాగే చెప్పులతో తింటావా? తిండితో ఆటలొద్దు, తినేదాన్ని కాలుమీద పెట్టినందుకు సిగ్గనిపించట్లేదా? అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు మాత్రం బ్యూటిఫుల్ పరికి హ్యాపీ బర్త్‌డే అని విషెస్ చెప్తున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్ రాజు -
'21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ
ఒక్క పాటతో పడిపోయింది బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌తో కలిసి మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఆలస్యం చేయడం ఎందుకనుకున్నారో ఏమో కానీ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే అతడికి బోలెడంత ఆస్తి ఉందని, 21 కార్లున్నాయని.. అందుకే మనోభావాలు పాప వెంటనే పెళ్లికి కూడా సిద్ధపడిపోయిందని ట్రోలింగ్ జరిగింది.మోడల్‌గా..తాజాగా ఈ ట్రోలింగ్‌పై శుభశ్రీ రాయగురు (SubhaShree Rayaguru) స్పందించింది. అలాగే తన ప్రేమకథను, పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో శుభశ్రీ మాట్లాడుతూ.. మాది లీగల్ ఫ్యామిలీ.. నాన్న జడ్జి. కాబట్టి నేను కూడా న్యాయవిద్య చదివాను. ముంబైలో లా చదువుతున్న సమయంలో మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాగా టైటిల్ గెలిచాను. ఐఏఎస్ కోచింగ్‌కు వెళ్దామనుకునే సమయంలో ఈ ట్రోఫీ రావడంతో మనసు మారింది. సినిమాలు ట్రై చేశాను. అలా బిగ్‌బాస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ షోకు వెళ్లాక నాకు చాలా ఫేమ్ వచ్చింది.సాంగ్ షూటింగ్లో పరిచయంఈ మధ్యే మేజస్టీ సాంగ్ చేశాను. ఆస్ట్రేలియాలో జరిగిన సాంగ్ షూటింగ్లో అజయ్‌ను తొలిసారి కలిశాను. సహనటుల్లాగే మాట్లాడుకునేవాళ్లం. వారం రోజులపాటు షూటింగ్ జరిగింది. చివరి రోజు షూటింగ్లో తను నాకు ప్రపోజ్ చేస్తుంటే నాకు తెలియకుండానే ఎంజాయ్ చేశాను. అలా 9 నెలల కిందట మా ప్రేమ మొదలైంది. మా ప్రేమకు ఇంట్లోవాళ్లు వెంటనే ఒప్పుకోలేదు. నెమ్మదిగా అంగీకరించారు. డబ్బు కోసమే పెళ్లి?మా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేశారు. అబ్బాయి నల్లగా ఉన్నాడు. అతడెలా నచ్చాడు? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నావా? అని వాగారు. అలా అనడానికి మీకెంత ధైర్యం? నేను ఎలాంటి పార్ట్నర్ను ఎంపిక చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అయినా ఈ జనరేషన్ యువత ఇలాంటి కామెంట్లు చేస్తుంటే నమ్మలేకపోయాను. నాకంటూ సొంతిల్లుంది, కారుంది, బాగానే డబ్బు సంపాదించాను. నాకెవరి డబ్బులు అక్కర్లేదు.పెళ్లే కాలేదు.. భరణం గురించి కామెంట్స్నేను పెళ్లి చేసుకునే అబ్బాయి నాకు గౌరవం ఇస్తాడా? ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడా? అని మాత్రమే చూస్తాను. ఈ లక్షణాలు లేకపోతే ఎంత డబ్బున్నా నేను పెళ్లి చేసుకోను. అజయ్ పరిచయమైనప్పటినుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ 9 నెలలకాలంలో నేను ఎక్కువగా ఏడ్చింది లేదు. నాకు మనిషి లుక్స్ గురించి అవసరం లేదు. మేమిద్దరం సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. మహా అయితే ఆరు నెలలు కలిసుంటారు.. భరణం ఎంత తీసుకుంటారు? ఇలాంటి కామెంట్లు చూసి తట్టుకోలేకపోయాను. ట్రోలింగ్ దెబ్బకు జ్వరంఈ ట్రోల్స్ చూసి ఏడ్చేశాను. ఇంకా పెళ్లే కాలేదు. భరణం దాకా వెళ్లిపోయారేంట్రా? అనుకున్నా.. ఆ కామెంట్ల దెబ్బతో నిశ్చితార్థం అయిన రెండురోజులకే నాకు జ్వరం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా తిడుతున్నారు? అని నాలో నేనే బాధపడ్డాను. అజయ్ ఇంట్లోవాళ్లు కూడా చాలా ఫీల్ అయ్యారు. దయచేసి నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని శుభశ్రీ కోరింది. ఈమె రుద్రవీణ, అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్ భావోద్వేగం -
బిగ్‌బాస్ 9లోకి కామన్ ఆడియన్స్ .. ఇలా రిజస్టర్ చేసుకోండి
బిగ్‌బాస్ 9 (Bigg Boss Season 9) నుంచి ఇప్పటికే ఒక వీడియోతో ప్రకటన వచ్చేసింది. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్‌గా మరోసారి అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ పేల్చేశారు. అయితే, తాజాగా 'కాల్ ఫర్ ఎంట్రీస్' పేరుతో మరో వీడియోను బిగ్‌బాస్ టీమ్ వదిలింది. గతంలో మాదిరి ఈసారి కామన్ ఆడియన్స్‌ను కంటెస్టెంట్స్‌గా తీసుకుంటామని వీడియోలో పేర్కొన్నారు.బిగ్‌బాస్ షోను ఎంతో ప్రేమిస్తున్న ప్రేక్షకులకు రిటర్న్ గిఫ్ట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుందని, అది కూడా కంటెస్టెంట్స్‌గా వచ్చే ఛాన్స్ ఉందని నాగార్జున తెలిపారు. ఈ సీజన్లో సెలబ్రిటీస్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా బిగ్‌బాస్- 9లోకి వెళ్లొచ్చు. అందుకు మీరు చేయాల్సింది www.bb9.jiostar.comలో రిజస్టర్ కావడమే. ఆపై బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ కావడానికి కారణం చెబుతూ వీడియోను అప్లోడ్ చేయడమే అంటూ వివరాలు ప్రకటించారు. -
'కాంటా లగా' సాంగ్‌తో సెన్సేషన్.. నటి కన్నుమూత
బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షెఫాలీ జరివాలా (42) ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను అంధేరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే నటి మృతి చెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టమ్ కోసం ఆమె మృతదేహాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నటి మృతికి ఇంకా కారణాలు తెలియలేదన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె నివాసంలో పలు ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. షెఫాలి (Shefali Jariwala) మృతి పట్ల సెలబ్రిటీలు, అభిమానులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.నటి ప్రయాణం సాగిందిలా..షెఫాలీ జరివాలా 2002లో వచ్చిన కాంటా లగా సాంగ్‌తో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి అభిమానులు ఆమెను కాంటా లగా గర్ల్ అనే పిలుచుకుంటున్నారు. ఈ గుర్తింపుతోనే ముజ్సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి నటించే ఛాన్స్ వచ్చింది. అలాగే కన్నడలో హుడుగరు మూవీలో యాక్ట్ చేశారు. బేబీ కమ్నా అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించారు. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లోనూ పాల్గొన్నారు. షెఫాలి.. 2004లో సంగీత దర్శకుడు హర్మీత్ సింగ్‌ను పెళ్లాడారు. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. 2009లో విడిపోయారు. అనంతరం 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో పెళ్లి చేసుకున్నారు.చదవండి: ఆస్కార్ కమిటీలో ఇండియన్ స్టార్స్ -
బిగ్ బాస్ 9 ప్రోమో రిలీజ్
-
బిగ్‌బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
బిగ్‌బాస్ 9 (Bigg Boss Season 9).. ఆగమనానికి సర్వం సిద్ధమవుతోంది. తాజాగా బిగ్‌బాస్ 9 లోగోనూ లాంచ్ చేస్తూ ప్రోమో రిలీజైంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నాడు కింగ్ నాగార్జున. ఈసారి కూడా హోస్ట్ నాగార్జునే అన్న విషయం ప్రోమోతో స్పష్టమైపోయింది.బజ్ హోస్ట్‌గా..కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్నవారిలో చాలామంది ఈ షోలో భాగం కానున్నారు. అలాగే ఈ వారం మొదలవుతున్న కూకు విత్ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయనున్నారు. అటు బిగ్‌బాస్ బజ్ హోస్ట్‌గా ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటివారంలో బిగ్‌బాస్ 9 షురూ కానుంది. చదవండి: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ -
'అశ్వత్థామ'గా గౌతమ్.. ఇదేందయ్యా ఇది.. ఇంకా మర్చిపోలే?
ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలంటారు. గౌతమ్ కృష్ణ (Gautham Krishna) అదే చేశాడు. బిగ్‌బాస్ షో వల్ల అవమానాలు పడ్డాడు, ఆదరణ పొందాడు. అదెలాగంటే.. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఇతడు శివాజీకి కరెక్ట్ మొగుడిలా తయారయ్యాడు. నేను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లు అన్నట్లు శివాజీ డిక్టేటర్‌గా వ్యవహరిస్తుంటే అది తప్పని ఎదిరించి నిలబడ్డాడు గౌతమ్ కృష్ణ. శివాజీని ప్రశ్నించేందుకు హౌస్మేట్స్ వెనకడుగు వేస్తుంటే గౌతమ్ మాత్రం అతడి పెద్దరికాన్ని గౌరవిస్తూనే మాటలు, చేతలతోనే ధీటుగా సమాధానం చెప్పేవాడు. అశ్వత్థామ అంటూ నవ్వులపాలు!కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడిని వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి పంపించినప్పుడు అశ్వత్థామ 2.0 అంటూ వేసిన డైలాగ్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆ డైలాగ్‌కు ఓవర్ కాన్ఫిడెన్స్ తోడవడంతో గౌతమ్‌పై ట్రోలింగ్ జరిగింది. చివరకు ఫినాలేకు అడుగు దూరంలో ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.అశ్వత్థామకు చావు లేదుబిగ్బాస్ 8వ సీజన్లో మరోసారి వైల్డ్‌కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే మాటలు పడ్డాడో అక్కడే తన మాటతో, ఆటతో ప్రశంసలు దక్కించుకున్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. మరోసారి చెప్తున్నా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. ఈ అశ్వత్థామకు చావు లేదు అంటూ షోలో డైలాగ్స్ వేశాడు. ఇప్పుడదే డైలాగ్‌ను తన పేరు ముందు చేర్చేసుకున్నాడు.పేరు ముందు అదే ట్యాగ్గౌతమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). బుధవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో గౌతమ్ తన పేరు ముందు అశ్వత్థామ అన్న ట్యాగ్ యాడ్ చేసుకున్నాడు. విమర్శలు, ప్రశంసలు అందించిన అశ్వత్థామ ట్యాగ్‌ను గౌతమ్ వాడుకోవడం చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే ఈ ట్యాగ్లు అవసరమా? అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. అయితే సినిమా కోసం నలుగురు మాట్లాడాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయడం మంచిదే, అందులోనూ అతడు పడి నిలబడ్డాడు అని మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు . చదవండి: రజనీకాంత్ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్ హీరోయిన్ సదా కాదు -
నిర్మాతతో బిగ్‌బాస్ శుభశ్రీ ఏడడుగులు.. హల్దీ వేడుక చూశారా? (ఫొటోలు)
-
'క్షీణించిన బిగ్‌బాస్ విన్నర్ ఆరోగ్యం.. అలా జరగకూడదని కోరుకుంటున్నా'
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ విన్నర్ సనా మక్బుల్ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. లివర్ సైరోసిస్ అనే వ్యాధితో సనా పోరాడుతోంది. ఇటీవల సనా హాస్పిటల్ బెడ్‌పై ఫోటోను పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సనా ఐదేళ్లుగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్‌తో బాధపడుతోంది. గతంలోనే చికిత్స తీసుకున్నప్పటికీ ఏమాత్రం మెరుగవ్వలేదని తెలుస్తోంది.తన ఆరోగ్యంపై సనా మాట్లాడుతూ.. 'నేను కొంతకాలంగా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్‌తో బాధపడుతున్నా. కానీ ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. నా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా లేదు. నా కాలేయంపై దాడి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం నాకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ నేను బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఇమ్యునోథెరపీని ప్రారంభించానని.. ప్రస్తుతం కోలుకోవడంపై దృష్టి సారించానని' ఆమె తెలిపింది.అయితే వైద్యులు కాలేయ మార్పిడి అవసరం రాకుండా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సనా తెలిపింది కొన్ని రోజులు కష్టమైన సరే కోలుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఇది అంత సులభం కాదని.. కానీ నేను అంత తేలికగా వదిలిపెట్టనని సనా మక్బుల్ అన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా నడుస్తున్నానని తెలిపింది. ఈ పరిస్థితి తనను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేసిందని చెప్పింది.కాగా.. సనా మక్బుల్ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-3 విన్నర్‌గా నిలిచింది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్యా, మామ ఓ చందమాల చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. -
బిగ్‌బాస్ 9: అప్పుడే ప్రారంభం కానుందా?
ఒకప్పుడు బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్‌లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.ఆ నెలలో షురూ..ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్‌బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్‌బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది. సంప్రదింపులు- చర్చ దశల్లోనే..కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్‌బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్‌బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు. పార్టిసిపెంట్లు వీళ్లేనా?అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్‌గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ప్రియుడితో 'చిన్నారి పెళ్లికూతురి' ఎంగేజ్మెంట్ -
మొన్నటివరకు అలా.. ఇప్పుడేమో అరియానా ఇలా (ఫొటోలు)
-
నీ తల్లిని కావడం వరం రా కన్నయ్యా! బిగ్‌బాస్ ఫేమ్ నటి ప్రియ ఇన్‌స్టా పోస్ట్ (ఫొటోలు)
-
బిగ్‌బాస్ గౌతమ్ 'సోలో బాయ్' ఎప్పుడు వస్తున్నాడంటే..?
తెలుగు బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో 'ఆకాశ వీధుల్లో' చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి! -
'మై లవ్' ఆల్బమ్ సాంగ్ లాంచ్‌లో 'బిగ్‌బాస్' స్టార్స్ (ఫొటోలు)
-
ప్రియుడితో 'మనోభావాలు పాప' ఎంగేజ్మెంట్..
తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు (Subhashree Rayaguru) త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది.ఆన్‌స్క్రీన్ కపుల్.. రియల్ లైఫ్‌లోనూ..ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది. ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తళుక్కుమని మెరిసింది. ఈ పాటలో ప్రియుడు అజయ్‌తో కలిసి నటించింది. అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం. వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు, బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru)చదవండి: అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ -
సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్బాస్బ్యూటీ శుభశ్రీ (ఫోటోలు)
-
బిగ్ బాస్‌లోకి యూట్యూబర్లు,ఇన్‌ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...
ఎక్కడో ఇంగ్లండ్‌లో పుట్టి ఓ హీరోయిన్ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్ మూలాలు కలిగిన బిగ్‌బాస్(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ బిగ్ బాస్.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన, మై విలేజ్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్‌స్టా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఇన్‌స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్‌తో ఇన్ఫ్లుయెన్సర్గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్ యూ ట్యూబ్ చానెల్ ద్వారా ప్రసిద్ధి పొందిన కిర్రాక్ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్జె కాజల్, ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్ స్టేటస్‌కు బిగ్ బాస్ ద్వారా మరింత గ్లామర్‌ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.ఈ నేపధ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అవుతోందనగానే సోషల్ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్ బాస్ హౌస్‌లోకి సోషల్ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు, తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్ బాస్‌కు సంబంధించినవి కాకపోయినా... ప్రాంతీయ బిగ్‌బాస్‌లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్ బాస్ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.హిందీలో బాలీవుడ్ దిగ్గజం సల్మాన్‌ఖాన్ సమర్పిస్తున్న బిగ్ బాస్ 19 గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్ కోసం మేకర్స్ గణనీయమైన ఫార్మాట్ మార్పును ప్లాన్ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన, స్థిరపడిన బాలీవుడ్ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.టెల్లీ రిపోర్టర్ నివేదిక ప్రకారం, బిగ్ బాస్ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్ అప్పీల్ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్‌కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్ బాస్ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్‌ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్ మీడియా సెలబ్రిటీల వల్ల వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్ బిగ్‌బాస్ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్ బాస్ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్‌కు కాకపోయినా వచ్చే సీజన్‌పై సోషల్ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు. -
పెళ్లి తర్వాత ఈరోజు ఎంతో ప్రత్యేకం అంటూ ఫోటోలు షేర్ చేసిన సోనియా (ఫొటోలు)
-
నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్ ఈజీనా? మీకేం తెలుసు?: నటి కన్నీళ్లు
కొన్ని సంతోషాలను కోట్లు పెట్టినా సొంతం చేసుకోలేము. ఆ సంతోషాన్ని ఆస్వాదించడం కోసం కోట్లు వదిలేసుకున్నా బాధ ఉండదు. మహిళకు అత్యంత ఆనందాన్నిచ్చేది అమ్మతనం. 'అమ్మ'యినందుకే ఇలియానా సూపర్ హిట్ మూవీ రైడ్‌కు సీక్వెల్లో చేయమని ఆఫర్ వచ్చినా వదిలేసుకుంది. కళ్లు చెదిరే పారితోషికం ఇస్తామన్నా.. ప్రస్తుతం తన కొడుకును చూసుకోవడమే ముఖ్యం అని కరాఖండిగా చెప్పేసింది.మిస్క్యారేజ్అయితే కొందరికి అమ్మతనం అంత ఈజీగా దొరకదు. చాలామందికి మొదటి కాన్పు ఆగదు. గర్భస్రావం అవుతూ ఉంటుంది. బాలీవుడ్ నటి, మోడల్, హిందీ బిగ్‌బాస్ 7 విన్నర్ గౌహర్ ఖాన్ (Gauahar Khan) జీవితంలోనూ అదే జరిగింది. తొలిసారి తన మిస్క్యారేజ్ అనుభవాలను యూట్యూబ్ వేదికగా వెల్లడించింది. గౌహర్.. మానొరంజన్ అనే పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది. ఇందులో మాతృత్వం గురించి, పిల్లల పెంపకం గురించే మాట్లాడనుంది. మొదటగా ఈ పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను వెల్లడించింది.9 వారాలకే కుప్పకూలిన ఆశలుఇంతవరకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పనేలేదు. ఈసారి దాన్ని బయటపెడుతున్నా.. జెహాన్ పుట్టడానికంటే ముందు నాకు గర్భస్రావం అయింది. ఆ బాధను మాటల్లో చెప్పలేను. దాదాపు 9 వారాలపాటు కడుపులో మోశాక బిడ్డను కోల్పోయాను. నా సంతోషం ఆవిరైపోయింది. దీని గురించి తర్వాతి ఎపిసోడ్స్‌లో మాట్లాడతాను. జెహాన్ పుట్టినప్పటి నుంచి అది సాధారణ డెలివరీనా? సీ సెక్షనా? అని అడుగుతూనే ఉన్నారు. నాకు సీ సెక్షన్ చేశారు. అయినా రెండూ కష్టమే.. మీకేం తెలుసు?: నటి కన్నీళ్లుఈ మధ్య ఓ సెలబ్రిటీ (సునీల్ శెట్టి) సాధారణ ప్రసవం కన్నా ఆపరేషన్ ఈజీ అన్నారు. ఆ మాట వినగానే గట్టిగా అరవాలనిపించింది. అలా ఎలా అనగలిగారు? అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ ఉండదు, నవమాసాలు మోయరు, సీ సెక్షన్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అసలే అర్థం కాదు. మీకసలు ఏదీ తెలీదు అని కన్నీళ్లు పెట్టుకుంది. నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty).. తన కూతురు అతియా కంఫర్టబుల్‌గా ఉంటుందని సీ సెక్షన్‌కు వెళ్లకుండా కష్టమైనా నేచురల్ డెలివరీనే ఎంచుకుందని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని క్షమాపణ చెప్పాడు.ఎవరీ గౌహర్ ఖాన్?గౌహర్ ఖాన్ విషయానికి వస్తే.. ఈమె శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో నా పేరే కాంచనమాల అనే ఐటం సాంగ్‌తో అలరించింది. రాకెట్ సింగ్, ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా, ఫీవర్, తేరే ఇంతేజార్ వంటి పలు చిత్రాలు చేసింది. తాండవ్, సాల్ట్ సిటీ, బెస్ట్ సెల్లర్ వంటి వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను 2020లో పెళ్లి చేసుకోగా 2023లో కుమారుడు జెహాన్ పుట్టాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది.చదవండి: ఆర్మీలో రెండేళ్ల ట్రైనింగ్.. ఆ మాటలతో మధ్యలోనే ఆగిపోయా!: -
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేం
మలయాళ టీవీ నటి, యాంకర్ బిగ్‌బాస్ ఫేం ఆర్య బాబు (ఆర్య బదై) తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్ డిజైనర్ సిబిన్ బెంజమిన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఇద్దరూ ఇన్స్ట పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. 'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్' అంటూ ఆర్య తన ఎంగేజ్మెంట్ వార్తను అభిమానులతో షేర్చేసింది. మలయాళం బిగ్ బాస్ 2 లో ఆర్య, సిబిన్ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!‘‘సిబిన్ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది. ఇది అస్సలు ప్లాన్ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా, నా కూతురు ఖుషీకి ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం నీచేతుల్లో..’’ అని పోస్ట్ పెట్టింది ఆర్య.ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!అటు సిబిన్ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఫోటోను షేర్ చేశాడు. ఆర్యను ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ... నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాగా కాంచీవరం.ఇన్‌కు ఫౌండర్ సీఈవోగా ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో ఆర్య, రోహిత్ విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్‌తో ప్రేమలో పడింది. వీరు చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సిబిన్‌కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు. -
'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్
బిగ్ బాస్.. ఓ రియాలిటీ షో మాత్రమే. గత కొన్ని సీజన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏడో సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ అని చెప్పుకొనే పల్లవి ప్రశాంత్ వల్ల షోకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దీనంతటికీ కూడా సదరు కంటెస్టెంట్స్ కి ఉండే బలుపే కారణం. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. స్వయనా సొహెల్ చెప్పాడు. ఈ షో వల్ల తనకు ఎంత మైనస్ అయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'బిగ్ బాస్ తర్వాత నాకు చాలా మైనస్ అయింది. ప్లస్ కూడా అయింది. ముఖ్యంగా మైనస్ గురించి చెప్పుకొంటే.. ఆ టైంలో నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అస్సలు కంట్రోల్ లో లేను. కొన్ని మాటలు నోరు జారాను. నా ఫ్రెండ్సే.. నన్ను అలా మాట్లాడేలా చేశారు. ఏందన్నా నువ్వు కానియ్ అనేవారు. అప్పట్లో నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చింది మాట్లాడేవాడిని. కప్పుది ఏముంది చేయించుకుందాం లాంటి అతి మాటలు మాట్లాడేవాడిని. దీనంతటికీ పక్క వాళ్ల ప్రభావమే కారణం''జీరోగా బిగ్ బాస్ షోకి వెళ్లాను. బయటకు వచ్చిన తర్వాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. కానీ నేను కావాలని నోరు జారలేదు. 'లక్కీ లక్ష్మణ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. 'నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా' అని వార్నింగ్స్ ఇవ్వడం చేశా. ఇప్పుడు ఆ బలుపు మొత్తం తగ్గిపోయింది. సమయం రావాలంతే. అదే మొత్తం సెట్ చేస్తుంది. నాకు ఇప్పుడు టైమ్ వచ్చింది'(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ)) 'చాలామంది బిగ్ బాస్ షోని తిట్టుకుంటారు కానీ.. అది నాకు చాలా నేర్పించింది. అక్కడ రియల్ గానే ఉన్నాను. బిగ్ బాస్ సీజన్ 4 బెస్ట్ అంటారు. గెలవాలనే తపన అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మా సీజన్ మాత్రం విలువలతో కూడిన సీజన్' అని సొహెల్ చెప్పుకొచ్చాడు.సొహెల్ మాటల బట్టి చూస్తే అతడు చెప్పింది అక్షరాలా నిజమేననిపిస్తుంది. ఎందుకంటే తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు గెలిచిన ఎవరూ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. పైపెచ్చు పూర్తిగా కనుమరుగైపోయారు కూడా. ఇకపై వచ్చే సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్స్ సొహెల్ మాటలు ఓసారి వింటే బెటర్ ఏమో?(ఇదీ చదవండి: 'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?) -
బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్‌కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్‌ను లివర్‌లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్‌లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్‌లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్‌కు దూరంగా కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్‌కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్‌గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్‌ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
పెళ్లి రోజు గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. బిందు మాధవి నేచురల్ లుక్!
గ్రీన్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ హోయలు..పెళ్లి రోజును గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ..ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో చాహల్ ప్రియురాలు ఆర్జే మహ్వశ్ సందడి..హీరోయిన్ బిందు మాధవి లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by प्रेrana kambam (@prerana.kambam) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
నా కష్టానికి ప్రతిరూపం ఈ కారు.. బిగ్‌బాస్ బ్యూటీ కల సాకారం..
నటి, సింగర్ షెహనాజ్ గిల్ (Shehnaaz Kaur Gill) హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌తో ఎక్కువ పాపులరైంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన షెహనాజ్ తాజాగా కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కలలు కనడం దగ్గరి నుంచి కారు నడిపేవరకు.. నా కష్టానికి ప్రతిఫలంగా ఈ నాలుగు చక్రాల కారు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది అని ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ధర ఎంతంటే?షెహనాజ్.. మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు రూ.1.35 కోట్లుగా ఉంది. మ్యూజిక్ వీడియోలో, సాంగ్స్‌లో ఎక్కువగా కనిపించే షెహనాజ్ పంజాబ్‌లో పలు సినిమాలు చేసింది. 2019లో హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొంది. ఈ సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2023లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో యాక్ట్ చేసింది. థాంక్యూ ఫర్ కమింగ్ మూవీలోనూ నటించింది. విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో సజ్నా వె సజ్నా అనే స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం హిందీలో సబ్ ఫస్ట్ క్లాస్, పంజాబీలో ఇక్క్ కుడి చిత్రాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) చదవండి: ముమైత్ బ్రెయిన్లో ఏడు వైర్లు.. షూ లేస్ కట్టుకున్నా ప్రమాదమే! -
అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవాళ్లందరినీ ఉగ్రవాదుల ఖాతాలో వేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేషణ. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న సోహైల్ (Syed Sohel Ryan), మెహబూబ్.. ఇలా ఎంతోమందిని ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. ఈ కామెంట్లపై నటుడు, తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని దొరకబట్టడం మానేసి మనదాంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. నేను భారతీయుడినిఎక్కడో జరిగినదానికి నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను టెర్రరిస్టు అయిపోను. నేను భారతీయుడిని. కులమత బేధాలు లేకుండా పెరిగాను. శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులు నాతోపాటు నమాజ్ చదివేవాళ్లు. క్రిస్టియన్ ఫ్రెండ్‌తో కలిసి చర్చికి వెళ్లేవాళ్లం. వాడి ప్లాన్ సక్సెస్.. నువ్వు ఫెయిల్మా ఇరుగుపొరుగువారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలు చాలామంది ఉన్నారు. అందులో నేనొకడిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ సక్సెస్ అయినట్లే.. భారతీయుడిగా నువ్వు ఫెయిల్ అయినట్లే!అడుక్కున్నా..మొన్న ఒక మహిళ.. భర్తను ముక్కలుముక్కలుగా నరికేసి డ్రమ్‌లో వేసింది. ఆ క్రూరత్వాన్ని టెర్రరిజం అనాలి. నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఇస్లాంలో రాసుంది. ఆ ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదు. నా తల్లిని పోగొట్టుకుని ఐదారునెలలవుతోంది. ఇంతలో నాపై ఇలాంటి కామెంట్లు వినేసరికి చాలా బాధపడ్డాను. నాపై చేసిన వీడియో డిలీట్ చేయమని ఆ యూట్యూబర్ (నా అన్వేషణ)ను అడుక్కున్నాను. 'మా అమ్మ గతేడాది చివర్లో చనిపోయారు. మా అమ్మపై బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. మీ తల్లిలాంటిదే నా తల్లి కూడా!మీ వ్యూస్ కోసం నన్ను తిట్టుకోండినేను కూడా నిన్ను తిరిగి బూతులు అనొచ్చు. కానీ, అనను. మీ తల్లిదండ్రులను బాగా చూసుకో' అంటూ వీడియో డిలీట్ చేయమని మెసేజ్ చేశాను. కావాలంటే నన్ను తిట్టుకో, వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి. కానీ తల్లుల్ని తిట్టొద్దు. వాళ్లేం పాపం చేశారు. అందరికీ ఒకటే చెప్తున్నా.. మీ మతాన్ని ప్రేమించండి. మిగతా మతాల్ని గౌరవించండి అని సోహైల్ చెప్పుకొచ్చాడు.చదవండి: ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని -
'అలా చేయకపోతే అస్సలు జీవితమే కాదు'.. గొప్ప మనసు చాటుకున్న బిగ్‌బాస్ బ్యూటీ!
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్‌లు కొట్టేశారు. అలాంటి వారిలో అశ్విని శ్రీ కూడా ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయింది.అయితే ఇటీవల తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది అశ్విని శ్రీ. ఈ సందర్భంగా తనలో అందమే కాదు.. మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది ముద్దుగుమ్మ. తన పుట్టిన రోజు వేడుకను ఓ అనాథాశ్రమంలో జరుపుకుంది. అక్కడే ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని బిగ్‌బాస్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బిగ్‌బాస్ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే!
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)ను తెలుగులో మొదలుపెట్టింది జూనియర్ ఎన్టీఆర్. తొలి సీజన్‌కు తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరించి షోను సక్సెస్ చేశాడు. కానీ తర్వాత మాత్రం ఆ షో నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో హీరో నాని (Nani) ధైర్యం చేసి యాంకర్‌గా మారాడు. ఇది రియాలిటీ షో అన్న విషయం మర్చిపోయి గేమ్ షోనే కదా.. హోస్ట్ చేసేద్దాం అనుకున్నాడు. తన యాంకరింగ్ కూడా బాగానే ఉండేది.రెండో సీజన్ హోస్ట్ నానికానీ కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం నానిపై విమర్శలు చేసేవారు. తన జడ్జిమెంట్‌లో ఏమాత్రం తేడా వచ్చినా ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఇదంతా చూసి నానికి దిమ్మతిరిగిపోయింది. ఏదో హోస్ట్‌గా వచ్చిన పాపానికి చెడుగుడు ఆడేసుకుంటున్నారని అప్సెట్ అయ్యాడు. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజనే.. తన ఆఖరి సీజన్ అని ప్రకటించాడు. ఇంకెప్పుడూ ఈ రియాలిటీ షో జోలికి వెళ్లనన్నాడు.అదే ఆఖరి రోజుప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 మే 1న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ షో గురించి స్పందించాడు. నాని మాట్లాడుతూ.. నా జీవితంలో బిగ్‌బాస్ చాప్టర్ ముగిసిపోయింది. మళ్లీ దాని జోలికి వెళ్లే ప్రసక్తే లేదు. రెండో సీజన్ చివరి ఎపిసోడ్ రోజే బిగ్‌బాస్ హోస్ట్‌గా నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అని పోస్ట్ పెట్టాను. బయటి ప్రపంచం తెలిసిందిబిగ్బాస్.. బయటి ప్రపంచం ఎలా ఉంటుందనేది నాకు కళ్లకు కట్టినట్లు చూపించింది. నన్ను మరింత టఫ్‌గా మార్చింది. ఒక గేమ్ షో అనుకుని వెళ్లాను. ఆ గేమ్ వెనకాల ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా? అనిపించింది. అయితే చాలామంది అభిప్రాయాలు షో అయిపోగానే మారిపోతాయ్.. అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బిగ్‌బాస్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడటం లేదని నాని చెప్పకనే చెప్పాడు.చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి -
#PavaniReddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావని రెడ్డి... ఫోటోలు వైరల్
-
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.తాజాగా ఇటీవల విశాఖలో జరిగిన దారుణంపై ఆదిరెడ్డి స్పందించారు. ప్రేమ పెళ్లి చేసుకుని నిండు గర్భిణీని హత్య చేసిన ఘటనపై ఆదిరెడ్డి ఎమోషనలయ్యారు. రెండు ప్రాణాలను ఎలా చంపేశావ్ రా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మరికొన్ని గంటల్లో డెలివరీ కాబోతున్న భార్యను గొంతు నులిమి చంపే కోపం ఎందుకు వస్తుందని అని నిలదీశారు. నిన్ను నమ్మి తన కుటుంబాన్ని వదిలేసి వస్తే ఇంత దారుణానికి ఒడిగట్టావంటే నువ్వెంత కసాయి నాకొడుకు అయి ఉండాలి ఆదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.అమ్మాయిలు ప్రేమించేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించండి.. ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకంటే అబ్బాయిలు నటించడం వారితి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఆరెంజ్డ్ మ్యారేజ్ చేసే తల్లిదండ్రులు సైతం పొరపాట్లు చేస్తున్నారు. అబ్బాయి కాస్తా ఎర్రగా ఉండి, డబ్బులు, ఆస్తి ఉంటే చాలని పెళ్లిళ్లు చేసేస్తున్నారు. వాడి గుణమేంటో ఎవరూ చూడట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోబోయే వాడి సిబిల్ స్కోర్, వాడు మంచోడా కాదా? వాడి మిత్రులు, బంధువులను అడిగి తెలుసుకోవాలి.. అలా చేయకపోతే తర్వాత అమ్మాయి జీవితాన్ని మనమే నాశనం చేసినవాళ్లమవుతాం అన్నారు. సమాజంలో ఉన్న ఇలాంటి సైకో గాళ్లను కచ్చితంగా ఉరి తీయాలని ఆదిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) -
ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్
బిగ్‌బాస్ కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గీతూ రాయల్ (Geetu Royal) చెప్పినట్లు జనాలకు సింపతీ ఎక్కువే! ఎవరైనా బాధపడుతుంటే అస్సలు చూడలేరు. అన్నా, నేను రైతుబిడ్డనన్నా అని అమాయకంగా ముఖం పెట్టి ఓట్లు అడుక్కున్న పల్లవి ప్రశాంత్‌ను గెలిపించారు. అందరూ తనను ఒంటరి చేసి టార్గెట్ చేస్తున్నారన్న కౌశల్‌కూ విజయాన్ని అందించారు. బాలాదిత్య కన్నీళ్లతో సిగరెట్ల కోసం అర్థించినా వాటిని ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టిందని గీతూ రాయల్‌ను బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ చేశారు.ఏడ్చేసిన గీతూ..ఎలాగో ట్రోఫీ మనదే అని డిసైడ్ అయిన గీతూ రాయల్‌కు ఎలిమినేషన్ పెద్ద షాకే ఇచ్చింది. బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss 6 Telugu) అయిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది గీతూ రాయల్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అందులో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్ బజ్ చేసేటప్పుడు మా ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. చనిపోదామనుకున్నాతల గోడకేసి కొట్టుకోవాలనిపించింది. ఎందుకీ లైఫ్.. చనిపోదాం అనుకున్న సమయంలో కూడా టీవీ షోలో పాల్గొని నాపై జోకులేస్తే నవ్వుకున్నాను. ఎందుకంటే నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను చనిపోతుంటే కూడా కచ్చితంగా ఓ వీడియో తీసే పోతాను (కన్నీళ్లు పెట్టుకుంటూ). నేను గట్టిగా మాట్లాడతాను కానీ నేను చాలా వీక్, చాలా ఎమోషనల్. బిగ్‌బాస్ షోకి వెళ్లినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే నేనే విన్నర్ అనుకున్నాను. కట్ చేస్తే ఆరు వారాలకే ఎలిమినేట్ అయ్యాను. అందుకే వెళ్లలేదుబయట జనాల్ని చూశాక నేను విన్నర్ అవను అని అర్థమైంది. అందుకే రీఎంట్రీ ఆఫర్ చేసినా వెళ్లలేదు. పైగా అప్పటికే డిప్రెషన్లో ఉన్నాను. మనిషి ఆరోగ్యానికి హానికరమైన సిగరెట్లు దాచినందుకు నేను షో నుంచి బయటకు వచ్చేశాను అని తెలిసి నా బుర్ర పాడైపోయింది. ఒక డెలివరీ బాయ్ నా షూస్ దొంగతనం చేశాడని వీడియో చేస్తే కూడా నన్నే తిట్టారు. జనాలు నన్ను నెగెటివ్‌గానే చూస్తున్నారు.నాకు, నా భర్తకు గొడవఎక్కువగా షోలలో ఎందుకు కనిపించడం లేదంటే.. ఒకానొక సమయంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బిచ్చేవారు. కానీ, ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. అందుకే వాటిని ఒప్పుకోవడం లేదు. ఇకపోతే నా భర్త వికాస్, నేను కలిసే ఉన్నాం. కాకపోతే ఇస్మార్ట్ జోడీ సమయంలో నాకు, నా భర్తకు గొడవ జరిగింది. గొడవయినప్పుడు తనతో మాట్లాడను. అలాంటిది ఆ షోకు వెళ్లి అంతా బాగున్నట్లు ఎలా నటించగలం? అందుకే ఆ షో రిజెక్ట్ చేశాను. మా మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్లీ కలిసిపోతాం అని గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.చదవండి: సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం -
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
చిన్నవయసులోనే ఎన్నో కష్టాలు చూసింది కీర్తి భట్ (Keerthi Bhat). అయినవారిని పోగొట్టుకుంది, ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. పెంచుకున్న పాప దూరమై తల్లడిల్లింది. ఇలా నిత్యం కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. నటుడు విజయ్ కార్తీక్‌ను పెళ్లాడబోతున్న ఆమె అతడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. విజయ్ కంటే ముందు కీర్తి ఓ వ్యక్తిని ప్రేమించగా.. అతడి చేతిలో దారుణంగా మోసపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి.. మాజీ ప్రియుడి అరాచకాల్ని బయటపెట్టింది.నా వెంటపడ్డాడునాపాటికి నేను పని చేసుకుంటూ పోతున్న సమయంలో ఓ వ్యక్తి నా వెనకాల పడ్డాడు. ఒకే సెట్లో ఉండేసరికి అతడి లవ్ ప్రపోజల్‌కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. వెళ్తే.. నాకు, అతడికి ఏదో ఎఫైర్ ఉందని అనుమానించేవాడు.బిగ్‌బాస్‌కు వెళ్లేముందే..ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరితో కలిసి ఉండాలి. హీరో, హీరోయిన్ అన్నాక షోకు వెళ్లాలి, కలిసి డ్యాన్స్ చేయాలి, రీల్స్ చేయాలి. కానీ, నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా అతడు, అతడి తల్లి డౌట్ పడేవారు. ఇదేంటి? ఇలా నరకంలో పడిపోయాను అనిపించింది. నేను దాచుకున్న డబ్బు అంతా వాళ్లకే ఖర్చు పెట్టాను. దానికి ప్రతిఫలంగా వాళ్లు సైకోలా ప్రవర్తించేవారు. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నేను దత్తత తీసుకున్న పాప చనిపోయింది. నా లవ్ బ్రేకప్ అయింది. అయితే పాప నా కూతురే కావొచ్చన్న అనుమానంతో డీఎన్ఏ టెస్ట్ చేయించాలనుకున్నారు. అక్కడే ఆగిపోయాడువాళ్లు డీఎన్ఏ టెస్ట్ అడిగినందుకు నేను భయంతో పాప చనిపోయిందని చెప్పానని నోటికొచ్చింది వాగుతున్నారు. అది విని నాకెంత బాధేసిందో! ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నేను ఒక రేంజ్‌కు వచ్చాను అని కీర్తి భట్ భావోద్వేగానికి లోనైంది. ఇకపోతే కీర్తి భట్ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చేశారు.చదవండి: నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో -
గాయపడ్డ 'బిగ్ బాస్' ఆదర్శ్.. కాలికి సర్జరీ
తెలుగులో పలు సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ. అలానే బిగ్ బాస్ తొలి సీజన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. చాన్నాళ్లు తెరపై కనిపించిన ఇతడు.. తాజాగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని చెబుతూ తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు)ఆదర్శ్ పోస్ట్ చేసిన వీడియో బట్టి చూస్తే.. మోకాలి మజ్జ దగ్గర గాయమైంది. దీంతో సర్జరీ చేశారు. తర్వాత ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ లాంటివి కూడా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి, త్వరలో కమ్ బ్యాక్ ఇస్తానని రాసుకొచ్చాడు.2005 నుంచి ఆదర్శ్.. ఇండస్ట్రీలో ఉన్నాడు. హ్యాపీడేస్, గోవిందుడు అందరివాడేలే, సరైనోడు, గరుడ వేగ, కలర్ ఫోటో, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటించాడు. మరి ఈ మధ్య ఏమైందో ఏమో తెలీదు గానీ కాలికి సర్జరీ చేయించుకున్నాడు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. శ్రీలీలని పట్టి లాగేశారు) View this post on Instagram A post shared by aadarsh balakrishna (@aadarshbalakrishna) -
బిగ్ బాస్ దివి.. మరీ ఇంత అందంగా ఉంటే ఎలా?
-
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఈ బ్యూటీ..
నువ్వు మాస్ అయితే నేను ఊర మాస్ అంటోంది ఓవియా (Oviya). ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీ ఇటీవల బీచ్‌కు వెళ్లింది. అక్కడ తన స్నేహితులు చేపలకు వల వేస్తున్నారని చూపించింది. అలాగే తను సిగరెట్ తాగుతూ ఆ వీడియోను కూడా షేర్ చేసింది. ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వీడియోను తర్వాత తొలగించినట్లు తెలుస్తోంది.ఎవరీ ఒవియా?కేరళలోని తిరుచూర్ ఓవియా సొంత గ్రామం. బీఏ పూర్తి చేసిన ఆమె 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో తెలుగువారిని పలకరించింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి.తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆరవ్తో ప్రేమాయణం జరిపిన ఆమె తర్వాత అతడికి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా స్పందించింది. ఈ కాంచన 3 బ్యూటీ ప్రస్తుతం సంభవం సినిమా చేస్తోంది.చదవండి: బాలీవుడ్ హీరోయిన్ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. నాకు వచ్చిన ఆఫర్స్ మరెవరికీ రావు: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.అయితే ఇటీవల టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్‌కు సూచించారు.అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్ మన ఇండియాలో లీగల్‌గానే చేశారని తెలిపారు. ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్‌ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు. 2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్‌లలో కేవలం ఉచిత లీగ్‌లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు. -
బుల్లితెర సెలబ్రిటీల ఉగాది... సోనియా అలా.. శోభా శెట్టి ఇలా..!
పండగ వచ్చిందంటే ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. పిండివంటలు, కొత్త బట్టలు.. ఇలా ఆరోజంతా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఉగాది అనగానే సాంప్రదాయ దుస్తులే ధరిస్తుంటారు. బుల్లితెర సెలబ్రిటీలు కూడా అంతే! వారు ట్రెడిషనల్ ముస్తాబైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సోనియా ఆకుల, శోభా శెట్టి, ప్రియాంక జైన్, యష్మి గౌడ సహా పలువురు బిగ్‌బాస్ తారలు ఎలా రెడీ అయ్యారో కింద మీరూ చూసేయండి.. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shobha Shetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Nainika Anasuru🦋 (@_.nainikadances) View this post on Instagram A post shared by Y A S H M I G O W D A (@yashmigowda) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి పూజ చేసిన శోభా శెట్టి.. ఎందుకంటే?
శోభా శెట్టి (Shobha Shetty).. కొంతకాలం క్రితం వరకు ఈమెను కార్తీకదీపం మోనితగానే గుర్తుపెట్టుకున్నారు జనాలు. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌తో శోభా శెట్టిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షోలో తను లవ్‌లో ఉన్నట్లు తెలిపింది. యశ్వంత్ రెడ్డి (Yashwanth)తో ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. గతేడాది జనవరిలో తాంబూలాలు మార్చుకోగా మే నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. 11 నెలలు కావొస్తున్నా ఇంకా పెళ్లెప్పుడనేది చెప్పడం లేదు శోభ.తాజాగా శోభ.. ప్రియుడితో కలిసి పూజ చేసింది. దాదాపు 16 కలశాలు పెట్టి మధ్యలో శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేసింది. పూజ చేయడానికి గల కారణం గురించి శోభ మాట్లాడుతూ.. కొత్తింట్లోకి వచ్చి ఎనిమిది నెలలవుతోంది. అప్పుడు పూజ చేసి ఇంటికి గుమ్మడికాయ కట్టాం. దిష్టి తాకి అదిప్పుడు పాడైపోయింది. అందుకే పంతులుగారిని పిలిచి పూజ చేశాం. దీనివల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. యశ్వంత్ ఎక్కువగా నమ్మడు. కానీ మా అత్తమ్మ, నేను ఎక్కువ నమ్ముతాం. అందుకే పూజ చేశాం అని శోభా శెట్టి చెప్పుకొచ్చింది.చదవండి: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ -
బెట్టింగ్ యాప్స్.. ఏడాదికి రూ.10 లక్షలిస్తామన్నారు: వాసంతి
ఈజీ మనీ కోసం చాలామంది బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వాడి నిండా మునుగుతున్నారు. అదే ఈజీ మనీ కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా ఉన్నారు. అందులో వాసంతి కృష్ణన్ (Vasanthi Krishnan) కూడా ఉంది. తాజాగా ఆమె బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడింది. అవగాహన లేక చేశా..వాసంతి మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఆఫర్లు వస్తుంటే చేసుకుంటూ పోయాను తప్ప దీనివల్ల జనాలు ఇబ్బందిపడుతున్నారని తెలీదు. ఆ యాప్స్ గురించి నాకంత అవగాహన లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇందులో తప్పే లేదనుకున్నాను. కనీస అవగాహన లేకుండానే సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాను. అయితే.. ఇలాంటివి ఎందుకు చేస్తున్నావ్ అంటూ నాకు నెగెటివ్ కామెంట్లు రావడం మొదలైంది. ఫాలోవర్లు కూడా తగ్గిపోయారు. నా వల్ల జనాలకు చెడు జరుగుతుందేమోనని ప్రమోషన్స్ ఆపేశాను. ఇప్పటికీ నన్ను ప్రమోషన్స్ చేయమని అడుగుతూనే ఉన్నారు.రూ.10 లక్షల ఆఫర్ఏడాదికి ఇంత, రెండేళ్లకు అంత అని ప్యాకేజీలు ఇస్తామన్నారు. అదంతా నావల్ల కాదు అని ఒక వీడియో చేసి ఆపేశాను. అప్పట్లో ఏడాదికి రూ.5 లక్షలు, రూ.10 లక్షలు ప్యాకేజీ ఇచ్చేవాళ్లు. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయనవసరం లేదు. కేవలం వీడియో తీసి సెండ్ చేయమనేవాళ్లు. కానీ నా అభిమానులు డబ్బు కోల్పోతున్నారని తెలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆపేశాను. అందరూ పాడైపోవాలన్న దురుద్దేశంతో అయితే ప్రమోషన్స్ చేయలేదు అని వాసంతి వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సీరియల్స్ చేస్తోంది.చదవండి: మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్ -
బిగ్‌బాస్ తర్వాత ఫస్ట్ మూవీ.. ఆర్టిస్ట్‌తో పలకరించిన సోనియా (ఫోటోలు)
-
తన మనసంతా మైసూర్ ప్యాలెస్‌లోనే ఉందంటున్న అరియానా గ్లోరీ (ఫోటోలు)
-
రైతుబిడ్డని చూసేందుకు వెళ్లిన ప్రియాంక జైన్ (ఫొటోలు)
-
రూ.50 లక్షల ప్రైజ్‌మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్‌బాస్ విజేత
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) విన్నర్ గెల్చుకునే ప్రైజ్‌మనీ రూ.50 లక్షలు. తెలుగులోనే కాదు హిందీలోనూ ఈ ప్రైజ్‌మనీ దాదాపు అంతే ఉంటుంది. అయితే వినడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ అది వెంటనే చేతికి ఇస్తే ఇంకా బాగుండేదంటున్నాడు హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ విజేత కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra). సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గత నెలలోనే పూర్తయింది. ఈ షోలో కరణ్ టైటిల్ గెలవగా వివియన్ డిసేన రన్నరప్‌గా నిలిచారు. కరణ్.. రూ.50 లక్షలు గెలిచాడన్నమాటేకానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదట!చేతికందని ప్రైజ్మనీతాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కలర్స్ ఛానల్లో నేను పాల్గొన్న మొదటి షో ఖత్రోన్ కె ఖిలాడీ-సీజన్ 14. గతేడాది జరిగిన ఈ షోలో విజయం సాధించాను. తద్వారా రావాల్సిన డబ్బు ఇటీవలే ముట్టింది. ఇదే ఛానల్లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని మరోసారి విజయం సాధించాను. కానీ ఇప్పటివరకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీని నాకివ్వనేలేదు. అలాగే కారు కూడా బహుమతిగా ఇస్తామన్నారు. దానికోసం ఎంతో ఎదురుచూడగా ఇప్పుడు నాచేతికి వచ్చేసింది.అభిమానులతో జాలీగా..అయితే ఈ షో నేను గెలుస్తాననుకోలేదు. అభిమానుల అండదండల వల్లే నా విజయం సాధ్యమైంది. ఒకవేళ నేను గెలవకపోయినా ఇంతే సాధారణంగా ఉండేవాడిని. బిగ్‌బాస్ తర్వాత నాకు విపరీతమైన ప్రేమాభిమానాలు దక్కుతున్నాయి. చాలా సమయం ఫ్యాన్స్‌తోనే గడుపుతున్నాను. నన్ను ఆశీర్వదించిన మహిళలకూ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కరణ్ బిగ్‌బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో తన సిబ్బంది పిల్లలకు చదువు చెప్పిస్తానన్నాడు. View this post on Instagram A post shared by KaranVeerMehra (@karanveermehra) చదవండి: తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్.. -
బాలీలో చిల్ అవుతున్న విష్ణుప్రియ నెట్టింట ఫోటోలు వైరల్
-
మల్లన్న పట్నం వేసి బోనం చేసిన సోనియా ఆకుల (ఫోటోలు)
-
జీవితంలో కొత్త అధ్యాయం షురూ.. మెహబూబ్ దిల్సే ఎమోషనల్
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సే (Mehaboob Dil Se) సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తమ కుటుంబంలోకి ఓ బుడ్డోడు వచ్చాడంటూ మురిసిపోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మా కుటుంబంలో మరొకరు చేరారు. ఆనందభాష్పాలతో తనకు సాదర స్వాగతం పలుకుతున్నాం. మా లైఫ్‌లో నువ్వే పెద్ద గిఫ్ట్‌నా తమ్ముడు సుభాన్కు బాబు పుట్టాడు. అతడి రాకతో మా ఇల్లు మరింత ప్రేమమయంగా, నవ్వుల హరివిల్లుగా మారుతోంది. ఈ బుడ్డోడు ఇప్పటికే మాలో అంతులేని ఆనందాన్ని నింపాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతి అని చెప్పకనే చెప్పాడు. మా బుడ్డోడు జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. తండ్రిలాగే కరుణామయుడిగా, బలవంతుడిలా ఎదగాలని ఆశిస్తున్నాను. మరి నీ పెళ్లెప్పుడు?వీడ్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు మా కుటుంబ బంధం మరింత బలపడినట్లు అనిపిస్తోంది అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది చూసిన అభిమానులు మెహబూబ్ పెదనాన్న అయినందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు. పనిలో పనిగా పెళ్లెప్పుడు చేసుకుంటావని ఆరా తీస్తున్నారు. దీనికి మెహు స్పందిస్తూ.. ఇప్పటికే ఇంట్లో పదేపదే పెళ్లి ప్రస్తావనే తెస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అని తల పట్టుకున్నాడు. View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) చదవండి: రూ.8 కోట్లు పెడితే రూ.55 కోట్లు.. ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ -
మూడు లగ్జరీ ఫ్లాట్స్ కొన్న బిగ్‌బాస్ విన్నర్.. ధర ఎన్ని కోట్లంటే?
గౌహర్ ఖాన్.. బాలీవుడ్లో ఆమె పేరు చాలా పాపులర్. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, టీవీ స్టార్,మోడల్,హీరోయిన్ ఇలా పలు రంగాల్లో రాణించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్లో అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్ భామ.అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబయిలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వర్సోవా ప్రాంతంలో దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువ చేసే మూడు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. వీటిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది. కాగా.. 2013లో బిగ్ బాస్ సీజన్- 7 టైటిల్ గెలిచిన గౌహర్ ఖాన్, మోడలింగ్‌తో పాటు హిందీ చిత్రాల్లో నటించింది.18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ ఆరంభించిన గౌహర్‌ఖాన్ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్, రాకెట్ సింగ్, ఫీవర్, బేగం జాన్ వంటి చిత్రాలతో పాటు తాండవ్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. 2020లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్(25)ను పెళ్లాడింది. ఆమె కంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో విమర్శలొచ్చాయి. -
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి.. బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ కృతి కర్బందా!
మనాలిలో బిగ్‌బాస్ బ్యూటీ దివి చిల్..బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ కృతి కర్బందా..పింక్ శారీలో మెరిసిపోతున్న మోనాల్ గజ్జర్..దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోన్న వితికా శేరు..బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
శ్రీలంకలోని శంకరి దేవి శక్తిపీఠం సందర్శించిన బిగ్‌బాస్ సోనియా (ఫోటోలు)
-
Divi Vadthya: నెలవంక సైతం సిగ్గుపడే అందం దివి సొంతం (ఫోటోలు)
-
మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య నువ్వే కావాలి సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
నమ్రతతో గొడవపడ్డ శిల్ప.. మూడు నెలల తర్వాత.. (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్ : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ (ఫొటోలు)
-
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్‌బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్‌గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
బిగ్‌బాస్ ఫినాలే ఛాన్స్ మిస్.. నమ్రతా, మహేశ్ బాబు సపోర్ట్‌పై శిల్పా రియాక్షన్
బిగ్‌బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్‌లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్వీక్లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్‌లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్‌లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.అయితే శిల్పా శిరోద్కర్‌కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.బిగ్‌బాస్‌లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్‌లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది. -
కాబోయే భర్తతో కలిసి పూజ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్ (ఫోటోలు)