బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్‌లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి.
కెప్టెన్సీ గేమ్
అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్‌ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది.
అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?
నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్‌మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్‌కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.
రీఎంట్రీ?
హౌస్‌మేట్స్‌తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్‌లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.


