హీరోయిన్లకు తలనొప్పిగా మారిన ఏఐ | Tamannaah Bhatia AI Photos Goes Viral, Actresses Demand Strict Action Against AI Misuse For Manipulated Images | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: హీరోయిన్లకు కొత్త తలనొప్పి.. తమన్నాకి సైతం తప్పలేదు!

Dec 10 2025 7:03 AM | Updated on Dec 10 2025 12:13 PM

Tamannaah Bhatia AI Photos Goes Viral

సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇందులో నిలదొక్కుకునేందుకు తారలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అందరూ అనుకున్న స్థాయికి చేరుకోలేరు. అదృష్టం తోడైనవారే తమ కలలను సాకారం చేసుకుంటారు. భాషాభేదం లేకుండా తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అందుకు తగిన గుర్తింపు వస్తే ఆనందిస్తారు. అయితే ఇప్పుడు ప్రముఖ స్టార్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) అనే ఆధునిక టెక్నాలజీ.

ఏఐ దుర్వినియోగం
సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల ఓపక్క ప్రయోజనాలు చేకూరుతుంటే మరికొందరు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోటోలను ఇష్టారీతిన ఎడిట్‌ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్‌ చేసి అశ్లీల ఫోటోలు చిత్రీకరిస్తున్నారు. ఇలా తప్పుగా చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా తమన్నా ఫోటోలను ఏఐ టెక్నాలజీతో బికినీ దుస్తుల్లో చిత్రీకరించి వైరల్‌ చేశారు. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే హీరోయిన్లకు తలనొప్పి తప్పేలా లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement