త్రిగుణ్, హెబ్బా పటేల్
త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఈషా’. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ఇది.
వంశీ నందిపాటి, ‘బన్నీ’ వాసు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 12న రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. కానీ, వాయిదా వేశారు. ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లుగా మంగళవారం తెలిపారు.


