ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్‌ | Aman Khan Brings The Roof Down In Pondicherry League With 34 Ball 100 | Sakshi
Sakshi News home page

PPL 2026: ఫాస్టెస్ట్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డు బ్రేక్‌

Jul 16 2026 4:34 AM | Updated on Jul 16 2026 4:59 AM

Aman Khan Brings The Roof Down In Pondicherry League With 34 Ball 100

పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్‌రౌండ‌ర్ అమ‌న్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో విలియనూర్ మోహిత్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న అమన్ ఖాన్‌.. మాహె మెగాలో స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన విలియనూర్ జట్టు 7.4 ఓవర్లలో 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన  29 ఏళ్ల అమన్.. ప్రత్యర్ధి బౌలర్లపై  విరుచుకుపడ్డాడు. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో అతడు సిక్సర్ల వర్షం కురిపించాడు. మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ కేవలం 34 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఈ యువ ఆల్‌రౌం‍డర్ ఓవరాల్‌గా 43 బంతులు ఎదుర్కొని 300 స్ట్రైక్ రేట్‌తో 129 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో  6 ఫోర్లు, ఏకంగా 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో అమన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత దేశీవాళీ/ లీగ్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా అమన్ నిలిచాడు.

ఈ క్రమంలో భారత యవ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డును అమన్ ఖాన్ బ్రేక్ చేశాడు. వైభవ్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లో శతక్కొట్టిన ఈ పాండిచ్చేరి ఆల్‌రౌండర్.. వైభవ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో తెలంగాణ క్రికెటర్ అమన్ రావు పెరాల(32) అగ్రస్ధానంలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement