చీరతో విదేశీ వనిత పాట్లు..! ఆ మహిళా కానిస్టేబుల్‌.. | Woman Constable Helps Argentine Tourist Wear Saree At Taj Mahal | Sakshi
Sakshi News home page

చీరతో విదేశీ వనిత పాట్లు..! ఆ మహిళా కానిస్టేబుల్‌..

Jul 15 2026 5:28 PM | Updated on Jul 15 2026 5:31 PM

Woman Constable Helps Argentine Tourist Wear Saree At Taj Mahal

నెట్టింట చక్కెర్లు కొడుతున్న వీడియో..మన దేశ ఆతిథ్యం తోపాటు, మన భారతీయ చీర గొప్పదనాన్ని చాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో ఆగ్రాలలోని తాజ్‌మహల్‌వద్ద ఒక అర్జెంటిన పర్యాటకురాలికి  చీర సరిచేసుకోవడంలో సహాయం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. 

సాంప్రదాయ వస్త్రధారణ తెలియని ఆ పర్యాటకురాలు యూపీ పోలీసులకు ధన్యవాదాలు అని తెలపడంతో ఒక్కసారిగా ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన పోలీసులు విధులకు మించి సాయం చేయడానికి ముందుకు వచ్చిన సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేగాదు భారతదేశా అతిథ్యం, పర్యాటకుల పట్ల స్నేహపూర్వకమైన పోలీసింగ్‌ని హైలెంట్‌ చేశారు మేడం అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించారు. 

అలాగే కొందరు నెటిజన్లు తాజ్ మహల్ సందర్శన సమయంలో చీర ధరించి భారతీయ సంస్కృతిని స్వీకరించినందుకు ఆ విదేశీ మహిళను కూడా అభినందిస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈఘటన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తాజ్‌మహల​ పశ్చిద్వారా వద్ద చోటు చేసుకుంది. దీనిపై యూపీ పోలీసు అధికారుల కూడా స్పందించారు. అవసరమైనప్పుడు దేశీయ , అంతర్జాతీయ పర్యాటకులిద్దరికీ సహాయం అందించేలా తాజ్ సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిని ప్రోత్సహిస్తుందని అధికారులు తెలిపారు.

 

(చదవండి: కుమారుడి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..! కన్నీటి సంద్రంలో తండ్రి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement