నా సినిమాలో మీరే హీరోయిన్‌.. ముందు శరీరమంతా చూపించండి..! | Chennai Producer Arrested After Actress Complains Of Inappropriate Photoshoot During Fake Film Offer | Sakshi
Sakshi News home page

నా సినిమాలో మీరే హీరోయిన్‌.. ముందు శరీరమంతా చూపించండి..!

Jul 14 2026 9:12 AM | Updated on Jul 14 2026 2:05 PM

Chennai Film Producer Two Camerawomen Arrested

చెన్నైలోని సాలిగ్రామంలో నివసించే 31 ఏళ్ల యువతి, బుల్లితెర, సినిమాల్లో సహాయ నటిగా నటిస్తోంది. ఈమెని పెరుంగుడి ప్రాంతానికి చెందిన నంది రామనాథన్‌ (65) సంప్రదించి, ‘నేను సినిమా నిర్మాతను. నేను నిర్మిస్తున్న కొత్త సినిమాలో మీరు హీరోయిన్‌ గా నటించాలి‘ అని చెప్పారు. 

అదే ప్రాంతంలోని కావేరి వీధిలో ఉన్న ఒక హాస్టల్‌లో జరుగుతున్న ’ఫోటో షూట్‌’కు హాజరవ్వమని ఆహ్వానించారు. ఆ తర్వాత ఆ నటి స్వయంగా హోటల్‌కు వెళ్లారు. ఆ సమయంలో, డైరెక్టర్‌ నంది రామనాథన్‌తో పాటు చెన్నై, తరామణి, విరుదునగర్‌లకు చెందిన ఇద్దరు యువతులు, ఏడేళ్ల బాలిక సహా నలుగురు అదే గదిలో ఉన్నారు. ఆకర్షణీయంగా ఉన్న ఆ నటి ఫోటోలను దుస్తులు ధరించిన మహిళ తన సెల్‌ ఫోన్‌తో వివిధ కోణాల్లో తీసింది. 

ఈ క్రమంలో శరీరం మీద ఒక్క మచ్చ కూడా తెలియకుడదు.. కాబట్టి ముఖం దాచి నగ్నంగా ఫొటో తీయాలని అతను చెప్పా డు. ఈ విషయం విని దిగ్భ్రాంతి చెందిన ఆ నటి, వారితో వాగ్వాదానికి దిగి, తర్వాత తన సెల్‌ఫోన్‌ ద్వారా ఈ ఘటన గురించి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేసింది. దీని తరువాత, సింగప్పెన్‌ స్పెషల్‌ పోలీస్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ జానకి నేతత్వంలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిర్మాత నంది రామనాథన్‌ను, అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను అరె స్టు చేశారు. వారితో ఉన్న బాలికను కూడా పోలీసులు రక్షించి, అడయార్‌లోని బాలల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.    

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement