‘‘రాజా ది రాజా’ మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది.. ఫైనల్ ఔట్‌పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. మా మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అని నిర్మాత కె. నిహారిక దాసరి పేర్కొన్నారు. రుత్విక్, విశాఖ ధీమాన్ జోడీగా అనిల్ బోయిడపు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజా ది రాజా’. కె. శ్రీలతా రెడ్డి సమర్పణలో బృందావన్ క్రియేషన్స్ పై కె.నిహారిక దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా కె.నిహారిక దాసరి మాట్లాడుతూ–‘‘హీరో రుత్విక్ నా తమ్ముడు. సినిమాలంటే చాలా ప్యాషన్. తను చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో హీరోగా పరిచయం చేశాం. మా మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ‘మగధీర’ వంటి గొప్ప సినిమాతో పోల్చడం హ్యాపీగా అనిపించింది. అయితే రెండు కథలకు సంబంధం లేదు. దర్శకుడు అనిల్ చాలా క్రియేటివ్ పర్సన్. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో తెరకెక్కించారు. హీరోయిన్ విశాఖ ధిమాన్ నటన సహజంగా ఉంటుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మా మూవీ రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. రవిశంకర్, నవీన్‌గార్లకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’’ అని చెప్పారు.


