త్వరలోనే అమ్మకానున్న సమంత డెలివరీపై అప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న తర్వాత తక్కువ గ్యాప్‌లోనే మాతృత్వ దశలోకి అడుగుపెట్టింది సమంత. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవలే వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సమంత పూర్తిగా తన నివాసానికే పరిమితమైంది. కాగా తన డెలివరీ కోసం ఎక్కడికి వెళ్తుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 
సంపన్నులు, సెలబ్రిటీలు తరచుగా అనుసరించే ‘బర్త్ టూరిజం’పై కూడా చర్చ జరుగుతోంది. అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాల్లో పుట్టిన బిడ్డకు పౌరసత్వం లభించే అవకాశం ఉండటంతో చాలామంది ఆ దిశగా వెళ్తారు. అయితే అమెరికాలో బర్త్ టూరిజంపై ఇటీవల గందరగోళం నెలకొనింది. వీసా సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత అమెరికా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. కెనడా కూడా పుట్టుకతోనే పౌరసత్వం ఇచ్చే నిబంధనలు కలిగి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే ఆలోచన లేదని తెలుస్తోంది. 
సమంత టీమ్‌కు చెందిన క్లోజ్ సర్కిల్ మాత్రం ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తోంది. ఆమె ఇండియాలోనే బిడ్డకు జన్మనిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో కాకుండా, ముంబయిలో డెలివరీ అయ్యే అవకాశాలను పరిశీలిస్తున్నారని సమాచారం. దీంతో సమంత డెలివరీ ఎక్కడ జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.


