కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా వస్తోన్న సినిమా 'వెల్‌కమ్ టూ వైల్డ్ లైఫ్'. ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఆయన గతంలో 'నిను వీడని నీడను నేనే', 'సింగిల్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వైల్డ్ లైఫ్ మూవీకి సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇవాళ శివరాజ్ కుమార్ బర్త్ డే కావడంతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చేతిలో సింహం పిల్లని పట్టుకుని శివరాజ్‌కుమార్ కనిపించారు. మరోవైపు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీని కేవీకే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కుడిపూడి విజయ్ కుమార్ నిర్మాస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.


