నీకెంత.. నాకెంత | MRP-Neekentha Naakentha Pre-Release Event | Sakshi
Sakshi News home page

నీకెంత.. నాకెంత

Jul 13 2026 12:59 AM | Updated on Jul 13 2026 12:59 AM

MRP-Neekentha Naakentha Pre-Release Event

నరేష్‌ అగస్త్య, డోనల్‌ బిష్ట్‌ జంటగా నటించిన సినిమా ‘ఎమ్‌ఆర్‌పీ’.    ‘నీకెంత నాకెంత’ అనేది క్యాప్షన్ . శ్రవణ్‌ జేష్ఠ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నరేష్‌ అగస్త్య మాట్లాడుతూ–‘‘ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశాం. మా చిత్రాన్ని చూసి, మా కష్టాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

‘‘మా కష్టానికి ప్రేక్షకులు ప్రతిఫలం అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రవణ్‌ జేష్ఠ. ‘‘నా తొలి తెలుగు సినిమా  ‘ఎమ్‌ఆర్‌పీ’ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు డోనల్‌ బిష్ట్‌. ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్, కశిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజయ్‌ అరసాడ స్వరకర్త. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement