ట్రైన్‌ జర్నీలో ఏం జరిగింది? | Vijay Sethupathi Train movie Teaser release | Sakshi
Sakshi News home page

ట్రైన్‌ జర్నీలో ఏం జరిగింది?

Jul 13 2026 12:50 AM | Updated on Jul 13 2026 12:50 AM

Vijay Sethupathi Train movie Teaser release

విజయ్‌ సేతుపతి, శ్రుతీహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ట్రైన్‌’. నాజర్, యుగి సేతు, నరైన్, కేఎస్‌ రవికుమార్, సంపత్‌ రాజ్, ఐరా దయానంద్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మిస్కిన్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌.థాను నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా టీజర్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఓ ట్రైన్‌ జర్నీలో చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు, ఆ ట్రైన్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, ప్రయాణికుల ఇబ్బందులు.. వంటి అంశాలతో ఈ  సినిమా కథనం సాగుతుందని టీజర్‌ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు మిస్కిన్‌ సంగీతం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement