ఆ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు హీరో చేశా: విజయ్‌ సేతుపతి | Vijay Sethupathi Interesting Comments On Puri Jagannadh At Slumdog Teaser Launch Event, Deets Inside | Sakshi
Sakshi News home page

పూరి సినిమాలో అప్పుడు జూనియర్‌ ఆరిస్ట్‌గా..ఇప్పుడు హీరోగా చేశా: విజయ్‌ సేతుపతి

Jun 9 2026 9:05 AM | Updated on Jun 9 2026 9:51 AM

Vijay Sethupathi Intersting Comments On Puri Jagannadh At Slumdog Teaser Launch Event

‘‘పూరి జగన్నాథ్‌గారి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా తమిళ రీమేక్‌లో జయం రవి (రవి మోహన్‌ ) హీరోగా నటించారు. ఈ చిత్రంలో నేను జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటించాను. ఇప్పుడు పూరిగారి దర్శకత్వంలో నేను హీరోగా ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’ సినిమా చేయడం సంతోషాన్నిస్తోంది. ఆయన కెరీర్‌లో ఇది ఒక బెస్ట్‌ ఫిల్మ్‌గా నిలుస్తుంది’’ అని విజయ్‌ సేతుపతి చెప్పారు.

 పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి హీరోగా రూపొందిన చిత్రం ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’. సంయుక్త, టబు, విజయ్‌కుమార్‌ ఇతర పాత్రల్లో నటించారు. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మించారు. సోమవారం చెన్నైలో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. 

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ–‘‘నిజ జీవిత ఘటనలతో రాసిన కథ ఇది. ఇది కేవలం యాక్షన్‌ సినిమా మాత్రమే కాదు.. చాలా భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూరిగారు, నా కాంబినేషన్‌లో చేసిన తొలి స్ట్రయిట్‌ తమిళ్‌ సినిమా ఇది’’ అన్నారు చార్మీ కౌర్‌. 

‘‘పూరి జగన్నాథ్‌గారితో పని చేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’’ అని పేర్కొన్నారు సంయుక్త. ‘‘పూరి జగన్నాథ్‌గారితో నిర్మాణ బాధ్యతలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత జేబీ నారాయణరావు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మాట్లాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement