పూరీ-సేతుపతి సినిమా టైటిల్ ఇదే.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. విజయ్ సేతుపతి(Vijay Sethupath) బర్త్‌డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘స్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది’ అంటూ విజయ్ పాత్ర తీరును వివరించారు. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించగా.. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది.From the slums… rises a storm no one can stop.RAW. RUTHLESS. REAL. ❤️🔥❤️🔥❤️🔥#PuriSethupathi is #SLUMDOG - 33 Temple Road 💥💥💥Happy Birthday Makkalselvan @VijaySethuOffl ❤️#HBDVijaySethupathi A #PuriJagannadh film 🎬@Charmmeofficial Presents 🎥Produced by Puri… pic.twitter.com/ca2PCs6tBG— Puri Connects (@PuriConnects) January 16, 2026