పూరీ-సేతుపతి సినిమా టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌! | Vijay Sethupath And Puri Jagannadh Film Titled Slum Dog, First Look Released Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

పూరీ-సేతుపతి సినిమా టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌!

Jan 16 2026 11:37 AM | Updated on Jan 16 2026 12:16 PM

Vijay Sethupath, Puri Jagannadh Film Titled Slum Dog, First Look Released

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు రోజు  ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. 

విజయ్సేతుపతి(Vijay Sethupath) బర్త్డే సందర్భంగా నేడు(జనవరి 16) ఈసినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ని విడుదల చేశారు. చిత్రానికిస్లమ్ డాగ్ ’(Slum Dog) అనే టైటిల్ని ఖరారు చేశారు.  33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా చిరిగిన దుస్తులు ధరిస్తూనే.. చేతిలో కత్తి పట్టుకొని కళ్లజోడుతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. 

ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ.. ‘మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది’ అంటూ  విజయ్‌ పాత్ర తీరును వివరించారు.   చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటించగా.. టబు, విజయ్కుమార్కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకున్న చిత్రం .. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్స్పనుల్లో బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement