యాంకర్ సుమ గురించి తెలుసు. భర్త రాజీవ్ కనకాల గురించి తెలుసు. వీళ్ల కొడుకు రోషన్ కూడా రెండు సినిమాలు హీరోగా చేశాడు. ఇతడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొద్దిమందికి తెలుసు. కానీ సుమ కూతురు పెద్దగా బయట కనిపించదు. అలాంటిది ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 8 నెలలు మంచానికే పరిమితం.. ఆ దర్శకుడే లేకపోయుంటే: హీరోయిన్ స్నేహ)
టీవీ నటిగా కెరీర్ మొదలుపెట్టిన సుమ.. తర్వాత యాంకర్ అయిపోయింది. ఆ టైంలోనే నటుడు రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకుంది. రాజీవ్ నటుడిగానే అడపాదడపా మూవీస్ చేస్తుంటగా.. సుమ యాంకరింగ్‌తో ఇప్పటికీ బిజీగానే ఉంది. వీళ్లకు కొడుకు రోషన్, కూతురు మనస్విని ఉన్నారు. రోషన్.. బబుల్‌గమ్, మోగ్లీ అనే చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ అవి హిట్ అవ్వలేదు. కూతురు మనస్విని ప్రస్తుతం చదువుకుంటోంది. పెద్దగా సోషల్ మీడియాలోనూ ఎక్కడ కనిపించదు.
ఇప్పుడు తల్లితో కలిసి అల్లు శిరీష్ రిసెప్షన్ వేడుకలో కనిపించడంతో సుమ కూతురు ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. సుమ అంత ఎత్తు కూడా ఉంది. మరి తల్లితండ్రి అన్నలానే ఇండస్ట్రీలోకి వస్తుందా? లేదా మరేదైనా ప్రొఫెషన్ ఎంచుకుంటుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)


