సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్ | Rashmika Mandanna Invites CM Revanth Reddy Family To Her Wedding Reception, Photos Viral On Social Media | Sakshi
Sakshi News home page

Rashmika: ముఖ్యమంత్రిని రిసెప్షన్‌కి ఆహ్వానించిన రష్మిక

Mar 1 2026 6:17 PM | Updated on Mar 1 2026 6:52 PM

Rashmika Invites CM Revanth Reddy Family Her Wedding Reception

టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.

(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)

పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్‌కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. 

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా)

Advertisement
 
Advertisement
Advertisement