ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్‌టైమ్‌..! | Dhurandhar 2 Movie Runtime Leaked, Sequel Set To Be Over 3 Hours Long, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్‌టైమ్‌..!

Mar 1 2026 4:09 PM | Updated on Mar 1 2026 5:52 PM

hurandhar movie runtime will be bigg hour

బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌  హీరోగా ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ధురంధర్‌.. గతేడాది డిసెంబరు 5న విడుదలైన ఈ మూవీకి సీక్వెల్‌ రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ రన్‌టైమ్‌ గురించి సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్‌ అవుతున్నాయి. పార్ట్‌-1కు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. ఆపై దీని రన్‌టైమ్‌ 3.34గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ సీక్వెల్‌ రన్‌టైమ్‌ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందరిని ఆశ్చర్యపరుస్తుంది.

'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్‌లో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్‌ 3.50 గంటలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, మరికొన్ని కథనాల్లో మాత్రం 3.40గంటలకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు.  ఈ మూవీ నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్‌-1కు మించే సీక్వెల్‌ రన్‌టైమ్‌ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సుమారు  17ఏళ్ల తర్వాత ఈ రేంజ్‌ నిడివితో బాలీవుడ్‌లో సినిమా రావడం విశేషం. 2008లో హృతిక్‌ రోషన్ నటించిన ‘జోథా అక్బర్‌’ (3.50గంటలు) రన్‌టైమ్‌తో విడుదలైంది. అయితే, నిర్మాతల నుంచి ధురంధర్‌ తుది రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రకారం రన్‌టైమ్‌ ఎక్కువగానే ఉందని సమాచారం.

ధురంధర్ 2 లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి వస్తున్నారు. యామి గౌతమ్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా సమాచారం ఉంది.  ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement