Ranveer Singh
-
కాంతార ఇమిటేషన్.. దురంధర్ హీరో అలా చేయాల్సిందే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్-2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. దురంధర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో పార్ట్-2 కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ చిత్రంపై సౌత్ స్టార్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీని కాంతార హీరో రిషబ్ శెట్టి సైతం కొనియాడారు. అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. కాంతార ఇమిటేషన్ కేసులో ఊరట..అయితే గతంలో రణ్వీర్ సింగ్ కాంతార మూవీ దేవతను ఇమిటేట్ చేయడం వివాదానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్ వీర్ సింగ్ ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత తన ప్రవర్తనపై రణ్వీర్ క్షమాపణలు కూడా చెప్పారు. ప్రజల భక్తి, సెంటిమెంట్ కావడంతో రణ్వీర్ సింగ్ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాగా.. చాముండి దేవత పాత్రలో రిషబ్ శెట్టి నటించారు. అయితే దైవాంశమైన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణ సరిపోదని.. ప్రత్యక్షంగా వచ్చి సారీ చెప్పాలని పిటిషన్లో కోరారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు రణ్వీర్ సింగ్‌కు ఊరటనిచ్చింది. చాముండి ఆలయాన్ని సందర్శించి క్షమాపణ చెప్పాలంటూ రణ్వీర్ సింగ్‌ను ఆదేశించింది. ఫిర్యాదుదారుడు క్షమాపణ కోసం కోర్టుకు హాజరు కావాలని కోరితే.. అందుకు అంగీకరించాలని కోర్టు సూచించింది.దీనిపై క్షమాపణ అఫిడవిట్ దాఖలు చేస్తామని.. రణ్వీర్ సింగ్ త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తారని హీరో తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణ సమయంలో రణవీర్ సింగ్ తండ్రి హాజరయ్యారు. కోర్టు సూచనలతో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కోర్టులో క్షమాపణ చెప్పి.. చాముండి ఆలయాన్ని సందర్శించనున్నారు.కాగా.. గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
18 ఏళ్లకే తల్లి పాత్ర.. ‘ధురంధర్’ నటిపై ప్రశంసలు
సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉండే పాత్రలు రేర్‌గా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడే కొంతమంది తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. అయితే అందులోనూ తమ వయసు తగ్గ పాత్రలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా తల్లి పాత్రలు చేయాల్సి వస్తే సీనియర్ హీరోయిన్లు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. 30 ఏళ్లు దాటినా.. తల్లి పాత్ర చేయమని అడిగితే నో చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ సారా అర్జున్ మాత్రం 18 ఏళ్లకే తల్లి పాత్ర చేసింది. అది కూడా 40 ఏళ్ల వయసు ఉన్న హీరో నటించిన పాన్ ఇండియా సినిమాలో. అదే ధురంధర్ 2.ధురంధర్ సినిమా సమయంలో సారాపై పెద్ద ఎత్తున ట్రోల్ నడిచింది. 40 ఏళ్ల వయసు ఉన్న హీరో(రణ్వీర్ సింగ్)తో రొమాన్స్ చేయబోతుందంటూ ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత అందరూ ఆమెపై ప్రశంసలు కురిరించారు. చిన్న పిల్ల అయినా బాగా నటించిందని అభినందించారు.అయితే పార్ట్ 1లో కేవలం హీరో ప్రియురాలి పాత్రలో కనిపించిన సారా.. పార్ట్ 2 మాత్రం ఓ బిడ్డకు తల్లిగా నటించి, మెప్పించింది. ప్రస్తుతం సారా వయసు 20 ఏళ్లు. ధురంధర్ షూటింగ్ సమయంలో ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో తల్లి పాత్ర ఒప్పుకొని సారా పెద్ద సాహసమే చేసింది.కథపై నమ్మకంతోనే సారా ఆ పాత్ర చేసేందుకు అంగీకరించిందట. తల్లి పాత్ర ఉంటుందని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ధురంధర్ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా చెప్పారు.‘పార్ట్ 2లో తల్లి పాత్ర పోషిస్తున్నానా అనే విషయాన్ని కూడా సారా అడగలేదు. కథ విని వెంటనే ఓకే చెప్పింది. దీంతో ఆమెకు లుక్ టెస్ట్ చేశాం. నేను చేసిన లుక్ టెస్ట్‌లోనూ సారానే ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆ పాత్రకు ఎంపిక చేశాం’ అని ముకేష్ అన్నారు. కాగా, ధురంధర్ కాస్టింగ్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సరైన నటుడిని ఎంచుకున్నారని, తెరపై చూస్తుంటే వారు తప్ప వేరే నటుడు అలా చేయరేమో అన్నట్లుగా పాత్రలను తీర్చిదిద్దారంటూ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. -
అందరి నోటా దురంధర్.. ఆ రియల్ హీరో స్టోరీ తెలుసా?
దురంధర్.. దురంధర్.. దురంధర్.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.ఈ నేపథ్యంలో అసలు దురంధర్ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్ ఎవరినీ తెగ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్‌కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.రియల్ ధురంధర్ ఆయనే..రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్ టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్‌గా పాకిస్తాన్ వెళ్లిన రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.భారత్‌కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్‌లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.23 ఏళ్ల వయసులోనే..రవీంద్ర కౌశిక్ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లోకి ప్రవేశించారు. అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్‌తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్‌లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్‌ను కలవాల్సిన ముల్తాన్‌లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్‌లో రవీంద్ర కౌశిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్‌ను సియాల్కోట్లో విచారించి.. కోట్ లఖ్‌పత్, మియాన్వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే? రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పట్టణం. 1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్‌లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్‌లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు. ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
జూన్‌లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్‌గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)A Cameraman showing in this scene.Peak Detailing by Aditya Dhar Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026 -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్‌వీర్‌సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్‌లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
5 పైసలు..5 లక్షల ఖర్చు
సంస్థ సొమ్మును కాజేయాలని చూసిన ఉద్యోగికి శిక్ష పడాల్సిందేనని కార్పొరేషన్, ‘నేను ఏ తప్పు చేయలేదు.. నాకు న్యాయం చేయండని’ ఆ ఉద్యోగి... 40 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. కేసు కోసం లక్షలు ఖర్చు చేశారు.. సంస్థ ఏళ్ల తరబడి పోరాడిందంటే ఆ ఉద్యోగి భారీగానే ‘ నొక్కేసుంటాడు’, అవినీతి సొమ్ము ‘మెక్కేసుంటాడని’ అనుకుంటున్నారా.. అయితే మీరు ‘చిల్లర’లో కాలేసినట్టే... ఎందుకంటే ఆ ఉద్యోగి సంస్థకు చెందాల్సిన ‘5పైసలు’ తన జేబులో వేసుకున్నాడని సంస్థ ఆరోపణ. అవును మీరు చదివింది నిజమే ‘5 పైసలే’. భారత న్యాయవ్యవస్థలో ‘5 పైసల కేసు’గా గుర్తింపు పొందింది. అసలేం జరిగింది.. చివరికి ఎవరికి న్యాయం దక్కిందో తెలుసుకుందాం..ఇప్పుడంటే యూపీఐ పేమెంట్లు, కార్డులతో చెల్లింపులు వచ్చాయి.. కానీ ఒకప్పుడు బస్సుల్లో ‘చిల్లర పోరాటాలు’ సర్వసాధారణం. ‘టికెట్‌కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్‌కు సహకరించండి’ అని బస్సుల్లో రాసేవారు. చిల్లర ఇవ్వకుండా కండక్టర్ ‘నొక్కేశాడని’ ప్రయాణికుల నుంచి ఆరోపణలు వినిపించేవి. ఢిల్లీకి చెందిన రణవీర్ సింగ్ యాదవ్ ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(డీటీసీ)లో కండక్టర్‌గా పనిచేసేవాడు. 1973లో ఆయన డ్యూటీలో ఉండగా స్క్వాడ్ బస్సును ఆపి తనిఖీ చేసింది. ఓ ప్రయాణికురాలి దగ్గర నుంచి 15 పైసలు తీసుకుని, ఆమెకు పది పైసల టికెట్ ఇచ్చాడు. మిగిలిన 5 పైసలు అతను జేబులో వేసుకున్నాడని స్క్వాడ్ ఆరోపణ. విచారణ జరిపి డీటీసీ 1976లో అతడ్ని విధుల నుంచి తొలగించింది. కోర్టులో పోరాటంతనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ రణవీర్‌సింగ్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కేవలం ‘5 పైసల’ విషయంలో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం చాలా కఠినమైన శిక్ష అని కోర్టు పేర్కొంది. గతంలోనూ అతను విధుల్లో నిర్లక్ష్యం వహించాడన్న డీటీసీ వాదనల్ని కోర్టు తోసి పుచ్చింది. అతడికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని 1990లో తీర్పు ఇచ్చింది. హైకోర్టులో అప్పీలులేబర్ కోర్టు తీర్పును డీటీసీ ఢిల్లీ హైకోర్టులో 1991లో సవాలు చేసింది. అప్పటి నుంచి ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. చివరికి ఢిల్లీ హైకోర్టు డీటీసీ పిటిషన్‌ను కొట్టేసింది. అతనికి రావాల్సిన గ్రాట్యూటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని ఆదేశించింది. ‘ 5 పైసల’ కోసం ఇన్నేళ్లు కేసు నడపడానికి ఎంత ఖర్చు చేశారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించగా, ఇరు పక్షాలు కలిపి సుమారుగా రూ. 5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడైంది. కేసు గెలవాలి.. తను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బాధితుడు తన ఆస్తిని అమ్మేశాడు. కష్టపడి కూడగట్టుకున్న పొదుపు సొమ్మును ఖర్చు చేశాడు..డీటీసీ ‘5పైసల’ కోసం సుమారుగా రూ. 47,000 కోర్టు ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టింది. ఒక చిన్న వివాదం కోర్టుల్లో ఏళ్ల తరబడి ఎలా సాగుతోంది..ఓ వ్యక్తి న్యాయపోరాటం అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. ఈ తరహా చిన్న ఘటనలు కోర్టు విలువైన సమయాన్ని వృథా చేస్తాయనే దానికి ఈ కేసు ఓ ఉదాహరణ. ‘నేను మోసం చేశానా అని నా పిల్లలు కూడా అడిగేవారు. నేను తప్పు చేయలేదని వారికి చెప్పడం చాలా బాధగా ఉండేది’.. నేను తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి నా జీవిత కాలం చేసిన పొదుపు మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది.‘ నా వయస్సు వారు తీర్థయాత్రలకు వెళ్లేవారు... నేను మాత్రం ఏళ్ల తరబడి కోర్టుల యాత్ర’ చేశాను. – రణవీర్‌సింగ్ యాదవ్, బాధితుడు -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్‌లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్‌లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్‌కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి)రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో కూడా!
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్లైన్లో తెలుగు వెర్షన్‌కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. ప్రీమియర్స్ కోసం ముందే బుక్ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయ్యింది. కన్నడలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ధురంధర్ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిద్యధర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్‌లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్‌తో చేసిన సిక్స్ ప్యాక్‌లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్‌పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్వీర్ సింగ్ దురంధర్-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్‌లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.మొదటి పార్ట్‌లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది. మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని మేకర్స్‌ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దివ్య తన ట్వీట్లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్‌గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026 -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్‌సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
బాక్సాఫిస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ 2
-
దురంధర్-2 మూవీ.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్‌లో దురంధర్-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?
తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. 'ధురంధర్ 2' మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. రిలీజ్ నాడు పడాల్సిన తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? తెలుగు షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చు?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతేడాది డిసెంబరు తొలివారంలో వచ్చిన 'ధురంధర్'.. 50 రోజులకు పైనే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. తర్వాత ఓటీటీలోకి వస్తే అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి పార్ట్ రిలీజైనప్పుడే సీక్వెల్.. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కూడా ఈసారి ఉంటాయని మాటిచ్చారు. కానీ ఇప్పుడది తప్పారు.18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల నుంచి ఉంటాయని పోస్ట్ పెట్టాడు. రాత్రి సంగతి పక్కనబెడితే తర్వాత అంటే 19వ తేదీ అయిన ఈ రోజు కూడా హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి తెలుగు షోలు ఉన్నప్పటికీ.. అవి అయినా వేస్తారా లేదా అనేది సందేహమే?'ధురంధర్ 2' విషయానికొస్తే.. రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు.అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష) -
పవన్ VS రణ్వీర్.. ఇది మూడోసారి
భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు పోటీగా రిలీజైన చిత్రం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీటి టాక్ ఏంటి? చూసిన వాళ్లు ఏమంటున్నారు? అనే విషయాల్ని పక్కనబెడితే పవన్ vs రణ్వీర్ పోటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలోనూ ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)రణ్వీర్ సింగ్.. హిందీ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇక్కడ కూడా ఇతడి మూవీస్ రిలీజయ్యాయి. గతంలో అంటే 2011లో పవన్ కల్యాణ్ 'పంజా' వచ్చినప్పుడే రణ్వీర్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' మూవీ కూడా వచ్చింది. వీటిలో పంజా ఫ్లాప్ కాగా రణ్వీర్ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. 2023లోనూ మళ్లీ వీళ్లిద్దరూ ఒకేరోజున చిత్రాల్ని రిలీజ్ చేశారు. పవన్ 'బ్రో' సినిమాతో రాగా రణ్వీర్ 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'తో వచ్చాడు. ఇక్కడ సేమ్ సీన్ రిపీటైంది పవన్ మూవీ ఫ్లాప్ కాగా రణ్వీర్ హిట్ కొట్టాడు.ఇపుడు ముచ్చటగా మూడోసారి రణ్వీర్ వర్సెస్ పవన్ పోటీలో నిలిచారు. ఈసారి రణ్వీర్ 'ధురంధర్ 2' ఆధిపత్యమే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ప్రీమియర్ల నుంచే నెగిటాక్ వస్తోంది. కంటెంట్ మరీ ఔట్ డేటెడ్‌గా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 'ధురంధర్ 2' హవా తెలుగులోనూ గట్టిగానే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సినిమా 'ధురంధర్'. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ వచ్చేసింది. నిన్నటి(మార్చి 18) నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడ్డాయి. చూసిన ప్రతిఒక్కరూ అదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ప్రీమియర్ చూసి తనదైన రివ్యూ ఇచ్చేశాడు. మూవీని ఆకాశానికెత్తేశాడు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'దేశభక్తి, స్వాగ్తో ఇప్పుడే 'ధురంధర్ 2' చూశాను. ప్రతి భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేలా చేసింది. సినిమాలో క్లాప్స్ కొట్టే సందర్భాలెన్నో. చిత్రబృందానికి శుభాకాంక్షలు. మాధవన్ సహా నటీనటులు అందరూ అదరగొట్టేశారు. నీలాంటి భిన్నమైన యాక్టర్ దేశంలో ఉండటం గర్వకారణంగా ఉంది బ్రదర్ రణ్వీర్ సింగ్. ఆదిత్య ధర్.. మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు. నీలాంటి దర్శకులు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. షో రాకర్. ఇది ఇంటర్నేషనల్ స్వాగ్తో తీసిన భారతీయ కథ. జైహింద్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.మామ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైనప్పటికీ.. అల్లు అర్జున్ ముందుగా 'ధురంధర్ 2' చూసి ఏకంగా రివ్యూ ఇవ్వడం తెలుగు ప్రేక్షకుల్లో చర్చకు కారణమైంది. ఎందుకంటే పవన్ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. మొత్తం నెగిటివ్ టాక్ వస్తోంది. అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ తదితరులు.. 'ధురంధర్ 2' సినిమాని బుధవారం సాయంత్రం అల్లు సినిమాస్ థియేటర్లో చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?) -
‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: ధురంధర్: ద రివేంజ్నటీనటులు: రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులుసంగీతం: శాశ్వత్ సచ్దేవ్సినిమాటోగ్రఫీ: వికాల్ నోవ్లఖాఎడిటర్: శివకుమార్ వి పనికర్రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్నిర్మాతలు: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్నిడివి: 229 నిమిషాలువిడుదల తేదీ: 19 మార్చి 2026గతేడాది డిసెంబరులో ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'ధురంధర్'. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటపై నిలబడి 'ధురంధర్: ద రివేంజ్'ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఒక జైలు ఖైదీని సీక్రెట్ ఏజెంట్‌గా పాకిస్తాన్‌కి పంపడం అనే కొత్త పాయింటే ధురంధర్ విజయానికి కారణం అయింది. ఇంతవరకు వచ్చిన స్పె యాక్షన్ సినిమాలకు ధురంధర్‌కు మత్య ఉన్న తేడా అదే. దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు, బీజీఎం అదిరిపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్ : ది రివెంజ్ కూడా అదే రేంజ్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్‌కి కూడా పెద్ద పీట వేశారు. పార్ట్ 1 చూసిన వాళ్లు సినిమా ప్రారంభం నుంచే ధురంధర్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. చూడనివారికి కూడా కథను చాప్టర్ల వారిగా విడగొట్టి.. అర్థమయ్యేలా తెరపై చూపించాడు దర్శకుడు. అయితే పార్ట్ 1 చూస్తేనే కొన్ని పాత్రలకు తాలుకు పవర్ తెలిసి..తర్వాత ఏం జరుగుతుందో ఊహించొచ్చు.చివరిలో వచ్చే కొన్ని ట్విస్టులను మాత్రం ఊహించలేం. అవి థ్రిల్‌కి గురి చేస్తాయి. పార్ట్1 కంటే నిడివి ఎక్కువైనా.. ఎక్కడా బోర్ కొట్టదు.హమ్జా పాత్ర ప్లాష్‌బ్యాక్‌తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్‌ను ఓ రేంజ్‌తో తీర్చిదిద్దారు. ల్యారీ పీఠం దక్కించుకునేందకు హమ్జా ఆడే మైండ్ గేమ్ అదిరిపోతుంది. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు వేసే ఎత్తులు థియేటర్స్‌లో చప్పట్లు కొట్టించేలా ఉంటాయి. 2016లో జరిగిన నోట్ల రద్ధు ఘటనను కూడా ఈ కథలో ప్రస్తావించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం అనేలా ఈ చిత్రంలో చూపించారు. అలాగే మాఫీయా డాన్ దావూద్‌ని కూడా ఈ కథకు ముడిపెట్టడం ఆసక్తిరేకెత్తించే అంశం. ఫస్టాఫ్ వరకు కాస్త స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ద్వితియార్థంలో ఏం జరుగుందా అనే ఆసక్తిని ప్రేక్షకులను కలిగించేలా ఇంటర్వెల్ కట్ చేశారు. ఇక సెకండాప్ మొత్తం కథనం పరుగులు పెడుతుంది. హమ్జాపై ఎన్సీ అస్లాం చౌదరిపై అనుమానం రావడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హమ్జా భారత ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే..సీక్రెట్ ఏజెంట్ హమ్జా పాత్రలో రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ అద్భుతంగా నటించాడు. ఎస్పీ చౌదరిగా నటించిన సంజయ్ దత్ నిడివి కాస్త తక్కువే. ఆయన పాత్ర ముగింపు బాగుంటుంది. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్‌గా మాధవన్ తెరపై కనిపించేది తక్కువే అయినా.. గుర్తిండిపోయేలా నటించాడు. జమీల్ జమాల్‌గా నటించిన రాకేశ్ బేడి నవ్వులు పూయించడంతో పాటు థ్రిల్లింగ్‌కి కూడా గురిచేశాడు. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలినవారంతా బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శాశ్వత్ సచ్దేవ్ బీజీఎం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పోరాట ఘట్టాలు వాస్తవికంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
దురంధర్-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్-2 ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్ అంటూ ఆడియన్స్ ట్వీటిర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. It's a stunning interval now✅Finally watched the Bade Saab 🔔Wait here for the complete #Dhurandhar2Review .#Dhurandhar2 #DhurandharTheRevenge . pic.twitter.com/8zk7CEhmkA— Always Bollywood (@AlwaysBollywood) March 18, 2026 BLOCKBUSTER 🔥#Dhurandhar2 #Dhurandhar2Review#DhurandharTheRevenge pic.twitter.com/j14czkhBWh— ◔‿◔ (@KhusshRaho) March 18, 2026 RANVEER SINGH 🫡Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026 #Dhurandhar2 crushing cringe Bollywood #DhurandharTheRevenge #Dhurandhar2review pic.twitter.com/Hy83od6XCR— Viral (@drviral1123) March 18, 2026 Ohhh mannnBLOCKBUSTER 1ST HALFThis is not going to stop soonThe opening sequence Jassi's back storyAnd many things Don't want to spoil it for u guyzzBut this is a Box office Tsunami#DhurandharTheRevengePremiere#Dhurandhar2Review Bgm is a hit miss because we are spoiled— Aarav jain (@sanidhya_jain18) March 18, 2026 -
'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?
స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్‌కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్‌కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్‌ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్‌లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్‌ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్లో ఏం జరగొచ్చనేది చూద్దాం.'ధురంధర్' పూర్తి స్టోరీ30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్‌తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్‌పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్‌లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్‌కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్‌లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్‌కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్‌లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్‌లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్‌లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్‌కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్‌ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్‌ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్‌కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్‌కి ఓకే చెబుతాడు.ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్‌కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్‌కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి? -
'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా
లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!)గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్ చూడనున్నారనమాట. రిలీజ్ 19నే అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్‌తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్‌తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
‘ధురంధర్’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్ కుమార్
ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్‌కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. ధురంధర్ విషయానికొస్తే.. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
'ధురంధర్-2' పవర్ఫుల్ సాంగ్ విడుదల
'ధురంధర్-2' నుంచి పవర్ఫుల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా 'ధురంధర్: ది రెవెంజ్ ఆరి ఆరి..' సాంగ్‌ను షేర్ చేశారు. శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలుస్తుంది. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్‌లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్‌లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్‌లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్‌కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్‌కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్‌కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్‌లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్‌లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్‌లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
'ధురంధర్' మేకర్స్‌కు తెలుగు ప్రేక్షకుల రిక్వెస్ట్
బాలీవుడ్ మూవీ ‘ధురంధర్: ది రెవెంజ్’ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన చిత్రం ‘ధురంధర్’. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా పార్ట్-2 రానుంది. దేశభక్తి కాన్సెప్ట్‌తో భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులను మెప్పించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మార్చి 19న విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి ఒక విన్నపం అంటూ వైరల్ అవుతుంది.ధురంధర్ -2 నిర్మాతలు తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్, సంభాషణల పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు డబ్బింగ్ పనులను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు నుంచి దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఒక స్పష్టమైన అభ్యర్థన వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియ రేంజ్లో విడుదల చేస్తున్నందున, అభిమానులు పాటలను తెలుగులోకి డబ్ చేయకుండా వాటి అసలు హిందీ వెర్షన్లోనే ఉంచమని మేకర్స్‌ను అడుగుతున్నారు.ఈ అభ్యర్థన వెనుక కారణం గతంలో అనేక డబ్ చేసిన సినిమా పాటలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అనువాదంలో విడుదలైన పాటలు బలహీనమైన మిక్సింగ్‌తో పాటు తప్పుడు అర్థాలు రావడం గమనించారు. డబ్ చేసిన వెర్షన్లలో వచ్చే పాటలు సినిమా ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా, పాటలు హిందీలోనే ఉంచాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. మూవీలో డైలాగ్‌లను మాత్రమే తెలుగులోకి డబ్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిర్మాతలు ఈ అభ్యర్థనను పరిశీలిస్తారా లేదా తెలుగు-డబ్ చేసిన పాటలతో ముందుకు వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాని ఆదిత్య, జ్యోతీదేశ్ పాండే, లోకేశ్ ధర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ వచ్చేసింది
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదట హిందీ వర్షన్ మాత్రమే మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రెవెంజ్’ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్లో యంగ్ రణ్వీర్ సింగ్‌ని జస్కిరాత్ సింగ్ రాంగీ అనే పాత్రను ట్రైలర్లో పరిచయం చేశారు. రెహమాన్ మరణం తర్వాత అక్కడి వీధుల్లో ఏర్పడిన వాతావరణాన్ని చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. -
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్‌పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్‌పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్‌టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్‌కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్‌ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్‌కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్‌పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్‌కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్‌లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్‌గా ధురంధర్ 2 ట్రైలర్) -
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్‌టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్‌మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారా టికెట్ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్‌లోని వివిధ మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్‌కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్‌కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్‌టైమ్..ధురంధర్ 2 మూవీ రన్‌టైమ్‌పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్‌తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్‌టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
మరింత వైలెంట్‌గా 'ధురంధర్ 2' ట్రైలర్
‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. -
వాయిదా రూమర్స్‌కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్‌ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'ధురంధర్' తొలి భాగం.. భారత్‌తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్‌కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) -
ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్‌టైమ్..!
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధురంధర్.. గతేడాది డిసెంబరు 5న విడుదలైన ఈ మూవీకి సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ రన్‌టైమ్ గురించి సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. పార్ట్-1కు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. ఆపై దీని రన్‌టైమ్ 3.34గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ సీక్వెల్ రన్‌టైమ్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందరిని ఆశ్చర్యపరుస్తుంది.'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్ 3.50 గంటలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, మరికొన్ని కథనాల్లో మాత్రం 3.40గంటలకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఈ మూవీ నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్-1కు మించే సీక్వెల్ రన్‌టైమ్ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సుమారు 17ఏళ్ల తర్వాత ఈ రేంజ్ నిడివితో బాలీవుడ్లో సినిమా రావడం విశేషం. 2008లో హృతిక్ రోషన్ నటించిన ‘జోథా అక్బర్’ (3.50గంటలు) రన్టైమ్తో విడుదలైంది. అయితే, నిర్మాతల నుంచి ధురంధర్ తుది రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రకారం రన్‌టైమ్ ఎక్కువగానే ఉందని సమాచారం.ధురంధర్ 2 లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి వస్తున్నారు. యామి గౌతమ్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా సమాచారం ఉంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. -
‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ధురంధర్ 2 చిత్రం కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి యామీ గౌతమ్ ధురంధర్ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్.. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్‌తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్ అన్నారు.ఇక ధురంధర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ‘ధురంధర్’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. -
ఇందులో ప్రాపగండా ఎక్కడుంది..? దురంధర్‌పై సీనియర్ నటుడు రివ్యూ
దురంధర్ మూవీతో రణ్వీర్ సింగ్ బాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఛావా, కాంతార-2 చిత్రాల వసూళ్లను అధిగమించింది. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేశారు. దీనిపై ప్రాపగండా చిత్రమని ముద్రవేశారు.తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా మాట్లాడారు. దురంధర్ ఓ మాస్టర్ పీస్ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారని కొనియాడారు. సాంకేతికత పరంగానూ ప్రేక్షకులను మెప్పించిందన్నారు. బ్యాంకాక్, థాయిలాండ్‌లో చాలా వాస్తవిక పద్ధతిలో రూపొందించారని అన్నారు. అద్భుతమైన టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి రణ్వీర్ సింగ్ అని అభివర్ణించారు. ఈ సినిమాను ఒక సంపూర్ణ కళాఖండమని అభివర్ణించారు. ఇందులో ఎలా ప్రాపగండా లేదని.. సినిమాను సినిమాగానే చూడాలని శతృఘ్న సిన్హా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ధురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ హంజా అలీ మజారి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణవీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా మెప్పించారు. ప్రస్తుతం ధురంధర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. Wow! Just happened to see the most talked about film an absolute masterpiece 'Dhurandhar'. What 'propaganda' film??? A film is a film is a film. It's a great film, gripping interesting & full of entertainment, made with sincerity. The sets too have been created beautifully in…— Shatrughan Sinha (@ShatruganSinha) February 25, 2026 -
రణవీర్‌సింగ్.. ఇది తగునా?
కాంతారా చాప్టర్–1 సినిమా గురించి మాట్లాడుతూ దేవుళ్లను కించపరిచేలా ప్రవర్తించారని ప్రముఖ బాలీవుడు నటుడు రణవీర్‌సింగ్‌పై బెంగళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా, దానిని కొట్టివేయాలని ఆయన న్యాయవాదులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారణ చేపట్టారు. రణవీర్‌సింగ్ జరిగిన పొరపాటును సరిదిద్దడానికి సిద్ధమని, క్షమాపణ కూడా చెప్పారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. జడ్జి స్పందిస్తూ, దేవత చావుండి పాత్రలో రిషబ్‌శెట్టి నటించారు. ప్రజల భక్తి భావాల గురించి రణవీర్‌సింగ్ కు తెలియకపోవచ్చు. మహిళా దెయ్యం అని మిమిక్రీ చేశారు. ఇది ప్రజల మనోభావాలకు భంగం కలిగే విషయం. రణవీర్‌సింగ్ కానీ, ఇతరులు కానీ అలా వ్యవహరించరాదు అని స్పష్టంచేశారు. కేసు విచారణకు ఆయన సహకరించాలి, అలాగే రణవీర్‌సింగ్ పై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దు అని ఆదేశిస్తూ మార్చి 2కు విచారణను వాయిదా వేశారు. -
కుర్రాడైనా ఓకే.. రొమాన్స్‌కి రెడీ అంటున్న నడివయసు హీరోయిన్లు
పెద్ద వయసు హీరోలు, పిన్న వయసు హీరోయిన్లు అనేది మన దేశ సినీ తెరపై కనిపించడం అత్యంత సర్వసాధారణ విషయం. అయితే తనకన్నా చిన్న వయసు హీరోతో పెద్ద వయసు హీరోయిన్ నటించడం, రొమాంటిక్ సీన్లను పండించడం అనేది చాలా అరుదు. హాలీవుడ్ చిత్రాల్లో బాగా పాప్యులరైన ఈ తరహా స్క్రీన్ రొమాన్స్ ఇటీవలి కాలంలో మన సినిమాల్లోనూ తరచు కనిపిస్తోంది. కనిపించినప్పుడల్లా కొంత చర్చనీయాంశంగా, వార్తాంశంగా మారుతున్నప్పటికీ నడివయసు హీరోయిన్స్ పట్టించుకోవడం లేదు.తమకన్నా 10 నుంచి– 25 ఏళ్ల వరకు తక్కువ ఉన్న వయసున్న హీరోలతో తెరపై జత కడుతున్నారు. అభిషేక్ బచ్చన్ భార్య, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కన్నా 9ఏళ్లు చిన్నవాడైన రణ్‌బీర్ కపూర్ తో ఏ దిల్ హై ముష్కిల్ అంటూ రొమాన్స్ చేసింది. అయితే ఈ సినిమా కవి హదయాన్ని ప్రేక్షకులు అర్ధం చేసుకున్నారు కానీ బచ్చన్ కుటుంబం మాత్రం దీన్ని జీర్ణించుకోవడం బహుత్ ముష్కిల్ అంటూ ఆక్షేపించిందని వార్తలు వచ్చాయి.సైఫ్ అలీఖాన్ శ్రీమతి కపూర్ వంశ వారసురాలు కరీనా కపూర్ కి అండ్ కా అనే సినిమాలో అర్జున్ కపూర్‌తో పండించిన డేరింగ్ రొమాన్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. అర్జున్ కపూర్ ఆమె కన్నా 20ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం. అలాగే బ్రదర్స్ సినిమాలోనూ తనకన్నా 10ఏళ్ల చిన్నవాడైన సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీ కట్టడం ద్వారా కరీనా అలాంటి సాహసాలకు తాను వెనుకాడేది లేదని తేల్చి చెప్పింది.టాలీవుడ్ ప్రిన్స్‌తో కలిసి వారణాసి ద్వారా టాలీవుడ్‌కి వస్తున్న ప్రియాంక చోప్రా తన కన్నా నాలుగేళ్లు చిన్నవాళ్లయిన హీరో రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ ఇద్దరితోనూ వేర్వేరు సినిమాల్లో సందడి చేసింది. ఇలా 5ఏళ్ల లోపు చిన్నవాళ్లతో నటించిన వారిలో రాణిముఖర్జీ(షాహిద్ కపూర్‌తో) శృతిహాసన్(గిరీష్ కుమార్‌తో) కొంకణా సేన్ శర్మ(రణబీర్ కపూర్‌తో)...ఇలా జాబితా ఎక్కువగానే ఉంది.వీళ్లందరూ ఒకెత్తయితే ఫిఫ్టీ ప్లస్ లో కూడా సింగిల్‌గా ఉంటూ ప్రేక్షకులను తరగని గ్లామర్‌తో కట్టిపడేస్తున్న టబు తన కన్నా వయసులో ఏకంగా పాతికేళ్లు చిన్నవాడైన ఇషాన్ ఖట్టర్‌తో రొమాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమెకు అతడు ‘ సూటబుల్ బాయ్’ అనే దర్శక నిర్మాతల అభిప్రాయం ఎలా ఉన్నా ఈ సినిమా విమర్శకుల నోళ్లకు బాగానే పనిచెప్పింది.వృద్ధ హీరోల పక్కన కుర్ర హీరోయిన్లను చూపడానికి, చూడడానికి అలవాటు పడింది దక్షిణాది చిత్ర పరిశ్రమ. ఇప్పుడిప్పుడే ఇక్కడ సమ వయస్కుడైన హీరో తో హీరోయిన్లు నటించడం వరకూ కొంచెం మార్పు కనిపిస్తోంది. ఇక తమకన్నా వయసులో బాగా చిన్నవారి పక్కన నటించడం అనేది మన సౌత్‌లో ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.పెళ్లికైనా, ప్రేమకైనా మగవాళ్ల వయసు మహిళల కన్నా ఎక్కువ ఉండాలనే సంప్రదాయం నుంచే సినిమా పాత్రలు కూడా పురుడు పోసుకున్నాయి. అయితే ప్రస్తుతం మారుతున్న సామాజిక పరిస్థితులతో పాటు సినిమా పాత్రల తీరుతెన్నులు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. మరోవైపు నడివయసులోనూ యువతులకు థీటుగా గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్లు పెరగడం కూడా దీనికి దోహదం చేస్తోంది. -
రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత
రణ్వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్'. రెండు నెలల క్రితం థియేటర్లలో కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో నెలరోజుల్లో సీక్వెల్ కూడా విడుదల చేయనున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూవీ టీమ్‌కి షాక్ తగిలింది. ముంబైలో ఇకపై షూటింగ్ చేయడానికి అనుమతి లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశముంది. ఇంతకీ అసలేమైంది?'ధురంధర్' చిత్రాన్ని తీసిన దర్శకుడు ఆదిత్య ధర్.. జియో స్టూడియోస్‌తో కలిసి నిర్మాణంలో భాగమయ్యాడు. 'బీ62 స్టూడియోస్' ఆదిత్యదే. ఈ నిర్మాణ సంస్థ పలుమార్లు నియమనిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఇకపై ముంబైలో షూటింగ్ కి అనుమతించకూడదని, ఈ మేరకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)కొన్నిరోజుల క్రితం ముంబైలోని చారిత్రక పోర్ట్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు డ్రోస్ ఎగరవేయడంతో నిర్మాణ సంస్థకు చెందిన మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా ముంబైలోని పలు వీధుల్లో షూటింగ్ జరగ్గా.. ఆ సమయంలో క్రాకర్స్, మండే పదార్థాలు ఉపయోగించారు. ఇది కండీషన్స్ ఉల్లంఘించడమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఇలా వరసగా ఉల్లంఘనలని తీవ్రంగా పరిగణించిన బీఎమ్సీ.. ఆదిత్య ధర్కి చెందిన బీ62 స్టూడియోస్‌ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రతిపాదించింది. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ.. ముంబైలో షూటింగ్ చేయడం కుదరదు.అలానే రీసెంట్ టైంలో అనుతి లేకుండా బిల్డింగ్‌లపై షూటింగ్ చేసినందుకు, అక్రమంగా జనరేటర్లు వాడినందుకుగానూ లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ని కూడా అధికారులు రద్దు చేశారు. మరి ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఏమని స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
దురంధర్ మరో రికార్డ్.. ఏకంగా 59 రోజుల పాటు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే వసూళ్లపరంగా పలు రికార్డులు బద్దలు కొట్టిన దురంధర్.. రెండు నెలలు పూర్తయినా తగ్గేలేదే అంటోంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న ఈ చిత్రం బుక్ మై షోలో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యధిక రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, స్త్రీ-2, ప్రేమలు, పుష్ప-2 సినిమాలను దాటేసింది. ఈ మూవీ అత్యధికంగా 59 రోజులు బుక్ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగింది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా సాధించని అతి పెద్ద ఘనతను దక్కించుకుంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్.. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లోనూ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బుక్ మై షోలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.కాగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్‌లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న విడుదల కానుంది.బుక్ మై షోలో ట్రెండింగ్ సినిమాలు..1. ధురంధర్- 59 రోజులు2. ఛావా -58 రోజులు3. స్ట్రీ 2 -57 రోజులు4. ప్రేమలు- 53 రోజులు5. పుష్ప 2: ది రూల్- 53 రోజులు6. మంజుమ్మెల్ బాయ్స్- 50 రోజులు7. కల్కి 2898 ఏడీ- 49 రోజులు8. జవాన్- 48 రోజులు9. లోకా చాప్టర్- 1- 46 రోజులు10. మహావతార నరసింహ- 42 రోజులు -
దురంధర్‌పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్‌పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్‌ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్ చూసి ఓ డైరెక్టర్‌గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ చిత్రంలో సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాక్‌లో ధురంధర్ సీడీలు.. ఇంత చీప్‌గా దొరుకుతున్నాయా?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ గతేడాది ధురంధర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లోనూ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. అక్కడ థియేటర్లలో రిలీజ్ అవకుండా బ్యాన్ చేసినప్పటికీ ఓటీటీలో మాత్రం తెగ చూసేస్తున్నారు.సీడీల అమ్మకంఅంతేకాదు, పాక్‌లో ధురంధర్ మూవీ పైరసీ క్యాసెట్లు కూడా అమ్ముతున్నారు. యూట్యూబర్ కార్ల్ రాక్ షేర్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరాచీలోని రెయిన్బో సెంటర్ పైరసీ కంటెంట్‌కు పెట్టింది పేరు. అక్కడ ధురంధర్ సినిమా సీడీలను 50 పాకిస్తాన్ రూపాయలకే ( భారత కరెన్సీలో రూ.16కే) అమ్ముతున్నారు. పాకిస్తాన్లో ఇండియన్ సినిమాలను నిషేధిస్తారు. కానీ ఇక్కడ నేనేం కనుగొన్నానో చూడండి అంటూ యూట్యూబర్ ధురంధర్ సీడీ చూపించాడు.అటు బ్యాన్.. ఇటు పైరసీఇది చూసిన జనాలు.. పాకిస్తాన్‌ను తిట్టే సినిమాలను అక్కడి ప్రజలే ప్రేమిస్తున్నారు.. ఇది మరీ విడ్డూరం. ఇంకా పైరసీ క్యాసెట్లు అమ్ముతున్నారంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం ఏమో ధురంధర్‌పై బ్యాన్ విధించింది. వీళ్లేమో ఎంతో సులువుగా పైరసీ చేస్తున్నారు. మరోపక్క మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ధురంధర్ విషయానికి వస్తే.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్ 2 మార్చి 19న విడుదలవుతోంది. View this post on Instagram A post shared by Karl Rock (@iamkarlrock) చదవండి: అర్జున్‌తో వివాదం.. విశ్వక్ ఏమన్నాడంటే? -
దురంధర్ హీరోకు బెదిరింపులు.. వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్..!
దురంధర్ హీరో రణ్వీర్ సింగ్‌కు బెదిరింపులొచ్చినట్లు తెలుస్తోంది. కొందరు దుండగులు వాట్సాప్ వాయిస్ చాట్ ద్వారా ఆయనను బెదిరించారు. వాట్సాప్ వాయిస్ సందేశం ద్వారా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం కాస్తా ముంబయి పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు ప్రారంభించారు.తాజా బెదిరింపుల నేపథ్యంలో ముంబయిలోని రణ్వీర్ సింగ్ ఇంటి బయట భద్రతను మరింత పెంచారు. కాగా.. ఇటీవలే ముంబయిలోని జుహులో బాలీవుడ్ చిత్రనిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల వ్యవధిలోనే స్టార్ హీరోకు బెదిరింపులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.కాగా.. ఇటీవల రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ బెదిరింపులపై రణ్వీర్ సింగ్ కానీ.. అతని టీమ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. -
అప్పుడు ‘షోలే’..ఇప్పుడు ‘ధురంధర్’.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొన్ని దశాబ్దాలుగా ‘ధురంధర్’లాంటి సినిమా వెండితెరపై రాలేదంటోంది చిత్ర నిర్మాత జ్యోతి దేశ్‌పాండే. ‘షోలే’ తర్వాత ఆ స్థాయి విజయం అందుకున్న సినిమా ఇదేనని గర్వంగా చెబుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ధురంధర్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ధురంధర్ ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఇది దర్శకనిర్మాత విజయం కాదు.. ప్రేక్షకులది. వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా విడుదలై.. విజయం అందుకున్న చిత్రాలు చాలా అరుదు. గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి సినిమాలు రాలేదు. ఈ చిత్రాన్ని ఒకటి ఎక్కువ సార్లు థియేటర్స్‌కి వచ్చి చూశారు. మౌత్ టాక్‌తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండు నెలల పాటు థియేటర్స్‌లో అలరించింది. ‘షోలే’ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిన చిత్రం ఇదే అనుకుంటా. ఈ విజయాన్ని మేం డబ్బులతో కొనలేదు. డబ్బులతో సాధించలేని విజయం ఇది’అని జ్యోతి దేశ్‌పాండే అన్నారు. ఇక సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది. కాగా, ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ధురంధర్.. డిజిటల్ స్క్రీన్‌పై కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. -
‘ధురంధర్’ ని ఎగబడి చూస్తున్న పాక్ ప్రజలు.. అక్కడ నెం. 1
ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘ధురంధర్’..ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. నెట్ఫ్లిక్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. భారతీయులు మాత్రమే కాదు పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్‌లో పాక్ ప్రజలు చూస్తున్న టాప్ 10 సినిమాల్లో దురంధర్ మొదటి స్థానంలో ఉంది.గతేడాది డిసెంబర్ 5న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 1400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. అయితే పాకిస్తాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. అయినా కూడా ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో రణ్వీర్ హీరోగా నటించగా.. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆదిత్యధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ధురంధర్ 2 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. -
దురంధర్‌కు అదే పెద్ద మైనస్.. అలా జరిగితే భారీ వసూళ్లు: అమిర్ ఖాన్
గతేడాది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన మూవీ దురంధర్. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీ గురించి స్టార్ హీరో అమిర్ ఖాన్ మాట్లాడారు. అలా జరిగి ఉంటే దురంధర్‌కు ఇంకా వసూళ్లు వచ్చేవని అన్నారు. మనదేశంలో థియేటర్ల కొరత వల్లే దురంధర్ వసూళ్లు ఇంకా తగ్గాయని వెల్లడించారు. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాలంటే దేశానికి మరిన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముందని తెలిపారు.ధురంధర్ లాంటి సినిమాకు చైనీస్ సినిమాలకు లభించినంత థియేటర్స్ ఉండి ఉంటే..మరింత భారీ వసూళ్లు సాధించి ఉండేదని అన్నారు. భారత్‌లో తగినన్ని థియేటర్స్ లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. చైనాలో ఉన్నంత మౌలిక సదుపాయాలు మన దేశంలో ఉండి ఉంటే బాగుండేదని అన్నారు.థియేటర్స్ మరింత అవసరం..ఇండియాలో మరిన్ని థియేటర్స్ నిర్మించాల్సిన అవసరముందని తాజా ఇంటర్వ్యూలో అమిర్ ఖాన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 9 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయని.. చైనాలో సుమారు లక్ష స్క్రీన్లు ఉన్నాయని తెలిపారు. అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు భారీగా బిజినెస్ జరుగుతుందదన్నారు. కేవలం చైనాలో మాత్రమే అక్కడి పెద్ద సినిమాలు బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తాయన్నారు. మనం మన స్క్రీన్ల సంఖ్య పెంచితేనే అది సాధ్యమవుతుందని అమిర్ ఖాన్ సూచించారు.గతేడాది చైనీస్ చిత్రం 'నె ఝా 2' ఆ దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ మూవీతో పోలిస్తే 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ధురంధర్.. దేశీయంగా 115 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లు) మాత్రమే రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 150 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూలు చేసిందని తెలిపారు.మరింత భారీ వసూళ్లు..మనదేశంలో కూడా మరిన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటే భారతీయ సినిమాలు గొప్ప విజయాన్ని సాధించేవని అమిర్ ఖాన్ తెలిపారు. మనదేశంలో రూ.1000 కోట్ల వసూలు చేసిన దురంధర్.. 5 వేల స్క్రీన్స్ కాకుండా.. 15,000 స్క్రీన్లలో విడుదలై ఉంటే మరింత భారీ విజయం సాధించి ఉండేదన్నారు. థియేటర్స్ సంఖ్య పెరిగినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుందని.. ఎందుకంటే ప్రస్తుతం మనదేశంలో ఒక్క స్క్రీన్ కూడా లేని జిల్లాలు చాలా ఉన్నాయని ఆమిర్ ఖాన్ అన్నారు. కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే.. గత సంవత్సరం 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత 'హ్యాపీ పటేల్', రజనీకాంత్ 'కూలీ' చిత్రాల్లో అతిథి పాత్రలలో మెరిశారు. -
'ధురంధర్' సినిమా కోసం 3 కేరవాన్స్ అడిగిన హీరో?
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ధురంధర్ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. ధురంధర్: ద రివేంజ్ మూవీ మార్చి 19న విడుదల కానుంది.మూడు కేరవాన్స్ఇదిలా ఉంటే ధురంధర్ సినిమా సెట్లో రణ్వీర్ సింగ్ ఏకంగా మూడు కేరవాన్స్ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు నిజమిదే!ధురంధర్ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో షూట్ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్ డిమాండ్ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్ కోసం రణ్వీర్ సింగ్ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు. Hamza VanHamza's staff VanHamza's Normal Van 😭😭🙏🏻#RanveerSingh what you actually do with so many vans? #Dhurandhar pic.twitter.com/yQ7oiDKvTY— Bunny (@cinephilesonly) February 1, 2026 చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్ -
ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.టాప్‌లో ట్రెండింగ్..థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌గా టాప్-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్‌లో కొనసాగడం విశేషం.కాగా.. ధురంధర్లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. Taking 22 countries by storm 🔥 Dhurandhar trends at #1 globally!#DhurandharOnNetflix pic.twitter.com/fZeVoSqqcw— Netflix India (@NetflixIndia) February 4, 2026 -
'ధురంధర్-2'లో దర్శకుడి సతీమణి..
బాలీవుడ్ సినిమా 'ధురంధర్' భారీ హిట్ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో జియో స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్ టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ధురంధర్-2లో ప్రముఖ నటి యామి గౌతమ్ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో కూడా భారీగా పాపులర్ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్‌ను నటి యామి గౌతమ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రీసెంట్గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. -
దురంధర్-2 క్రేజ్.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా?
గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.ఆ రికార్డ్స్ గల్లంతేనా?ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్‌కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది. -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్‌కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్‌లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్‌లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్‌పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్‌కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? భారత్‌పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)విలన్ రహమాన్ డకాయిట్‌ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్‌ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్‌ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'ధురంధర్-2' టీజర్ ప్రకటన వచ్చేసింది
బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, థియేటర్ వర్షన్ ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్ల మేరకు రాబట్టింది. సినిమాకు మంచి ఆదరణ రావడంతో పార్ట్-2పై దర్శకుడు ఆదిత్యధర్ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 3)న టీజర్‌ను విడుదల చేయనున్నారు. ధురంధర్ సీక్వెల్ కోసం పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధురంధర్ 2 మూవీ మ్యూజిక్ సంగీత హక్కులను సారెగామా నుండి టి-సిరీస్‌కు మార్చారు. ఇది ఈ మూవీ ఫ్రాంచైజీకి గణనీయమైన క్రేజ్‌ను తెచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కుల కోసం భూషణ్ కుమార్ భారీ ఆఫర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. ధురంధర్-2 టీజర్ ప్రకటన కూడా టి-సిరీస్ నుండి రావడం విశేషం. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తిరిగి రానున్నారు. మార్చి 19, 2026న ఒకేసారి పాన్-ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. -
కూతురు తెచ్చిన అదృష్టం.. హీరోల రేంజ్ మారిపోయింది!
ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంటారు. కానీ, ఆ పాప పుడుతూనే అదృష్టాన్ని మోసుక్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. అదెలాగంటే స్టార్ హీరోలకు పాప పుట్టాక దశ తిరిగిపోయింది. హిట్లు, సూపర్ హిట్లు కాదు ఏకంగా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ చూశారు. ఆ సంగతులు ఓసారి చూసేద్దాం..పాప తెచ్చిన సంతోషంబాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ 2023లో 'యానిమల్' మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఏకంగా రూ.917 కోట్లు రాబట్టింది. రణ్‌బీర్ కెరీర్లోనే ఇది అత్యధికం. అయితే ఈ సినిమా కంటే ముందు అతడి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 2022లో రణ్‌బీర్- ఆలియా భట్ పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా పుట్టింది. పాప పుట్టిన వేళా విశేషం.. రణ్‌బీర్‌కు బాగా కలిసొచ్చింది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో రికార్డులు తిరగరాశాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా యానిమల్ పార్క్ రాబోతోంది.అదృష్టంబాలీవుడ్లో మరో స్టార్ జోడీ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొణె. వీరిద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్లకు అంటే 2024 నవంబర్‌లో ఈ దంపతులకు కూతురు పుట్టింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా జన్మించడంతో తనకు దువా అని నామకరణం చేశారు. పాప పుట్టాక రణ్వీర్ కెరీర్‌కు కూడా మంచి బూస్ట్ లభించింది. 2025 చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కూడా సీక్వెల్ వస్తోంది. మార్చి 19న ధురంధర్ 2 విడుదల కానుంది.పెద్ది కూడా బ్లాక్‌బస్టర్!టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్‌చరణ్-ఉపాసన పెళ్లయిన పదేళ్లకు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఉపాసన కడుపుతో ఉండగానే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. RRR మూవీలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుని తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో సగర్వంగా నిలబెట్టింది. ఈసారి చరణ్‌కు కవలలు (పాప, బాబు) పుట్టారు. చరణ్ నెక్స్ట్ మూవీ పెద్ది. ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి హీరోలు ఊహించలేనంత విజయాల్ని అందుకుంటున్నారు. ఈ లెక్కన చరణ్‌కు మళ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ రావడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.చదవండి: 50 మంది సెలబ్రిటీలు.. వీరిలో కరెక్ట్ విన్నర్‌ను గెస్ చేస్తే రూ.50 లక్షలు! -
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్‌వన్‌గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.ఈ మూవీని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్‌లోనూ ఈ మూవీ నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. -
ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?
రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ధురంధర్' సినిమా.. రీసెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి తెలుగు ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి ఎలాంటి స్పందన వస్తోంది? ఎవరు ఏమంటున్నారు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)ఇప్పటివరకు స్పై థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపు ఒకే టైపులో ఉండేది. దాన్ని 'ధురంధర్' బ్రేక్ చేసింది. చాలా రియలస్టిక్‌గా, పూర్తిగా పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీయడం చాలామందికి సరికొత్త అనుభూతి కలిగించింది. రణ్వీర్ సింగ్ పోషించిన హమ్జా పాత్రనే హీరో కానీ అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర ఈ మూవీలో ప్రతిఒక్కరినీ డామినేట్ చేసింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ పాత్రలు కూడా థియేటర్లలో చూసినప్పుడు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలో సినిమా చూసిన తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి.దక్షిణాదిలో పుష్ప, కేజీఎఫ్ లాంటి మాస్ ఎలివేషన్స్ మూవీస్ చాన్నాళ్ల క్రితమే వచ్చాయి. అద్భుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. వాటితో 'ధురంధర్'ని పోల్చలేం కాకపోతే ఈ చిత్రాన్ని చాలా రియలస్టిక్ యాక్షన్‌తో తీశారు. ఎక్కడా ఓవర్ డోస్ ఫైట్స్, ఎలివేషన్స్ లాంటివి ఉండవు. డ్రామా కూడా స్టోరీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. మూడున్నర గంటల మూవీ.. దాదాపు ఎనిమిది ఛాప్టర్లుగా తీశారు. కొందరికి ఈ నిడివి వల్ల ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మరికొందరికి మాత్రం ఇందులో కొత్తగా ఏముంది? ఇలాంటి యాక్షన్ మూవీస్ ఇప్పటికే చాలా చూశాం కదా అని అంటున్నారు.(ఇదీ చదవండి: ధనుష్ నాకు అన్నలాంటోడు.. మృణాల్ ఇలా అనేసిందా?)దర్శకుడు ఆదిత్య ధర్.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై దాడి, ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి తదితర నిజజీవిత సంఘటనలని సినిమాలో భాగం చేసిన విధానం బాగుంది. కాకపోతే వీటి గురించి ఐడియా ఉంటే.. సినిమా నచ్చుతుంది. లేదంటే మాత్రం ఆ పోర్షన్స్ సరిగా అర్థం కాకపోయే అవకాశముంది. ఒకవేళ ఆ ఘటనల గురింతి తెలిస్తే మాత్రం 'ధురంధర్' మంచి కిక్ ఇస్తుంది.'ధురంధర్' తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎక్కడా కృత్రిమంగా అనిపించలేదు. పాటలు హిందీ వెర్షన్‌వి ఉంచేసి మంచి పనిచేశారు. ఒకవేళ వాటిని డబ్బింగ్ చేసుంటే మాత్రం మొత్తం ఫీల్ మారిపోయి ఉండేది. కలర్ గ్రేడింగ్ విషయంలోనూ తొలుత నెట్‌ఫ్లిక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. థియేటర్ ప్రింట్‌తో పోలిస్తే ఓటీటీలో కలర్ తేడాగా ఉందని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయం నెట్‌ఫ్లిక్స్ వరకు చేరడంతో.. మార్పులు చేసింది. కలర్ గ్రేడింగ్‌తోపాటు సౌండ్ క్వాలిటీ కూడా పెంచింది.సినిమాలో సెట్ వర్క్ చూసి చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అసలు షూటింగ్ అంతా ఎక్కడా చేశారా అని మాట్లాడుకుంటున్నారు. అయితే థాయ్‌ల్యాండ్‌లోని కొన్ని ఎకరాల్లో కరాచీలోని లయరీ ఊరిని ఉన్నది ఉన్నట్లుగా దింపేశారు. సినిమాలో యాక్టింగ్, పాటలు, యాక్షన్ సీన్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. లొకేషన్స్ కూడా అంతే ప్లస్ అయ్యాయి. ఇకపోతే 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు హిందీ మాత్రమే వచ్చింది. కానీ మార్చి 19న విడుదలయ్యే సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ) -
'ధురందర్' లాంటి హిట్ తర్వాత శంకర్ తోనా?
రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'ధురందర్'. రణ్వీర్ సింగ్ ఇమేజీని అమాంతం పెంచేసింది. ఇతడికి తొలిసారి వందల కోట్ల కలెక్షన్స్ అంటే ఏంటో చూపించింది. ఇప్పటివరకు ఓ లెక్క ఇకనుంచి ఓ లెక్క. దీంతో తర్వాత చేసే సినిమాల విషయంలో రణ్వీర్ ఆచితూచి వ్యవహరించబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. కానీ డైరెక్టర్ శంకర్ కొత్త మూవీలో ఇతడు ఓ హీరోగా నటించనున్నాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు. జెంటిల్మెన్, బాయ్స్, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో, రోబో 2, ఐ, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ తదితర సినిమాలు చేశాడు. అయితే గత రెండు మూడు మూవీస్ చూస్తే.. ఈయన ట్రాక్ రికార్డ్ ఘోరంగా మారింది. చేసిన సినిమాలు చేసినట్లు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో శంకర్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ చేస్తాడా అని అందరూ అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ)గతంలో శంకర్ మాట్లాడుతూ.. తనకు వేల్పరి అనే డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని చెప్పుకొచ్చాడు. చారిత్రక నేపథ్య కథాంశంతో దీన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఇప్పుడు దాన్ని తీయబోతున్నాడని సమాచారం వినిపిస్తోంది. ముంబైకి చెందిన పెన్ స్టూడియో సంస్థ దీన్ని నిర్మించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని, ఇందులో తమిళ హీరో చియాన్ విక్రమ్, బాలీవుడ్ నటుడు రణవీర్‌సింగ్ నటించే అవకాశం ఉన్నట్లు రూమర్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంత నిజమో చూడాలి?రణ్వీర్ సింగ్‌తో 'అపరిచితుడు'ని హిందీలో రీమేక్ చేయాలని శంకర్ గతంలో అనుకున్నాడు. ప్రకటన కూడా చేశారు. అది అది అక్కడి వరకే పరిమితమైంది. ఇప్పుడు దాన్ని తీయకపోవచ్చు. మరోవైపు 'ధురందర్'తో రణ్వీర్ ఇమేజ్ పెరగ్గా.. వరస ఫ్లాపులతో శంకర్ గుర్తింపు బాగా పడిపోయింది. మరి వీరిద్దరూ ఇప్పుడు కలిసి పనిచేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీలో తగ్గిన దురంధర్ రన్‌టైమ్.. అసలు కారణలేంటి?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఆదిత్య ధార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబ్టటిన తొలి చిత్రంగా ఘనత సాధించింది. ఈ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది.జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ల వర్షన్ కంటే ఓటీటీలో 9 నిమిషాల నిడివి తగ్గడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఓటీటీకి వచ్చే సినిమాలు దాదాపు ఇంకా సన్నివేశాలు యాడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా దురంధర్ మూవీని కట్ చేయడంపై అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకు ఆ తొమ్మిది నిమిషాలు ఎందుకు తొలగించారన్న దానిపై ఆడియన్స్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకుందాం.రన్‌టైమ్ అసలు వెర్షన్ కంటే ఎందుకు తక్కువగా ఉందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభంలో 3 గంటల 34 నిమిషాలు ఉండగా.. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, బూతులను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం అనవసరమైన సీన్స్ తొలగించి ఉంటారని భావిస్తున్నారు. ముఖ్యంగా బలూచ్ నేపథ్యంలో తెరకెక్కించిన సంజయ్ దత్ సీన్స్‌పై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలను సవరించాలని చిత్రనిర్మాతను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత కొత్త వర్షన్ జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 4, జనవరి 5 నాటి సెన్సార్ సర్టిఫికేట్ల ప్రకారం సవరించిన రన్‌టైమ్ సుమారు 209 నిమిషాలు(సుమారు 3 గంటల 29 నిమిషాలు). అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌లోని వర్షన్ సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. అంతేకాకుండా యాడ్స్ కూడా ఓటీటీలో కనిపించకపోవచ్చని.. ఇది కూడా రన్‌టైమ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. అయితే కచ్చితంగా ఏదైనా సీన్స్ తొలగించారో లేదో అధికారికంగా ప్రకటించలేదు.నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌కు ఒక సినిమాను కత్తిరించడానికి హక్కు లేదు. అయితే మేకర్స్ అనవసర సీన్స్ తొలగించినట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలు అందించిన వర్షన్ మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓటీటీలు ప్రాథమికంగా కేవలం పంపిణీదారులుగా మాత్రమే పనిచేస్తాయి. అంతే తప్ప సినిమాలో ఏవైనా మార్పులు జరిగితే అవి కేవలం నిర్మాత వైపు నుంచే జరగాలి. లేదంటే కొన్నిసార్లు ప్లాట్‌ఫారమ్ అభ్యర్థన మేరకు మార్పులు చేసే అవకాశం ఉంది. కాగా.. డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. 'ధురందర్' సీక్వెల్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. -
దురంధర్ ఓటీటీ డేట్ ఫిక్స్.. అదొక్కటే నిరాశ
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈనెల 30 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ థియేట్రికల్ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటలా 34 నిమిషాలు కాగా.. ఓటీటీలో దాదాపు 9 నిమిషాలు తగ్గించారు. ఓటీటీలో అన్‌కట్ వెర్షన్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగినా రన్‌టైమ్ తగ్గడం ఆడియన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది.కాగా.. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే ఛావా, కాంతార-2 చిత్రాలను దాటేసింది. అంతేకాకుండా తాజాగా దేశీయంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఘనత సాధించింది. It’s official! 🔒🔥Dhurandhar drops on Netflix TONIGHT! pic.twitter.com/gsAGMURqj7— Fozzy (@fozzywrites) January 29, 2026 -
దురంధర్ అరుదైన రికార్డ్.. పుష్ప-2, బాహుబలి-2 తర్వాత..!
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది.తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్-2 చిత్రాన్ని దాటేసింది. పుష్ప-2, బాహుబలి-2 సినిమాల తర్వాత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇండియాలో రూ.1002 కోట్ల వసూళ్లు సాధించింది. మనదేశంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ మూవీగా అవతరించింది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(రూ.760) పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.అరుదైన రూ.1000 కోట్ల క్లబ్రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' మూవీతో పాటు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి. ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'(రూ.1,471 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి- 2: ది కన్‌క్లూజన్ (రూ.1417 కోట్లు) రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో మూడో చిత్రంగా దురంధర్(రూ.1002) నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2(రూ.1001) కోట్లతో నాలుగో ప్లేస్ దక్కించుకుంది.కాగా.. ఈ స్పై థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇందులో రణ్వీర్ ప్రధాన పాత్రలో నటించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురందర్ -2 మార్చిలో విడుదల కానుంది.భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు1 పుష్ప 2 -రూ.1471 కోట్లు2 బాహుబలి 2- రూ.1417 కోట్లు3 ధురందర్- రూ.1002 కోట్లు4 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.1001 కోట్లు5 ఆర్ఆర్ఆర్- రూ.916 కోట్లు6 కల్కి 2898 ఏడీ- రూ.767 కోట్లు7 జవాన్- రూ.760 కోట్లు8 కాంతార చాప్టర్ 1- రూ.741 కోట్లు9 ఛావా- రూ.716 కోట్లు10 స్త్రీ 2- రూ.713 కోట్లు -
ఓటీటీకి దురంధర్.. ఆ డేట్ ఫిక్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. దాదాపు రూ.130 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈనెల 30 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్స్ వైరలవుతున్నాయి. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.అయితే ముందు నుంచే జనవరి 30 నుంచి స్ట్రీమింగ్కు రానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే దురంధర్ ఈ నెలాఖర్లోనే ఓటీటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ దురంధర్ స్ట్రీమింగ్ కానుంది. The wait ends on January 30.Experience #Dhurandar on Netflix power, performance, and presence.#RanveerSingh #OTTRelease#Dhurundhar #Netflix pic.twitter.com/jpm66gvAhL— Abhi (@Abhi1879734) January 21, 2026 -
40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. ట్రోల్స్ లెక్క చేయను
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ 'ధురంధర్' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్‌కు జంటగా నటించింది 20 ఏళ్ల సారా. దీంతో హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్. అదే నమ్ముతా..ఆమె మాట్లాడుతూ.. నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగా లేను. కాబట్టి అక్కడేం జరుగుతుందనేది నాకు పెద్దగా తెలీదు. ఈ ఏజ్ గ్యాప్ గొడవంతా సోషల్ మీడియాలోనే జరుగుతోందనుకుంటా.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిప్రాయం ఉంటుందని భావిస్తాను. ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. కాబట్టి ఏజ్ గ్యాప్ నచ్చకపోవడమనేది వారి సమస్య. అది నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు. అలాంటివి నేను లెక్క చేయను. సినిమా కథేంటో నాకు తెలుసు. ఆ కథకు అనుగుణంగానే అందరూ నడుచుకున్నారు. అంతే..కో స్టార్‌పై ప్రశంసలుఇకపోతే రణ్వీర్ సింగ్ లాంటి నటులను నేను చూడలేదు. ఎంతో అంకితభావంతో పని చేస్తాడు. సెట్లో ఉన్న అందరి గురించి పట్టించుకుంటాడు. సినిమా తీయడం అనేది దర్శకనిర్మాతల పని మాత్రమే కాదు.. సమిష్టి కృషి అని నమ్ముతాడు. సెట్ డిజైన్ దగ్గరి నుంచి అన్నింట్లోనూ పాలుపంచుకుంటాడు. అందర్నీ ఏకం చేసి ముందుకు నడిపిస్తాడు అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.సినిమాఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ సినిమా 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.చదవండి: రేణూ దేశాయ్ శాపనార్థాలు -
దురంధర్ దూకుడు.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రిలీజై 39 రోజులైనా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1300 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డును తన సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డ్‌ను ధురంధర్ తుడిచిపెట్టేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల కలెక్షన్ రాబట్టింది. అంతకుముందు బాహుబలి-2 20.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత తొమ్మిది ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.కాగా.. ఇప్పటికే ఈ మూవీ భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి ఆదిత్య ధార్ ధర్శకత్వం వహించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. -
బాలీవుడ్లో టాప్
హిందీ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. రణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శ కత్వం వహించిన సినిమా ‘ధురంధర్’. మాధవన్, సంజయ్‌దత్, అక్షయ్ఖన్నా, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్,లోకేష్ ధర్, జ్యోతిదేశ్‌పాండే నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబరు 5న థియేటర్స్‌లో విడుదలైంది. కాగా ‘ధురంధర్’ సినిమా 33 రోజుల్లో రూ.831.40 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించి, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ‘ధురంధర్’ చిత్రం రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శించబడుతోంది. ఇక ‘ధురంధర్ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. -
బాక్సాఫీస్ హిట్‌గా దురంధర్.. ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్కును దాటేసింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ మూవీ ఓటీటీ డీల్‌పై చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రానుందనే విషయంపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్‌కు కలిపి రూ.130 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో పార్ట్‌కు రూ.65 కోట్లతో ఒప్పందం చేసుకుంది.అయితే ఈ సినిమా డీల్ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఒప్పందం డబుల్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రూ.130 కోట్ల డీల్ చాలా తక్కువ అని బాలీవుడ్లో చర్చ మొదలైంది. దీంతో ఈ డీల్ విలువ రూ.275 కోట్ల వరకు చేరుకొవచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఒక హిందీ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన బిగ్ డీల్‌గా నిలవనుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన స్టార్ సినిమాలు రూ.150 కోట్లకు పైగా ఓటీటీ వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. -
‘ధురంధర్’ కి రూ. 90 కోట్ల నష్టం!
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 'ధురంధర్'(Dhurandhar)పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘మిడిల్ ఈస్ట్ మార్కెట్ యాక్షన్ సినిమాలకు చాలా ముఖ్యం. ఈ బ్యాన్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది. అయినా, డిసెంబర్ హాలిడే సీజన్లో ప్రేక్షకులు ఇతర దేశాలకు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నారు’ అని కపాడియా తెలిపారు.ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. నార్త్ అమెరికా, యూరప్ మార్కెట్లలో బాగా ఆడినా, గల్ఫ్ బ్యాన్ వల్ల మరింత వసూళ్లు రావాల్సి ఉండగా... ఆ అవకాశం చేజారిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
కొత్త డాన్ తప్పుకున్నాడా?
‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు హీరో రణ్వీర్ సింగ్. అయితే ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకుంటున్నారనే టాక్ బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ ‘డాన్ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్మెంట్ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘ధురంధర్’ సినిమా తర్వాత రణ్వీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ‘డాన్ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్ 3’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ‘డాన్’గా రణ్వీర్ సింగ్ వెండితెరపై కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), ‘డాన్ 2 (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు). కానీ ‘డాన్ 3’లో యాక్టర్‌గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్వీర్ సింగ్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్వీర్ సింగ్ కొత్త సినిమాకు ‘ప్రళయ్’ అనే టైటిల్ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. -
దురంధర్ తెలుగు వర్షన్.. రిలీజ్ కాకపోవడానికి అదే కారణమా?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్ ఆడియన్స్‌కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్‌ను సౌత్ భాషల్లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.అదే కారణమా?అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్‌లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అందుకే డబ్బింగ్ వర్షన్‌తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓటీటీలో చూడాల్సిందేనా..?ఇక సౌత్ భాషల్లో దురంధర్‌ను థియేటర్లలో చూసే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్ డబ్బింగ్ వర్షన్ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారిందా? అనేది తెలుసుకుందాం.ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్‌గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ విమర్శలు..బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్‌కు మరింత ప్లస్‌గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్‌కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది. -
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
కొన్ని సినిమాలు సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజులో ఉంటాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలూ వినిపిస్తాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అవును ఇదంతా చెబుతున్నది 'ధురంధర్' కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్లో ఏం మాట్లాడుకుంటున్నారు?'ధురంధర్'.. పదిహేను రోజుల క్రితం రిలీజైన హిందీ సినిమా. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో మూవీ ఉందని కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పీఆర్ షో దీనికి చేయలేదు. కట్ చేస్తే రిలీజైన రెండు వారాల్లో సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనూ మంచి రెస్పాన్స్, వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ తట్టుకోలేకపోయారు. హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది గానీ పాలిటిక్స్ చూపించకపోయింటే బాగుండేదని అన్నాడు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయి, జనాలకు ఇది నచ్చేస్తే ఇతడు హీరోగా ఉన్న స్పై యూనివర్స్‌ని ఇక జనాలు చూడరేమో అని భయం కావొచ్చు?హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ మూవీలో వయలెన్స్ దారుణంగా ఉందని చెప్పింది. ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అన్నట్లు మాట్లాడింది. మరి ఈమె గతంలో పలు చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లోనూ నటించింది. మరి వాటి సంగతేంటని నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు. పలువురు పేరు మోసిన హిందీ రివ్యూయర్లు కూడా ఇదేం మూవీ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో పాకిస్థాన్ని చాలా పవర్‌ఫుల్‌గా, భాయ్ భాయ్ దోస్తానా అన్నట్లు చూపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లోని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్', 'వార్', 'వార్ 2' సినిమాల్లో పాకిస్థాన్ని ఒకలా ప్రెజెంట్ చేశారు. ఉగ్రవాదులని ఒకలా చూపించారు. కానీ 'ధురంధర్' చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్‌గా అర్థమయ్యాయని చెప్పొచ్చు. దీని దెబ్బకు ఇకపై యష్ రాజ్ స్పై యూనివర్స్‌ని జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే రాబోయే రోజుల్లో 'ధురంధర్' ఆ రేంజ్ ఎఫెక్ట్ చూపించబోతుంది.బాలీవుడ్లో గతంలోనూ నెపోటిజం ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో మాత్రం అది పీక్స్‌కి చేరింది. సదరు స్టార్ హీరో లేదా హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏ మేరకు ఆడుతున్నాయనేది అందరికీ తెలుసు. అయినా సరే వీళ్లు మాత్రమే స్టార్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో వాటికి చెక్ పడటం గ్యారంటీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రణ్వీర్ సింగ్, సంజయ్ దత్తో పాటు చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ మెరిశారు. ఇందులో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నది కూడా యాక్టింగేనా అనిపించక మానదు.'ధురంధర్' సినిమాలో ఒక్కసారి కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. కేవలం దాయాది దేశంలోని ఓ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది అని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అలా అని దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో పెద్ద పెద్ద మెసేజులు ఇవ్వలేదు. ఇది పరిస్థితి అని చూపించాడు. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అన్నట్లు వదిలేశాడు.దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా 'ధురంధర్'ని ప్రశంసిస్తూ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ప్రస్తుత దర్శకులు ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నాడు. కొన్నాళ్ల ముందు కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్లో 'కబీర్ సింగ్' తీసినప్పుడు ఇలానే చాలామంది చాలా విమర్శలు చేశారు. 'యానిమల్' రిలీజ్ టైంలోనూ ఇదే రిపీటైంది. కానీ వాళ్లందరికీ సందీప్.. తన సినిమాతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు కూడా ఆదిత్య అలాంటి పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ పునాదులు కదిలించే ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే బాలీవుడ్‌కి ఇదో ప్రమాద హెచ్చరిక లాంటిది! -
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దక్షిణాదిలోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. చూసిన చాలామందికి ఇది నచ్చేస్తోంది. మరికొందరు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. ఈ క్రమంలోనే 'ధురంధర్' డిజిటల్ డీల్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. రాబోయే మార్చి 19న అది థియేటర్లో ఇది విడుదల కానుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు)అసలు విషయానికొస్తే.. 'ధురంధర్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే రూ.130 కోట్లకు ఈ డీల్ జరిగిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ రాగా.. ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్లతో ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఏదేమైనా ఏదో ఒకలా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది.'ధురంధర్' స్ట్రీమింగ్ విషయానికొస్తే థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే వచ్చే జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఉందని మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతవరకు ఈ విషయంపై క్లారిటీ అయితే రాలేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
దురంధర్ క్రేజ్.. మూవీని వీక్షించిన టీమిండియా
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీని టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్ మాల్లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్ దురంధర్‌ను వీక్షించింది.ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Subodh Rambir Singh (@bollyfreaksofficial) -
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్ పేరు రాసుకోండి..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.సైయారాను దాటేసిన దురంధర్..డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలా దురంధర్ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.అందుకే బజ్..పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్వీర్ సింగ్ మూవీ రావడం కూడా దురంధర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్‌తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్ల రికార్డులను తుడిచిపెట్టేసింది.ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌గా మార్చి 12, 2026న విడుదల కానుంది. -
'ధురంధర్' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్‌లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్‌లో ఓ హై పొజిషన్లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్వీర్ సింగ్) పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్‌తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్‌ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్‌గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్వీర్).. సీక్వెల్లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్నపాటి ట్రైలర్‌లా చూపించారు. తద్వారా సీక్వెల్‌పై ఆసక్తి పెంచారు.ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ) -
కాంతారపై రణ్వీర్ సింగ్ కామెంట్స్.. రిషబ్ శెట్టి రియాక్షన్..!
కాంతార వివాదంపై హీరో రిషబ్ శెట్టి స్పందించారు. రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ తనకు అసౌకర్యంగా అనిపించాయని అన్నారు. చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రతిష్టాత్మక వేదికలపై దేవతలను ప్రస్తావిస్తూ మిమిక్రీ చేయకూడదని సూచించారు. కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు గౌరవప్రదంగా చిత్రీకరించామని తెలిపారు.రిషబ్ మాట్లాడుతూ, 'కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒక చిత్రనిర్మాతగా నేను ప్రతిదీ గౌరవప్రదంగా చిత్రీకరించాలి. వాటిని నిర్ధారించుకోవడానికి చాలా మంది పెద్దల మార్గదర్శకత్వం తీసుకున్నా. దేవతలపై మిమిక్రీ చేయడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సినిమాలో చాలా భాగం సినిమాటిక్, నటనకు సంబంధించింది. అయినా కూడా దైవం అనేది సున్నితమైన అంశం. ఎక్కడికి వెళ్లినా, వేదికలపై దేవతలను అపహాస్యం చేయవద్దని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది భావోద్వేగాలతో ముడిపడిన విషయం' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలోని పంజర్లీ దేవతను ఉద్దేశించి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ఆగ్రహానికి దారితీసింది. గోవాలో జరిగిన ఇఫ్ఫీ వేడుకలో రణవీర్ సింగ్ పంజర్లీ దేవతను ఇమిటేట్ చేశారు. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరారు. తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. రిషబ్ శెట్టి నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశమని అని అన్నారు. కాగా.. ఈ ఏడాది కాంతార: చాప్టర్ 1 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న దురంధర్.. రణ్వీర్ సింగ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ.364.60 కోట్లు సాధించింది. రెండో ఆదివారం ఇండియాలో ఏకంగా రూ.58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక హిందీ చిత్రానికి వచ్చిన రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ మూవీపై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రణ్వీర్ సింగ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 2025లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన ఇండియన్ చిత్రాల జాబితాలో ధురంధర్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మూవీ కంటే ముందు కాంతార: చాప్టర్ 1 ఛావా, సైయారా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే దురంధర్ స్థానం మరింత మెరుగయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.దురంధర్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.430.20 కోట్లుగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండో వీకెండ్లో శుక్రవారం రూ34.70 కోట్లు, శనివారం రూ.53.70 కోట్లు, ఆదివారం రూ.58.20 వసూళ్లతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దీంతో బాలీవుడ్ సినీ చరిత్రలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో సాగే రహస్య గూఢచార కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడంతో అరబ్ దేశాల్లో దురంధర్‌పై నిషేధం విధించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.The story of The Unknown Men is now known globally.Book your tickets. 🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Ruling Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/zvxEJqbrvv— Jio Studios (@jiostudios) December 15, 2025 -
బాక్సాఫీస్ వద్ద దురంధర్.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!
డిసెంబర్ తొలివారంలో రిలీజైన బిగ్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధర్ తెరకెక్కించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్స్ కూడా కలిపితే రూ.300 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే మొదటి వారం కలెక్షన్స్ పెరగడం ఏ సినిమాకైనా సాధ్యమే. కానీ రెండో వారంలోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దురంధర్ దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రెండో వారంలో ఈ మూవీ ఓ క్రేజీ రికార్డ్‌ను అందుకుంది. రెండో శుక్రవారం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ రోజు పుష్ప-2, ఛావా, యానిమల్ లాంటి బిగ్ హిట్స్ వసూళ్లను అధిగమించింది. హిందీలో ఈ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఫ్రైడే ఒక్క రోజే ఈ మూవీ రూ.34.7 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ లిస్ట్‌లో పుష్ప-2 రూ.27.50 కోట్లు, ఛావా రూ.24.03 కోట్లు, యానిమల్ రూ.23.53 కోట్లు, గదర్-2 రూ.20.50 కోట్లు, బాహుబలి2 రూ.19.75 కోట్లు సాధించాయి. తాజాగా ఈ రికార్డులను రణ్వీర్ సింగ్ దురంధర తుడిచిపెట్టేసింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడంతో దురంధర్ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే దురంధర్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. HISTORIC... 'DHURANDHAR' OVERTAKES 'PUSHPA 2', 'CHHAAVA', 'ANIMAL' ON *SECOND FRIDAY*... #Dhurandhar is rewriting the record books 🔥🔥🔥.First, take a look at the *second Friday* numbers...⭐️ #Pushpa2 #Hindi: ₹ 27.50 cr⭐️ #Chhaava: ₹ 24.03 cr⭐️ #Animal: ₹ 23.53 cr⭐️… pic.twitter.com/AYRjQia5sF— taran adarsh (@taran_adarsh) December 13, 2025 -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్ రివ్యూ..!
రణ్వీర్ సింగ్ దురంధర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్ ట్రాక్‌తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ తన టాలెంట్‌తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.బన్నీ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్‌ట్రాక్‌లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది. Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025 -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఆ దేశాల్లో బ్యాన్..!
రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇందులో పాకిస్తాన్‌ను నెగెటివ్‌గా చూపించారంటూ అరబ్ దేశాలు దురంధర్‌పై నిషేధం విధించాయి. ఈ మూవీని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యూఏఈ బ్యాన్ చేశాయి. దీంతో ఆయా దేశాల్లో దురంధర్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో పాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయనే అరబ్ దేశాలు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్ దేశాల్లోని థియేటర్లలో దురంధర్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కొన్నిచోట్ల అసలు అనుమతులు కూడా రాలేదు. దీంతో చివరికీ కొన్ని థియేటర్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.200 కోట్ల దిశగా దురంధర్ దూసుకెళ్తోంది. -
కాంతారపై రణ్వీర్ సింగ్ కాంట్రవర్సీ.. స్పందించిన సీనియర్ హీరో భార్య..!
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇటీవల కాంతార మూవీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకల్లో కాంతార సీన్‌ను ఇమిటేట్ చేశాడు. అదే కాంతార ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. తమ దైవాన్ని కించపరిచేలా మాట్లాడారని.. క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.ఈ వివాదం కాస్తా మరింత ముదరడంతో రణ్వీర్ సింగ్ క్షమాపణలు కోరాడు. రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశమని వివరణ ఇచ్చాడు. తాజాగా ఈ వివాదంపై సీనియర్ హీరో గోవిందా సునీతా అహుజా స్పందించారు. ఈ విషయంలో రణ్వీర్ సింగ్‌కు ఎలాంటి చెడు ఉద్దేశం ఉండకపోవచ్చని అన్నారు. కానీ దక్షిణాది ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు.. అందుకే వారికి అది నచ్చలేదని సునీతా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా... రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.అసలేం జరిగిందంటే..ఈవెంట్లో స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.కాంతార మూవీ..రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. -
పాకిస్తాన్లో అలాంటివేవి లేవు.. ‘దురంధర్’పై హిలేరియస్ రివ్యూ
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించిన సినిమా ‘దురంధర్’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్‌లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్ టాక్ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్ పాటకు అక్షయ్ ఖన్నా చేసిన డ్యాన్స్‌పై మాత్రం ఇంటర్నెట్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ రివ్యూ చేశాడు. దురంధర్ సినిమా చూసిన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...‘‘అయ్యా... దురంధర్ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్‌లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్వీర్ సింగ్ ఓ మోటర్ సైకిల్ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె్లండర్ బైక్‌నే సూపర్ బైక్ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు. కరాచీలో అండర్‌పాస్ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్‌పాస్‌లు అన్నీ భారత్ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్‌లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్ ఇక్బాల్, రెహ్మాన్ డెకాయిట్, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి. View this post on Instagram A post shared by Sanchit Pulani (@sanchitpulani) -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ నటించారు. ఈ చిత్రం పార్ట్-2 మార్చి 19, 2026న విడుదల కానుంది. -
దురంధర్ బాక్సాఫీస్.. అంచనాలను మించిపోయిన వసూళ్లు..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘దురంధర్’.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్ తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్‌కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్‌ని రాబట్టి.. హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్వీర్ సింగ్ ఖాతాలో హిట్ పడిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. వీకెండ్‌లోగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. -
రణవీర్ సింగ్ ‘దురంధర్’ మూవీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5)ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ డిసెంబర్ 4న తేది రాత్రే పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దురంధర్ ఎలా ఉంది? రణ్వీర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్‌లో దురంధర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని, రణ్వీర్ వన్‌మ్యాన్ షో అంటూ అని పలువురు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.Dhurandhar is a decent patriotic actiondrama with solid thrills. Ranveer Singh impresses as Major Mohit, and the action + BGM work well. Story familiar hai, par presentation engaging banati hai.⭐️⭐️⭐️/5 — Massy,emotional & good one-time watch.#Dhurandhar #DhurandharReview pic.twitter.com/RkGCCeOIur— Critixpro (@CritixPro999) December 5, 2025‘దురంధర్’ దేశభక్తిని రేకెత్తించే డీసెండ్ యాక్షన్ డ్రామా. అద్భుతమైన థ్రిల్లింగ్స్ అంశాలు ఉన్నాయి. మేజర్ మోహిత్ పాత్రలో రణవీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. పోరాట ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తెలిసిన కథే అయినా కథనం ఎంగేజింగ్‌గా ఉంటుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. What a magnificent first half!🔥 Aditya Dhar has cooked with the intense scenes,Akshay Khanna is out of the box,R Madhavan delivers his best,trust me there are hardly action sequences in first half,still Dhar has managed to keep gripping screenplay just with convos #Dhurandhar https://t.co/6rfOSlsX7p pic.twitter.com/s0REydeUQp— Shahid (@CinephileScribe) December 5, 2025 ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఆదిత్య ధార్ కొన్నీ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్షయ్ ఖన్నా, మాధవన్ కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆదిత్య ధార్ కేవలం డైలాగ్స్‌తోనే స్క్రీన్ ప్లేను అసక్తికరంగా మార్చాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Dhurandhar Interval: It was good, not Great, but theek hai 1st half Takes time to buildup & film lengthy feel hoti hai Bcoz of The film has been presented till now but let's see hoping for the better 2nd half 🫡I have fate in Aditya Dhar Hoping for the Best!🫡 pic.twitter.com/UmbzoQ7u5B— DEV KA REVIEW (@DEVKAREVIEW3180) December 5, 2025#Dhurandhar It’s INTERVAL🔥Mass Cinema + Solid Content = Mr.DHARPure Cinema Peaks Here @AdityaDharFilms Stay Away From Social Media Freaks, Book Seats & Enjoy Gripping Spy Thriller🇮🇳Stay Tuned For Full Review….#RanveerSingh @yamigautam #Madhvan— Bollywood Legacy Channel (@LegacyChannel_) December 5, 2025 -
కజిన్ వెడ్డింగ్‌లో మెరిసిన దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ దంపతులు (ఫొటోలు)
-
కాంతార కాంట్రవర్సీకి చెక్.. సారీ చెప్పిన రణవీర్ సింగ్
-
'కాంతార'పై కామెడీ.. క్షమాపణ చెప్పిన స్టార్ హీరో
రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1' సినిమా హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. దానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్. ఎందుకంటే 'కాంతార'లో పంజుర్లీ దేవతకు సంబంధించిన విషయాన్ని చూపించారు. దీన్ని రణ్వీర్ కామెడీ చేసేలా ప్రవర్తించడం విపరీతమైన విమర్శలకు దారితీసింది.ఏం జరిగిందంటే?కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పంజుర్లీ దేవతని ఆరాధిస్తుంటారు. 'కాంతార 1' రిలీజ్ టైంలోనే కొందరు సదరు దేవత తరహా వేషాలు వేసుకుని వచ్చారు. దీనిపై హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మూవీని గౌరవంగా చూడాలని, దేవుళ్లను అవమానించేలా ప్రవర్తించకూడదని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడేమో గోవా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్వీర్.. పంజుర్లీ దేవతని అవమానించేలా కామెడీ చేశాడు.(ఇదీ చదవండి: పక్క ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదు.. పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?)ఈ కార్యక్రమానికి రిషభ్ శెట్టి హజరవగా.. స్టేజీపై రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'రిషబ్.. నేను థియేటర్లో కాంతార: చాప్టర్ 1 సినిమా చూశాను. మీ నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆడ దెయ్యం (చాముండీ) మీకు ఆవహించే సీన్లో మీ నటన అద్భుతంగా ఉంది' అని ప్రశంసించాడు. అయితే సినిమాలో బాగా పాపులర్ అయిన 'ఓ..' అనే హావభావాన్ని చేసి చూపించాడు. ఇది సీరియస్‌గా ఉండాల్సింది పోయి కామెడీగా అనిపించింది. దీంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. నిన్నంతా సోషల్ మీడియాలో ఓ రేంజులో రణ్‌వీర్‌ని విమర్శించారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు.'సినిమాలో రిషభ్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఆ సీన్లో ఎలా చేశాడనేది చూపించాలనుకున్నాను. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నేను ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను' అని రణ్వీర్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇక్కడ విశేషం ఏంటంటే రణ్వీర్.. కర్ణాటకకు అల్లుడే. ఇతడు పెళ్లి చేసుకున్న దీపికది ఆ రాష్ట్రమే. కానీ ఇప్పుడు వాళ్ల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.(ఇదీ చదవండి: నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?)Ranveer Singh literally mocking Daiva Chavundi possession in Kantara.How low these movie stars can go for fame, money with zero respect for sacred Tulunad Daivaradhane beliefs🥺Shame.Rishabh is enjoying that mimic?@RanveerOfficial @shetty_rishab pic.twitter.com/F4x0X2rVmA— Vije (@vijeshetty) November 29, 2025 -
దేవతను దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ హీరో
ఎంతో అట్టహాసంగా కొనసాగిన ఇఫీ (అంతర్జాతీయ చలనచిత్రోత్సవ) వేడుకలు శుక్రవారం (నవంబర్ 28న) విజయవంతంగా ముగిశాయి. గోవాలో ఈ ముగింపు వేడుకకు కాంతార హీరో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సైతం హాజరయ్యాడు. కానీ అత్యుత్సాహంతో రణ్వీర్ చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?స్టేజీపై రణ్వీర్ మాట్లాడుతూ.. నేను కాంతార: చాప్టర్ 1 థియేటర్లో చూశాను. రిషబ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఆడ దెయ్యం అతడి శరీరంలో ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశం అయితే అమేజింగ్ అంటూ ఆ సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే తనను కాంతార 3లో చూడాలనుకుంటే రిషబ్‌ను మీరే ఒప్పించండి అని ప్రేక్షకులను కోరాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక నటుడిగా స్టేజీపై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేది కూడా తెలీదా? దైవాన్ని పట్టుకుని దెయ్యం అంటాడేంటి? దేవతను కించరిచే హక్కు ఈయనకెక్కడిది? అని మండిపడుతున్నారు.కాంతార విశేషాలురిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. #RanveerSingh literally called chavundi mata a ghost and mimicked her in funny way Isn't this Blasphemy pic.twitter.com/iJ1bAjRCLs— Tyler Burbun (@BurbunPitt) November 29, 2025 చదవండి: ప్రకాశ్ రాజ్ భార్యగా ఛాన్స్.. ఐదుగురితో కాంప్రమైజ్ అడిగారు -
ఇఫీ ముగింపు వేడుకల్లో రజనీ, రిషబ్ శెట్టి సందడి (ఫొటోలు)
-
'గ్లోబల్ పీస్ ఆనర్స్ 2025'ఈవెంట్ లో నీతా అంబానీ (ఫొటోలు)
-
ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్
గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కి సరైన హిట్ పడట్లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే 'ఉరి' మూవీ తీసిన ఆదిత్య ధర్‌తో కలిసి ఓ మూవీ చేశాడు. అదే 'ధురంధర్'. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)4 నిమిషాలకు పైగానే ఉన్న ట్రైలర్ చూడటానికి బాగుంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు జలదరించే కొన్ని సీన్స్‌తో నింపేశారు. రణ్వీర్ సింగ్ హీరో కాగా ఇతడికి జోడీగా సారా అర్జున్ నటించింది. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈసారైనా రణ్వీర్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత) -
దీపికా పదుకోన్ దివాలీ సర్ప్రైజ్.. మహారాణిలా బుజ్జి ‘డింపుల్ క్వీన్’ (ఫొటోలు)
-
యాడ్ కోసం రూ. 100 కోట్లు.. అట్లీ, శ్రీలీల కాంబినేషన్ (వీడియో)
సెలబ్రిటీలు వ్యాపార ప్రకటనలు చేయడం సహజం. అయితే, దాని బడ్జెట్ అనేది హీరో రేంజ్‌ను బట్టి ఉంటుంది. కానీ, బాలీవుడ్లో ఒక యాడ్ కోసం ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారని తెలుస్తోంది. చింగ్స్ దేశీ చైనీస్ (Ching’s Desi Chinese) అనే కంపెనీ ఈ యాడ్ కోసం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్‌ను రంగంలోకి దించింది. ఈ వాణిజ్య ప్రకటనను దర్శకుడు అట్లీ తెరకెక్కించారు.ఈ యాడ్‌లో రణ్వీర్ సింగ్ ఏజెంట్ చింగ్‌గా కనిపిస్తే.. శ్రీలీల ఏజెంట్ మిర్చిగా మెరిసింది. విలన్‌గా బాబీ డియోల్ ప్రోఫెసర్ వైట్ నాయిస్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ప్రోమో విడుదల చేశారు. పూర్తి వీడియోను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. రణ్వీర్ సింగ్ గతంలో కూడా చింగ్స్ దేశీ చైనీస్ కోసం యాడ్స్ చేశారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆయన పనిచేశారు. అందులో తమన్నా భాటియాతో కలిసి ఓ ఇన్స్టంట్ నూడుల్స్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్ కోసం స్టార్ యాక్టర్స్ నటించడంతో రెమ్యునరేషన్ భారీగా తీసుకున్నట్లు సమాచారం. అందుకే బడ్జెట్ కూడా పెరిగిపోయిందని ఇండస్ట్రీలో టాక్. -
రణ్వీర్ సింగ్ విలన్‌గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరోయిన్ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్‌కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్‌కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్‌ను విలన్‌గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్‌తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. -
భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ గణేష్ చతుర్థి (ఆగస్టు 27న)ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ జంట అంబానీ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దురంధర్ నటుడు రణవీర్ న్యూలుక్ వైరల్‌గా మారింది. పాప పుట్టిన తరువాత పబ్లిక్ అప్పియరన్స్‌కు దూరంగా ఉన్న వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. పల్లవ్ పల్లీవాల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న వీరి వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.గోల్డ్ అండ్‌గ్రీన్ దుస్తుల్లో దీపికా ,రణ్వీర్ సింగ్ మెరిసారు. ముఖ్యంగా ధురంధర్ షూటింగ్ ప్రారంభించిన నెలల తర్వాత వచ్చిన క్లీన్-షేవ్ లుక్ నెటిజన్లు ఆకర్షిస్తోంది. పొడవాటి జుట్టు, గడ్డాన్ని తొలగించి కనిపించాడు. ఈ దంపతులు ముంబైలోని వరసిద్ధి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తారు. గర్భంతో ఉన్నపుడు దీపికా ఈ గణపతిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.దీపికా పదుకొనే- రణ్వీర్ సింగ్ గత ఏడాది సెప్టెంబర్ 8న తమ తొలి సంతానం దువాకు జన్మనిచ్చారు. దువాకు మరికొన్ని రోజుల్లో సంవత్సరం నిండనుంది. తమ కుమార్తెను ప్రజల దృష్టి నుండిదూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఫోటోలను తీయవద్దని కూడా అభ్యర్థించారు కూడా. మరి దువా ఫస్ట్ బర్త్‌డే వేడుకలు ఘనంగా ఉండబోతున్నాయా?ఈ సందర్భంగా నైనా పాపను చూపిస్తారా? అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉందైంది. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal)కాగా రణ్వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్ సినిమా హాళ్లలో సందడి చేయనుంది. ఇటీవల డిజిటల్‌గా లాంచ్ అయిన 2 నిమిషాల 42-సెకన్ల కట్, రేపు సినిమాల్లో విడుదలయ్యే పరమ సుందరికి జతచేయబడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 5 డిసెంబర్ 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. -
సీక్రెట్‌గా వీడియో షూట్.. కోపంతో ఊగిపోయిన దీపికా పదుకొణె
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు.. సెల్ఫీలంటూ ఎగబడిపోతుంటారు. వారు హడావుడిలో ఉన్నా, వద్దని చెప్తున్నా వినిపించుకోరు. కొందరైతే స్టార్స్‌కు తెలియకుండా వారిని ఫాలో చేసి సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) విషయంలో ఇప్పుడదే జరిగింది. కూతురు దువాతో కలిసి బయటకు వెళ్లిన దీపికను ఓ అభిమాని ఫాలో అయ్యాడు. దీపికా అసహనంముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో వాళ్లను సీక్రెట్‌గా కెమెరాలో చిత్రీకరించాడు. ఇది దీపికా కంట పడటంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఇలా చేయడం తప్పని మందలించింది. వీడియో డిలీట్ చేయమని కోరింది. ఇప్పటివరకు దీపికా జంట.. కూతురి ముఖాన్ని ఎక్కడా చూపించలేదు. పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్స్) కూడా స్టార్స్ విన్నపం మేరకు దువా ఫోటోలను క్లిక్ చేయకుండా సహకరించారు.మందలించినా వినకుండా..దీపికా-రణ్వీర్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే సదరు అభిమాని మాత్రం ఇలా వీడియో తీయడం.. అది వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పేరెంట్స్ అనుమతి లేకుండా దువా ఫేస్‌ను రివీల్ చేశాడని ఆగ్రహిస్తున్నారు. ఆమె వద్దని చెప్పినా వినకుండా వీడియో పోస్ట్ చేయడం తప్పని మందలించారు. ఆన్లైన్లో కూతురి ఫోటో ప్రత్యక్షం కావడంపై దీపికా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.దువాకాగా దీపికా, రణ్వీర్ 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గతేడాది సెప్టెంబర్ 8న కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన పాపాయికి దువా అని నామకరణం చేశారు. దువా అంటే ప్రార్థన అని అర్థం. సినిమాల విషయానికి వస్తే.. రణ్వీర్.. ధురంధర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది. అలాగే డాన్ 3 సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు. దీపికా.. అల్లు అర్జున్- అట్లీ మూవీలో నటించనుంది. deepika herself requested not to click or post pictures or videos of dua yet people are still doing it please out of basic respect and privacy stop this behaviour— 🎀 (@mecoreeee) August 23, 2025baby dua is the cutest omggg 😭😭😭🤍🤍🤍🤍 i won't share the vid, dp is clearly bothered by whoever filmed it. it their choice to protect their daughter's privacy until they feel like sharing it with us. BUT BABYGIRL IS JUST TOO ADORABLE 🥹🫶🏼 bless her 🤍— srkdp (@srkdeepikaholic) August 23, 2025DELETE THE VIDEO, STOP SHARING AND SPREADING IT. It’s a breach of privacy, Deepika was asking the person to stop recording. They didn’t consent to Dua being clicked or recorded.— nikita💫 (@nikita1372) August 23, 2025 చదవండి: సిద్దిపేట మోడల్‌కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష! -
స్టార్ హీరో సినిమా.. ఆసుపత్రి పాలైన 100 మంది
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) నటిస్తున్న చిత్రం 'ధురంధర్'.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లడఖ్ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి సుమారు 100 మందకి పైగా ఆసుపత్రిపాలయ్యారు. వారందరూ లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.లడఖ్‌లోని లేహ్ జిల్లాలో కొద్దిరోజులుగా ధురంధర్ సినిమా షూటింగ్ జరుగుతుంది. సెట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అకస్మాత్తుగా సెట్లోని చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది. వారిని లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించిన వైద్యులు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేసుగా గుర్తించారు. సినిమా సెట్స్‌లో దాదాపు 600 మంది భోజనం చేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్’ సినిమాలో రణ్వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పా.. ప్రియాంక చోప్రా
‘రామ్-లీలా’ సినిమాలో ప్రియాంక చోప్రా ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రామ్ చాహే లీలా’ అంటూ సాగే ఆ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్లిప్‌ని షేర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది.‘ఈ ప్రత్యేక పాట కోసం దర్శకుడు సంజయ్ లీలా నన్ను సంప్రదించినప్పుడు ‘నేను చేయగలనా’ అనుకున్నాను. కష్టంగానే ఆ పాటకు ఓకే చెప్పాను. సెట్లో దర్శకుడు నాకు బాగా ధైర్యం చెప్పాడు. పాటలోని ప్రతి పదానికి అర్థం వివరిస్తూ..హావభావాల దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకూ సలహాలిచ్చారు. కొరియోగ్రాఫర్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. లంచ్ బ్రేక్ టైంలో కూడా డ్యాన్స్ మూమెంట్స్ గురించి వివరించేవాడు. కష్టంగా ఒకే చెప్పినా..నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ గుర్తుంటాయి’ అని ప్రియాంక ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.రామ్-లీలా సినిమా విషయానికొస్తే.. 2013లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రణ్వీర్-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వం వహించాడు. గ్యాంగ్‌స్టర్ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రేమికుల చుట్టు తిరిగే కథ ఇది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ఆజ్ కీ రాత్ రీమిక్స్‌లో..?
షారుక్ ఖాన్‌తో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ సినిమాలను తెరకెక్కించి, హిట్స్ అందుకున్నారు దర్శకుడు ఫర్హాన్ అక్తర్. తాజాగా ఫర్హాన్ డైరెక్షన్లోనే ‘డాన్ 3’ రానుంది. అయితే ‘డాన్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా చేయడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. హీరోయిన్గా కియారా అద్వానీని ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాలేదు. కాగా ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చారు కియారా. దీంతో కియారా సెట్స్‌కు రావడం కుదరదని, ఆమె ప్లేస్‌లో మేకర్స్ కృతీ సనన్‌ను హీరోయిన్గా తీసుకున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.ఓ దశలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ప్రియాంకా చోప్రా ‘డాన్ 3’లోనూ నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కాగా ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రణ్వీర్ సింగ్. డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీంతో ముందుగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు రణ్వీర్.ఆ విధంగా ‘డాన్ 3’ చిత్రీకరణ వాయిదా పడింది. జనవరిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారు మేకర్స్. ఎలాగూ ‘డాన్ 3’ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ముందుగా ప్రకటించినట్లుగానే హీరోయిన్గా కియారా అద్వానీనే నటింపజేయాలనుకుంటున్నారట. ఇక ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ పాట ఉన్న విషయం తెలిసిందే. ఈ పాపులర్ సాంగ్‌ను ‘డాన్ 3’లో రీమిక్స్ చేసి, ఈ స్పెషల్ సాంగ్‌లో కృతీ సనన్‌తో డ్యాన్స్ చేయిస్తే బాగుంటుందని, ఈ సాంగ్‌లో ప్రియాంకా చోప్రా గెస్ట్‌గా కనిపిస్తే బాగుంటుందని ఫర్హాన్ భావిస్తున్నారట. ఆ దిశగా కృతీతో చర్చలు జరుపుతోందట ‘డాన్ 3’ టీమ్. మరి... ‘ఆజ్ కీ రాత్’ సాంగ్‌లో రణ్వీర్తో కలిసి కృతీ సనన్ స్టెప్పులేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ‘డాన్, డాన్ 2’ చిత్రాలకు సంగీతం అందించిన శంకర్–ఇషాన్–లాయ్ త్రయమే ‘డాన్ 3’కీ సంగీతం అందించనున్నారు. -
బర్త్ డే గిఫ్ట్.. లగ్జరీ కారు కొన్న రణ్వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధురంధర్ అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే జూలై 6న రణ్వీర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో రణ్వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తోన్న డాన్ -3లో నటించనున్నారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే తాజాగా మన స్టార్ హీరో ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినీ తారలు ఇలాంటి లగ్జరీ కార్లు కొనడం సాధారణమే అయినప్పటికీ దీని విలువ దాదాపు రూ.4.57 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. సరికొత్త హై ఎండ్ ఈవీని రణ్వీర్ సింగ్ తన గ్యారేజీకి మరో కారును తీసుకొచ్చారు. ఈ విలాసవంతమైన కారును తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న కొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తకారులో తన సతీమణి దీపికా పదుకొణెతో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
వాస్తవ కథను వెలికి తీద్దాం
‘‘ఒక భారీ అగ్ని ఎగిసే క్షణం ఆసన్నమైంది... కొందరు అపరిచితుల గురించి తెలియని వాస్తవ కథను వెలికి తీద్దాం’’ అంటూ హిందీ చిత్రం ‘ధురంధర్’లోని తన పోస్టర్ని, టీజర్‌ని షేర్ చేశారు హీరో రణ్వీర్ సింగ్. ఆదివారం (జూలై 6) రణ్వీర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్‌ని విడుదల చేసి, ఈ సినిమాని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్లో రణ్వీర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు.థ్రిల్, వయొలెన్స్, మిస్టరీలతో ఈ టీజర్ సాగుతుంది, ‘ధురంధర్’లో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రామ్‌పాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (2019)తో జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని భారత నిఘా, శాంతి భద్రతల మాజీ అధికారి, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో బీ62 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిత్రదర్శకుడు ఆదిత్య ధర్ ఓ నిర్మాత కాగా, జ్యోతీ దేశ్‌పాండే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్ (Dhurandhar Movie). సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. నేడు (జూలై 6) రణ్వీర్ బర్త్‌డే సందర్భంగా దురంధర్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో మాస్ అవతార్‌లో కనిపించాడు. అలాగే ఓ హీరోయిన్ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు.చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా..ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ కూతురే సారా. సౌత్‌లో బాలనటిగా ఎన్నో సినిమాలు చేసిన ఆమె.. దురంధర్తో హీరోయిన్గా వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఈమె తెలుగులో దాగుడుమూత దండాకోర్ చిత్రంలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించింది. నాన్న మూవీలో విక్రమ్ కూతురిగా మెప్పించింది. తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. పొన్నియన్ సెల్వన్ మూవీలో ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్రలో మెరిసింది. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్చైల్డ్ ఆర్టిస్ట్‌గా బోలెడంత పాపులారిటీ సంపాదించిన సారా.. అప్పుడే హీరోయిన్గా మారడంతో సినీప్రియులు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ 40 ఏళ్ల రణ్వీర్తో 20 ఏళ్ల సారా కలిసి నటించడంపై అప్పుడే చర్చ మొదలైంది. వీళ్లిద్దరూ జంటగా నటించారా? లేదంటే ఏదైనా మిషన్ కోసం ఇలా కలిశారా? అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. అదే రోజు ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రిలీజ్ అవుతుండటం గమనార్హం. చదవండి: కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి -
మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్వీర్ సింగ్
‘ఆపరేషన్ సిందూర్’ పై హీరో రణ్వీర్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓపోస్ట్ షేర్ చేశారు. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం(భారతీయులు) ఇబ్బంది పెట్టం. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్. ఈ ఆపరేషన్‌లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు. -
నీ శరీరం.. నీ ఇష్టం అన్నాడు : దీపికా పదుకొణె
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె ఒకటి. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. దాదాపు ఆరేళ్ల తర్వాత 2024లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలను కనడానికి ఇంత గ్యాప్ తీసుకోవడం తన నిర్ణయమే అంటోంది దీపికా. ఈ విషయంలో రణ్వీర్ సింగ్ తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచాడని చెప్పింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రెగ్నెన్సీ విషయంలో రణ్వీర్ ఎంత క్లారిటీగా ఉన్నారనే విషయాన్ని చెబుతూ భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘పెళ్లయిన కొత్తలో ఓ సారి పిల్లలను కనడం గురించి రణ్వీర్తో మాట్లాడుతూ..ఎప్పుడు ప్లాన్ చేద్దాం అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ..‘పిల్లలను కనడం ఇద్దరి నిర్ణయం అయినప్పటికీ.. మోయాల్సింది నువ్వు మాత్రమే. నీ శరీరంలోనే బేబీ పెరుగుతుంది. కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కనగలను అని నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాం’ అన్నారు. ఆయన మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి’ అని దీపికా చెప్పుకొచ్చిది. ఇక తన కూతురుకి దువా అనే ఎందుకు పెట్టారో వివరిస్తూ.. ‘బేబీకి పెరు పెట్టే విషయంలో మేం తొందరపడలేదు. బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పేరు పెట్టాం. ముందుగా బేబీ క్షేమంగా మా చేతుల్లోకి రావాలనే కోరుకున్నాం.దువా అనే పేరు కూడా అనుకోకుండా పెట్టేశాం. ఓ రోజు రాత్రి సెట్లో ఉన్న రణ్‌వీర్‌కి మెసేజ్ చేశాను. బేబీ పేరు గురించి చర్చిస్తూ ‘దువా’ అన్నాను. వెంటనే ఓకే చెప్పేశాడు. అదే పేరును మేం ప్రకటించాం. అరబిక్ భాషలో దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే ఈ పాప అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టేశాం’అని దీపికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకొని పూర్తి సమయం బేబీకి కేటాయించింది. కల్కి 2లో నటించబోతుంది. అలాగే షారుఖ్ ఖాన్ కొత్త సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
డాన్‌తో జోడీ?
బాలీవుడ్ కొత్త డాన్ రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ ‘డాన్ ’ ఫ్రాంచైజీలో రూపొందనున్న కొత్త చిత్రం ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించను న్నారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఈ మూవీని 2023 ఆగస్టులోనే ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ వేసవి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. కానీ, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉండటంతో ఈ మూవీలో హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ‘డాన్ 3’ కోసం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ఫర్హాన్ అక్తర్. అందులో భాగంగా ఇటీవల శర్వారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కృతీసనన్ పేరు బాలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. ‘డాన్ 3’ లో రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కాగా హిందీలో వచ్చిన ‘డాన్ ’ (2006), ‘డాన్ 2’ (2011) సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా, 1978లో వచ్చిన ‘డాన్ ’లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. -
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
దీపికా స్టైలిష్ డ్రెస్, చూడ్డానికి చాలా సింపుల్ : కానీ ధర తెలిస్తే షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా భర్తతో రణ్వీర్తో కలిసి విమానాశ్రయంలో తళుక్కున మెరిసింది. ఈ సందర్బంగా లవబుల్ కపుల్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. ఎప్పటిలాగానే నవ్వుతూ మీడియాకు ఫోజులిచ్చారు.కుమార్తె దువాకు జన్మనిచ్చిన తరువాత తల్లిదండ్రులుగా జంటగా కనిపించారు. ట్రెండింగ్ వైడ్ లెగ్ జీన్స్, పాప్లిన్ స్లిట్ షర్ట్‌లో చాలా సింపుల్‌గా కనిపించింది. కానీ ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా?ఎయిర్‌పోర్ట్‌లో నల్ల చారల చొక్కా, ప్యాంట్ చాలా సింపుల్‌గా కంఫర్టబుల్‌గా చిక్ స్టైల్‌తో మెప్పించింది గ్లోబల్ ఐకాన్. లీ మిల్ కలెక్షన్‌కు చెందిన ఈ డ్రెస్ ధర 79,100. దీనికి జతగా సిటిజన్స్ ఆఫ్ హ్యుమానిటీ హై రైజ్ వైడ్ లెగ్ జీన్స్‌ను ధరించింది. దీని ధర సుమారు రూ. 39వేలే. (యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!)అంతేనా లగ్జరీ ఎలిమెంట్‌ను జోడిస్తూ లూయిస్ విట్టన్ సన్ గ్లాసెస్‌తో తన లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఇంకా అద్భుతమైన కార్టియర్ శాంటాస్ డి కార్టియర్ వాచ్‌తో రూపాన్ని పూర్తి చేసింది, దీని ధర రూ.3,080,000. ఇదీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం Power couple Ranveer Singh and Deepika Padukone turn heads at the Mumbai airport with their effortless style and charm 💕#RanveerSingh #DeepikaPadukone #deepveer #Bollywood #iwmbuzz @RanveerOfficial @deepikapadukone pic.twitter.com/TE2Al4PK7J— IWMBuzz (@iwmbuzz) January 7, 2025 ఇక రణవీర్ సింగ్ తన జుట్టును పోనీ టైల్లో కట్టి, తన క్యాజువల్ బెస్ట్ డ్రెస్‌లో అందరికీ హాయ్ చెప్పాడు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూతురు దువాతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ఇటీవల దీపిక 39వ పుట్టినరోజు (జనవరి,5)కు ఈ జంట మాల్దీవుల్లో సెల్రబేషన్స్ ముగించుకొని తిరిగి ముంబై చేరుకున్నారు. కాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి దీపికా కల్కి( Kalki ) సినిమాలో నటించింది. గర్భంతో ఉన్న మహిళగా నటనతో విమర్శకులను సైతం మెప్పించింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నపుడే ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు, నిండు గర్భంతో ప్రమోషన్స్‌లో పాల్గొని అందర్నీ మెస్మరైజ్ చేసింది.ఈ ప్రమోషన్స్‌లో రూ.1.14 లక్షల విలువైన బ్లాక్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. Magda రూ.41.500 విలువైన Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. కోటి రూపాయల విలువచేసే బ్రేస్ లేట్ కూడా ధరించిన విషయం తెలిసిందే. -
భార్యకు స్టార్ హీరో స్పెషల్ విషెస్.. ఏకంగా ఐ లవ్ యూ చెబుతూ!
-
'రణ్‌వీర్‌లో ఆ లక్షణాలే నచ్చాయి'.. దీపికా పెళ్లి వీడియో వైరల్!
బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ కపుల్స్‌లో దీపికా పదుకొణె- రణ్వీర్ సింగ్ ఒకరు. ఈ జంటకు ఇటీవలే కూతురు జన్మించింది. వీరి పెళ్లయిన ఆరేళ్లకు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. సెప్టెంబర్ 8న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దీపికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఈ జంట ఇవాళ తమ ఆరో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2018లో ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకల్లో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కొంకణి, సింధీ సంప్రదాయాల్లో నవంబర్ 14న వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరికి పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తన భర్త రణ్వీర్ సింగ్ గురించి దీపికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా మంది చూడని వ్యక్తికి నేను ఆకర్షితురాలినయ్యా. అతనినొక నిశ్శబ్దం. అంతేకాదు తెలివైన, సున్నితమైన వ్యక్తి. అతను ఏడిస్తే నాకు చాలా ఇష్టం. అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి. అందుకే నేను ఇష్టపడ్డా' అని పెళ్లి వీడియోలో మాట్లాడింది.కాగా.. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా (2013) సెట్లో వీరిద్దరు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట దాదాపు ఆరేళ్ల డేటింగ్ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ రోజు మ్యారేజ్ డే సందర్భంగా దీపికా పదుకొణెకు స్పెషల్‌గా విషెస్ తెలిపారు. -
మా ప్రార్థనలకు సమాధానం దువా
బాలీవుడ్‌లోని వన్నాఫ్ ది క్రేజీ కపుల్స్ రణ్వీర్ సింగ్ – దీపికా పదుకోన్ తమ కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అని నామకరణం చేశారు. ఆ పేరును ఖరారు చేసినట్లుగా వెల్లడించి, దువా కాళ్లు మాత్రమే కనిపించేలా రణ్వీర్–దీపికలు ఓ ఫొటోను షేర్ చేశారు.‘‘మా కుమార్తెకు దువా పదుకోన్ సింగ్ అనే పేరు పెట్టాం. దువా అంటే ప్రార్థన. మా ప్రార్థనలకు దువా సమాధానం. అందుకే మా కుమార్తెకు ఆ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు రణ్వీర్–దీపిక. 2018లో రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వివాహం చేసుకున్నారు. 2023 సెప్టెంబరులో దీపిక ఓ పాపకు జన్మనిచ్చారు. -
కూతురికి క్యూట్ నేమ్ పెట్టిన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె తమ ముద్దుల కుమార్తె పేరును ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈమేరకు చిన్నారి పాదాల ఫోటోను షేర్ చేశారు. 'దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రార్థనలకు సమాధానమే తను. మా మనసు సంతోషంతో, ప్రేమతో ఉప్పొంగిపోతోంది' అని రాసుకొచ్చారు.గుడ్ న్యూస్కాగా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె.. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, 83 వంటి సినిమాల్లో కలిసి నటించారు. 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపిక తాను గర్భవతిని అని గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 8న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇకపోతే దీపిక, రణ్వీర్.. సింగం అగైన్ సినిమాలో గెస్ట్ రోల్లో మెరవనున్నారు. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న దీపికా పదుకొణె కంపెనీ
బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు చెందిన సంస్థ కేఏ ఎంటర్ప్రైజెస్ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమాచారాన్ని సేకరించే జాప్కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.పికా పదుకొణె కంపెనీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్మెంట్లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.బాలివుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్‌కు సమీపంలోని బాంద్రా బ్యాండ్స్టాండ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. -
బాజీరావు ఇల్లు
రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు. కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్లను మెయింటెయిన్ చేస్తోంది.కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి. -
ఐశ్వర్యనే ఆదర్శం అంటున్న మామ్ దీపికా!
బాలీవుడ్ స్వీట్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ పండంటి పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడబిడ్డకు తండ్రి కావాలనే రణవీర్ కోరిక నెరవేరింది. అయితే దీపికా తన ముద్దుల తనయ పెంపకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను ఫాలో కానుందని సమాచారం. విషయం ఏమిటంటే...సాధారణంగా చంటిపాపాయి పుట్టినపుడు ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, ఇతర పెద్దవాళ్లు తల్లీ బిడ్డల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంటారు. చంటిబిడ్డకు నలుగు పెట్టి నీళ్లు పోయడం, పాపాయికి పాలు పట్టించడం, బాలింతకు ఎలాంటి ఆహారం పెట్టాలి లాంటి జాగ్రత్తలు, బాధ్యతలు వాళ్లవే. మకొంతమంది తమ పాపాయిని జాగ్రత్తగా చూసేందుకు ఒక ఆయమ్మను, నానీనో పెట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు లక్షలు ఖర్చుపెట్టి మరీ నానీలను నియమించకుంటారు. కానీ దీపికా మాత్రం ఐశ్వర్య, అలియా భట్, అనుష్క శర్మ పేరెంటింగ్ స్టైల్‌ను ఫాలో అవుతోందట. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం దీపిక నానీని ఏర్పాటు చేసుకోకూడదని నిర్ణయించింది. స్వయంగా తానే చిన్ని దీపిక బాధ్యతలను చూసుకోనుందిట.ఆలియానే ఆదర్శంమరో విషయం ఏమిటంటే పాప ఫోటోను మరికొన్ని పాటు రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచాలని భావిస్తోందట. కొంచెం పెద్దయ్యాక మాత్రమే తన బేబీని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో ఆలియాను ఫాలో కానుందట. ఐశ్వర్య తన కుమార్తె పుట్టినపుడు నానీనీ పెట్టుకోలేదట. ఇందుకు ఆమె అత్తగారు జయా బచ్చన్ కూడా 'హ్యాండ్-ఆన్-మామ్' అంటూ పొగిడింది కూడా. ఆ తరువాత అనుష్క శర్మ , అలియా భట్ ఇదే బాటలో నడిచిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో -
దీప్‌వీర్ బిడ్డను చూసేందుకు తరలివెళ్లిన అంబానీ
బాలీవుడ్ నటులు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులకు ఇటీవల (సెప్టెంబర్ 8)న ఆడబిడ్డ పుట్టింది. ఈ నేపథ్యంలో పలువురుబాలీవుడ్ పెద్దలు, ఇతర సెలబ్రిటీలకు ఈజంటకు అభినందనలు అందించారు. మరికొంతమంది స్వయంగా హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లి రణ్వీర్, దీపిక తొలి సంతానాన్ని ఆశీర్వదించారు. అలాగే దీపికా, రణ్వీర్ దంపతులతో సన్నిహిత సంబంధాలున్న, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భారీ భద్రత మధ్య దక్షిణ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు వెళ్లారు. రణ్వీర్, దీపికకు అభినందనలు తెలిపారు. వారి ముద్దుల తనయను ఆశీర్వదించారు.Mukesh Ambani made a late night visit to H.N. Reliance Hospital to meet Deepika, Ranveer and their baby.#DeepikaPadukone #RanveerSingh pic.twitter.com/4oLdspp7PN— Deepika Padukone Fanpage (@DeepikaAccess) September 10, 2024 కాగా బిలియనీర్ ముఖేష్ అంబానీ బాలీవుడ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. అంబానీ ఇంట ఏ పండుగ, ఏ వేడుక జరిగిన బాలీవుడ్ పెద్దలంతా అక్కడ హాజరు కావాల్సిందే. అనంత్, రాధిక ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు, మొన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ అతిరథ మహారథులంతా తరలి వచ్చారు. అయితే గర్భంతో ఉన్న నేపథ్యంలో దీపికా రాలేకపోయినప్పటికీ, రణ్వీర్ అనంత్ , రాధిక వివాహ వేడుకల్లో ప్రత్యేక డ్యాన్స్‌తో అలరించారు. -
బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. అభినందనల వెల్లువ!
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె బిడ్డకు జన్మనిచ్చారు. శనివారం సాయంత్రం ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికెళ్లిన దీపికా పదుకొణెకు ఇవాళ పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దీపికా, రణ్‌వీర్‌సింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఇటీవలే కల్కి మూవీతో అభిమానులను అలరించింది దీపికా పదుకొణె. 2018లో పెళ్లి చేసుకున్న దీపిక-,రణ్వీర్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా గర్భంతో ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో మొదటి బిడ్డను ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇవాళ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా.. మొదటిసారి రామ్ లీలా చిత్రంలో దీపికా - రణ్వీర్ జంటగా నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ అనంతరం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. -
ఆస్పత్రికి వెళ్లిన కల్కి భామ.. త్వరలోనే గుడ్‌న్యూస్!
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఈ నెలలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలాఖరులోహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పనుంది. తాజాగా తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే దీపికా పదుకొణె రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రి వెళ్లనట్లు తెలుస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసి సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితమే తన భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటో షూట్ పిక్స్ పంచుకున్నారు. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఫోటోలు వైరలయ్యాయి.ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా పదుకొణె సినిమాలకు విరామం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్స్‌లో పాల్గొనదని తెలుస్తోంది. ఇటీవలే ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో కలిసి కల్కి 2898 ఏడీ సినిమాతో అభిమానులను అలరించింది. కల్కి పార్ట్-2 లోనూ దీపికా కనిపించనుంది. అంతే కాకుండా బాలీవుడ్ మూవీ సింగం ఎగైన్లోనూ నటించనుంది. -
ముంబై సిద్ధి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్న దీపికా పదుకొణె దంపతులు
బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ దంపతులు ముంబైలో ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని తాజాగా దర్శించుకున్నారు. కొద్దిరోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్న ఈ దంపతులు వినాయకుడి ఆశీస్సులు తీసుకునేందుకు ఆలయానికి వచ్చారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిద్దరూ ఎరుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.2018లో దీపికా పదుకొణే, రణ్వీర్ సింగ్ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ, మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని కూడా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే ఆమె డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
బేబీ బంప్ 'ఫోటోలు' షేర్ చేసిన దీపికా పదుకోనె (ఫొటోలు)
-
దీపికా పదుకొణెకు ప్రెగ్నెన్సీ.. అందుకోసం లండన్ వెళ్తున్నారా?
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో దీపికా పదుకొణె - రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఇప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించిన ఈ కపుల్ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భంతో ఉందని అభిమానులతో తొలిసారి అధికారికంగా పంచుకున్నారు. సెప్టెంబర్‌లో తమ జీవితంలో బిడ్డను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అందుకే ఇప్పటికే ముంబయిలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. బిడ్డ పుట్టాకే ఆ ఇంట్లోకి వెళ్లనున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ 28న ముంబయిలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట ప్రసవం కోసం లండన్‌కు వెళ్లనున్నారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం దక్షిణ ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోనే డెలివరీకి కానున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల కల్కితో అభిమానులను అలరించిన దీపికా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ క్షణాలను ఆస్వాదిస్తోంది. దీంతో ఆమె వచ్చే ఏడాది మార్చి వరకు ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదు. ఆ తర్వాతే కల్కి పార్ట్-2లో సెట్స్‌లో కనిపించే అవకాశముంది. కాగా.. దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం ఎగైన్‌లో రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించనుంది. -
రూ.100 కోట్లతో దీపికా పదుకొణె లగ్జరీ విల్లా.. చేరేది ఎప్పుడంటే !
బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. అయితే ప్రస్తుతం గర్భంతో ఉన్న దీపికా సినిమాలకు దూరంగా ఉంటోంది. రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఈ ఏడాదిలోనే అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బేబీ బంప్‌తోనే కల్కి మూవీ ప్రమోషన్లలో పాల్గొంది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.రూ.100 కోట్లతో భవనం..అయితే బాలీవుడ్ ఫేమస్ జంటల్లో ఒకరైన దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ తమ కలల సౌధాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మన్నత్‌కు సమీపంలోనే వీరి లగ్జరీ భవనాన్ని నిర్మిస్తున్నారు. సముద్రానికి ఎదురుగా ఉన్న బాంద్రాలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బంగ్లా దాదాపు చివరిదశకు చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె కొత్త ఇంటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సకల సౌకర్యాలతో తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నారు. వచ్చే నెలలో బిడ్డ పుట్టాక బాంద్రాలో ఉన్న తమ కొత్త ఇంట్లో అడుగుపెట్టనుంది దీపికా- రణ్వీర్ జంట. గతంలో ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ.22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.దీపికా- రణ్వీర్ ప్రేమకథ..2013లో వీరిద్దరు కలసి నటించిన హిట్ మూవీ గోలియోన్ కి రాస్లీలా: రామ్-లీలా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాతే డేటింగ్ ప్రారంభించారు. మరో బ్లాక్‌బస్టర్ చిత్రం బాజీరావ్ మస్తానీలో కూడా కలిసి నటించారు. 2018లో ఇటలీలో ఒక సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా.. మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై మెరవనుంది. సింగం ఎగైన్‌లో వీరిద్దరు కనిపించనున్నారు. ఆ తర్వాత రణ్‌వీర్‌సింగ్ డాన్ 3లో కూడా నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చైతూతో ఎంగేజ్మెంట్ తర్వాతా.. మారిపోయిన శోభిత ఇమేజ్...
-
ఐటం సాంగ్‌లో శోభిత ధూళిపాళ.. చై ఒప్పుకుంటాడా?
నాగచైతన్య- శోభిత ధూళిపాళ.. ఇద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆ ప్రేమను ఎన్నడూ బయటపెట్టలేదు. తమ మధ్య ఏమీ లేదన్నట్లుగానే ప్రవర్తించారు. కలిసి షికార్లకు వెళ్లినా గుట్టుగా దాచారు. ఎట్టకేలకు ఈ దాగుడుమూతలకు స్వస్తి పలుకుతూ ఈ మధ్యే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న ఇరు కుటుంబసభ్యులు తాంబూలాలు మార్చుకున్నారు. వీరి వివాహం ఈ ఏడాది చివర్లోనో లేదా వచ్చే ఏడాది మార్చిలోనో ఉందని ప్రచారం జరుగుతోంది.ఐటం సాంగ్ ఆఫర్అప్పటివరకు ఇద్దరూ తమ సినిమా పనులతో బిజీగా ఉండనున్నారు. తాజాగా శోభితకు బాలీవుడ్ నుంచి ఊహించని ఆఫర్ వచ్చిందట! మునుపెన్నడూ చేయని రోల్ ఇచ్చారట.. అదే ఐటం సాంగ్! రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో శోభితను భాగం చేయాలని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట! ఐటం సాంగ్ చేయాలంటూ శోభితకు ఆయన ఆఫర్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. శోభిత ఆన్సర్ ఏమై ఉంటుంది?ఈ క్రమంలో ఫర్హాన్ అక్తర్- శోభిత పలుమార్లు భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు భోగట్టా! మరి శోభిత.. ఐటం సాంగ్‌కు ఓకే చెప్తుందా? లేదా ఆఫర్ తిరస్కరిస్తుందా? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయినా శోభిత ఐటం సాంగ్ చేసేందుకు చై ఒప్పుకుంటాడా? అని మరికొందరు సందేహిస్తున్నారు. అసలు డాన్ 3లో శోభిత పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!చదవండి: ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి -
ఒలింపిక్స్‌లో పతకం మిస్.. లక్ష్యసేన్‌పై రణ్వీర్ సింగ్ ప్రశంసలు!
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్‌పై బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. తాజాగా పారిస్‌లో జరుగుతన్న ఒలింపిక్స్‌లో కాంస్యపతకం దక్కకపోవడంపై స్పందించారు. పురుషుల బ్యాడ్మింటన్‌లో సెమీఫైనల్ చేరుకున్న తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సృష్టించాడని రణ్వీర్ కొనియాడారు. ప్రస్తుతం నీ వయస్సు 22 ఏళ్లేనని.. మరో రోజు నువ్వు పోరాడాలంటూ మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.నువ్వు ఓడిపోయినప్పటికీ నీ ప్రయత్నం గొప్పదని రణ్వీర్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. ఒలింపిక్స్‌లో నీ చురుకుదనం, ప్రదర్శన, ఏకాగ్రత అద్భుతంగా ఉందన్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నానని.. నువ్వు ఒక స్టార్.. నీ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని పోస్ట్‌లో రాసుకొచ్చారు. భవిష్యత్తులో రాబోయే యువతకు నువ్వు ఒక ఆదర్శమని రణ్వీర్ సింగ్ మద్దతుగా నిలిచారు. కాగా.. ఒలింపిక్స్‌లో జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ప్లేయర్ చేతిలో ఓటమి చెందారు. -
Ranveer Singh: ఆ ఠీవీ, ఆ దర్పం.. మహారాజులా ఉన్నాడే! (ఫోటోలు)
-
అనంత్ అంబానీ పెళ్లి.. నాగిని డ్యాన్స్‌తో అదరగొట్టిన స్టార్ హీరో!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుు అనంత్ అంబానీ పెళ్లి ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలువురు ప్రముఖ సినీతారలు సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుకకు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా హాజరైన నూతన వధువరూలను ఆశీర్వదించారు.అయితే ఈ పెళ్లిలో జరిగిన బరాత్‌లో బాలీవుడ్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్వీర్ సింగ్ సందడి చేశారు. అర్జున్ కపూర్, వీర్ పహారియాతో కలిసి స్టెప్పులు వేశారు. నాగిని డ్యాన్స్ చేస్తూ రణ్వీర్ సింగ్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by PopDiaries Spotlight (@popdiaries.bollywood) -
అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు
అంబానీల ఇంట్లో పెళ్లి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు అన్నట్లు ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఏదో ఓ పేరుతో ఫంక్షన్ నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమైన పెళ్లి వేడుక కూడా జరిపించారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లతో పాటు ప్రధానమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రులు వరకు చాలామంది హాజరై, హాట్ టాపిక్ అయిపోయారు. ఇదంతా పక్కనబెడితే అనంత్.. తన స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనంత్‌కి బాలీవుడ్లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే వాచీనీ అనంత్ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. వీటితో షారుక్, రణ్వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!) View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) -
'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?
'హనుమాన్'తో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు తీసినప్పటికీ ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే 'హనుమాన్' థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుందో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల్లో ఇతడు బిజీగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ)'హనుమాన్' తర్వాత దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉందని ప్రకటించారు. త్వరగా ఈ మూవీ వస్తే బ్రేక్ ఇద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం వేరే ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అలా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో 'రాక్షసుడు' అనే మూవీ ఓకే అయిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అనంతరం కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపించింది.ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. 'ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అని రాసుకొచ్చాడు. దీంతో ఎవరికీ తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. హీరో రణ్వీర్ సింగ్ రిజెక్ట్ చేయడమే ఈ ట్వీట్‌కి కారణమని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలేం జరిగిందనేది ప్రశాంత్ వర్మ చెప్తే తప్ప క్లారిటీ రాదు!(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!)One day you realise every rejection was a blessing in disguise! :)— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024 -
యంగ్ హీరోకి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ హీరో
సాధారణంగా పుట్టినరోజు విషెస్ అంటే ట్వీట్ లేదంటే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి విషెస్ చెప్పొచ్చు. కానీ కొందరు మాత్రం డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇలానే ప్రయత్నించాడు. తన తోటీ హీరో అయిన రణ్వీర్ సింగ్‌కి క్రేజీ వీడియోతో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్లో తగ్గేదే లే)బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి సూర్యవంశీ, సింగం-2 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా రణ్వీర్ పుట్టినరోజు సందర్భంగా అక్షయ్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసి మరీ విషెస్ చెప్పాడు.గతంలో మూవీ షూటింగ్ టైంలో తీసిన పాత వీడియోలో భాగంగా రణ్వీర్, అక్షయ్ క్రేజీ స్టెప్పులేస్తూ కనిపించారు. ఇకపోతే విషెస్ చెబుతూ రణ్‌వీర్‌ని అక్షయ్ పవన్ హౌస్‌తో పోల్చడం విశేషం. నిజం చెప్పాలంటే బాలీవుడ్లో ఈ ఇద్దరు హీరోలు పవర్ హౌస్ లాంటివాళ్లే. కానీ గత కొన్నాళ్ల నుంచి వీళ్లకు సరైన హిట్ పడట్లేదు. (ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar) -
చిత్ర విచిత్రమైన డ్రస్సులు.. ఈ స్టార్ హీరో రూటే సెపరేటు (ఫొటోలు)
-
ఆ హీరోతో నా సినిమా అందుకే ఆగిపోయింది: దర్శకుడు శంకర్
భారత అగ్రదర్శకుల్లో ఒక్కరైన శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు ఇండియన్-2 ఈ నెలలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆ చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారాయన. మరోవైపు రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ నిర్మాణంలో ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండూ కాకుండా.... శంకర్ ఇండియన్ 3పైనా ఫోకస్ చేశాడు. తాను తర్వాత తీయబోయే చిత్రం అదేనని తాజాగానూ స్పష్టం చేశారాయన. దీంతో శంకర్ అప్‌కమింగ్ ప్రాజెక్టు ఇంకా ఏదైనా ఉందా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో చాలా కాలం కిందట ఆయన డైరెక్షన్లో రావాల్సిన ఓ సినిమా.. ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అదే ‘అన్నియన్’(అపరిచితుడు) రీమేక్.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా అన్నియన్ రీమేక్ చేయాలని శంకర్ భావించారు. ఇందు సంబంధించిన టెస్ట్ షూట్ చేసి.. ఆ ఫొటోలను సైతం రిలీజ్ చేశారు. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు గురించి తర్వాత అప్డేట్ లేకుండా పోయింది. తాజాగా.. ఇండియన్ 2 ప్రమోషన్లో శంకర్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు.He is a maverick and charismatic showman no one else can play!Welcome aboard, @RanveerOfficial Can't wait for this magnificent journey to begin mid 2022.⁰@jayantilalgada @PenMovies pic.twitter.com/LJueK4d8ra— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021‘‘రణ్వీర్తో అన్నియన్ను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ, ఆ తర్వాత మా ఆలోచనలన్నీ మారిపోయాయి. భారీ బడ్జెట్‌తో ఇతర భాషల్లో చిత్రాలు తీద్దామని, అది అన్నియన్ కంటే గొప్పగా ఉండాలని మా నిర్మాతలు నన్ను కోరారు. దీంతో ఆలోచనల్లో పడ్డాం. రణ్వీర్తో సినిమా ఉంటుంది. కానీ, అది అన్నియన్ రీమేక్ కాదు. అంతకు మించిన కథతో తప్పకుండా ఆయనతో సినిమా తీస్తా’’ అని శంకర్ ప్రకటించారు. -
హబ్బీతో బేబీమూన్‌కు : భార్య అంటే ఎంత ప్రేమో! వైరల్ వీడియో
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే బేబీమూన్కోసం లండన్‌కు పయనమయ్యారు. ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అందంగా మెరిసారు. విమానాశ్రయంలో దర్శన మిచ్చిన ఈ జంట వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ లవ్‌బర్డ్స్ ఇద్దరూ చేతిలో చేయివేసుకుని మరీ కనిపించడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అలాగే కారు దిగిన వెంటనే దీపికా వైపు పరుగెత్తుతూ వాహనం నుండి బయటకు వచ్చేందుకు సాయం చేస్తూ, తన భార్యను అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటున్న తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)కాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’కి సంబంధించిన ముంబైలో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో దీపికా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పదుకొనే ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ప్రభాస్ సరసన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. రానా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో ప్రభాస్‌తోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. -
ఆగిపోయిన ప్రశాంత్ వర్మ సినిమా.. బాలీవుడ్ డెబ్యూకు బ్రేక్!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్‌డూపర్ హిట్ కొట్టాడు. దీంతో ఆయనతో కలిసి పని చేయాలని బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశపడ్డారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి రాక్షస్ అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆగిపోయిన మూవీఇంతలోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో ప్రశాంత్.. 'రణ్వీర్ చాలా ఎనర్జిటిక్ పర్సన్. ఎంతో టాలెంట్ ఉన్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పని చేస్తాం అని పేర్కొన్నాడు.భవిష్యత్తులో..అటు రణ్వీర్ సింగ్ సైతం ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్. మేము కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. అయితే ఫ్యూచర్లో తప్పకుండా కలిసి పని చేస్తాం అని తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది హనుమాన్కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. An official statement from the team about #RanveerSingh’s Project with #PrasanthVarma and #MythriMovieMakers!!In a mutual understanding, the team decided to part ways with a possible collaboration in future. @RanveerOfficial @PrasanthVarma @MythriOfficial pic.twitter.com/OG2gqkwJMO— Ramesh Bala (@rameshlaus) May 30, 2024 చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్‌లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్.. -
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్వీర్ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. -
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
ఆసియా బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ల పెళ్లి ముచ్చట మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని, ప్రీ వెడ్డింగ్ బాష్‌ను ఘనంగా నిర్వహించుకున్న లవ్‌బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఛలో ఇటలీ..ఈ ఏడాది మార్చిలో జామ్‌నగర్‌లో వారి గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత, అనంత్ -రాధిక మర్చంట్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణించే క్రూజ్‌లో మూడు రోజుల వేడుకను నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా మరో ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకునేందుకు రడీగా ఉన్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్, క్రీడా, రాజకీయ రంగ ప్రముఖులు ఇటలీకి పయనమయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీతోపాటు,అనిల్ అంబానీ , కాబోయే వధువు రాధిక తండ్రితో కలిసి వెళ్లారు. ( ఇదీ చదవండి: అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?)అలాగే రాధిక-అనంత్‌కు మంచి స్నేహితులు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తన ముద్దుల తనయ రాహాలతో కలిసి బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి, పాపతో కలిసి ఎయిర్ పోర్ట్‌లో దర్శనిచ్చారు. అంతేనా సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ ఇంకా బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. (చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్ : రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా)కాగా అనంత్-రాధిక రెండవ ప్రీ వెడ్డింగ్ బాష్ మే 28వ తేదీనుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్ తీరంలో క్రూయిజ్ షిప్లో జరుగుతందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి, 2365 నాటికల్ మైళ్లు (4380 కిమీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న వేదికకు చేరుకుంటుంది. -
బేబీ బంప్‌తో దీపిక క్యూట్‌గా, అపురూపంగా చూసుకున్న రణవీర్
View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన ఓటు హక్కును వినియోగించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ పోలింగ్‌సందర్భంగా ముంబైలో పోలింగ్ స్టేషన్‌కు భర్త,స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా త్వరలో తల్లికాబోతున్న దీపికాను భర్త చేయిపట్టుకుని జాగ్రత్తగా పోలింగ్ బూత్ వద్దకు తీసు కెళ్లాడు. తెల్లటి చొక్కా , నీలిరంగు జీన్స్‌లో పదిలంగా తన గర్భాన్ని దాచుకుంటూ క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే తల్లిగా తొలిసారి నిండుగా కనిపించడంతో చూలింత కళ ఉట్టిపడుతోంది అంటూ కమెంట్ చేశారు ఫ్యాన్స్ . దిష్టి తగల గలదు అంటూ కూడా కమెంట్ చేశారు.దీపికా-రణవీర్జంట ఈ ఏడాది సెప్టెంబరులోతమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అనేక హిట్ సినిమాలతో దూసుకుపోతున్న దీపిక రణవీర్‌ను ప్రేమ వివాహం చేసుకునంది. కొట్టిన దీపిక రణవీర్ సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. సినిమా పరంగా దీపికా 'సింగం 3' ,'కల్కి’లో కనిపించనుంది. మరోవైపు రణవీర్ ఫర్హాన్ అక్తర్ 'డాన్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. రణవీర్‌తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్లతో కలిసి సింఘమ్ ఎగైన్‌లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకోనుందా? అవును సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ఈ చర్చే నడుస్తోంది. ఎందుకంటే సదరు హీరో ఇన్ స్టాలో ఉండాల్సిన పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఏమై ఉంటుందబ్బా అని అభిమానులు, నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే వీళ్లలో కొందరు కలిసి ఉంటుంటే.. మరికొందరు మాత్రం మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ రణ్వీర్ - దీపిక చేరబోతున్నారా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే రణ్వీర్ తన ఇన్ స్టా ఖాతాలోని పెళ్లి ఫొటోల్ని డిలీట్ చేశాడు. దీంతో లేనిపోని అనుమానాలు వచ్చాయి.దీపిక ఇన్ స్టాలో ఉన్నాయి కానీ రణ్వీర్ ఖాతాలో మాత్రం పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. అయితే దీపికతో కలిసున్న మిగతా ఫొటోలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాదన్నట్లు దీపిక ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ఇలాంటి టైంలో విడాకులు రూమర్ అనేది నమ్మేలా అనిపించట్లేదు. పెళ్లి పిక్స్ కనిపించకుండా పోవడం బహుశా ఏదో పొరపాటు వల్ల అయ్యిండొచ్చని వీళ్ల ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాలంటే రణ్వీర్ స్పందించాల్సిందే. (ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh)


