బాక్సాఫీస్ హిట్‌గా దురంధర్.. ఓటీటీ డీల్‌ ఎన్ని కోట్లో తెలుసా? | Ranveer Singh Movie Dhurandhar Ott Deal Details | Sakshi
Sakshi News home page

Ranveer Singh: బాక్సాఫీస్ హిట్‌గా దురంధర్.. ఓటీటీ డీల్‌ ఎన్ని కోట్లంటే?

Jan 1 2026 2:52 PM | Updated on Jan 1 2026 3:18 PM

Ranveer Singh Movie Dhurandhar Ott Deal Details

బాలీవుడ్‌ రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 2025లోనే అ‍త్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్కును దాటేసింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ కావడంతో దురంధర్ మూవీ ఓటీటీ డీల్‌పై చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రానుందనే విషయంపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్‌కు కలిపి రూ.130 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో పార్ట్‌కు రూ.65 కోట్లతో ఒప్పందం చేసుకుంది.

అయితే ఈ సినిమా డీల్‌ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఒప్పందం డబుల్‌ అ‍య్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రూ.130 కోట్ల డీల్ చాలా తక్కువ అని బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. దీంతో ఈ డీల్ విలువ రూ.275 కోట్ల వరకు చేరుకొవచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఒక హిందీ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన బిగ్‌ డీల్‌గా నిలవనుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన స్టార్ సినిమాలు రూ.150 కోట్లకు పైగా ఓటీటీ వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement