డ్యాన్స్‌తో దుమ్మురేపిన సునీల్.. 'కూలీ' మోనికాని మించి | Sunil Majako Mallika Song and Dance | Sakshi
Sakshi News home page

Sunil: చాన్నాళ్ల తర్వాత సునీల్ సూపర్ డ్యాన్స్

Feb 15 2026 7:38 PM | Updated on Feb 15 2026 7:38 PM

Sunil Majako Mallika Song and Dance

లోకేష్‌ కనగరాజ్‌ తీసిన 'కూలీ' చూసినవారెవ్వరూ అందులోని మోనికా పాటని మర్చిపోలేరు. నిజానికి చూడనివారినీ వదలకుండా రకరకాల సామాజిక మాధ్యమాల్లో కవర్‌ సాంగ్‌గా ఆ పాట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపును ఆ ఒక్క పాటతో దక్కించుకున్నాడు మళయాళ నటుడు సౌబిన్‌ షాహిర్‌. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేడుకల్లో ఆ పాట సందడి చేస్తూనే ఉంది.

ఈ నేపధ్యంలో మన టాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ ఆ పాట క్రేజ్‌కి చెక్‌ పెట్టేలా ఉన్నాడు. త్వరలో విడుదల కానున్న 'కాటలన్' అనే మళయాళ చిత్రంలో మోనికా పాటని మించేలా డ్యాన్స్ ఊపేశారు. ఈ విషయం తాజాగా ఆ సినిమా టీజర్‌ లాంచ్‌తో వెల్లడైంది. పాల్‌ జార్జ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోనీ వర్గీస్‌ పెపే, దుసర విజయన్, కబీర్‌ సింగ్‌లతో పాటు సునీల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్ర నిర్మాతలు తమ చిత్రం మొదటి లిరికల్‌ వీడియోని విడుదల చేశారు. 'మజాకో మల్లికా' అంటూ సాగే ఈ పాట విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారింది. ముఖ్యంగా సునీల్‌ స్టెప్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

'మజాకో మల్లికా'లో సునీల్‌ డ్యాన్స్‌లో ఈజ్‌ని అనేక మంది ప్రశంసిస్తున్నారు. అంతేకాక ఈ పాటను చాలామంది మోనికా పాటతో పోలుస్తున్నారు. ఓ చేత్తో సిగిరెట్‌ పట్టుకుని స్మోక్‌ చేస్తూ ఒకే కాలితో సునీల్‌ వేసిన స్టెప్స్‌ని చూసి ఒక నెటిజన్‌.. 'నటుడు సునీల్‌ డ్యాన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌' అని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకులకు సునీల్‌ డ్యాన్స్‌ బాగా పరిచయం అయినప్పటికీ... దక్షిణాది మొత్తానికి ఇప్పుడు పరిచయం అయిందని చెప్పొచ్చు.

ఈ పాటకు సంగీతాన్ని ప్రముఖ కన్నడ సంగీతకారుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరపరిచారు, ఇతను 'కాంతారా చాప్టర్‌ 2' కు వర్క్‌ చేయడం విశేషం. ఈ పాటను ఆనంద్‌ శ్రీరాజ్‌ భద్ర పాడారు, వినాయక్‌ శశికుమార్‌ సాహిత్యం రాశారు. కూలీ సినిమాలో సౌబిన్‌ లాగే ఈ సినిమాలో కూడా సునీల్‌ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాటలన్ చిత్రం విడుదల తర్వాత సునీల్‌ సాంగ్‌.. మోనికా రేంజ్‌లో హిట్‌ కొడితే ఇక దక్షిణాది సినిమాల్లో హీరోలతో పాటుగా విలన్‌ పాటల ట్రెండ్‌ మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అత్యంత హింసాత్మక చిత్రంగా పేరొందిన మార్కో సినిమాను అందించిన క్యూబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ అందిస్తున్న ఈ యాక్షన్‌ సినిమా మే నెలలో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement