పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..! | yamadonga Actress Mamta Mohandas shares her personal life struggles | Sakshi
Sakshi News home page

Mamta Mohandas: పెళ్లి బంధం ఫెయిల్..నటుడి మోసం.. మానసికంగా కుంగిపోయా..!

Feb 15 2026 1:45 PM | Updated on Feb 15 2026 2:07 PM

yamadonga Actress Mamta Mohandas shares her personal life struggles

జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ మమతా మోహన్ దాస్.  ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాకుండా రాఖీ మూవీలో తన గాత్రంలో అభిమానులను అలరించింది. అయితే కొన్నాళ్లకే క్యాన్సర్ బారిన మమతా మోహన్ దాస్ చాలా ఇబ్బందులు పడింది. ఓసారి క్యాన్సర్‌ జయించినా మమతకు మళ్లీ తిరగబెట్టడంతో తన కెరీర్‌ ముగిసిపోయిందనుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత మహారాజా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో మెప్పించింది.  అంతేకాకుండా రుద్రంగి సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇ‍చ్చింది.

అయితే  సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా..పర్సనల్‌ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటోంది ముద్దుగుమ్మ. తాజాగా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది. ఒక స్టార్‌ యాక్టర్  తనను ఎలా మోసం చేశాడని తెలిపింది. క్యాన్సర్, బొల్లి వ్యాధి సమస్యలతో సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించానని అంటోంది.

అదే సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడితో డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. ఈ విషయం అమ్మ కూడా తెలుసని.. కానీ అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడని తెలిపింది. అయితే మమతా మోహన్ దాస్ మొదట తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి బంధంలో విడాకులు  తనను మానసికంగా కుంగదీశాయని మమతా ఆవేదన వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement