సింపుల్ లైఫ్‌ని లీడ్ చేసే అదికొద్ది మంది నటుల్లో ఒకరు జగపతి బాబు. ఒప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ అయితేపోతే చాలు.. సాధారణ వ్యక్తిలాగే జీవిస్తాడు. సమయం దొరికితే ఒక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తాడు. చుట్టూ ఉన్నవాళ్లతో సరదాగా మాట్లాడతాడు.
అంతేకాదు సెట్‌లో కూడా చాలా అల్లరి చేస్తాడని తోటి నటీనటులు చెబుతుంటారు. మెమోరీస్‌గా ఉండాలంటూ కొన్ని అల్లరి పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు జగపతి బాబు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అల్లరి పని చేసి పోలీసు స్టేషన్‌కి వెళ్లి వచ్చేవారట. సెట్‌లో ఉన్నవాళ్లకు కచ్చితంగా మద్యం అందించేవాడట. అలా ఓసారి అమెరికాకి వెళ్లి.. మద్యం మత్తులో గ్యాంబ్లింగ్ ఆడారట. అక్కడ డబ్బులు వచ్చిన ప్రతిసారి గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తే.. చివరకు పొగపెట్టి గదిలో నుంచి బయటకు పంపేశారని, అది తనకో స్వీట్ మెమోరీ అని అంటున్నాడు జగపతి బాబు.
బస్సు ఎక్కితే గుర్తుపట్టలేదు
సాధారణ మనిషిలాగానే బతకడం నాకు ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా సరదాగా బయటకు వెళ్తుంటాను. ‘కబడ్డీ కబడ్డీ’సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు ఎర్రబస్సు ఎక్కితే..ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. రాజోలులో షూటింగ్ జరుగుతున్న సమయంలో.. నా షూట్ అయిపోగానే నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కా. నా వెనక సిబ్బంది కూడా ఎక్కింది. నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కాసేపయ్యాక గుసగుసలు మొదలయ్యాయి. జగపతి బానేనా.. జగపతి బానేనా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. నేను మాత్రం సైలెంట్‌గా ఉన్నా. ఒకరు చూసి.. ‘నువ్వు జగపతి బాబువే కదా’ అని అన్నారు. నేను వెంటనే కాదని చెప్పా. వాళ్లు సైలెంట్ అయిపోయారు. మా హోటల్ దగ్గర బస్సు ఆగగానే.. దిగేసి ‘నేను జగపతి బాబునే’ అంటూ గట్టిగా నవ్వుకుంటూ హోటల్‌లోకి వెళ్లిపోయా. ఇలాంటి అల్లరి పనులు చాలానే చేశా’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.


