మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు: సుప్రిత | Actress Surekha Vani Daughter Supritha Comments On Social media | Sakshi
Sakshi News home page

మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు: సుప్రిత

Feb 15 2026 1:11 PM | Updated on Feb 15 2026 1:24 PM

Actress Surekha Vani Daughter Supritha Comments On Social media

సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రిత అమరావతికి ఆహ్వానం సినిమాతో వెండితెరపైకి వచ్చింది. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన కెరీర్‌ ఆరంభంలోనే అనేక వివాదాలతో పాటు ట్రోలింగ్‌ను దాటుకుని వచ్చింది. అయితే, తమ వ్యక్తిగత జీవితం గురించి సుప్రిత పంచుకుంది.

'కొన్ని సో కాల్డ్‌ మీడియా వారు మా కన్నీళ్లతో డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రతిదానికి మా గురించి తప్పుడు కథనాలు రాసేస్తున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా వెళ్లాం. అయితే, ఇప్పుడు బలంగా తయారయ్యాము. ఎంతటి నెగటివిటీ చేసినా సరే పట్టించుకనేది ఉండదు. గతంలో తెలిసోతెలీకనో బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌‌ చేశాం. ఇప్పుడు అది కూడా లేదు. బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల జరిగే నష్టాల గురించి  తెలిసిన తర్వాత మేము కూడా చాలా బాధపడ్డాం. నిర్మాత కేపీ చౌదరితో ఎలాంటి సంబంధాలు లేవని చెబుతున్నా సరే.. పదేపదే డ్రగ్స్‌తో లింక్‌లు అంటూ మాపై కొన్ని  మీడియా ఛానల్స్‌లలో ప్రచారం చేశారు. 

కేపీ చౌదరిపై వచ్చిన వార్తా కథనాల వల్ల ఆయన కూడా కుంగిపోయారు. డ్రగ్స్‌తో సంబంధాలు పెట్టుకుని ఆయన తప్పు చేశాడు. కానీ, మరణించిన తర్వాత కూడా తప్పుడు థంబ్‌నైల్స్‌ పెట్టి కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ డబ్బు సంపాధించేకునేందుకు ప్లాన్‌ చేశాయి. అతను ఒక మంచి వ్యక్తిగా మాకు తెలుసు. కానీ, లేనిపోని రూమర్స​్‌ క్రియేట్‌ చేసి మమ్మల్ని  ఇబ్బందులకు గురిచేశారు.' అని చెప్పింది.

తన తల్లి సురేఖ వాణి రెండో పెళ్లి గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. రెండో పెళ్లి చేయాలనేది కేవలం తన కోరిక మాత్రమేనని ఆమె చెప్పింది. తన మదర్‌కు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని  స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement