రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..! | Himanshi Khurana gets Rs 10 crore extortion threat from email | Sakshi
Sakshi News home page

Himanshi Khurana: ప్రముఖ నటి హిమాన్షీకి బెదిరింపులు

Feb 15 2026 12:04 PM | Updated on Feb 15 2026 12:26 PM

Himanshi Khurana gets Rs 10 crore extortion threat from email

బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలైన రణ్‌వీర్‌ సింగ్, రోహిత్ శెట్టిలకు బెదిరింపులొచ్చాయి. తాజాగా మరో నటికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ నటి హిమాన్షీ ఖురానాకు బెదిరింపులొచ్చాయి. పది కోట్లు ఇవ్వాలని  ఓ దుండగుడు డిమాండ్‌ చేశాడు. దీంతో నటి పంజాబ్‌లోని మొహాలీ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ మెయిల్‌ ద్వారా వాయిస్‌ నోట్‌ వచ్చిందని.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని హిమాన్షీ తన ఫిర్యాదులో పేర్కొంది. జీషన్‌ అక్తర్‌ అనే పేరుతో మెయిల్‌ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నటి హిమాన్షీ ఖురానీ పంజాబీ మూవీ సద్దా హక్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు. జోడీ బిగ్‌డే పార్టీ, నా.. నా.. నా లాంటి ఆల్బమ్స్‌తో అలరించారు. అంతేకాకుండా హిందీ బిగ్‌బాస్‌ సీజన్-‌ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement