‘కపుల్‌ ఫ్రెండ్లీ’కి హిట్‌ టాక్‌.. ఫస్ట్‌డే కలెక్షన్‌ ఎంతంటే.. | Couple Friendly Movie Box Office Collection Day 1 Details | Sakshi
Sakshi News home page

‘కపుల్‌ ఫ్రెండ్లీ’కి హిట్‌ టాక్‌.. ఫస్ట్‌డే కలెక్షన్‌ ఎంతంటే..

Feb 15 2026 11:40 AM | Updated on Feb 15 2026 12:16 PM

Couple Friendly Movie Box Office Collection Day 1 Details

ఈ వారం రిలీజ్‌ అయిన సినిమాల్లో హిట్‌ టాక్‌ సంపాదించుకున్న చిత్రం‘కపుల్‌ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా  నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. రొటీన్‌ లవ్‌స్టోరీనే అయినా..తెరపై చాలా మెచ్యూర్డ్‌గా ప్రజెంట్‌ చేశాడంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంతోష్‌, మానసల ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవ్వడం సినిమాకు కలిసొచ్చింది.

పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం..బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.89 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడం.. ఈ వారం రిలీజైన మిగతా చిత్రాలకు ఫ్లాప్‌ టాక్‌ రావడంతో వారాంతంలో కపుల్‌ ప్రెండ్లీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement