Manasa Varanasi
-
ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. ప్రేక్షకులకు ట్విస్ట్
ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన 'కపుల్ ఫ్రెండ్లీ' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్లో కూడా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో సంతోష్ శోభన్ (Santosh Sobhan), మానస వారణాసి (Manasa Varanasi) జంటగా నటించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అయితే, ఈ మూవీ విడుదల తర్వాత చిత్ర యూనిట్‌తో ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మంచి బజ్ క్రియేట్ అయింది. ఆపై కథలో కూడా విషయం ఉండటంతో బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది.‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో కపుల్ ఫ్రెండ్లీ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం వర్షన్లలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అధనంగా రూ. 279 రెంట్ చెల్లించాల్సి వస్తుంది. ఈ మూవీ కోసం రూ. 3 కోట్ల వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బాక్సాఫీస్ వద్ద సుమారుగా రూ. 14 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. స్టోరీ నెమ్మదిగా సాగినప్పటికీ కథ బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చారు.కథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్‌లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన
గత నెలలో వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలోకి వచ్చి హిట్ అయిన తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ఏ మాత్రం అంచనాల్లేకుండా గత నెలలో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లు క్లిక్ కాలేదు. ఓ వారం తర్వాత ప్రభాస్‌తో మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూ చేసింది. తర్వాత నుంచి వసూళ్లు కాస్త పికప్ అయ్యాయి. ఓవరాల్‌గా డీసెంట్ నంబర్లతో థియేట్రికల్ రన్ ముగించుకుంది. గత నెల 14న థియేటర్లలోకి రాగా ఈ శుక్రవారం(మార్చి 13) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'కపుల్ ఫ్రెండ్లీ' విషయానికొస్తే.. శివ(సంతోష్ శోభన్)ది నెల్లూరు. ఉద్యోగ అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. కానీ ఎంతకీ జాబ్ దొరక్క పార్ట్ టైమ్ బైక్ రైడర్‌గా పనిచేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఓ రోజు మిత్ర(మానస వారణాసి) పరిచయమవుతుంది. ఆమెది శివ లాంటి కథే. దీంతో ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని అబద్ధాలు చెబుతూ చెన్నైలో బతికేస్తుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మిత్ర కూడా శివతో కలిసి ఉండాల్సి వస్తుంది. మరి పెళ్లికి ముందే కలిసున్న శివ-మిత్ర జీవితాలు చివరకు ఎలా మారాయి? ఈ ప్రేమకథ సుఖాంతమైందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తారకరత్న చివరి గుండె చప్పుడు విన్నా.. 23 రోజులు కొన ఊపిరితో) -
చిన్న సినిమా కలెక్షన్స్‌పై ప్రభాస్ ఎఫెక్ట్.. వీడియో వైరల్
ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా సరే తన వారికోసం సమయం కేటాయిస్తాడు. ప్రభాస్‌కు హిట్ ఇచ్చిన ‘వర్షం’ డైరెక్టర్ శోభన్ గుర్తున్నారు కదా.. ఇప్పుడు ఆయన కుమారుడు సంతోశ్ నటించిన కొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ విడుదలైంది. ఆయన మీద గౌరవంతో ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీని ప్రమోట్ చేశారు. చిత్ర యూనిట్‌తో ఏకంగా గంట పాటు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తనోక స్టార్ హీరో అనే విషయాన్ని కూడా డార్లింగ్ పక్కన పెట్టేశాడు. తనకు తొలి విజయాన్ని అందించిన దర్శకుడి కుమారుడు ఎదురుగా కనిపించడంతో ఒక హగ్ ఇస్తావా అంటూ అభిమానాన్ని చాటుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ప్రభాస్ దెబ్బతో ‘కపుల్ ఫ్రెండ్లీ’ బ్రేక్ ఈవెన్సంతోశ్ శోభన్ - మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’.. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో పి.అజయ్ కుమార్ రాజు నిర్మించారు. సుమారు రూ. 7 కోట్ల బడ్జెట్‌తో పూర్తి అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 6.80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రాస్ ఇంటర్వ్యూ తర్వాత ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. ఈ వీకెండ్లో చాలా థియేటర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. తెలంగాణలో 400 షోలు, ఆంధ్రాలో 600 షోలు, కర్ణాటకలో 125 షోలు ప్రదర్శించినట్టు ట్రేడ్ రిపోర్ట్. అయితే, ప్రభాస్ ఇంటర్వ్యూ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. ఫైనల్‌గా ఈ మూవీ భారీ లాభాలను తెచ్చిపెడుతుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.‘కపుల్ ఫ్రెండ్లీ’ చూసి ఆ ఫీల్ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ (Prabhas) అన్నారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు మరో స్థాయిలో ఉందని ప్రశంసించారు. హీరో సంతోశ్ శోభన్ అడిగిన వెంటనే అతడికి ఫోన్ నంబరు ఇచ్చారు ప్రభాస్. తనకు ‘వర్షం’ సినిమాలా.. సంతోశ్‌కి ఈ మూవీ గుర్తుండిపోయేలా అవుతుందని డార్లింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by ֆʊɖɦɛɛʀ (@_sai_rebel_45) -
తెలుగమ్మాయి 'ఫ్రెండ్లీ' హిట్.. ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
టాలీవుడ్లో హీరోయిన్లుగా చేసిన తెలుగమ్మాయిలు రీసెంట్ టైంలో బాగానే కనిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో మానస వారణాసి ఒకరు. గత వీకెండ్ రిలీజైన 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో తొలి సక్సెస్ అందుకున్న ఈమె.. సంతోషంలో మునిగితేలుతోంది. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పొద్దు: మంచు లక్ష్మీ)మాసన పక్కా హైదరాబాదీ. చిన్నప్పుడు ఇక్కడే చదువుకుంది గానీ తండ్రి ఉద్యోగరీత్యా మలేసియా వెళ్లింది. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. తర్వాత తిరిగి స్వస్థలానికి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో చదివింది. ఆ టైంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసింది. 2020లో మిస్ తెలంగాణగా నిలిచింది. అదే ఏడాది.. ఫెమినా మిస్ ఇండియా, మిస్ ఇండియా వరల్డ్ కిరీటాలు కూడా సొంతం చేసుకుంది.పలు మోడలింగ్ పోటీల్లో గెలిచిన ఈమెకు సహజంగా సినిమాలపై ఆసక్తి కలిగింది. కానీ ఇంట్లో వాళ్లు తొలుత వద్దని చెప్పడంతో హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ ఎక్సేంజ్ అనలిస్టుగా కొన్నాళ్ల పాటు పనిచేసింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్న తర్వాత ఇంట్లో వాళ్లని ఒప్పించి ఇండస్ట్రీలోకి ఎంటరైంది. తొలుత మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాలో హీరోయిన్గా చేసింది. లుక్స్ బాగున్నప్పటికీ హిట్ అయితే దక్కలేదు.2024లో తొలి సినిమా రిలీజైతే.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో వచ్చింది. ఇందులో మిత్ర అనే పాత్రలో అదరగొట్టేసింది. సంతోష్ శోభన్ హీరోగా చేసిన ఈ చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్న మానస.. టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. సంతోష్ శోభన్‌తోనే మరో సినిమా చేయనున్న మానసకు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. శ్రీలీల, భాగ్యశ్రీ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. స్టార్ హీరోలకు సరైన జోడీగా మానస నిలిచే ఛాన్స్ ఉంది. మరి కెరీర్‌ని ఈమె ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: హీరో సుహాస్) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) -
టాలీవుడ్లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్ మారుతోందా?
టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు. అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం.మానస వారణాసి..మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.శివానీ నాగారం..తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.బేబీ వైష్ణవి చైతన్య..బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్ మూవీ మెరిసింది. ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.శ్రీ గౌరి ప్రియ..మ్యాడ్ బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.ఈషా రెబ్బా..మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. -
లవ్ &రిలేషన్ షిప్ కి ఉన్న తేడా అదే..! ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే...
-
‘కపుల్ ఫ్రెండ్లీ’కి హిట్ టాక్.. ఫస్ట్‌డే కలెక్షన్ ఎంతంటే..
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో హిట్ టాక్ సంపాదించుకున్న చిత్రం‘కపుల్ ఫ్రెండ్లీ’. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ లవ్‌స్టోరీనే అయినా..తెరపై చాలా మెచ్యూర్డ్‌గా ప్రజెంట్ చేశాడంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సంతోష్, మానసల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం సినిమాకు కలిసొచ్చింది.పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం..బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడం.. ఈ వారం రిలీజైన మిగతా చిత్రాలకు ఫ్లాప్ టాక్ రావడంతో వారాంతంలో కపుల్ ప్రెండ్లీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. -
‘కపుల్ ప్రెండ్లీ’పై ప్రభాస్ రివ్యూ
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు రెబల్ స్టార్ ప్రభాస్. తనకు వర్షం సినిమాలా, సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ గుర్తుండిపోయే మూవీ అవుతుందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇదొక లవ్ లీ బ్యూటిఫుల్ ఫిలిం అని, ఈ చిత్రాన్ని చూడటాన్ని ఎంజాయ్ చేశానంటూ ప్రభాస్ తెలిపారు. సంతోష్, మానస జోడీ అద్భుతంగా ఉందని, అశ్విన్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రభాస్ ప్రశంసించారు. ఇలాంటి మంచి కథలను తెరపైకి తీసుకొచ్చిన కో ప్రొడ్యూసర్ అజయ్, యూవీ క్రియేషన్స్ కు ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు.కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. -
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : కపుల్ ఫ్రెండ్లీనటీనటులు: సంతోష్ శోభన్, మానస వారణాసి, యోగిబాబు, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ:యూవీ కాన్సెప్ట్స్సమర్పణ: యూవీ క్రియేషన్స్రచన, దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్సంగీతం: ఆదిత్య రవీంద్రన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్విడుదల తేది: ఫిబ్రవరి 14, 2026సంతోష్ శోభన్.. ప్రతిభ గల నటుడు. కానీ ఆయన ఖాతాలో భారీ హిట్ అనేదే లేదు. ‘ఏక్ మినీ కథ’ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘కపుల్ ప్రెండ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కాడా? ఫీల్ గుడ్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాంకథేంటంటే..నెల్లూరుకు చెందిన శివ..ఓ బడ్డింగ్ ఆర్కిటెక్ట్. ఉద్యోగం కోసం చెన్నై వస్తాడు. ఏళ్లు గడిచినా ఆయనకు సరైన ప్రాజెక్టు దొరకదు. దీంతో డైలీ ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. అలా మిత్ర(మానన వారణాసి) అనే అమ్మాయి బైక్ రైడ్‌లో పరిచయం అవుతుంది. చిత్తూరుకు చెందిన మిత్ర.. సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చెన్నై వస్తుంది. శివలాగే ఆమె కూడా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ కారణంగా ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురురించి.. లివింగ్ రిలేషన్‌ని కొనసాగిస్తారు. కొన్నాళ్లకు ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో వీరిద్దరి జీవితంలో ఊహించని పరిణామం ఎదురవుతుంది. అదేంటి? శివ, మిత్ర ఒకే ఇంట్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది. మిత్ర రాకతో శివ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరకు వీరిద్దరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. జీవిత ప్రయాణం ఎప్పుడు ఎలా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. రేపటి గురించి ఆలోచించకుండా..ఈ క్షణం మనల్ని ప్రేమించిన వాళ్లతో సంతోషంగా గడుపుతూ.. కొన్ని మధుర జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా ద్వారా ఇచ్చిన మంచి సందేశం ఇది. సంభాషలతో కాకుండా కథ రూపంలో ఈ సందేశాన్ని ఇచ్చారు దర్శఖుడు. సినిమా కథ చాలా సరదాగా ప్రారంభమై.. ఎమోషనల్‌గా ముగుస్తుంది. కథనం నెమ్మదిగా సాగినా... ఎక్కడ బోర్ కొట్టదు. అనుకోకుండా పరిచమై.. ప్రేమలో పడి..పెళ్లికి ముందు హద్దులు దాటి.. చివరకు పెళ్లి చేసుకోవాలనుకునే సమయంలో ఓ షాకింగ్ విషయం తెలియడం.. ఆ ఆర్వాత వీరిద్దర ప్రయాణం ఎలా కొనసాగింది? అనేది తెరపై చాలా మెచ్యూర్డ్‌గా చూపించాడు దర్శకుడు.హీరో బ్రేకప్ సీన్‌తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఉద్యోగం కోసం శివ పడే ఇబ్బందులను చూపిస్తూనే మరోవైపు మిత్ర పాత్రను పరిచయం చేశారు. ఇద్దరూ కలిసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. మిత్ర సహాయంతో శివ చేతికి ప్రాజెక్టులు రావడం..తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం.. ఈ ప్రయాణంలో మిత్రతో ప్రేమలో పడడం.. ఇదంతా రొమాంటిక్‌గా సాగుతుంది. ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగినా.. బోర్ మాత్రం కొట్టదు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాలోని ట్విస్ట్ తెలిసిన తర్వాత మనకు గీతాంజలి, ఓయ్, సాగరసంగమం లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. సినిమా ప్రారంభంలో చూపించే కేరళ సీన్ల వెనుక ఉన్న అసలు స్టోరీ ద్వితియార్థంలోనే తెలుస్తుంది. క్లైమాక్స్ ఊహకందేలా సాగుతుంది.ఎవరిలా చేశారంటే.. శివ పాత్రలో సంతోష్ శోభన్ జీవించేశాడు. ఎక్కడ అతి చేసినట్లుగా అనిపించదు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. మిత్రగా మానస తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. సంతోష్, మానసల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. మిగతా పాత్రలన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి అంతే. యోగి బాబు ఉన్నా..కామెడీ పండించే స్కోప్ లేదు. హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ ఫాదర్‌గా రాజీవ్ కనకాల తెరపై కనిపించేదేది కాసేపే అయినా.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
ట్రైలర్ చూడగానే హిట్ అనిపించింది
సంతోష్ శోభన్ , మానస వారణాసి జోడీగా నటించిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు రిలీజ్ అవుతోంది. నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ–‘‘సంతోష్ మంచి పెర్ఫార్మర్. సహజంగా యాక్ట్ చేస్తాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూడగానే, మూవీ హిట్ అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ‘‘ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరచదు’’ అన్నారు అశ్విన్ చంద్రశేఖర్. ‘‘వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం ఇది’’ అని చెప్పారు ధీరజ్ మొగిలినేని. దర్శకులు మేర్లపాక గాంధీ, అభిలాష్ రెడ్డి, నందినీ రెడ్డి, నిర్మాత స్వప్నదత్ అతిథిలుగా పాల్గొని ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ముద్దు సీన్లు.. ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడ్డారు: మానస వారణాసి
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా యువత ఈ ట్రైలర్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి కారణం అందులో ఓ ముద్దు సీన్ కూడా చూపించడం. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయంటోంది హీరోయిన్ మానన వారణాసి. కథ చెప్పినప్పుడే తనకు ముద్దు సీన్ల గురించి చెప్పారని.. టీమ్‌పై నమ్మకంతో ఓకే చెప్పానని అంటోంది. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంట్లో వాళ్లు ఆ సీన్లను చూసి ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్వయంగా మానస వారణాసినే చెప్పింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాలోని ముద్దు సీన్ల గురించి మాట్లాడుతూ.. ‘ఈ మూవీలో సన్నిహితంగా ఉండే సన్నివేశాలు ఉంటాయి. కథ చెప్పినప్పుడే ఇది లవ్ స్టోరీ రెండు ముద్దు సీన్స్ ఉంటాయని చెప్పారు. మొదట్లో నేను సందేహించాను. కానీ మా డీవోపీ, డైరెక్టర్, హీరో సంతోష్..ఇలా టీమ్ అంతా ప్రొఫెషనల్, హానెస్ట్ గా ఉన్నారు. వీళ్లు అసభ్యంగా సీన్స్ చేయరు అని నమ్మకం కలిగింది. నాకొక కంఫర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సంతోష్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ టీమ్ అంతా ఒక మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తుంటే నటిగా నేనూ ప్రొఫెషనల్ గా ఉండాలి కదా అని నటించాను. రొమాంటిక్ సీన్స్ అయినా బ్యూటిఫుల్ గా పొయెటిక్ గా తెరకెక్కించారు. నా దృష్టిలో గ్లామర్ అంటే ఎక్స్ పోజింగ్ కాదు. టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక మా ఇంట్లో వాళ్లు కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు. మన వారణాసి కుటుంబంలో ఉండి ఇలా ఎలా చేశావు అన్నారు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సపోర్ట్ చేశారు’ అని మానస చెప్పుకొచ్చింది. -
‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్ ఈవెంట్ లో మెరిసిన హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)
-
'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్ ఈవెంట్ (ఫొటోలు)
-
లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్.. 'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్ రిలీజ్
హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్న హీరో సంతోష్ శోభన్.. కాస్త గ్యాప్ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' అనే మూవీ చేశాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు కాగా సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్గా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు. అనుకోకుండా ఓసారి కలిసిన హీరోహీరోయిన్లు.. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటూ లివింగ్ రిలేషన్షిప్ మెంటైన్ చేస్తారు. తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్) -
అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోలు చూశారా?
-
‘గామా అవార్డ్స్’ కర్టెన్ రైజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఓ ఈవెంట్లో సందడి చేసిన మానసా వారణాసి (ఫొటోలు)
-
హైదరాబాద్ : కొత్తపేటలో సందడి చేసిన బ్యూటీ క్వీన్ మనసా వారణాసి (ఫోటోలు)
-
అందానికి ఆధారం..నీరు, ఆహారం..!
ప్రతి వ్యక్తి అందానికీ దోహదం చేసేవాటిలో నీరు, ఆహారం ప్రధానమైనవని బ్యూటీ క్వీన్, నటి మనసా వారణాసి అన్నారు. కొత్తపేటలో నూతనంగా నెలకొల్పిన సికారా క్లినిక్స్‌లో సౌందర్య పోషణలో ఏఐ ఆధారిత ఉత్పత్తుల వినియోగం, తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సంప్రదాయ ఆహారం, సౌందర్య సాధనాల విలువ అమూల్యమైనదని, అయితే ఆధునిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని ట్రీట్మెంట్లు తప్పవని అన్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన హైడ్రో ఫేషియల్ వంటి చికిత్సలు తనకు ఇష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సౌదర్య చికిత్స నిపుణులు, సంస్థ నిర్వాహకులు రాఘవేందర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య నిపుణులు సైతం కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తాగమని సూచిస్తుంటారు. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక, శరీరంలోని మలినాలను బయటకు పంపించేస్తుంది. తద్వారా చర్మం తాజాగా, కాంతిమంతంగా ఉంటుందనేది సౌందర్య నిపుణుల వాదన. ఇది ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడే తేలికపాటి అందుబాటులో ఉన్న రెమిడీ. అంతేగాదు చల్లటి నీటిలో ముఖంపై పెట్టిన రక్తసరఫరా జరిగి మృతకణాలు పోతాయని కూడా అంటుంటారు నిపుణులు. అందువల్ల నీళ్లని తప్పనిసరిగా ఎక్కువగా తాగేలా ప్రయత్నిద్దాం. ఆరోగ్యంగానూ, అందంగానూ ఉందాం. (చదవండి: World Motorcycle Day: రైడింగ్ స్కిల్‌తో అదరగొట్టిన ఉమెన్ రైడర్స్..!) -
బెడ్ రూంలో ఫోటోషూట్.. మాజీ మిస్ ఇండియా ఫోటోలు వైరల్
-
చీరకట్టులో మిలమిల మెరుస్తున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు
-
గ్యాప్ కాదు.. ప్రిపరేషన్..
ఫ్యాషన్ షోలో దేవకీనందన వాసుదేవ ఫేమ్ నటి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంత ఇల్లు. నా మనసు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందని దేవకీనందన వాసుదేవ ఫేమ్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె సాక్షితో ముచ్చటించారు. 2020లో మిస్ ఇండియాగా ఎంపికయ్యాను. 2024లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చా. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్నారని పలువురు అంటున్నారు.. అయితే ఇది గ్యాప్ కాదు.. నాకు ప్రిపరేషన్‌లా అనిపిస్తోంది. ముంబై నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్యాషన్ ఎప్పుడూ సినిమాపైనే. మొన్ననే దేవకీనందన వాసుదేవ రిలీజ్ అయ్యింది. చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. వివిధ రకాల థీమ్స్ వస్త్రాలతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేశారు. డిజైనర్ అర్జెంటుమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రణవ్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్స్‌కు చెందిన కలెక్షన్లు, ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్ కపూర్, ప్రజ్ఞ అయ్యగారి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో టాపర్స్‌గా మెరిశారు. ఈ మోడల్ షోలో 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ ర్యాంపుపై సందడి చేశారు. -
అందమైన తెలుగు హీరోయిన్.. మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు! (ఫొటోలు)
-
ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు – అశోక్ గల్లా
‘‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. భక్తి అంశాలు, ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు అశోక్ గల్లా. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించారు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ– ‘‘దేవకీ నందన వాసుదేవ’లో హీరో పేరు కృష్ణ, హీరోయిన్ పేరు సత్యభామ, విలన్ కంసరాజు.. ఇలా మైథాలజీ టచ్ ఉంటుంది. ప్రశాంత్‌గారి టచ్‌తో బోయపాటి శ్రీనుగారు సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అర్జున్ జంధ్యాల ఈ మూవీ తీశారు. సోమినేని బాలకృష్ణగారు కథని నమ్మి రాజీపడకుండా నిర్మించారు. మా సినిమా చూశాక మహేశ్‌బాబు మావయ్య ఎలా స్పందిస్తారా? అని ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
సత్యభామ గుర్తుండిపోతుంది: మానస వారణాసి
అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రమిది. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ–‘‘నేను హైదరాబాద్‌లో పుట్టాను. మా నాన్నగారు మలేషియాలో ఉద్యోగి. దీంతో నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. ఇంజినీరింగ్ మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశాను. ఆ తర్వాత ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాను.మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడంతో మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత ఓ మూవీ వర్క్‌షాప్‌లో పాల్గొనడంతో సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. ఇక ‘దేవకి నందన వాసుదేవ’ లో నేను విజయనగరం అమ్మాయి సత్యభామపాత్రలో నటించాను. ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే అమ్మాయి తను. సత్యభామపాత్ర ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది.నాకు భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. దీంతో ఈ సినిమాలోని డ్యాన్స్ సాంగ్ ‘బంగారం’కు అది కొంత ఉపయోగపడింది. అశోక్ గల్లా, అర్జున్ జంధ్యాలగార్లు సెట్స్‌లో సపోర్టివ్‌గా ఉన్నారు. బాలకృష్ణగారి వల్లే ఈ సినిమా గ్రాండ్‌గా వచ్చింది. హీరో సంతోష్ శోభన్ తో ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ చేశాను’’ అన్నారు. -
మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్!
టాలీవుడ్ మన్మథుడు ‘కింగ్’ నాగార్జున అక్కినేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 60 ఏళ్లలో కూడా గ్లామర్, ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ మూవీతో అలరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఇప్పుడు ఆయన మరో సినిమాకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్‌తో జతకట్టబోతున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ కథకు ఇంప్రెస్ అయిన నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసల వినిపిస్తున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో నాగార్జున డబుల్ రోల్ చేయబోతున్నట్లు వినికిడి. తండ్రి-కొడుకులుగా ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ నాగార్జున సరసన నటించే హీరోయిన్ హాట్‌టాపిక్ నిలిచింది. మిస్ ఇండియాతో నాగ్ ఈ చిత్రంలో రొమాన్స్ చేయనున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. 2020 మిస్ ఇండియా టైటిల్ గెలిచిన మానస వారణాసిని ఇందులో జూనియర్ నాగ్ సరసన హీరోయిన్గా ఎంపిక చేశారని, ఇప్పుటికే నాగార్జున, మానసల ఫొటోషూట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: 200 థియేటర్లో రిరిలీజ్కు సిద్ధమైన ఆర్ఆర్ఆర్.. కొత్త ట్రైలర్ చూశారా? ఆ గుడ్‌న్యూస్‌ని ముందు తారక్‌తో పంచుకున్నా: రామ్ చరణ్ -
విజయవాడలో మిస్ఇండియా 2020 మానస వారణాసి సందడి ( ఫొటోలు )
-
కరోనా కలకలం.. మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
ప్యూర్టో రికా: మిస్ వరల్డ్ పోటీలకు కరోనా సెగ తాకింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మిస్ ఇండియా 2021 మానస వారణాసితో పాటు పలువురు కరోనా బారిన పడటంతో ఆ పోటీలు అర్థాంతరంగా ఆగిపోయాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే గురువారం(డిసెంబర్ 16వ తేదీన) ప్యూర్టోరికాలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్‌కు ముందే మానసతో పాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. మొత్తం 17 మందికి కోవిడ్ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రకటించారు. కాగా 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా- 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే కరోనా కలకలంతో పోటీలు వాయిదా పడక తప్పలేదు. -
‘వుయ్ కేన్’ కార్యక్రమంలో ఫెమినా మిస్ ఇండియా- 2020 మానస వారణాసి
-
మానస సంచరరే...
ఫెమినా మిస్ ఇండియా పోటీలో గెలిచిన అమ్మాయి అనగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మనసులలో ఒకటే నామం, ఒకటే రూపం కదలాడుతోంది. మది మదిన సంచరిస్తున్న ఆమే మానస వారణాసి. ఈ భారతీయ సుందరికి డ్రెస్ డిజైన్స్ చేసినవారిలో హైదరాబాదీ డిజైనర్ శ్రవణ్‌కుమార్ ఉన్నారు. మానస వారణాసి సంప్రదాయ, ఇండోవెస్ట్రన్ స్టైల్ వేషధారణ గురించి ఈ డిజైనర్ చెప్పిన వివరాలు. డ్రెస్ డిజైన్స్. మిస్ ఫ్యాషన్ కూడా... తెలుగు అమ్మాయిల్లో అరుదైన అందం మానసది. తనకు నేను పలు మార్లు డిజైన్స్ అందించాను. తను బాగా ఫ్యాషన్ స్పృహ ఉన్న అమ్మాయి. ఇండియన్, వెస్ట్రన్, అఫిషియల్, ఫార్మల్... ఇలా ఏ డ్రెస్ అయినా బాగా క్యారీ చేయగలదామె. తను తప్పకుండా మిస్ వరల్డ్ అవుతుంది. ఎందుకంటే... ఆమె ఇండియన్ బ్యూటీ, టెక్నికల్ ఇండియన్ బ్యూటీ... ప్యూర్ ఇండియన్ బ్యూటీ... రైట్ బాడీ, రైట్ యాటిట్యూడ్ లతో నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – శ్రవణ్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ టమరీ గాడీగా కాకుండా రెండు రంగులతో చేసిన మ్యాజిక్ వినూత్న అందాన్ని తీసుకువచ్చింది. బంగారు రంగు పెద్ద అంచు ఉన్న వంగపండు లెహంగా అదే రంగు బ్లౌజ్, దుపట్టా, లెహంగాకు సెట్ టాజిల్స్.. ఓ ప్రత్యేక ఆకర్షణ. టవెస్ట్రన్ జంప్‌సూట్ నుంచి డిజైన్ చేసిన మోడల్ డ్రెస్. మేని రంగును డ్రెస్ రంగు మరింతగా ఎలివేట్ చేస్తుంది. టవెస్ట్రన్ షార్ట్ గౌన్‌కి ఇండియన్ సంప్రదాయ చీర అంచు మరింత అందాన్ని తీసుకువచ్చింది. -
వాసవీ కాలేజీ లో మిస్ ఇండియా సందడి
-
రాజమౌళి సినిమాలో చేయాలని ఉంది: మానస వారణాసి
ఫెమినా మిస్ ఇండియా కిరీటంతో అందరి హృదయాలను గెలుచుకొని మిస్ వరల్డ్ కోసం అడుగులు వేస్తున్న తెలుగమ్మాయి మానస వారణాసి. నగరానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన మానస తనకంటూ ఉన్న కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు, ఇష్టాలను షేర్ చేసుకున్నారు. ► ముందుగా మీలో మీకు బాగా నచ్చే లక్షణం? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రశాంతంగా ఉంటేనే ఎదైనా సాధించగలం. ► మీలో నచ్చనిది..? లేజీనెస్...! చేయవలసిన పనులను ఎక్కు వగా వాయిదా వేస్తుంటాను. ► ఇష్టమైన ఫుడ్..? పూర్తిగా వెజిటేరియన్‌ని. వెజిటేరియన్లో ఎదైనా సరే ఇష్టంగా తింటాను. ముఖ్యంగా పులిహోరా నా ఫేవరెట్. ► నచ్చిన సినిమాలు..? తెలుగులో బాహుబలి, వేరే బాషల్లో అయితే ఇంటర్స్టెల్లర్. ► ఇష్టపడే ఫిల్మ్ స్టార్స్...? ఆయుష్ ఖురానా, ప్రియాంక చోప్రా. ► నచ్చిన కలర్..? ఫైర్ రెడ్. ► ఎలాంటి డ్రెస్సింగ్‌ని ఇష్టపడతారు...? ఇండియన్ వేర్. ► పెర్ఫ్యూమ్స్...? కొరియాండర్, లావెండర్ ఫ్లేవర్స్.. ► నచ్చే పుస్తకం..? లిటిల్ ప్రిన్స్ ► ఎలాంటి గేమ్స్ ఇష్టం..? మెదడుకు పనిపెట్టేవి. ► నచ్చిన ప్లేస్? ఎవ్వరినైనా ఆహ్వానించే సుగుణం ఉన్న హైదరాబాద్ నగరం. ► ఇష్టమైన వాహనం? కంఫర్ట్‌గా ఉండే ఏ కారైనా ఇష్టమే. ► ఇష్టమైన పనులు...? సేవ చేయడం. ఆల్రెడీ కొన్ని ఎన్జీవోలతో కలిసి వాలంటీర్‌గా పని చేసాను. ► మోడలింగ్‌లోకి రాకుండా ఉంటే..? యోగా ట్రైనర్‌ని అయ్యేదానిని. ► హబీస్...? పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. పాటలు కూడా పాడతాను. ► ఫిట్‌నెస్‌కు సంబంధించిని నియమాలు? రెండేళ్లుగా క్రమం తప్పకుండా యెగా చేస్తున్నాను. కానీ డైట్ మాత్రం పాటించను. మా అమ్మమ్మ చేసిన వంటకాలేవీ వదలను. ► మీ సక్సెస్ మంత్ర? ఎమోషనల్‌గా, స్ప్రిచ్యువల్గా బ్యాలెన్స్డ్ గా ఉంటాను. అప్పుడే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతాను. ఎప్పుడూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తాను. ప్రతి పనిలో గతం కంటే ఉన్నతంగా ఉండేలా కష్టపడుతాను. గోల్స్ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అప్పుడే మనం చేసే పనులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఐ లవ్ చాలెంజెస్. ► సినిమాల్లో అవకాకాశాలు వస్తే ..? ప్రస్తుతం నా ధ్యాస అంతా మిస్ వరల్డ్ పైనే. రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయాలని ఉంది. – హనుమాద్రి శ్రీకాంత్, సాక్షి, హైదరాబాద్ ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
మిస్ ఇండియా మానస వారణాసి ఫోటోలు..
-
ప్రపంచ సుందరే నా టార్గెట్: మానస వారణాసి
సాక్షి, చిక్కడపల్లి: మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించడమే తన లక్ష్యమని మిస్ ఇండియా మానస వారణాసి అన్నారు. బుధవారం సాయంత్రం నగరంలోని అశోక్‌నగర్ వీధి నంబర్– 2లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆమెకు తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్, చెల్లెలు మేఘన, అమ్మమ్మ గరికపాటి అన్నపూర్ణ, స్నేహితులు, అపార్ట్‌మెంట్‌వాసులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం మానసను లెజెండ్ అపార్ట్మెంట్ వాసులు ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. ♦చాలా రోజుల తర్వాత నగరంలోని సొంతింటికి వచ్చాను. మిస్ ఇండియా పోటీలో నిలిచేందుకు ఎంతోకాలం నిరీక్షించాను. ముంబై వెళ్లి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో ఉంటూ ఎంతో కష్టపడి పోటీలకు సన్నద్ధమయ్యాను. ♦మిస్ ఇండియా ఓ బిగ్ చాలెంజ్. దానిని సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాం వైపు స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా అమ్మానాన్న సైతం ఆ దిశగా ముందుకు నడిపించారు. ఇప్పుడు వారెంతో సంతోషపడుతున్నారు. ఇండియాను ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫాంపై నిలబెట్టేందుకు కృషి చేస్తా. సినిమా అవకాశాలు ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్లను. నా లక్ష్యం మిస్‌వరల్డ్ మాత్రమే. ♦మిస్ ఇండియా మానసను చూడగానే అశోక్‌నగర్‌లోని స్ట్రీట్ నంబర్ వాసులు, లెజెండ్ అపార్ట్మెంట్ వాసులు ఆమెపై పూలవర్షం కురిపించి సత్కరించారు. డప్పు దరువులకనుగణంగా చిన్నారులతో కలిసి ఆమె డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. స్నేహితులు, బంధువులు పూల బొకేలతో మానసను అభినందించారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. స్నేహితులతో కలసి తీన్మార్ డ్యాన్స్ చేస్తున్న మిస్ ఇండియా మానస వారణాసి మాకెంతో గర్వకారణం తమ అపార్ట్మెంట్లో ఉండి ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి అందరితో వినయంగా మాట్లాడే మానసకు మిస్ ఇండియా రావడం గర్వకారణం. – సందీప్ మిశ్రా, అపార్ట్మెంట్ వాసి మిస్ వరల్డ్ రావాలి.. లెజెండ్ అపార్ట్మెంట్లో మానసను తొమ్మిదేళ్లుగా చూ స్తున్నాం. ఆమెకు మిస్ ఇండి యా రావడం ఎంతో సంతో షంగా ఉంది. మిస్ వరల్డ్ కూడా రావాలని ఆశిస్తున్నాం. – పద్మాకర్ జాదవ్, అపార్ట్మెంట్ వాసి విమానాశ్రయంలో ఘనస్వాగతం శంషాబాద్: మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత తొలిసారిగా మానస వారణాసి బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మానస వారణాసి మీడియాతో మాట్లాడుతూ.. మిస్ ఇండియా పోటీల్లో వివిధ రాష్ట్రాల అమ్మాయిలతో కలిసి ఉన్నానని, మంచి వాతావరణంలో పోటీలు జరిగాయన్నారు. వలంటీర్‌గా తాను పనిచేసిన అనుభవం కూడా తన విజయానికి దోహదపడిందన్నారు. చదవండి: (మా కూతురికే.. ప్రపంచ సుందరి కిరీటం!) (సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త) -
‘మిస్ ఇండియా ఐనా.. ముద్దుల మనవరాలే’
ఆమె మిస్ ఇండియా అయినా నాకు ముద్దుల మనవరాలే. నా వయసు 80 ఏళ్లు. మానస వారణాసి అంటే మాటల్లో వర్ణించలేనంత ఆప్యాయత, అనురాగం. ఏం అమ్మాయి.. పెళ్లీడుకొచ్చావు. నీకు ఈ కాలేజీలు, స్టేజ్ షోలు ఎందుకు? మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని వెంటపడేదాన్ని. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ప్రతిరోజూ సరదా కబుర్లు సాగుతుండేవి. ఓ వైపు మనవరాలు మానసను చీవాట్లు పెడుతూనే మరోవైపు ఆమె అమితంగా ఇష్టపడే పెసరట్టు, పులిహోర, ఫ్రైడ్‌రైస్, వైట్‌రైస్ వండిపెట్టేదాన్ని. మానస మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచిన తరుణంలో నా ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. వెంటనే ఆమెకు వీడియో కాల్ చేసి విష్ చేశాను. – గరికపాటి అన్నపూర్ణ, మిస్ ఇండియా మానస వారణాసి అమ్మమ్మ చిన్నప్పుడు భరతనాట్యంలో ప్రావీణ్యం..స్విమ్మింగ్‌లో ప్రతిభ.. స్కూల్, కాలేజీలో యాంకరింగ్..ఇలా డ్యాన్సర్‌గా, స్విమ్మర్‌గా, సింగర్‌గా, ఆర్టిస్ట్‌గా, బుక్ రీడర్‌గా నా కూతురు ఎప్పుడూ ముందుండేది. తను ఏదైనా అనుకుంటే ఆ పని చేసే వరకు నిద్రపోయేది కాదు. మలేషియాలో చదివినప్పటికీ..మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఫాలో అవుతూ..నేడు మిస్ ఇండియాగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు మిస్ ఇండియా మానస వారణాసి తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి నగరానికి వస్తున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కుటుంబ సభ్యులను పలకరించింది. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన శైలజ, రవిశంకర్ దంపతులు 1992లో నగరంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత రవిశంకర్ మలేషియాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా చేసేవారు. అదే సమయంలో కూతురు స్కూల్ విద్య అంతా మలేషియాలో జరిగింది. 11,12 తరగతులు ఫిడ్జ్‌లో చదివింది. ఇంజనీరింగ్ ఇబ్రహింపట్నంలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదివింది. మరిన్ని విశేషాలు వారి మాటల్లో... తనే స్టైలిస్ట్..తనే డిజైనర్ వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా పోటీలు చాలా వరకు వర్చువల్ వేదికగా జరిగాయి. ఉదయం 5.30 గంటలకే మానస నిద్రలేచేది. ఉదయం లేచి ఆరోజంతా ఏం చేయాలనే అంశాలపై డైరీ రాసుకునేది. వర్చువల్‌గా పోటీలు మొదలయ్యే వరకు తనే డ్రస్ డిజైన్ చేసుకునేది. సొంతంగా మేకప్ వేసుకునేది. ఇంట్లో ఒక్కరి సాయం కూడా అడిగేది కాదు. ఇలా ఈ పోటీల్లో తనే ఒక స్టైలిస్ట్‌గా, హెయిర్ డిజైనర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా ఉన్న పట్టుదల మాకెంతో నచ్చింది. ముషీరాబాద్, కోఠీలోని పిల్లలకు విద్యాభ్యాసం వీలు కుదిరినప్పుడల్లా ముషీరాబాద్ గర్ల్స్ స్కూల్, కోఠిలోని షెల్టర్‌హోంలో ఉన్న పిల్లలకు ఉదయం వెళ్లి మ్యాథ్స్ ఇంగ్లిష్ నేర్పించేది. నేనే స్వయాన తనని బైక్ మీద డ్రాప్ చేసి వచ్చేదాన్ని తల్లి శైలజ వివరించారు. ఇలా ఓ ఎన్జీఓలో మూడేళ్ల పాటు ఫ్రీగా పిల్లలకు సర్వీస్ చేసింది. ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. తన చెల్లి, ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా గడుపుతుంటుంది. డిసెంబర్లో జరిగే ప్రపంచ పోటీల్లో నా కూతురు ప్రపంచ కిరీటం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తల్లి శైలజ. ఖాళీ దొరికితే నవలలు చదివేది చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అంటే మానసకు చాలా ఇష్టం. ఖాళీ దొరికితే బుక్స్ చదివేది. అలా కాలేజీ డేస్ నుంచి సెలవుల సమయంలో నవలలు చదివేది. వద్దన్నా వినేది కాదు. ఖాళీ టైంలో అక్కతో కలసి యూట్యూబ్‌లో వంటలు చూస్తూ చేసి అమ్మనాన్నలకు వండిపెట్టేవాళ్లమని వివరించింది మానస చెల్లి మేఘన. ఇలా చైనీస్, థాయ్‌లాండ్ వంటకాలన్నీ ఇష్టపడేది మానస. అక్క, నేను గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్లం ఇద్దరం చిన్న చిన్న విషయాల్లో గొడవ పడేవాళ్లం. అయినా.. అక్కంటే నాకు, నేనంటే అక్కకి ప్రాణం. ఇద్దరం ఫేస్టివల్స్ అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునేవాళ్లం. ది బెస్ట్ సిస్టర్ ఫర్ ఎవర్ అంటూ నేను మంచి మెసేజెస్ పంపితే తను ఫిదా అయ్యేది. – మేఘన వారణాసి (మానస సోదరి) ఏమున్నా మాతోనే షేర్ చేసుకుంటుంది మానస ఏమున్నా మాతోనే షేర్ చేసుకునేది. కలసి మూవీస్‌కి వెళ్తుంటాం. ఎక్కువగా తనకి ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం. అందాల పోటీలకోసం మా ఫ్రెండ్ పడిన కష్టం మాకు బాగా తెలుసు. ఇప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. – నిహారిక, మనస్విని, (మానస ఫ్రెండ్స్) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ని.. గ్లామర్ రంగానికి కొత్త
‘హైదరాబాద్ నగరం నన్ను తీర్చిదిద్దింది. ఫుడ్ నుంచి ఫ్రెండ్స్ దాకా ఎన్నో ఇచ్చింది. నేను ఈ నగరంతో మమేకమైపోయా’’ అంటోంది నగరవాసి, తాజాగా ముంబయిలో జరిగిన పోటీల్లో మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న మానస వారణాసి (23). గ్లామర్ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా బ్యూటీ కాంటెస్ట్‌లోకి అడుగుపెట్టిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. ఎంబ్రాయిడరీ నుంచి ట్రెక్కింగ్ దాకా భిన్న రకాల అభిరుచులు, చిన్న వయసులోనే పరిపక్వ ఆలోచనలతో అబ్బురపరిచే మానస ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నేను గ్లామర్ రంగానికి చాలా కొత్త. కాలేజ్ డేస్‌లో మిస్ ఫ్రెషర్‌గా గెలవడం తప్ప.. గతంలో గ్లామర్ రంగంలో ఎప్పుడూ ఫుల్‌టైమ్ పనిచేసింది లేదు. అనుకోకుండా ఈ పోటీకి ఎంపికై, టైటిల్ గెలుచుకోవడం చాలా ఆనందాన్నిస్తోంది. పోటీ ఇప్పటికే.. సిస్టర్స్‌గా ఎప్పటికీ... మిస్ ఇండియా పోటీలో 31 మంది ఫైనలిస్ట్‌లు పలు రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. కోవిడ్ కారణంగా ఈ పోటీ చాలా వరకూ వర్చువల్‌గానే సాగింది. వీరిలో 15 మంది ముంబయిలో జరిగిన ఫైనల్స్‌కు ఎంపికై హాజరయ్యారు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అంతేకాదు స్టైలింగ్ నుంచి ఎక్సర్సైజ్ దాకా ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నా. ఈ అనుభవం మర్చిపోలేనిది. పోటీ కేవలం ఇక్కడి వరకే. తర్వాత స్వంత సిస్టర్స్‌లా లైఫ్ లాంగ్ టచ్‌లో ఉంటాం. కుటుంబమే కీర్తి... మనుషులే స్ఫూర్తి... అమ్మమ్మ, తల్లిదండ్రులు, సోదరి ఇదే నా కుటుంబం. వాసవిలో ఇంజినీరింగ్ చదివా. సాధారణ జీవితం, అత్యున్నత ఆలోచనలు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే కుటుంబం మాది. అది నేర్పిన విలువలే నన్ను నిర్వచిస్తాయి. తమను తాము ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుని, పునరావిష్కరించుకునే మనుషులే నాకు స్ఫూర్తి. జీవితాంతం వ్యక్తిగా పరిణతి సాధించుతూనే సాగుతాను. ఏ విషయంలోనైనా అంతిమంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేని సంపూర్ణ జీవితమే నాకు ప్రధానం. సినిమా... రమ్మంటే? భవిష్యత్తు మనకేమి ఇస్తుందో ఎవరికి తెలుసు? ఒక కొత్త ఆశలు..అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి నేను మిస్ ఇండియా పోటీలకు వచ్చాను. ఈ టైటిల్ నన్నెక్కడికి తీసుకెళుతుందో చూడాలని నేను ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నా. సినిమా రంగ ప్రవేశం అనే ప్రశ్నకు కాలం మాత్రమే సమాధానం చెబుతుంది. నా వరకూ నాకు ఎదురయ్యే ప్రతి అవకాశానికి తలుపులు తెరచి ఉంచాలనేది ఇప్పటిదాకా సాగిన నా ప్రయాణం నాకు నేర్పింది. అద్భుత యోగం.. అందం మానసికం.. శరీరంతో పాటు మనసు ఆత్మల మేలు కలయికే ఫిట్నెస్. అది అందించేదిగా నేను ఎంచుకున్న యోగా నా జీవితంలో అద్భుతాలు చేసింది. ఇతరుల్ని మెప్పించడానికి చేసే ప్రయత్నం కాక నిన్ను నువ్వు మెప్పించుకోవడమే ముఖ్యమనేది ఫ్యాషన్‌లో పాటించే సూచించే సూత్రం. నువ్వేమిటి అనే విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటే నీకు నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి నువ్వు సంతృప్తిగా భావించకపోతే అందంగా ఉండడం అనేదానిలో అర్ధం లేదు. అందాల భామ.. అభిరుచుల చిరునామా.. నగరానికి చెందిన మానస వారణాసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ ఎనలిస్ట్‌గా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. మానస తండ్రి అనుమణి వారణాసి, తల్లి శైలజ వారణాసి. ఇన్స్ట్రా గ్రామ్ ద్వారా పెట్స్‌పై ప్రేమ నుంచి తన ఎంబ్రాయిడరీ స్కిల్స్ దాకా ఎన్నో ఆమె పంచుకుంటుంటారు. ట్రెక్కింగ్, స్కై గేజింగ్ తదితర సాహసాలు చేయడాన్ని ఇష్టపడే మానస సైన్ లాంగ్వేజ్ లో కూడా శిక్షణ పొందారు. ఒక సాధారణ యువతిగా నగరానికి చెందిన ఎన్జీవో ‘మేక్ ఎ డిఫరెన్స్’తో కలిసి పనిచేయడం నన్ను చాలా మార్చింది. నా అంతర్ముఖ వ్యక్తిత్వాన్ని అధిగమించడానికి, విద్యాపరమైన సమానత్వాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా ఉపకరించింది. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఇక మిస్ ఇండియాగా సమాజానికి నా వంతు బాధ్యత స్వచ్ఛంగా, స్వచ్ఛందంగా నిర్వర్తిస్తాను.


