లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్.. 'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్ రిలీజ్ | Couple Friendly Movie Trailer | Sakshi
Sakshi News home page

Couple Friendly: సంతోష్ శోభన్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా?

Feb 2 2026 6:08 PM | Updated on Feb 2 2026 6:21 PM

Couple Friendly Movie Trailer

హీరోగా పలు సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్న హీరో సంతోష్ శోభన్.. కాస్త గ్యాప్ తర్వాత 'కపుల్ ఫ్రెండ్లీ' అనే మూవీ చేశాడు. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు. లివింగ్ రిలేషన్ కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)

అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు కాగా సంతోష్ శోభన్ సరసన మానస వారణాసి హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ దీన్ని రిలీజ్ చేయనున్నారు. అనుకోకుండా ఓసారి కలిసిన హీరోహీరోయిన్లు.. కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటూ లివింగ్ రిలేషన్‌షిప్ మెంటైన్ చేస్తారు. తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగిందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)

Advertisement
 
Advertisement
Advertisement