బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. అదే కారణం: సీతారామం బ్యూటీ | Mrunal Thakur Reacts Her Breakup with Ex Boy friend goes viral | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: 'ఆ కారణం వల్లే బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్'

Feb 2 2026 6:11 PM | Updated on Feb 2 2026 6:24 PM

Mrunal Thakur Reacts Her Breakup with Ex Boy friend goes viral

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే పర్సనల్‌ లైఫ్‌పై రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్‌ ధనుశ్‌ను ఆమె పెళ్లాడనుందని వార్తలొచ్చాయి. వీటిపై తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ధనుశ్ తనకు మంచి ఫ్రెండ్‌ మాత్రమే కాదు.. ఒక అన్నలాంటి వాడని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన దో దివానే శహర్‌ మే అనే మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ఈ విషయంపై స్పందించింది.

అంతేకాకుండా తన బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్‌ గురించి మృణాల్ చెప్పేసింది. నేను యాక్టింగ్ చేయడం అతనికి నచ్చలేదని.. మేము విడిపోవడానికి అదే కారణమని తెలిపింది. నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని అతనే బ్రేకప్ చెప్పేశాడని వెల్లడించింది. ఈ విషయంలో తనకు ఎలాంటి బాధ లేదని.. అలాంటి వాడితో కొనసాగడం కష్టంగా అనిపించిందని పేర్కొంది. అందుకే అతనితో విడిపోవాల్సి వచ్చిందని మృణాల్ చెప్పుకొచ్చింది. బ్రేకప్ తర్వాత అతని గురించి జాలిపడ్డానని తెలిపింది. 

కాగా.. మృణాల్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం దో దివానే శహర్ మే. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానుంది. అంతే కాకుండా టాలీవుడ్ హీరో అడివి శేష్‌ సరసన డకాయిట్‌లో మృణాల్‌ నటిస్తోంది.  ఈ సినిమా మార్చి 19న రిలీజ్ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement