15 ఏళ్లకే రోడ్డుపైకి.. ఎన్నో అవమానాలు: అమాల్‌ మాలిక్‌ | Amaal Mallik: My Family Background worked Against Me | Sakshi
Sakshi News home page

10 ఏళ్లపాటు కష్టాలే.. సీడీలు అమ్మేస్తానని జాబ్‌లో నుంచి పీకేశారు!

Feb 2 2026 5:54 PM | Updated on Feb 2 2026 6:07 PM

Amaal Mallik: My Family Background worked Against Me

సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ వల్ల కెరీర్‌ తొలినాళ్లలో తనను ఉద్యోగం నుంచి పీకేశారంటున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమాల్‌ మాలిక్‌. ఇతడి తండ్రి డబూ మాలిక్‌ సంగీత దర్శకుడిగా, సింగర్‌గా బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న కొడుకు, సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ కూడా తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెద్ద కొడుకు అమాల్‌ మాలిక్‌ మాత్రం ఆ స్థాయి గుర్తింపు అందుకోలేకపోయాడు. 

15 ఏళ్లకే..
ఇటీవలే ఇతడు హిందీ బిగ్‌బాస్‌ 19వ సీజన్‌లో పాల్గొన్నాడు. తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమాల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు రోడ్డుపైకి వచ్చి పని వేట మొదలుపెట్టాను. దాదాపు 10 ఏళ్లు ఎంతో కష్టపడ్డాను. అసిస్టెంట్‌గా పని చేశాను. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండే సినిమాల హార్డ్‌ డిస్కులు తీసిపెట్టుకునేవాడిని. తర్వాత దానితో డబ్బు సంపాదించొచ్చన్నది నా ఆశ.

అవమానం
అయితే నా పేరు పక్కన మాలిక్‌ ఉందన్న విషయం తెలియగానే వెంటనే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేవారు. ఇతడు ఆ కుటుంబం నుంచి వచ్చాడు, ఒకవేళ మన సినిమాలోని మ్యూజిక్‌ను బయటవాళ్లకు అమ్మేసినా అమ్మేస్తాడు అని అవమానించి మరీ పక్కనపెట్టేవారు. దానివల్ల నాకు, తమ్ముడికి సరిగా పని దొరక్కపోయేది. మాకు బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టి మా జర్నీలో కష్టాలే లేవని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు అని చెప్పుకొచ్చాడు.

సంగీత దర్శకుడిగా..
అమాల్‌ మాలిక్‌.. సల్మాన్‌ ఖాన్‌ జై హో సినిమాతో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఏక్‌ పహేలీ లీలా, హీరో, క్యాలెండర్‌ గర్ల్స్‌, హేట్‌ స్టోరీ 3, ఎయిర్‌లిఫ్ట్‌, బాఘీ, బద్రీనాథ్‌ కీ దుల్హానియా వంటి పలు చిత్రాల్లో పాటలు కంపోజ్‌ చేశాడు.

చదవండి: 50 మంది సెలబ్రిటీలతో గేమ్‌ షో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement